బ్రహ్మ మహా పురాణము
214 - యమలోక మార్గ స్వరూప వర్ణనమ్
మునులు:
న తృప్తి మధిగచ్ఛామః పుణ్యధర్మామృతస్య చ
మునే త్వన్ముఖగీతస్య తథాకౌతూహలం హి నః
ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం కర్మణో గతిమ్
వేత్సి సర్వం మునే తేన పృచ్ఛామస్త్వాం మహామతిమ్
శ్రూయతే యమలోకస్య మార్గః పరమదుర్గమః
దుఃఖక్లేశకరః శశ్వ త్సర్వ భూత భయావహః
కథం తేన నరా యాంతి మార్గేణయమసాదనమ్
ప్రమాణం చైవ మార్గస్య భ్రూహి నో వదతాం వర
మునే పృచ్ఛామ సర్వజ్ఞ బ్రూహి సర్వమశేషతః
కథం నరకదుఃఖాని నాప్నువంతి నరాన్మునే
కేనోపాయేన దానేన ధర్మేణ నియమేన చ
మానుషస్య చ యామ్యస్య లోకస్య కియదంతరమ్
కథం చ స్వర్గతిం యాంతి నరకం కేన కర్మణా
కియంతి స్వర్గస్థానాని కియంతి నరకాని చ
కథం సుకృతినో యాంతి కథం దుష్కృత కారిణః
కిం రూపం కిం ప్రమాణం వా కో వర్ణ స్తూభయోరపి
మునులు:
“వ్యాస ముని! మీ ముఖముచే గానము చేయబడిన పుణ్య ధర్మముల నెడి గానామృతమునకు దృప్తి జెంద లేకున్నాము. భూతముల యొక్క పుట్టువు ప్రళయము కర్మగతి యంతయు నెరుగుదువు. అందు వలన నిన్నడుగు చున్నాము. యమలోక మార్గము దుఃఖ క్లేశము లను గల్గించు నని సర్వభూత భయంకర మని మిక్కిలి దుర్లభ మని విన్నాము. ఆ దారి వెంట నరులు యమ సదనమున కెట్లు వెళ్ళుదురు. ఆ దారి యొక్క దూరమెంత? నరక దుఃఖములను బొంద కుండుటకు నుపాయము, దాన ధర్మ నియమాదు లెట్టివి? నరులు స్వర్గమెట్లు పొందుదురు. ఆ రెంటికిని స్థానము లెన్ని? పుణ్యాత్ములెట్లు వెళ్ళుదురు. పాపులెట్లు వెళ్ళుదురు? స్వర్గమునుకు గొంపోబడు జీవుని యొక్కయు నరకమునకు గొంపోబడు జీవుని యొక్కయు ఆకారము రంగు ప్రమాణము లెట్టివి?” అన వ్యాసు డిట్లనియె.
వ్యాసులు:
శృణుధ్వం మునిశార్దూలా వదతో మమ సువ్రతాః
సంసార చక్రమజరం స్థితిర్యస్య న విద్యతే
సోహం వదామి వః సర్వం యమమార్గస్య నిర్ణయమ్
ఉత్క్రాంతికాలాదారభ్య యథానాన్యో వదిష్యతి
స్వరూపంచైవ మార్గస్య యన్మాం పృచ్ఛథ సత్తమాః
యమలోకస్యచాధ్వాన మంతరం మానుషస్య చ
యోజనానాం సహస్రాణి షడశీతి స్తదంతరమ్
తప్తతామ్రమివాతప్తం తదధ్వానముదాహృతమ్
తదవశ్యం హి గంతవ్యం ప్రాణిభిర్జీవ సంజ్ఞకైః
పుణ్యా న్పుణ్యకృతో యాంతి పాపాన్పాప కృతోధమాః
ద్వావింశతిశ్చ నరకా యమస్య విషయే స్థితాః
యేషు దుష్కృత కర్మాణో విపచ్యంతే పృధక్పృథక్
నరకో రౌరవో రౌద్రః శూకరస్తాళ ఏవ చ
కుంభీపాకో మహాఘోరః శాల్మలోథ విమోహనః
కీటాదః కృమిభక్షశ్చ నా (లా) లాభక్షో భ్రమస్తథా
నద్యః పూయ వహాశ్చాన్యా రుధిరాంభ స్తథైవ చ
అగ్నిజ్వాలా మహాఘోరః సందంశః శునభోజనః
ఘోరా వైతరిణీ చైవ అసిపత్రవనం తథా
“సంసార చక్రము అజరము. అనగ నది యెన్నిటికిని శిథిలము కానిది. నిలుకడ లేక తిరుగుచునే యుండును. ప్రాణోత్ర్కమణము జరిగినది మొదలు జీవుడు పయనించు యమ మార్గ స్వరూపము నేను జెప్పెదను. మఱి యొకడు సెప్పలేడు. యమ లోకమునకు మనుష్య లోకమునకు నడుమ గల యంతరము ఎనుబది యారువేల యోజనములు. కాలిన రాగి వలెనది క్రాగు చుండును. జీవులు తప్పక ప్రయాణము జేయ వలసిన దారి యది. పుణ్యులు పుణ్యలోక మునకు బాపులు నరకమునకు పోవుదురు. యముని రాజధానిలో నిరువది రెండు నరకము లున్నవి. వాని పేరులు స్పష్టము.
