బ్రహ్మ మహా పురాణము
190 - కేశివధ నిరూపణమ్
వ్యాసులు:
కకుద్మిని హతేరిష్టే ధేనుకేచ నిపాతితే
ప్రలంబే నిధనం నీతే ధృతే గోవర్ధనాచలే
దమితే కాలియే నాగే భగ్నే తుంగద్రుమద్వయే
హతాయాం పూతనాయాం చ శకటే పరివర్తితే
కంసాయనారదః ప్రాహ యథావృత్తమనుక్రమాత్
యశోదాదేవకీ గర్భపరివర్తాద్య శేషతః
శ్రుత్వా తత్సకలం కంసో నారదాద్దేవదర్శనాత్
ననుదేవంప్రతి తదా కోపం చక్రేస దుర్మతిః
సోతికోపా దుపాలభ్య సర్వయాదవసంసది
జగర్హే యాదవాంశ్చాపి కార్యం చైతదచింతయత్
యావ న్న బలమారూఢౌ బలకృష్ణౌ సుబాలకౌ
తావదేవ మయా వధ్యా వసాధ్యౌ రూఢయౌవనౌ
చాణూరోత్ర మహావీర్యో ముష్టికశ్చ మహాబలః
ఏతాభ్యాం మల్ల యుధ్దేతౌ ఘాత యిష్ట్యామి దుర్మదౌ
ధనుర్మహమహాయాగవ్యాజేనానీయ తౌవ్రాజత్
తథా తథా కరిష్యామియాస్యతః సంక్షయం యథా
ఇత్యాలోచ్య స దుష్టాత్మా కంసోరామజనార్ధనౌ
హంతుం కృతమతి ర్వీరమక్రూరం వాక్యమబ్రవీత్
వ్యాసులు:
అరిష్ట ధేనుకాది రాక్షసులు హతులుగాగా గోవర్ధ నోద్దరణము జరుగ నారదుండు సని కంసునకు యశోదా గర్భము మార్పు మొదలైన విశేషముల శేషము నివేదించెను. విని కంసుడు వసు దేవునిపై పగ బట్టెను. యాదవ సభలో యాదవులను దుయ్య బట్టి తనలో నిట్లా లోచించెను. బాలురైన బలరామ కృష్ణులను బలవంతులు కాకుండనే నేను వధింప వలయును. యౌవన మొందిన తరువాత వారసాధ్యు లయ్యెదరు. ఇక్కడ చాణూరుడు ముష్టికుడును. మంచి బలశాలురు. వీరితో నా బాలురకు మల్ల యుద్దము పెట్టి యా దుర్మదులను జంపెద గాక! ధనుర్యాగమను మిష పెట్టి వ్రేపల్లె నుండి వారల రావించి వారు గడ తేఱుట కెట్లెట్లు సేయ వలెనో యట్లు సేసెద. అని తలచి యా దుష్టు డొక నిశ్చయము నకువచ్చి అక్రూరునితో నిట్లనియె.
కంసుడు:
భోభో దానపతే వాక్యం క్రియతాం ప్రీతయేమమ
ఇతః స్యందన మారుహ్య గమ్యతాం నందగోకులమ్
వసుదేవసుతౌ తత్ర విష్ణోరంశసముద్భవౌ
నాశాయకిల సంభూతౌ మమ దుష్టౌ ప్రవర్థతః
ధనుర్మహమహాయాగశ్చతుర్దశ్యాం భవిష్యతి
అనేయౌ భవతా తౌతుమల్ల యుద్ధాయ తత్రవై
చాణూరముష్టికౌ మల్లౌ నియుద్దకుశలౌ మమ
తాభ్యాం సహానయోర్యుద్ధం సర్వలోకోత్ర పశ్యతు
నాగః కువలయాపీడో మహామాత్ర ప్రచోదితః
సతౌ నిహంస్యతే పాపౌ వసుదేవాత్మాజౌ శిశూ
తౌ హత్వా వసుదేవంచ నందగోవం చ దుర్మతిమ్
హనిప్యేపితరం చైవ ఉగ్రసేనం చ దుర్మతిమ్
తతః సమస్తగోపానాం గోధనా న్యఖిలాన్యహమ్
విత్తం చాపహరిష్యామి దుష్టానాం మద్వధైషిణామ్
త్వామృతే యాదవాశ్చేమే దుష్టా దానపతే మమ
ఏతేషాం చ వధాయాహం ప్రయతిష్యామ్యనుక్రమాత్
తతోనిష్కంటకం సర్వం రాజ్యమేత దయాదవమ్
