లోమహహర్షణుడు:
యత్తు సత్రాజితే కృష్ణో మణిరత్నం స్యమంతకమ్
దదా వహారయద్భభ్రు ర్భోజేన శతధన్వనా
సదా హి ప్రార్ధయామాస సత్యభామా మనిందితామ్
అక్రూరోంతరమన్విష్య న్మణిం చైవ స్యమంతకమ్
నత్రాజితం తతో హత్వా శతధన్వా మహాబలః
రాత్రౌ తం మణి మదాయ తతోక్రూరాయ దత్తవాన్
అక్రూరస్తు తదా విప్రా! రత్న మాదాయ చోత్తమమ్
సమయం కారయాం చక్రేనావేద్యోహం త్వయేత్యుత
లోమహహర్షణుడు:
శ్రీ కృష్ణుడు సత్రాజిత్తునకు మణి రత్నము నొసంగగా, దానిని బభ్రువు, (అక్రూరుడు) భోజ వంశీయు డగు శతధన్వునిచే హారింప జేసెను. అక్రూరుడ వకాశము కనిపెట్టి సత్యభామను స్యమంతక మడుగుచుసే యుందెను. శతధన్వుడు సత్రాజిత్తును సంహరించి రాత్రి వేళ మణింగొని వచ్చి అక్రూరున కొసంగెను. అక్రూరడది గొని యీ యంశ మెవ్వరికి నెన్నడును దెలుపనని వానిచే ప్రమాణము సేయించెను.
వయ మభ్యుత్ప్రవత్య్సామః కృష్ణేన త్వాం ప్రధర్షితమ్
మమ్యా ద్వారకా సర్వా వశే తిష్ఠ త్యద సంశయమ్
హతే పితరి దుఃఖార్తా సత్యభామా మనస్వినీ
ప్రయయౌ రథమారుహ్య నగరం వారణావతమ్
సత్యభామా తు తద్వృత్తం భోజస్య శతధన్వనః
భర్తుర్ని వేద్య దుఃఖార్తా పార్శ్వస్ధాశ్రూ ణ్యవర్తయత్
పాండవానాం చ దగ్దానాం హరిః కృత్వోదక క్రియామ్
కుల్యర్థే చాపి పాండూనాం న్యయోజయత సాత్యకిమ్
తతస్త్వరితమాగమ్య ద్వారకాం మధుసూదనః
పూర్వజం హలినం శ్రీమా నిదం వచనమబ్రవీత్
తండ్రి హతు డగుటకుం దపించి సత్యభామ రథమెక్కి వారణావత మునకేగెను. అక్కడ ధోజ వంశీయు డగు శతధన్వుని యీ వృత్తాంతమును భర్త కుందెలిపి కంటనీరు గ్రుక్కు కొనెను, లక్క యింట దగ్ధులైన పాండవుల కుదక క్రియసేసి కృష్ణుడు సాత్యకిని వారి యొక్క ఉత్తర క్రియ యందు నియోగించి వెంటనే ద్వారక కేతెంచి బలరామునితో నిట్లనెను.
శ్రీకృష్ణుడు:
హతః ప్రసేనః సింహేన సత్రాజి చ్చతధన్వనా
స్యమంతకస్తు మద్గామీ తస్య ప్రభు రహం విభో
తదారోహ రథం శీఘ్రం భోజం హత్వా మహారథమ్
స్యమంతకో మహాబాహో అస్మాకం స భవిష్యతి
శ్రీకృష్ణుడు:
సింహము ప్రసేనుని జంపినది, శతధ్వనుడు సత్రాజిత్తును జంపెను. స్యమంతకము నాకు జెంద వలసి యున్నది. కావున త్వరగా రథ మెక్కుము. అ భోజుం గూల్చి యమ్మణిం తెత్తుము, ఆ స్యమంతకము మనది కాగల దనియె.
