బ్రహ్మ మహా పురాణము
43 – అవంతీ వర్ణనమ్ (అవంతి = ఉజ్జయిని)
బ్రహ్మ:
పురాకృతయుగే విప్రా శ్శక్రతుల్య పరాక్రమః
బభూవ నృపతి శ్రీమా నింద్రద్యుమ్న ఇతి శ్రుతః
సత్యవాదీ శుచి ర్దక్ష స్సర్వశాస్త్రవిశారదః
రూపవా న్సుభగ శ్శూరో దాతా భోక్తా ప్రియంవదః
యష్టా సమస్త యజ్ఞానాం బ్రహ్మణ్య స్సత్యసంగరః
ధనుర్వేదేచ శాస్త్రేచ నిపుణఃకృతీ
వల్లభో నరనారీణాం పౌర్ణ్యమాస్యాం యథా శశీ
అదిత్య ఇవ దుష్ర్పేక్ష్యః శత్రుసంఘ భయంకరః
వైష్ణవ స్సత్త్వ సంపన్నో జితక్రోధో జితేంద్రియః
అధ్యేతా యోగసాంఖ్యానాం ముముక్షుర్ధర్మతత్పరః
ఏవం స పాలయ న్పృథ్వీం రాజా సర్వగుణాకరః
తస్య బుద్ధిః సముత్పన్నా హరేరారాధనం ప్రతిః
బ్రహ్మ:
విప్రులారా! మున్ను గృత యుగము నందు “ఇద్రద్యమ్నుడు” అను రాజుండెను. అతడింద్ర తుల్య పరాక్రముడు. సత్యవాది శుచి సమర్థుడు సర్వశాస్త్ర విశారదుడు. రూప వంతుడు నుభగుడు శూరుడు దాత భోక్త ప్రియభాషి. యజ్వ బ్రహ్మజ్ఞాని సత్య ప్రతిజ్ఞుడు ధనుర్వేద మందు వేద మందు శాస్త్రము నందు నిపుణుడు స్త్రీ పురుషులకు పున్నమ చందురు నట్లానంద కరుడు. ప్రతాపమున సూర్యుడట్లు తేరిపార జూడ నలవికాని వాడు. శత్రు కూటమునకు భయంకరుడు విష్ణు భక్తుడు. సత్త్వశాలి, జిత క్రోథుడు జితేంద్రియుడు. యోగ శాస్త్ర సాంఖ్య (జ్ఞాన) శాస్త్రముల నధ్యయనము సేసిన వాడు, మోక్షేచ్ఛ గలవాడు, ధర్మ నిష్ఠుడు. ఇట్లు సర్వ లక్షణ నిధియైన యారాజు భూమిని పాలించు చుండ నతనికి హరి నారాధింప వలెనను నిశ్చయము గల్గినది.
కథమారాధయిష్యామి దేవదేవం జనార్ధనమ్
కస్మిన్ నేత్రేథవా తీర్ధే నదీతీర్థే తథాశ్రమే
ఏవం చింతాపరః సోథ నిరీక్ష్యమనసా మహీమ్
ఆలోక్య సర్వతేర్థాని క్షేత్రాణ్యథ పురాణ్యపి
తాని సర్వాణి సంత్యజ్య జగా మాయతనం పునః
విఖ్యాతం పరమం క్షేత్రం ముక్తిదమ్ పురుషోత్తమమ్
సగత్వా తత్క్షేత్రవరం సమృద్ధ బలవాహనః
ఆయజచ్చాశ్వమేధేన విధి వద్భూరిదక్షిణః
కారయిత్వా మహోత్సేధం ప్రాసాదం చైవ విశ్రుతమ్
తత్ర సంకర్షణం కృష్ణం సుభద్రాం స్థాప్య వీర్యవాన్
పంచతీర్థం చ విధివత్కృత్వా తత్ర మహీపతిః
స్నానం దానం తపో హోమం దేవతాప్రేక్షణం తథా
భక్త్యా చారాధ్య విధివత్ర్పత్యహం పురుషోత్తమమ్
ప్రసాదా ద్దేవ దేవస్య తతోమోక్ష మవాప్తవాన్
మార్కండేయం చకృష్ణం చ దృష్ట్వా రామం చ భోద్విజాః
