బ్రహ్మ మహా పురాణము

47 - ప్రాసాదకరణమ్‌

బ్రహ్మ:

ఏవం స పృథివీపాల శ్చింతయిత్వా ద్విజోత్తమాః

ప్రాసాదార్థం హరేస్తత్ర ప్రారంభమకరోత్తదా

ఆనాయ్య గణకాన్సర్వా నాచార్యాన్‌ శాస్త్రపారగాన్‌

భూమిం సంశోధ్యయత్నేన రాజా తు పరయాముదా

బ్రాహ్మణైర్ఞాన సంపన్నై ర్వేద శాస్త్రార్థ పారగైః

అమాత్యైః మంత్రిభిశ్చైవ వాస్తువిద్యా విశారదైః

తైః సార్థం స సమాలోచ్య సుముహూర్తే శుభేదినే

సు చంద్ర తారసంయోగే గ్రహాను కూల్య సంయుతే

జయమంగళ శబ్దైశ్చ నానావాద్యెర్మనోహరైః

వేదాధ్యయన నిర్ఘో షైర్గీతైః సుమధురస్వరైః

పుష్పలాజాక్షతైర్గంధైః పూర్ణకుంభైః సదీపకైః

దదావర్ఘ్యం తతోరాజా శ్రద్ధయా సుసమాహితః

దత్త్వైవ మర్ఘ్యం విధివ దానాయ్య స మహీపతిః

కళింగాధిపతిం శూర ముత్కళాధిపతిం తధా

కోశలాధిపతించై తానువాచ తదానృపః

బ్రహ్మ:

ఇట్లా రాజు విష్ణుప్రాసాద నిర్మాణమును గురించి యాలోచించి ప్రారంభము చేసెను. జోతిష్కులను బిలిపించి భూ శోధనము చేయించెను. అంతియే గాక జ్ఞానులు, వేదశాస్త్ర పారంగతులు, అమాత్యులు, మంత్రులు, మొదలగు వారితో సమాలోచించి సుముహూర్తమున చంద్ర తారాబల సంపత్తి గ్రహాను కూల్యము గల శుభ సమయమున వాస్తు విద్వాంసులతో నీ యారంభము జరిపించెను. మంగళ వాద్యములు, వేదా ధ్యయనము మనోహరముగా జరిగెను. పూవులు, నక్షతలు, పేలాలతో దీపములతో పూర్ణ కుంభములతో నా మహీపతి భక్తితో భగవంతున కర్ఘ్యమిచ్చెను. కళింగోత్కళ, కోశలా ధీశ్వరులను ఆహ్వానించెను.

రాజు:

గచ్ఛధ్వం సహితాః సర్వే శిల్యార్థే సుసమాహితాః

గృహీత్వా ళిల్పముఖ్యాశ్చ శిలాకర్మ విశారదాన్‌

వింధ్యాచలం సువస్తీర్ణం బహుకందర శోభితమ్‌

నిరూప్య సర్వసానూని చ్ఛేదయిత్వా శిలాః శుభాః

సంవాహ్యంతాంచ శకటై ర్నౌకాభి ర్మావిలంబయ

బ్రహ్మ:

ఏవం గంతుం సమాదిశ్య తాన్నృపా న్స మహీపతిః

పునరేవ అబ్రవీద్వాక్యం సామాత్యా న్సపురోహితాన్‌

మఱియు నా నరేంద్రులను స్వామి విగ్రహము కొఱకనువయిన శిలకై వెళ్ళుడని యానతిచ్చెను. శిల్పులను వెంటగొని వింధ్యాద్రికి జని బండ్లపై పడవలపై నేగి పాషాణములను గొని రండని పంపెను. ఇట్లాజ్ఞ యిచ్చి యమాత్యులతో పురోహితుల కిట్లానతిచ్చెను.

