బ్రహ్మ:
ఏవం దృష్ట్వా తదా దక్షః శంభో ర్వీర్యం ద్విజో త్తమాః
ప్రాంజలిః ప్రణతో భూత్వా సంస్తోతు ముపచక్రమే
నమస్తే దేవేదేవేశ! నమస్తే న్థకసూదన!
దేవేంద్ర త్వం బలశ్రేష్ట దేవదానవ పూజిత
సహస్రాక్ష విరూపాక్ష త్రక్ష్య యక్షాధిపప్రియ
సర్వతః పాణిపాద స్త్వం సర్వతోక్షిశిరోముఖః
సర్వతః శ్రుతిమాం ల్లోకే సర్వ మావృత్య తిష్టసి
శంకుకర్ణో మహాకర్ణః కుంభకర్ణో ర్ణవాలయః
గజేంద్రకర్ణో గోకర్ణః శతకర్ణో నమోస్తుతే
శతోదరః శతావర్తః శతజిహ్వః సనాతనః
గాయంతి త్వాం గాయత్రిణో ఆర్చయం త్యర్క మర్కిణః
దేవదానవ గోప్తాచ బ్రహ్మ చ త్వం శతక్రతుః
మూర్తిమాం స్త్వం మహామూర్తిః సముద్రః సరసాంనిధిః
త్వయి సర్వా దేవతా హి గావో గోష్ఠ ఇవా సతే
త్యత్తః శరీరే పశ్యామి సోమ మగ్నిం జలేశ్వరమ్
ఆదిత్యమథ విష్ణుం చ బ్రహ్మాణం సబృహస్పతిమ్
క్రియాకరణకార్యే చ కర్తా కారణ మేవ చ
అస చ్చ సదస చ్చైవ తథైవ ప్రభవాప్యయౌ
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ
పశూనాం పతయే చైవ నమో స్త్వంధక ఘాతినే
త్రిజటాయ త్రిశీర్షాయ త్రిశూల వరధారిణే
త్ర్యంబకాయ త్రినేత్రాయ త్రిపురఘ్నాయ వై నమః
నమ శ్చండాయ ముండాయ విశ్వచండధరాయచ
దండినే శంకుకర్ణాయ దండిదండాయ వై నమః
నమో ర్థదండికేశాయ శుష్కాయ వికృతాయ చ
విలోహితాయ ధూమ్రాయ నీలగ్రీవాయ వై నమః
నమో స్త్వ ప్రతి రూపాయ విరూపాయ శివాయచ
సూర్యాయ సూర్యపతయే సూర్యధ్వజ పతాకినే
నమః ప్రమథనాశాయ వృషస్కంధాయ వై నమః
నమో హిరణ్యగర్భాయ హిరణ్యకవచాయచ
హిరణ్యకృతచూడాయ హిరణ్యపతయే నమః
శత్రుఘాతాయ చండాయ పర్ణసంఘశయాయ చ
నమః స్తుతాయ స్తుతయే స్తూయమానాయ వై నమః
సర్వాయ సర్వభక్షాయ సర్వభూతాంతరాత్మనే
నమో హోమాయ మంత్రాయ శుక్లధ్వజపతాకినే
నమో నమ్యాయ నమ్యాయ నమః కిలకిలాయ చ
నమ స్త్వాం శయమానాయ శయితా యోత్థితాయ చ
స్థితాయ ధావమానాయ కుబ్జాయ కుటిలాయ చ
నమో నర్తనశీలాయ ముఖవాదిత్రకారిణే
బాధాపహాయ లుబ్ధాయ గీత వాదిత్రకారిణే
నమో జేష్ఠాయ శ్రేష్ఠాయ బలప్రమథనాయచ
ఉగ్రాయ చ నమో నిత్యం నమ శ్చ దశబాహవే
నమః కపాల హస్తాయ సిత భస్మ ప్రియాయ చ
విభీషణాయ భీమాయ భీష్మవ్రతధరాయ చ
నానావికృత వక్త్రాయ ఖడ్గజిహ్వోగ్ర దంష్ట్రిణే
పక్షమాసలవార్థాయ తుంబీ వీణాప్రియాయ చ
అఘోరఘోర రూపాయ ఘోరఘోర తరాయ చ
నమ శ్శివాయ శాంతాయ నమ శ్శాంతతమాయ చ
నమో బుద్ధాయ శుద్ధాయ సంవిభాగ ప్రియాయ చ
పవనాయ పతంగాయ నమ స్సాంఖ్యపరాయచ
నమః చండైక ఘంటాయ ఘంటాజల్పాయ ఘంటినే
సహస్ర శత ఘంటాయ ఘంటామాలా ప్రియాయ చ
ప్రాణదండాయ నిత్యాయ నమ స్తే లోహితాయ చ
హూం హూం కారాయ రుద్రాయ భగాకారప్రియాయ చ
నమో పారవతే నిత్మం గిరివృక్షప్రియాయచ
