28 - కోణాదిత్యమాహాత్మ్యమ్‌

బ్రహ్మ:

తత్రాస్తే భారతే వర్షే దక్షిణోదధిసంస్థితః

ఓఢ్రదేశ ఇతి ఖ్యాతః స్వర్గమోక్షప్రదాయకః

సముద్రా దుత్తరం తావ ద్యావ ద్విరజమండలమ్‌

దేశోసౌ పుణ్యశీలానాం గుణౖః సర్వై రలంకృతః

తత్ర దేశ ప్రసూతా యే బ్రాహ్మణాః సంయతేంద్రియాః

తపః స్వాధ్యాయనిరతా వంద్యాః పూజ్యాశ్చ తే సదా

శ్రాద్ధే దానే వివాహేచ యజ్ఞేవా చార్యకర్మణి

ప్రశస్తాః సర్వకార్యేషు తత్ర దేశోద్భవా ద్విజాః

షట్కర్మనిరతాస్తత్ర బ్రాహ్మణా వేదపారగాః

ఇతిహాసవిదశైవ పురాణార్థవిశారదాః

సర్వశాస్త్రార్థకుశలా యజ్వానో వీతమత్సరాః

అగ్నిహోత్రరతాః కేచిత్‌ కేచిత్‌ స్మార్తాగ్నితత్పరాః

పుత్రదారధనైర్యుక్తా దాతారః సత్యవాదినః

నివసంత్యుత్కలే పుణ్యే యజ్ఞోత్పవవిభూషితే

ఇతరేపి త్రయో వర్ణాః క్షత్రియాధ్యా స్సుసంయతాః

స్వకర్మనిరతాః శాంతా స్తత్ర తిష్ఠంతి ధార్మికాః

కోణాదిత్య ఇతిఖ్యాత స్తస్మిన్‌ దేశే వ్యవస్థితః

యం దృష్ట్యా భాస్కరం మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతేః

 బ్రహ్మ:

దక్షిణ సముద్ర తీర మందోఢ్ర దేశము గలదు. అది స్వర్గ మోక్ష ప్రదము. సముద్రము నకుత్తరముగా విరజ మండలము సరిహద్దుల దాక అది యున్నది. అచటి బ్రాహ్మణులు జితేంద్రియులు. తపస్స్వాధ్యాయ నిరతులు. వంద్యులు పూజ్యులును. యజ్ఞదాన వివాహాది శుభ కర్మము లందు శ్రాద్ధాదుల యందు వీరు చాలా ప్రశస్తులు. షట్కర్మ నిరతులు. ఇతిహాస పురాణార్థ విశారదులు. సర్వ శాస్త్రార్థ సమర్థులు, మాత్సర్య హీనులు, పుత్ర దారధన క్షేత్ర సంపన్నులు, సత్య వచనులు, దాతలు. క్షత్రియాది వర్ణముల వారును స్వధర్మ నిరతులు ధార్మికులు శాంతులు. ఆ దేశ మందు కోణాదిత్యుడను పేర సూర్య భగవానుడు వెలసి యున్నాడు. తద్దర్శనము సర్వపాప నికృంతనము.

మునులు:

శ్రోతు మిచ్ఛామ తద్భ్రూహి క్షేత్రం సూర్యస్య సాంప్రతమ్‌

తస్మిన్‌ దేశే సురశ్రేష్ఠ యత్రాస్తే స దివాకరః

బ్రహ్మ:

లవణ స్యోదధే స్తీరే పవిత్రే సుమనోహరే

సర్వత్ర వాలుకాకీర్ణే దేశే సర్వగుణాన్వితే

చంపకాశోక వకులైః కరవీరైః సపాటలైః

పున్నాగైః కర్ణికారైశ్చ వకులై ర్నాగకేసరైః

తగరై ర్థవ బాణౖశ్చ అతిముక్తైః సకుబ్జకైః

మాలతీ కుంద పుష్పైశ్చ తథాన్యై ర్మల్లికాదిభిః

కేతకీవనషండైశ్చ సర్వర్తు కుసుమోజ్వలైః

కదంభై ర్లకుచైః శాలైః పనసై ర్దేవడారుభిః

సరలైః ర్ముచుకుందైశ్చ చందనైశ్చ సితేతరైః

అశ్వత్థైః సప్తపర్ణైశ్చ ఆమ్రైరామ్రాతకైస్తథా

తాలైః పూగఫలైశ్చైవ నారికేలైః కపిత్థకైః

అన్యైశ్చ వివిధై ర్వృక్షైః సర్వతః సమలంకృతమ్‌

క్షేత్రం తత్ర రవేః పుణ్య మాస్తే జగతి విశ్రుతమ్‌

 సమంతా ద్యోజనం సాగ్రం భుక్తి ముక్తి ఫల్రపదమ్‌

అస్తే తత్ర స్వయందేవః సహస్రాంశుః దివాకరః

కోణాదిత్య ఇతి ఖ్యాతో భుక్తిముక్తి ఫలప్రదః

మునులు:

ఆ దేశమందు కోణాదిత్యుడను పేర సూర్య భగవానుడు వెలసి యున్నాడు. లవణ సముద్రోత్తర తీరము వాలుకాకీర్ణము. మనోహరము సర్వ పుష్ప ఫల భరిత తరు సుందరము రమారమి సార్థ యోజన విశాలముగా నచట సూర్య క్షేత్రము భక్తి ముక్తి ప్రదము. అది నానా తరులతా సుందరము.

