బ్రహ్మ మహా పురాణము

234 - ఆత్యంతి కలయ నిరూపణమ్‌

వ్యాసులు:

ఆధ్యాత్మికాది భో విప్రా జ్ఞాత్వా తాపత్రయం బుధః

ఉత్పన్నజ్ఞనవైరాగ్యః ప్రాప్నోత్యాత్యంతికం లయమ్‌

ఆధ్యాత్మికోపి ద్వివిధః శారీరో మానస స్తథా

శారీరో బహుభిర్భేదైర్భిద్యతే శ్రూయతాం చ సః

శిరోరోగ ప్రతిశ్యాయ జ్వర శూలభగందరైః

గుల్మార్శః శ్వయథుశ్వాసచ్ఛర్ద్యాదిభిరనేకధా

తథాక్షిరోగాతీసార కుష్ఠాంగామయసంజ్ఞకైః

భిద్యతే దేహజ స్తాపో మానసం శ్రోతుమర్హథ

కామక్రోధ భయద్వేషలోభయోహవిషాదజః

శోకాసూయావమానేర్ష్యా మాత్సర్యాభిభవస్త

మానసోపి ద్విజశ్రేష్ఠా స్తాపో భవతి నై కధా

ఇత్యేవమాదిభిర్భేదైస్తాపో హ్యాధ్యాత్మికః స్మృతః

మృగపక్షి మనుష్యాద్యైః పిశాచోరగరాక్షసైః

సరీసృపాద్యైశ్చ నృణాం జన్యతే చాధిభౌతికః

తోష్ణవాతవర్షాంబు వైద్యుతాది సముద్భవః

తాపో ద్విజపరశ్రేష్ఠాః కథ్యతే చాధిదైవికః

గర్భజన్మ జరాజ్ఞాన మృత్యునారకజం తథా

దుఃఖం సమస్రశో భేదైర్బిద్యతే మునసత్తమాః

సుకుమారతను ర్గర్భే జంతు ర్బహుమలావృతే

ఉల్బ సంవేష్టితో భగ్నపృష్ఠగ్రీవాస్థిసంహతిః

అత్యవ్లు కటు తీక్షోష్ణ లవణైర్మాతృ భోజనైః

అతితాపిభి రత్యర్థం బాధ్యమానోతివేదనః

ప్రసారణాకుంచనాదౌ నాంగా నాం ప్రభురాత్మనః

శకృన్మూత్రమహావంకశాయీ పర్వత్ర పీడితః

నిరుచ్ఛ్వాసః సచైతస్యః స్మరన్జన్మశతాన్యథ

ఆస్తే గర్భేతిదుఃఖేన నిజకర్మనిబంధనః

జాయమానః పురీపాసృజ్మూత్ర శుక్రావిలాసనః

ప్రాజాపత్యేన వాతేన పీడ్యమానాస్థి బంధనః

అధోముఖస్తైః క్రియతే ప్రబలైః సూతిమారుతైః

క్లెశైర్నిప్ర్కాంతి మాప్నోతి జఠరాన్మాతురాతురః

మూర్ఛామవాప్య మహతీం సంస్పృష్టో బాహ్యవాయునా

విజ్ఞానభ్రంశ మాప్నోతి జాతస్తు మునిసత్తమాః

కంటకైరివ తున్నాంగః కక్రచైరివ దారితః

పూతి వ్రణాన్నిపతితో ధరణ్యాం క్రిమికో యథా

కండూయనేపి చాశక్తః పరివర్తేప్యనీశ్వరః 

స్తన్యపానాదికాహార మవాప్నోతి పరేచ్ఛయా 

అశుచిస్రస్తరే సుప్తః కీటదంశాదిభిస్తథా

భక్ష్యమాణోపి నై వైషాం సమర్థో వినివారణే 

జన్మదుఃఖాన్యనేకాని జన్మనోనంతరాణిచ 

బాలభావే యదాప్నోతి అధిభూతాదికాని చ

అజ్ఞానతమసా ఛన్నో మూఢాంతః కరణో నరః 

న జానాతి కుతః కోహం కుత్ర గంతా కిమాత్మకః

కేన బంధేన బద్ధోహం కారణం కిమకారణమ్‌

కిం కార్యం కిమకార్యం వా కిం వాచ్యం కిం న చోచ్యతే

కో ధర్మఃకశ్చ వాధర్మః కస్మిన్వర్తేత వై కథమ్‌

కిం కర్తవ్యమక ర్తవ్యం కిం వా కిం గుణదోషవత్‌

ఏవం పశుసమైర్మూఢైరజ్ఞాన ప్రభవం మహత్‌

అవాప్యతే నరైర్దుఃఖం శిశ్నోదరపరాయణైః

అజ్ఞానం తామసోభావః కార్యారంభ ప్రవృత్తయః 

అజ్ఞానినాం ప్రవర్తంతే కర్మలోపస్తతో ద్విజాః 