నమో యజ్ఞాధిపతయే భూతాయ ప్రస్తుతాయ చ
యజ్ఞవాహాయ దాంతాయ తప్యాయ చ భగాయ చ
నమ స్తటాయ తట్యాయ తటినీపతయే నమః
అన్నదాయా న్నపతయే నమ స్త్వన్నభుజాయ చ
నమ స్సహస్రశీర్షాయ సహస్రచరణాయ చ
సహస్రోద్ధత శూలాయ సహస్రనయనాయ చ
నమో బాలార్కవర్ణాయ బాలరూపధరాయ చ
నమో బాల్కార రూపాయ కాలక్రీడనకాయ చ
నమ శ్శుద్ధాయ బుద్ధామ క్షోభణాయ క్షయాయ చ
తరంగాంకిత కేశాయ ముక్తకేశాయ వై నమః
నమ ష్షట్కర్మనిష్ఠాయ త్రికర్మనియతాయ చ
వర్ణాశ్రమాణాం విధి వత్పృథ గ్థర్మ ప్రవర్తినే
నమ శ్రేష్ఠాయ జ్యేష్ఠాయ నమః కలకలాయ చ
శ్వేతపింగల నేత్రాయకృష్ణ రకైక్షణాయ చ
ధర్మ కామార్థ మోక్షాయ క్రథాయ క్రథనాయ చ
సాంఖ్యాయ సాంఖ్యముఖ్యాయ యోగాధిపతయే నమః
నమో రథ్యాధిరథ్యాయ చతుష్పథపథాయ చ
కృష్ణాజినో త్తరీయాయ వ్యాల యజ్ఞోపవీతినే
ఈశాన రుద్రసంఘాత హరికేశ! నమోస్తుతే
త్ర్యంబకా యాంబికానాథ వ్యక్తావ్యక్త నమో స్తు తే
కాలకామదకామఘ్న దృష్టో ద్వృత్తనిఘాదన
సర్వగర్హిత సర్వఘ్న సద్యోజాత నమోస్తుతే
ఉన్మాదన శతావర్త! గంగాతోయార్థ్రమూర్ధజ
చంద్రార్థ సంయుగావర్త! మేఘావర్త! నమోస్తుతే
నమో న్నదానకర్త్రే చ అన్నదప్రభవే నమః
అన్నభోక్త్రే చ గోప్త్రేచ త్వ మేవ ప్రళయానల!
జరాయుజాండజా శ్చైవ స్వేదజోద్భిజ్జ ఏవ చ
త్వ మేవ దేవదేవేశ భూతగ్రామ శ్చతుర్విధః
చరాచరస్య స్రష్టా త్వం ప్రతిహర్తా త్వ మేవ చ
త్వ మేవ బ్రహ్మా విశ్వేశ అప్సు బ్రహ్మ వదంతి తే
సర్వస్య పరమా యోనిః సుధాంశో! జ్యోతిషాం నిధిః
ఋక్సామాని తథోంకార మాహు స్త్వాం బ్రహ్మవాదినః
హాయి హాయి హరే హాయి హువా హావేతి వాసకృత్
గాయంతి త్వాం సుర శ్రేష్ఠాః సామగా బ్రహ్మవాదినః
యజుర్మయ ఋజ్మయ శ్చ సామాథర్వయుత స్తథా
పఠ్యసే బ్రహ్మవిద్భి స్త్వం కల్పోపనిషదాం గణైః
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా వర్ణాశ్రమా శ్చ యే
త్వ మేవా శ్రమసంఘా శ్చ విద్యు త్త్సనిత మేవ చ
సంవత్సర స్త్వ మృతవో మాసా మాసార్థ మేవ చ
కలా కాష్ఠా నిమేషా శ్చ నక్షత్రాణి యుగాని చ
వృషాణాం కకుదం త్వం హి గిరీణాం శిఖరాణి చ
సింహో మృగాణాం పతయ స్తక్షకానంత భోగినామ్
క్షీరోదో హ్యుదధీనాం చ మంత్రాణాం ప్రణవ స్తథా
వజ్రం స్రహరణానాం చ వ్రతానాం సత్య మేవ చ
త్వ మేవే చ్ఛా చ ద్వేష శ్చ రాగో మోహః శమః క్షమా
వ్యవసాయో ధృతి ర్లోభః కామక్రోధౌ జయాజయౌ
త్వం గదీ త్వం శరీ చాపి ఖట్వాంగీ ముద్గరీ తథా
ఛేత్తా భేత్తా ప్రహర్తా చ నేతా మంతా సి నో మతః
దశలక్షణ సంయుక్తో ధర్మో ర్థః కామ ఏవ చ
ఇందు స్సముద్ర స్సరితః పల్వలాని సరాంసి చ
తతావల్య స్తృణౌషధ్యః పశవో మృగపక్షిణః
దవ్ర్యకర్మగుణారంభః కాలపుష్పఫలప్రదః
ఆది శ్చాంత శ్చ మధ్య శ్చ గాయ త్త్యోంకార ఏవ చ
