శివప్రోక్తమైన జన్మరాహిత్యోపాయము
వ్యాసుడు:
శ్రుత్వైవం సా జగన్మాతా భర్తు ర్వచన మాదితః
హృష్టా బభూవ సుప్రీతా విస్మితా చ తదా ద్విజాః
యే తత్రాస న్మునివరా స్త్రిపురారేః సమీపతః
తీర్థయాత్రా ప్రసంగేన గతా స్తస్మి న్గిరౌ ద్విజాః
తేపి సంపూజ్య తం దేవం శూలపాణిం ప్రణమ్యచ
పప్రచ్ఛుః సంశయం చైవ లోకానాం హితకామ్యయా
వ్యాసుడు:
ఇట్లు పరమేశ్వరుడు చెప్పిన విషయము అంతయు విని జగన్మాత హర్షమును ప్రీతిని ఆశ్చర్యమును పొందెను. ఆ సమయములో శిపుని సమీపమున ఉన్న మునివరులును తీర్థయాత్రా ప్రసంగమున అచటికి వచ్చి చేరి యున్న ద్విజులును శివుని సంపూజించి నమస్కరించి లోకముల హితమును కోరి తమకు గల సంశయమును ప్రశ్నించిరి.
మునులు:
త్రిలోచన నమస్తేస్తు దక్షక్రతువినాశన
పృచ్ఛామ స్త్వాం జగన్నాథ సంశయం హృది సంస్థితమ్
సంసారేస్మిన్మహాఘోరే భైరవే లోమహర్షణే
భ్రమంతి సుచిరం కాలం పురుషాశ్చాల్పమేధసః
యేనోపాయేన ముచ్యంతే జన్మసంసార బంధనాత్
బ్రూహి త చ్ఛ్రోతుమిచ్ఛామః పరం కౌతూహలం హి నః
మునులు:
ఓ త్రిలోచనా! దక్షయజ్ఞ వినాశనా! జగన్నాథా! మా హృదయ మందున్న సంశయమును అడుగు చున్నాము. మహా ఘోరమయి భయంకరమయి గగుర్పాటు కలిగించు ఈ సంసారములో అల్పప్రజ్ఞ కలవారగు మానవులు ఎంతో కాలము జన్మావృత్తి పొందు చున్నారు. వీరు జన్మ సంసారముల బంధము నుండి విడుదల పొందు ఉపాయమును వినగోరు చున్నాము చెప్పుము.
మహేశ్వరుడు:
కర్మపాశ నిబద్ధానాం నరాణాం దుఃఖభాగినామ్
నాన్యోపాయం ప్రపశ్యామి వాసుదేవా త్పరం ద్విజాః
యే పూజయంతి తం దేవం శంఖచక్ర గదాధరమ్
వాఙ్మసః కర్మభిః సమ్య క్తే యాంతి పరమాం గతిమ్
కిం తేషాం జీవితే నేహ పశువచ్ఛేష్టితేన చ
యేషాం న ప్రవణం చిత్తం వాసుదేవే జగన్మయే
మహేశ్వరుడు:
ఓ బ్రాహ్మణులారా! కర్మ పాశములచే బద్ధులయి దుఃఖములను అనుభవించు చున్న మానవులకు వాసుదేవుడు తప్ప వేరు ఉపాయము లేదు. శంఖచక్ర గదా ధరుడగు ఆ దేవుని మనో వాక్కర్మలతో లెస్సగా పూజించు వారు మోక్షమును పొందుదురు. జగద్రూపు డగు వాసుదేవుని వైపునకు మరలి యుండని మనస్సు కలవారు పశువుల వలెనే ఆహార నిద్రాది చేష్టలతో ఈ లోకమున జీవించుట వలన ప్రయోజనము ఏమున్నది?
ఋషులు:
పినాకి న్భగనేత్రఘ్న సర్వలోక నమస్కృత
మాహాత్మ్యం వాసుదేవస్య శ్రోతుమిచ్ఛామ శంకర
ఋషులు:
ఓ పినాక ధారీ! భగుడను ఆదిత్యుని నేత్రము పోగొట్టిన వాడవు సర్వ లోకముల నమస్కృతు లనందుకొను వాడవు అగు శంకరా! వాసుదేవుని మాహాత్మ్యమును వినగోరు చున్నాము.