రాజు:

గచ్ఛంతు దూతాః సర్వత్ర మమాజ్ఞాం ప్రవదంతువై

యత్ర తిష్ఠంతి రాజానః పృథివ్యాంతాన్‌ సుశీఘ్రగాః

హస్త్యశ్వ రథపాదాతైః సామాత్యైః సపురోహితైః

గచ్ఛత సహితాః సర్వ ఇంద్రద్యుమ్న స్య శాసనాత్‌

రాజు:

నా యానతి గొని దూతలు ఈ పుడమి కల రాజు లందరికి శుభవార్త తెలిపి రండనెను. దూతలు రాజు వచనమును రాజులకు దెయిప నేగిరి.

ఏవం దూతాః సమాజ్ఞాతాః రాజ్ఞాతేన మహాత్మనా

గత్వా తదా నృపానూచుర్వచనం తస్య భూపతేః

శ్రుత్వాతు తే తధా సర్వే దూతానాం వచనం నృపాః

ఆజగ్ము స్త్వరితాః సర్వే స్వసైన్యైః పరివారితాః

యే నృపాః సర్వదిగ్భాగే యేచ దక్షిణతః స్థితాః

పశ్చిమాయాం స్థితా యేచ ఉత్తరా పథ సంస్థితాః

ప్రత్యంత వాసినో యేపి యేచ సన్నిధివాసినః

పార్వతీయాశ్చ యే కేచిత్తధా ద్వీప నివాసినః

రధైర్నాగైః పదాతైశ్చ వాజిభిర్ధన విస్తరైః

సంప్రాప్తా బహుశో విప్రాః శ్రుత్వేంద్ర ద్యుమ్నశాసనమ్‌

తానాగతా న్నృపా న్దృష్ట్వా సామాత్యాన్సపురోహితాన్‌

ప్రోవాచ రాజా హృష్టాత్మా కార్యముద్దిశ్య సాదరమ్‌

దూతలేగి రాజులకు వార్త నెఱింగింప వారు ససైన్య పరివారముగా నరుదెంచిరి. నలు దెసల రాజ్యముల వారు పర్వత ద్వీపాది పర్వత ప్రాంతముల వారు నయ్యు త్సవమునకు వచ్చిరి.

రాజు:

శృణుథ్వం నృపశార్దూలా యధా కించి ద్ట్రవీమ్యహమ్‌

అస్మిన్షేత్రవరే పుణ్యే భుక్తిముక్తి ప్రదే శివే

హయమేథం మహాయజ్ఞం ప్రాసాదం చైవ వైష్ణవమ్‌

కధం శక్నోమ్యహం కర్తుమితి చింతాకులం మనః

భవద్భిః సుపహాయైష్తు సర్వమేతత్కరోమ్యహమ్‌

యది యూయం సహాయా మే భవథ్వం నృపసత్తమాః

రాజు:

అట్లరుదెంచిన రాజులను గని యీ పుణ్య క్షేత్రము భుక్తిముక్తి ప్రదము. ఇంద శ్వమేధమును జేసి విష్ణు ప్రాసాద నిర్మాణమును గూడ జేయ కుతూహల పడుచున్నాను. కావున మీరందరూ నాకిందు సహకరింప వలెను.

బ్రహ్మ:

ఇత్యేవం వదమానన్య రాజరాజస్య ధీమతః

సర్వే ప్రముదితా హృష్టా భూపాస్తే తస్య శాసనాత్‌

పవృషుర్ధన రత్నైశ్చ సువర్ణ మఱి మౌక్తికైః

కంబలాజిన రత్నైశ్చ రాంకవా స్తరణై శ్శుభైః

వజ్రవైడూర్య మాణిక్యైఃపద్మరాగేంద్ర నీలకైః

గజైరశ్వైర్ధనైశ్చాన్యై రథైశ్చైవ కరేణుభిః

అసంఖ్యేయై ర్భహువిధై ర్ద్రవ్యై రుచ్చావచైస్తధా

శాలివ్రీహి యవైశ్చైవ మాషముద్గ తిలైస్తధా

సిద్దార్ధ చణకైశ్చైవ గోధూమై ర్శసురాదిభిః

శ్యామాకై ర్మధుకైశ్చైవ నీవారైః సకులత్థకైః

అన్యైశ్చ వివిధైర్ధాన్యైః గ్రామ్యారణ్యౖః సహస్రశః

బహుధాన్య సహస్రాణాం తండులానాంచ రాశిభిః

గవ్యస్య హవిషః కుంభైః శతశోథ సహస్రశః

తధాన్యైర్వివిధై ర్ద్రవ్యై ర్భక్ష్యభోజ్యాను లేపనైః

రాజానః పూరయామాసు ర్యత్కించిర్ద్రవ్య సంభవైః

తాన్‌ దృష్ట్వా యజ్ఞ సంభారాన్‌ సర్వ సంపత్సమన్వితాన్‌

యజ్ఞకర్మవిధో విప్రాన్వేద వేదాంగ పారగాన్‌

శాస్త్రేషు నిపుణా న్దక్షా న్కుశలా న్సర్వ కర్మసు

ఋషీం శ్చైవ మహర్షీం శ్చ దేవర్షీంశ్చైవ తాపసాన్‌

బ్రహ్మచారి గృహస్థౌంశ్చ వానప్రస్థా న్యతీంస్తథా

స్నాతకాన్‌ బ్రాహ్మణాం శ్చాన్యా నగ్ని హోత్రే సదాస్థితాన్‌

ఆచార్యోపాధ్యాయ వరాన్స్వాధ్యాయ తపసాన్వితాన్‌

సదస్యాన్‌ శాస్త్ర కుశలాం స్తథా న్యాన్పావకా న్బహూన్‌

దృష్ట్వా తాన్నృపతిః శ్రీమానువాచ స్వపురోహితమ్‌

బ్రహ్మ:

బుద్ధిశాలి యగు రాజిట్లు పలుకుటకు నృపతు లెల్లరు నానందించిరి. అతని శాసనము ననుసరించి ధన కనక, రత్న, ముక్తా మణి రాసులను అనర్ఘ వజ్ర వైడుర్యాదులను, శాలువలను నూత నాంబరములను, నేనుగులపై గుర్రములపై నసంఖ్యాకముగ తరలించుకొని వచ్చరి. నానా విధ ఆహార పదార్థములను నవ ధాన్యములను, మాష ముద్గ తండుల తిలాదులను, గొని తెచ్చి గాదులను నింపిరి, ఆ యజ్ఞ సంభారములను జూచి నృపతి పరమానంద భరితుడై మహర్షులను, దేవర్షులను, బ్రహ్మచారి ప్రముఖ చతురాశ్రమ స్థులను ఆచార్యో పాధ్యాయ ఋత్విజ వర్గమును సర్వశాస్త్ర కుశలు రయిన సదస్యులను నా శ్రీమంతుడు దర్శింప నానంద భరితుడై పురోహితునితో నిట్లనియె.

రాజ:

తతః ప్రయాంతు విద్వాంసో బ్రాహ్మణా వేదపారగాః

వాజిమేధార్థ సిద్ధ్యర్ధం దేశం పశ్యంతు యజ్ఞియమ్‌

రాజ:

అశ్వమేధాశ్వమునకు వేద పారగులైన బ్రాహ్మణు లాయా దేశముల కేగి పరీక్షింతురు గాక యనెను.

బ్రహ్మ:

ఇత్యుక్త స్సతథా చక్రే వచనం తస్య భూపతేః

హృష్టః స మంత్రిభిః సార్ధం తదా రాజపురోహితః

తతో యయౌ పురోధాశ్చ ప్రాజ్ఞః స్థపతిభిః సహ

బ్రాహ్మణా నగ్రతః కృత్వా కుశలాన్యజ్ఞ కర్మణి

తం దేశం ధృవరోగ్రామం సప్రతోలి విటంకినమ్‌

కారయామాస విప్రోసౌ యజ్ఞవాటం యథావిధి

ప్రాసాదశతసంబాధం మణిప్రవర వేదికమ్‌

 ఇంద్ర సద్మనిభం రమ్యం హేమరత్న విభూషితమ్‌

స్తంభా న్కనక చిత్రాంశ్చ తోరణాని బృహంతి చ

యజ్ఞాయతన దేశేషు దత్వా శుద్ధం చ కాంచనమ్‌

అంతః పురాణి రాజ్ఞాం చ నానాదేశనివాసినామ్‌

కారయామాన ధర్మాత్మా తత్ర తత్ర యథా విధి

బ్రాహ్మణానాం చ వైశ్యానాం నానాదేశ సమీయుషామ్‌

కారయామాస విధివచ్ఛాలా స్తత్రాప్యనేకశః

ప్రీత్యర్థం తస్య నృపతే రాయయుర్మృపసత్తమాః

రత్నా న్యనేకా న్యాదాయ స్త్రియశ్చాయయు రుత్సవే

తేషాం నిర్విశతాం స్వేఘ శిబిరేషు మహాత్మనామ్‌

నదతః సాగరస్యేవ దివి స్సృగ భవ ద్ధ్వనిః

బ్రహ్మ:

రాజ పురోహితుడానంద భరితుడై రాజులతో బ్రాహ్మణ పురస్సరముగా నొక గ్రామ ప్రాంతమున యజ్ఞ వాటమును శాస్త్రీయముగా నిర్మింప జేసెను. అది అనేక రాజ ప్రాసాదము లతో మణిమయము లయిన వేదికలతో, బంగరు స్తంభములతో తోరణములతో సుమనోహరముగా శోభిల్లు చుండెను. నానా దేశ రాజులకు నంతః పురములను ఏర్పరచెను. ఆ దేవుని సంతోష పరుప నమూల్య మయిన వస్తువులను స్వర్ణ రత్నాదులను గాన్కలంగొని వారివారి శిబిరము లందు విడిసిరి. ఆ సందడి సముద్ర ధ్వనిని మించి ఆకాశ మంటెను. నానాదేశా గతులైన బ్రాహ్మణ వైశ్యులకును విడుదులను యథా విధిగ నేర్పాటు చేయించెను.

తేషా మభ్యాగతానాం చ స రాజా మునిసత్తమాః

వ్యాదిదేశాయతనాని శయ్యాశ్చాప్యుపచారతః

భోజనాని విచిత్రాణి శాలీక్షుయవగోరసైః

 ఉపేత్య నృపతిశ్రేష్ఠో వ్యాదిదేశ స్వయం తదా

తథా తస్మిన్యహాయజ్ఞే బహవో బ్రహ్మవాదినః

 యే చ ద్విజాతి ప్రవరా స్తత్రాసన్ద్విజ సత్తమాః

సమాజగ్ము స్సశిష్యాస్తా న్ర్పతిజగ్రాహ పార్థివః

సర్వాంశ్చ తాననుయయౌ యావదావసథానితి

స్వయమేవ మహా తేజా దంభం త్యక్త్వా నృపోత్తమః

తతః కృత్వా స్వశిల్పం చ శిల్పినోన్యే చ యే తదా

కృత్స్నం యజ్ఞవిధిం రాజ్ఞే తదా తస్మై న్యవేదయన్‌

తతః శ్రుత్వా నృపశ్రేష్ఠః కృతం సర్వమతంద్రితః

హృష్టరోమాభవద్రాజా సహమంత్రిభిరచ్యుతః

మఱియు నందాగతులైన వారికి శయ్యాస నాదులు మృష్టాన్న సంతర్పణముల నాడేర్పరచెను. ఆ యజ్ఞమునకు మహానుభావులు బ్రహ్మ వేత్తలు శిష్యులతో నేతెంచిరి. రాజు వారికి నెట్టి డాంబికము లేక హృదయ పూర్వకముగా స్వయముగా స్వగత మొసంగెను. ఆ మీదట శిల్పులు నందు తమ శిల్ప నైపుణ్యముం బ్రదర్శించిరి. రాజు మంత్రులతో నేమాత్ర మేమరుపాటు లేకుండ నా యజ్ఞ సన్నాహముం దిలకించి పులకితాంగుడయ్యె.