ప్రసాధిష్యే త్వయా తస్మాన్మత్ర్పీత్యై వీరగమ్యతామ్
యథా చ మాహిషం సర్పి ర్దధి చాప్యుపహార్యవై
గోపాః సమానయంత్వాశు త్వయా వాచ్యాస్తథా తథా
కంసుడు:
ఓ దానవేశ! నా ప్రీతి కొఱకు నీవిట నుండి రథమెక్కి గోకుల మేగుము. హరి యంశమున బుట్టిన వసుదేవుని కొడుకులను గొనిరమ్ము. వారలు నా చావునకు బుట్టి పెరుగు చున్నారు. ఈ చతుర్ధశి నాడు ధనురుత్సవమను మహా యాగము జరుగ గలదు. అందువల్ల యుద్ధమునకై యేర్పాటు జరుగును. నా కడ చాణూర ముష్టికు లను మల్లురు యుద్ధ కుశలురు. వారలతో నీ బలరామ కృష్ణులకు జరుగు యుద్దమును సర్వ లోకము జూచు గాక! కువలయాపీడ మను నేనుగు మావటీండ్ర కెల్ల మేటి యైన వానిచే దోలబడి యా యిద్దఱు శిశువులను మట్టుపెట్ట గలదు. వారిం జంపి వసుదేవుని నందునిం గూల్చి నా తండ్రి దుష్టుడగు నుగ్రసేనునిం జంపెదను. అటుపై గోపాలుర గో ధనములను గొల్ల గొట్టెదను. వారు నాకు శత్రువులు. నీవు దప్ప యీ యాదవు లందురు పరమ దుష్టులు. నాకు గిట్టరు. ఈ యందఱను గూడ జంపుటకు క్రమముగ నీతో నేను యత్నించెద. ఆ గొల్లలు గేదినెయ్యి పెరుగును కాన్కగ గొని నీ వెంబడిన వచ్చునట్లు నీవట్లట్ల నచ్చె జెప్పుము.
వ్యాసులు:
ఇత్యాజ్ఞప్తస్తదాక్రూరో మహాభాగవతో ద్విజాః
ప్రీతిమానభవత్కృష్ణం శ్వో ద్రక్ష్యామీతి సత్వరః
తథేత్యుక్త్వా తు రాజానం రథమారుహ్యసత్వరః
నిశ్చక్రామ తదాపుర్యా మధురాయా మధుప్రియః
వ్యాసులు:
అని యిట్లాజ్ఞాపించ బడి మహా భాగవతుడు (భక్తా గ్రేసరుడు) మధు ప్రియుడు (మద్య ప్రియుడు) అగు నక్రూరుడట్లే యని కంస రాజునకు దెల్పి మధురాపురము నుండి బయలు వెడలెను.
వ్యాసులు:
కేశీచాపి బలోదగ్రః కంసతూదః ప్రచోదితః
కృష్ణస్య నిధనాకాంక్షీ వృందావనముపాగమత్
సఖురక్షతభూపృష్ఠః సటాక్షేపధుతాంబుదః
పునర్విక్రాంత చంద్రార్కమార్గో గోపాంత మాగమత్
తస్య హ్రేషితశబ్దేన గోపాలాదైత్య వాజినః
గోప్యశ్చ భయసంవిగ్నా గోవిందం శరణం యయుః
త్రాహి త్రాహీతి గోవంత స్తేషాం శ్రుత్వాతు తద్వచః
సతోయజలదధ్వాన గంభీరమిదముక్తవాన్
వ్యాసులు:
అవ్వల గంసుని వాహనమగు గుఱ్ఱము రూపము గల కేశి యనువాడు కంస ప్రేరితుడై కృష్ణుం జంపనెంచి బృందా వనమునకు వచ్చెను. వాడు కాలి డెక్కలం ధరణీ తలముం జిమ్ముచు జూలు విదలలించి మేఘములు జెదరించుచు చంద్ర సూర్య మార్గము నాక్రమించి గోపకుల దరి కేతెంచెను. వాని సకిలింపును విని గోపాలురు గోపికలు భయమునం బెదరి పోయి గోవిందుని త్రాహిత్రాహి (రక్షింపు రక్షింపుము) అని శరణొందిరి.
