శ్రీ భగవానుడు:
నాహం దేవో న యక్షో వా నదైత్యో నచదేవరాట్
నబ్రహ్మా నచరుద్రోహం విద్ది మాం పురుషోత్తమమ్
ఆర్తిహా సర్వలోకానా మనంతబలపౌరుషః
అరాధనీయో భూతానా మంతో యస్య న విద్యతే
పఠ్యతే సర్వశాస్త్రేషు వేదాంతేషు నిగద్యతే
య మాహుర్ జ్ఞానగమ్యేతి వాసుదేవేతి యోగినః
అహమేవస్వయం బ్రహ్మా అహంవిష్ణుశ్శివోప్యహమ్
ఇంద్రోహం దేవరాజశ్చజగత్సంయమనోయమః
పృథివ్యాదీని భూతాని త్రేతాగ్ని ర్హృతభు జ్నృప
వరుణోపాంపతిశ్చాహం ధరిత్రీచ మహీధరః
యత్కించి ద్వాఙ్మయం లోకే జగత్థ్సావరజంగమమ్
చరాచరం చ యద్విశ్వం మదన్యన్నాన్తికంచన
ప్రీతోహం తే నృపశ్రేష్ఠ! పరం వరయ సవ్రత
యదిష్టం తత్ర్పయచ్ఛామి హృది యత్తే వ్యవస్థితమ్
మద్దర్శన మపుణ్యానాంస్వప్నాంతేపిన జాయతే
త్వంపున ర్దృఢభక్తిత్వా త్ర్పత్యక్షం దృష్టవానసి
శ్రుత్ర్వైవం వాసుదేవస్య వచనం తస్య భోద్విజాః
రోమాంచితతను ర్భూత్వా ఇదం స్తోత్రం జగౌనృపః
శ్రీ భగవానుడు:
ఇంద్రద్యుమ్నునితో పరమేశ్వరు డిట్లనియె. రాజా! యక్ష గంధర్వాదులు మహేంద్ర బ్రహ్మా రుద్రాదులలో నే నెవ్వడను గాను, పురుషోత్తమునిగా నన్నెఱుంగుము. సకల పాపములు హరించు ననంత బల పౌరుషములు గలవాడను. అనంతడను అశేష భూత కోటికి నారాధనీయుడను. ఎవరిని జ్ఞాన గమ్యుడని వాసుదేవుడని యోగులు పేర్కొందురో. వేదాంతములు వెల్పునో యట్టి యోగ గమ్యమగు వస్తువును నేను త్రిముర్తులు నేనై యున్నాను. దిక్పాలు లందురు నేనే. అఖిల చరాచర జగత్తును నేను. నా కంటె నన్యము లేదు. నీ యెడల సంప్రీతిం గంటిని. వర మర్ధింపుము నా దర్శనము పుణ్యము చేయని వానికి కలనైన గాదు. నీవు ధృఢ భక్తి సంపన్ను డగుటచే ప్రత్యక్షము నన్ను జూచితివి. అని స్వామి యన భూమిపతి మేను పులకింప నా దేవుని పలు విధంబుల స్తుతించెను.
రాజు:
శ్రియః కాంత నమస్తేస్తు శ్రీపతే పీతావాసనే
శ్రీద శ్రీశ శ్రీనివాస నమస్తే శ్రీనికేతన
ఆద్యం పురుష మీశానం సర్వేశం సర్వతోముఖమ్
విష్కలం పరమం దేవం ప్రణతోస్మి సనాతనమ్
శబ్దాతీతం గుణాతీతం భావాభావ విర్జితమ్
నిర్లేపం నిర్గుణం సూక్ష్మం సర్వజ్ఞం సర్వభావనమ్
ప్రావృణ్మేఘప్రతీకాశం గోబ్రాహ్మణహితే రతమ్
సర్వేషా మేవ గోప్తారం వ్యాపినం సర్వభావినమ్
శంఖచక్రధరం దేవం గదాముసలధారిణమ్
నమస్త్యే వరదం దేవం నీలోత్పలదలచ్ఛవిమ్
నాగపర్యంకశయనం క్షీరోదార్ణవశాయినమ్
నమస్యేహం హృషీకేశం సర్వపాపహరం హరిమ్
పునస్త్వాం దేవదేవేశం నమస్త్యే వరదం విభుమ్
సర్వలోకేశ్వరం విష్ణుం మోక్షకారణ మవ్యయమ్
ఓ లక్ష్మీనాథా! పీతాంబరధారీ! శ్రీనివాసా! నమస్కారము. ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వతో ముఖుడు సనాతనుడు నగు విష్ణు దేవుని నమస్కరించెద. శబ్దములకు అతీతుడు గుణాతీతుడు భావాతీతుడు నిర్లిప్తుడు నిర్గుణుడు సూక్ష్మమైన వాడు. సర్వజ్ఞుడు శంఖ చక్ర గధా ముసల ధారియు నీలోత్పల దళ శ్యాముడు. వర ప్రదాత. శేష శాయియు క్షీర సాగర శయనుడు, సర్వ పాపహారియు నగు హృషీకేశుని నమస్కరించెద. మోక్ష కారణ భూతుడవు వ్యాపకుడవు, నాశ రహితుడవు దేవ దేవుడవు నగు నిన్ను నమస్కరించెద.