బ్రహ్మ:

తస్మి న్యజ్ఞే ప్రవృత్తే తు వాగ్మినో హేతువాదినః

 హేతువాదా న్బహూంశ్చక్రుః పరస్పర జగీషవః

దేవేంద్రస్యేవ విహితం రాజసింహేన భోద్విజాః

దదృశుస్తోరణాన్యత్ర శాతకుంభమయానిచ

శయ్యాసన వికారాంశ్చ సుబహూన్రత్న సందాయాన్‌

ఘటపాత్రీ కటాహాని కలశాన్వర్ధమానకాన్‌

నహికశ్చి దసౌవర్ణ మపవ్యద్వసుధాధిపః

యూపాంశ్చ శాస్త్ర పఠితాన్‌ దారవాస్హే మభూషితాన్‌

ఉపక్షిప్తాన్యథా కాలం విధివద్భూరి వర్చసః

స్థలజా జలజా యే చ పశవః కేచన ద్విజాః

సర్వానేవ సమానీతా నపశ్యం స్తత్ర తే నృపాః

గాశ్చైవ మహిషీశ్చైవ తధా వృద్ధ స్త్రియోపిచ

ఔదకానిచ సత్త్వాని శ్వాపదాని వయాంసి చ

జరాయుజాండజాతాని స్వేద జాన్యుద్భిదానిచ

పార్వతాన్యుపధాన్యాని భూతాని దదృశుశ్చ తే

 ఏవం ప్రముదితం సర్వం పశుతో ధనధాన్యతః

యజ్ఞవాటం నృపా దృష్ట్వా విస్మయం పరమం గతాః

బ్రాహ్మణానాం విశాం చైవ బహు మిష్టా న్నమృద్భామత్‌

పూర్ణే శతసహస్రేతు విప్రాణాం తత్రభుంజతామ్‌

దుందుభిర్మేషునిర్ఘోష న్ముహూర్ముహు రధాకరోత్‌

విననాదా సకృచ్చాపి దివసే దివసే గతే

ఏవం స వవృధే యజ్ఞ స్తస్య రాజ్ఞస్తు ధీమతః

అన్నస్య సుబహూన్విప్రాః ఉత్పర్గా న్నిర్గతోపమాన్‌

దధికుల్యాశ్చ దదృశుః పయసశ్చ హ్రదాంస్తథా

జంబూద్వీపోహి సకలో నానాజన పదైర్యుతః

ద్విజాశ్చ తత్రదృశ్యంతే రాజ్ఞస్తస్య మహామఖే

తత్ర యాని సహస్రాణి పురుషాణాం తతస్తతః

గృహీత్వా భాజనం జగ్ముర్బహూని ద్విజసత్తమాః

శ్రావిణశ్చాపి తే సర్వే సుమృష్ట మణికుండలాః

పర్యవేషయన్ద్విజాతీం శతసోథ సహశ్రః

వివిధాన్యను పానాని పురుషా యేనుయాయినః

తే వై నృపోపభోజ్యాని బ్రాహ్మణేభ్యో దదుః సహ

సమాగతాన్వేదవిదో రాజ్ఞశ్చ పృథివీశ్వరాన్‌

పూజాం చక్రే తదా తేషాం విధివద్భూరి దక్షిణః

దిగ్దేశాదాగతా న్రాజ్ఞో మహా సంగ్రామ శాలినః

నటనర్తకకాదీంశ్చ గీతస్తుతివిశారదాన్‌

పత్న్యో మనోరమా స్తస్య పీనోన్నత పయోధరాః

ఇందీవర పలాశాక్ష్యః శరశ్చంద్ర విభాననాః

కులశీల గుణోపేతాః సహస్రైకం శతాధికమ్‌

ఏవం తద్భూత పరమ పత్నీ గణసమన్వితమ్‌