సాగరే చేంద్రద్యుమ్నాఖ్యే స్నాత్వా మోక్షం లభే ద్ధ్రువమ్
దేవేశ్వరు జనార్ధను నెట్లా రాధింప గలను! ఏ క్షేత్రము తీర్థము నదీ తీరము ఆశ్రమము నిందుల కనువయి నది! అని తలచి పృథివి నెల్ల మనసుచే పరికించి అన్ని తీర్థ క్షేత్రపుర సముదాయము నెల్ల వదలి పురుషోత్తమ క్షేత్రమం దాలయమున కేగెను. అతనిని బలము (సేన) వాహనములు వెంబడించి నవి. అక్కడ భూరి దక్షిణ లొసంగి యథావిధిగ అశ్వ మేధము సేసెను. స్వామికి మహోన్నత ప్రాసాదము గట్టించి అందు సంకర్షణుని (బల రాముని) కృష్ణుని సుభద్రను ప్రతిష్ఠించి పంచతీర్థము లేర్పరచి స్నానదాన తపో హోమాదు లాచరించి దేవతా దర్శనము చేసి భక్తితో ప్రతి దినము హరి నారాధించి యా స్వామి యను గ్రహముచే మోక్షముల బొందెను. మార్కండేయుని కృష్ణుని బలరామునిం దర్శించి యింద్రద్యుమ్న సాగరమున స్నానము సేసి మోక్షమును దప్పక మానవుడు పొందును.
మునులు:
కస్మా త్స నృపతిః పూర్వ మింద్రద్యుమ్నో జగత్పతిః
జగామ పరమం క్షేత్రం ముక్తిదమ్ పురుషోత్తమమ్
గత్వా తత్ర సురశ్రేష్ఠ కథం స నృపసత్తమః
వాజిమేధేన విధివదిష్టవా న్పురుషోత్తమమ్
కథంస సర్వఫలదే క్షేత్రే పరమ దుర్లభే
ప్రాసాదం కారయామాస చేష్టం త్రైలోక్య విశ్రుతమ్
కథం స కృష్ణం రామం చ సుభద్రాంచ ప్రజాపతే
నిర్మమే రాజశార్దులః క్షేత్రం రక్షితవాన్ కథమ్
కథం తత్ర మహీపాలః ప్రాసాదే భువనోత్తమే
స్థాపయామాస మతిమాన్ కృష్ణా దీం స్త్రిదశార్చితాన్
ఏతత్సర్వం సురశ్రేష్ట విస్తరేణ యథాతథమ్
వక్తుమర్హ స్యశేషేణ చరితం తస్య ధీమతః
న తృప్తి మధిగచ్ఛామస్తవ వాక్యామృతేన వై
శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మ స్పరం కౌతూహలం హినః
మునులు:
ఇంద్రద్యుమ్న ప్రభువు మున్నా ముక్తి క్షేత్రమున కెందులకు వెళ్ళెను. వెళ్ళి యా స్వామిని అశ్వమేధము సేసి యెట్లా రాధించెను? త్రిలోక ప్రఖ్యాతమైన యా లయము నక్కడ యెట్లు నిర్మించెను? సుభద్రా బలరామ కృష్ణుల మూర్తులనెట్లు నిర్మించెను? ఆ క్షేత్ర రక్షణమెట్లు సేసెను? ఆలయ మందు కృష్ణాదుల ప్రతిష్ఠ యెట్లు జరిగెను? ఇదంతయు జరిగినది జరిగినట్లు విపులముగ నానతిమ్ము నీవాగమృత మానిన కొలది మాకింకను నది గ్రోలవలయు నని పించు చున్నది. విన వలెనని మిక్కిలి కుతూహల మగుచున్నది.
