లోమహర్షణుడు:
అయోః పుత్రాశ్చతే పంచ సర్వే వీరా మహారథాః
స్వర్భాను తనయాయాంచ ప్రభాయాం జఙ్ఞిరే నృపాః
సహుషః ప్రథమం జఙ్ఞే వృద్దశర్మా తతః పరమ్
రంబో రజి రనేనాశ్చ త్రిషు లోకేషు విళ్రుతాః
రజిః పత్ర శతానీహ జనయామాస పంచవై
రాజేయమితి విఖ్యాతం క్షత్ర మింద్రభయావహమ్
యత్ర దేవాసురే యుద్దే సముత్పన్నే సుదారుణే
దేవా శ్త్చేవాసురా శ్త్చేవ పితామహ మధాబ్రువన్
ఆవయో ర్భగవ న్యుద్ధే కో విజేత భవిష్యతి
బ్రూహి నః సర్వభూతేశ! శ్రోతు మిచ్ఛామ తత్త్యతః
లోమహర్షణుడు:
ఆయుఫు పుత్రులు మహరధు లయిదుగురు స్వర్భానుని (రాహువు) కుమార్తె ప్రభ యను నామె యందు జన్మించిరి. వారు సహుషుడు, పృద్ధశర్మ, రంభుడు, రజి, అనేనుడు అనువారు త్రిలోక ప్రసిద్దులు. రజి యైదు వందల మంది కుమారులం గనెను. ఈ క్షత్ర కుటుంబము రాజేయమని ప్రసిద్ది కెక్కినది. ఇంద్రునికి గూడ ఇది భయంకర మయ్యెను. దేవాసుర యుద్దమైన తఱి నయ్యు భయులును మా యిర్వురకును జరుగు యుద్ద మందెవ్వరు జయింతురో వినవలతుము నిజ మేఱిగింపు మని బ్రహ్మ నడిగిరి.
బ్రహ:
యోషా మర్ధాయ సంగ్రామే రజి రాత్తాయుథః ప్రభుః
యోత్స్యతే తే విజేష్యంతేతాన్ లోకాన్నాత్ర సంశయః
యతో రజి ర్దృతి స్తత్ర శ్రీశ్చ తత్ర యతో ధృతిః
యతోధృతిశ్చ శ్రీశ్చైవ ధర్మస్తత్ర జయస్తధా
బ్రహ్మ:
రజియను ప్రభు నాయుధ మెత్తి యెవ్వరి వంక పోరాడునో వారు ముల్లోక ములం గెలువ గలరు. రజి యెటుండునో యటనే ధైర్యము ఉండును. ధృతి యెటుండనో యట లక్ష్మి యుండును . థృతియు శ్రీయు నెందుండునో నక్కడ ధర్మము జయమును గల్గును.
తే దేవా దానవాః ప్రీతా దేవే నోక్తా రజిం తదా
అభ్యయు ర్జయ మిచ్ఛంతో వృణ్యానా స్తం నరర్షభమ్
సహి న్వర్భానుదౌహిత్రః ప్రభాయాం సమపద్యత
రాజా పరమతేజస్వీ సోమంశవి వర్థనః
తే హృష్టమనసః సర్వే రజిం వై దేవదానవాః
ఊచు రన్మజ్జయాయ త్వం గృహాణ వరకార్ముకమ్
అథోవాచ రజి స్తత్ర తయోర్వై దేవదైత్యయోః
అర్థజ్ఞః స్వార్ధ ముద్దిశ్య యశః స్వంచ ప్రకాశయన్
దేవదానవు లది వివి ప్రీతులై రజిని దమవంక రమ్మని వరించిరి. స్వర్బానుని దౌహిత్రుడు (రాహువు యొక్క కూతురు కొడుకు) ప్రభ యందు పుట్టిన వాడు, పరమ తేజస్వి, సోమ వంశ వర్ధనుడు నగు రజింగని వారు మాకు జయము కల్గుట కీవు విల్లు గైకొను మని వేడి కొనిరి. అతడు విని అర్ధజ్ఞుడు గావున స్వార్ధమెంచి తన కిర్తిం బ్రకాశింప జేయుచు నిట్లనియె.