మహేశ్వరుడు:
పితామహా దపి వరః శాశ్వతః పురుషో హరిః
కృష్ణో జాంబూనదాభాసో వ్యభ్రే సూర్య ఇ వోదితః
దశబాహు ర్మహాతేజా దేవతారినిషూదనః
శ్రీవత్సాంకో హృషీకేశః సర్వదైవత పూజకః
బ్రహ్మా త స్యోదరభవ స్త స్యాహం చ శిరోభవః
శిరోరుహేభ్యో జ్యోతీంషి రోమభ్యశ్చ సురాసురాః
ఋషయో దేహసంభూతా స్తస్య లోకాశ్చ శాశ్వతాః
పితామహగృహం సాక్షా త్సర్వదేవగృహం చ సః
సోస్యాః పృథివ్యాః కృత్స్నాయాః స్రష్టా త్రిభువనేశ్వరః
సంహర్తా చైవ భూతానాం స్థావరస్య చరస్య చ
స హి దేవదేవః సాక్షా ద్దేవనాథః పరంతపః
సర్వజ్ఞః సర్వసంస్రష్టా సర్వగః సర్వతోముఖః
న తస్మా త్పరమం భూతం త్రిషు లోకేషు కించన
సనాతనో మహాభాగో గోవింద ఇతి విశ్రుతః
స సర్వా న్పార్థివా న్సంఖ్యే ఘాతయిష్యతి మానదః
సురకార్యార్థముత్పన్నో మానుష్యం వపురాస్థితః
న హి దేవగణాః శక్తా స్త్రివిక్రమ వినాకృతాః
భువనే దేవకార్యాణి కర్తుం నాయకవర్జితాః
నాయకః సర్వభూతానాం సర్వభూత నమస్కృతః
ఏతస్య దేవనాథస్య కార్యస్య చ పరస్య చ
బ్రహ్మభూతస్య సతతం బ్రహ్మర్షి శరణస్య చ
బ్రహ్మావపతి నాభిస్థః శరీరేహం చ సంస్థితః
సర్వాః సుఖం సంస్థితాశ్చ శరీరే తస్య దేవతాః
స దేవః పుండరీకాక్షః శ్రీగర్భః శ్రీసహోషితః
శార్జ్ఞ చక్రాయుధః ఖడ్గీ సర్వనాగరిపుధ్వజః
ఉత్తమేన సుశీలేన శౌచేన చ దమేన చ
పరాక్రమేణ వీర్యేణ వపుషా దర్శనేన చ
ఆరోహణ ప్రమాణేన వీర్యేణార్జవ సంపదా
అనృశంస్యేన రూపేణ బలేన చ సమన్వితః
అస్త్రైః సముదితః సర్వైర్దివ్యైరద్బుతదర్శనైః
యోగమాయా పహస్రాక్షో విరూపాక్షో మహామనాః
వాచా మిత్ర జనశ్లాఘీ జ్ఞాతి బంధుజనప్రియః
క్షమావాం శ్చా నహంవాదీ స దేవో బ్రహ్మదాయకః
భయహర్తా భయార్తానాం మిత్రానంద వివర్ధనః
శరణ్యం సర్వభూతానాం దీనానాం పాలనే రతః
శ్రుతవానథ సంపన్నః సర్వభూత నమస్కృతః
సమాశ్రితానా ముపకృ చ్ఛత్రూణాం భయకృత్తథా
నీతిజ్ఞో నీతిసంపన్నో బ్రహ్మవాదీ జితేంద్రియః
మహేశ్వరుడు:
బ్రహ్మ కంటెను మేలగు వాడు శాశ్వతు డగు పురుషుడు హరి. అతడే కృష్ణుడు. మేఘములు లేని ఆకాశమున ఉదయించిన సూర్యుని వలె బంగారు కాంతితో ప్రకాశించు వాడు. పది బాహువులు మహా తేజస్సు కలిగి రాక్షస సంహారి యయి శ్రీవత్సమను మచ్చతో కూడి విషయేంద్రియ ములకు అధిపతియై సర్వ దేవతా సమూహమునకు ప్రభువగు వాడు. అతని ఉదరము నుండి