బ్రహ్మ మహా పురాణము
196 - కాలయవనో పాఖ్యానమ్
గార్గ్యం గోష్ఠే ద్విజం శ్యాలః షండ ఇత్యుక్తవాన్ ద్విజాః యదూనాంసంనిధౌ సర్వేజహసుర్యాదవా స్తదా
తతఃకోపసమావిష్టో దక్షిణాపథమేత్యసః సుతమిచ్ఛంస్తపస్తేపే యదుచక్రభయావహమ్
ఆరాధయన్మహాదేవం సోయశ్చూర్ణ మభక్షయత్ దదౌవరంచ తుష్టోసౌ వర్షే ద్వాదశకే హరః
సంభావయామాస స తం యవనేశోహ్యనాత్మజమ్ తద్యోపిత్సంగమా చ్ఛాస్యపుత్రోభూద్రవిసప్రభః
తంకాలయవనంనామ రాజ్యేస్వే యవనేశ్వరః అభిషిచ్య వనంయాతో వజ్రాగ్రకఠినోరసమ్
గోష్ఠ మందు గార్గ్యుని బావమరది యతనని (పురోహితుని) యదువులదరి సన్నిధి యందు షండుడని (నపుంసకుడని) తూల నాడెను. యాదవు లందఱు నవ్విరి. అంత నతడు కినుక గొని దక్షిణా పథమునకు వచ్చి యదు వంశ భయంకరుడగు పుత్రునిం గోరి తపస్సు చేసెను. ఆతడు శివు నారాధించుచు లోహచూర్ణ మాత్రము దిని యుండెను. హరు డాతనికి సంతుష్టుడై పండ్రెండవ సంవత్సరమున వర మిచ్చెను. పుత్ర సంతతి లేని యాతనిని యవనాధీశ్వరుడు గౌరవించెను. వాని యంగనతో నతడు సంగమించి నంతట భ్రమర (తుమ్మెద) సమాన ప్రభగల కొడుకు పుట్టెను. కాల యవనుడను పేరు గల వానిని వజ్ర కఠినమైన రొమ్ము గల వానిని తన రాజ్యమున పట్టాభిషేకించి యడవికిం బోయెను.
సతువీర్యమదోన్మత్తః పృథివ్యాం బలినో నృపాన్ పప్రచ్ఛనారదశ్చాసమైకథయామాపయాదవాన్
మ్లేచ్ఛకోటి సహస్రాణాం సహసైః సోపి సంవృతః గజాశ్వరథసంపన్నైశ్చకార పరమోద్యమమ్
ప్రయయౌచాతపచ్ఛన్నైః ప్రయాణౖః స దినేదినే యాదవాన్ ప్రతిసామర్షోమునయో మథురాంపురీమ్
కృష్ణోపి చింత యామాస క్షపితం యాదవంబలమ్ యవనేన సమాలోక్య మాగధః సంప్రయాస్యతి
మాగధస్యబలం క్షీణం సకాలయవనోబలీ హంతా తదిదమాయాతం యదూనాం వ్యసనంద్విధా
తస్మాద్దుర్గం కరిష్యామి యదూనామతిదుర్జయమ్ స్త్రియోపి యత్రయుధ్యేయుః కింపునర్వృష్ణి యాదవాః
మయిమత్తే ప్రమత్తే వాసుప్తే ప్రవసితేపివా యాదవాభిభవం దృష్ట్వామాకుర్యుర్వైరిణోధికమ్
ఇతి సంచింత్య గోవిందో యోజనాని మహోదధిమ్ యయాచేద్వాదశ పురీంద్వారకాంతత్ర నిర్మమే
మహోద్యానాం మహావప్రాంతడాగశత శోభితామ్ ప్రాకారశతసంబాధా మింద్రస్యేవామరావతీమ్
మథురావాసినంలోకం తత్రానీయ జనార్ధనః ఆసన్నేకాలయవనే మథురాంచ స్వయంయయౌ
బహిరావాసితే సైన్యే మథురాయా నిరాయుధః నిర్జగామ సగోవిందో దదర్శయవనశ్చతమ్
సజ్ఞాత్వా వాసుదేవంతం బహుప్రహరణోనృపః అనుయాతో మహాయోగీచేతోభిః ప్రాప్యతే న యః
తేనానుయాతః కృష్ణోపి ప్రవివేశ మహాగుహామ్ యత్రశేతే మహావీర్యోముచుకుందో నరేశ్వరః
