బ్రహ్మ:
స్తుత్త్వైవం ముని శార్దూలాః ప్రణమ్యచ సనాతనమ్
వాసుదేవం జగన్నాధం సర్వకామ ఫలప్రదమ్
చింతావిష్టోమహీపాలః కుశానా స్తీర్యభూతలే
వస్త్రంచ తన్మనా భూత్వా సుష్వాప ధరణీతలే
కథం ప్రత్యక్ష మభ్యేతి దేవదేవో జనార్దనః
మమచార్తిహరో దేవః కదాసావితి చింతయన్
బ్రహ్మ:
ఓముని వరులార! అమ్మహీపతి యిట్లు జగన్నాధుని మ్రొక్కి వినుతించి యాలోచనలో మునిగి దర్బలు పరచుకొని యా మీద బట్ట పరచుకొని యా దేవునిపై మనసు నిల్పి నాబాధను హరించు దేవదేవు దెవుడు ప్రత్యక్ష మగునని యనుకొనుచు నేలపై నిదురించెను.
సుప్తస్య తస్య నృపతే ర్వాసుదేవో జగద్గురుః
అత్మానం దర్శయామాస శంఖచక్రగదాభృతమ్
స దదర్శ తు సప్రేమ దేవదేవం జగద్గురుమ్
శంఖ చక్ర ధరం దేవం గదాపాణిన మవ్యయం
శార్జ్గ బాణధరం దేవం జ్వలత్తేజోతి మండలమ్
యుగాంతాదిత్యవర్ణాభ మింద్రనీల నిభంహరిం
సుపర్ణాంసే తమాసీనం షోడశార్ధ భుజం శుభమ్
న చాస్మై ప్రాబ్రవీద్ధీరాః సాధురాజన్మహామతే
క్రతునానేన దివ్యేన తథా భక్త్యాచ శ్రద్దయా
తుష్టోస్మి తే మహీపాల వృథా కిమనుశోచపి
యదత్ర ప్రతిమారాజన్ జగత్పూజ్యా సనాతనీ
యథా సాప్రాప్యతే భూప తదుపాయం బ్రవీమితే
గతాయా మధ్య శర్వర్యాం నిర్మలే భాస్కరోదితే
సాగరస్య జలస్యాంతే నానాద్రుమ విభూషితే
జలం తథైవ వేలాయాం దృశ్యతే తత్రవై మహత్
లవణస్యోదధే రాజ స్తరంగైః సమభిప్లుతమ్
కూలాంతే హి మహావృక్షః స్థితః స్థలజలేషు చ
వేలాభిర్హన్య మానశ్చ న చాసౌ కంపతే ద్రుమః
పరశుమాదాయ హస్తేన ఊర్మేరంత స్తతో ప్రజ
ఏకాకీ విహరన్ రాజన్ సత్వం పశ్యసిపాదపమ్
ఈదృక్ చిహ్నం సమాలోక్య ఛేదయ త్వమశంకితః
ఛేద్యమానం తుతంవృక్షంతప్రాతరద్భుత దర్శనమ్
దృష్ట్వా తేనైవ సంచిత్య తతో భూపాల దర్శనాత్
కురుమాం ప్రతిమాం దివ్యం జహి చింతాంవిమోహినీమ్
జగద్గురువు ఆ నిదురించిన ఱేనికి స్వరూప దర్శన మను గ్రహించెను. శంఖ చక్ర గదా శార్జ్గములను దాల్చి చుట్టును నొక వెలుగు గుడిగట్ట యుగాంతా దిత్యప్రభతో గరుడుని మూపుపై నెక్కి యెనిమిది బాహువులతో దర్శన మిచ్చిన యా దేవ దేవుని ఱేడు దర్శించెను. అట్లు పొడ సూపిన యా స్వామి రాజుతో నిట్లనియె. ఈ క్రతువు చేత నీభక్తి శ్రధ్దల చేత నంతుష్టుడ నైతిని. ఊరక యేల పరితపింతువు. ఈ ప్రతిమ జగత్పూజ్యము. సనాతనము. (ఈనాటిది గాదు) ఇది నీవు వడయుట కుపాయము దెల్పెదను. ఈ రాత్రి గడచి సూర్యో దయము కాగానే సముద్ర జలముల కల్లంత చివర పలుచెట్ల గుబురులతో చెలియలి కట్ట నానుకొని సముద్ర జలము కెరటములతో గాన వచ్చును. అంత కవ్వలి గట్టున నొక చెట్టు నీళ్ళను నేలను గూడ దాకుచు నుండును. తరంగ ఘాతముననేని యది కంపింపదు. గొడ్డలి గొని నీవా నీటిలో నేకాకి వై యెట్టి జడుపు గొనక యట్టిటు దిఱిగి చూచి ఇట్టి చిహ్ణాలు గల యా తరువుంగని శంకింపక నఱకుము. ఆ అద్భుత వృక్షమును గని యాలోంచి దాన నా దివ్య మూర్తిని గావింపుము. నిన్ను తబ్బిబ్బు పరచునే మఱియే యాలోచన నైన సేయుకుము.