ఏవం స్తుత్వా తు తం దేవం ప్రణిపత్య కృతాంజలిః
ఉవాచ ప్రణతో భూత్వా నిపత్య ధరణీతలే
ప్రీతోసి యది మే నాథ వృణోమి వర ముత్తమమ్
దేవాసురాః సగంధర్వా యక్షరక్షోమహోరగాః
సిద్దవిద్యాధరాః సాధ్యాః కింనరా గుహ్యకా స్తథా
ఋషయో యే మహాభాగా నానా శాస్త్రవిశారదాః
పరివ్రాడ్యోగయుక్తాశ్చ వేదతత్త్వార్థచింతకాః
మోక్షమార్గవిదో యేన్యే ధ్యాయంతి పరమం పదమ్
నిర్గుణం నిర్మలం శాంతం యత్పశ్యంతి మనీషిణః
తత్పదం గంతు మిఛ్ఛమి త్వత్ర్పసాదా త్సుదుర్లభమ్
ప్రాంజిలియై ప్రణామ మాచరించి వినయమున రాజిట్లు పలికెను. “జగన్నాధ! దేవాసుర గంధర్వ యక్షరక్ష స్సిద్ద సాధ్య విద్యాధర నాగ గుహ్యక కిన్నరాదులు సర్వశాస్త్ర పారగులు సన్యాసులు యోగులు వేదార్థ చింతనులు మోక్షమార్గ విదులు ఏ పరమ పదుమును ధ్యానింతురో నిర్గుణము నిర్మలము శాంతము నైన దేనిని బొంద గోరుదురో యట్టి పదమును నీ ప్రసాదమున నంద గోరుదును.
శ్రీ భగవానుడు:
సర్వంభవతు భద్రం తే యథేష్టం సర్వ మాప్నుహి
భవిష్యతి యథాకామం మత్ర్పసాదాన్న సంసయః
దశవర్ష సహస్రాణి తథా నవశతాని చ
అవిచ్ఛిన్నం మహారాజ్యం కురు త్వం నృపసత్తమ
ప్రయాస్యసి పదం దివ్యం దుర్లభం యత్సురాసురైః
పూర్ణంమనోరథం శాంతం గుహ్య మవ్యక్త మవ్యయమ్
పరాత్పరతరం సూక్ష్మం నిర్లేపం నిష్కలం ధ్రువమ్
చింతాశోకవినిర్ముక్తం క్రియాకారణవర్జితమ్
తదహం దర్శయిష్యామి జ్ఞేయాఖ్యం పరమం పదమ్
యం ప్రాప్య పరమానందం ప్రాప్ప్యసి త్వం పరాంగతిమ్
కీర్తి శ్చ తవ రాజేంద్ర భవ త్యత్ర మహీతలే
యావద్ఘనా నభో యావద్యా వచ్చంద్రార్కతారకమ్
యావత్సముద్రాః సప్తైవ యావన్మేర్వాదిపర్వతాః
తిష్టంతి దివి దేవాశ్చ తావ త్సర్వత్ర చావ్యయా
ఇంద్రద్యుమ్నసరోనామ తీర్థం యజ్ఞాంగసంభవమ్
యత్ర స్నాత్వా సకృల్లోకః శక్రలోక మవాప్నుయాత్
దాపయిష్యతి యంః పిండాం స్తటేస్మి న్సరస్యశ్శుభే
కులైకవింశ ముద్ధృత్య శక్రలోకం గమిష్యతి
పూజ్యమానోప్సరోభిశ్చ గంధర్వైర్గీతనిస్వనైః
విమానేన వసే త్తత్ర యావదింద్రా శ్చతుర్దశ
సరసో దక్షిణే భాగే నైరృత్యాం తు సమాశ్రితే
న్య గ్రోధ స్తిష్ఠతే తత్ర తత్సమీపే తు మండపః
కేతకీవనసంఛన్నో నానాపాదపసంకులః
నారికేళైరసంఖ్యేయై శ్చంపకై ర్వకుళావృత్తైః
అశోకైః కర్ణికారైశ్చ పుంనాగై ర్నాగకేసరైః
పాటలామ్రాతసరళై శ్చందనై ర్దేవదారుభిః
న్యగ్రోధాశ్వత్థఖధిరైః పారిజాతై స్సహార్జునైః
హింతాళై శ్చైవ తాళై శ్చ శింశపై ర్బదరై స్తథా
కరంజైర్లకుచైః ప్లక్షైః పనసై ర్బిల్వధాతుకైః
అన్యై ర్బహువిధై ర్వృక్షైః శోభిత స్సర్వతః పరమ్