రజి:
యది దైత్యగణా న్సర్వా న్జిత్వా వీర్యేణ వానవః
ఇంద్రో భవామి ధర్మేణ తతో యోత్స్యామి సంయుగే
దేవాః ప్రథమతో విప్రాః ప్రతీయ ర్హృష్టమానసాః
ఏవం యధేష్టం నృపతే కామః సంపద్యతాం తవ
శ్రుత్వా సురగణానాంతు వాక్యం రాజా రజిస్తదా
పప్ర చ్ఛాసురముఖ్యాంస్తు యథా దేవా నపృచ్ఛత
దానవాదర్పసంపూర్ణాః స్వార్థ మేవావగమ్యహ
ప్రత్యూచు స్తం నృపవరం సాభిమాన మిదం వచః
రజి:
దైత్వ గుణముల నెల్ల గెలిచి ధర్మమున సేవింద్రుడ నగుదునేని యప్పుడు యుద్ధమున బోరెదను. అని రజి యనగా వేల్పులు మొదట సంతోష పడిరి. అట్లే నీ కోరిక సఫలము సేసి కొమ్మనిరి. అవ్వల నసుర ముఖ్యుల జూచి దేవతల నడిగి నట్లడిగెను. దానవులు దర్ప సంపూర్ణులు గావున స్వార్ధముసే చూచికొని సాభిమానముగ నతని కిట్లు బదులు పలికిరి.
దానవులు:
అస్మాక మింద్రః ప్రహ్లాదో యస్యార్థే విజయామహే
అస్మింస్తు సమరే రాజం స్తిష్ఠ త్వం రాజసత్తమ
రాక్షసులు:
మా కింద్రుడు ప్రహ్లాదుడు. ఆయన కొరకే మేము గెలుపు పడయ నెంతుము. రాజా! నీవీ సమరమున నిలువు మనిరి.
స తధేతి బ్రువన్నేప దేవై ర ప్యతిచోదితః
భవిష్య సీంద్రో జిత్వైనం దేవైరుక్తస్తు పార్ధివః
జఘాన దానవా స్సర్వా న్యేవధ్యా వజ్రపాణినః
స విప్రనష్టాం దేవానాం పరమశ్రీః శ్రియం వశీ
నిహత్య దానవ స్సర్వా నాజహార రజిః ప్రభుః
తతో రజిం మహా వీర్యం దేవైః సహ శతక్రతుః
రజిపుత్రోహవిత్యుక్త్వా పునరేవాబ్రవీ ద్వచః
ఇంద్రోసి తాత దేవానాం సర్వేషాం నాత్ర సంశయః
యస్యాహమింద్రః పుత్రస్తే ఖ్యాతిం యాస్యామి కర్మభిః
సతు శత్రువచః శ్రుత్వా వంచిత స్తేవ మాయమా
త థై వే త్యబ్రవీద్రాజా ప్రీయమాణః శతక్రతుమ్
తస్మింస్తు దేవైః సదృశే దివం ప్రాప్తే మహీపతౌ
దాయాద్యమింద్రా దాజహ్రూ రాజ్యం తత్తనయా రజెః
పంచపుత్రశతా న్యస్య తద్వై స్థానం శతక్రతోః
నమాక్రామంత బహుధ స్వర్గలోకం త్రివిష్టపమ్
తే యదాతు స్వసంముఢా రాగోన్మత్తా విధర్మిణః
బ్రహ్మద్విషశ్చ సంవృత్తా హతవీర్యపరాక్రమాః
తతో లేభే స్వమైశ్వర్య మింద్రః స్థానం తధోత్తమమ్
హత్వా రజిసుతా న్సర్వా న్కామ క్రోధపరాయణాన్
య ఇదం చ్యావనం స్థానా త్ర్పతిష్ఠానం శతక్రతోః
శృణుయా ద్ధారయేద్వాపి న స దౌర్గత్య మాప్నుయాత్
అతడట్లే యని దేవతల చేత గూడ వీనిని (ప్రహ్లాదుని) గెలిచి యింద్రుడవై తీరెదవని ప్రేరేపింప బడి దానవు లందఱ సంహరించెను. వజ్రపాణికి గూడ వధింప నలవి గాని వారింగూడ తుద ముట్టించి పరమ శ్రీమంతుడైన రజి మున్ను నష్టమై పోయిన వేల్పుల ఐశ్వర్యమును పునః ప్రతిష్ఠ చేసెను. అప్పుడింద్రుడ మరులతో గూడి మహాధీరు డయిన రజింజూచి నిక్కముగ నీవు దేవేంద్రుడవ నావనులచే నేను నీకు పుత్రుడనను ప్రఖ్యాతి గాంచెద ననెను. రజి యునట్లు మాయచే శత్రువుచే మోసగింప బడి యట్లే యగుగాక యసంప్రీతి నెంచెను. అట్లా నృపతి దేవ సముడై దివమ్ము నకరుగ, నాతని పుత్రులైదు వందల మంది యాతని ఆస్తిని (పిత్రార్జితమును ఇంద్రు నుండి గైకొనిరి, అట్లు స్వర్గ మాక్రమించి వారు రాగ మత్తుతై దమకు దాము మూఢులై ధర్మ దూరులై బ్రహ్మ ద్వేషులై వీర విక్రమముల గోల్పోయిరి). అందుపై కామక్రోథ వశులైన వారింజంపి ఇంద్రు డెప్పటి యట్ల స్వస్థానమును బొంది స్వస్థు డయ్యెను ఈ శత ముఖుని స్థాన భ్రంశమును పునః ప్రతిష్ఠానమును విన్న వాడును ధారణ జేసిన యతడును దుర్గతి పాలుగాడు.
