లోమహర్షణుడు:
శ్రుత్వైవం వై మునిశ్రేష్ఠాః కథాం పాపప్రణాశినీం
రుద్రకోపోద్భవాం పుణ్యాం వ్యాసస్య వదతో ద్విజాః
పార్వత్యాశ్చ తధా రోషం క్రోధం శంభోశ్చ దుస్సహం
ఉత్పత్తిం వీరభద్రస్య భద్రకాల్యాశ్చ సంభవమ్
దక్షయజ్ఞ వినాశం చ వీర్యం శంభో స్తథాద్బుతం
పునః ప్రసాదం దేవస్య దక్షస్య సుమహాత్మనః
యజ్ఞ భాగం చ రుద్రస్య దక్షస్య చ ఫలం క్రతోః
దృష్ట్వా బభూవు స్సం ప్రీతా విస్మితాశ్చ పునః పునః
పప్రచ్చుశ్చ పున ర్వ్యాసం కధాశేషం తధా ద్విజాః
పృష్టః ప్రోవాచ తా న్వ్యసః క్షేత్ర మేకామ్రకం పునః
లోమహర్షణుడు:
ముని వరులార! వ్యాసులు తెలుపు చుండ రుద్రుడు కోపించిన మీదట జరిగిన పుణ్య కథను పార్వతి రోషము శంభుని క్రోధము వీరభద్రుని యెక్కయు, భద్రకాలి యొక్క అవతారము దక్ష యజ్ఞ ధ్వంసము శంకరుని ఆద్భుత విక్రమము తిరిగి యాయన మహాత్ముడగు దక్షునికి ప్రసన్నుడగుట రుద్రునకు యజ్ఞ భాగ మిచ్చుట దక్షునికి క్రతుఫలము లభించుట చూచి సంప్రీతులు విస్మితులునై ఋషులు వ్యాసుని తక్కిన కథను దెలుపుమని యడిగిరి. వ్యాస భగవానుడు ఏకామ్ర క్షేత్రమును గురించి వారడుగ నిట్లు తెలుప దొడంగెను.
వ్యాసుడు:
బ్రహ్మప్రోక్తాం కథాం పుణ్యాం శ్రుత్వా తు ఋషిపుంగవాః
ప్రశశంసు స్తదా హృష్టా రోమాంచితతనూరుహాః
వ్యాసుడు:
బ్రహ్మ తెలిపిన పుణ్యకథ నాలించి ముని పుంగవులు యొడలు పులకరింప ఆనంద భరితులై వ్యాసులను కథను గొని యాడిరి.
ఋషులు:
అహో దేవస్య మాహాత్మ్యం త్వయా శంభోః ప్రకీర్తితమ్
దక్షస్య చ సుర శ్రేష్ఠ యజ్ఞ విధ్వంసనం తధా
ఏకామ్రకం క్షేత్రవరం వక్తు మర్హసి సాంప్రతమ్
శ్రోతు మిచ్చామహే బ్రహ్మ న్సరం కౌతూహలం హినః
ఋషులు:
ఆహా! శంభు దేవుని మహిమ నీవు చక్కగ దెల్పితివి. ఇపుడే కామ్ర క్షేత్రమును గురించి తెలుపుము. విన వలెనని మిక్కిలి కుతూహలముతో నున్నా మనిరి,
వ్యాసుడు:
తేషాం తద్వచనం శ్రుత్వా లోకనాథ శ్చతుర్ముఖః
ప్రోవాచ శంభోస్తత్క్షేత్రంభూత లేదుష్కృతచ్చిదమ్
వ్యాసుడు:
వారి వచనము విని లోకేశ్వరుడు చతుర్ముఖుడు భూతలమున పాపహర మగు నా శివ క్షేత్రముం గూర్చి మునుల కిట్లు తెలిపెను.