లోమహర్షణుడు:
తతః ప్రవృత్తం యుధ్ధం చ తుములంభోజ కృష్ణయోః
శతధన్వా తతోక్రూరం సర్వతోదిశ మైక్షత
సంరబ్ధౌ తావుభౌ తత్ర దృష్ట్వా భోజజనార్ధనౌ
శక్తోపి శాపా ద్దార్దిక్య మక్రూరో నాన్వపద్యత
అపయానే తతో బుద్ధిం భోజ శ్చక్రే భయార్ధితః
యోజనానాం శతం సాగ్రం హృదయా ప్రత్యపద్యత
విఖ్యాతా హృదయా నామ శతయోజనగామినీ
భోజస్య వడవా విప్రా! యయా కృష్ణ మయోధయత్
క్షీణాం జవేన హృదయా మధ్వనః శతయోజనే
దృష్ట్వా రథస్య స్వాం వృద్ధిం శతధన్వాన మర్ధయత్
తత స్తస్యా హతాయాస్తు శ్రమా త్ఖేదాచ్చ భోద్విజాః
ఖముత్పేత రథ ప్రాణాః కృష్ణో రామ మథాబ్రవీత్
లోమహర్షణుడు:
శతధ్వనుడు కృష్ణునితో బోరుచు సక్రూరు డెక్కడు న్నాడని చూచు చుండెను. అక్రూరుడు శక్తుడయ్యు శాపభీతిచే యుద్ధమున తోడ్పడ డయ్యెను, అప్పుడు భోజుడు భయార్తుడై వెనుదిరుగ నిశ్చయించెను. “హృదయ” ఆను వాని గుఱ్ఱము నూరు యోజనములు మించి దూక గలదు. భోజుని స్వాధీనము ననున్నది. దానితోనే కృష్ణునితో దలపడెను. నూరు యోజనములు మేఱ యరిగి వేగముడు గుటయు, తన రథ వేగ మెచ్చుటయుం జూచి కృష్ణుడు శతధన్వుని నొప్పించెను. అ గుఱ్ఱము డిల్లవడి తుదకు ప్రాణములు గోల్పోవుట చూచి కృష్ణుడు బలరామునితో నిట్లనియొ.
శ్రీకృష్ణుడు:
తిష్ఠే హ త్వం మహాబాహో దృష్టదోషా హయా మయా
పద్భ్యాం గత్వా హరిష్యామి మణిరత్నం స్యమంతకమ్
శ్రీకృష్ణుడు:
ఓ శూరాగ్రేసర! నీవిక్కడే యుండుము. గుఱ్ఱము నష్ట మైనది. పాదచారినై వెళ్లి మణి రత్నమైన స్యమంతకము హరించ గలను. అని
పద్భ్యామేవ తతో గత్వా శతధన్వాన మచ్యుతః
మిథిలామభితో విప్రా జఘాన పరమాస్త్రవిత్
స్యమంతకం చ నాపశ్య ద్ధత్వా భోజం మహాబలమ్
నివృత్తం చాబ్రవీ త్కృష్ణం మణిం దేహీతి లాంగలీ
నాస్తీతి కృష్ణశ్చోవాచ తతో రామో రుషాన్వితః
ధిక్చబ్దపూర్వ మసకృ త్ర్పత్యు వాచ జనార్దనమ్
అటు పిమ్మట హరి పాదచారియై వెళ్ళి శతధన్వుని పైకేగి మిధిలా ప్రాంతమున వానిని సంహరించెను. కాని వాని దగ్గర స్యమంతకము కాన రాదయ్యె. మరలి వచ్చిన కృష్ణునిం గని హలాయుడు డగు బలరాముడు మణి నిమ్మని యడిగెను. కృష్ణుడు లేదని బదులు చెప్పెను. అంతట బలరాముడు రోషము గొని ఛీఛీ యని కేకలు వేసి కృష్ణునితో నిట్లు పలికెను.