న తత్ర వృక్షచ్ఛాయా వా న తడాగాః సరాంసి చ
న వాప్యో దీర్ఘికా వాపి న కూపో న ప్రపా సభా
న మండపోనాయతనం న చ నద్యో నచ పర్వతాః
న కించి దాశ్రమస్థానం విద్యతే తత్ర వర్త్మని
యత్ర విశ్రమతే శ్రాంతః పురుషోతీవకర్షితః
అవశ్యమేవ గంతవ్యః ససర్వైస్తు మహాపథః
ప్రాప్తే కాలే తు సంత్యజ్య సుహృద్బంధుధనాదికమ్ జరాయుజాండజాశ్చైవస్వేదజాశ్చోద్భిజా స్తథా
జంగ మాజంగమాశ్చైవ గమిష్యంతి మహాపథమ్
దేవాసుర మనుష్యైశ్చ వైవస్వతవశానుగైః
స్త్రీపుంనపుంసకైశ్చైవ పృథివ్యాం జీపసంజ్ఞితైః
పూర్వాహ్ణే చాపరాహ్ణేవా మధ్యాహ్నేవా తథా పునః
సంధ్యాకాలేర్ధరాత్రే వా ప్రత్యూషే వాప్యుపస్థితె
వృద్ధైర్వా మధ్యమైర్వాపి యౌవనస్థైస్తథైవ చ
గర్భవాసేథ బాల్యే వా గంతవ్యః స మహాపథః
ప్రవాసస్థైర్గృహస్థైర్వా పర్వతస్థైః స్ధలేపి వా
క్షేత్రస్థైర్వా జలస్థైర్వా గృహమధ్య గతైస్తథా
ఆసీనైశ్చాస్థితైర్వాపి శయనీయగతై స్తథా
జాగ్రద్భిర్వా ప్రసుప్తైర్వా గంతవ్యః స మహాపథః
ఇహానుభూయ నిర్దిష్ట మాయుర్జంతుః స్వయం తదా
తస్యాంతే చ స్వయం ప్రాణై రనిచ్ఛన్నపి ముచ్యతే
జలమగ్నిర్విషం శస్త్రం క్షుద్యాధిః పతనం గిరేః
నిమిత్తం కించిదాసాద్య దేహీ ప్రాణై ర్విముచ్యతే
విహాయ సుమహత్కృత్స్నం శరీరం పాంచఖౌతికమ్
ఆ దారిలో చెట్టునీడ చెరువులు సరస్సులు బావులు చలి వెందలి విశ్రమించుటకు గృహము గాని యుండవు. ఆ దారిలో నదులు పర్వతములు గొంచెము విశ్రమించుటకు జోటు లుండవు. మరణ కాలము వచ్చినంతట బందు మిత్రాదులను వదలి సర్వ జీవులు సర్వ వేళల చిన్న పెద్ద యనకుండ గర్భములో నున్న శిశువు సైతము నేస్థితిలో నున్నను దుదకు నిద్రావస్థలో నున్నను బ్రాణములు విడిచిన జీవి యిహము నందు నిర్దిష్టమై యున్న యాయుర్దాయము ననుభవించి తుదకా దారింబడి యేగ వలసినదే. వద్దన్నను నది తప్పదు. జలాగ్నులు విష శస్త్రములు నాకలి పర్వతము నుండి పడుట మొదలగు నేదో నిమిత్తమున దేహి బ్రాణములను వదలి యీ పాంచభౌతిక మహా శరీరము నిక్కడ విడుచును.
అన్యచ్ఛరీర మాదత్తే యాతనీయం స్వకర్మజమ్
దృఢం శరీర మాప్నోతి సుఖదుఃఖోపభుక్తయే
తెన భుంక్తే స కృచ్ఛ్రాణి పాపకర్తా నరో భృశమ్
సుఖాని ధార్మికో హృష్ట ఇహ నీతో యమక్షయే
ఊష్మా ప్రకుపితః కాయే తీవ్రవాయు సమీరితః
భినత్తి మర్మస్థానాని దీప్యమానో నిరింధనః
ఉదానో నామ పవన స్తతశ్చోర్ధ్వం ప్రవర్తతే
భుజ్యతా మంబుభక్ష్యాణా మధోగతి నిరోధకృత్
తతో యేనాంబుదానాని కృతావ్యన్నరసాస్తథా
దత్తాః స తస్యామాహ్లాద మాపది ప్రతిపద్యతే
అన్నాని యేన దత్తాని శ్రద్ధాపూతేన చేతసా
సోపి తృప్తి మవాప్నోతి వినాప్యన్నేన వై తదా
యేనానృతాని నోక్తాని ప్రీతిభేదః కృతో న చ
ఆస్తికః శ్రద్ధధానశ్చ సుఖమృత్యుం స గచ్ఛతి
దేవ బ్రాహ్మణ పూజాయాం నిరతాశ్చాన సూయకాః
శుక్లా వదాన్యా హ్రీమంత స్తే నరాః సుఖమృత్యవః
యః కామాన్నాపి సంరంభా న్న ద్వేషాద్ధర్మముత్పృజేత్
యథో క్తకారీ సౌమ్యశ్చస సుఖం మృత్యుమృచ్ఛతి
వారిదాస్తృషితానాం యే క్షధితాన్న ప్రదాయినః
ప్రాప్నువంతి నరాః కాలే మృత్యుం సుఖసమన్వితమ్
శీతం జయంతి ధనధా స్తాపం చందనదాయినః
ప్రాణఘ్నీం వేదనాం కష్టాం యే చాన్యోద్వేగ ధారిణః
మోహం జ్ఞాన ప్రదాతార స్తథా దీపప్రదాస్తమః
కూటసాక్షీ మృషావాదీ యో గురుర్నానుశాస్తి వై
