బ్రహ్మ మహా పురాణము
200 - ప్రద్యుమ్నాఖ్యానమ్
మునులు:
శంబరేణ హృతోవీరః ప్రద్యుమ్న స్స కథం పునః
శంబరశ్చ మహావీర్యః ప్రద్యుమ్నేన కథం హతః
మునులు:
శంబరునిచే బ్రద్యుమ్నుడెట్లు హరింప బడెను. ప్రద్యుమ్నుడా శంబరుని సంహరించిన విధమేమి? తెలుపుడు అని విన్న వించిరి.
వ్యాసులు:
షష్ఠేహ్ని జాతమాత్రేచ ప్రద్యుమ్నం సూతికాగృహాత్
మమైష హంతేతి ద్విజా హృతవా న్కాలశంబరః
నీత్వా చిక్షేప చైవైనం గ్రాహోగ్రే లవణార్ణవే
కల్లోలజనితావర్తే సుఘోరే మకరాలయే
పతితం చైవ తత్రైకో మత్స్యో జగ్రాహ బాలకమ్
న మమార చ తస్యాపి జఠరానలదీపితః
మత్స్యబంధైశ్చ మత్స్యోసౌ మత్స్యైరన్యైః సహ ద్విజాః
ఘాతితోసురవర్యాయ శంబరాయ నివేదితః
తస్య మాయావతీ నామ పత్నీ సర్వగృహేశ్వరీ
కారయామాస సూదానా మాధిపత్యమనిందితా
దారితే మత్స్యజఠరే దదృశే సాతిశోభనమ్
కుమారం మన్మథతరో ర్దగ్ధస్య ప్రథమాంకురమ్
కోయం కథ మయం మత్స్యజఠరే సముపాగతః
ఇత్యేవం కౌతుకావిష్టాం తాం తన్వీం ప్రాహ నారదః
వ్యాసులు:
ప్రద్యుమ్నుడు పుట్టిన యాఱవ నాడు కాల శంబరుడు. తన కీతడు హంతకుడని తలచియా శిశువును పురిటింట నుండి కొంపోయి మొసళ్లచే భయంకరమైన సముద్రమున విసరి వేసెను. ఆ పడిన శిశువు నొక చేప పట్టు కొనెను. దాని జఠరాగ్నికి గురి యయ్యు నా బాలుడు చావలేదు. జాలరులు వలవేయ నితర చేపలతో బాటు పట్టు వడి శంబరునికి సమర్పింప బడియె. వాని భార్య మాయావతి యనునది వాని గృహ యజమాను రాలా చేపను వంటవాని కీయ వాడది చీల్చి యా చేప కడుపున మున్ను దగ్ధుడైన మన్మథుడను వృక్షము యొక్క మొదటి మొలకను, పరమ సుందరు డగు శిశువుం జూచెను. ఎవడు నీవు? చేప కడుపున కెట్లు వచ్చెను! అని వెడుక పడుచున్న శంబరుని భార్యంగని నారదుడు
నారదుడు:
అయం సమస్త జగతాం సృష్ఠి సంహార కారిణా
శంబరేణ హృతః కృష్ణతనయః సూతికాగృహాత్
క్షిప్తస్సముద్రే మత్స్యేన నిగీరస్తే వశం గతః
నవరత్నమిదం సుభ్రు విస్రబ్ధా పరిపాలయ
నారదుడు:
ఈ శిశువు సర్వ సృష్టి సంహారములు సేయ గల శంబరునిచే పురిటింట నుండి హరింప బడిన వాడు. కృష్ణుని కుమారుడు సముద్రమున విసర బడి చేప మ్రింగగా నీకు దక్కినాడు. ఇది మానవ రత్నము. శ్రద్ధగ కాపాడు మని తెల్పెను.
వ్యాసులు:
నారదేనైవ ముక్తా సా పాలయామాస తం శిశుమ్
బాల్యాదేవాతిరాగేణ రూపాతిశయ మోహితా
వ్యాసులు:
ఆమె యట్లే యా బాలుని సౌందర్యా తిశయమునకు మోహపడి యనురక్తితో బెంచెను.