ఓ విప్రులారా! వివేకి యగు జీవుడు ఆధ్యాత్మికములు, ఆధి భౌతికము, ఆధి దైవికములు అను మూడు విధములగు తాపము వలని దుఃఖమును దోషమును గుర్తెరిగి వైరాగ్యముతో జ్ఞానము సంపాదించుటచే ఆత్యంతిక లయమును, మోక్షమును పొందును. వీనిలో ఆధ్యాత్మిక తాపము దైహికము మానసికము అని రెండు విధములు. శిరో రోగము, ప్రతిశ్యాయము, జ్వరము, శూల వ్యాధి, భగందరము, గుల్మము, ఆర్శస్సు, శ్వయథువు, శ్వాస వ్యాధి, ఛర్ది, అక్షి రోగములు, అతి సారము, కుష్ఠము, అవయవముల రోగములు, ఈ మొదలుగ దైహిక తాపము బహు విధములు. కామము, క్రోధము, భయము, ద్వేషము, లోభము, మోహము, విషాదము, శోకము, అసూయ, అవమానము, ఈర్ష్య, మత్సరము, తిరస్కారము మొదలుగ మానస తాపము అనేక విధములు ఈ రెండును కలిసి అధ్యాత్మిక తాపమన బడును. ఆత్మ అనగా ఇచట దేహమని యర్థము. పాంచ భౌతిక దేహముతో సంబంధించి నవి ఆధ్యాత్మికములు. పైవాని వివరము ఆయుర్వేదాది శాస్త్రముల నుండి తెలియ దగినవి. మృగములు, పక్షులు, మనుష్యులు, పిశాచములు, సర్పములు, రాక్షసులు, ప్రాకెడి ప్రాణులు మొదలగు వానిచే మానవునికి కలుగు తాపములు అధి భౌతికములు, భూతముల, ప్రాణుల వలన కలుగు నవి. చలి, ఉష్ణము, గాలి, వర్షము, నీరు, మెఱవులు వాని వలన కలుగు తాపము అధి దైవికము. గర్భము, జన్మము, ముసలి తనము, అజ్ఞానము, మృత్యువు, నరకము, మొదలగు వాని వలన కలుగు దుఃఖములు వేల కొలది విధములు. ఎట్లనగా, సుకుమార శరీరము కల జీవుడు తల్లి గర్భములో అనేక మలినములు క్రమ్మి యున్న గర్భములో మావిలో చుట్టబడి వెన్ను వీపు మెడ ఎముకలు వంగి చాల పుల్లనివి, కారపువి, చురుకైనవి, చాల వెచ్చనివి, ఉప్పనివి అగు ఆహారములు తల్లి తినగా అవి కలిగించు తాపము వలన చాల బాధ పడుచుండును. అవయవములు స్వేచ్ఛగా చాచలేక ముడువ లేక మల మూత్రముల రొంపిలో పండు కొనుచు ఊపి రాడక చైతన్య మున్నందున గడచిన వందల కొలది జన్మములను జ్ఞాపకము చేసి కొనుచు తన పూర్వ కర్మలకు బద్ధుడై దుఃఖము లనుభవించు చుండును. ఇది గర్భ దుఃఖము. ప్రసవ కాలపు గాలులచే తల క్రిందులుగా త్రిప్పబడి మలము రక్తము మూత్రము శుక్ర శోణితములు మొదలగు వానిచే నోరంతయు మలినము కాగా ప్రాజావత్యము అను ప్రసవ ద్వారపు గాలిచే ఎముకల సంధులు బాధ పడుచుండ తల్లి గర్భము నుండి ఎన్నో క్లేశములతో వెలుపలికి వచ్చును. ముళ్లు గ్రుచ్చు కొనినట్లు రంపముతో కోసినట్లు అవయవములు బాధ పడుచుండ క్రుళ్ళిన పుండులో నుండి బయట పడిన క్రిమివలె బయట పడి గోకి కొనుటకును అటు ఇటు దొరలుట కును శక్తిలేక ఇతురుల ఇచ్ఛకు లోబడి పాలు మొదలగు ఆహారము గ్రహించును. మలిన మగు ప్రక్కలపై పరుండియు పురుగులు దోమలు కుట్ట చున్నను తిను చున్నను వాటిని తిను చున్నను వాటిని తోలుకొన నైన లేకుండును. ఇటు వంటి జన్మ దుఃఖములను జన్మకు అనంతరము పొందు ఆధ్యాత్మికాది దుఃఖములను అంతు లేనివి. నరుడు అజ్ఞానాంధ కారముతో కప్పబడి మనస్సు మూఢమై నేను ఎక్కడి నుండి వచ్చితిని?? ఎవడను? ఎట్టివాడను? ఎక్కడికి పోవలెను? నన్ను ఏ బంధము బంధించినది? ఇది సకారణమా? అకారణమా? చేయదగిన దేది! తగని దేది? పలుకదగిన దేది? తగని దేది? ధర్మమేది? అధర్మ మేది? గుణము ఏది? దోషమేది ? అని యెరుగక పశువుల వలె ఆహార మైథునములు కయి మాత్రము ప్రాకు లాడుట అజ్ఞానము వలన కలుగు దుఃఖము. అజ్ఞానము తమో గుణ ధర్మము. దాని వలన నరులు చేయ వలసిన కర్మలను చేయక చేయరాని వానిని చేయు చుందురు.