తాను జేసిన కర్మా నుసారము యాతనా శరీరమును సుఖ దుఃఖము లనుభవించుటకు మఱొక ధృడమైన దానిని స్వీకరించును. ఆ శరీరముతో బాపి పాపము పుణ్యుడు పుణ్యము ననుభవించును. ప్రాణము పోవు నపుడు తీవ్రమైన వాయువు చేరగుల్కొల్పబడి శరీర మందు సూక్ష్మముగనున్న అగ్ని ప్రకోపించును. అది కట్టెలు లేకుండ గనే మండు నగ్నివలె రగుల్కొని ఆయువు పట్టులను (మర్మ స్థానములు) బ్రద్దలు కొట్టును. అవ్వలను దాన వాయువు మీదికి లేచును. ఆ జీవి తిన్న యాహారము త్రాగిన నీరు క్రిందికి పోకుండ నిరోధించును. ఎవడు బ్రతికి యుండగ మంచి నీళ్ళిచ్చి యెవరి కేని యన్న రసము బెట్టెనో వానికి నా యాపద సమయ మందు హాయి గల్గును. శ్రద్ధా పవిత్రమైన మనస్సుతో నన్నము బెట్టినవాడు ఆ యమ మార్గమున నన్నము లేకుండగనే తృప్తి నొందును. అనృత మాడని వాడు నెదుట వాని ప్రీతికి భంగము చేయని వాడు ఆస్తికుడు శ్రద్ధావంతుడు సుఖమైన మరణము నొందును. దేవ బ్రాహ్మణ పూజా నిరతులు అసూయా రహితులు శుక్లులు (అచ్చము పుణ్యములు చేసిన వారు) దాతలు హ్రీమంతులు (తప్పు పని చేయుటకు గల్గెడి సంకోచము హ్రీ యన బడును) వీరు సుఖ మృత్యువులు. (అనాయాస మరణులు.) కామోద్రేక ద్వేషములకు వశుడు గాక ధర్మము దప్పక చెప్పినట్లు చేయుచు సౌమ్యుడై యుండువాడు సుఖమైన చావొందును. దప్పికకు నీళ్ళు ఆకలికి అన్నముల బెట్టిన నరులు సుఖ మరణ మందుదురు. ధన దాతలు యమ మార్గములో జలిని జయింతురు. మంచి గంధ మిచ్చిన వారు తాపము నొందరు. ఇతరుల యుద్వేగమమును సహించిన వారు ప్రాణోత్క్రమణ వేదనను బొందరు. జ్ఞాన (విద్య) దాతలు దీపమిచ్చిన వారు మోహములో బడరు. కూట సాక్షి యసత్య వాది గురుశిక్ష నొందని వాడు వెద నిందకుడు మృత్యు సమయములో మూర్ఛలో బడుదురు.
తేమోహమృత్యవః సర్వే తథా యే వేదనిందకాః
విభీషణాః పూతి గంధాః కూట ముద్గరపాణయః
ఆగచ్ఛంతి దురాత్మానో యమస్య పురుషా స్తథా
ప్రాప్తేషు దృక్పథం తేషు జాయతే తస్య వేపథుః
క్రందత్యవిరతః సోథ భాతృమాతృ పితౄం స్తథా
సా తు వాగస్ఫుటా విప్రా ఏకవర్ణా విభావ్యతే
దృష్టి ర్విభ్రామ్యతే త్రాసా త్కాసావృష్ట్యత్య (విష్టమ) థాననమ్
తతః సవేదనావిష్టం తచ్ఛరీరం విముంచతి
ప్రాణము పోవు జీవునకు భయంకరులు పాడుకంపు గొట్టువాడు బడితలు బల్లెములు దుడ్లు చేత బట్టిన వారు క్రూరులు యమ కింకరు లెదురు వత్తురు. వాండ్రు కంట బడగానే యీ ప్రాణికి కంపము పుట్టును. మొర్రోయని బంధువుల కొఱ కేడ్చును. ఆ మాటకూడ స్ఫుటముగా అన్ని యక్షరములు నేక రూపమున వినిపించును. బెదరున జూపు బెదరును. కంఠములో గురగుర పుట్టును. అంతట వేదనా మయమైన యా శరీరము జీవుడు వదలును.
వాయ్వగ్రసారీ తద్రూప మేవాన్య త్ప్రపద్యతే
తత్కర్మయాతనార్థేచ న మాతృపితృ సంభవమ్
తత్ప్రమాణవయోవస్థా సంస్థానైః ప్రాప్యతేన్యథా
తతో దూతో యమస్యాథ పాశైర్బధ్నాతి దారుణైః
జంతోః సంప్రాప్తకాలస్య వేదనార్తస్య వై భృశమ్
భూతైః సంత్యక్తదేహస్య కంఠప్రాప్తానిలస్యచ
శరీరాచ్చ్యావితో జీవో రోరవీతి తథోల్బణమ్
నిర్గతో వాయుభూతస్తు షాట్కౌశికకలే బరే
మాతృభిః పితృభిశ్చైవ భ్రాతృభిర్మాతులైస్తథా
దారైః పుత్రై ర్వయస్యైశ్చ గురుభిస్త్యజ్యతే భువి
దృశ్యమానశ్చతైర్దీనై రశ్రుపూర్ణేక్షణైర్భృశమ్
స్వశరీరం సముత్సృజ్య వాయుభూతస్తు గచ్ఛతి
వాయువు ననుసరించి (వ్రాత ప్రకోపముచే) కర్మ యాతనా నుభవమునకు దలిదండ్రుల వలన నేర్పడిన శరీరమును గాక యదే రూపమున నున్న శరీరమును సరిగా నదే ప్రమాణము నదే బాల్యా ద్యవస్థ గల యవయవములతో బొందును. అవ్వల యమదూత పాశములచే గట్టి వేయును. మరణ వేదన పడుచు గాలము రాగా పంచ భూతములు దేహమును విడచి పెట్టును. ప్రాణము కంఠగత మైన సమయమున జీవుడు శరీరము నుండి విడదీయ బడి యెద్దువలె రంకెలు వేయును. షాట్కౌశికమైన ఆనంద మయ (అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ) వాయు స్వరూప మున నిర్గమించును. తల్లి దండ్రి మొదలగు సర్వ సంబంధుల చేత విడువ బడును. బిక్క మొగములు బెట్టి కన్నీళ్ళు గార్చుచు వారు చూచు చుండ తన శరీరమును (గూడును) విడిచి వాయు రూపుడై పోవును.