బ్రహ్మ:
ఏవముక్త్వా మహాభాగో జగామా దర్శనం హరిః
స చాపి స్వప్నమాలోక్య పరం విస్మయమాగతః
తాం నిశాం స సముద్వీక్ష్య స్థిత స్తద్గత మానసః
వ్యాహరన్వైష్ణవాన్ మంత్రాన్సూక్తంచైవ తదాత్మకమ్
ప్రగతాయాం రజన్యాం తు ఉత్థితో నాన్యమానసః
స స్నాత్వా సాగరే సమ్య గ్యథా వద్విధినా తతః
దత్వా దానం చ విప్రేభ్యో గ్రామాంశ్చ నగరాణిచ
కృత్వా పౌర్వాహ్నికం కర్మ జగామ స నృపోత్తమః
న చాశ్వో న పదాతిశ్చ న గజో న చ సారధిః
ఏకాకీ స మహావేలాం ప్రవివేశ మహీపతిః
తం దదర్శ మహావృక్షం తేజస్వంతం మహాద్రుమమ్
మహాతిగ మహారోహం పుణ్యం విపులమేవచ
మహోత్సేధం మహాకాయం ప్రసుస్తంచ జలాంతికే
సాంద్రమాంజిష్ఠ వర్ణాభం నామజాతివివర్జితమ్
నరనాథ స్తదా విప్రా ద్రుమం దృష్ట్వా ముదాన్వితః
పరశునా శాతయామాప నిశితేన దృఢేన చ
ద్వేధీకర్తు మనాస్తత్ర బభూవేంద్రసఖః సచ
నిరీక్షమాణే కాష్టే తు బభూవాద్భుత దర్శనమ్
విశ్వకర్మాచ విష్ణుశ్చ విప్రరూపధరావుభౌ
అజగ్మతు ర్మహాభాగౌ తదాతుల్యా గ్రజన్మానౌ
జ్వలమానౌ స్వతేజోభి ర్దివ్యస్రగనులేపనౌ
అధ తౌ తం సమాగమ్య నృపమింద్రసఖం తదా
తావూచతు ర్మహారాజ కిమత్ర త్వం కరిష్యసి
కిమర్ధంచ మహాబాహో శాతితశ్చ వనస్పతిః
అసహాయో మహా దుర్గే నిర్జనే వనే
మహాసింధుతటే చై వ కథం వై శాతితో ద్రుమః
బ్రహ్మ:
ఇట్లా హరి మహానుభావు డానతిచ్చి యంతర్ధాన మందెను. రాజు తన కలను గమనించి యెంతో యాశ్చర్య పడెను. ఆ ఱేయెల్ల యందే మనసు నిడి విష్ణు దేవతాకము లైన మంత్రములను విష్ణు సూక్తమును బారాయణము సేయుచు వేకువను లేచి యొండు తలంపు గొనక చక్కగ సాగర స్నానము సేసి గుఱ్ఱము లేదు వెంట కాలిబంటు లేడు ఏన్గు లేదు సారథియు లేడు ఒంటరిగ నా కడలి చెలియ కట్టం దిగి తేజో మయమైన పెను మొదలు గట్టిన సువిస్తృత మైన యా పుణ్య వృక్షమును గాంచెను. మిక్కిలి యెత్తుగ మిక్కిలి బోదెగల్గి జలము దరి నిద్రలో నున్న దట్టని మంజిష్టి వర్ణము (ఎఱుపు) గలిగిన యాతరు వేజాతిదో యేపేరిదో తెలియ రాదయ్యెను. నరనాథు డదిగని యానంద పడి పదునైన గొడ్డలిచే దానిని రెండు తునకలు గావింపనెంచి కొట్టెను. అది చూడ నాశ్చర్యము గొల్పు చుండెను. అంతట విశ్వకర్మయు (దేవశిల్పి) విష్ణువును విప్ర రూపము దాల్చి వచ్చిరి. ఇద్దరు నొకేరూపున దేజరిల్లు చుండిరి. దివ్య మాలలు ధరించిరి. దివ్య గంధము పూసికొనిరి. ఇంద్రునకు మిత్రుడైన యా రాజును గలిసి కొని మహారాజా! నీవిచట నేమొకో చేయు చున్నావు? ఈ మహా వృక్షము నెందులకు నఱికితివి? ఈ నిర్జనమైన కాఱడవిలో నీవు తోడు లేక మహోదధి యొడ్డున నొంటరిగ నీవెట్లి చెట్టును నఱకితివి?
