వ్యాసులు:
ద్వారవత్యాం తతః శౌరిం శక్రస్త్రిభువనేశ్వరః
ఆజగామాధ మునయో మత్తైరావతపృష్ఠగః
ప్రవిశ్య ద్వారకాం సోథ సమీపే చ హరే స్తదా
కథయామాస దైత్యస్య నరకస్య విచేష్టితమ్
వ్యాసులు:
“ఇంద్రు రైరావత మెక్కి ద్వారవతి యందున్న కృష్ణుని జూడ వచ్చి యతనికి నరకాసురుని చర్యలను దెలిపెను.”
ఇంద్రుడు:
త్వయా నాథేన దేవానాం మనుష్యత్వేపి తిష్ఠతా
ప్రశమం సర్వదుఃఖాని నీతాని మధుసూదన
తపస్వి జనరక్షాయై సోరిష్టో ధేనుక స్తథా
వ్రలంబాద్యాస్తథా కేశీ తే సర్వే నిహతా స్త్వయా
కంసః కువలయాపీడః పూతనా బాలఘాతినీ
నాశం నీతాస్త్వయా సర్వే యోన్యే జగదుపద్రవాః
యుష్మద్దోర్దండ సంబుద్ధి పరిత్రాతే జగత్రయే
యజ్ఞే యజ్ఞహవిః ప్రాశ్య తృప్తిం యాంతి దివౌకసః
సోహం సాంప్రత మాయాతో యన్నిమిత్తం జనార్దన
తచ్ఛ్రుత్వా తత్ర్పతీకార ప్రయత్నం కర్తుమర్హపి
భౌమోయం నరకో నామ ప్రాగ్జ్యోతిష పురేశ్వరః
కరోతి సర్వభూతానా మపఘాత మరిందమ
దేవసిద్ధసురాదీనాం నృపాణాం చ జనార్దన
హత్వా తు సోసురః కన్యా కురోధ నిజమందిరే
ఛత్రం యత్సలిలస్రావి తజ్జహార ప్రచేతసః
మందరస్య తథా శృంగం హృతవాన్మణి పర్వతమ్
అమృతస్రావిణీ దివ్యే మాతుర్మేమృత కుండలే
జహార సోసురోదిత్యా వాంఛ త్యైరావతం ద్విపమ్
దుర్నీతమే తద్గోవింద మయా తస్య తవోదితమ్
యదత్ర ప్రతి కర్తవ్యం తత్స్వయం పరిమృశ్యతామ్
ఇంద్రుడు:
దేవతలకు దిక్కయిన నీవు మనుష్య రూపమున నుండియు సర్వ దుఃఖ ప్రశమనము జేసినావు. తపశ్శాలుర రక్షణకు నరిష్టుడు మొదలుగ గంసుని వరకు గల జగ దుపద్రవ మైన వారిని నశింప జేసితివి. నీ బాహుదండము చేతను బ్రబోధము చేతను ద్రిభువనములు రక్షణము బొంది దేవతలు యజ్ఞము లందు హవిర్భావము లారగించి తృప్తులగు చున్నారు. నేనిపుడు ఎందులకు వచ్చితినో విని ప్రతిక్రియకు నెత్నింపుడు. భూమి పుత్రుడు నరకుడను వాడు ప్రాగ్జ్యోతిష పురాధిపతి సర్వ భూతములకు బాధ చేయు చున్నాడు. దేవ సిద్ధులు సురులు మొదలగు వారి కన్యకల హరించి తన యింట నిర్భంధించి నాడు. ఉదకమును స్రవించు వరుణుని యొక్క గొడుగును వాడు హరించెను. మణులకు ఆకరమైన మందర పర్వత శిఖరమును గొని పోయినాడు. మా తల్లి యదితి యొక్క కుండలములను అమృతము స్రవించు వానినిగా జేసినాడు. ఇపుడు ఐరావతము కావలెనను చున్నాడు. వాని దుష్కృత్యము నీకు నివేదించి నాను. ఇందు జేయ వలసిన ప్రతిక్రియ నీవు స్వయముగా విమర్శింపుము.