ఆషాడస్య సితే పక్షే పంచమ్యాం పితృదైవతే
ఋక్షే నేష్యంతి న స్తత్ర నీత్వా సప్త దినానివై
మండపే స్థాపయిష్యంతి సువేశ్యాభిః స్సుశోభనైః
క్రీడావిశేషబహుళై ర్నృత్య గీతమనోహరైః
చామరై స్వర్ణదండైశ్చ వ్యజనైః రత్నభూషణైః
వీజయంత స్తథాస్మభ్యం స్థాపయిష్యంతి మంగళాః
బ్రహ్మచారీ యతిశ్చైవ స్నాతకాశ్చ ద్విజోత్తమాః
వానప్రస్థా గృహస్థాశ్చ సిద్ధా శ్చాన్యేచ బ్రహ్మణాః
నానావర్ణపదై స్త్సోత్రైరృగ్యజుస్సామ నిస్వనైః
కరిష్యంతి స్తుతిం రాజ న్రామకేశవయోః పునః
తతఃస్తుత్వాచదృష్ట్వాచ సంప్రణమ్యచభక్తితః
నరో వర్షాయుతం దివ్యం శ్రీమద్ధరిపురే వసేత్
పూజ్యమానో ప్సరోభిశ్చ గంధర్వై ర్గీతనిస్వనైః
హరే రనుచర స్తత్ర క్రీడతే కేశవేన వై
విమానే నార్కవర్ణేన రత్నహారేణ భ్రాజతా
సర్వకామై ర్మహాభోగై స్తిష్ఠతే భువనోత్తమే
తపః క్షయా దిహాగత్య మనుష్యోబ్రాహ్మణోభవేత్
కోటీధనపతిః శ్రీమాంశ్చతుర్వేదీ భవే ద్ధ్రువమ్
శ్రీ భగవానుడు:
“ఓ రాజా! మంచిది నీకు శుభమగు గాక. నీ కోరిన స్థానము నందుము. నా అనుగ్రహమున నది నీకు లభించును. సందేహము వలదు. పది వేల తొమ్మిది వంద లేండ్లు నీవు రాజ్య మేలుదువు గాక. ఆ మీద నా దివ్య పదము గాంతువు. నీకీర్తి శాశ్వత మగును. “ఇంద్రద్యుమ్న సరస్సు” అను పేరు నీ తీర్థము యజ్ఞాంగ సంభవము. ఇందు స్నానము చేసిన జీవి యింద్ర లోకము వడయును. ఇచ్చట పిండ ప్రదానము చేసిన నిరువది తరముల వారు స్వర్గముం గాంతురు. అచ్చట నప్సరసలచే గంధర్వ గాన మాలాపించు బూజింప బడి పదునల్గు రింద్రులు పాలించు నంత కాలము విమాన మధివసించి నీవు విహరింతువు. ఈ సరస్సునకు దక్షిణ దిశ నైఋతి మూల నొక మఱ్ఱి చెట్టున్నది. దాని దరి నొక మండపము కలదు. దాని చుట్టు మొగలి పొదలున్నవి. వివిధ తరు సంకుల మట కొబ్బరి మొదలగు తోటలు సంపెంగ పూల తోటలు చాలా గలవు. ఆషాడ శుక్ల పంచమి పితృ దేవతాకమయిన మఘా నక్షత్రమందు మండపమున వేంచేవు జేసి యేడు రోజులు నిలిపి నృత్య గీత క్రీడా వినోదములచే నర్చించి సువర్ణ దండములగు చామరములచే నీచోపులిచ్చుచు రత్న భూషిత వ్యజనము లచే వీచుచు నొక స్తంభము నట ప్రతిష్ఠించి బ్రహ్మచారి యతి స్నాతకులు గృహస్థులు వాన ప్రస్థులు నానా విధ స్తోత్ర పాఠములచే ఋగ్యజుస్సామము లచే మమ్ము (బలరామ కృష్ణులను) స్తుతింతురు. ఇట్లు మమ్ము దర్శంచి భక్తితో మ్రొక్కిన భక్తులు పది వేలేండ్లు వైకుంఠమున వసించును. సర్వ భోగము లందును నా పుణ్యము ననుభవించి తిఱిగి ఈ యిలపై విప్రులై జనించి కోటీశ్వరులై చతుర్వేదులై విరాజిల్లుదురు.