బ్రహ్మ:
శృణుధ్వం ముని శార్దూలాః! ప్రవక్ష్యామి సమాసతః
సర్వపాపహరం పుణ్యం క్షేత్రం పరమదుర్లభమ్
లింగకోటిసమాయుక్తం వారాణసి సమం శుభమ్
ఏకామ్ర మితి విఖ్యాతం తీర్దాష్టకసమన్వితమ్
ఏకామ్రవృక్ష స్తత్రాసీ త్పురా కల్పే ద్విజోత్తమాః
నామ్నా తస్యైవ తత్క్షేత్రం మేకామ్రక మితి శ్రుతమ్
హృష్టపుష్టజనాకీర్ణం నరనారీసమన్వితమ్
విద్వాంస గణభూయిష్ఠం ధనధాన్యాదిసంయుతమ్
గృహగోపురసంబాధం త్రికచాద్వారభూషితమ్
నానావణిక్సమాకీర్ణం నానారత్నోపశోభితమ్
పురాట్టాలకసంయుక్తం రథిభిః సమలంకృతం
రాజహాంసనిభైః శుభ్రైః ప్రాసాదై రుపశోభితమ్
మార్గగద్వార సంయుక్తం సితప్రాకారశోభితమ్
రక్షితం శస్త్రసంఘైశ్చ పరిఖాభి రలంకృతమ్
సిత రక్తై స్తథా పీతైః కృష్ణశ్యామైశ్చ వర్ణకైః
సమీరణోద్దతాభిశ్చ పతాకాభి రలంకృతమ్
నిత్యోత్సవ ప్రముదితం నానావాదిత్రనిస్యనైః
వీణావేణు మృదంగైశ్చక్షేపణీభి రలంకృతమ్
దేవతాయతనై ర్దివ్యైః ప్రాకారోద్యానమండితైః
పూజా విచిత్రరచితైః సర్వత్రసమలంకృతమ్
స్త్రియః వ్రముదితాస్తత్ర దృశ్యంతే తనుమధ్యమాః
హారై రలంకృత గ్రీవాః పద్మపత్రాయతేక్షణాః
పీనోన్నతకుచాః శ్యామాః పూర్ణచంద్రనిభాననాః
స్థిరాలకా స్సుకపోలాః కాంచీనూపురనాదితాః
సుకేశ్య శ్చారుజఘానాః కర్ణాంతాయతలోచనాః
సర్వలక్షణసంపన్నాః సర్వాభరణభూషితాః
దివ్యవస్త్రధరాః శుభ్రాః కాశ్చి త్కాంచనసన్నిభాః
హంసవారణగామిన్యః కుచభారావనామితాః
దివ్యగంధానులిప్తాంగాః కర్ణాభరణభూషితాః
మదాలసాశ్చ సుశ్రోణ్యో నిత్యం ప్రహసితాననాః
ఈషద్విస్పష్టదశనా బింబోష్ఠా మధురస్వరాః
తాంబూలరంజితముఖా విదగ్ధాః ప్రియదర్శనాః
సుభగాః ప్రియవాదిన్యో నిత్యం యౌవనగిర్వితాః
దివ్యవస్త్రధరాః సర్వాః సదా చారిత్రమండితాః
క్రీడంతి తా స్సదా తత్ర స్త్రియ శ్చాప్సరసోపమాః
స్వే స్వే గృహే ప్రముదితా దివా రాత్రౌ వరాననాః
పురుషా స్తత్ర దృశ్యంతే రూపయౌవనగర్వితాః
సర్వలక్షణసంపన్నాః సుమృష్టమణికుండలాః
బాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ మునిసత్తమాః
స్వధర్మ విరతా స్తత్ర నివసంతి సుధార్మికాః
అన్యాశ్చ తత్ర తిష్ఠంతి వారముఖ్యాః సులోచనాః
ఘృతాచీ మేనకా తుల్యా స్తథా సమ తిలోత్తమాః
ఊర్వశీ సదృశాశ్చైవ విప్రచిత్తినిభాస్తథా
విశ్వాచీ సహజన్యభాః ప్రమ్లోచాసదృశాస్తథా
