బ్రహ్మ మహా పురాణము

42 - ఉత్కల క్షేత్ర వర్ణనమ్‌

బ్రహ్మ:

విరజే విరజా మాతా బ్రహ్మాణీ సంప్రతిష్ఠితాః

యస్యాఃసందర్శనా స్మర్త్యః పునాత్యాసప్తమం కులమ్‌

సకృ ద్దృష్ట్వాతు తాందేవీం భక్త్యాపూజ్య ప్రణమ్యచ

నరః స్వవంశ ముద్దృత్య మమలోకం స గచ్ఛతి

అన్యాశ్చ తత్ర తిష్ఠంతి విరజే లోకమాతరః

సర్వపాపహరా దేవ్యో వరదా భక్తవత్సలాః

ఆస్తే వైతరణీ తత్ర సర్వ పాపహరా నదీ

యస్యాం స్నాత్వా నరశ్రేష్ఠ స్సర్వ పాపైః ప్రముచ్యతే

ఆస్తేస్వయంభూ స్తత్రైవ క్రోడరూపీ పరిః స్వయమ్‌

దృష్ట్వా ప్రణమ్య తం భక్త్యా పరం విష్ణుం వ్రజంతితే

కాపిలే గోగ్రహే సోమే తీర్థే చాలాబుపంజ్ఞితే

మృత్యుంజయే క్రోడతీర్థే వాసుకే సిద్ధకేశ్వరే

తీర్థేష్వేతేషు మతిమా న్విరజే సంయతేంద్రియః

గత్వా ష్టతీర్థం విధివత్‌స్నాత్వా దేవా స్ర్పణమ్యచ

సర్వపాప వినిర్ముక్తో విమానవరమాస్థితః

ఉపగీయమానో గంధర్వైర్మమ లోకే మహీయతే

బ్రహ్మ:

విరజమను క్షేత్ర మందు విరజయను తల్లి సరస్వతీ దేవి సుప్రతిష్ఠింప బడినది. ఆమెను దర్శించి మనుజు డేడు తరముల వారిని బవిత్రులను జేయ గలడు. ఆ దేవి నొక్క మారేని దర్శించి పూజించి మ్రొక్కిన వాడు దన వంశము నుద్ధరించి నా లోకమున కేగును. ఆ విరజ క్షేత్రమున లోకమాత లింక నెందఱో యున్నారు. వారు సర్వపాప హారిణులు భక్త వత్సలలు, వర ప్రదాత్రులు. అక్కడ సర్వపాప హారిణి వైతరిణీ నది యున్నది. అందు స్నానము చేసిన నరోత్తముడు సర్వపాప విముక్తు డగును. అక్కడనే వరాహ మూర్తియై హరి తన కూడా వెలసి యున్నాడు. ఆయనను భక్తితో దర్శించి మ్రొక్కి విష్ణు పరమాత్మం బొందుదురు. విరజ క్షేత్ర మందున్న కపిల తీర్థము గోగ్రహము సోమము ఆలాబు తీర్థము మృత్యుంజయము క్రోడము (వరాహము) వాసుకము సిద్ధకేశ్వరము నను పేరుగల యీ యెనిమిది తీర్థము లందు బుద్ధి మంతుడు ఇంద్రియముల నిగ్రహించి యధా విధిగ స్నానము చేసి దేవతలకు మ్రొక్కి సర్వపాప ముక్తుడై దివ్య విమాన మెక్కి గంధర్వులు గానము సేయుచు గీర్తింప నేగి నాలోక మందు పూజ్యు డగును.