ఏవం తస్మై వరం దత్వా కృత్వా చ సమయం హరిః
జగా మాదర్శనం విప్రాః సహితో విశ్వకర్మణా
సతు రాజా తదా హృష్టో రోమాంచిత తమారుహః
కృతకృత్య మివాత్మానం మేనే సందర్మనాద్ధరేః
తతః కృష్ణంచ రామంచ సుభద్రాం చ వరప్రదామ్
రథై ర్విమాన సంకాశై ర్మణి కాంచన చిత్రతైః
సంవాహ్య తా స్తదా రాజా మహామంగళనిఃస్వనైః
ఆనయామాస మతిమా న్సామాత్య స్సపురోహితః
నానావాదిత్ర నిర్ఘోషై ర్నానావేదస్వనై శ్శుభైః
సంస్థాప్య చ శుభే దేశే పవిత్రే సుమనోహరే
తత శ్శుభతిథౌ కాలే నక్షత్రే శుభలక్షణే
ప్రతిష్ఠాం కారయామాస సుముహూర్తే ద్విజై స్సహ
యథోక్తేన విధానేన విధిదృష్టేన కర్మణా
ఆచార్యనుమతేనైవ సర్వం కృత్వా మహీపతిః
ఆచార్యాయ తదా దత్త్వా దక్షిణాం విధివత్ర్పభుః
ఋత్విగ్భ్యశ్చ విధానేన తథాన్యేభ్యో ధనం దదౌ
కృత్వా ప్రతిష్ఠాం విధివ త్ర్పాసాదే భువనోత్తమే
స్థావయామస తాన్సర్వా న్విధిదృష్టేన కర్మణా
తత స్సంపూజ్య విధినా నానాపుష్పైస్సు గంధిభిః
సువర్ణమణిముక్తాద్యై ర్నానావస్రై స్సుశోభనైః
రత్నైశ్చ వివిధై ర్దివ్యై రాసనై ర్గ్రామపత్తనైః
దదౌ చాన్యా న్స విషయా న్పురాణి నగరాణి చ
ఏవం బహువిధం దత్త్వా రాజ్యం చారు యథోచితమ్
ఇష్ట్వా చ వివిధై ర్యజ్ఞైర్దత్వా దానా న్యనేకశః
కృతకృత్య స్తతోరాజా త్యక్తసర్వపరిగ్రహః!
జగామ పరమం స్థానం తద్విష్ణోః పరమం పదమ్
ఏవం మయా మునిశ్రేష్టాః కథితో వో నృపోత్తమాః
క్షేత్రస్య చైవ మాహాత్మ్యం కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛథ
శ్రుత్వైవం వచనం తస్య బ్రహ్మణోవ్యక్త జన్మనః
అశ్చర్యం మేనిరే విప్రాః పప్రచ్ఛుశ్చ పునర్ముదా
అని యిట్లు హరి యాతనికి వరమిచ్చి విశ్వకర్మతో కనుమఱు గయ్యెను. ఆ ఱేడానంద భరితుడై కృతార్థుడ నైతి ననుకొని బలరామ కృష్ణులను సుభద్రను దేవ విమాన మట్టి రథము నెక్కించి యూరేగించి పురోహిత మంత్రి సామంతాదు లతో చక్కని పవిత్ర ప్రదేశ మందు శుభ లగ్నమున ప్రతిష్టించి యథావిధిగ నర్చించి యాచర్య ఋత్విగ్జ నంబులను భూరి దక్షిణలచే సత్కరించెను. ఆ మీద బెక్కు జన్నములు చేసెను. కృతకృత్యుడై ఐహిక భోగములను విడిచి విష్ణుపద మందెను. ఇది ఈ పురుషోత్తమ క్షేత్ర మహిమ. మఱి యేమి విన వలతురన మును లిట్లనిరి. పురుషోత్తమ క్షేత్రయాత్ర యేపుడెట్లు చేయ వలెను! పంచతీర్థ విశేష మేమి! అందొక్కొక్క తీర్థ స్నానంబు వలనను, దానముల వలను దేవదా దర్శనంబు వలన నేయే ఫలము లభించును? దెలుపు మని వేడిరి.