బ్రహ్మ శిరస్సు నుండి నేను జన్మంచితిమి. శిరోజముల నుండి జ్యోతిస్సులు రోమముల నుండి దేవ దానవులు దేహము నుండి ఋషులు శాశ్వతము లగు లోకములు జనించినవి. అతడు సాక్షాత్ బ్రహ్మకును సర్వలోకముల కును గృహము. ఈ పృథివిని అంతటిని సృష్టించువాడు, త్రిలోకములకు ఈశ్వరుడు, రక్షకుడు. చరాచర భూతముల సంహరించు వాడు. తానే దేవతలకును దేవుడు, రక్షకుడు. పరుల తపింప జేయువాడు. సర్వజ్ఞుడు సర్వము సృష్టించు వాడు అంతట ఉండు వాడు. అన్ని వైపులకు ముఖములు కలవాడు. మూడు లోకము లందును అతని కంటె మేలగు తత్త్వము ఏదియు లేదు. సనాతనుడు, ఎల్లప్పుడు ఉండు వాడు. మహాభాగుడు గోవిందుడు సర్వధర్మ రక్షకుడు అని ప్రసిద్ధి కలవాడు. మహా మానవంతు డగు ఆ వాసుదేవుడు దేవ కార్యార్థమై మానవ దేహము ధరించి యుద్ధమున రాజుల నందఱను సంహరించును. ఈ త్రివిక్రముడు లేనిదే ఈ లోకమున దేవతలును తమ కార్యములను నెరవేర్చు కొనజాలరు. అతడు సర్వ భూతముల నమస్కారముల నందుకొను సర్వభూత నాయకుడు. ఆతనికి నాయకులు ఎవరును లేరు. దేవతలకు రక్షకుడు కార్య జగద్రూపుడు పరబ్రహ్మ తత్త్వరూపుడు బ్రహ్మర్షులను శరణ్యుడు అగు అతని నాభియందు బ్రహ్మ శరీరము నందు నేను అందఱు దేవతలును సుఖముగా ఉన్నాము. ఆ దేవుడు పద్మ నేత్రుడు. లక్ష్మి తన గర్భ మందున్న వాడు లక్ష్మితో కూడి యుండు వాడు శార్జ్గము చక్రము ఖడ్గము గరుడ ధ్వజము కలిగి ఉత్తమ మగు సుశీలము శౌచము బహిరింద్రియ నిగ్రహము పరాక్రమము వీర్యము దేహ సౌందర్యము చక్కని ఆకృతి ఎత్తు సరి ఋజు స్వభావ సంపద సౌమ్యత రూపము బలము కలవాడు. ఆశ్చర్య కరమగు రూపములు కల సర్వ దివ్యాస్త్రములు కలవాడు. యోగ మాయచే వేయి కన్నులు విరూపము లగు కన్నులు కలవాడు. ఉన్నత మనస్సు కలవాడు. వాక్కుతో తన మిత్ర జనుల మెచ్చువాడు. జ్ఞాతులకును బంధు జనులకును ప్రియుడు. క్షమా గుణము కలవాడు. అహంకారము లేనివాడు. బ్రహ్మత్వమును ఇచ్చువాడు. భయముచే భాధ నొందువారి భయమును పోగొట్టు వాడు. మిత్రుల ఆనందమును వృద్ధి చేయువాడు. సర్వ భూతములకు శరణ్యుడు. దీనుల పాలించుట యందు ఆసక్తుడు. వేద శాస్త్రముల అధ్యయనము యోగ్యత కలవాడు. ఆశ్రితులకు రక్షకుడు. శత్రు భయంకరుడు. నీతి తత్త్వమును ఎఱిగి ఆచరించు వాడు. వేద వేదాంగ తత్త్వము ప్రవచించు వాడు. ఇంద్రియముల జయించిన వాడు.