నరకం కర్మణాం లోపాత్ఫలమాహుర్మహర్షయః

తస్మాదజ్ఞానినాం దుఃఖమిహ చాముత్ర చోత్తమమ్‌

జరాజర్జర దేహశ్చ శిథిలావయవః పుమాన్‌

విచలచ్ఛీర్ణదశనో వలిస్నాయుశిరావృతః

దూరప్రనష్టనయనో వ్యోమాంతర్గతతారకః

నాసావివరనిర్యాత రోమపుంజశ్చలద్వపుః

ప్రకీటభూత సర్వాస్థిర్నత పృష్ఠాస్థిసంహతిః

ఉత్సన్నజఠరాగ్నిత్వా దల్పాహారోల్పచేష్టితః

కృచ్ర్ఛ చంక్రమణోత్థానశయనాసన చేష్టితః

మందీభవచ్చ్రోత్రనేత్ర గలల్లాలా విలాసనః

ఆనాయత్తైః సమస్తైశ్చ కరణై ర్మర ణోన్ముఖః

తత్‌ క్షణేప్యనుభూతానా మస్మర్తాఖిలవస్తునామ్‌

సకృదుచ్చారితే వాక్యే సముద్భూత మహాశ్రమః

శ్వాసకాసామయాయాస సముద్భూత ప్రజాగరః

అన్యేనోత్థాప్యతేన్యేన తథా సంవేశ్యతే జరీ

భృత్యాత్మ పుత్ర దారాణా మవమాన పరాకృతః

ప్రక్షీణాఖిలశౌచశ్చ విహారాహార సంస్పృహః

హాస్యః పరిజనస్యాపి నిర్వణ్ణాశేష బాంధవః

అనుభూతమివాన్యస్మి న్జన్మన్యాత్మ విచేష్టితమ్‌

సంస్మరన్యౌవనే దీర్ఘ నిఃశ్వసిత్యతితాపితః

ఏవమాదీని దుఃఖాని జరాయామనుభూయ చ

మరణే యాని దుఃఖాని ప్రాప్నోతి శృణు తాన్యపి

శ్లథగ్రీవాంఘ్రి హస్తోథ ప్రాప్తో వేపథున నరః

ముహుర్గ్లాని పరశ్చాసౌ ముహుర్జ్ఞాన బలాన్వితః

హిరణ్యధాన్యతనయ భార్యా భృత్యగృహాదిషు

ఏతే కథం భవిష్యంతీ త్యతీవమ మతాకులః

మర్మవిధ్బి ర్మహారోగైః క్రకచైరివ దారుణైః

శరైరివాంతకస్యోగ్రై శ్చిద్యమానాస్థి బంధనః

పరివర్తమానతారాక్షి హస్తపాదం ముహుః క్షిపన్‌

సంశుష్యమాణ తాల్వోష్ఠ కంఠో ఘురఘురాయతే

నిరుద్ధకకంఠ దేశోపి ఉదానశ్వాస పీడితః

తాపేన మహతా వ్యాప్త స్తృషా వ్యాప్తస్తథా క్షుధా

క్లేశాదుత్ర్కాంతి మాప్నోతి యామ్యకింకర పీడితః

తతశ్చ యాతనాదేహం క్లేశేన ప్రతిపద్యలే

ఏతాన్యన్యాని చోగ్రాణి దుఃఖాని మరణే నృణామ్‌

శృణుధ్వం నరకే యాని ప్రాప్యంతే పురుషైర్మృత్తైః

యామ్య కింకరపాశాదిగ్రహణం దండతాడనమ్‌

యమస్య దర్శనం చోగ్రముగ్ర మార్గ విలోకనమ్‌

కరంభవాలుకా వహ్నియంత్ర శస్త్రాదిభీషణే

ప్రత్యేకం యాతనా యాశ్చ యాతనాది ద్విజోత్తమాః

క్రకచైః పీడ్యమానానాం మూషాయాం చాపిధ్మాప్యతామ్‌

కుఠారైః పాట్యమానాచాం భూమౌనాపి నిఖన్యతామ్‌

శూలేష్వారోప్య మాణానాం వ్యాఘ్రవక్త్రే ప్రవేశ్యతామ్‌

గృధ్రైః సంభక్ష్యమాణానాం ద్వీపిభిశ్చోపభుజ్యతామ్‌