మాఘే మాసే సితే పక్షే సప్తమ్యాం సంయతేంద్రియః

క్మతోపవాసో యత్రైత్య స్నాత్వా తు మకరాలయే

కృతశౌచో విశుద్ధాత్మా స్మరన్‌ దేవం దివాకరమ్‌

సాగరే విధివతే స్నాత్వా శర్వర్యంతే సమాహితః

దేవా నృషీ న్మనుష్యాంశ్చ పితౄన్‌ సంతర్ప్య చ ద్విజాః

ఉత్తీర్య వాససీ ధౌతే పరిదాయ సునిర్మతే

ఆచమ్య ప్రయతో భూత్వా తీరే తస్య మహోదధేః

ఉపవి శ్యోదయేకాలే ప్రాఙ్ముఖ స్సవితు స్తథా

విలిఖ్య పద్మం మేధావీ రక్తచందనవారిణా

అష్టపత్రం కేసరాఢ్యం వర్తులం చోర్థ్వకర్ణికమ్‌

తిలతండులతోయంచ రక్త చందనసంయుతమ్‌

రక్తపుష్పం సదర్భంచ ప్రక్షిపే త్తామ్రభాజనే

తామ్రాభావేర్క పత్రస్య పుటే కృత్వా తిలాదికమ్‌

పిధాయ తన్ముని శ్రేష్ఠాః పాత్రం పాత్రేణ విన్యసేత్‌

కరన్యాసాంగవిన్యాసం కృత్వాంగైః హృదయాదిభిః

ఆత్మానం భాస్కరం ధ్యాత్వా సమ్యక్‌ శ్రద్ధాసమన్వితః

మధ్యే చాగ్నిదలే ధీమాన్‌ నైఋతే శ్వసనే దలే

కామారిగోచరే చై ప పునర్మధ్యే చ పూజయేత్‌

ప్రభూతం విమలం సార మారాధ్యం పరమం సుఖమ్‌

సంపూజ్య పద్మ మావాహ్య గగనా త్తత్ర భాస్కరమ్‌

కర్ణికోపరి సంస్థాప్య తతో ముద్రాం ప్రదర్శయేత్‌

కృత్వా స్నానాదికం సర్వం ధ్యాత్వా తం సుసమాహితః

సితపద్మోపరి రవిం తేజోబింబే వ్యవస్థితమ్‌

పింగాక్షం ద్విభుజం రక్తం పద్మపత్రారుణాంబరమ్‌

సర్వలక్షణ సంయుక్తం సర్వాభరణభూషితమ్‌

నురూపం వరదం శాంతం ప్రభామండల మండితమ్‌

ఉద్యంతం భాస్కరం దృష్ట్యా సాంద్రసిందూరసన్నిభమ్‌

తతస్త త్పాత్ర మాదాయ జానుభ్యాం ధరణీంగతః

కృత్వా శిరసి తత్పాత్ర మేకచిత్తస్తు వాగ్యతః

త్య్రక్షరేణతు మంత్రేణ సూర్యా యార్ఘ్యం నివేదయేత్‌

అదీక్షితస్తు తస్యైవ నామ్నై వార్ఘ్యం ప్రయచ్ఛతి

శ్రద్ధయా భావయుక్తేన భక్తి గ్రాహ్యో రవి ర్యతః

అగ్నినిర్‌ ఋతి వాయ్వేశ మధ్య పూర్వాదిదిక్షుచ

హృచ్ఛిరశ్చ శిఖావర్మ నేత్రాణ్యస్త్రంచ పూజయేత్‌

దత్వార్ఘ్యం గంధ ధూపంచ దీపం నైవేద్యమేవచ

జప్త్వా స్తుత్వా నమస్కృత్వా ముద్రాం బధ్వా విసర్జయేత్‌

యే వార్ఘ్యం సంప్రయచ్ఛంతి సూర్యాయ నియేతేంద్రియాః

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాశ్చ సంయతాః

భక్తిభావేన సతతం విశుద్ధేనాంతరాత్మనా

తే భుక్త్వాభిమతాన్‌ కామాన్‌ ప్రాప్నువంతి పరాం గతిమ్‌