హరితో లోహితః కృష్ణో నీలః పీత స్తథా క్షణః
కద్రు శ్చ కపిలో బభ్రుః కపోతో మత్స్యక స్తథా
నువర్ణరేతా విఖ్యాతః సువర్ణ శ్చాప్యయో కుతః
సువర్ణనామా చ తథా సువర్ణప్రియ ఏవ చ
త్వ మింద్ర శ్చ యమ శ్చైవ వరుణో ధనదో నిలః
ఉత్ఫుల్ల శ్చిత్రభాను శ్చ స్వర్భాను ర్భాను రేవ చ
హోత్రం హోతా చ హోమ్యం చ హుతం చైవ తధా ప్రభుః
త్రిసౌపర్ణ స్తథా బ్రహ్మ న్యజుషాం శతరుద్రియమ్
పవిత్రం చ పవిత్రాణాం మంగళానాం చ మంగళమ్
ప్రాణా శ్చ త్వం రజ శ్చ త్వం తమ స్సత్త్వయుత స్తథా
ప్రాణో పానః సమాన శ్చ ఉదానో వ్యాన ఏవ చ
ఉన్మేష శ్చ నిమేష శ్చ క్షుత్తృట్ జృంభా తథై చ
లోహితాంగ శ్చ దంష్ట్రీచ మహావక్త్రో మహోదరః
శుచిరోమా హరిచ్ఛ్మశ్రురూర్థ్వకేశ శ్చలాచలః
గీతావాదిత్ర నృత్యాంగో గీతవాదనక ప్రియః
మత్స్యో జాలో జలో జయ్యో జలవ్యాలః కుటీచరః
వికాల శ్చ సుకాల శ్చ దుష్కాలః కాలనాశనః
మృత్యు శ్చైవాక్షయో న్త శ్చ క్షమా మాయాకరోత్కరః
సంవర్తో వర్తక శ్చైవ సంవర్తక బలాహకౌ
ఘంటాకీ ఘంటాకీ ఘంటీ చూడూలో లవణోదధిః
బ్రహ్మా కాలాగ్ని వక్త్ర శ్చ దండీ ముండ స్త్రిదండదధృక్
చతుర్యుగ శ్చతుర్వేద శ్చతుర్హోత్రశ్చతుష్పథః
చాతురాశ్రమ్య నేతా చ చాతుర్వర్ణ్వకర శ్చ హ
క్షరాక్షరః ప్రియో ధూర్తో గణైర్గణ్యో గణాధిపః
రక్తమాల్యాంబరధరో గిరీశో గిరిజాప్రియః
శిల్పీశః శిల్పినః శ్రేష్ఠః సర్వ శిల్ప ప్రవర్తకః
భగనేత్రాంతక శ్చండః పూష్ణోదంతవినాశనః
స్వాహా స్వధా వషట్కారో నమస్కారో నమో స్తుతే
గూఢవ్రత శ్చ గూఢ శ్చ గూఢవ్రతనిషేవితః
తరణ స్తారణ శ్చైవ సర్వభూతేషు తారణః
ధాతా విధాతా సంధాతా నిధాతా ధారణో ధరః
తపో బ్రహ్మ చ సత్యం చ బ్రహ్మచర్యం తథా ర్జవమ్
భూతాత్మా భూతకృ ద్భూతో భూతభవ్య ద్భవోద్భవః
భూర్హువః స్వరిత శ్చైవ భూతో హ్యగ్ని ర్మహేశ్వరః
బ్రహ్మావర్తః సురావర్తః కామావర్త నమో స్తు తే
కామబింబ వినిర్హంతా కర్ణికార స్రజప్రియః
గోనేతా గోప్రదారశ్చ గోవృషేశ్వరవాహనః
త్రైలోక్య గోప్తా గోవిందో గోప్తా గోవర్గ ఏవ చ
అఖండచంద్రాభిముఖః సుముఖో దుర్ముఖో ముఖః
చతుర్ముఖో బహుముఖో రణేష్వభిముఖ స్సదా
హిరణ్యగర్భ శ్శకుని ర్థనదో ర్థపతి ర్విరాట్
అధర్మహా మహాదక్షో దండధారో రణప్రియః
తిష్ఠన్థ్సిర శ్చ స్థాణు శ్చ నిష్కంప శ్చ సునిశ్చలః
దుర్వారణో దుర్విషహో దుస్సహో దురితక్రమః
దుర్థరో దుర్వశో నిత్యో దుర్ధర్షో విజయో జయః
శశః శశాంక నయన శ్శీతోష్ణః క్షుత్తృషా జరా
అధయో వ్యాధయ శ్చైవ వ్యాధిహా వ్యాధిప శ్చ యః
సహ్యో యజ్ఞ మృగవ్యాధో వ్యాధినామాకరో కరః
శిఖండీ పుందరీక శ్చ పుండరీకావలోకనః
దండధృ క్క్చకృదండ శ్చ రౌదృభాగ వినాశనః