బ్రహ్మ:
తయోః శ్రుత్వా వచో విప్రాః సతు రాజా ముదాన్వితః
బభాషే వచనం తాభ్యాం మృదులం మధురం తథా
దృష్ట్వా తౌ బ్రాహ్మణా తత్ర చంద్ర సూర్యావివాగతౌ
నమస్కృత్య జగన్నాథా వవాజ్ఞ్ముఖ మవస్థితః
బ్రహ్మ:
అయ్యిరువుర మాటవిని యారాజు ముదమంది చంద్ర సూర్యులట కరుదెంచిన యా బ్రహ్మాణుల నానంద భరితుండై గని నమస్కరించి యా జగన్నాథుల సన్నిధి దలవాంచి నిలువబడి యిట్లనియె.
రాజు:
దేవదేవ మనాద్యంత మనంతం జగతాం పతిమ్
ఆరాధయితుం ప్రతిమాం కరోమీతి మతిర్మమ
అహం స దేవదేవేన పరమేణ మహాత్మనా
స్వప్నాంతే చ సముద్దిష్టో భవద్భ్యాం శ్రావితం మయా
రాజు:
అది యంతము లేని యనంత మూర్తిని జగత్పతిని యారాధించుట కొక ప్రతిమను గావించుకొన వలెనని తలంపు గల్గినది కలలో నా దేవుని చేత నేను భావింప బడితిని. ఆ సంగతి మీకు తెల్పితిని.
బ్రహ్మ:
రాజ్ఞస్తు వచనం శ్రుత్వా దేవేంద్ర ప్రతిమస్య చ
ప్రహస్య తస్మై విశ్వేశ స్తుష్టో వచన మబ్రవీత్
బ్రహ్మ:
అనవిని విశ్వేశ్వరుండు హరి నవ్వి సంతుష్టిగొని యిట్లు పలికెను.