సర్వా స్తాః ప్రియవాదిన్యః సర్వా విహసితాననాః
కళాకౌశలసంయుక్తాః సర్వా స్తా గుణసంయుతాః
ఏవం పణ్యస్త్రియ స్తత్ర నృత్యగీత విశారదాః
నివసంతి మునిశ్రేష్ఠా! స్సర్వ స్త్రీగుణగర్వితాః
ప్రేక్షణాలాపకుశలా స్సుందర్యః ప్రియదర్శనాః
న రూపహీనా దుర్వృత్తాన పరద్రోహకారికాః
యాసాం కటాక్షపాతేన మోహం గచ్ఛంతి మానవాః
న తత్ర నిర్ధనా స్సంతి న మూర్ఖాన పరద్విషః
న రోగిణో న మలినా న కదర్యా న మాయినః
న రూపహీనా దుర్వృత్తా న పరద్రోహకారిణః
తిష్ఠంతి మానవా స్తత్ర క్షేత్రే జగతి విశ్రుతే
సర్వత్ర సుఖసంచారం సర్వసత్త్వ సుఖావహమ్
నానాజనసమాకీర్ణం సర్వసస్యసమన్వితమ్
కర్ణికారైశ్చ పనసై శ్చంపకై ర్నాగకేసరైః
పాటలాశోకవకులైః కపిత్థై ర్బహులై ర్ధవైః
చూతనింబకదంబైశ్చ తథాన్యైః పుష్పజాతిభిః
నీపకై ర్ధవ ఖదిరై ర్లతాభి శ్చ విరాజితమ్
శాలై స్థాలై స్తమాలైశ్చ నారికేళైః శుభాంజనైః
అర్జునై స్సమపర్ణైశ్చ కోవిదారైః సపిప్పలైః
లకుచైః సరళై ర్లోధ్రైర్హింతాలై ర్దేవదారుభిః
పలాశై ర్ముచుకుందై శ్చపారిజాతైః సకుబ్జకైః
కదళీవనఖండైశ్చ జంబూపూగఫలై స్తథా
కేతకీకరవీరైశ్చ అతిముక్తై శ్చ కింశుకైః
మందారకుందపుష్పై శ్చ తథాన్యైః పుష్పజాతిభిః
నానా పక్షిరుతై స్సేవ్యైరుద్యానైర్నందనోపమైః
ఫల భారానతై ర్వృక్షై స్సర్వర్తుకుసుమోత్కరైః
చకోరై శ్శతవత్రైశ్చ భృగంరాజై శ్చకోకిలైః
కలవింగైర్మయూరైశ్చ ప్రియపుత్రైః శుకైస్తథా
జీవంజీవక హారీతై శ్చాతకైర్వన వేష్టితైః
నానాపక్షిగణైశ్చాన్యైః కూజద్భిర్మధురస్వరైః
దీర్ఘికాభిస్తటాకైశ్చ పుష్కరిణీభిశ్చ వాపిభిః
నానాజలాశ యైశ్చాన్యైః పద్మినీషండమండితైః
కుముదైః పుండరీకైశ్చ తథా నీలోత్పలై శ్శుభైః
కాదంబై శ్చక్రవాకైశ్చ తథైవ జలకుక్కు టైః
కారండవైః ప్లవైర్హంసై స్తథాన్యై ర్జలచరాభిః
ఏవం నానావిధై ర్వృక్షైః పుష్పైర్నానా విధై ర్వరైః
నానాజలాశయైః పుణ్యౖః శోభితం తత్సమంతతః
అస్తే తత్ర స్వయం దేవః కృత్తివాసా వృషధ్వజః
హితాయ సర్వలోకన్య భుక్తిముక్తి ప్రదః శివః
పృథివ్యాం యాని తీర్థాని సరితశ్చ సరాంసి చ
పుష్కరిణ్య స్తటాకాని వాప్యః కూపాశ్చ సాగరాః
తేభ్యః పూర్వం సమాహృత్య జలబిందూన్పృథ క్పృథక్
సర్వలోక హితార్దాయ రుద్రః సర్వసురైస్సహ
తీర్థం బిందుసరో నామ తస్మిన్ క్షేత్రే ద్విజోత్తమాః
చకార ఋషిభిః సార్థం తేన బిందుసరః స్మృతమ్