విషపో మృతప శ్చైవ సురాపః క్షీరసోమపః
మధుప శ్చా పపశ్చైవ సర్వప శ్చ బలాబలః
వృషాంగరాంభో వృషభ స్తథా వృషభలోచనః
వృషభ శ్చైవ విఖ్యాతో లోకానాం లోకసంస్కృతః
చంద్రాదిత్యౌ చక్షుషీ తే హృదయం చ పితామహః
అగ్నిష్టోమ స్తథా దేహోధర్మకర్మ పృసాదితః
న బృహ్మాన చ గోవిందః పురాణఋషయో న చ
మాహాత్మ్యం వేదితుం శక్తా యాథాతథ్యేన తే శివః
శివా యా మూర్తయ స్సూక్ష్మా స్తా మహ్యం యాంతు దర్శనమ్
తాభి ర్మాం సర్వతో రక్ష పితా పుత్రమివౌ రసమ్
రక్ష మాం రక్షణీయో హం తవా నఘ నమో స్తు తే
భక్తానుకంపీ భగవా ద్భక్త శ్చాహం సదా త్వయి
యః సహస్రా ణ్యనేకాని పుంసా మావృత్య దుర్దృశామ్
తిష్ఠ త్యేకః సముద్రాంతే స మే గోప్తా స్తు నిత్యశః
యం వినిద్రా జిత శ్వాసాః సత్త్వస్థాః సమదర్శినః
జ్యోతిః పశ్యంతి యుంజానా స్తస్మై యోగాత్మనే నమః
సంభక్ష్య సర్వభూతాని యుగాంతే సముపస్థితే
య శ్శేతే జలమధ్యస్థ స్తం ప్రపద్యేం బుశాయినమ్
ప్రవిశ్య వనదం రాహోర్యః సోమం పిబతే నిశి
గ్రస త్యర్కం చ స్వర్భాను ర్భూత్వా సోమాగ్ని రేవచ
అంగుష్ఠమాత్రాః పురుషా దేహస్థాః సర్వదేహినామ్
రక్షంతు తే చ మాం నిత్యం నిత్యం చాప్యాయయంతు మాం
యేనా ప్యుత్పాదితా గర్భా ఆపో భాగగతా శ్చ యే
తేషాం స్వాహా స్వధా చైవ అప్నువంతి స్వదంతి చ
యేవ రోహంతి దేహాస్తాః ప్రాణినో రోదయంతి చ
హర్షయంతి న కృష్యంతి నమ స్తేభస్తు నిత్యశః
యే సముద్రే నదీదుర్గే పర్వతేషు గుహాసు చ
వృక్షమూలేషు గోష్టేషు కాంతార గహనేషు చ
చతుష్పథేషు రథ్యాసు చత్వరేషు సబాసు చ
హస్త్యశ్వరథశాలాసు జీర్ణోద్యానాలయేషు చ
యేషు పంచమ భూతేషు దిశాసు విదిశాసు చ
ఇంద్రార్కయో ర్మధ్యగతా యే చ చంద్రార్క రశ్మిషు
రసాతలగతా యే చ యే చ తస్మాత్పరం గతాః
నమ స్తేభ్యో నమ స్తేభ్యో నమస్తేభ్యో పిసర్వశః
సర్వ స్త్వం సర్వగో దేవః పర్వభూతపతి ర్భవః
సర్వభూతాంతరాత్మా చ తేన త్వం న నిమంత్రితః
త్వ మేవ చే జ్యసే దేవ యజ్ఞై ర్వివిధదక్షిణైః
త్వ మేవ కర్తా సర్వస్య తేన త్వం న విమంత్రతః
అథవా మాయయా దేవ మోహితః సూక్ష్మయా త్వయాః
తస్మా త్తు కారణా ద్వాపి త్వం మయా న నిమంత్రితః
ప్రసీద మమ దేవేశ త్వ మేవ శరణం మమ
త్వం గతి స్త్వం ప్రతిష్ఠా చ వ చా న్యో అస్తితి మే మతిః
స్తుత్వైవం స మహాదేవం విరరామ ప్రజాపతిః
భగవా నపి సంప్రీతః పున ర్దక్ష మభాషత
దక్షకృత శివస్తవము
బ్రహ్మ:
దక్ష ప్రజాపతి శంభు ప్రభావముగని ప్రాంజలియై ప్రణతుడై యిట్లు స్తుతంప నారంభించెను. (ఈ దక్షకృత శివస్తుతి శివ సహస్ర నామావళి రూపము. పారాయణ ప్రథానము కావున 2-81 శ్లోకము దాక తాత్పర్యము వ్రాయ బడలేదు శివుని విరాడ్రూ పమున వినుతించిన ఘట్టము.)
