బ్రహ్మ మహా పురాణము

26 - స్వయంభూ బ్రహ్మర్షి సంవాదః

మునులు:

పృథివ్యా ముత్తమాం భూమిం ధర్మకామార్థమోక్షదామ్‌

తీర్థానా ముత్తమం తీర్థం బ్రూహీ నో వదతాం వర

మునులు:

ప్రవచన నిపుణా! పృథివి యందుత్తమ మయినది ధర్మార్థకామ మోక్షముల నొసంగునది యగు భూమిని తీర్థముల కెల్ల నుత్తమ తీర్థమును దెల్పుమని అడిగిరి.

లోమహర్షణుడు:

ఇమం ప్రశ్నం మమగురుం పప్రచ్ఛు ర్మునయః పురా!

తమహం సంప్రవక్ష్యామి యత్పృచ్ఛద్వం ద్విజో త్తమాః

లోమహర్షణుడు:

 మున్ను మునులీ ప్రశ్నమును మా గురువుల నడిగిరి.

స్వాశ్రమే సుమహాపుణ్యే నానాపుష్పోపశోభితే

నానాద్రుమ లతా కీర్ణే నానామృగగణౖర్యుతే

పున్నాగైః కర్ణికారైశ్చ సరలై ర్ధేవదారుభిః

శాలైస్తాలైప్తమాలైశ్చ పనసై ర్ధవ ఖాదిరైః

పాటలాశోక వకులైః కరవీరైః స చంపకై

అసైశ్చ వివిధైర్వృక్షైః నానాపుష్పోపశోభితైః

కురుక్షేత్రే సమాసీనం వ్యాసం మతి మతాం వారమ్‌

మహా భారత కర్తారం సర్వశాస్త్రవిశారధమ్‌

ఆధ్యాత్మనిష్ఠం సర్వజ్ఞం సర్వభూతహితేరతమ్‌

పురాణాగమవక్తారం వేదవేదాంగపారగమ్‌

పరాశరసుతం శాంతం పద్మపత్రాయతేక్షణమ్‌

ద్రష్టు మభ్యాయయుః ప్రీత్యా మునయః సంశిత వ్రతాః

కశ్యపో జమదగ్నిశ్చ భరద్వాజోథ గౌతమః

వశిష్ఠో జైమిని ర్థౌమ్యో మార్కండేయోథ నాకుజః

విశ్వామిత్రః శతానందో వాత్స్యో గార్గ్యోథ అసురిః

సుమంతు ర్భార్గవోనామ కణ్వో మేథాతిథిర్గురుః

మాండవ్య శ్చ్యవనో ధూమ్రో హ్యసితో దేవలస్తథా

మౌద్గల్య స్తృణయజ్ఞశ్చ పిప్పలాదోకృత వ్రణః

సంవర్తః కౌశికో రై భ్యో మైత్రేయో హరిత స్తధా

శాండిల్యశ్చ విభాండశ్చ దుర్వాసా లోమశ స్తధా

నారదః పర్వతశ్చైవ వైశంపాయనగాలవౌ

భాస్కరిః పూరణః సూతః పులస్త్యః కపిల స్తధా

ఉలూకః పులహో వాయు ర్దేవస్థాన శ్చతుర్భుజః

సనత్కుమారః పైలశ్చ కృష్ణః కృష్ణానుభౌతికః

ఏతై ర్మునివరైశ్చాన్యై ర్వృత స్సత్యవతీసుతః

రరాజ సమునిః శ్రీమా న్నక్షత్రైరివ చంద్రమాః

తా నాగతా న్మునీ న్సర్వా న్పూజయామాస వేదవిత్‌

తేపి తం ప్రతిపూజ్యైవ కథాం చక్రుః పరస్పరం

కథాంతే తే మునిశ్రేష్ఠాః కృష్ణం సత్యవతీసుతమ్‌

పప్రచ్చుః సంశయం సర్వే తపోవననివాసినః

