మునులు:
భూయోపి కథయాస్మాకం కథాం సూర్య సమాశ్రితామ్ న తృప్తి మధిగచ్ఛామః శ్రుణ్వంత స్తాం కథాం శుభామ్
యోయం దీప్తో మహాతేజా వహ్నిరాశి సమవ్రభః ఏత ద్వేదితు మిచ్ఛామః ప్రభావోస్య కుతః ప్రభో
మునులు:
పితామహ! సూర్య కథ నెంతవిన్నను తృప్తి లేదు. అగ్నిరాశి వలె వెలుంగు నీ మూర్తికి ప్రభావ మెందుండి యయ్యెనో తెలియ నెంతుము. ఇంకను నా శుభ చరిత్ర మాకానతిమ్ము.
బ్రహ్మ:
తమోభూతేషు లోకేషు నష్టే స్థావరజంగమే ప్రకృతే ర్గుణహేతుస్తు పూర్వం బుద్ధి రజాయత
అహంకారస్తతో జాతో మహాభూత ప్రవర్తకః వాయ్వగ్ని రావః ఖం భూమి స్తత స్త్యండ మజాయత
తస్మిన్నండే త్విమేలోకాః సప్త చైవ ప్రతిష్ఠతాః పృథివీ సప్తభి ర్ద్వీపైః సముద్రైశ్చైవ సప్తభిః
తత్రైవావస్థితో హ్యాసీదహం విష్ణు ర్మహేశ్వరః విమూఢా స్తామసాః సర్వే ప్రధ్యాయంతి తమీశ్వరమ్
తతోవై సుమహాతేజాః ప్రాదుర్భూత స్తమోనుదః ధ్యానయోగేన చాస్మాభి ర్విజ్ఞాతం సవితా తదా
జ్ఞాత్వాచ పరమాత్మానం సర్వ ఏవ పృధక్ పృథక్ దివ్యాభిః స్తుతిభిర్దేవః న్తుతోస్మాభి స్తదేశ్వరః
అదిదేవోసి దేవానా మైశ్వర్యాచ్చ త్వమీశ్వరః ఆదికర్తాసి భూతానాం దేవదేవో దివాకరః
జీవనః సర్వభూతానాం దేవగంధర్వ రక్షసామ్ మునికిన్నర సిద్ధానాం తథై వోరగపక్షిణామ్
త్వం బ్రహ్మ త్వం మహాదేవ స్త్వం విష్ణుస్త్వం ప్రజాపతిః వాయురింద్రశ్చ సోమశ్చ వివస్వాన్ వరుణకస్తథా
త్వం కాలః సృష్టికర్తా చ హర్తా భర్తా తథా ప్రభుః సరితః సాగరాః శైలా విద్యుదింద్ర ధనూంషిచ
ప్రళయః ప్రభవశ్చైవ వ్యక్తావ్యక్తః సనాతనః ఈశ్వరా త్పరతో విద్యావిద్యాయాః పరతః శివః
శివాత్పరతరో దేవ స్త్వమేవ పరమేశ్వరః సర్వతః పాణిపాదాంతః సర్వత్తో క్షి శిరోముఖః
సహస్రాంశుః సహస్రాస్యః సహస్ర చరణేక్షణః భూతాది ర్భూర్భువః స్వశ్చ మహః సత్యం తపో జనః
ప్రదీప్తం దీపనం దివ్యం సర్వలోకప్రకాశకమ్ దుర్నిరీక్షం సురేంద్రాణాం యద్రూపం తస్య తే నమః
సురసిద్ధగణౖర్జుష్టం భృగ్వత్రిపులహాదిభిః స్తుతం వరమ మవ్యక్తం యద్రూపం తస్య తే నమః
వేద్యం వేదవిదం నిత్యం సర్వజ్ఞాన సమన్వితమ్ సర్వదేవాదిదేవస్య యద్రూపం తస్య తే నమః
విశ్వకృ ద్విశ్వభూతం చ వైశ్వానరసురార్చితమ్ విశ్వస్థిత మచింత్యం చ యద్రూపం తస్య తే నమః
వరం యజ్ఞాత్ పరం వేదాత్ పరం లోకాత్ పరం దివః పరమాత్మే త్యభిఖ్యాతం యద్రూపం తస్య తే నమః
అవిజ్ఞేయ మనాలక్ష్య మధ్యానగత మవ్యయమ్ అనాదినిధనం చైవ యద్రూపం తస్య తే నమః
నమోనమః కారణకారణాయ నమోనమః పాపవిమోచనాయ నమో నమస్తే దితిజార్దనాయ, నమోనయో రోగ విమోచనాయ