ఫలశ్రుతి 81 నుండి 100 దాకా తాత్పర్యము వ్రాయ బడుచున్నది. ఓ సదాశివా ! నీ కన్నులు చాంద్రా దిత్యులు. హృదయము బ్రహ్మ. ధర్మకర్మ సంపాదిత మైన యగ్నిష్టోమము శరీరము. నీ యథార్థమైన మహిమ బ్రహ్మ హరి ఋషులునుం గూడ యెఱుంగ లేరు. నీ శివ మూర్తులు (మంగళ కరము లయిన యాకారములు) సూక్ష్మములు. అవి నాకు దర్శన మిచ్చుగాక! తండ్రి కన్న కొడుకు నట్లా నీ మూర్తులతో నన్ను రక్షింపుము. నీ సంరక్షణలో నుండ దగిన నన్ను రక్షింపుము. నీవు భక్తానుగ్రాహ కుడవు. నేను నీ భక్తుడను. ఏ మూర్తి వేలకొలది పురుషుల నావరించి సముద్ర మవ్వల నుండనో ఆమూర్తి నాకు రక్షక మగుగాక! నిద్ర జయించి శ్వాస నరికట్టి సత్త్వ గుణ స్థాయినంది సమదర్శనులై పరంజ్యోతిని (భ్రూమధ్య స్థానమున) సంయొజన సేసి చూతురో అట్టి యోగాత్మకుడ వైన నీకు నమస్కారము. ప్రళయ మందెల్ల భూతముల భక్షించి జల మధ్యమున శయనించు నా శివునకు నమస్కారము. రాహు ముఖము జొచ్చి రాత్రి సోముని త్రావును. పగలు సూర్యుని గ్రసించును. అట్టి నీ మూర్తికి నమస్కారము. సోముడు అగ్ని అంగుష్ఠ మాత్రులై సర్వ దేవరుల దేహ మందండు పురుషులు (శివ మూర్తులు) నన్నె ల్లపుడు రక్షింతురు గాక నన్నా ప్యాయనము సేయుదురు గాక సంతృప్తుని గావింతురు గాక యని భావము. ఎవ్వరి వలన పిండోత్పత్తి (గర్భోత్పత్తి) జరుగునో యెవరు జల గర్భముం దుందురో స్వాహా స్వధా కారమున హవిర్భాగముల నందు కొందురో అరగింతురో యెవని వలన దేహ ధారులు పుట్టుదురో ఏ మూర్తులు జీవుల నేడి పింతురో (రుద్ర రూవులన్న మాట) ఆనంద పెట్టుదురో క్లేశము గల్గింనరో యట్టి నీ మూర్తులకు నమస్కారము. సముద్ర మందు నదీ దుర్గమందు పర్వతము లందు గుహలందు వృక్షమూల మందు గోశాల లందు నడవులలో గహనములలో చతుష్పథము లందు (నాలుగు దార్లు కలిసిన చోట) వీధు లందు (రాచబాట లందు) చత్వరము లందు (సంస్కృత భూమి) సభలలో ఏనుగు గుఱ్ఱముల సాలలందు పాడు వడిన యుద్యాన వనము లందు ఆలయము లందు పంచ భూతములలో దిక్కులలో విదిక్కులలో ఇంద్ర సూర్యుల నడుమ సూర్య చంద్ర కిరణము లందు బాతాళ మందు అంత కంటెను మీదను నే నీ మూర్తులు గలవో వానకి నమస్కారము. సత్వము నీవే సర్వత్ర వీవే సర్వ భూతపతివి, సర్వ భూతాంత రాత్మవు నీవు, అందుచే నీవు నిమంత్రితుడవు గావు. (పిలువ బడువాడు) వివిధముల దక్షిణలు గల యజ్ఞములచే నీవే యజింప బడుదువు. అంతకును నీవే కర్తవు. అందుచే నీవు నిమంత్రి తుడవుగావు సూక్ష్మమైన మాయయు నీవే. దానిచే నేనును మోహింప బడితిని. (పొరబడితి నన్నమాట) అందు చేతగూడ నిన్ను నేను నియంత్రింప లేను. నిన్ను పేర్కోన లేదని భావము. నాయెడల బ్రసన్నుడ వగుము. నాకు నీవే దిక్కు. నీవే నా గతివి. నీవే నా ప్రతిష్ఠయు (ఉనికి లేక ఆధారమన్న మాట). నీకంటె మఱి యొక్కడు లేడని నా తలంపు. అని యిట్లు మహేశ్వరుని దక్షుడు స్తుతించి యూరు కొనెను.
శ్రీ భగవానుడు:
పరితుష్టో స్మి తే దక్ష స్తవేనా నేన సువ్రత
బహునా తు కి ముక్తేన మత్సమీపం గమిష్యపి
శ్రీ భగవానుడు:
భగవంతుడు ప్రీతుడై దక్షునింగని మఱియు నిట్లనియె.