గోవింద:
అలం త్రాసేన గోపాలాః కేశినః కిం భయాతురైః
భవద్భిర్గోజాతీయైర్వీర వీర్యం విలోప్యతే
కిమనేనాల్పసారేణ హ్రేషితారోష కారిణా
దైతేయ బలవాహ్యేన వల్గతా దుష్టవాజినా
ఏహ్యేహిదుష్ట! కృష్ణోహం పూష్ణస్త్వి పినాకధృక్
పాతయిష్యామి దశనాం వదనారభిలాంస్తవ
గోవింద:
హరియు నదివిని జలములతో నున్న మేఘము యొక్క గర్జనమట్ల గంభీరముగ నిట్లు పల్కెను. గోపకులార జడియ వలదు. గోప జాతి పరాక్రమము లోప మగును. అల్ప బలము రాక్షస బల భారముచే జిందులు ద్రొక్కుచు సకలించుచు నున్న ఈ పాడు గుఱ్ఱము వలన నేమగును. అని ఓ క్రూర! రా రా నేను గృష్ణుడను. పినాక పాణి(హరుడు) పూషుని (సూర్యుని) యొక్కవలె నీ యెల్ల పండ్లూడ గొట్టెద నని కృష్ణుడు వాని కెదురు నడచె.
వ్యాసులు:
ఇత్యుక్త్వా సతుగోవిందః కేశినః సంముఖం యయౌ
వివృతాస్యశ్చ సోప్యేనం దైతేయశ్చ ఉపాద్రవత్
బాహుమాభోగినం కృత్వా ముఖే తస్య జనార్దనః
ప్రవేశయామాస తదా కేశినో దుష్టవాజినః
కేశినోవదనం తేన విశతా కృష్ణ బాహునా
శాతితా దశనాస్తస్య సితాభ్రావయవా ఇవ
కృష్ణస్య వవృధే బాహుః కేశిదేహకృతోద్విజాః
వినాశాయ యథా వ్యాధిరాప్తభూతైరుపేక్షితః
విపాటితౌష్టో బహులం సఫేనం రుధిరం వమన్
సృక్కణీ వివృతే చక్రే విశ్లష్టే ముక్తబంధనే
జగామ ధరణీం పాదైః శకృన్మూత్రం సముత్సృజన్
స్వేదార్దృగాత్రః శాంతశ్చ నిర్యత్నః సోభవత్తతః
వ్యాదితాస్యోమహారౌద్రః సోసురః కృష్ణ బాహునా
నిపపాత ద్విధాభూతో వైద్యుతేన యథాద్రుమః
ద్విపాదపృష్ఠపుచ్ఛార్థశ్రవణౖకాక్షినాసికే
కేశినస్తే ద్విధా భూతే శకలేచ విరేజతుః
హత్వాతు కేశినం కృష్ణోముదితైర్గోపకైర్వృతః
అనాయస్త తనుః స్వస్థో హసం స్తత్రైవ సంస్థితః
తతోగోపాశ్చ గోప్యశ్చ హతే కేశిని విస్మితాః
తుష్టువుః పుండరీకాక్ష మనురాగమనోరమమ్
అయయౌత్వరితో విప్రోనారదో జలదేస్థితః
కేశినం నిహతం దృష్ట్వా హర్షనిర్భరమానసః
వ్యాసులు:
వాడున్ను నోరుతెఱచి హరిపై కెగబడెను. తన నిండు భుజమును వాని నోటిలో దూర్చెను. దాన వాని పండ్లెల్లం దెలి మేఘవు దునుకు లట్లూడి రాలిపోయె. కృష్ణ బాహువు లోన కేగిన కొలది బంధువు లుపేక్షింప బెఱిగిన వ్యాధి యట్లూరక పెరిగి దవడలు బ్రద్దలయి నురుగులం తోడి రక్తముం గ్రక్కికొని వాడు సెలవులు విచ్చి కీలు కీలూడి వడి పాదములు చాచి విణ్ణూత్రములు విడుచుచు పుడమిపై బడెను. మఱియు ముచ్చెమటలు పోసి చచ్చువడి వాడు చేష్టలు దక్కెను. హరి బాహువుచే నోరు విచ్చిపోవ మహ రౌద్రాకారి యగు వాడు పిడుగు వడిన చెట్టువలె బెండై రెండై కూలెను. రెండు పాదములు పిరుదు తోక రెండుగా నై చెవి కన్ను ముక్కు నొక్కటి వంతుననై మొత్తము శరీరము రెండు ముక్కలై వాడు కూలబడెను. కృష్ణుడిట్లు కేశి సంహరము చేయ సంతోష బడిన గోపకులతో గూడుకొని శరీర మించుకయు నాయాస పడకుండ స్వస్థుడై నవ్వుచు నచ్చటనే యుందెను. గోపికలును గోపకులును గేశి హతు డగుట జూచి వింతబడి యనురాగ మనోహర ముగ బుండరీకాక్షుని గొని యాడిరి. కేశి హతు డగుట చూచి నారదుడంత మేఘముల నుండి వెలువడి వెవేగ వచ్చి మనసానంద భరితము గాగ కృష్ణునిట్లు గొనియాడెను.