సోపిప్రవిష్టో యవనో దృష్ట్వా శయ్యాగతంనరమ్ పాదేనతాడయామాస కృష్ణంమత్వా స దుర్మతిః
దృష్టమాత్రశ్చతే నాసౌజజ్వాల యవనోగ్నినా తత్ క్రోథజేనమునయోభస్మీభూతశ్చతత్ క్షణాత్
సహిదేవాసురేయుద్ధేగత్వాజిత్వా మహాసురాన్ నిద్రార్తః సుమహాకాలం నిద్రాంవవ్రేవరంసురాన్
ప్రోక్తశ్చదేవైః సంసుప్తం యస్త్వాముత్థాపయిష్యతి దేహజేనాగ్నినా సద్యఃసతుభస్యీ భవిష్యతి
ఆ కాల యవనుడు బలమున మదమెక్కి యవనిం గల బలవంతులు రాజు లెవ్వడని యడుగ నారదుండు యాదవులని తెల్పెను. వాడు కోటివేల మంది మ్లేచ్ఛులతో జతురంగ బలముతో పెద్ద యుద్యమము సేసెను. దినదిన మెండ లంబడి వాడు పయనించి కసిగొని యాదవులను గూర్చి మధురాపురి కేగెను. అంతట గృష్ణు డిట్లా లోచించెను యవనులచే యాదవులము నశించుట చూచి మాగధుడు (జరాసంధుడు) యుద్ధమున కేతెంచును. మాగధుని బలము క్షీణించి నపుడు యవనుడు వచ్చును ఈ విధముగ రెండు వైపుల నుండియు యాదవులకు కష్టము వచ్చి పడినది. అందుచే యాదవుల కొరకభేద్య మైన దుర్గ మొకటి నిర్మించెదను. తద్రక్షణచే నబలలు (స్త్రీలు) కూడ యుద్ధము చేయ గలరు. అట్టి యెడ పృష్టి యదు వంశముల వారి మాట చెప్పనేల? నేను మత్తుకొని కాని ప్రమత్తుడనై కాని యున్నను నిద్ర పోయినను నెటకేని ప్రవాసము వెళ్ళిన గాని యాదవుల లోకువ చూచి శత్రువులు వారిపై నెక్కువ విజృంభింపరు. అని గోవిందు డాలోచించి మహా సముద్రుని పండ్రెండు యోజనముల మేర నిమ్మని (సముద్రమును దూరముగా తొలగుమని కోరి) యచట ద్వారకాపుర నిర్మాణము సేసెను. అది మహోద్యానములు పెద్దకోట పెక్కు తటాకములు ప్రాకారములతో నింద్ర రాజధాని యమరావతి వలె నుండెను. మధురాపుర వాసుల నక్కడికి గొనివచ్చి యందుంచి కాల యవనునికి దగ్గరగా నుండునని తాను మధుర కేగెను. అందుండి సైన్యము తరలింప బడగా దాన నిరాయుధుడై యటకేగి నంత నతనిని గాల యవనుడు చూచెను. వాడాయన వాసుదేవుడని గ్రహించి చేత నాయుధము బూని మహా యోగులేని మనసుల చేబట్ట రాని యా స్వామిని వెన్నంటి తరిమె. అట్లు తరుమ బడి కృష్ణు డచ్చట ముచుకుందుడను రాజు మహా పరాక్రముడు నిద్రించు చున్న గుహలో బ్రవేశించెను. ఆ యవనుడు నటదూరి యట పరుండి యున్న నరుని గని కృష్ణు డనుకొని పాదముచే దన్నెను. అతడు కన్ను తెఱచి చూచిన క్షణములో యవనుడగ్నిచే గాలి పోయెను. ఆ ముచుకుందుడు మున్ను దేవాసుర యుద్దమున కేగి మహా రాక్షసు లందఱిం జయించి దేవతలను నిద్ర కావలెనని కోరెను. వారును నిదురించిన నిన్నెవ్వడు వచ్చి లేపునో వాడు దేహమునం బుట్టిన యగ్నిచే నప్పుడ భస్మము గాగలడు అని వర మిచ్చిరి.