బ్రహ్మ:
తథైవ మబ్రవీ ద్వాక్యం త్రైలోక్యాధిపతి ర్భవః
కృత్వా శ్వాసకరం వాక్యం సర్వజ్ఞో వాక్యసంహితమ్
శివుడు:
దక్ష దుఃఖం న కర్తవ్యం యజ్ఞవిధ్వంసనం ప్రతి
అహం యజ్ఞహన స్తుభ్యం దృష్టమేత త్పురా సఘ
భూయ శ్చ త్వం వర మిమం మత్తో గృహ్ణీష్వ సువ్రత
ప్రసన్న స్సుముఖో భూత్వా మమైకాగ్ర మనా శ్శృణు
అశ్వమేధ సహస్రస్య వాజపేయ శతస్య వై
ప్రజాపతే! మత్ర్పసాదా త్పలభాగీ భవిష్యసి
వేదా న్షడంగా న్బుధ్యస్వ సాంఖ్యయోగాం శ్చ కృత్స్నశః
తప శ్చ విపులం తప్త్వా దుశ్చరం దేవదానవైః
అబ్దై ర్ద్వాదశభి ర్యుక్తం గూఢ మప్రజ్ఞనిందితమ్
వర్ణాశ్రమకృతై ర్దర్మై ర్వినీతం న క్వచిత్క్వచిత్
సమాగతం వ్యవస్థితం పశుపాశవిమోక్షణమ్
సర్వేషా మాశ్రమాణాం చ మయా పాశుపతం వ్రతమ్
ఉత్పాదితం దక్ష శుభం సర్వపాప విమోచనమ్
అస్య చీర్ణస్యయత్ సమ్యక్ఫలం భవతి పుష్కలమ్
తచ్చా స్తు సుమహాబాగ మానస స్త్యజ్యతాం జ్వరః
నీ చేసిన స్తవముచే సంతుష్టుడ నైతిని. నీవుత్తమ వ్రత నిష్ఠుడవు. ఎక్కువ మాట లెందులకు? నీవు నా సన్నిధికి వత్తువు అని త్రి లోకేశుడు భవుడు సర్వజ్ఞుడు దక్షుని కాశ్వాస కరముగ (ఓదార్పుగ) పలికి! దక్షా! యజ్ఞ ధ్వంసమునకు దుఃఖ పడవలదు. చూచితివి గదా. యజ్ఞ హననము సేసినది నేనే. ఇదిగో నీ యజ్ఞ ఫలము నుత్తమ మైన దానిని నా వలన మఱుల బడయును. ప్రసన్న సుముఖుడవు యేకాగ్ర మనస్కుడ వునై నామాట వినుము. వేయి ఆశ్వ మేధములు నూరు వాజపేయములు సేసిన ఫలము నా ప్రసాదముచే నీవిప్పుడంద గలవు. షడంగ వేదములను సమగ్రసాంఖ్య యోగములను (జ్ఞాన యోగములను) నీవు తెలిసి కొనుము. పండ్రెండేండ్లు దేవ దానవులు చేయలేని ప్రజ్ఞా హీనులు (అజ్ఞానులు) నిందించు నట్టిదియు వర్ణాశ్రమ ధర్మములతో గూడి నదియు లొంగని దియు వ్యవసితమును (వ్యవస్థ చేయ బడినదియు) పశుపాశ విమోచనము సేయునది. (జీవుల యజ్ఞాన పాశముల ద్రెంచునది) సర్వాశ్రమస్థులకు నను వైనదిగ నేను సర్వ పశుపాప విమోచన మంత్రమును రూపొందించి తిని. ఇది లెస్సగ నాచరించిన యెడల పుష్కలమైన ఫలము గల్గును. అది నీకు అనుష్టేయ మగుగాక ! మహానుభావ! మానసిక జ్వరమును(తాపమును) విడువుము.
బ్రహ్మ:
ఏవ ముక్త్వా తు దేవేశః సపత్నీకః సహానుగః
ఆదర్శన మనుప్రాప్తో దక్ష స్యామిత తేజసః
అవాస్య చ తథా భాగం యథోక్తం చోమయా భవః
జ్యరం చ సర్వధర్మజ్ఞో బహుదా వ్యభజ త్తదా
శాంత్యర్ధం సర్వభూతానాం శృణుధ్వ మథ వై ద్విజాః
బ్రహ్మ:
ఇట్లు దేవేశుండు పలికి ఉమాదేవితో పరివారముతో యంత ర్థానమయ్యెను. మఱియు నా భవుడు సర్వధర్మజ్ఞుడు గావుస సర్వభూత శాంతి కొఱకు దక్షయజ్ఞ ధ్వంసమునకు దానా విర్భవింప జేసిన జ్వరము నీ క్రింది విధముగా విభజించెను. ఈ వివరము నో విప్రోత్తము లారా వినుండు.