బ్రహ్మ:
సాధుసాధుద్విజశ్రేష్ఠా యత్పృచ్ఛధ్వం పురాతనమ్
సర్వపాపహరంపుణ్యం భుక్తిముక్తి ప్రదమ్ శుభమ్
వక్ష్యామి తస్య చరితం యథావృత్తం కృతేయుగే
శ్రుణుధ్వం మునిశార్దూలాః ప్రయతాః సంయతేద్రియాః
బ్రహ్మ:
ఇట్లు మునులడుగ బ్రహ్మ బాగు బాగు! పురాతన కథ నడిగితిరి. ఇది సర్వ పాపహరము. భుక్తి ముక్తిదము. శుభకరము. కృతయుగ మందు జరిగిన చరిత్ర యిదె చెప్పు చున్నాను. శ్రద్ధగా నింద్రియముల నదుపున నుంచి కొని వినుండు.
అవంతీ నామ నగరీ మాలవే భువి విశ్రుతా
బభూవ తస్య నృపతేః పృథివీకకుదోపమా
మాలవ దేశము నందు అవంతి యను నగర మున్నది. అది భూ మండలమను ఋషభమునకు మూపురమా యన్నట్లు తలమనిక మైయుండెను.
హృష్టపుష్ట జనాకీర్ణా దృఢప్రాకార తోరణా
దృఢ యన్త్రార్గల ద్వారా పరిఖాభి రలంకృతా
నానావణిక్సమాకీర్ణా నానాభాండసువిక్రియా
రథ్యాపణవతీ రమ్యా సువిభక్త చతుష్పథా
గృహ గోపురసంబాధా వీథీభిః సమలంకృతా
రాజహంస నిభైః శుభ్రై శ్చిత్రగ్రీవై ర్మనోహరైః
అనేక శతసాహస్రైః ప్రాసాదైః సమలంకృతా
యజ్ఞోత్సవ ప్రముదితా గీతవాదిత్ర నిస్వనా
నానావర్ణ పతాకాభి ర్ధ్వజైశ్చ సమలంకృతా
హస్త్యశ్వ రథసంకీర్ణా పదాతి గణ సంకులా
నానాయోథ సమాకీర్ణా నానాజన వరైర్యుతా
బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యై శ్శూద్రైశ్చైవ ద్విజాతిభిః
సమృద్ధా సా మునిశ్రేష్ఠా విద్వద్భిః సమలంకృతా
న తత్రమలినాః సంతి న మూర్ఖా నాపి నిర్ధనాః
న రోగిణో నహీనాంగా నద్యూత వ్యసనాన్వితాః
సదా హృష్టాః సుమనసో దృశ్యంతే పురుషాః స్త్రియః
క్రీడంతిస్మ దివారాత్రౌ హృష్టాస్తత్ర పృథక్పృథక్
సువేషాః పురుషాస్తత్ర దృశ్యంతే మృష్టకుండలా
సురూపాః సుగుణాశ్చైవ దివ్యాలంకార భూషితాః
కామదేవ ప్రతీకాశాః సర్వలక్షణ లక్షితాః
సుకేశాః సుకపోలాశ్చ సుముఖాః శ్మశ్రుధారిణః
జ్ఞాతారః సర్వశాస్త్రాణాం భేత్తారః శత్రువాహినీమ్
దాతారః సర్వరత్నానాం భోక్తారః సర్వసంపదామ్
స్త్రియం స్తత్ర మునిశ్రేష్ఠా దృశ్యంతే సుమనోహరాః
హంసవారణగామిన్యః ప్రఫుల్లాంభోజ లోచనాః
సుమధ్యమాః సు జఘనాః పీనోన్నత పయోధరాః
సుకేశా శ్చారువదనాః సుకపోలాః స్థిరాలకాః
హావభావానత గ్రీవాః కర్ణాభరణ భూషితాః
బింబోష్ఠ్యా రంజితాముఖా స్తాంబూలేన విరాజితాః
సువర్ణాభరణోపేతాః సర్వాలంకార భూషితాః
శ్యామావదాతాః సుశ్రోణ్యః కాంచీనూపుర నాదితాః
దివ్యమాల్యాంబరధరా దివ్య గంధానులేపనాః
విదగ్ధాః సుభగాః కాంతా శ్చార్వంగ్యః ప్రియదర్శనాః
రూపలావణ్య సంయుక్తాః సర్వాః ప్రహసితానాః
క్రీడంత్యశ్చ మదోన్మత్తాః సభాసు చత్వరేషు చ