భవార్థమేవ దేవానాం బుద్ధ్యా పరమయా యుతః
ప్రాజాపత్యే శుభేమార్గే మానవే ధర్మసంస్కృతే
సముత్పత్స్యతి గోవిందో మనో ర్వంశే మహాత్మనః
అంశో నామ మనోః పుత్రో హ్యంతర్ధామా తతః పరమ్
అంతర్ధామ్నో హవిర్ధామా ప్రజాపతి రవిందితః
ప్రాచీనబర్హి ర్భవితా హవిర్ధామ్నః సుతో ద్విజాః
తస్య ప్రచేతఃప్రముఖా భవిష్యంతి దశాత్మజాః
ప్రాచేతసస్తథా దక్షో భవితేహ ప్రజాపతిః
దాక్షాయణ్య స్తథాదిత్యో మను రాదిత్యత స్తతః
మనోశ్చ వంశజ ఇలా సుద్యుమ్న శ్చ భవిష్యతి
బుధాత్ఫురూరవాశ్చాపి తస్మా దాయు ర్భవిష్యతి
నహుషో భవితా తస్మా ద్యయాతి స్తస్య చాత్మజః
యదు స్తస్మా న్మహాసత్త్వః క్రోష్టా తాస్మా ద్భవిష్యతి
క్రోష్టు శ్చైవ మహాన్పుత్రో వృజినీవా న్భవిష్యతి
వృజినీవకశ్చ భవితా ఉషద్గు రపరాజితః
ఉషద్గోర్భవితా పుత్రః శూరశ్చిత్రరథ స్తథా
తస్య త్వవరజః పుత్రః శూరో నామ భవిష్యతి
తేషాం విఖ్యాత వీర్యాణాం చారిత్ర గుణశాలినామ్
యజ్వినాం చ విశుద్ధానాం వంశే బ్రాహ్మణ సత్తమాః
స శూరః క్షత్త్రియశ్రేష్ఠో మహావీర్యో మహాయశాః
స్వవంశవిస్తారకరం జనయిష్యతి మానదమ్
వసుదేవమితి ఖ్యాతం పుత్ర మానక దుందుభిమ్
తస్య పుత్ర శ్చతుర్బాహు ర్వాసుదేవో భవిష్యతి
దాతా బ్రాహ్మణ సత్కర్తా బ్రహ్మభూతో ద్విజప్రియః
రాజ్ఞో బద్ధా న్స సర్వన్వై మోక్షయిష్యతి యాదవః
జరాసంధం తు రాజానాం నిర్జిత్య గిరిగహ్వరే
సర్వపార్థివ రత్నాఢ్యో భవిష్యతి స వీర్యవాన్
పృథివ్యా మ ప్రతిహతో వీర్యేణాపి భవిష్యతి
విక్రమేణ చ సంపన్నః సర్వపార్థివ పార్థివః శూరః
సంహననో భూతో ద్వారకాయాం వస స్స్రభుః
పాలయిష్యతి గాం దేవీం వి నిర్జిత్య సురాసురాన్
తం భవంతః సమాసాద్య బ్రాహ్మణై రర్హణై ర్వరైః
అర్చయంతు యథాన్యాయం బ్రహ్మాణమివశాశ్వతమ్
యో హిం మాం ద్రష్టుమిచ్ఛేత బ్రహ్మాణం చ పితామహమ్
ద్రష్టవ్యస్తేన భగవా న్వాసుదేవః ప్రతాపవాన్
దృష్టే తస్మిన్నహం దృష్టో న మేత్రాస్తి విచారణా
పితామహో వాసుదేవ ఇతి విత్త తపోధనాః
స యస్య పుండరీకాక్షః ప్రీతియుక్తో భవిష్యతి
తస్య దేవగణః ప్రీతో బ్రహ్మపూర్వో భవిష్యతి
య స్తుతం మానవో లోకే సంశ్రయిష్యతి కేశవమ్
తస్యకీర్తి ర్యశ శ్చైవ స్వర్గ శ్చైవ భవిష్యతి
ధర్మాణాం దేశికః సాక్షా ద్భవిష్యతి స ధర్మవాన్
ధర్మవిద్భిః స దేవేశో నమస్కార్యః సదాచ్యుతః
ధర్మ ఏవ సదా హి స్యా దస్మి న్నభ్యర్చితే విభౌ