శిఖాభితాపో నాగానాం పర్వతానాం శిలాజతు
అపాం తు నీలికాం విద్యా న్నిర్మోకో భుజగేషు చ
ఖోరకః సౌరభేయానా మూపరః పృధీవీతలే
శునా మపి చ ధర్మజ్ఞ! దృష్టి ప్రత్యవరోధనమ్
రంద్రాగత మధా శ్వానాం శిఖోధ్బేద శ్చ బర్హిణామ్
నేత్రరాగః కోకిలానాం ద్వేషః ప్రోక్తో మహాత్మనామ్
జనానా మపి భేద శ్చ సర్వేషా మితి నః శ్రుతమ్
శుకానా మపి సర్వేషాం హిక్కికా ప్రోచ్యతే జ్వరః
శార్దూలేష్వథ వై విప్రాః శ్రయో జ్వర ఇహోచ్యతే
మానుషేషు చ సర్వజ్ఞా జ్వరో నామైష కీర్తితః
మరణే జన్మని తథా మథ్యే చాపి వివేశితః
ఏతన్మాహేశ్వరం తేజో జ్వరో నామ సుదారుణః
నమస్య శ్చైవ మాన్య శ్చ సర్వప్రాణిభి రీశ్వరః
ఇమాం జ్వరోత్పత్తి మదీనమానసః
పఠే త్సదా యః సుసమాహితో నరః
విముక్తరోగః స నరో ముదా యుతో లభేత కామాం శ్చ యథామనీషితాన్
ఆ జ్వరము గజములలో శిరోతాపము గను, పర్వతములలో శిలాజితము గను, నీటిలో నీలిక (అను పేరుతోను) పాములలో కుబుసము గను అవులలో ఖోరకము భూమి యందు ఊషరము(చవిటి నేల) కుక్కలకు నేత్రా వరోధము (గ్రుడ్డి తనము) గుఱ్ఱములకు రంధ్రా గతము నెమళ్లకు పించెము లూడి పోవుట కోకిలలకు నేత్ర రాగము గను మహాత్ములకు ద్వేషము సర్వ జనులకు భేదము(ఒంటెత్తు తనము. ఒకరి కొకరికి బడక పోవుట) చిలుకల కెక్కిళ్లు పులులకు శ్రమ(అలసట) మనుష్యులకు కేవలము జ్వర రూపమైన వ్యాధియే ఇది నరులకు పుట్టు నపుడు గిట్టు నపుడు ఆరెంటికి నడుమను గూడ, నుంచ బడినది. ఇది మాహేశ్వర తేజస్సే. జ్వరము (శివ జ్వరము) అనుపేర మిక్కిలి దారుణమై యున్నది. సర్వ ప్రాణులకును ఈశ్వరుడు నమస్కరింప వలసిన వాడు మాన్యుడు(పూజ నీయుడు) ఈ జ్వరోత్పత్తి నిండు మనసుతో జదివిన వాడు రోగ ముక్తుడై సంతోషముతో గూడి సర్వాభీష్టముల నందును.
ఫలశ్రుతి
దక్షప్రోక్తం స్తవం చాపి కీర్తయే ద్యః శృణోతి వా
నాశుభం ప్రాప్నుయాత్కించి ద్దీర్ఘమాయు రవాప్నుయాత్
యథా సర్వేషు దేవేషు వరిష్టో భగవా న్భవః
తథా స్తవో వరిష్టో యం స్తవానాం దక్షనిర్మితః
యశ స్స్వర్గ సురైశ్వర్య విత్తాది జయకాంక్షిభిః
స్తోతవ్యోభక్తి మాస్థాయ విద్యాకామై శ్చ యత్నతః
వ్యాధితో దుఃఖితో దీనో నరో గ్రస్తో భయాదిభిః
రాజకార్య నియుక్తో వా ముచ్యతే మహతో భయాత్
అనేనై వ చ దేహేన గణానాం చ మహేశ్వరా త్
ఇహ లోకే సుఖం ప్రాప్య గణరా డుపజాయతే
న యక్షా న పిశాచా వా నాగా నచవినాయకాః
కుర్యు ర్విఘ్నం గృహే తస్య యత్ర నం స్తూయతే భవః
శృణుయా ద్వా ఇదం నారీ భక్త్వా థ భవభావితా
పితృపక్షే భర్తృపక్షే పూజ్యా భవతి చైవ హి
శృణుయా ద్వా ఇదం సర్వం కీర్తయే ద్వా ప్యభీక్షుణశః
తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం గచ్చన్త్యవిఘ్నతః
మనసా చింతితం యచ్చ యచ్చ వాచా ప్యుదాహృతమ్
సర్వం సంపద్యతే తస్య స్తవ స్యాస్యా నుకీ ర్తనాత్
దేవన్య సగుహస్యా థ దేవ్యా నందీశ్వరస్య చ
బలిం విబాగతః కృత్వా దమేన నియమేన చ
తతః ప్రయుక్తో గృహ్ణీయా న్నామా న్యాశు యథాక్రమమ్
ఈ ప్సితాంల్ల భతే ప్యర్థా న్కామా న్భోగాం శ్చ మానవః
మృత శ్చ స్వర్గ మాప్నోతి స్త్రీసహస్ర సమావృతః
సర్వకామసుయుక్తో వా యుక్తో వా సర్వ పాతకైః