అంధకార మపారం చ మహాఘోరం తమో వృతమ్
సుఖదుఃఖ ప్రదాతారం దుర్గమం పాపకర్మణామ్
దుఃసహం చ దురంతం చ దుర్నిరీక్షం దురాసదమ్
దురాపమతి దుర్గం చ పాపిష్ఠానాం సదాహితమ్
అంధకార బంధురము చుట్టు చీకటి యావరించి నది సుఖ దుఃఖ ప్రదము దుస్సహము దురంతము దురా సదము దుర్నీరీక్ష్యము, దుర్గమమునై యాదారిం బట్టి పాపాత్ములు వెళ్ళుదురు.
కృష్యమాణాశ్చ తైర్భూతైర్యామ్యైః పాశైస్తు సంయతాః
ముద్గరైస్తాడ్యమాణాశ్చ నీయంతే తం మహాపథమ్
క్షీణాయుషం సమాలోక్య ప్రాణినం చాయుషక్షయే
నినీషవః సమాయాంతి యమదూతా భయంకరాః
అరూఢా యానకాలే తు ఋక్షవ్యాఘ్రఖరేషు చ
ఉష్ట్రేషు వానరేష్వన్యే వృశ్చికేషు వృకేషు చ
ఉలూకసర్పమార్జారం తథాన్యే గృధ్రవాహనాః
శ్యేనసృగాలమారూఢాః సరఘా కంకవాహనాః
వరాహపశుభేతాళ మహిషాస్యా స్తథా పరే
నానారూపధరాః ఘోరాః సర్వప్రాణిభయంకరాః
దీర్ఘముష్కాః కరాళాస్యా వక్రనాసాస్త్రిలోచనాః
మహాహను కపోలాస్యాః ప్రలంబదశనచ్ఛదాః
నిర్గతై ర్వికృతాకారై ర్దశనైరంకురోపమైః
మాంసశోణితదిగ్ధాంగా దంష్ట్రాభిర్భృశముల్బణైః
ముఖైః పాతాళసదృశైర్జ్వలజ్జిహ్వైర్భయంకరైః
నేత్రైః సువికృతాకారై ర్జ్వలత్పింగళచంచలైః
మార్జారోలూకఖద్యోత శక్రగోపవదుద్ధతైః
కేకరైః సంకులై స్తభ్ధై ర్లోచనైః పావకోపమైః
భృశమాభరణైర్భీమై రాబద్ధైర్భుజగోపమైః
శోణాసరళగాత్రైశ్చ ముండమాలావిభూషితైః
కంఠస్థ కృష్ణసర్పైశ్చ ఫూత్కారరవభీషణైః
వహ్నిజ్వాలోపమైః కేశై స్తబ్థరూక్షైర్భయంకరైః
బభ్రుపింగళలోలైశ్చ కద్రుశ్మశ్రుభిరావృతాః
భుజదండైర్మహోఘోరైః ప్రలంబై పరిఘోపమైః
కేచిద్విబాహవస్త్రత్ర తథాన్యే చ చతుర్భుజాః
ద్విరష్టబాహవశ్చాన్యే దశవింశభుజా స్తథా
అసంఖ్యాత భుజాశ్చాన్యే కేచిద్బాహుసహస్రిణః
ఆయుధైర్వికృతాకారైః ప్రజ్వలద్భిర్భయానకైః
శక్తితోమరచక్రాద్యైః సుదీప్తైర్వివిధాయుధైః
పాశశృంఖలదండైశ్చ భీషయంతో మహాబలాః
ఆగచ్ఛంతి మహారౌద్రా మర్త్యానామాయుషం క్షయే
గ్రహీతుం ప్రాణినః సర్వం యమస్యాజ్ఞాకరాస్తథా
యత్తచ్ఛరీరమాద త్తే యాతనీయం స్వకర్మజమ్
తదస్య నీయతే జంతో ర్యమస్య సదనం ప్రతి
బద్ధ్వా తత్కాల పాశైశ్చ నిగడైర్వ్రజ్రశృంఖలైః
తాడయిత్వా భృశం క్రుద్ధై ర్నీయతే యమకింకరైః
ప్రస్థలంతం రుదంతం చ ఆక్రోశంతం ముహుర్ముహుః
హా తాత మాతః పుత్రేతి వదంతం కర్మదూషితమ్
ఆహత్య నిశితైః శూలై ర్ముద్గరై ర్నిశితైర్ఘనైః
ఖడ్గశక్తి ప్రహారైశ్చ వజ్రదండైః సుదారుణైః
భర్త్స్యమానో మాహారావై ర్వజ్ర శక్తి సమన్వితైః
ఏకైకశో భృశం క్రుద్ధై స్తాడయద్భిఃసమంతతః
స ముహ్యమానో దుఃఖార్తః ప్రతపంశ్చ ఇత స్తతః
ఆకృష్య నీయతే జంతు రధ్వానం సుభయంకరైః
కుశకంటక వల్మీక శంకుపాషాణ శర్కరే
తథా ప్రదీ ప్తజ్వలనే క్షారవజ్రశతోత్కటే
ప్రదీప్తాదిత్య తప్తేన దహ్యమాన న్తదంశుభిః
కృష్యతే యమదూతైశ్చ శివాసంనాదభీషణైః
వికృష్యమాణస్తైర్ఘోరై ర్భక్ష్యమాణః శివాశతైః
ప్రయాతి దారుణే మార్గే పాపకర్మా యమాలయమ్
క్వచిద్భీతైః క్వచిత్త్రస్తైః ప్రస్ఖలద్భిః క్వచిత్క్వచిత్
దుంఖేనాక్రందమానైశ్చ గంతవ్యః సమహాపథః
నిర్భర్త్స్యమానై రుద్విగ్నై ర్విద్రుతైర్భయవిహ్వలైః
కంపమాన శరీరైస్తు గంతవ్యం జీవసంజ్ఞకైః
కంటకాకీర్ణమార్గేణ సంతప్త సికతేన చ
దహ్యమానై స్తు గంతవ్యం నరైర్దాన వివర్జితైః