అష్టమ్యాం బహుళే పక్షే మార్గశీర్షే ద్విజోత్తమాః
య స్తత్ర యాత్రాం కురుతే విషునే విజితేంద్రియః
విధివ ద్బిందుసరసి స్నాత్వా శ్రధ్దాసమన్వితః
దేవానృషీన్మనుష్యాంశ్చ పితౄన్ సంతర్ప్య వాగ్యతః
తిలోదకేనవిధినా నామగోత్రవిధానవిత్
స్నాత్వైవం విధివత్తత్ర సోశ్వమేధ ఫలంలభేత్
గ్రహోపరాగే విషువే సంక్రాంత్యా మయనే తథా
యుగాదిషు షడశీత్యాం తథాన్యత్ర శుభేతిథౌ
యేతత్ర దానం విప్రేభ్యః ప్రయచ్చంతి ధనాదికమ్
ఆన్యతీర్థా చ్చతగుణం ఫలం తే ప్రాప్నువంతివై
పిండం యే సంప్రయచ్చంతి పిత్భభ్య స్సరసప్తటే
పితౄణామక్షయాం తృప్తిం తే కుర్వంతి న సంశయః
తతః శంభోర్గృహం గత్వా వాగ్యతః సంయతేంద్రియః
ప్రవిశ్య పూజయే చ్చర్వం కృత్వా తం త్రిః ప్రదిక్షిణమ్
ఘృతక్షీరాదిభిః స్నానం కారయిత్వా భవం శుచిః
చందనేన సుగందేన విలిప్య కుంకుమేన చ
తతః సంపూజయేద్దేవం చంద్రమౌళి ముమాపతిమ్
పుష్పైర్నానావిధై ర్మేధ్యై ర్బల్వార్క కమలాధిభిః
ఆగమోక్తేన మంత్రేణ వేదోక్తేన చ శంకరమ్
అదీక్షితస్తు నామ్నైవ మూలమంత్రేణ చార్చయేత్
ఏవం సంపూజ్య తం దేవం గంధపుష్పానురాగిభిః
ధూపదీపైశ్చనై వేద్యైరుపహారై స్తథా స్తవైః
దండవత్ర్పణి పాతై శ్చ గీతై ర్వాద్యైర్మనోహరైః
నృత్యజప్యనమస్కారై ర్జయశ బ్దైః ప్రదక్షిణైః
ఏవం సంపూజ్య విధివ ద్దేవ దేవ ముమాపతిమ్
సర్వపాప వినిర్ముక్తో రూపయౌవన గర్వితః
కులై కవింశ ముద్ధృత్య దివ్యాభరణ భూషితః
సౌపర్ణేన విమానేన కింకిణీజాలమాలినా
ఉపగీయమానో గంధర్వైరప్సరోభిరలంకృతః
ఉద్యోత యన్దిశః సర్వాః శివలోకం సగచ్చతి
భుక్త్వా తత్ర సుఖం విప్రా మనసః ప్రీతిదాయకమ్
తల్లోక వాసిభిః సార్ధం యావదాభూత సంప్లవమ్
తతస్తస్మాదిహాయాతః పృథివ్యాం పుణ్యసంక్షయే
జాయతే యోగినాం గేహే చతుర్వేదీ ద్విజోత్తమాః
యోగం పాశుపతం ప్రాప్య తతో మోక్షమవాప్నుయాత్
శయనోత్థాపనే చైవ సంక్రాంత్యా మయనే తథా
అశోకాయాం తథాష్టమ్యాం పవిత్రారోపణే తథా
యే చపశ్యంతి తం దేవం కృత్తివాసస ముత్తమమ్
విమానేనార్క వర్ణేన శివలోకం వ్రజంతి తే
సర్వకాలేపి తందేవం యే పశ్యంతి సుమేధసః
తేపి పాప వినిర్ముక్తాః శివలోకం వ్రజంతి వై
దేవస్య పశ్చిమే పూర్వే దక్షిణే చోత్తరే తథా
యోజన ద్వితయం సార్థం క్షేత్రం తద్బుక్తి ముక్తిదమ్
తస్మిన్‌క్షేత్రవరే లింగం భాస్కరేశ్వర సంజ్ఞితమ్