లోమహర్షణుడు:
రంభోనపత్య స్త్వాసీడ్ వంశం పక్ష్యా మ్యనేనసః
అనేననః సుతో రాజా ప్రతిక్షత్రో మహాయశాః
ప్రతిక్షత్రసుతశ్చాసీ త్సంజయో నామ విశ్రుతః
సంజయస్య జయః పుత్రో విజయ స్తస్యచాత్మజః
విజయస్య కృతిః పుత్ర స్తస్య హర్యత్వతః సుతః
హర్యత్వతసుతో రాజా సహదేవః ప్రతాపవాన్
సహదేవస్య ధర్మాత్మా నదీన ఇతి విశ్రుతః
నదీనస్య జయత్సేనో జయత్సేనస్య సంకృతిః
సంకృతేరపి ధర్మాత్మా క్షత్రవృద్ధో మహాయశాః
ఆనేనసః సమాఖ్యాతాః, క్షత్రవృద్ధస్య చాపరః
క్షత్రవృద్థాత్మజ స్తత్ర సునహోత్రో మహాయశాః
సునహోత్రస్య దాయాదా స్త్రయః పరమధార్మికాః
కాశః శలశ్చ ద్వావేతౌ తధా గృత్సమదః ప్రభుః
పుత్రో గృత్యమదస్యాపి శునకో యస్య శౌనకః
బ్రాహ్మణాః క్షత్రియాశ్చైవ వైశ్యాః శూద్రాస్తధైవచ
శలాత్మజ ఆర్ష్టిసేన స్తనయ స్తస్య కాశ్యపః
కాశస్య కాశిపో రాజా పుత్రో దీర్ఘతపా స్తదా
ధనుస్తు దీర్ఘతపసో విద్వా స్ధన్వంతరి స్తతః
తపసోంతే సుమహతో జాతో వృద్ధస్య ధీమతః
పున ర్ధన్వంతరి ర్దేవో మానుషేష్విహ జన్మని
తస్య గేహే సముత్పన్నో దేవో ధన్వంతరి స్తదా
కాశిరాజో మహారాజః సర్వరోగ ప్రణాశనః
ఆయుర్వేదం భరద్వాజా త్ర్పాష్యేహ న భిషక్క్రియః
త మష్టధా పునర్వ్యస్య శిష్యేభ్యః ప్రత్యపాదయత్
లోమహర్షణుడు:
రంభునకు సంతానము లేదు. ఇక యనేననుని వంశము వర్ణించెద. అనేననుని కుమారుడు యశస్వియైన ప్రతిక్షత్రుడు అను రాజు. వాని తనయుడు సంజయుడు. వాని బిడ్డడు జయుడు. వాని వాడు విజయుడు. వాని తనయుడు కృతి. వాని సుతుడు హర్యత్వతుడు. వాని యాత్మజుడు సహదేవుడు. మంచి ప్రతాపశాలి. వాని కొడుకు ధర్మశీలి యగు నదీనుడు. జయత్సేనుడు వాని కుమారుడు. వాని యౌరసుడు సంకృతి. వాని బిడ్డడు ధర్మ పరుడైన క్షత్రవృద్ధుడు కీర్తిశాలి. అనేననులు చెప్పబడిరి. క్షత్రవృద్ధుని వంశము చెప్పెదను. క్షత్రవృద్ధుని తనయుడు సునహోత్రుడు. యశస్వి వాని సంతానము, పరమ ధార్మికులు కాశుడు, శలుడు గృత్సమదుడు ననువారు. గృత్సమదుని కుమారుడు శునకుడు. వాని కొడుకు కొడుకు శౌనకుడు వాని వలన బ్రహ్మణ, క్షత్రియులు, వైశ్య శూద్రులు కలిగిరి. అర్ష్టిసేనుడు శలుని కుమారుడు. వాని తనయుడు కాశుడు. కాశుని కొడుకులు కాశిపుడు దీర్ఘతవుడు. ధనవు దీర్ఘతవుని కుమారుడు. విద్వాంసుడు, వాని తనయుడు ధన్వంతరి. ఆయన మహత్తర తప మ్మొనరించి వృద్ధుడయిన దశలో ధనువునకు గల్గినాడు. దేవతాంశమున మున్ను దయించిన ధన్వంతరియే యిపుడు మానవాంశమున జన్మించెను. కాశీ మహారాజై భరద్వాజుని వలన నాయుర్వేదమును జదివి వైద్యము సేసి సర్వరోగ హరుడై యా శాస్త్రము నెనిమిది భాగములు గావించి, (అష్టాంగ మొనరించి) శిష్యుల కుప దేశించెను.
