బ్రహ్మ మహా పురాణము

63 - పంచతీర్థమాహాతమ్యం

బ్రహ్మ:

తతో గచ్ఛేద్విజశ్రేష్ఠా స్తీర్థం యజ్ఞాంగ సంభవమ్‌

ఇంద్రద్యుమ్నసరో నామ యత్రా స్తేపావనం శుభమ్‌

గత్వా తత్ర శుచిర్ధీమా నాచమ్య మనసా హరిమ్‌

ధ్యాత్యోపస్థాయ చ జల మిమం మంత్రముదీరయేత్‌

అశ్వమేధాంగసంభూత తీర్ధ సర్వాఘనాశన

స్నానం త్వయి కరోమ్యద్య పాపం హర నమో స్తుతే

ఏవముచ్చార్య విధివ త్స్నాత్వా దేవానృషీన్పితౄన్‌

తిలోదకేన చాన్యాంశ్చ సంతర్వ్యా చమ్య వాగ్యతః

దత్త్వా పితృభ్యః పిండాంశ్చ సంపూజ్య పురుషోత్తమమ్‌

దశాశ్వమేధికం సమ్య క్ఫలం ప్రాప్నోతిమానవః

సప్తావరాన్యప్త పరా న్వంశానుద్ధృత్య దేవవత్‌

కామగేన విమానేన విష్ణులోకం స గచ్ఛతి

భుక్త్వాతత్ర సుఖాన్భోగా న్యావచ్చంద్రార్కతారకమ్‌

చ్యుతస్తస్మాదిహాయాతో మోక్షం చ లభతే ధ్రువమ్‌

ఏవం కృత్వాపంచతీర్థీ మేకాదశ్యాముపోషితః

జ్యేష్ఠశుక్లపంచదశ్యాం యః పశ్యేత్పురుషోత్తమమ్‌

సపూర్వోక్తం ఫలం ప్రాప్య క్రీడిత్వా చాచ్యుతాలయే

ప్రయాతి పరమం స్థానం యస్మాన్నా వర్తతేపునః

బ్రహ్మ:

సముద్ర స్నానా నంతరము యజ్ఞ పురుషుని శరీర మందా విర్భవించిన తీర్థము ఇంద్రద్యుమ్న సరస్సును సేవిం పవలెను. ఆ తీర్థ సేవన మందు “అశ్వ మేధాంగ సంభూత”యను మంత్రము నుచ్చరించ వలెను. ఇట దేవర్షి పితృ తర్పణము జేసి దశాశ్వమేధ యాగ ఫలమొంద వచ్చును. వెనుక యేడు తరముల రాగల యేడు తరముల వారిని నీ పుణ్య మాచరించు నాత డుద్ధరింప గలడు. కామగ విమానమున విష్ణు లోకమున కేగ గలడు. ఏకాదశి యుపవాస ముండి పంచ తీర్థములను సేవించి జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు పురుషోత్తముని దర్శించు నాతడు పునరావృత్తి రహిత పుణ్యస్థాన మందును.

మునులు:

మాసానన్యా న్పరిత్యజ్య మాఘాదీన్ప్రపితామహ

ప్రశంససి కథం జ్యేష్ఠం బ్రూహి తత్కారణం ప్రభో

మునులు:

మాఘాది మాసములను వదలి జ్యేష్ఠ మాసమునే ప్రసంశించితి వేలయని మునులడుగ

బ్రహ్మ:

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యామి సమాసతః

జ్యేష్ఠం మాసం తథా తేభ్యః ప్రశంసామి పునః పునః

పృథివ్యాం యాని తీర్థాని సరితశ్చ సరాంసి చ

పుష్కరిణ్యస్తడాగాని వాప్యః కూపాస్తథా హ్రదాః

నానానద్యః సముద్రాశ్చ సప్తాహం పురుషోత్తమే

జ్యేష్ఠశుక్లదశమ్యాది ప్రత్యక్షం యాంతి సర్వదా

స్నానదానాదికం తస్మా ద్దేవతా ప్రేక్షణం ద్విజాః

యత్కించి త్క్రియతే తత్ర తస్మిన్కాలే క్షయం భవేత్‌

బ్రహ్మ:

జ్యేష్ఠ శుక్ల దశమి మొదలు ఏడు రోజులు సర్వ తీర్థములు పురుషోత్తమ క్షేత్ర మందుండు. కావున నే కొంచెము పుణ్యమేని నిచట యక్షయ మగును.

శుక్లపక్షస్య దశమీ జ్యేష్ఠే మాసి ద్విజోత్తమాః

హరతే దశపాపాని తస్మాద్దశహరా స్మృతా

యస్తస్యాం హలినం కృష్ణం పశ్యేద్భద్రాం సుసంయతః

సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం వ్రజేన్నరః

నరో దోలాగతం దృష్ట్వా గోవిందం పురుషోత్తమమ్‌

ఫాల్గుణ్యాం ప్రయతో భూత్వా గోవిందస్యపురం వ్రజేత్‌

విఘవద్దివసేప్రాప్తే పంచతీర్థవిధానతః

కృత్వాసంకర్షణం కృష్ణం దృష్ట్వా భద్రాంచభోద్విజాః

నరః సమస్త యజ్ఞానాం ఫలం ప్రాప్నోతి దుర్లభమ్‌

విముక్తః సర్వపాపేభ్యోవిష్ణులోకం స గచ్ఛతి

యః పశ్యతి తృతీయాయాం కృష్ణం చందనరూషితమ్‌

వైశాఖస్యాసితే పక్షే స యాత్యచ్యుతమందిరమ్‌

జ్యైష్ఠ్యాం జ్యేష్ఠరక్షయుక్తాయాం యః పశ్యేత్పురుషోత్తమమ్‌

కులైకవింశముద్ధృత్య విష్ణులోకం సగచ్ఛతి

జ్యేష్ఠ శుక్లపక్ష దశమి పది రకముల పాపములను హరించును. కనుక దశహర యన బడును. ఆనాడు బలరామ కృష్ణ సుభద్రల దర్శనము విష్ణు లోక ప్రదము. పాల్గుణ పూర్ణిమ నాడుయ్యెల యందున్న గోవిందుని ఆ డోలోత్సవమును జూచు నతడు గోవింద పురమేగును. విషువత్తులందు పంచతీర్థ సేవన మొనరించి యా మూడు మూర్తులను సేవించు నతడు సర్వ యజ్ఞ ఫలభాజను డగును. విష్ణు లోక గమనము చేయును. వైశాఖ కృష్ణ తృతీయ తిధి యందు కృష్ణునకు చందనోత్సవము జరుగును. అది చూచు నతడు. విష్ణు లోక మందును. జ్యేష్ఠా నక్షత్రముతో నున్న జ్యేష్ఠ పూర్ణిమ యందు బురుషోత్తమ దర్శనము చేసిన యతడు ఇరువది యొక్క తరముల నుద్ధరించి విష్ణుపద మందును.