దేవతల మేలు కొఱకే ఆ వాసుదేవుడు ఉత్తమ బుద్ధి శాలియై ధర్మముచే సంస్కరింప బడినను ప్రజాపతి యొక్క శుభ మార్గమున మహాత్ముడగు మనువు వంశమున జన్మించును. మనువునకు అంశుడు అతనికి అంతర్ధాముడు అతనికి పూజ్యుడగు హవిర్ధాముడను ప్రజాపతి అతనికి ప్రాచీన బర్హి జనింతురు. అతనికి ప్రచేతసుడు మొదలగు పదిమంది కుమారులు పుట్టుదురు. వారిలో ప్రచేతసుని కుమారుడగు దక్షుడు ప్రజాపతి యగును. దక్షుని పుత్త్రికలు దాక్షాయణులను నక్షత్రములు. ఆదిత్యుని కుమారుడు వైవస్వత మనువు. ఈ వైవస్వత మను వంశమున ఇల అను నామెయు సుద్యుమ్నుడును జన్మింతురు. ఇలా కుమారుడు బుధుడు. ఆతనికి పురూరవసుడు ఆతనికి ఆయువు అతనికి నహుషుడు అతనికి యయాతి అతనికి యదువు అతనికి మహా బలశాలి యగు క్రోష్ట అతనికి వృజినీకాన్ అతనికి పరాజయమునే ఎఱుగని వీరుడగు ఉషంగుడు అతనికి శూరుడగ్గు చిత్రరథుడు అతనికి కడసారి కుమారుడుగా శూరుడను వాడు కలుగును. ప్రసిద్ధ మగు వీర్యము కలిగి సత్ప్రవర్తనము సద్గుణములు కలిగి యజ్ఞముల నాచరించిన పవిత్రుల వంశమున జన్మించిన క్షత్రియ శ్రేష్ఠుడు మహా వీర్యము మహా యశస్సు కల ఆ శూరుడను నతడు తన వంశమును విస్తరింప జేయువాడును అభిమాన శాలియు వసుదేవుడని ప్రసిద్ధి పొందిన వాడును అగు ఆనక దుందుభిని కుమారునిగా పొందును. అతనికి కుమారుడు చతుర్బాహుడగు వాసుదేవుడు. యదు వంశ సంజాతుడగు అతడు దాత బ్రాహ్మణుల నాదరించు వాడు బ్రాహ్మణులకు ప్రీతిపాత్రుడు బ్రాహ్మణుల యందు ప్రీతి కలవాడు. గిరివజ్రము నందలి మగధ రాజగు జరాసంధుని అతడు జయించి అతనిచే బద్ధులై యున్న రాజులను అందఱను విడిపించును. పృథివి యందే తన కెదుఱు లేని వీర్య వంతుడగు ఆ వాసుదేవుడు శ్రీకృష్ణుడు సమస్త రాజశ్రేష్ఠులచే ఆశ్రయింప బడును. సమస్త రాజులకు రాజై విక్రమము కలిగి శూరునకు ఉండ దగిన దృడ దేహ నిర్మాణము కలిగి ఆ ప్రభువు ద్వారక యందు వసించుచు చెడు మనస్సు కలవారగు శత్రువుల జయించి భూదేవిని పాలించును. మీరు అతనిని ఆశ్రయించి బ్రాహ్మణులకు చేయ దగిన మేలైన పూజలతో శాశ్వతు డగు పర బ్రహ్మమును వలె శాస్త్ర న్యాయాను సారము అర్చింతురు. లోక పితా మహుడగు బ్రహ్మను నన్నును దర్శింప గోరువారు ప్రతాప వంతుడును భగవానుడు నగు వాసుదేవుని దర్శింప వలెను. అతనిని దర్శించుట నన్ను దర్శంచుటయే. అందు సందేహము లేదు. బ్రహ్మయు వాసుదేవుడే అని ఓ తపోధనులారా! తెలిసి కొనుడు. పుండరీకాక్షు డగు వాసుదేవ కృష్ణునకు ఎవరిపై ప్రీతి కలుగునో వారి విషయమున బ్రహ్మది దేవత లందఱు ప్రీతు లగుదురు. శ్రీకృష్ణుని ఆశ్రయించిన మానవునకు కీర్తియు స్వర్గమును లభించును. ధార్మికుడు అగు వాసుదేవుడే ఇతరులకు సర్వధర్మ ములను పదేశించు వాడగును. ధర్మము ఎఱిగిన వారెల్లరును దేవతలకు ప్రభువు అచ్యుతుడు తన్నాశ్రయించిన వారిని అధోగతికి పోనీయని వాడు అగు వాసుదేవుని నమస్కరింప వలెను. విభుడగు ఆ శ్రీకష్ణుని ఆసక్తితో అర్చించి నచో ధర్మమే లభించును.