కురుక్షేత్రమున నానాతరు లతా పుష్ప ఫలోప శోభితమైన తన యాశ్రమమునం దాసీనుడై యున్న మహాభారత కర్తను సర్వశాస్త్ర విశారదుని ఆధ్యాత్మ నిష్ఠుని సర్వజ్ఞుని స్వభూత హితాభిరతుని పురాణాగమ వక్తను వేదవేదాంగ పారగుని శాంతుని మతిమంతుల కెల్ల సగ్రేసరుని పద్మ పత్రాయ తేక్ణుని శ్రీ వేద వ్యాసుని దర్శించు వేడుకతో నిశిత వ్రత పరాయణు లైన మును లేతెంచిరి. ఆ వచ్చిన వారు కశ్యపుని మొదలు కృష్ణాను భౌతుకుని దాక గల పేర్లవారు. నక్షత్రములలో చంద్రుని వలె వారిలో పరాశర సూనుడు శ్రీమంతుడు వ్యాసుడు మిక్కిలిగా దేజరిల్లెను. వేదవేత్త యగు నమ్ముని యా మునివరులను బూజించెను. వారును నతనికి ప్రతి పూజ సల్పి కుశల ప్రశ్నము లయిన తరువాత సాత్యవతేయు నిట్లడిగిరి.

మునులు:

మునే వేదాంశ్చ శాస్త్రాణి పురాణాగమభారతమ్‌

భూతం భవ్యం భవిష్యంచ సర్వం జానాసి వాజ్మయమ్‌

కష్టేస్మి న్దుఃఖ బహుళే నిస్సారే భవసాగరే

రాగగ్రహాకులే రౌద్రే విషయోదకసంప్లవే

ఇంద్రియావర్తకలితే తృష్టోర్మిశతసంకులే

మోహపంకావిలే దుర్గే లోభగంభీరదుస్తరే

నిమజ్జ్వ జ్జగ దాలోక్య నిరాలంబ మచేతనమ్‌

పృచ్ఛామ స్త్వాం మహాభాగం బ్రూహివో మునిసత్తమ

శ్రేయః కిమత్ర సంసారే భైరవే లోమహర్షణే

ఉపదేశ ప్రదానేన లోకా నుద్ధర్తు మర్హసి

దుర్లభం పరమంక్షేత్రం వక్తు మర్హసి మోక్షదమ్‌

పృథివ్యాం కర్మభూమించశ్రోతు మిచ్ఛామహే వయమ్‌

కృత్వా కిల న్తర స్సమ్య క్కర్మభూమౌ యథోదితమ్‌

ప్రాప్నోతి పరమాం సిద్ధిం నరకం చ వికర్మతః

మోక్షక్షేత్రే తథా మోక్షం ప్రాప్నోతి పురుష స్సుధీః

తస్మా ద్భ్రహి మహా ప్రాజ్ఞయత్పృష్టోసి ద్విజోత్తమః

శ్రుత్వాతు వచనం తేషాం ముసీనాం భావితాత్మనామ్‌

వ్యాసః ప్రోవాచ భగవా న్భూతభవ్యభవిష్యవిత్‌

మునులు:

ఓ మునివరా! వేదశాస్త్ర పురాణా గమాది సర్వ సారస్వతమును భూత భవిష్యద్వర్త మానములను నెరుంగుదువు. మునిసత్తమా! రాగమను మొసళ్ళు, విషయములను నుప్పు నీరు, ఇంద్రియములను సుళ్ళు గలిగి, దురాశ యను కెరటముల నిండి, లోభ గంభీరము దుస్తరము మోహమును రొంపియు గల్గి దుఃఖ బహుళము కష్టతరము నిస్సారమైన సంసార సాగర మందు మునిగి నిరాలంబ మై యచేతనమై యున్న జగత్తును జూచి మహానుభావుడ వగు నిన్నడుగు చున్నాము. ఈ భయంకర సంసార మందేది సాధింప వలె? ఏది శ్రేయ స్సాధనము? ఉపదేశించి జగముల నుద్ధరింపుము. ఈ యవని యందు దుర్లభము మోక్షదము నైన పవిత్ర క్షేత్రమును చెప్పుడు. ఈ మేదిని యందు గర్మభూమి యేదియో నీ వలన విన దలచితిమి. కర్మ భూమి యందు నరుడు యధా విధిగా గర్మ మొనరించి పరమ సిద్ధిని బొందును. వికర్మ వలన నరకమును బొందును. మోక్ష భూమి యందు మోక్ష మందును గావున మాకీ విషయములు వినిపింపు మన, త్రి కాలజ్ఞుడగు వ్యాస మహర్షి వారి కిట్లా నతిచ్చెను.