గీతవాద్య కథాలాపైః రయంత్యశ్చ తాః స్త్రియః
వారముఖ్యాశ్చ దృశ్యంతే నృత్యంగీత విశారదాః
ప్రేక్షణాలాప కుశలాః సర్వయోషి ద్గుణాన్వితాః
అన్యాశ్చ తత్ర దృశ్యంతే గుణాచార్యాః కులస్త్రియః
పతివ్రతాశ్చ సుభగా గుణైః సర్వైరలంకృతాః
వనైశ్చోపవనైః పుణ్యై రుద్యానైశ్చ మనోరమైః
దేవతాయతనై ర్దివ్యై ర్నానాకుసుమవోభితైః
శాలైస్తాలై స్తమాలైశ్చ వకుళైర్నాగకేసరైః
పిప్పలైః కర్ణికారైశ్చ చందనాగరు చంపకైః
పున్నాళైగైర్నారికేళైశ్చ పనసై స్సరలద్రుమైః
నారంగైర్ల కుచైర్లోధ్రైః సప్తపర్ణై శ్శుభాంజనైః
చూతబిల్వ కదంబైశ్చ శింశుపై ర్ధవఖాదిరైః
పాటలాశోకతగరైః కరవీరైః సితేతరైః
పీతార్జునకభల్లాతైః సిద్దై రామ్రాతకైస్తథా
న్య గ్రోధాశ్వత్థకాశ్మర్యైః పలాశై ర్దేవదారుభిః
మందారైః పారిజాతై శ్చ తింతిడీకవిభీతకైః
ప్రాచీన మాలకైః ప్లక్షై ర్జంబూ శిరీష పాదపైః
కాలేయైః కాంచనారైశ్చ మధుజంబీర తిందుకైః
ఖర్జూరాగ స్త్యవకులైః శాఖోటకహరీతకై
కంకోలై ర్ముచుకుందైశ్చ హింతాలై ర్భీజపూరకైః
కేతకీవనఖండై శ్చ అతిముక్తై స్సకుబ్జకైః
మల్లికా కుంద బాణైశ్చ కదలీ షండమండితైః
మాతులుంగైః పూగఫలై కరుణై సింధువారకైః
బహువారైః కోవిదారై ర్బదరై స్సకరంజుకైః
అన్యైశ్చ వివిధైః పుష్పవృక్షై శ్చాన్యై ర్మనోహరైః
లతా గుల్మై ర్వితానైశ్చ ఉద్యానై ర్నందనోపమైః
సదా కుసుమగంధాఢ్యై స్సదా ఫలభరానతైః
నానాపక్షిరుతైః రమ్యైః ర్నానా మృగగణావృతైః
చకోరై శ్శతపత్రైశ్చ భృంగారైః ప్రియపుత్రకైః
కలవింకై ర్మయూరైశ్చ శుకైః కోకిలకై స్తథా
కపోతైః ఖంజరీటైశ్చ శ్యైనైః పారానతై స్తథా
ఖగైశ్చాన్యై ర్బహువిధై శ్శ్రోత్రరమ్యై ర్మనోరమైః
సరితః పుష్కరిణ్యశ్చ సరాంసి సుబహూని చ
అన్యైర్జలాశ యైః పుణ్యై కుముదోత్పలమండితైః
పద్మై స్సితేతరై శ్శుభ్రై కహ్హారై శ్చ సుగంధిభిః
అన్యైర్భహువిధైః పుష్పైర్జలజై స్సుమనోహరైః
గంధామోదకరై ర్దివ్యై స్సర్వర్తు కుజుమోజ్వలైః
హంసకారండవాకీర్ణై శ్చక్రవాకోపశోభితైః
సారసైశ్చ బలాకైశ్చ కూర్మైర్మత్త్స్యై స్సనక్రకైః
జలపాదైః కదంబైశ్చ ప్లవైశ్చ జలకుక్కుటైః
ఖగైర్జలచరైశ్చాన్యై ర్నానారవ విభూషితైః
నానావర్ణై స్సదా హృష్టైరంచితాని సమంతతః
ఏవం నానావిధైః పుష్పైర్వివిధైశ్చ జలాశ యైః
వివిధైః పాదపైః పుణ్యై రుద్యానై ర్వివిధైస్తథా
జలస్థలచరైశ్చైవ విహగై శ్చార్వధిష్ఠితైః
(ఇట 25 శ్లోకము నుండి 64వ శ్లోకముదాక నగర వర్ణనము. క్రిందటి యధ్యాయము విరజ క్షేత్ర వర్ణన సందర్భమున నిట్లే వర్ణన మున్నది. కావుని నిక్కడ సది పునరుక్తముగ తాత్పర్యము వ్రాయలేదు.)