రత్న మాలాకులం దివ్యం పతాకాధ్వజ సేవితమ్‌

రత్నహార యుతం రమ్యం చంద్రకాంతి సమప్రభమ్‌

కరిణః పర్వతాకారా న్మద సిక్తాన్మహాబలాన్‌

శతశః కోటి సంఘాతై ర్దంతి భిర్దంత భూషణైః

వాతవేగ జవైరశ్వైః సింధూజాతైః సుశోభనైః

శ్వేతాశ్వైః శ్యామ కర్ణైశ్చ కోట్యనేకై ర్జవాన్వితైః

సన్నద్ధ బద్ధక క్షైశ్చ నానాప్రహరణోద్యతైః

అసంఖ్యేయైఃపదాతైశ్చ దేవపుత్రోపమైస్తథా

ఇత్యేవం దదృశో రాజా యజ్ఞసంభార విస్తరమ్‌

ముదం లేభే తదా రాజా సంహృష్టో వాక్యమబ్రవీత్‌

ఆ యజ్ఞ మారంభము నంత సదస్యు లొండొరులను గెలువ నిత్యద్బుత శాస్త్రార్థములు గావించిరి. దేవేంద్ర వైభవమును మించిన ఆ యజ్ఞవాట నిర్మాణ శోభను దిలకించి, మంగళార్థము లయిన పూర్ణ కలశల వీక్షించి శ్రౌతము చెప్పినట్లు నిలువ బడిన దారుమయ యూప స్తంభము లంగని, జల స్థలము లందు బుట్టిన యజ్ఞ పశువుల నావులు గేదెల నాలోకించి యజ్ఞమున కేతెంచిన ప్రజలానంద భరితులైరి. జరాయుజాదులు నాల్గు రకముల జీవులు పర్వతము లందు పండెడి ధాన్యములు మొదలయిన యజ్ఞ సంభారము లనేక ములం జూచి రాజు లాశ్చర్యానంద వివశులైరి. బ్రాహ్మణాదులకు మృష్టాన్న సంతర్పణములు జరిగెను. ఇట్లు విప్ర సహస్ర సంకులమైన యయ్యజ్ఞ వాటము నందు మంగళార్థము లైన దుందుభి ద్వనులు విన సొంపైనవి. పాలు పెరుగు లందేరులై ప్రవహించెను. జంబూ ద్వీపమంతయు నట కేతెంచి నట్లు కనిపించెను. విప్రులు సువర్ణ మణికుండ లాదులను వేలకొలది బహుమాన ములందందు కొని యేగిరి. అందు బ్రాహ్మణులు రాజ భోజ్యము లయిన విందు లారగించిరి. ఋత్విజులకు భూరి దక్షిణ లొసంగెను. మరియు నాఱేడు రాజులకు గూడ మిక్కిలి సత్కరించెను. ఆరాజు నంతఃపురము యజమాన నత్నీగణము కులశీల సంపన్నము పరమ శోభన స్వర్ణ రత్నా భరణము లందాల్చి ముక్తారత్న హారములు మెఱయ నా యజ్ఞమున కద్బుత శోభను సంపాదించెను. మహా గజములు సింధు జాతము లైన అశ్వములు పలు రంగులు గలవి నానా విధాయుధ ధారు లయిన భటులు నా యజ్ఞ మునకు రక్ష యిచ్చు చుండ జూచి యా యజమాని మానవేశ్వరు డుప్పొంచుగు నిట్లనియె.

రాజు:

ఆనయుధ్వం హయశ్రేష్ఠం సర్వలక్షణ లక్షితమ్‌

చారయధ్వం పృథివ్యాం వై రాజ పుత్రాః సుసంయతాః

విద్వద్భి ర్ధర్మ విద్ఛిశ్చ ఆత్ర హోమో విధేయతామ్‌

కృష్ణచ్ఛాగం చ మహిషం కృష్ణసార మృగం ద్విజాన్‌

అనడ్వాహం చ గాశ్చైవ సర్వాంశ్చ పశుపాలకాన్‌

ఇష్టయశ్చ ప్రవర్తంతాం ప్రాసాదం వైష్టవం తతః

సర్వమేతచ్చ విప్రేభ్యో దీయతాం మనసేప్సితమ్‌

స్త్రియశ్చ రత్నకోట్యశ్చ గ్రామాశ్చ నగరాణి చ

సమ్యక్‌ సమృద్ధ భూమ్యశ్చ విషయాశ్చైవ మర్థినాం

 అన్యాని ద్రవ్యజాతాని మనోజ్ఞాని బహునిచ

సర్వేషాం యాచమానానాం నాస్తి హ్యేతన్న భాషయేత్‌

తావత్రృ వర్తతాం యజ్ఞో యావద్దేవః పురా త్విహ

ప్రత్యక్షం మమ చాభ్యేతి యజ్ఞ స్యాస్య సమీపతః

బ్రహ్మ:

ఏవ ముక్త్వా తదా విప్రాః రాజసింహో మహాభుజః

దదౌ సువర్ణ సంఘాతం కోటినాం చైవ భూషణమ్‌

కరేణు శత సాహస్రం వాజినో నియతాని చ

అర్భుదం చైవ వృషభం స్వర్ణ శృంగీశ్చ ధేనుకాః

సురూపాః సురభీశ్చైవ కాంస్య దోహాః పయస్వినీః

ప్రాయచ్ఛత్స తు విప్రేభ్యో వేదవిద్భ్యో ముదాయుతః

వాసాంసి చ మహార్హాణి రాంకభవాస్తరణానిచ

 సుశుక్లానిచ శుభ్రాణి ప్రవాళ మణి ముత్తమమ్‌

బ్రహ్మ:

సర్వ శుభ లక్షణ లక్షితమైన అశ్వమేధాశ్వమును గొని రండు, సుసన్నద్ధు లయి రాజ కుమారులా గుఱ్ఱము వెంట రక్షణ యిచ్చును ననుగమింతురు గాక ధర్మశాస్త్ర విదు లయిన విప్రులు ఋత్విజు లిక్కడ హోమాదులను నిర్వర్తింపుడు నల్లమేక, నల్లలేడి, జాతి గల యెద్దు దున్నపోతు గోవులు గోపాలురును నిందు గొనిరండు. ఇష్టి విశేషములను జరిపింపుడు. ఆ మీద విష్ణు దేవాలయ నిర్మాణము నిర్వర్తింప బడును. విప్రులేది కోరిన నది యెల్ల నిండు, మఱి యిందు వచ్చు యాచకు లెల్లరకు లేదన కుండ సర్వ ద్రవ్యములు నీయ బడుగాక. నాకు భగవంతుడు విష్ణువు సాక్షాద్దర్శన మిచ్చు దాక యీ యజ్ఞము జరుగ వలసినదే యని యారాజు బంగారు రాసులను గజ తురగ గో వృషభాదులను కోట్లు నర్బుదములుగా దానములు గావించెను. గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు పాలు పితుకుటకు కంచు బిందెలు జతసేసి అనేక గోవులను వేద విదుల కొసంగెను.