వ్యాసుడు:

శృణుధ్వం మునయ స్సర్వే వక్ష్యామి యది పృచ్ఛతయః

సంవాదోభవ త్పూర్వ మృషీణాం బ్రహ్మణాసహ

మేరుపృష్టే తు విస్తీర్ణే నానారత్న విభూషితే

నానాద్రుమలతాకీర్ణే నానాపుషోపశోభితే

నానాపక్షిరుతే రమ్యే నానాప్రసవణాకులే

నానా నత్త్వసమాకీర్ణే నానాశ్చర్యసమన్వితే

నానావర్ణ శిలాకీర్ణే నానాధాతువి భూషితే

నానాసత్వసమాకీర్ణే నానాశ్రమ సమన్వితే

తత్రా సీనం జగన్నాథం జగద్యోనిం చతుర్ముఖం

జగత్పతిం జగద్వంద్యం జగదాధార మీశ్వరమ్‌

దేవదానవగధరెవ్య ర్యక్షవిద్యాధరోరగైః

మునిసిధ్ధాప్సరోభిశ్చ వృత మన్యై ర్దివాలయైః

కేచిత్త్సువంతి తం దేవం కే చిద్గాయంతి చాగ్రతః

కేచి ద్వాద్యాని వాద్యంతే కేచి న్నృత్యంతి చాపరే

ఏవం ప్రముదితే కాలే సర్వభూత సమాగమే

నానాకుసుమ గంధాడ్యే దక్షిణానిలసేవితే

భృగ్వా ద్యాస్తం తదాదేవం ప్రణిపత్య పితామహమ్‌

ఇమమర్థ మృషివరాః పప్రచ్చుః పితరం ద్విజాః

వ్యాసుడు:

మున్ను మేరుపృష్ట మందు నానా రత్నద్రుమ లతా కుసుమ పల్లవ లలితమై నానా మృగ ఖగ కలకలమై నానావర్ణ శిలాధాతు రంజితమై నానా ముని జనాశ్రమ సమన్వితమై రమ్యము నైన ప్రదేశము నందాసీను డై యున్న వాడు.

ఋషులు:

భగవన్‌శ్రోతు మిచ్ఛామః కర్మభూమిం మహీతలే

వక్తుమర్హసి దేవేశ మోక్ష క్షెత్రంచ దుర్లభమ్‌

తేషాం వచన మాకర్ణ్య ప్రాహ బ్రహ్మా సురేశ్వరః

పప్రచ్ఛుస్తే యథా ప్రశ్నం తత్సర్వం మునిసత్తమాః

ఋషులు:

జగన్నాథుడు, జగద్యోని, చతుర్ముఖుడు, జగన్నాథుడు, జగద్వంద్యుడు జగదా ధారుడు ఈశ్వరుడు, జగత్పతి, దేవదాన వాదులచే వివిధ రీతుల సేవింప బడుచున్న బ్రహ్మను భృగ్వాది మునులు దర్శించి మ్రొక్కి యిదే యంశము నడిగిరి. భగవంతుడా! భూతలమున కర్మ భూమిని దుర్లభమైన మోక్ష ప్రద క్షేత్రమును తెలుపు డనగా సురేశ్వరుండిట్లు తెలుప బూనెను.