దేవతాయతనై ర్దివ్యై శ్శోభితా సా మహాపురీ
తత్రాస్తే భగవా న్దేన స్త్రిపురారి స్త్రిలోచనః
మహాకల ఇతి ఖ్యాత స్సర్వకామప్రద శ్శివః
శివకుండే నరః స్నాత్వా విధివత్పాపనాశనే
దేవాన్పితౄ నృషీంశ్చైవ సంతర్ప్య విధివ ద్భుధః
గత్వా శివాలయం పశ్చాత్కృత్వా తంత్రిః ప్రదక్షిణమ్
ప్రవిశ్య సంయతోభూత్వా ధౌతవాసా జితేంద్రియః
స్నానైః పుష్పైస్తథా గంధై ర్థూపైర్దీపైశ్చ భక్తితః
నైవేద్యైరుపహారైశ్చ గీతవాద్యైః ప్రదక్షిణైః
దండవత్ర్పణి పాతైశ్చ నృత్యై స్త్సోత్రైశ్చ శంకరమ్
సంపూజ్య విధివద్భక్త్యా మహాకాలం సకృచ్ఛివమ్
అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః
పాపై స్సర్వై ర్వినిర్ముక్తో విమానై స్సర్వకామికైః
ఆరుహ్య త్రిదివం యాతి యత్ర శంభోర్నికేతనమ్
దివ్యరూపధర శ్రీమాన్దివ్యాలంకార భూషితః
భుంక్తే తత్ర వరాన్భోగాన్ యావదా భూత సంప్లవమ్
శివలోకే మునిశ్రేష్ఠా జరామరణ వర్జితః
పుణ్యక్షయాదిహాయాతః ప్రవరే బ్రాహ్మణే కులే
చతుర్వేదీ భ వే ద్విప్ర స్సర్వ శాస్త్ర విశారదః
యోగం పాశుపతం ప్రాప్య తతోమోక్ష మవాప్నుయాత్
ఆస్తే తత్ర నదీ పుణ్యా శిప్రానామేతి విశ్రుతా
తస్యాం స్నాతస్తు విధివత్సంతర్ప్య పితృదేవతాః
సర్వపాప వినిర్ముక్తో విమానవర మాస్తితః
భుంక్తే బహువిధాన్భోగా స్వ్సర్గలోకే నరోత్తమః
ఆస్తే తత్రైవ భగవా న్దేవదేవో జనార్దనః
గోవిందస్వామి నామాసౌ భుక్తి ముక్తిప్రదో హరిః
తం దృష్ట్వా ముక్తి మాప్నోతి త్రిసప్తకుల సంయుతః
విమానే నార్క వర్ణేన కింకిణీ జాలమాలినా
సర్వకామ సమృద్దేన కామగేనాస్థితేనచ
ఉపగీయమానో గంధర్వై ర్విష్ణులోకే మహీయతే
భుంక్తేచ వివిధాన్కామా న్నిరాతంకో గతజ్వరః
ఆభూతసంప్లవం యావత్సురూప స్సుభగ స్సుఖీ
కాలేనాగత్య మతిమా ద్ర్బాహ్మణ స్స్యాస్మహితలే
ప్రవరే యోగినాం గేహే వేదశాస్త్రార్థ తత్త్వవిత్
వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షవాప్నుయాత్
విక్రమస్వామి నామానం విష్ణుం తత్రైవ భోద్విజాః
దృష్ట్వా నరో వానారీవా ఫలం పూర్వోదితం లభేత్
అన్యేపి తత్రతిష్ఠంతి దేవా శ్శక్ర పురోగమాః
మాతరశ్చ మునిశ్రేష్ఠా స్సర్వకామఫలప్రదాః
దృష్ట్వా తాన్విధివద్భక్త్యా సంపూజ్య ప్రణిపత్యచ
సర్వపాప వినిర్ముక్తో నరోయాతి త్రివిష్టపమ్
ఏవం సా నగరీ రమ్యా రాజసింహేన పాలితా
నిత్యోత్సవప్రముదితా యథేంద్రస్యామరావతీ
పురాష్ఠాదశ సంయుక్తా సువిస్తీర్ణ చతుష్పథా