మేదశ్శోణిత దుర్గంధై ర్బస్తగాత్రైశ్చ పూగశః
దగ్ధస్ఫుటత్వచాకీర్ణై ర్గంతవ్యం జీవఘాతకైః
కూజద్భిః క్రందమానైశ్చ విక్రోశద్భిశ్చ విస్వరమ్
వేదనార్తైశ్చ సద్భిశ్చ గంతవ్యం జీవఘాతకైః
శక్తిభిర్ఛింద పాలైశ్చ ఖడ్గతోమరసాయకైః
భిద్యద్భిస్తేక్ష్ణశూలాగ్రై ర్గంతవ్యం జీవఘాతకైః
శ్వానైర్వ్యాఘ్రైర్వృకైః కంకై ర్భక్ష్యమాణైశ్చ పాపిభిః
కృంతద్భిః క్రకచాఘాతై ర్గంతవ్యం మాంసఖాదిభిః
మహిషర్షభశృంగాగ్రై ర్బిద్యమానైః సమంతతః
ఉల్లిఖద్భిః శూకరైశ్చ గంతవ్యం మాంసఖాదకైః
సూచీ భ్రమరకాకోల మక్షికాభిశ్చ సంఘశః
భుజ్యమానైశ్చ గంతవ్యం పాపిష్ఠైర్మధుఘాతకైః
విశ్వస్తం స్వామినం మిత్రం స్త్రియం వా య స్తుఘాతయేత్
శస్త్రైర్నికృత్యమానైశ్చ గంతవ్యం చాతురై ర్నరైః
ఘాతయంతి చ యేజంతూం స్తాడయంతి నిరాగసః
రాక్షసై ర్భక్ష్యమాణాస్తే యాంతి యామ్యపధం నరాః
యే హరంతి పరస్త్రీణాం వరప్రావరణాని చ
తే యాంతి విద్రుతా నగ్నాః ప్రేతీభూతా యమాలయమ్
వాసో ధాన్యం హిరణ్యం వా గృహక్షేత్రమథాపివా
యే హరంతి దురాత్మానః పాపిష్ఠాః పాపకర్మిణః
పాషాణైర్లగుడైర్థండై స్తాడ్యమానైస్తు జర్జరైః
వహద్భిః శోణితం భూరి గంతవ్యం తు యమాలయమ్
బ్రహ్మస్వం యే హరంతీహ నరా నరకనిర్భయాః
తాడయంతి తథా విప్రా నాక్రోశంతి నరాధమాః
శుష్కకాష్ఠనిబద్ధాస్తే చిన్న కర్ణాక్షినాసికాః
పూయ శోనితదిగ్ధాస్తే కాలగృధ్రైశ్చ జంబుకైః
కింకరైర్భీషణైశ్చండై స్తాడ్యమానాశ్చ దారుణైః
విక్రోశమానా గచ్ఛంతి పాపినస్తే యమాలయమ్
ఏవం పరమదుర్థర్ష మధ్వానం జ్వలనప్రభమ్
రౌరవం దుర్గవిషమం నిర్దిష్టం మానుషస్య చ
ప్రతప్తతామ్రవర్ణాభం వహ్నిజ్వాలా స్ఫులింగవత్
కురంట కంట కాకీర్ణం పృథువికట తాడనైః
శక్తివజ్రైశ్చ సంకీర్ణ ముజ్వలం తీవ్రకంటకమ్
అంగార వాలుకామిశ్రం వహ్ని కీటక దుర్గమమ్
జ్వాలామాలా కులం రౌద్రం సూర్యరశ్మిప్రతాపితమ్
అధ్వానం నీయతే దేహీ కృష్యమాణః సునిష్ఠురైః
యదైవ క్రందతే జంతు ర్దుఃఖార్తః పతితః క్వచిత్
తదైవాహన్యతే సర్వై రాయుధైర్యమ కింకరైః
ఏవం సంతాడ్యమానశ్చ లుబ్ధః పాపేషు యోనయః
అవశో నీయతే జంతు ర్దుర్ధరైర్యమ కింకరైః
సర్వైరేవహి గంతవ్య మధ్వానం తత్సుదుర్గమమ్
నీయతే వివిధైర్ఘోరై ర్యదూతై రవజ్ఞయా
నీత్వా సుదారుణం మార్గం ప్రాణినం యమకింకరైః
ప్రవేశ్యతే పురీం ఘోరాం తామ్రాయసమయీం ద్విజాః
సాపురీ విపులాకారా లక్షయోజనమాయతా
చతురస్రా వినిర్దిష్టా చతుర్ద్వారవతీ శుభా
ప్రాకారాః కాంచనాస్తస్యా యోజనాయుతముచ్ఛ్రితాః
ఇంద్రనీల మహానీల పద్మరాగోపశోభితా
సాపురీ వివిధైః సంఘై ర్ఘోరా ఘోరైః సమాకులా
దేవదానవ గంధర్వై ర్యక్షరాక్షసపన్నగైః
పూర్వం ద్వారం శుభం తస్యాః పతాకా శతశోభితమ్
వజ్రేంద్ర నీలవై ఢూర్య ముక్తాఫలవిభూషితమ్
గీతనృత్యైః సమాకీర్ణం గంధర్వాప్సరసాం గణైః
ప్రవేశ స్తేన దేవానా మృషీణాం యోగినాం తథా
గంధర్వ సిద్ధయక్షాణాం విద్యాధర విసర్పిణామ్
ఉత్తరం నగరద్వారం ఘంటాచామర భూషితమ్
ఛత్ర చామరవిన్యాసం నానారత్నైరలంకృతమ్
వీణావేణురవై రమ్యై ర్గీతమంగళ నాదితైః
ఋగ్యజుఃసామనిర్ఘోపై ర్ముని బృంద సమాకులమ్
విశంతి యేన ధర్మజ్ఞాః సత్యవ్రతపరాయణాం
గ్రీష్మే వారి ప్రదా యే చ శీతిచాగ్ని ప్రదా నరాః
శ్రాంతసంవాహకా యే చ ప్రియ వాదరతాశ్చ యే
యే చ దానరతా శూరా మాతా పితృపరాశ్చ యే