త్రైలోక్యదీవకం దేవం భాస్కరం గగనే చరమ్‌

యే సంశ్రయంతి మనుజా స్తే స్యుః సుఖస్య భాజనం

యావన్నదీయతే చార్ఘ్యం భాస్కరాయ యథోతితమ్‌

తాప న్నపూజయే ద్విష్ణుం శంకరం వాసురేశ్వరమ్‌

తస్మాత్‌ ప్రయత్న మాస్థాయ దద్యా దర్ఘ్యం దినే దినే

ఆదిత్యాయ శుచిర్భూత్వా పుష్పై ర్గంఢై ర్మనోరమైః

ఏవం దదాతి యశ్చార్ఘ్యం సప్తమ్యాం సుసమాహితః

ఆదిత్యాయ శుచిః స్నాతః స లభే దీప్సితం ఫలమ్‌

మాఘమాస శుక్ల సప్తమి నాడు వేకువ నక్కడి సముద్రమున స్నానము చేసి దేవ ఋషి పితృ తర్పణము చేసి ధౌత వస్త్రములు దాల్చి యాచమించి యమ్మహో దధియం దుదయ వేళ నాసీనుడై రక్త చందన జలముల సూర్యునకు ఎనిమిదిరే కులు గల కేసరా వృతమైన వర్తులాకార పద్మమును (అష్టదళ పద్మమును) గర్ణికతో గూడ లిఖించి తిల తండుల తోయముల రక్త చందనముతో గూర్చి రక్తపు ష్పములు దర్భలు రాగి పాత్ర యందుంచి యాదానిని మరొక పాత్రతో మూసి అంగన్యాస కర న్యాసములు చేసి తనను భాస్కరునిగా ధ్యానించి శ్రద్ధతో నడుమ నగ్నిదళ మందు నైఋతి వాయవ్య ఈశాన్య స్థాన మధ్య యందు పూజచేయ వలెను. (కేసరము = కింజల్కము) ఆ పద్మమును నారాదించి యందు గగనము నుండి భాస్కరుని నాహ్వానించి తామర పువ్వు దుద్దు మీద ప్రతిష్టించి ముద్రా ప్రదర్శనము చేసి రెండు భుజములు తేనె రంగు కన్నులు గల వానినిగా నరుణ పద్మా రుణాంబర ధారిగా సర్వాభరణ భూషితునిగా సర్వ లక్షణ లక్షితునిగా శాంత మూర్తిగా వరద ముద్రా ధారిగా ప్రభామండల మండితునిగా సాంద్ర సిందూర వర్ణునిగ నుదయ భాస్కరుని ధ్యానించి మోకాళ్ళపై గూర్చుండి యా పాత్రము నెత్తి శిరంబున దాల్చి త్య్రక్షర మంత్రముతో సూర్యునకర్ఘ్య మీయ వలెను. సూర్య మంత్ర దీక్షలేని వాడు. సూర్య నామముతోనే యర్ఘ్య మీయ నగును. ఆగ్నేయ, నైఋతి, వాయు, ఈశ, మధ్య పూర్వాది దిశలందు హృదయ, శిర శ్శిఖా, కవచ, నేత్ర అస్త్రముల పూజింప వలెను. ఆర్ఘ్య మర్పించి గంధ ధూప దీప నైవేద్యాదు లొసంగి జపము జేసి నమస్కరించి స్తుతించి ముద్రా బంధముతో విసర్జనము చెప్ప వలెను. భక్తితో నిట్లర్కునకర్ఘ్య మిచ్చిన పుణ్యులు భుక్తి ముక్తులను బడ యుదురు. త్రైలోక్య దీపసు డైన భాస్కర దేవుని గగన సంచారి నెవ్వరా శ్రయింతు రాజనులు సుఖ భాజనులు. భాస్కరున కర్ఘ్య మీయ కుండ విష్ణు శంకల సురేశ్వర నర్చింప గూడదు.