పశ్యంతి యే తు తం దేవం స్నాత్వా కుండే మహేశ్వరమ్
ఆదిత్యేనార్చితం పూర్వం దేవదేవం త్రిలోచనమ్
సర్వపాప వినిర్ముక్తా విమాన వర మా స్థితాః
ఉపగీయమానా గంధర్వైః శివలోకం వ్రజంతితే
తిష్ఠంతి తత్ర ముదితాః కల్పమేకం ద్విజోత్తమాః
భుక్త్వాతు విపులాన్ భోగాన్ శివలోకే మనోరమాన్
పుణ్యక్షయాదిహాయాతా జాయంతే ప్రవరే కులే
అథవా యోగినాం గేహే వేదవేదాంగ పారగాః
ఉత్పద్యంతే ద్విజవరాః సర్వభూతహితే రతాః
మోక్ష శాస్త్రార్ధ కుశలాః సర్వత్రసమబుద్ధయః
యోగం శంభో ర్వరం ప్రాప్య తతో మోక్షం వ్రజంతి తే
తస్మిన్ క్షేత్రవరే పుణ్యే లింగం యద్దృశ్యతే ద్విజాః
పూజ్యాపూజ్యంచ సర్వత్ర వనే రథ్యాంతరేపి వా
చతుష్పథే శ్మశానేవా యత్రకుత్రచ తిష్ఠతి
దృష్ట్వా తల్లింగ మవ్యగ్రః శ్రద్ధయా సుసమాహితః
స్నాపయిత్వా తు తం భక్త్యా గంధైః పుష్పైర్మనోహరైః
ధూపైర్దీపైః సనై వేద్యై ర్నమస్కారై స్తథా స్తవైః
దండవత్ర్పణిపాతైశ్చ నృత్యగీతాదిభిస్తథా
సంపూజ్యైవం విధానేన శివలోకం వ్రజేన్నరః
నారీ వా ద్విజశార్దూలాః సంపూజ్య శ్రధ్దయాన్వితా
పూర్వోక్తం ఫలమాప్నోతి నాత్ర కార్యా విచారణా
కః శక్నోతి గుణాన్వక్తుం సమగ్రా న్మునిసత్తమాః
తస్యక్షేత్రవరస్యాథ ఋతే దేవా న్మహేశ్వరాత్
యస్మి న్యస్మిం స్థితౌ విప్రాః స్నాత్వా బిందు సరోంభపి
పశ్యే ద్దేవం విరూపాక్షం దేవీం చ వరదామ్ శివామ్
గణం చండం కార్తికేయం గణేశం వృషభం తథా
కల్పద్రుమంచ సావిత్రీం శివలోకం సగచ్ఛతి
స్నాత్వా చ కపిలే తీర్థే విధివ త్పాపనాశనే
ప్రాప్నో త్యభిమాతాన్ కామాన్ శివలోకం సగచ్ఛతి
యః స్తంభం తత్ర విధివ త్కరోతి నియతేంద్రియః
కులైక వింశ ముద్దృత్య శివలోకం సగచ్ఛతి
ఏకామ్రకే శివక్షేత్రే వారణాసీ సమే శుభే
స్నానం కరోతి యస్తత్ర మోక్షం స లభతే ధ్రువమ్
సర్వ పాపహరము పరమ దుర్లభము కోటి లింగ సహితము కాశీ క్షేత్ర సమానము ఎనిమిది తీర్థములతో గూడి నదియు నేకామ్ర మని ప్రసిద్ధి గల పుణ్య క్షేత్రమును గురించి చెప్పు చున్నాను. వినుడు. పూర్వకల్ప మందక్కడ నేకామ్ర వృక్షము (ఒంటి మామిడి చెట్టు) ఉన్నందున నా క్షేత్రమున కాపేరు వచ్చినది. అందు సంతుష్టి, పుష్టియు గల స్త్రీ పురుషు లుందరు, పండిత సమూహము తోను, ధన ధాన్యముల తోను గూడినది, గృహ గోపురముల యొత్తిడి గొన్నది, త్రికోణాకార