విరజే యో మమ క్షేత్రే పిండదానం కరోతివై

స కరోత్యక్షయాం తృప్తిం పితౄణాం నాత్ర సంశయః

మమక్షేత్రే మునిశ్రేష్ఠావిరజే యే కళేబరమ్‌

పరిత్యజంతి పురుషా స్తే మోక్షం ప్రాప్నువంతివై

స్నాత్వా యః సాగరే మర్త్యో దృష్ట్వా చ కపిలం హరిమ్‌

పశ్యేద్దేవీం వారాహీం సయాతి త్రిదశాలయమ్‌

సంతి చాన్యాని తీర్థాని పుణ్యా న్యాయతనానిచ

తత్కాలేతు మునిశ్రేష్ఠా వేదితవ్యానితానివై

సముద్రస్యోత్తరే తీరేతస్మిన్‌ దేశే ద్విజోత్తమాః

ఆస్తేగుహ్యం పరం క్షేత్రం ముక్తిదమ్‌ పాపనాశనమ్‌

సర్వత్రవాలుకాకీర్ణం పవిత్రమ్‌ సర్వకామదమ్‌

దశయోజనవిస్తీర్ణం క్షేత్రం పరమదుర్లభమ్‌

అశోకార్జునపున్నాగై ర్వకుళైః సరళద్రుమైః

పనసైర్నాకేళై శ్చ శాలైస్తాలైః కపిత్థకైః

చంపకై కర్ణికారైశ్చ చూతబిల్వైః సపాటలైః

కదంబైః కోవిదారైశ్చ లకుచై ర్నాగకేసరైః

ప్రాచీనామలకై ర్లోధ్రై ర్నారంగై ర్ధవఖాదిరైః

సర్జబూర్జాశ్వకర్ణైశ్చ తమాలైర్దేవదారుభిః

మందారైః పారిజాతైశ్చ న్యగ్రోధాగురు చందనైః

ఖర్జూరామ్రాతకైః సిద్దైర్ముచుకుందైః సకింశుకైః

అశ్వత్థైః సప్తపర్ణైశ్చ మధుధార శుభాంజనైః

శింశపామలకై ర్నీపైర్నింబతిందు విభీతకైః

సర్వర్తు ఫలగంధాఢ్యైః సర్వర్తు కుసుమోజ్వలైః

 మనోహ్లాదకరైః శుభ్రైర్నానా నిహగనాదితైః

శ్రోత్రరమ్యైః సుమధురై ర్బలనిర్మదనేరితైః

మనసః ప్రీతిజనకై శబ్దైః ఖగముఖేరితైః

చకోరైః శతపత్రైశ్చ భృంగరాజై స్తథాశుకైః

 కోకిలైః కలవింకైంశ్చ హారీతై ర్జ్వీజీవకైః

ప్రియపుత్రైశ్చాతకైశ్చ తథాన్యై ర్మధురస్వరైః

శ్రోత్రరమ్యైః ప్రియకరైః కూజద్భిశ్చార్వధిష్ఠితైః

కేతకీవనఖండై శ్చ అతిముక్తైః సకుబ్జకైః

మాలతీకుంద బాణైశ్చ కరవీరైః సితేతరైః

జంబీరకరుణాంకోలై ర్దాడిమైర్బీజ పూరకైః

మాతులుంగైః పూగఫలై ర్హింతాలైః కదళీవనైః

అన్యైశ్చ వివిధైర్వృక్షైః పుష్పైశ్చాన్యై ర్మనోహరైః

లతావితాన గుల్మైశ్చ వివిధైశ్చ జలాశ యైః

దీర్ఘికాభి స్తటాకైశ్చ పుష్కరిణీభిశ్చ వాపిభిః

నానాజలాశయైః పుణ్యైః పద్మినీఖండమండితైః

సరసాంచమనోజ్ఞాని ప్రసన్న సలిలానిచ

కుముదైః పుండరీకై శ్చ తథానీలోత్పలైః శుభైః

కల్హారైః కమలై శ్చాపి ఆచితాని సమంతతః

కాదంబైశ్చక్రవాకైశ్చ తథైవ జలకుక్కుటైః

కారండవైః ప్లవైర్హంసైః కూర్మైర్మత్స్యైశ్చ మద్గుభిః

దాత్యూహసారసాకీర్ణేః కోయష్టి బక శోభితై

ఏతైశ్చాన్యైశ్చ కూజద్భిః సమంతా జ్జలచారిభిః

ఖగైర్జలచరైశ్చాన్యైః కుసుమైశ్చ జలోద్భవైః

ఏవం నానావిధై ర్వృక్షైః పుష్పైః స్థలజలోద్భవైః

బ్రహ్మచారిగృహస్థైశ్చ వానప్రస్థైశ్చ భిక్షుభిః

స్వదర్మ నిరతైర్వర్ణై స్థతాన్యైః సమలంకృతమ్‌

హృష్టపుష్ట జనాకీర్ణం నరనారీ సమాకులమ్‌

అశేష విద్యానిలయం సర్వదర్మ గుణాకరమ్‌

ఏవం సర్వగుణోపేతం క్షేత్రం పరమదుర్లభమ్ః

విరజ క్షేత్రమున పితరులకు బిండ దానము చేసిన నది యక్షయ తృప్తికర మగును. ఈ నా క్షేత్ర మందు శరీరము విచిడిన వారు ముక్తు లగుదురు. ఇచట సముద్ర స్నానము సేసి కపిలుడను పేరనున్న విష్టువును వారాహి యను దేవతను దర్శించి స్వర్గ మందును. ఇచట పుణ్య తీర్థములు ఆలయములు పెక్కు లున్నవి. అవి ఆ యాత్రా సమయ మందు తెలిసి కొని సేవింప దగును. సముద్రము నుత్తరపు టొడ్డున గల ప్రదేశ మందు గుహ్యమైన ముక్తి క్షేత్ర మున్నది. అందంతట నిసుక మేటలు నున్నవి. పది యోజనముల వైశాల్యము గలది. అశోకాది నానాఫల వృక్షములు మందారాదులు పూలచెట్లు ఖర్జూ రాదులు సర్వర్తు ఫల కుసుమ గంధ భరితములు పక్షి కూజిత మనోహరము లెన్నో కలవు. దిగుడు బావులు పుష్కరిణులు తామర కొలనులు లెక్కే లేదు. స్థల జలచరములగు పక్షులు పెక్కు లున్నవి. స్వవర్ణ ధర్మానుసారులు గృహస్థాద్యా శ్రమముల వారక్కడ నున్నారు. స్త్రీలు పురుషులు హృష్ణులును పుష్టులును. అది సర్వ విద్యా సదనము. సర్వ ధర్మ గుణాకరము. అట్టి క్షేత్రము మతి దుర్లభము.