ధన్వంతరేస్తు తనయః కేతుమా నితి విశ్రుతః
అధ కేతుమతః పుత్రో వీరో భీమరథః న్మతః
పుత్రో భీమరధస్యాపి దివోదాసః ప్రజేశ్వరః
దివోదాసస్తు ధర్మాత్మా వారాణ స్యధిపోభవత్
ఏతస్మిన్నేవ కాలేతు పురీం వారాణసీం ద్విజాః
శూన్యాం నివేశయామాన క్షేమకో నామ రాక్షసః
శప్తా హి సా మతిమతా నికుంభేన మహాత్మనా
శూన్యా వర్షసమస్రంవై భవిత్రీ తి న సంశయః
తస్యాం హి శప్తమాత్రాయాం దివోదాపః ప్రజేశ్వరః
విషయాంతే పురీం రమ్యాం గోమత్యాం సంస్యవేశయత్
భద్రశ్రేణ్యస్య పూర్వం తు పురీ వారాణసీ అభూత్
భద్రశ్రేణ్యస్య పుత్రాణాం శత ముత్తమధన్వినామ్
హత్వా నివేశయామాస దివోదాసో నరాధిపః
భద్రశ్రేణ్యస్య తద్రాజ్యం హృతం యేన బలీయసా
ఆ ధన్వంతరి తనయుడు కేతుమంతుడు. భీమరధు డాతని తనయుడు. దివోదాసు డతని తనయుడు. అతడు ధార్మికుడు. కాశి నగరము నేలిన వాడు. ఈతని కాలముననే క్షేమకుడను రాక్షసుడు వారణాసిని శూన్యముం గావించెను. మహాత్ముడైన నికుంభుని శాపముచే వేయేండ్లు కాశీ క్షేత్రమట్లుగా వలసి వచ్చెను. అట్లు శాప నష్టమైన రమ్యమైన నగరమున దివోదాసుడు గోమతీ తీరమందు పునర్ని ర్మించెను. ఇంతకు ముందు వారణాసి భద్ర శ్రేణ్యుని పాలన యందుండెను. దివోదాసుడు వాని కుమారులను నూర్వురను మేటి విలుకాండ్రను జంపి భద్రశ్రేణ్యుని రాజ్యము గెలిచి నూతన నగర నిర్మాణము సేసెను.
భద్రశ్రేణ్యస్య పుత్రస్తు దురమో నామ విశ్రుతః
దివోతాసేన బాలేతి ఘృణయా స విసర్జితః
హైహయస్య తు దాయాద్యం హృతవా న్వై మహీపతిః
ఆజహ్రే పితృదాయాద్యం దివోదానహృతం బలాత్
భద్రశ్రేణ్యస్య పుత్రేణ దుర్దమేన మహాత్మనా
వైరస్యాంతో మహాభాగాః కృతశ్చాత్మీయతేజసా
దివోదాసా ద్దృషద్వత్యాం వీరో జజ్ఞే ప్రతర్దనః
తేన బాలేన పుత్రేణ ప్రహృతం తు పునర్బలమ్
ప్రతర్దనస్య పుత్రౌ ద్వౌ వత్సభర్గౌ సువిశ్రుతౌ
వత్సపుత్రో హ్యలర్కస్తు సంనతి స్తస్య చాత్మజః
అలర్క స్తస్య పుత్రస్తు బ్రహ్మణ్యః సత్య సంగరః
అలర్కం ప్రతి రాజర్షిం శ్లోకో గీతః పురాతనైః
షష్టివర్షసహస్రాణి షష్టివర్షశతాని చ
యువా రూపేణ సంపన్నః ప్రాగాసీచ్చ కులోద్వహః
లోపాముద్రాప్రసాదేన పరమాయ రవాప్తవాన్
తస్యా సీ త్సుమహద్రాజ్యం రూపయౌవనశాలినః
శాపస్యాంతే మహాబాహు ర్హ త్వా క్షేమక రాక్షసమ్
రమ్యాం నివేశయామాస పురీం వారాణసీం పునః