ద్వారబంధ శోభితము, నర్తక బృంద సహితము సర్వ రత్నోప శోభితము, కోట బురుజులతో నొప్పునది, రథికులచే శోభించునది, రాజ హంసలట్లు తెల్లని ప్రాసాదములతో రాణించునది పుర ద్వారములతో నొప్పునదియు తెల్లని ప్రాకారములతో వ్యాప్త మైనదియు, ఆయుధ ధారులచే నభిరక్షితము, కందకములతో రాణించునదియు, వాయు కంపిత బహువర్ణ పతాకా పరిశోభితము, నిరంతరోత్సవ ప్రముదితము, నానా వాద్యధ్వని సంకులము, దేవాలయములు, ప్రాకారములు, ఉద్యాన వనములతో పరమ సుందరము. అందలి స్త్రీలు పరమ సుందరులు, ఆనంద భరితులు, సర్వాభరణ భూషితులు, పద్మ నేత్రలు పూర్ణ చంద్రాననలు కాంచీ నూపుర శబ్ద శోభితలు కొందరు బంగరు చాయ వారు. కొందరు గజ గమనలు. కొందరు పినోన్నత కుచభారా వనమ్రలు దివ్యగందాను లిప్తలు, కొందరు కర్ణా భరణ భూషితలు, మరి కొందఱు మదవతులు, సుశ్రోణులు, కొందరు నగుమోము గలవారు, అపుడించుక వెలువడు పలు వరుస గలవారు కొందరు బింబా ధరోష్టులు కొందురు మధుర స్వర మనోహరులు. తాంబూల రంజిత ముఖులు, ప్రియ దర్శనులు, మనోహారిణులు, క్రియ వాదినులు, నిత్య యౌవన గర్వితలు. అందరు దివ్యాంబరా భరణ థారిణులు, పరమ పతివ్రతలు ఆ క్షేత్రమున యువతులు అప్సరస్స మానులు, క్రీడా విలాసినులు, రేయిం బవళ్ళు తమ తమ గృహము లందు ఆనంద భరితులై యుండు ఉత్తమ గృహిణులు. అచట పురుషులు రూప యౌవన గర్వితులు, సర్వ లక్షణ సంపన్నలు నిగనిగ మెరయు మణి మండనములు ధరించు వారు. బ్రహ్మణాది వర్ణముల వారు స్వధర్మ నిరతులు. అందు వారాంగనలు కూడ పరమ సుందరులై యెప్పుదురు. ఊర్వసీ, మేనకాది దేవ సుందరీ మణుల యందమున నొప్పువారు. సంగీతాది సకల కళా నిపుణులు. ప్రియ వాదినులు. సర్వ లక్షణ లక్షితులు, నృత్యగీత విశారదులు. సర్వ రమణీ రమణీయ గుణ గర్వితలు. వాలు చూపులలో మాటలలో నిపుణులు, కురూపులు, కుబుద్దులు, పరద్రోహ పరాయణులు, నందు గాన రారు. వారి కటాక్ష ప్రసరణ మాత్రమున మానవులు మోహా వివశులగుదురు. నిర్ధనులు, మూర్ఖులు పర ద్వేషులు, రోగులు, లోభులు మాయకులు, జగత్ర్ప సిద్ధమైన ఆ క్షేత్రమున నుండరు, సర్వసుఖ సంచారము. సర్వసత్త్వ సుఖకరము, సర్వసన్య సంభరితము. సర్వజన సంకులము. అందు కల ఫల వృక్షములు ఎందును లేవు. అందలి యుద్యానములు నందన వనోపమములు, సర్వర్తు కుసుమ ఫల భారావనమ్ర వృక్ష శోభితములు.