అస్తేతత్ర మునిశ్రేష్ఠా విఖ్యాతః పురుషోత్తమః

యావదుత్కళమర్యాదా దిక్‌ క్రమేణ ప్రకీర్తితా

వ త్కృష్ణప్రసాదేన దేశః పుణజ్యతమోహి సః

యత్ర తిష్ఠతి విశ్వాత్మా దేశేస పురుషోత్తమః

గద్వ్యాపీ జగన్నాథ స్తత్ర సర్వం ప్రతిష్ఠితమ్‌

అహంరుద్రశ్చ శక్రశ్చ దేవా శ్చాగ్ని పురోగమాః

నివసామో మునిశ్రేష్ఠా స్తస్మిన్‌ దేశే సదావయమ్‌

గంథర్వాప్సరసః సర్వాః పితరో దేవమానుషాః

యక్ష విద్యాధరాః సిద్ధా మునయః సంశితవ్రతాః

ఋషయో వాలఖిల్యాశ్చ కశ్యపాధ్యాః ప్రజేశ్వరాః

నుపర్ణాః కిన్నరా నాగా స్తథా న్యే స్వర్గవాసివః

సాంగాశ్చ చతురోవేదాః శాస్త్రాణి వివిధానిచ

ఇతిహాస పురాణాని యజ్ఞాశ్చ వరదక్షిణాః

నద్యశ్చవివిధాః పుణ్యా స్తీర్థా న్యాయతనానిచ

సాగరాశ్చ తథా శైలా స్తసిన్ద్మేశే వ్యవస్థితాః

ఏవం పుణ్యతమే దేశే దేవర్షి పితృసేవితే

సర్వోపభోగ సహితే వాసః కస్యనరోచతే

శ్రేష్ఠత్వం కస్యదేశస్య కించాన్యదధికం తతః

ఆస్తేయత్ర స్వయం దేవో ముక్తిదః పురుషోత్తమః

దన్యాస్తే విబుధప్రఖ్యా యే వసంత్యుత్క ళే నరాః

అక్కడ పురుషోత్తము డను పేర విష్ణు వున్నాడు. ఉత్కశ దేశము సరిహద్దు వరకు గల దేశమా కృష్ణా నుగ్రహముచే పుణ్య తమము. నేను రుద్రుడు ఇంద్రుడు అగ్నిముఖు లగు దేవతలు నచ్చటనే యెల్ల వేళల వసింతుము. గంధర్వు లప్సరసలు పితరులు మనుష్యులు మునులు వాలఖిల్యాదులు కశ్యపాదులు గరుడలు కిన్నరులు నాగులు సాంగము లైన వేదములు సర్వ శాస్త్రములు ఇతిహాస పురాణాదులు యజ్ఞములు పుణ్య నదులు తీర్థములు గిరులు సాగరములు నక్కడనే యున్నవి. ఇట్లు దేవ ఋషి పితృసేవితమై సమస్తోప భోగములతో గూడిన పవిత్ర తమమైన దేశమున నివాస మెవనికి రుచింపదు? దాని కంటె అథికమైన శ్రేష్ఠత్వ మే దేశమున నుండును? బ్రాహ్మణులారా ముక్తి ప్రదుడైన పురుషోత్తముడు స్వయముగ సన్నిహితుడై యున్న యుత్కళ దేశవాసులు ధన్యులు.

తీర్థరాజజలే స్నాత్వా పశ్యంతి పురుషోత్తమమ్‌

స్వర్గేవసంతి తే మర్త్యా నతే యాంతి యమాలయమ్‌

యే వసన్త్యుత్క ళే క్షేత్రే పుణ్యే శ్రీపురుషోత్తమే

సఫలం జీవితం తేషా ముత్కలానాం సుమేధసామ్‌

యే పశ్యంతి సురశ్రేష్టం ప్రసన్నాయతలోచనమ్

చారుభ్రూకేశ ముకుటం చారుకర్ణావతంసకమ్‌

చారుస్మితం చారుదంతం చారుకుండలమండితమ్‌

సునాసం సుకపోలం చ సులలాటం సులక్షణమ్‌

త్రైలోక్యానందజననం కృష్ణస్యముఖపంకజమ్‌

అక్కడ తీర్థ స్నానము చేసి పురుషోత్తముని సేవించిన వారు స్వర్గమున కేగుదురు. వారు యమా లయమునకు బోరు. ఉత్కల దేశము నందలి పురుషోత్తమ క్షేత్ర నివాసుల జీవితము ధన్యము. ప్రసన్నములై విశాల నేత్రములు చక్కని కను బొమలు కేశ పాశము కిరీటము నింపైన చెవి కమ్మలు చిఱునవ్వు చక్కని పలు వరుసయు గల్గి కిరీటా లంకృతుడైన యా కృష్ణ పరమాత్మ యొక్క ముఖ పద్మము త్రిలోకానంద జనకము.