భద్రశ్రేణ్యుని తనముయుడు దుర్దముడు దివోదాసునిచే బాలుడని కరుణచే విడువ బడినవాడై హైహయుని దాయాద్యమును (పరంపరా గతమైన రాజ్య సంపదను) హరించెను. బలాత్కరించి హరించిన సామ్రాజ్యమును మహానుభావుడగు దుర్దముడు లాగి కొనెను తన ప్రతాపముచే వైరమును అంతము చేసెను. దివోదాసునికి దృషద్వతి యందు వీరుడగు ప్రతర్ధను డుదయించెను, బాలుడయ్యు నాతడు పరబలమును హరించెను. వాని తనయులు వత్సుడు, భర్గుడు ననువారు మిక్కిలి కీర్తి శాలురు. వత్సుని కుమారు డలర్కుడు. అలర్కుడు బ్రహ్మజ్ఞాని, సత్య ప్రతిజ్ఞుడు. వానికొడుకు నంనతి. రాజర్షియగు అలర్కుని గూర్చి ప్రాచీనుల శ్లోక మొకటి గలదు. అతడు యరువది యారు వేలేండ్లు కులోద్ధారకుడై లోపాముద్రా నుగ్రహ పాత్రుడయ్యెను. రూప యౌవన సంపన్నుడైన అతనికి సువిశాలమైన సామ్రజ్య ముండెను. శాపాంతమున క్షేమకుడను రాక్షసుని జంపి వారణసీ నగరమును రమ్యముగ పునర్మిర్మాణము గావించెను.
సంనతేరపి దాయాదః సునీథోనామ ధార్మికః
సునీథస్య తు దాయాదః క్షేమో నామ మహాయశాః
క్షేమస్య కేతుమా న్పుత్రః సుకేతు స్తస్య చాత్మజః
సుకేతో స్తనయశ్చాపి ధర్మకేతురితి స్మృతః
ధర్మకేతోన్తు దాయాదః సత్యకేతు ర్మహారథః
సత్యకేతు సుతశ్చాపి విభు ర్నామ ప్రజేశ్వరః
ఆనర్తస్తు విభోః పుత్రః సుకుమారశ్చ తత్సుతః
సుకుమారస్య పుత్రస్తు ధృష్టకేతుః సుధార్మికః
ధృష్టకేతేస్తు దాయాదో వేణుహోత్రః ప్రజేశ్వరః
వేణుహోత్రసుతశ్చాపి భార్గో నామ ప్రజేశ్వరః
వత్సస్య వత్సభూమిస్తు భార్గభూమిస్తు భార్గజః
ఏతే త్వంగిరసః పుత్రా జాతా వంశేథ భార్గవే
బ్రాహ్మణాః క్షత్రియో వైశ్యాస్త్రయః పుత్రాః సహస్రశః
ఇత్యేతే కాశ్యపాః ప్రోక్తా నహుషస్య నిబోధత
సంనతి కొడుకు సునీధుడు. వాని నుండి క్షేముడు, వానికి కేతుమంతుడు. వానికి సుకేతువు, వానికి ధర్మకేతువు వానికి మహారధుడగు సత్యకేవువు, వానికి విభువు. వానికి అనర్తుడు, వానికి సుకుమారుడు, వానికి ధృష్టకేతువు, వానికి వేణుహోత్రుడు, వానికి భార్గుడు ననుపుత్ర పరంపర యేర్పడెను. వత్సునికి వత్సభూమి యనువాడు భార్గునకు భార్గభూమి యను వారు పుత్రులు. నీరందరును అంగిరసుని పుత్రులు భార్గవ వంశము వారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేల కొలది జన్మించిరి. ఇది కాశ్యప వంశము ఇక సహూషుని పరంపర వినుండు.
Summary of chapter 11 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The descendants of Yayāti's five sons — Yadu, Turvasu, Druhyu, Anu, and Pūru — are systematically narrated. Each son founds a distinct royal line: Yadu becomes the ancestor of the Yādava clan from which Śrī Kṛṣṇa is eventually born; Pūru's line leads to the Pāṇḍavas and Kauravas. The chapter traces these dynasties through many generations, affirming the sacred continuity of dharmic kingship.