స హి దేవో మహాతేజాః ప్రజాహితచికీర్షయా
ధర్మార్థం పురుషవ్యఘ్ర ఋషకోటీః ససర్జ చ
తాః సృష్టా స్తేన విధినా పర్వతే గంధమాదనే
సనత్కుమారప్రముఖా స్తిష్ఠంతి తపసా న్వితాః
తస్మా త్స వాగ్మీ ధర్మజ్ఞో నమస్యో ద్విజపుంగవాః
వందితో హి స వందేత మానితో మానయీత చ
దృష్టః పశ్యేదహరహః సంశ్రితః ప్రతిసంశ్రయేత్
అర్చిత శ్చార్చయే న్నిత్యం స దేవో ద్విజసత్తమాః
ఏవం తస్యా నవద్యస్య విష్ణోర్వై పరమం తపః
ఆదిదేవస్య మహతః సజ్జనాచరితం సదా
భువనేభ్యర్చితో నిత్యం దేవై రపి సనాతనః
అభయే నానురూపేణ ప్రపద్య త మనువ్రతాః
కర్మణా మనసా వాచా స నమస్యో ద్విజైః సదా
యత్నవద్భి రుపాస్థాయ ద్రష్టవ్యో దేవకీ సుతః
ఏష వై విహితో మార్గో మయా వై మునిసత్తమాః
తం దృష్ట్వా సర్వదేవేశం దృష్టాః స్యుః సురసత్తమాః
మహావరాహం తం దేవం సర్వలోకపితామహమ్
ఆహం చైవ నమస్యామి నిత్య మేవ జగత్పతిమ్
తత్ర చ త్రితయం దృష్టం భవిష్యతి న సంశయః
సమస్తా హి వయం దేవా స్తస్య దేహే వసామహే
తస్యైవ చాగ్రజో భ్రాతా సితాద్రినిచయ ప్రభః
హలీ బల ఇతి ఖ్యాతో భవిష్యతి ధరాధరః
త్రిశిరా స్తస్య దేవస్య దృష్టోనంత ఇతి ప్రభోః
సువర్ణో యస్య వీర్యేణ కశ్యప స్యాత్మజో బలీ
అంతం నైవాశకద్ద్రష్టుం దేవస్య పరమాత్మనః
స చ శేషో విచరతే పరమయా వై ముదా యుతః
అంత ర్వసతి భోగేన పరిరభ్య వసుంధరామ్
య ఏష విష్ణుః సోనంతో భగవా న్వసుధాధరః
యో రామః స హృషీకే శోయుతః సర్వధరాధరః
తా వుభౌ పురుషవ్యాఘ్రౌ దివ్యౌ దివ్యపరాక్రమౌ
ద్రష్టవ్యౌ మాననీయౌ చ చక్రలాంగలధారిణౌ
ఏష వోనుగ్రహఃప్రోక్తో మయా పుణ్య స్తపోధనాః
తద్భవంతో యదుశ్రేష్ఠం పూజయేయుః ప్రయత్నతః
మహా తేజస్సు కలవాడును పురుష శ్రేష్ఠుడును అగు ఆ వాసుదేవుడు ప్రజల హితమును కోరి ధర్మమును ఉద్ధరించుటకై ఋషులను సృష్టించెను. సనత్కుమారుడు మొదలగు ఆ ఋషులు తపో వంతులై గంధమాదన పర్వతమున నున్నారు. అందు వలన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ధర్మజ్ఞుడును ధర్మ ప్రవచన సామర్ద్యము కలవాడును అగు ఆ వాసుదేవుని నమస్కరించి నచో అతడును వారిని నమస్కరించును. అట్లే తన్నా దరించిన వారిని తానాదరించును. తన్ను దర్శించిన వారిని తాను దర్శించును. తన్నా శ్రయించిన వారిని తానాశ్రయించును. తన్నర్చించిన వారిని తానర్చించును. ఇట్లు మానవ లోకమున సజ్జనులు దోష రహితుడు