స యదా యౌవనా భోగభూషితోభూద్ద్విజోత్తమాః
సాభిలాషా తదా సాతు బభూవ గజగామినీ
మాయావతీ దదౌచాస్మైమాయా సర్వా మహాత్మనే
ప్రద్యుమ్నాయాత్మభూతాయ తన్న్యస్త హృదయేక్షణా
ప్రసజ్జంతీం తు తామాహ స కార్ష్ణిః కమలలోచనః
ఆ బాలుడు నిండు యౌవనము గనియామె వానికి తన మాయ నంతను చెప్పెను. వాని యందు హృదయము చూపులు నిలిపి ప్రవర్తించుండ ప్రద్యుమ్నుడు,
ప్రద్యుమ్నుడు:
మాతృభావం విహాయైవ కిమర్ధం వర్తసేన్యథా
మాతృ భావము విడిచి మరొక తీరున నాయెడల నీవేల ప్రవర్తించున్నా వని యడిగెను.
వ్యాసులు:
సా చాస్మైకథయామాస స పుత్త్రస్త్వం మమేతి వై
తనయం త్వామయం విష్ణోర్హృతవాన్కాలశంబరః
క్షిప్తః సముద్రే మత్స్యస్య సంప్రాప్తో జఠరాన్మయా
సాతు రోదితి తే మాతా కాంతాద్యాప్యతివత్సలా
ఆమెయు నీవు నాకు కుమారుడవు కావు. విష్ణు కుమారుడ వైన నిన్ను కాల శంబరుడు హరించి సముద్రమున విసరగా నొక చేప కడుపు నుండి నాకు లభించితివి. నిన్ను గన్న తల్లి నీకొఱ కిప్పుడును నేడ్చు చున్నది.
వ్యాసులు:
ఇత్యుక్తః శంబరం యుద్ధే ప్రద్యుమ్నస్స సమాహ్వయత్
క్రోధాకులీకృతమనా యుయుధే చ మహాబలః
హత్వా సైన్యమశేషం తు తస్య దైత్యస్య మాధవః
సప్త మాయా వ్యతిక్రమ్య మాయాం సంయుయుజేష్టమీమ్
తయా జఘాన తం దైత్యం మాయయా కాలశంబరమ్
ఉత్పత్య చ తయా సార్ధ మాజగామ పితుః పురమ్
అంతఃపురే చ పతితం మాయావత్యా సమన్వితమ్
తం దృష్ట్వా హృష్టసంకల్పా బభూవుః కృష్ణయోషితః
రుక్మిణీ చాబ్రవీత్ప్రేమాణ సక్తదృష్టి రనిందితా
అది విని కోపము గని మనసు వికలమై ప్రద్యుమ్నుడు శంబరుని యుధ్ధమునకు బిలిచెను. మరియు వాని సైన్యమెల్ల గూల్చి ఏడు రకముల మాయలను దాటి ఎనిమిదవ విధమైన మాయను ప్రయోగించి యా శంబరాసురుని జంపెను. ఆ మాయావతితో నెగిరి తండ్రి పురమునకు వచ్చెను. అంతఃపుర మందు వ్రాలి మాయావతితో గూడి యున్న యాతనిని జూచి కృష్ణ పత్నులు సంతోషించిరి. రుక్మిణియును ప్రీతితో నతనిపై చూపు నిలువ నిట్లనియె.
రుక్మిణి:
ధన్యాయాః ఖల్వయం పుత్రో వర్తతే నవయౌవనే
అస్మిన్వయసి పుత్రో మే ప్రద్యుమ్నో యది జీవతి
సభాగ్యా జననీ వత్స త్వయా కాపి విభూషితా
ఆథవా మాదృశః స్నేహో మమ యాదృగ్వపుశ్చ తే
హరే రపత్యం సువ్యక్తం భవాన్వత్స భవిష్యతి
ఏ ధన్యురాలి తనయుడో యీతడు నవ యౌవన మందున్నాడు. నా కుమారుడు ప్రద్యుమ్నుడే కనుక జీవించి యుండిన ఈ వయసులో నుండెడి వాడు. నాయనా! నీచేత సొంపు గన్న యా కన్నతల్లి యదృష్ట వంతురాలు. అది గాక నీ ప్రేమ నీ శరీరము నీ యాకారము సరిగా నన్ను పోలి యున్నది. స్పష్టముగ నీవు హరి కుమారుడవే అగుదువు అనేను.