విష్ణువు:
సాధు సాధు మహీపాల యదేతన్మత ముత్తమమ్
సంసార సాగరే ఘోరే కదళీదళసన్నిభే
నిస్సారే దుఃఖబహుళే కామక్రోధ సమాకులే
ఇంద్రియావర్తకలిలే దుస్తరే రోమహర్షణే
నానావ్యాధిశతావర్తే జలబుద్బుదసన్నిభే
యతస్తే మతి రుత్పన్నా విష్ణోరారాధనాయవై
ధన్యస్త్వం నృపశార్దూల గుణైః సర్వైరలంకృతః
సప్రజా పృథివీ ధన్యా సశైల వనకాననా
సపురగ్రామనగరా చతుర్వర్నైరలంకృతా
యత్రత్వం నృపశార్దూల ప్రజాః పాలయితా ప్రభుః
ఏహ్యేహి సుమహాభాగ ద్రుమేస్మిన్సుఖశీతలే
అవాభ్యాం సహ తిష్ఠ త్వం కథాభి ర్దర్హసంశ్రితః
అయం మమ సహాయస్తు ఆగతః శిల్పినాం వరః
విశ్వకర్మసమః సాక్షాన్నిపుణః సర్వకర్మసు
మయోద్దిష్టాం తు ప్రతిమాం కరోత్యేష తటం త్యజ
విష్ణువు:
బాగుబాగు నృప! నీ తలంపు మేలైనది. అంతులేని యీ ఘోర సంసారము అరటియాకు వగిది నిస్సారము. బహు దుఃఖ నిలయము. కామ క్రోథాకులము. ఇంద్రియము లిందు సుడులు, నానా వ్యాధులు. నీటి బుడగ వంటిది. విష్ణు నారాధింప నీకు దలపు గలుగుటచే నీవు ధన్యుడవు. సద్గుణ భూషణుడవు. నీ ప్రజలు పురగ్రామ శైల కాననములతో నాల్గు వర్ణములతో నీ పాలించు పృథివియు ధన్యులు. రారమ్మ చల్లని యీ చెట్టుదరి నీవు మాతో గూడ మాట లాడుకొంద మిట వచ్చి నిలువుము. ఈతడు నాతోడ వచ్చినాడు మహాశిల్పి. విశ్వకర్మతో సాటి యైనవాడు. ఎల్ల పనుల నెంతో నేర్పరి. నేనుద్దేశించిన ప్రతిమ నీతడు చేయును. ఒడ్డు దిగుము.
బ్రహ్మ:
శ్రుత్వైవం వచనం తస్యతదా రాజా ద్విజన్మనః
సాగరస్య తటం త్యక్త్వా గత్వా తస్య సమీపతః
తస్థౌ స నృపతి శ్రేష్ఠో వృక్షచ్ఛాయే సుశీతలే
తతస్తస్మై న విశ్వాత్మా దదా వాజ్ఞాం ద్విజాకృతిః
శిల్పిముఖ్యాయ విప్రేంద్రా కురుష్వప్రతిమా ఇతి
బ్రహ్మ:
అన నా ద్విజుని మాట విని సముద్రము నొడ్డు నుండి జని యా చెట్టు నీడను నిలిచెను. ఆ వ్విశ్వరూపుడు విష్ణువా శిల్పి వరునకు బ్రతిమ చెక్కుమని యానతిచ్చెను.
కృష్ణరూనం పరం శాంతం పద్మపత్రాయతేక్షణమ్
శ్రీవత్సకౌస్తుభధరం శంఖ చక్రగదాధరమ్
గౌరాంగం క్షీరవర్ణాభం ద్వితీయం స్వస్తికాంకితమ్
లాంగలాస్త్రధరం దేవ మనంతాఖ్యమ్ మహాబలమ్
దేవదానవగంధర్వ యక్షవిద్యాధరోరగైః
న విజ్ఞాతో హి తస్యాంత స్తేనానంత ఇతి స్మృతః
భగినీం వాసుదేవస్య రుక్మవర్ణాం సుశోభనామ్
తృతీయాం వై సుభద్రాంచ సర్వలక్షణలక్షితామ్
తామర ఱేకులట్టి కన్నులు ఉరమున శ్రీవత్స కౌస్తుభములు హస్తము లందు శంఖ చక్ర గదా శార్జ్గములు గలిగిన దొకటి అచ్చము పాలవలె తెల్లనై స్వస్తిక ముద్ర నాగలి చేతను పూనిన అనంత మూర్తి యింకోకటి వాసుదేవుని చెల్లెలు బంగారు చాయగల పరమ శోభనము సర్వ లక్షణ లక్షితము నగు సుభద్రా మూర్తి మూడవది. ఇట్లు మూడు ప్రతిమలు గావింపు మనెను.