దనుర్జ్యా ఘోష నినదా సిద్ద సంగమ భూషితా
విద్యావద్గుణ భూయిష్ఠా వేద నిర్ఘోషనాదితా
ఇతిహాస పురాణాని శాస్త్రాణి వివిధాని చ
కావ్యాలాప కథాశ్చైవ శ్రూయంతేహర్నిశం ద్విజాః
ఏవం మయా గుణాఢ్యా సో జ్జయినీ సముదాహృతా
యస్యాం రాజాభవత్పూర్వ మింద్రద్యుమ్నో మహామతిః
అక్కడి త్రిపుర వైరి (శివుడు) ’మహాకాలుడు’ అనుపేర వెలసి యున్నాడు. ఆయన సర్వాభీష్ట ప్రదాత. అటు పాప హరమైన శివ కుండమున స్నానము సేసి దేవర్షి పితృ తర్పణాదులు సేసి శివా లాయము కేగి ప్రదక్షిణము సేసి ధ్యానా వాహనాద్యు పచారముల స్వామి నర్చించిన నరుడు అశ్వమేధ యాగ ఫలము నందును. దివ్య విమానములో శివ లోకమున కేగును. అట దివ్య రూపాంబరా భరణాదులతో గూడి మహా భోగముల ననుభవించి యిక్కడికి వచ్చి బ్రాహ్మణుడై జనించి నాల్గు వేదములు సర్వ శాస్త్రములు నేర్చి పాశుపత యోగముల బొంది ముక్తి నందును. అక్కడ శిప్రాయను నది గలదు. అట స్నాన తర్పణాదులు సేసిన యతడు విమానమున స్వర్గ మేగును. అక్కడనే విష్ణువు గోవింద స్వామి యనుపేర నున్నాడు. ఆయనను సేవించిన నిరువది యొక్క తరములు తరించును. ఈ మున్ను జెప్పిన ఫలము లన్నియు నట గల్గును. తిరిగి యీ లోకమునకు వచ్చి వైష్ణవ యోగమున ముక్తి నందును. అక్కడనే విక్రమ స్వామియను పేరనున్న విష్ణువు నారాధించిన మగవాడు గాని యాడుది గాని మున్ను జెప్పిన ఫల మందుదురు. అక్కడ నింద్రాది దేవతలు మాతృకలు గలరు. వారును కోరిన కోర్కె లిత్తురు. వారిని సేవించిన స్వర్గము లభించును. అవంతి యను నా నగరమును రాజ సింహుడను రాజు పాలించెను. అందులో పదునెన్మిది పురములు (మహాపుర భాగములు) కలవు. అవి సువిస్తీర్ణ రాజ మార్గములు. విధ్యా వంతులట నందఱును. వేద ఘోషచే నది ప్రతిధ్వనించు చుండును. అట ఇతిహాస శాస్త్ర పురాణాది ప్రసంగములు నిత్యము వినబడును. దీనికి మునువు పరిపాలకుడు ఇంద్రద్యుమ్నుడు.
Summary of chapter 43 of the Brahma Mahā Purana is as follows:
Indradyumna seeks to understand the history of the Puruṣottama kṣetra and how the Lord came to reside there. Sages and divine messengers narrate the ancient events — how Viṣṇu originally chose this coastal site, how certain cosmic events led to the establishment of the divine presence, and why this kṣetra is worshipped by all beings including Devas, Siddhas, and Pitṛs.