కస్మిన్కాలే సురశ్రేష్ఠ గంతవ్యం పురుషోత్తమమ్
విధినా కేన కర్తవ్యం పంచతీర్థమితి ప్రభో
ఏకై కస్య చ తీర్థస్య స్నానదానాదియత్ఫలమ్
దేవతా ప్రేక్షణే చైవ బ్రూహి సర్వం పృథక్పృథక్
బ్రహ్మ:
నిరాహారః కురుక్షేత్రే పాదేనై కేన యస్తపేత్
జితేంద్రియో జితక్రోధ స్సప్త సంవత్సరాయుతమ్
దృష్ట్వా సదా జ్యేష్ఠశుక్ల ద్వాదశ్యాం పురుషోత్తమమ్
కృతోపవాసః ప్రాప్నోతి తతోధికతరం ఫలమ్
తస్మా జ్జ్యేష్టే మునిశ్రేష్టాః ప్రయత్నేన సుసంయతేః
స్వర్గలోకేప్పువిప్రాద్యైర్ధృష్ఠవ్యః పురుషోత్తమః
పంచతీర్థం తు విధివ త్కృత్వాజ్యేష్టే నరోత్తమః
శుక్ల పక్షస్య ద్వాదశ్యాం పశ్యే త్తం పురుషోత్తమమ్
యే పశ్యంత్యవ్యయం దేవం ద్వాదశ్యాం పురుషోత్తమమ్
తే విష్ణులోక మాసాద్య నచ్యవంతే కదాచన
తస్మాజ్జ్యేష్టే ప్రయత్నేన గంతవ్యం భో ద్విజోత్తమాః
కృత్వా తస్మిన్పంచతీర్థం ద్రష్టవ్యఃపురుషోత్తమః
సుదూరస్థోపి భో భక్త్యా కీర్తయే తురుషోత్తమమ్
అహన్యహని శుద్ధాత్మ సోసి విష్ణుపురం వజ్రేత్
యాత్రాం కరోతి కృష్ణస్య శ్రద్దయాయః సమాహితః
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం వ్రజేన్నరః
చక్రం దృష్ట్వా హరేర్దూరా త్ప్రాపాదోపరి సంస్థితమ్
సహస్రా ముచ్యతే పాపా న్నరో భక్త్యాప్రణమ్య తత్
బ్రహ్మ:
కురుక్షేత్ర మందు నిరాహారియై యెంటి కాలిపై నిల్చి డెబ్బది వేలేండ్లు చేసిన తపస్సు యొక్క ఫల మీ క్షేత్రము నందు జ్యేష్ఠ శుద్ద దశమి నాడుపవాస ముండి జగన్నాథు దర్శించి నంత మాత్రాన గల్గును. జ్యేష్ఠ మందే పంచతీర్థ యాత్ర సేసి శుద్ద ద్వాదశి నాడు పురుషోత్తముని దర్శంచ వలెను. దానిచే విష్ణు లోకమును శాశ్వతముగ పొందును. దూరమున నుండి యేని పురుషోత్తముని దిన దినము కీర్తించిన జాలును. విష్ణు పురము నందును హరి చేతిలోని చక్రము నల్లంత దూరమందుండి యేని ఆలయమును పరి భాగమందున్న దానిని జూచి నమస్కరించిన యాతడు పాపా విముక్తు డగును.
Summary of chapter 51 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Drawn by the divine light, Mārkaṇḍeya enters the mouth of a luminous infant reclining on a Vaṭa leaf amid the pralaya ocean. Within the child's belly the sage discovers the entire universe intact — all worlds, beings, mountains, rivers, and Devas. He wanders within for a long time, unable to find an end, until he is expelled through the child's mouth and finds himself again in the pralaya ocean. The child is revealed as Nārāyaṇa himself.