భ్రాతృత్వా న్మర్షయామ్యేష స్వస్తి తేస్తు వ్రజా మ్యహమ్
కృత్యం నమే ద్వారకయా న త్వయా న చ వృష్ణిభిః
తమ్ముడ వని సైరించితిని. నీకు స్వస్తి యగుగాక. నాకు ద్వారకతో గాని, నీతో గాని, వృష్ణులతో గాని పనిలేదు, నేను వెళ్ళు చున్నాను. అని
ప్రవివేశ తతో రామో మిథిలా మరిమర్దనః
సర్వకామై రుప హృతైర్మిథిలే నాభిపూజితః
బలరాముడు మిథిలం బ్రవేశించెను. మిథి లాధిపతి సత్కార మంది, ఇష్టోప భోగియై యక్కడనే యుండెను.
ఏతస్మిన్నేవ కాలే తు బభ్రు ర్మతి మతాం వరః
నానారూపా న్ర్కతూన్సర్వా నాజహార నిరర్గలాన్
దీక్షామయం స కవచం రక్షార్థం ప్రవివేశ హ
స్యమంతకకృతే ప్రాజ్ఞో గాంధీపుత్రో మహాశయశాః
అథ రత్నాని దాన్యాని ధనాని వివిధాని చ
షష్టిం వర్షాణి ధర్మాత్మా యజ్ఞేష్వేవ న్యయోజయత్
అక్రూరయజ్ఞా ఇతి తే ఖ్యాతా స్తస్య మహాత్మనః
బహ్వన్న దక్షిణాః సర్వే సర్వకామప్రదాయినః
అథ దుర్యోధనో రాజా గత్వా స మిథిలాం ప్రభుః
గదాశిక్షాం తతో దివ్యాం బలదేవా దవాప్తవాన్
ఈ సమయము లోనే బుద్ధి శాలియగు బభ్రువు (అక్రూరుడు) పెక్కు విధములగు క్రతువుల నాచరించెను. గాంధీ పుత్రుడగు నా అక్రూరుడు దీక్షా మయమైన రక్షా కవచమ్ము దొడిగికొని స్యమంతకము కొఱకు యజ్ఞము చేసెను. అరువ దేండ్లు వివిధ రత్న ధనరాసుల నధ్వరము లందు వినియోగించెను. “అక్రూర యజ్ఞము” లను పేర నవి ప్రఖ్యాతి వవసినవి. అవి విపులాన్న దాన దక్షిణులు సర్వ కామ ప్రదములునై విలసిల్లెను. అంతట దర్యోధనుడు మిథిల కేగి బలరాముని కడ గదా యుధ్ధ శిక్షణమును వడసెను.
సంప్రసాద్య తతో రామో వృష్ణ్యంధక మహారథైః
ఆనీతో ద్వారకామేవ కృష్ణేన చ మహాత్మనా
అక్రూర శ్చాంధకైః సార్థ మాయాతః పురుషర్షభః
హత్వా సత్రాజితం సుప్తం సహబంధుం మహాబలః
జ్ఞాతి భేదభయా త్కృష్ణ స్తముపేక్షితవాం స్తదా
అపయాతే తదాక్రూరే నావర్ష త్పాకశాసనః
అనావృష్ట్యా తదా రాష్ట్ర మభవ ద్బహూదా కృశమ్
తతః ప్రసాదయామాసు రక్రూరంః కుకురాంధకాః
పునర్ద్వారవతీం ప్రాప్తే తస్మి న్దానపతౌ తతః
ప్రవవర్ష సహస్రాక్షః కక్షే జలనిధేస్తదా
కన్యాం చ వాసుదేవాయ స్వసారం శీలసం మతామ్
అక్రూరః ప్రదదౌ ధీమా న్ప్రీత్యర్థం మునిసత్తమాః
అథ విజ్ఞాయ యోగేన కృష్ణో బభ్రుగతం మణిం
సభామధ్య గతః ప్రాహ తమక్రూరం జనార్ధనః