పఠ న్దక్షకృతం స్తోత్రం సర్వపాపైః ప్రముచ్యతే
మృత శ్చ గణసాయుజ్యం పూజ్యమాన స్సురాసురైః
వృషేణ వినియుక్తేన విమానేన విరాజితే
ఆభూతసంప్లవస్థాయీ రుద్ర స్యానుచరో భవేత్
దక్షుడు సేసిన యీ శివస్తవమును బారాయణము సేసిన వాడె న్నడును అశుభము నందడు. దీర్ఘాయు వందును సర్వ దేవులందు మహా దేవుడు భగవంతుడు శ్రేష్ఠుడయి నట్లు దక్ష కృతమైన యీ శివస్తుతి కూడ సర్వస్తుతి వరిష్ఠము. కీర్తి స్వర్గము దేవైశ్వర్యము ధనము జయము గోరు వారును విద్యా కాములను ఈ స్తవమును భక్తితో పఠింప వలయును. వ్యాధి, దుఃఖము భయమునకు గురియైన వాడు రాజకార్య నియుక్తుడును నీ స్తుతి పఠించిన భయ విముక్తు డగును. అతడీ దేహము తోనే శివ గణములను భవించు మహేశ్వర సుఖమును( పరమేశ్వర విభూతిని) ఇహమంద నుభవించి, గణాధిపతి యగును. యక్షులు పిశాచులు నాగులు వినాయకులును ఆ భక్తుని కెట్టి విఘ్నములు గల్గింపరు. ఈస్తుతిని భక్తితో శివునిపై భావము నిల్పి విన్నచో పుట్టింటను అత్తింటను బూజ్యు రాలగును. దీనిని విన్నను కీర్తించి నను వానికి నిర్విఘ్నముగ సర్వ కార్వసిద్ది యగున. ఇది కీర్తించుటచే మనసు చేత సంకల్పించి నది మాటచే నన్నది యెల్ల పనులు నెరవేరును. కుమార స్వామికి గౌరికి నందీశ్వరునికి ఇంద్రియని గ్రహముతో నియమముతో వేర్వేరు బలిని (పూజను) నోనరించి యా మీద నీ శివ నామములను గ్రమముగ బారాయణకు గ్రహింప వలెను. అందు వలన మానవు డిష్టార్థములను భోగములను పురుషార్థములను బడయును. మరణించి అప్సరః స్త్రీ సహస్రముతో స్వర్గమున కేగును. కోరికలతో పాతకములతో నున్న వాడైన నీ దక్షకృత శివస్తుతి పఠించి సర్వపాప ముక్తు డగును. దేహ పాతా నంతరము గణ సాయజ్య మందును. సురాసుర లపుడు వానిం బూజింతురు. అతడు భూత ప్రళయము దాక వృషభ వాహన మెక్కి, విమాన మెక్కి రుద్రానుచరు డగును.
ఇత్యాహ భగవా న్వ్యాసః పరాశరసుతః ప్రభుః
నైత ద్వేదయ తేకశ్చిన్నైత చ్ర్చావ్యం చకస్యచిత్
శ్రుత్వేమం పరమం గుహ్యం యే పి స్యుః పాపయోనయః
వైశ్యాః స్త్రియశ్చ శూద్రా శ్చ రుద్రలోక మవాప్నుయుః
శావ్రయే ద్యశ్చ విప్రేభ్యః సదా పర్వసు పర్వసు
రుద్రలోక మవాప్నోతి ద్విజో వై నాత్ర సంశయః
ఈ విధముగ పరాశర నూనుడు వ్యాస భగవానుడు పలికినాడు. ఇది యెవ్వడు నెఱుగడు. దీని నెవ్వనికి వినిపింప రాదు. ఇది గుహ్యమైన (మంత్ర సమ్మితమైన) స్తవము. పాప జన్ముల యినను వైశ్యులు స్త్రీలు శూద్రులు నీస్తుతి పఠించి విని రుద్రలోక మందుదురు. విప్రులకు ప్రతి పర్వమందు దీనిని వినిపింప వలెను. అందుచే ద్విజుడు రుద్రలోక మందును సందియుము లేదు.
Summary of chapter 40 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The sacred land of Utkala (Oḍiśā) is described as a supremely holy territory blessed by the presence of Puruṣottama (Jagannātha). The divine significance of this land, its sacred rivers and forests, and the merit of residing or dying within its boundaries are extolled. The chapter begins the extended Puruṣottama-kṣetra section that continues through many subsequent chapters.