సద్గుణ శాలి ఆది దేవుడు పూజ్యుడు నగు విష్ణుని విషయమున తప మాచరింతురు. సనాతనుడు శాశ్వతుడు అగు ఆ దేవుని దేవతలును అర్చింతురు. తమకు తగిన అభయముతో శరణా గతితో ఆయనను అనుష్ఠించుచు ద్విజులు మొదలగు వారు త్రికరణము లతో నమస్కరించుచు యత్న పూర్వకముగా దర్శనము చేసికొన వలెను. ఓ ముని శ్రేష్ఠులారా! నేను వ్యవస్థ చేసిన మార్గము ఇది. సర్వ దేవులకు ఈశు డగు ఆ వాసుదేవుని దర్శించినచో సర్వదేవ శ్రేష్ఠులను దర్శించి నట్లే. మహా వరాహ రూపుడు సర్వలోక సృష్టికర్త జగములకు రక్షకుడు అగు ఆ వాసుదేవుని నేనును నిత్యము నమస్కరించు చుందును. నేను మొదలుగా సమస్త దేవతలును ఆయన దేహమున వసింతుము. కనుక ఆయన దర్శనముచే త్రిమూర్తుల దర్శనము జరుగును. ఆ వాసుదేవుని అన్న వెండి కొండల కాంతి వంటి కాంతి కలిగి హలి హలము ధరించిన వాడు బలుడు అని ప్రసిద్ధుడై భూమిని రక్షించును. అతడు సహస్ర శిరస్కుడగు శేషుడే. దేవుడును ప్రభువును పరమాత్మ రూపుడు నగు అతని అంతమును కశ్యపుని కుమారుడును బలశాలయు నగు గరుడుడును తన వీర్యముతో చూడజాలక పోవుటచే అతడు అనంతుడు అన బడెను. ఆ శేషుడే సంతోషముతో కూడి భూమ్యంత ర్భాగమున భూమిని చుట్టుకొని తన పడగలతో భూమిని ధరించుచు చరించుచు వసించు చున్నాడు. ఆ విష్ణువే ఈ యనంతుడు. అట్లే సర్వ ధరాధరు డగు హృషీకేశు డగు వాసుదేవ కృష్ణుడే ఈ బలరాముడు. ఈ పురుష శ్రేష్ఠు లిరువురును దివ్యులు దివ్య పరాక్రమము కలవారు. చక్రమును నాగలిని ధరించిన ఈ ఇరువురను మీరు నర్చించి పూజించ వలెను. ఓ తపోధను లారా! మీకు నేను తెలుపు చున్న అనుగ్రహము ఇదియే. కనుక మీరు ప్రయత్న పూర్వకముగా ఆ యదు శ్రేష్ఠుని పూజించ వలెను.
Summary of chapter 119 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The supreme spiritual attainment of sincere devotees of Bhagavān Viṣṇu is described: liberation (mokṣa) in the form of eternal residence in Vaikuṇṭha, beyond the reach of birth, death, and dissolution. Śiva teaches that the glory of Viṣṇu is beyond his own complete comprehension, such is its infinitude. The devotee who approaches Viṣṇu with single-pointed bhakti transcends all bindings of karma and attains the supreme goal.