ద్విజశుశ్రూషణే యుక్తానిత్యం యేతిధిపూజకాః
పశ్చిమం తు మహాద్వారం పుర్వా రత్నైరిభూషితమ్
విచిత్రమణి సోపానం తోమరైః సమలంకృతమ్
భేరీమృదంగ సంనాదైః శంఖకాహలనాది తమ్
సిద్ధబృందైః సదా హృష్టై ర్మంగళైః ప్రణినాదితమ్
ప్రవేశస్తేన హృష్టానాం విశ్వభక్తిమతాం నృణామ్
సర్వతీర్థప్లుతా యే చ పంచాగ్నేర్యేచ సేవకాః
ప్రస్థానే యే మృతా వీరా మృతాః కాలంజరే గిరౌ
అగ్నౌ విపన్నా యే వీరాః సాధితం యైరనాశకమ్
యే స్వామి మిత్రలోకార్థే గోగ్రహే సంకులే హతాః
యమకింకరులు పాశములచే గట్టి ముద్గరము లచే గొట్టుచు లాగికొని పోవుదురు. (ముద్గరము=పొట్టి యినుప దుడ్డు) యమ దూతలు జీవుని యాయుర్దాయ మయినట్లు తెలిసికొని బల్లూకములు పెద్ద పులులు గాడిదలు వొంటెలు కోతులు మండ్ర గబ్బలు తోడేళ్ళు గుడ్ల గూబలు పాములు పిల్లులు గ్రద్దలు, డేగలు, నక్కలు, నెక్కి వత్తురు. పెక్కు వికృత రూపములతో అనగా పందులు కుక్కలు, పశువులు దున్నలు మొదలగు రూపములతో వత్తురు. భయంకర మూర్తులు వంకర ముక్కులు, మూడు కళ్ళు పెద్ద దవడలు దీర్ఘాండములు వ్రేలాడు పెదవులు గల్గి రక్త మాంసములు అలమిన శరీరములతో భయంకరమైన కోరలతో మండుచున్న నాలికలతో బాతాళము వంటి ముఖములతో వికృతము లైన నేత్రములతో పిల్లులు గుడ్ల గూబలు మిణుగురు వురుగులు ఆర్ద్ర పురుగు లట్లున్న తిరుగుడు వడుచున్న కన్నులతో మెల్లకళ్ళతో నిప్పులట్లు మెఱయు చూపులతో నాయమ దూతలు కనిపింతురు. భయంకరమైన పాము లట్లుండు అయోమయ ములైన భూషణములతో పుఱ్ఱల మాలలు ధరించి బుసలు కొట్టు నల్ల తాచుల గంఠములకు జుట్టుకొని యగ్ని మంటలట్లున్న నిక్కిన తల వెంట్రుకలతో నూర కదలు రాగి రంగు, గోరోచనపు రంగులో నున్న వ్రేలాడు గడ్డములతో గొందరికి రెండు నాలుగు పదహారు పది, ఇరువది మఱియు లెక్క లేనన్ని చేతులతో కొందరు వేయి చేతులతో మంటలు జిమ్ము వివిధా యుధములతో బాశములతో నినుప గొలుసులతో దండములతో వచ్చి హడలు గొట్టుదురు. యముని యాజ్ఞగొని జీవుల సర్వమూ హరించి కొనిపోయి యమ సదనము జేర్తురు. తడబడుచు నేడ్చుచు బొబ్బ లిడుచు అమ్మనాన్న కొడుకాయని జుట్టాలను బిలిచి యేడ్చుచున్న కర్మచే చెడిన వానిని శూలములచే బొడుచుచు నినుప గుదియలచే నడచుచు వజ్ర సమానము లైన దండములచే బాదుచు గత్తులచే నరకుచు బెల్లుగ నార్చుచు గృద్ధులైన కింకరు లీడ్చుకొని పోవుచుండ నా జీవుడు దుఃఖమున గుమిలి మూర్ఛవడి యుడుకెత్తి పోవ నిట్టటు లాగుచు సూదులట్లు గ్రుచ్చికొను గుశ కంటకముల నీడ్చుచు పుట్ణల దొర్లించుచు శంకు పాషాణముల దొరలించుచు గులకరాళ్ళ కెరలించుచు గనగన మండు మంటలలో కాలెడి యెండలో నొకవంక నక్కలు తినుచుండ జీవుడు నరక మార్గమున బోవును. ఇట పాపులు బెదరి బెదరి తడబడి యాక్రందనము చేయుచు నాదారిం జను చుందురు. కాలిన నేలపై ముండ్ల కంచెలలో కాలుచు దానము జేయని పిసిని గొట్టులు పయనింతురు. జీవ ఘాతకులు రక్తము రసి మొదలగు వాని పాడు కంపుతో గొట్టు మేకపోతు శరీరముతో జర్మము గాలుచుండ వెళ్ళును. మఱియు పులుగుల వలె గూయుచు నాక్రందించుచు వికృతముగ నాక్రోశించుచు వేదనకు గురియై వివిధా యుధములచే నరక బడుచు పొడువ బడుచు జీవ ఘాతకులా దారిం బోవుదురు. మాంసము మెక్కిన జీవులు బల్లెములచే బొడవ బడుచు ఱంపములచే గోయ బడుచు యెడ్లు