వ్యాసులు:
ఏతస్మిన్నంతరే ప్రాప్తః సహకృష్ణేన నారదః
అంతఃపురవరాందేవీం రుక్మిణీం ప్రాహ హర్షితః
వ్యాసులు:
ఇంతలో కృష్ణునితో గూడ నారదుడేతెంచి అంతఃపు రాంగనల కెల్ల మిన్న యైన రుక్మిణీ దేవిని చూచి హర్షముతో.
నారదుడు:
ఏషతే తనయః సుభ్రు హత్వా శంబరమాగతః
హృతో యేనాభవత్పూర్వం పుత్రస్తే సూతి కాగృహాత్
ఇయం మాయావతీభార్యా తనయస్యాస్య తే సతీ
శంబరస్య న భార్యేయం శ్రూయతా మత్ర కారణమ్
మన్మథే తు గతే నాశం తదుద్భవ పరాయణా
శంబరం మోహయామాస మాయారూపేణ రుక్మిణి!
వివాహాద్యుపభోగేషు రూపం మాయామయం శుభమ్
దర్శయామాస దైత్యస్య తస్యేయం మదిరేక్షణా
కామోవతీర్ణః పుత్రస్తే తస్యేయం దయితా రతిః
విశంకా నాత్ర కర్తవ్యా స్నుషేయం తవ శోభనా
కల్యాణీ! మున్ను పురిటింట నుండి హరించిన యా శంబరాసురుని చంపి వచ్చిన యీతడు నీ బిడ్డడే. ఈ మాయావతి పతివ్రత. ఆ నీ కుమారుని భార్య. శంబరుని భార్య కాదు. దానికి కారణ మిదిగో వినుము. మన్మథుడు పోయిన తరువాత నాతని పునర్జన్మ కోరుచు మాయా రూపమున వివాహాది భోగము లందు శంబరుని ఈమె తబ్బిబ్బు సేసెను. మన్మథుని పత్నియే యీమె. ఆ దైత్యునికి మాయా రూపమును జూపినది. నీ కుమారుడు మన్మథుడు తిరిగి యవతరించి నాడు. ఆతని ప్రాణ ప్రియ రతియే యీమె. శంకింపకుము. ఈ పరమ కల్యాణి నీ కోడలు.
వ్యాసులు:
తతో హర్షసమావిష్టౌ రుక్మిణీకేశవౌ తదా
నగరీ చ సమస్తా సా సాధు సాధ్వి త్యభాషత
చిరం సష్టేన పుత్రేణ సంగతాంప్రేక్ష్యరుక్మిణీమ్
అవాప విస్మయం సర్వో ద్వారవత్యాం జనస్తదా
అన రుక్మిణీ కృష్ణులు ఆనంద భరితు లైరి. ద్వారకా నగర మెల్ల బాగు బాగని హర్షించినది. చిర కాలము క్రిందట బోయిన కుమారునితో కూడు కొనిన రుక్మిణిని చూచి ద్వారకా నగర జనమెల్ల విస్మయము జెందెను.
Summary of chapter 93 of the Brahma Mahā Purana is as follows:
The demon Naraka (Bhauma), who has conquered the three worlds and imprisoned sixteen thousand royal daughters, is confronted by Kṛṣṇa at Indra's behest. Satyabhāmā accompanies Kṛṣṇa into battle; Kṛṣṇa kills Naraka with his Sudarśana discus. The earrings of Aditi and the white umbrella of Indra are restored; the imprisoned princesses — unable to return to their families — are married by Kṛṣṇa as an act of protection and honor.