నమోనమః సర్వవరప్రదాయ, నమోనమః సర్వసుఖ ప్రదాయ నమోనమః సర్వధనప్రదాయ, నమానమః సర్వ మతిప్రదాయ
స్తుతః సభగవానేవం తైజసం రూపమాస్థితః ఉవాచ వాచా కల్యాణ్యా కో వరో వః ప్రదీయతాం
బ్రహ్మ:
లోకములు తమః ప్రాయములు కాగా చరాచర సృష్టి నష్టప్రాయము కాగా ప్రకృతి యొక్క గుణ వికారమునకు గారణమై బుద్ధి జనించెను. అందుండి యహంకారము, దాన మహా భూతములు నవ్వల నొక యండము జనించెను. ఈ లోకము లెల్ల దాని యందున్నవి. అందు నేను, విష్ణువు, శివుడు నుండి తామస వృత్తులమై యీశ్వరుని ధ్యానించితిమి అపుడు విజ్ఞాన స్వరూపుడు ధ్యాన యోగ మందు మాకు సూర్య రూపుడై గోచరించెను. విశ్వ రూపునిగ మే మాయనను స్తుతించితిమి. “ఆది దేవోసి దేవానాం” “నీవు దేవతల కెల్ల మొదటి దేవతవు” ఇత్యాదిగ మూల శ్లోకములు పారాయణార్హములు వీని భావము సుగమము.
దేవతలు:
తవాతి తైజసం రూపం న కశ్చిత్‌సోఢు ముత్సహేత్ సహనీయం త ద్భవతు హితాయ జగతః ప్రభో
ఏవ మస్త్వితి సోప్యుక్తో భగవా నాదికృత్ ప్రభుః లోకానాం కార్య సిద్ధ్యర్థం ఘర్మవర్షహిమప్రదః
తతః సాంఖ్యాశ్చ యోగాశ్చ యేచాన్యే మోక్షకాంక్షిణః ధ్యాయంతి ధ్యాయినో దేవం హృదయస్థం దివాకరం
సర్వలక్షణహీనోపి యుక్తో వా సర్వపాతకైః సర్వంచ తరతే పాపం దేవ మర్కం సమాశ్రితః
అగ్నిహోత్రం చ వేదాశ్చ యజ్ఞాశ్చ బహుదక్షిణాః భానోర్భక్తినమస్కారకలాం నార్హంతి షోడశీమ్
తీర్థానాం పరమం తీర్థం మంగళానాంచ మంగళమ్ పవిత్రంచ పవిత్రాణాం ప్రపద్యంతే దివాకరమ్
శక్రాద్యైః సంస్తుతం దేవం యే నమస్యంతి భాస్కరమ్ సర్వకిల్బిషనిర్ముక్తాః సూర్యలోకం వ్రజంతి తే
దేవతలు:
జగత్ ప్రభూ! నీ తేజో రూపము నెవ్వడును సహింప నేరడు. కావున లోక హితము కొఱకది ప్రశాంతమగు గాక! అనినంతట సూర్య భగవానుడు ఘర్మమును వర్షమును జలువను గూడ నీయ గలవాడు కావున జగత్కార్య సిద్ధి కట్లే యగు గాక యనెను. సాంఖ్యులు, యోగులు ముముక్షువులు భాస్కరుని హృదయ మందు చైతన్య రూపమున నున్నవాని గని ధ్యానింతురు. బహు దక్షిణము లైన క్రతువులు వానికి నాధార మైన వేదములు సూర్య నమస్కారము యొక్క కలా మాత్రమున కేని (లేన మాత్రమున కేని) సరిగావు, అది తీర్థముల కెల్ల తీర్థము. మంగళముల కెల్ల మంగళము. పవిత్రముల కెల్ల పవిత్రము నైన దివాకర మూర్తి నందరు శరణందుదురు. సూర్య నమస్కారము సర్వ పాప హరము.
మునులు:
చిరాత్ప్రభృతి నో బ్రహ్మన్ శ్రోతు మిచ్ఛా ప్రవర్తతే నామ్నా మష్టశతం బ్రూహి యత్త్వ యోక్తం పురా రవేః
మునులు:
“ప్రజాపతీ! చాల కాలము నుండి మాకు సూర్యుని యష్టోత్తర శతనామములను విన వలెనని కోరిక యున్నది. కాన దయచేసి తెలుపుమని” మును లడిగిరి.