రోగా ద్విముచ్యతే రోగీ విత్తార్థీ లభతే ధనమ్‌

విద్యాం ప్రాప్నోతి విద్యార్థీ నుతార్థీ పుత్రవాన్‌ భవేత్‌

యం యం కామ మభిధ్యాయన్‌ సూర్యా యార్ఘ్యం ప్రయచ్ఛతి

తస్య తస్య ఫక్షేం సమ్యక్‌ ప్రాప్నోతి పురుషః సుధీః

స్నాత్వావై సాగరే దత్వా సూర్యా యార్ఘ్యం ప్రణమ్యచ

నరోవా యది నారీవా సర్వకామఫలం లఖేత్‌

తతః సూర్యాలయం గచ్ఛేత్‌ పుష్ప మాదాయ వాగ్యతః

ప్రవిశ్చ పూజయే ద్భానుం కృత్వా తు త్రిః ప్రదక్షిణమ్‌

పూజయేత్‌ పరయా భక్త్యా కోణార్కం మునిసత్తమాః

గంధై పుష్పైస్తధా దీసైర్థూపై ర్నైవేద్య కైరపి

దండవత్‌ ప్రణిపాతైశ్చ జయశబ్దై స్తథా స్తవైః

ఏవం సంపూజ్య తం దేవం సహస్రాంశుం జగత్పతిం

దశానా మశ్వమేధానాం ఫలం ప్రాప్నోతి మానవః

సర్వపాపవినిర్ముక్తొ యువా దివ్యవపుర్నరః

సప్తావరాన్‌ సప్తవరాన్‌ వంశా నుద్ధృత్య భోద్విజాః

విమానే నార్కవర్ణేన కామగేన సువర్చసా

ఉపగీయమానో గంధర్వైః సూర్యలోకం సగచ్ఛతి

భుక్త్వా తత్ర వరాన్‌ భౌగాన్‌ యావ దాభూతనంప్లవమ్‌

పుణ్యక్షయా దిహాయాతః ప్రవరే యోగినాం కులే

చతుర్వేదో భవే ద్విప్రః స్వధర్మ నిరతః శుచిః

యోగం వివస్వతః ప్రాప్య తతో మోక్ష మవాప్నుయాత్‌

చైత్రే మాసి సితే పక్షే యాత్రాం మదనభంజికామ్‌

యః కరోతి నర స్తత్ర పూర్వోక్తమ్‌ స ఫలం లభేత్‌

శయనోత్థాపనే భానోః సంక్రాంత్యాం విషువే యనే

వారే రవే స్థిథౌ చైవ సర్వకాలేథవా ద్విజాః

యే త్రత యాత్రాం కుర్వంతి శ్రద్ధయా సంయతేంద్రియాః

విమానే నార్క వర్ణేన సూర్యలోకం వ్రజంతి తే

అస్తే తత్ర మహాదేవః స్తీరే నదనదీపతేః

రామేశ్వర ఇతి ఖ్యాతః సర్వకామ ఫలప్రదః

యే తం పశ్యంతి కామారిం స్నాత్వా సమ్య జ్మహోదథౌ

గంధైః పుష్పైస్తథా థూపై ర్థీపై ర్నై వేద్యకై ర్వరైః

ప్రణిపాతై స్తథా స్తోత్రై ర్గీతై ర్వాద్యై ర్మనోహరైః

రాజసూయఫలం సమ్య గ్వాజిమేధఫలం తథా

ప్రాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం తథా

కామగేన విమానేన కింకిణీజాలమాలినా

ఉపగీయమానా గంధర్వైః శివలోకం వ్రజంతి తే

ఆభూతసంప్లవమ్‌ యావ ద్భుక్త్వా భోగా న్మనోరమాన్‌

పుణ్యక్షయా దిహాగత్య చాతుర్వేదా భవంతి తే

శాంకరం యోగ మాస్థాయ తతో మోక్షం వ్రజంతి తే

యస్తత్ర సవితుః క్షేత్రే ప్రాణాం స్త్యజతి మానవః

స సూర్యలోక మాస్ధాయ దేవవ న్మోదతే దివి

పున ర్మానుషతాం ప్రాప్య రాజా భవతి థార్మికః

యోగం రవేః సమాసాద్య తతో మోక్ష మవావ్ను యాత్‌

ఏవం మయా మునిశ్రేష్ఠాః ప్రోక్తం క్షేత్రంసుదుర్లభమ్‌

కోణార్క స్యోదధేస్తీరే భుక్తిముక్తిఫలప్రదమ్‌

రోగ విముక్తి, ధన సంపత్తి, విద్యాసిద్ధి, పుత్ర పౌత్రా భివృద్ధి యన్నియు దీన గల్గును. చేతం బూవులు ధరించి సూర్యాలయమున కేగ వలయును. మూడు మార్లు ప్రదక్షిణము చేయ వలెను. ఆ మీద నా దేవుని పూజింప వలెను. దాన దశాశ్వమేధ ఫలము కల్గును, తుదకు సూర్యుడట్లు వెలుగు విమానము నెక్కి గంధర్వులచే నుపగీయ మానుడయి సూర్య భక్తుడు సూర్య లోక మందును, తిఱిగి వచ్చి యోగి కులమందు దయించి భానుయోగము నంది ముక్తి నందును. చైత్రశుక్ల మందు మదన భంజికయను (కామ దమనము) యాత్రను జేసియు నీ ఫలమందును. శయనో త్థానైకా దశీతిధు లందు భాను సంక్రమణ మందు నీ యాత్ర చేసిన వారు విమాన యానులై భానులోక మరిగెదరు. ఆ సముద్ర తీరమున రామేశ్వరుడను పేర శివు డున్నాడు. అయన నర్చించిన వారికి రాజ సూయ ఫల మొదవును. కామగమైన విమానమున నీ మున్ను చెప్పిన ప్రభావముతో శివపురి కేగును. ఈ రవి క్షేత్రమున మేను బాసిన జీవి సూర్య లోక మంది మానవ జన్మమెత్తి ధార్మిక ప్రభువై సూర్య సారూప్య మంది మోక్ష మందును. ఇది కోణార్క స్వామి మహిమ.