దున్నలు మొదలగు వానిచే బొడవ బడుచు పందులచే గీర బడుచు సూదులచే బొడవ బడుచు గందురీగలు కుట్ట మధు ఘాతకులు (ఇతరుల నోటి యందలి మధుర మైన కూడు పడగొట్టిన వారు) స్వామి ద్రోహము జేసిన వారు మిత్రఘాత స్త్రీ ఘాత చేసిన వారు యమ కింకరుల శస్త్రములదెగి పోవలసి యుండును. నిరపరాధము లైన సాధుజంతు ఘాత చేసిన వారిని రాక్షసు లాదారిలో గొరికిగొని తిను చుందురు. పర స్త్రీల వస్త్రము లపహరించిన వారు ప్రేతలై దిగంబరులై యమాలయమునకు బరువు లెత్తుదురు. గృహక్షేత్ర సువర్ణ వస్త్ర ధాన్యాదులను దొంగిలించిన పాపులు పాషాణములచే బడితెలచే బాద బడుచు గీలుకీలు పట్టువిడి రక్తములు గార నా దారి వెంట బోవలసి యుండును. బ్రాహ్మణుల గొట్టి ఘోష పెట్టించిన వారు యెండిన కాష్ఠములకు వేసి కట్టబడి కన్ను ముక్కు చెవులు గోయబడ జీము నెత్తురుచే నలము కొనబడి కాలుని గ్రద్దలచె నక్కలచే బీకికొని తిన బడుచు దండములం బాద బడుచు మొర వెట్టుచు నాతెర వునం బోవుదురు. ఇట్టి ఘోరమైన జ్వాలా మయమైన రౌరవ మను నరకము మానవుల కేర్పడినది. కాలిన రాగి వలె మంటలు జిమ్ముచు మిణుగురులు చెదర ముళ్ళ జెముడు డొంకలతో నిండిన నిప్పుల యిసుకతో నిండి వహ్ని కీటకమైన మార్గమున (వహ్ని = నిప్పుచేత కీటకము = నిష్ఠురము) మండుటెండ గాయు దారిని బాసి చన వలసి యుండును. ఇట్లెంతో దూరము గడచిన మీద రాగి యినుముతో నిర్మితమై లక్ష యోజనముల వైశాల్యము గల్గి నలు చదరముగా నాలుగు ద్వారములు గల యమ నగరము వచ్చును. పదివేల యోజనములు ఎత్తైన బంగారు ప్రాకారములు దానికి గలవు. ఇంద్రనీలాది మణులచే నది శోభనించు చుండును. దాని తూర్పు ద్వారమున దేవ దానవ యక్ష రాక్షస పన్నగాది గణ ములుండును. వందల కొలది పతాకము లెగురు చుండును. గంధర్వ అప్సరస లట నాడుచు పాడు చుందురు. ఆ తూర్పు ద్వారమున ప్రవేశము దేవ ఋషి యోగి బృందములకు. యక్ష సిద్ధాదర విద్యాధరులకు మాత్రమే. ఉత్తర ద్వారమున గంటలు మ్రోయు చుండును. ఛత్ర చామరాదులు సొంపు నింపు చుండును. అది నానా రత్నా లంకృతము. వీణా వేణు మృదంగాది మంగళ ధ్వనులు వినిపించు చుండును. ఋగ్యజుస్సామ వేద ఘోషముతో మునిబృంద మందము గొలుపు చుండును. ఆ ద్వారము వెంట ప్రవేశము గలవారు ధర్మజ్ఞులు సత్యవ్రతులు. వేసవిలో మంచి నీరిచ్చిన వారు. చలి కాలమున వెచ్చదన మిచ్చిన వారు. అలసట వడిన వారికి విశ్రాంతి నిచ్చిన వారు. ప్రియ భాషణము చేసిన వారు. దాన శూరులు. మాతా పితృసేవా తత్పరులు. గురు శుశ్రూష చేసిన వారు. అతిథి పూజకులు. వీరికి నుత్తర ద్వారము ప్రవేశ ద్వారము. ఇక పడమటి ద్వారము రత్న భూషితము. రంగురంగుల రత్నాల మెట్లు తొమరములు నచట రాణించును. భేరీ మృదంగ శంఖాదుల ధ్వనులు కాహళముల మేళవింపు (కాహళం = బాకా) వినిపించును. హర్ష భరితులై శుభ ప్రదులైన సిద్దుల యొక్క బృందములచే నది మారుమ్రోయు చుండును. ఆ దారిని ప్రవేశమానంద భరితులకు భక్తులకు సర్వతీర్థ స్నానము జేసిన వారికి. పంచాగ్నుల సేవించిన వారికి పుణ్యతీర్థ యాత్రలందు కాలంజర పర్వతము లందు నగ్నియందు మరణించిన వారికి శత్రు నాశనము చేసికొన్న వారికి స్వామి (యజమాని) స్నేహితుడు లోకము గోపులు మొదలైన వాని రక్షణ కొరకు హతులైన శూరులకు తపోధనులకు పశ్చిమ ద్వారమున బ్రవేశ మీయ బడును.