బ్రహ్మ:
శ్రుత్వైతద్వచనం తస్య విశ్వకర్మాసుకర్మకృత్
తత్ క్షణాత్కారయామాస ప్రతిమాః సుభలక్షణాః
ప్రథమం శుక్లవర్ణాభం శారదేందుసమప్రభమ్
ఆరక్తాక్షం మహాకాయం స్ఫటావికటమస్తకమ్
నీలాంబరధరం చోగ్రం బలం బలమదోద్ధతం
కుండలైకధరం దివ్యం గదాముసలధారిణమ్
ద్వితీయం పుండరీకాక్షం నీలజీమూతసన్నిభమ్
అతసీపుష్పసంకాశం పద్మపత్రాయతేక్షణమ్
పీతవాన స మత్యుగ్రం శుభం శ్రీవత్సలక్షణమ్
చక్రపూర్ణకరం దివ్యం సర్వపాపహరం హరిమ్
తృతీయాం స్వర్ణవర్ణాభాం పద్మపత్రాయతేక్షణామ్
విచిత్రవస్త్రసంచ్ఛన్నాం హారకేయూరభూషితామ్
విచిత్రాభరణోపేతాం రత్నహారావలంబితామ్
పీనోన్నతకుచాం రమ్యాం విశ్వకర్మా వినిర్మమే
సతు రాజాద్భుతం దృష్ట్వా క్షణేనై కేన నిర్మితాః
దివ్యవస్త్రయుగచ్చన్నా నానారత్నై రలంకృతాః
సర్వలక్షణసంపన్నాః ప్రతిమాః సుమనోహరాః
విస్మయం పరమం గత్వా ఇదం వచన మబ్రవీత్
విశ్వకర్మ యామాట విని యా క్షణమున నాశుభ లక్షణములతో ముమ్మూర్తులను గావించెను. ఒకటి శరత్కాల చంద్రబింబ మట్లచ్చము తెల్లది. ఎఱ్ఱని కనులు పెద్ద శరీరము పాము పడగం బోలు మస్తకము నల్లని వలువయు గల బలరామ మూర్తి. ఒక్కటే కుండలము, దివ్య గదా ముసలాయుధము బూనినది. తెల్ల దామరల బోలు కన్నులు. నల్లని మేఘము అతసీ కుసుమము నట్లు నిగనిగ లాడు నీల తనువు, పీతాంబరము నురమున శ్రీవత్స లక్షణము చేతం జక్రాయుధము గల్గిన సర్వ పాపహరమైన శ్రీహరి మూర్తి రెండవది. మూడవది. స్వర్ణఛ్చాయ శరీరము రత్నహార కేయూరాది విచిత్ర భూషణములు కమల నయనములు విచిత్ర వస్త్రములతో నొప్పి పీనోన్న స్తనియైన సుభద్ర మూర్తి. ఆ రాజా యద్భుత శిల్పముంగని క్షణములో నిర్మించిన యా దివ్య మూర్తుల నీక్షించి మిక్కిలి వింతవడి యిట్లనియె.
ఇంద్రద్యుమ్నుడు:
కిం దేవౌ సమనుప్రాప్తౌ ద్విజరూపధరావుభౌ
ఉభౌ చాద్భుత కర్మాణౌ దేవవృత్తా వమానుషౌ
దేవౌ వా మానుషౌవాపి యక్షవిద్యాధరౌ యువామ్
కింను బ్రహ్మహృషీ కేశౌ కిం వసూ కిముతాశ్వినౌ
నవేద్మి సత్యసద్బావౌ మాయారూపేణ సంస్థితౌ
యువాం గతోస్మి శరణ మాత్మా మే తుప్రకాశ్యతామ్
ఇంద్రద్యుమ్నుడు:
ద్విజమూర్తు లందాల్చి యేతెంచిన మీరిద్దరు దేవతలు అద్భుత కర్ములు దేవ వర్తనులు అమానుష కర్ములునగు మీరు వేల్పులా యక్షులా విద్యాధరులా బ్రహ్మయు విష్ణువునా? వసువులా! కాక అశ్వినీ కుమారులా! ఎఱుగ నైతిని మాయా రూపమున నున్నారు మిమ్ము శరణ పోందు చున్నాము. మీ స్వరూపమును నాకు వెలువరింపుడు. అని అనియె.
Summary of chapter 50 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
During his meditation near the sacred Vaṭa, Mārkaṇḍeya is caught up in the great waters of cosmic dissolution (pralaya). The entire universe is dissolved into the primordial ocean; all beings, Devas, and mountains are swallowed by the flood. The sage wanders alone in the terrifying darkness of the pralaya waters, bewildered and exhausted, until he sights a miraculous light.