ఆదదాత్స మహాయజ్ఞే రత్నాని వివిధానిచ

వజ్ర వైడూర్య మాణిక్య ముక్తికాద్యాని యానిచ

అలంకారవతీః శుభ్రాః కన్యా రాజీవ లోచనాః

శతాని పంచ విప్రేభ్యో రాజా హృష్టః ప్రదత్తవాన్‌

స్త్రియః పీన పయోభారాః కంచుకైః స్వస్తనావృతాః

మధ్య హీనాశ్చ సుశ్రోణ్యః పద్మపత్రా యతేక్షణాః

 హావ భావాన్విత గ్రీవా బహ్వ్యో వలయ భూషితాః

పాద నూపుర సంయుక్తాః పట్టదుకూల వాససః

ఏకైకశోదదాత్త స్మిన్కామ్యాశ్చ కామినీ ర్బహూః

ఆర్ధిభ్యో బ్రాహ్మణాదిభ్యో హయమేధే ద్విజో త్తమాః

భక్ష్యం భోజ్యంచ సంపూర్ణం నానాసంభారసంయుతమ్‌

ఖండ ఖాద్యాన్యనేకాని స్విన్న పాకాంశ్చ పిష్టకాన్‌

అన్నాన్యన్యాని మేధ్యాంశ్చ ఘృత పూరాంశ్చ ఖాండవాన్‌

మధురాం స్తర్జితాన్పూపానన్నం మృష్టం సుపాకికమ్‌

ప్రీత్యర్థం సర్వసత్త్వానాం దీయతేన్నం పుసః పునః

దత్తస్య దీయమానస్య దనస్యాంతో న విద్యతే

ఏవం దృష్ట్వా మహా యజ్ఞం దేవ దైత్యాః సచారణాః

గంధర్వా ప్సరసః సిద్దా ఋషయశ్చ ప్రజేశ్వరాః

విస్మయం పరమం యాతా దృష్ట్వా క్రతువరం శుభమ్‌

పురోధా మంత్రిణో రాజా హృష్టా స్తత్రైవ సర్వశః

న తత్ర మలినః కశ్చిన్న దీనో న క్షుధాన్వితః

న వోపసర్గో గ్లాని ర్నాధయో వ్యాధయస్తథా

నాకాలమరణం తత్ర నదంశో నగ్రహా విషమ్‌

హృష్ట పృష్టజనాః సర్వే తస్మి న్రాజ్ఞో మహోత్సవే

యేచ తత్ర తపః సిద్ధా మునయ శ్చిర జీవివః

నజాతం తాదృశ్యం యజ్ఞం ధనధాన్య సమన్వితమ్‌

ఏవం సరాజా విధివద్వాజి మేధం ద్విజోత్తమాః

క్రతుం సమాపయామాస ప్రాసాదం వైష్ణవం తథా

అనర్ఘ సువర్ణ మణిమయాంబరా భరణములను తెల్లని శయ్యాసనా స్తరణములను, పగడములను వజ్ర వైడూర్య గోమేధికాది రత్నములను నమూల్యము లనమేయముల నిచ్చెను. సాలంకృత కన్యా దానములు సేసెను. సర్వాంగ సుందరు లయిన యంగనా మణులను విలాస వతులను చీరలతో రావికలతో హార కేయూర కంకణాదులతో గాన్క లిచ్చెను. భక్ష్య భోజ్య చోష్య లేహ్యాత్మ ములయిన చతుర్విధ మృష్టాన్న సంతర్పణము ఘృత పాయసావూప సమృద్దముగా గావించెను. సర్వజీవ సంతృప్తిగా నన్నదానము సేసెను. ఆ దానముల కాంతు దరి గానా రాదాయ్యె. ఈ అద్భుత యజ్ఞ వైభవమును గాంచి దేవతలు దైత్యులు చారణులు గంధర్వుల ప్సరసలు సిద్దులు ఋషులు రాజులు నెంతేని యాశ్చర్య మందిరి. ఋత్వి గ్వర్గము పురోహిత మంత్రి సామంతులు నాడిన యానందము నకు హద్దులు లేవు. అందు నొడలు వలువలు మాసిన వాడు దీనుడు నాకలి గొన్న వాడు, ఇబ్బందులకు లోనైన వాడు. దిగులు వడిన వాడు. వ్యాధి గ్రస్తుడు మనో వ్యాధి గ్రస్తుడు నైన జీవి యొక్కడును లేడు. ఆ రాజ్యమున నకాల మరణము గ్రహా వేశము భూతప్రేత పిశా చావేశము విష స్పర్శము నన్నది లేనే లేదు. హృష్ట పుష్ట జన సంకుల మాఱేని దేశము. మునులు తమతమ సేయు తపస్సు లందు బరమ సిద్ధిని బడసిరి. చిరంజీవు లైరి. ఎన్నడు నీవర కిట్లు దనధాన్య సమృద్ధముగ యజ్ఞము జరిగినది లేదు. ఇట్లా రాజేంద్రు డింద్రద్యుమ్నుడు యధా విధిగ నయ్యశ్వ మేధమును విష్ణు ప్రాసాదమును నిర్వర్తించి జగన్మంగళము సేకూర్చెను.