వ్యాసులు:
ఇతి శ్రుత్వా స్మితం కృత్వా భగవాన్దేవకీసుతః
గృహీత్వా వాసనం హస్తే సముత్తస్థౌ వరాసనాత్
సంచింతిత ముపారుహ్య గరుడం గగనే చరమ్
సత్యభామాం సమారోప్య యయౌ ప్రాగ్జ్యోతిషం పురమ్
అరుహ్యైరావతం నాగం శక్రోపి త్రిదశాలయమ్
తతో జగామ సుమనాః పశ్యతాం ద్వారకౌకసామ్
అన విని భగవంతుడు దేవకీ సుతుడు అల్లన నవ్వి ఇంద్రుని జేత బట్టుకొని పీఠము నుండి లేచెను. తలచి నంతన వచ్చిన గరుత్మంతుని పై సత్యభామను ఎక్కించి ప్రాగ్జ్యోతిష పురమున కేగెను. ఇంద్రుడు ఐరావతము నెక్కి ద్వారకా వాసులు చూచుచుండ స్వర్గమున కేగెను.
స్రాగ్జ్యోతిషపురస్యాస్య సమంతా చ్ఛతయోజనమ్
ఆచితం భైరవైః పాశైః పరసైన్యనివారణే
తాంశ్చిచ్ఛేద హరిః పాశా న్క్షిప్త్వా చక్రం సుదర్మనమ్
తతో మురః సముత్తస్థౌ తం జఘాన చ కేశశః
మురస్ప తనయాన్యప్త సహస్స్రాస్తాం స్తతో హరిః
చక్రధారాగ్ని నిర్ధగ్ధ్నాం శ్చకార శలభానివ
హత్వా మురం హయగ్రీవం తథా పంచజనం ద్విజాః
ప్రాగ్జ్యోతిషపురం ధీమాం స్త్వరావాన్సము పాద్రవత్
నరకేనాస్య తత్రాభూ న్మహాసైన్యేన సంయుగః
కృష్ణస్య యత్ర గోవిందో జఘ్నే దైత్యాన్సహస్రశః
శస్త్రౌస్త్రవర్షఫం ముంచంతం స భౌమం నరకం బలీ
క్షిప్త్వా చక్రం ద్విధా చక్రే చక్రీ దైతేయ చక్రహా
హతే తు నరకే భూమి ర్గృహీత్వాదితి కుండలే
ఉపతస్థే జగన్నాథం వాక్యం చేదమథాబ్రవీత్
ప్రాగ్జ్యోతిష పురము చుట్టునూ నూరు యోజనములు భయంకరము లైన పాశములచే జుట్టబడి యుండెను. పరసైన్య నిరోధమునకు ఏర్పడిన యా పాశములను సుదర్శ నాయుధము విసరి హరి ఖండించెను. అవ్వల మురాసురుడు ఎదిరింప రాగ హరి వానిని గడ తేర్చెను. మరియు వాని కొడుకులను ఏడువేల మందిని మిడుతలను వలె చక్ర ధారాగ్ని దగ్ధులను జేసెను. అచ్చటనే హయగ్రీవుని జంపి బుద్దీశాలి యగు హరి తొందరతో ప్రాగ్జ్యోతిష పురమునకు బరువెత్తెను. అచ్చట నరకునితో మహా సైన్యముతో ఘోర యుద్ధ మయ్యెను. గోవిందుడు వేల కొలది దైత్యులను గూల్చెను. అవ్వల శస్త్రాస్త్రములను వర్షించు చున్న భౌముని మీదికి జక్రాయుధమును విసరి దైతేయ చక్ర సంహారి వానిని రెండుగ జేసెను. నరకుడు కూలగా భూదేవి యదతి యిచ్చిన కుండలములు గొని జగన్నాధు సన్నిధికి వచ్ఛి యిట్లనియె.