నారధుడు:
సాధుసాధు జగన్నాథ! లీలయైన యదచ్యుత
నిహతోయం త్వయా కేశీ క్లేశద స్త్రిదివౌకసామ్
సుకర్మాణ్యవతారే తు కృతాని మధుసూదన
యాని వైవిస్మితం చేత స్తోష మేతేన మే గతమ్
తురగస్యాస్య శక్రోపి కృష్ణ! దేవాశ్చ బిభ్యతి
ధుతకేసరజాలస్య హ్రేషతోభ్రావలోకినః
యస్మాత్త్వయైష దుష్టాత్మా హతః కేశీ జనార్దన
తస్మాత్కేశవనామ్నా త్వం లోకే గేయో భవిష్యసి
స్వస్త్యస్తుతే గమిష్యామి కంసయుధ్దేధునాపునః
పరశ్వోహం సమేష్యామి త్వయా కేశివిషూదన
ఉగ్రసేనసుతే కంసే సానుగే వినిపాతితే
భారావతారకర్తాత్వం ప్రుథివ్యా ధరణీధర
తత్రానేకప్రకారేణ యుద్ధాని పృథివీక్షితామ్
ద్రష్టవ్యాని మయా యుష్మత్ర్పణీతాని జనార్దన
సోహం యాస్యామి గోవింద దేవకార్యం మహత్కృతమ్
త్వయా సభాజితశ్చాహం స్వస్తి తేస్తు వ్రజామ్యహమ్
నారధుడు:
బాగు బాగు జగన్నాథ స్వర్గ వాసులకు బీడ గల్గించు క్రేశిని లీలామాత్రముగ చంపితివి. ఈ యవతారమున నీ చేసిన లీలలు ఆద్భుతములు. దీన నా మనసు అశ్చర్యమును ఆనందమును జెందినది. ఈ హయాసురునకు నింద్రుడు దేవతలును హడలి పోవుదురు. వీడు విదిలించి సకలించుచు నాకసము వంకకు జూచిన వానిం జూచి దేవతలు హడలెత్తి పోవుదురు. కేశివధ సేసి నందున లో కమందీవు కేశవ నామమున గీర్తింప బడుదువు. నీకు మంగళ మగుగాక. వెళ్లు చున్నాను. కంసుని తోడి యుద్దమున నెల్లుండి నిన్ను గలిసి కొందును. ఉగ్రసేనుని కొడుకు కంసుడు సపరివారముగ గూలగనే నీవు పృథివీ భారహర్త వగుదువు. అక్కడ రాజుల తోడి యుద్దము లనేకములు నాకు దర్శనీయము కాగలవు. ఓ జనార్దన గోవింద నేను వెళ్లి వచ్చెదను. దేవ కార్యము చాల గొప్పగ జరుప బడినది. నీచే నేను గారవింప బడితిని. నీకు శుభమగు గాక
వ్యాసులు:
నారదేతు గతే కృష్ణః సహ గోపై రవిస్మితః
వివేశ గోకులం గోపీనేత్రపానై కభాజనమ్
వ్యాసులు:
యని నారదుడేగ కృష్ణుడు గోపకులతో గోపికలు తమ నయనము లచే దన లీలా సౌందర్య పానము చేయు గోకులమున బ్రవేశము చేసెను.
Summary of chapter 83 of the Brahma Mahā Purana is as follows:
Kaṃsa sends the noble Akrūra to Vṛndāvana to invite Kṛṣṇa and Balarāma to Mathurā for a bow-festival, intending to have them killed. Akrūra, a devoted Vaiṣṇava, eagerly accepts this mission as an opportunity to behold Kṛṣṇa. His devotional journey to Gokula, his first darśana of the divine brothers, and the profound inner transformation he undergoes in their presence are described with great tenderness.