మహారథులగు వృష్ణ్వంధకులతో పోయి కృష్ణుడు బలరాముని ద్వారకకు మరల దెచ్చెను. బంధువులతో గూడ నిద్రలో వున్న సత్రాజిత్తును జంపిన అక్రూరు డంధకులతో బాటు మరల ద్వారకకు వచ్చెను. అప్పుడు కృష్ణడు జ్ఞాతులతో బెడియు నను భయము వలన వాని నుపేక్షించెను. అప్పు డక్రూరుడు మిథిలకు పోగా నింద్రుడు వర్షించడయ్యె. అనావృష్ఠితో రాజ్యమనేక విధముల క్షిణించి పోయెను. అందు వలన కుకురాంధకులు అక్రూరునిం బ్రసన్నుం జేసికొని మరల ద్వారకకుం గొని వచ్చిరి. అంత దానవతి యగు నతడు ద్వారకకు రాగానే జలనిధి తీరమున వాసవుడు బాగుగా వర్షించెను. అక్రూరుడు శీలవతి యగు తన చెల్లెలిని వాసుదేవునకి ప్రీతి కలుగ నిచ్చెను. అంతట కృష్ణుడు యోగ శక్తిచే స్యమంతకమణి యక్రూరుని దగ్గర నున్నదని గమనించి సభా మధ్యమున నక్రూరుని గూర్చి యిట్లు పలికెను.
శ్రీకృష్ణుడు:
యత్త ద్రత్నం మణివరం తవ హస్తగతం విభో
తన్మే ప్రయద్ఛ మానార్హ మయి మానార్యకం కృథాః
షష్టి వర్షగతే కాలేయో రోషోభూ న్మమానఘ
స సంరూడ్యో సకృత్ర్సాప్త స్తతః కాలాత్యయో మహాన్
శ్రీకృష్ణుడు:
నీ చేజిక్కిన మణిని నాకిమ్ము. నా మర్యాద గాపాడుము. అఱువది యేండ్లు నాకీ మణి నిమిత్తముగ రోషము గల్గినది, కాల మెంతో గడిచి పోయినది.
సతతః కృష్ణ వచనాత్సర్వ సాత్త్వత సంసది
ప్రదదౌ తం మణిం బభ్రు రక్లేశేన మహామతిః
తతస్తమార్జవా త్ర్పాప్తం బభ్రోర్హస్తా దరిందమః
దదౌ హృష్ణమనాః కృష్ణ స్తం మణిం బభ్రవే పునః
స కృష్ణహస్తా త్సంప్రాస్తం మణిరత్నం స్యమంతకమ్
అబధ్య గాందినీపుత్రో విరరా జాంశుమానివః
అంతట నక్రూరుడు కృష్ణుని పలుకు లంబట్టి సర్వ యాదవ సమాజము నందు మణింగొని వచ్చి మనస్సు నొచ్చకుండ బుద్ది మంతుడు కావున దానిని హరి కిచ్చెను. అరిభీకరుడైన కృష్ణుడు బభ్రు హస్తము నుండి సూటిగ లభించిన యా మణిని చేకొని హర్షము గొని తిరిగి దాని నక్రూరునకే యిచ్చెను. గాంధినీ పుత్రడగు నక్రూరుడు క్భష్ణుని హస్తము నుండి లభించిన యా స్యమంతక మణి రత్నమును దాల్చి సూర్యుని వలె దేజరిల్లెను.
Summary of chapter 17 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
A detailed account of Jambūdvīpa, the central continent containing Bhāratavarṣa, is presented. The nine varṣas (regions) of Jambūdvīpa and its great mountains — Meru, Himavat, Hemakūṭa, Niṣadha, Nīla, Śveta, and Śṛṅgī — are described. The rivers, sacred centres, and cosmological significance of Mount Meru at the centre of the world are expounded.