ఏవందగ్ధ్వా స తం పాపం దృష్ట్వా చ మధుసూదనమ్ కస్త్వమిత్యాహసోప్యాహ జాతోహంశశినఃకులె
వసుదేవస్యతనయోయదువంశసముద్భవః ముచుకుందోపితచ్ఛృత్వా వృద్ధగార్గ్యవచః స్మరన్
సంస్మృత్యప్రణి పత్యైనం సర్వం సర్వేశ్వరం హరిమ్ ప్రాహజ్ఞాతోభవాన్ విష్ణోరంశస్త్వం పరమేశ్వరః
పురాగార్గ్యేణ కథితమష్టావింశ త్తమేయుగే ద్వాపరాంతే హరేర్జన్మ యదువంశే భవిష్యతి
స త్వం ప్రాప్తోన సందేహో మర్త్యానాముపకారకృత్ తథాహిసుమహత్తేజోనాలం సోఢుమహంతవ
తథాహిసుమహాంభోదధ్వని ధీరతరంతతః వాక్యంతమితిహోవాచ యుష్మత్ పాదసులాలితమ్
ఇట్లా పాపాత్ముని యవనునిం గాల్చి మధుసూదనుం గని ఎవడ వీవన నేను చంద్ర వంశమున వసుదేవునికి బుట్టి నాడను యాదవుడ నని హరి పల్కెను. ముచుకుందుడు విని వృద్ధ గార్గ్యుని మాట స్మరించి సర్వేశ్వరుండని యెఱింగి హరికి ప్రణతుడై యిట్లనియె. అవును నిన్నెఱుగుదును నీవు విష్ణు నంశమున నుదయించిన వాడవు. మున్ను గార్గ్యుడు ఇరువది యెనిమిదవ ద్వాపరము చివర యదు వంశమున హరి యవతారము జరుగు నని చెప్పెను. అతడే నీవు. మర్త్యుల కుపకారము చేయ దయ చేసిన వాడవు. సంశయము లేదు. నీ అప్రాకృత దివ్య తేజము నేని సహింప లేను. అని మహామేఘ గర్జా గంభీరమైన ధ్వనితో ముచుకుందుడు కృష్ణ స్వామి నిట్లు స్తుతించెను.
ముచుకుందుడు:
దేవాసురే మహాయుద్ధే దైత్యాశ్చసుమహాభటాః నశేకుస్తే మహత్తేజ స్తత్తేజో నసహామ్యహమ్
సంసార పతితస్మైకోజంతో స్త్వం శరణంపరమ్ సంప్రసీద ప్రపన్నార్తి హర్తాహర మమాశుభమ్
త్వం పయోనిధయః శైలాః సరితశ్చవనానిచ మేదినీగగనం వాయురాపోగ్నిస్త్వంతథాపుమాన్
పుంసః పరతరం సర్వం వ్యాప్యజన్మ వికల్పవత్ శబ్దాదిహీనమజరం వృద్ధి క్షయ వివర్జితమ్
త్వత్తోమరాస్తు పితరో యక్షగంధర్వ రాక్షసాః సిద్ధాశ్చాప్సరస స్త్వత్తో మనుష్యాః పశవఃఖగాః
సరీసృపాః మృగాస్పర్వే త్వత్తశ్చైవ మహీరుహాః యచ్చభూతం భవిష్యద్వాకించి దత్రచరాచరే
అమూర్తం మూర్త మథవాస్థూలం సూక్ష్మతరంతథా తత్సర్వం త్వం జగత్కర్త ర్నాస్తికించి త్త్వయావినా
మయాసంసార చక్రేస్మిన్ భ్రమతా భగవన్ సదా తాపత్రయాభిభూతేన నప్రాప్తా నిర్వృతిః క్వచిత్
దుఃఖాన్యేవ సుఖానీతి మృగతృష్ణా జలాశయః మయానాథ గృహీతాని తాని తాపాయమేభవన్
రాజ్యముర్వ్యాం బలంకోశోమిత్ర పక్షస్తథాత్మజాః భార్యా భృత్యజనా యేచశబ్దాద్యా విషయాః ప్రభో
సుఖబుద్ధ్యామయా సర్వం గృహీతమిద మవ్యయ పరిణామేచదేవేశతాపాత్మక మభూన్మమ
దేవలోక గతింప్రాప్తోనాధ దేవగణోపిహి మత్తఃసాహాయ్య కామోభూచ్ఛాశ్వతే కుత్ర నిర్వృతిః
త్వామనారాధ్య జగతాం సర్వేషాం ప్రభవాస్పదమ్ శాశ్వతీ ప్రాప్యతేకేన పరమేశ్వర నిర్వృతిః
త్వన్మాయామూఢమనసో జన్మమృత్యుజరాదికాన్ అవాప్య పాపాన్ పశ్యంతి ప్రేతరాజాన మంతరా