తే విశంతి నరాః శూరాః పశ్చిమేన తపోధనాః
పుర్యాం తస్యాం మహాఘోరం సర్వసత్త్వభయంకరమ్
హాహాకార సమాక్రుష్టం దక్షిణం ద్వారమీదృశమ్
అంధకార సమాయుక్తం తీక్షణశృంగైః సమన్వితమ్
కంటకైర్వృశ్వికైః సర్సై ర్వజ్రకీటైః సుదుర్గమైః
విలుంపద్భిర్వృకైర్వ్యాఘ్రై రృక్షైః సింహైః సజంబుకైః
శ్వాసమార్జార గృధ్రైశ్చ సజ్వాలకవలైర్ముఖైః
ప్రవేశస్తేన వై నిత్యం సర్వేషామపకారిణామ్
యే ఘాతయంతి విప్రా న్గా బాలం వృద్ధం తథాతురమ్
శరణాగతం విశ్వసస్తం స్త్రియం మిత్రం నిరాయుధమ్
యేగమ్యాగామినో మూఢాః పరద్రవ్యాపహారిణః
నిక్షేపస్యాపి హర్తారో విషవహ్ని ప్రదాశ్చయే
పరభూమిం గృహం శయ్యాం వస్త్రాలంకారహారిణః
పరరంధ్రేషు యే క్రూరా యే సదానృత వాదినః
గ్రామరాష్ట్ర పురస్థానే మహాదుఃఖ ప్రదాహి యే
కూటసాక్ష్య ప్రదాదాతారః కన్యావిక్రయ కారకాః
అభక్ష్యభక్షణ రతా యే గచ్ఛంతి స్నుషాం సుతామ్ః
మాతరం పితరం చైవ యే వదంతి చ పౌరుషమ్
అన్యేయే చైవ నిర్దిష్టా మహాపాతక కారిణః
దక్షణేన తు తే సర్వే ద్వారేణ ప్రవిశంతి వై
ఆ నగరమునకు దక్షిణ ద్వారము మహా భయంకరము సర్వప్రాణి భయంకరము. హాహాకార మెత్తు చుండును. అంధకార బంధురము. సూదిమొన గల శిఖరములు ముళ్ళు తేళ్ళు వజ్ర కీటములు (కర్రల దొలుచు పురుగులు) వీనిచే నడు గిడుటకు వీలుండదు. తోడేళ్ళు పులులు నక్కలతో సింహములు పిల్లులు గ్రద్దలు కణకణ మండు ముఖములతో జరించు నా ద్వారమున సర్వాపకారులైన వారికి బ్రవేశము. గో బ్రాహ్మణ వృద్ధులను బాధలలో నున్న వానిని శరణు జొచ్చిన వానిని స్త్రీని మిత్రుని ఆయుధము చేతిలో లేని వానిని జంపిన వారికిది ప్రవేశ ద్వారము. పొందరాని గురు పత్ని మొదలైన స్త్రీలను బొందిన వారు మూఢులు పర ద్రవ్యాహారకులు దాచ నిచ్చిన వస్తువులు హరించిన వారు విషము బెట్టిన వాండ్రు నిప్పంటిన వారు పర భూ గృహశయ్యా వస్త్ర భూషణా పహరులు పరుల లోపములనే వెదకు క్రూరులు ననృత వాదులు గ్రామమునకు రాష్ట్రమునకు పురమునకు దుఃఖము కల్గించిన వారు అబద్ధ సాక్ష్య మిచ్చిన వారు కన్యల నమ్ముకొన్న వారు అభక్ష్య భక్షణ ప్రియులు కోడలిని కూతురును బొందిన వాడ్రు తల్లిని దండ్రిని కటువుగ మాట్లాడిన వారు మరి మహా పాతకులుగ చెప్పబడిన యెందరు దక్షిణ ద్వారమున యమపురము బ్రవేశింతురు.
Summary of chapter 107 of the Brahma Mahā Purana is as follows:
In counterpoint to the preceding chapter, the celestial realms and divine pleasures awaiting those who have lived righteously are described. Various categories of virtuous action — charity, worship, pilgrimage, truth-telling, service to brāhmaṇas and elders, ahiṃsā, and devotion — and their corresponding heavenly rewards are enumerated. The virtuous soul's joyful sojourn in celestial realms, followed eventually by rebirth in blessed human circumstances, is narrated.