భూమికృత కృష్ణ స్తుతి
ధరణి:
యదాహముద్ధృతా నాథ త్వయా శూకర మూర్తినా
తత్సంస్పర్మభవః పుత్ర స్తద్యాయం మయ్యజాయత
సోయం త్వయైవ దత్తోమే త్వయైవ వినిపాతితః
గృహాణ కుండలే చేమే పాలయాస్య చ సంతతిమ్
భారావతరణార్థాయ మమైవ భగవానామమ్
అంశేన లోక మాయాతః ప్రసాదసుముఖ ప్రభో
త్వం కర్తా చ వికర్తా చ సంహర్తా ప్రభవోవ్యయః
జగత్ప్వరూపో యశ్చ త్వ స్తూయసేచ్యుత కిం మయా
వ్యాపీ వ్యాప్యః క్రియా కర్తా కార్యం చ భగవాన్సదా
సర్వభూతాత్మ భూతాత్మా స్తూయసేచ్యుత కిం మయా
పరమాత్మా త్వమాత్మాచ భూతాత్మా చావ్యయో భవాన్
యదా తదా స్తుతిర్నా స్తి కిమర్థం తే ప్రవర్తతామ్
ప్రసీద సర్వభూతాత్మ న్నరకేన కృతం చయత్
తత్క్షమ్యతా మదోషాయ మత్సుతః స నిపాతితః
ధరణి:
“స్వామి! వరాహ మూర్తివై ననుద్ధరించి నపుడు ఆ నీ స్పర్శ వలన నీ పుత్రుడు పుట్టి నాడు. నీవిచ్చిన వాడు వీడు. నీ చేతిలో కూలి నాడు. ఈ కుండలములను గై కొనుము. ఈ నరకుని సంతానమును రక్షింపుము. నా భారమును దింపుటకు నీవీ లోకమున నంశావతార మెత్తినావు. అనుగ్రహ సుముఖు డవు గమ్ము. నీవు కర్తవు. వికర్తవు. (వేరు చేయు వాడవు) సంహర్తవు. సృష్టి హేతువవు. జగత్ స్వరూపుడవు. నిన్ను నేనెక్కడ స్తుతింప గలను, వ్యాపించు వాడవు, వ్యాపింప బడు వాడవు, చేయు వాడవు, చేయ నగు పని చేయుటయు నీవె, సర్వ భూతములకు నాత్మ స్వరూపుడవు, నేనెక్కడ స్తుతింతును. ఆత్మ (జీవుడు) భూతాత్మ (భూత స్వరూపము) పరమాత్మవు నీవె. నరకుడు చేసిన దానిని దప్పిదము కాకుండ క్షమింపుము. ప్రసన్ను డవు కమ్ము. వీడు నా కుమారుడు. కూల్ప బడినాడు.” అని భూదేవి హరిని స్తుతించెను.
వ్యాసులు:
తథేతి చోక్త్వా ధరణీం భగవాన్భూత భావనః
రత్నాని నరకావాసాజ్జగ్రాహ మునిసత్తమాః
కన్యాపురే స కన్యానాం షోడశాతుల విక్రమః
శతాధికాని దదశే సహస్రాణి ద్విజోత్తమాః
చతుర్దంష్ట్రాన్గజాంశ్చోగ్రా న్షట్సహస్రాణి దృష్టవాన్
కాంభోజానాం తథాశ్వానాం నియుతాన్యేవింశతిమ్
కన్యాస్తాశ్చ తథా నాగాం స్తానశ్వాన్ద్వారకాపురీమ్
ప్రాపయామాస గోవిందః సద్యో నరక కింకరైః
దదృశే వారుణం ఛత్రం తథైవ మణి పర్వతమ్
ఆరోపయామాస హరి ర్గరుడే పతగేశ్వరే
ఆరుహ్య చ స్వయం కృష్ణః సత్యభామాసహాయవాన్
ఆదిత్యాః కుండలే దాతుం జగామ త్రిదశాలయమ్
కృష్ణుడు ధరణితో నట్లేయని నరకునింట నున్న రత్నములను దీసి కొనెను. (రత్నము లనగ మణులే కాదు ఆయా వస్తువులలో కెల్ల నుత్తమ మయిన యెల్ల వస్తువులను) అంతః పురమున పదహారు వేలు పైన నూర్గురు నగు కన్యకలను గూడ గైకొనెను. నాలుగు దంతములు గల యారువేల యేనుగుల నచట జూచెను. కాంభోజ దేశీయము లైన గుఱ్ఱములు ఇరువది యొక్క నియతముల సంఖ్య గలవి వాని యింట నున్నవి. నరకుని కింకరులచే నప్పటి కప్పుడు గోవిందుడు ద్వారకా పురికి దరలింప జేసెను. వారుణ చ్ఛత్రమట గనిపించెను. అట్లే మణి పర్వతమును. హరి దానిని ఖగరాజు గరుడ నెక్కించెను. సత్యభామతో దాను నధిష్ఠించి యదితికి కుండలము లిచ్చుటకు ద్రిదశపురి కేగెను.
Summary of chapter 95 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The sixteen thousand royal daughters rescued from Naraka's captivity become the wives of Kṛṣṇa, who multiplies himself by his Yogamāyā to be simultaneously present with each of them. By this divine act of dharmic protection, Kṛṣṇa restores their dignity. Additionally, six other great queens — Satyabhāmā, Jāmbāvatī, Nāgnajitī, Kālindī, Mitravindhā, and Bhadrā — are enumerated as his principal wives.