తతఃపాశశతైర్బద్ధా నరకేష్వతిదారుణమ్ ప్రాప్నువంతి మహద్దుఃఖం విశ్వరూప మిదంతవ
అహమత్యంత విషయీ మోహిత స్తవమాయయా మమత్వాగాధగర్తాంతే భ్రమామి పరమేశ్వర
సోహంత్వాం శరణమపార మీశమీడ్యం సంప్రాప్తః పరమపదం యతోనకించిత్ సంసాన శ్రమ పరితాపత ప్తచేతా నిర్విణ్ణే పరిణతధామ్ని సాభిలాషః
ముచుకుందుడు:
స్వామి! దేవాసుర యుద్దములం దుద్భటులైన దైత్యు లెందఱో నీ తేజమునకు దట్టుకొన లేక పోయిరి. అట్టి నీ తేజస్సు నేనోర్వ జాలను. సంసార పతితమైన జంతువునకు నీవొక్కడివే దిక్కు. ప్రసన్నుల యార్తిని హరించు నీవు నా యెడ ప్రసన్నుడవు గమ్ము. నా అశుభమును హరింపుము. సముద్రములు పర్వతములు నదులు మేదిని గగనము వాయువు నీరు అగ్నియు నీవే. పురుషుని కంటె మిగుల పరమై వికల్పాత్మక మైన యెల్ల జన్మము లందు వ్యాపించి శబ్దాది విషయ స్పర్శ లేక వృద్ధి క్షయ జరాదులు లేక యున్న కేవలమైన వస్తువు నీవే. నీవలనన చరా చరాత్మకము స్థూలము సూక్ష్మము నైన జగత్తు పొడమినది. పొడము చున్నది. పొడమ నున్నది. మూర్తము అమూర్తము నైవదెల్ల నీవలన నైనదే. నీ కంటె మఱి యేదియు లేదు. సంసార చక్ర పరిభ్రమణము సేయుచు తాపత్రయ తప్తుడనైన నాకాత్యంతిక సుఖమంద లేదు. దుఃఖములను సుఖములని యెండ మావులను జలాశయములని యనుకొంటిని. అది ఎక్కడ లేని యుడుకుం దెచ్చి పెట్టినది. రాజ్య సుఖము పుత్రమిత్ర కళత్రాదికము శబ్దాది విషయ భోగము సుఖమని మఱిగిన నాకు తుదకది తాపాత్మకముగా పరిణ మించినది. దేవలోక గతి నందితిని గాని యా దేవ గణము నాసాహాయ్యము గోరినది. తండ్రీ! శాశ్వతమైన నిర్వృతి (పరమ తృప్తి) యెక్కడ? సర్వ జగత్ప్రభవ స్థానమును నిన్నారాధింపక యా శాశ్వతానంద మెవడు పొందును? నీమాయచే మూఢులై జన్మ మృత్యు జరాది పాపానుభవముల నంది ప్రేతపతిం జూతురు. అవ్వల కాలపాశములం గట్టువడి యతి దారుణముగ నరకము లందనేక విధములగు దుఃఖము లందురు. ఇది నీ విశ్వ స్వరూపము. నేను విషయ లోలుడనై నీ మాయచే మోహితుడనై మమకారమను మురికి గుంటలో తిరుగాడు చున్నాను. పరమేశ్వర! నిన్ను స్తుతిపాత్రుని శరణందు చున్నాను. సంసార శ్రమచే నుడికిల్లిన మనసుతో నిర్విణ్ణుడనై (దుఃఖినై) పరమ పదమైన పరంధామ మైన నీ యందు ముచ్చట గొన్నాడను.
Summary of chapter 89 of the Brahma Mahā Purana is as follows:
Balarāma, moved by nostalgia and longing, returns to Vṛndāvana to visit the gopīs and cowherds who had loved him and Kṛṣṇa in childhood. The reunion is joyful; the gopīs share their grief at Kṛṣṇa's prolonged absence, and Balarāma consoles them with assurance of the Lord's grace. The chapter depicts the unchanging devotion of the Vṛndāvana community even years after Kṛṣṇa's departure.