బ్రహ్మ:
అష్టోత్తరశతం నామ్నాం శృణుధ్వం గదతో మమ భాస్కరస్య పరం గుహ్యం స్వర్గమోక్షప్రదం ద్విజాః
బ్రహ్మ:
బ్రాహ్మణులారా! మిక్కిలి రహస్యమును స్వర్గ మోక్షముల నిచ్చునదియు నగు సూర్యుని అష్టోత్తర శత నామములను చెప్పు చున్నాను. వినుడు.
ఓం సూర్యో ర్యమా భగ స్త్వష్టా పూషా ర్కః సవితా రవిః గభస్తిమా నజః కాలో మృత్యు ర్ధాతా ప్రభాకరః
పృధివ్యాపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతిః శుక్రో బుధోంగారక ఏవచ
ఇంద్రో వివస్వాన్ దీప్తాంశుః శుచిః శౌరిః శనైశ్చరః బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః
వైద్యుతో జాఠర శ్చాగ్ని రైంధన స్తేజసాం పతిః ధర్మధ్వజో వేదకర్తా వేదాంగో వేదవాహనః
కృతం త్రేతా ద్వాపరశ్చ కలిః సర్వామరాశ్రయః కలా కాష్ఠా ముహూర్తాశ్చ క్షపా యామా స్తథా క్షణాః
సంవత్సరకరో శ్వత్థః కాలచక్రో విభావసుః పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః
కాలాధ్యక్షః ప్రజాధ్యక్షో విశ్వకర్మా తమోనుదః వరుణః సాగరోంశశ్చ జీమూతో జీవనో రిహా
భూతాశ్రయో భూతపతిః సర్వలోకనమస్కృతః స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాది రలోలుపః
అనంతః కపిలో భానుః కామదః సర్వతోముఖః జయో విశాలో వరదః సర్వభూతనిషేవితః
మనః సుపర్ణో భూతాదిః శీఘ్రగః ప్రాణధారణః ధన్వంతరి ర్థూమకేతు రాదిదేవో దితేఃసుతః
ద్వాదశాత్మా రవి ర్దక్షః పితా మాతా పితామహః స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్
దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః చరాచరాత్మా సూక్ష్మాత్మా మైత్రేయః కరుణాన్వితః
ఏతద్వై కీర్తనీయస్య సూర్యస్యామితతేజసః నామ్నా మష్టశతం రమ్యం మయా ప్రోక్తం ద్విజోత్తమాః
సురగణపితృయక్షసేవితః హ్యసుర నిశాకరసిద్ధవందితం వరకనకహుతాశనప్రభం ప్రణిపతితోస్మి హితాయ భాస్కరమ్
సూర్యోదయే యః సుసమాహితః పఠేత్ స పుత్రదారాన్ ధనరత్న సంచయమ్
లభేత జాతిస్మరతాం నరః సతు స్శృతించ మేధాంచ స విందతే పరామ్
ఇమం స్తవం దేవవరస్య యో నరః ప్రకీర్తయే చ్ఛుద్ధమనాః సమాహితః
విముచ్యతే శోకదవాగ్ని సాగరాత్ లభేత కామా న్మనసా యథేప్సితాన్
గొప్ప తేజశ్శాలి యగు శ్రీ సూర్యుని అష్టోత్తర శత నామములు చెప్ప బడెను. సురాసుర సిద్ధ పితృ యక్ష గణ సేవితుడును, సువర్ణము అగ్ని యొక్క కాంతి వంటి కాంతి గల వాడును నగు భాస్కరుని నా శ్రేయస్సు కొరకు నమస్కరింతును. సూర్యోదయ కాలమున ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును సావధాన చిత్తుడై చదివిన వాడు యోగ్యమైన భార్యను పుత్రులను ధన రత్న సముదాయమును, పూర్వ జన్మ స్మృతిని, జ్ఞాపక శక్తిని, గొప్ప ధారణా శక్తిని పొంద గలడు. సంసార దావాగ్ని సాగరము నుండి విముక్తి నందును. మనోరథముల నెల్ల పొందును.
Summary of chapter 33 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Śiva, wishing to test the steadfastness of Pārvatī's devotion, sends the Saptarṣis in disguise to dissuade her from her vow, enumerating Śiva's inauspicious characteristics — his ash-covered body, wandering lifestyle, lack of wealth, and association with ghosts. Pārvatī firmly rebuts each objection, declaring her unconditional devotion. Śiva himself then appears disguised as a brahmacārin and argues further against his own worthiness, only to be firmly rejected, thus proving Pārvatī's steadfastness beyond doubt.