అందు శుక పిక చకోర చక్రవాత ప్రముఖ సకల పక్షికుల కిలకిలారావ సంకులము లగు వనములు, సరస్సులు దిగుడు బావులు, చూడ ముచ్చట గొల్పు చుండును. అందు కమలములు కలువలు ఎర్ర తామరలతో నిండిన పుణ్య సరస్సు లెటు చూసినను కన్నుల పండువు చేయు చుండును. అయట పరమ శివుడు సన్నిహితుడు. ఆ పరమేశ్వరుడు భూమి యందున్న నదులు పుష్కరిణులు చెరువులు నూతులు సాగరములు అనువాని నుండి జల బిందువులను సేకరించి సురలతో నా పుణ్య క్షేత్రమును బిందు సరమను తీర్థమును నిర్మించెను. మార్గశీర్ష బహుళాష్టమి నాడు జితేంద్రియుడై యచట యాత్ర చేసి శ్రద్ధతో స్నానము చేసి వాజ్నియమ మూని దేవర్షి పితృ తర్పణ మాచరించి తిలాంజలులు చేసిన వాడు అశ్వమేధ ఫలమందును. గ్రహణ పర్వ కాలమున విషువమున (సమ రాత్రిందిన కాలమున) సంక్రమణ మందు అయన సమయమున యుగాదు లందు షడశీలితిని (తుల మొదలు కొని 86వ రోజున వచ్చెడి పుణ్య కాలము. ఇది సంవత్సరమునకు నాలుగు పర్యాయములు వచ్చును. ద్విస్స్వభావ రాశి యందే యిది వచ్చును.) మఱి యితర శు భసమయము లందు ధనాది పుణ్య దానములు చేసిన వారు ఇతర తీర్థముల కంటె నూరురెట్ల ఫలము నందుదురు. ఆ బిందు సరస్తీర్థము నందు పితృ దేవతలకు పిండ ప్రదానము చేసిన వారు పితృ దేవతలకు అక్షయ తృప్తిని కలుగ జేసిన వారగుదురు సంశయము లేదు.
అటుపై నింద్రియముల నిమిడించు కొని వాక్కును నిగ్రహించు కొని, శివాలయ మునకు (ఏకామ్రేశ్వ రాలయము) ఏగి అందు శంకరుని పూజింప వలెను. ఆ మున్ను ఆలయమునకు ముమ్మారు ప్రదక్షిణము చేయ వలెను. ఆవునేతితో గో క్షీరముతో శుచియై స్వామి కభిషేకించి చందనము, కుంకుమయు పూసి యవ్వల ఉమాపతి యగు చంద్ర మౌళీశ్వరుని పుష్పములచే పవిత్రము లగు బిల్వార్క కమలాదు లచే నాగమ విధానమున వైదిక మంత్రములతో నారాధించ వలెను. దీక్షా పరుల పూజా విధాన మిది. దీక్ష నొందని వారు మూల మంత్రము తోను నామముల తోను అర్చించ వలెను. ఈ విధముగ గంధ పుష్పాదులతో షోడశో పచారముల తోను నృత్య గీతాదులతోను నారాధించి పాప విముక్తు లగుదురు. రూపసి యువకుడు నగును. ఇరువది యొక్క తరముల వారి నుద్ధరించి దివ్యాభరణ ముల దాల్చి, చిరు గంటలు మ్రోయు బంగరు విమానమున గంధర్వా ప్సరసాదులు కీర్తింప స్వదిశల మిరుమిట్లు గొల్పుచు తుదకు శివ లోకము చేరును. అచటి భక్తులతో భూత ప్రళయ పర్యంత మచట నుండి భూ లోకమునకు వచ్చి యోగి గృహము నందు చతుర్వేది యగును. అచట పాశుపత దీక్షగొని మోక్షము నొందును.
శయనైకాదశి, ఉత్థానైకాదశు లందు సంక్రమణము లందు, అయన పుణ్య కాలము లందును, అశోకాష్టమి పవిత్రారోపణము లందును శివ దర్శనము చేయువారు సూర్యప్రభ మగు విమానమున శివ లోకమున కేగుదురు. మేధావంతులు ఎల్ల కాలము శివ దర్శనము చేసి శివలోక మందుదురు. ఈ శివ క్షేత్రమునకు నలుదిక్కు లందు గల రెండున్నర యోజనముల ప్రదేశము భుక్తి ముక్తుల నిచ్చు క్షేత్రము. ఆ క్షేత్రము నందు గల లింగము భాస్కరేశ్వర మనబడును. అచట నున్న కుండమున స్నానముచేసి ఆదిత్యునిచే నర్చింప బడిన ఆ భాస్కరేశ్వరుని దర్శించిన వారు విమానమెక్కి గంధర్వ గానము లవధరించును శివ లోకమున కేగుదురు. అచట నానంద భరితులై ఒక కల్ప కాలము మనోహర భోగముల ననుభవించి పుణ్యక్షయము కాగా భూలోకము చేరి యోగి గృహమునందు పుట్టి వేదవేదాంగ పారగులై సర్వభూత హితము కోరు బ్రాహ్మణులై సర్వసములై మోక్షశాస్త్ర కుశలురై శివయోగ మంది మోక్ష మందుదురు. పూజ్య మైనను అపూజ్య మైనను ఒక శివ లింగము అడవిలో రాచబాటలో నాల్గుదార్లు కలిసిన చోట శ్మశానము నందు గాని యెక్కడో యక్కడా క్షేత్రము నందున్న యెడల దానిం జూచి తొట్రు పడక శ్రద్ధతో మనసు నిలిపి భక్తితో నభిషేకము చేసి సుగంధ పుష్పాదులచే ధూపదీప నైవేద్యాదులచే నమస్కారములచే స్తుతులచే నమస్కరించి సాష్టాంగ దండ ప్రణామము గావించి నృత్య గీతాదులచే యాధా విధిగా నర్చించిన యతడు శివలోక మేగును. స్త్రీ యైనను శ్రద్ధతో శివుం బూజించిన నీ మున్ను జెప్పిన ఫల మందును. ఇందు విమర్శింప బనిలేదు.
ఆ యేకామ్ర క్షేత్రము యొక్క సమగ్ర గుణ విశేషములను పరమేశ్వరుని కంటే మఱి యెవ్వడు వర్ణింప గలడు? ఏ యే స్థితిలో నున్ననను వైశాఖాది మాసము లందు బిందు సరోవర జలమందు స్నానము చేసి యట నున్న శివుని, వరదాత్రి యగు పరమేశ్వరిని ప్రమథ గణములను కుమార స్వామిని గణపతిని నందిని కల్ప వృక్షమును సావిత్రీ దేవిని దర్శింప వలెను. అందు వలన శివుని సాలోక్య మందును. కపిల తీర్థమున యధా విధిగ స్నాన మాచరించి యభీష్టముల నంది శివలోక మందును. ఆ క్షేత్రములనే జితేంద్రియుడై యధావిధి స్తంభ ప్రతిష్ట చేయునతడు ఇరువది యొక్క తరముల కులము నుద్ధరించి శివ లోకమున కేగును. కాశీక్షేత్ర సమయమున శివక్షేత్ర మగు నేకామ్ర క్షేత్రము నందు స్నానము సేసిన యతడు తప్పక మోక్ష మందును.
Summary of chapter 41 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The legend of King Indradyumna of Avantī is introduced. A supremely devoted king, Indradyumna yearns to behold Bhagavān Viṣṇu in his physical form. A visiting sage informs him of Puruṣottama (Jagannātha) on the eastern coast. Indradyumna abandons his kingdom and sets out on pilgrimage; the chapter describes his journey and the sacred land of Avantī from which he departs.