క్వథ్యతాం తైలమధ్యే చ క్లిద్యతాం క్షారకర్దమే

ఉచ్చాన్నిపాత్యమానానాం క్షిప్యతాం క్షేపయంత్రకైః

నరకే యాని దుఃఖాని పాపహేతూద్భవాని వై

ప్రాప్యంతే నారకైర్వి ప్రాస్తేషాం సంఖ్యా న విద్యతే

న కేవలం ద్విజశ్రేష్టా నరకే దుఃఖపద్దతిః

స్వర్గేపి పాతభీతస్య క్షయిష్ణో ర్నాస్తి నిర్వృతి

కర్మల లోపము వలన మానవులకు నరక యాతనలు కలుగును. ఈ విధముగ అజ్ఞానులకు ఇహ లోకమునను పర లోకమునను దుఃఖములే. ముసలి తనమున దేహమును దేహావయవము లును శిథిలములై దంతములు కదలుచు ఊడుచు చర్మము ముడతలు పడి నాడులు నరములు తేలుచు దూరపు చూపు కనబడక కంటి పాపలు ఆకాశము లోనికి పెట్టి చూచుచు నాసికా రంధ్రముల నుండి వెంట్రుకలు వెలికి వచ్చు చుండ శరీరము వణకు చుండ ఎముకలు బయట పడి వెన్ను వంగి ఆకలి నశించి ఎక్కువ తినలేక తిన్నది జీర్ణము కాక పనులు చేయుటకు శక్తి లేక ఎంతో శ్రమతో నడచుట లేచుట కూర్చుండుట పనులు చేయుట కలిగి చెవులు సరిగా విన బడక కన్నులు సరిగా కనబడక నోట చొల్లు కారుచు ఇంద్రియ శక్తి తగ్గి చావుకు సిద్ధమై ఎప్పటి కప్పుడే విషయములు మరచుచు ఒక్కమాట పలుకుటకు చాల శ్రమ పడుచు దగ్గుతో ఆయాసముతో నిద్ర పట్టక లేచుటకు పండు కొనుటకు కూడ ఇతరులపై ఆధార పడుచు సేవకులు భార్య పుత్రులు కూడ అలక్ష్యము చేయు చుండగా శౌచము చేసి కొనుట కూడ శక్తి లేక ఏమో తిన వలెనని తిరుగ వలెనని కోరికలు మాత్ర మధికమై పరిజనులు కూడ ఎగతాళి చేయు చుండ చుట్టములు విసుగు కొనుచుండ తాను తన యౌవనములో శక్తి యున్నప్పుడు చేసిన పనులను ఏదో పూర్వ జన్మములో చేసిన పనులను వలె జ్ఞాపకము చేసికొనుచు ఇట్టి అనేక భాద లనుభవించును.

మరణ కాలమున కాళ్లు చేతులు మెడ శిథిల మగును. అంతలోనే శ్రమ అంతలోనే తెలివి బలము కలుగు చుండును. తన భార్య సంతానము ధనము ఇల్లు సేవకులు తన తరువాత ఏమగునో అని చింత ఱంపములతో కోయు చున్నట్లు మర్మ స్థానములలో రోగబాధ అస్థి సంధులలో యమ బాణములు గ్రుచ్చు కొన్నట్లు బాధ మెలికలు తిరిగి పోవుచున్న కనుగ్రుడ్లు కాళ్లు చేతులు కలిగి తన్ను కొనుట పెదవులు దౌడలు కంఠము ఎండి పోవుచు గురగుర లాడుచు కంఠము నుండి శ్వాస ఆడక బాధ అకలి దప్పులచే బాధ పడుచు యమ భటులచే బాధ నొందుచు ఎంతో క్లేశముతో ప్రాణములు బయటికి పోవు చుండును. తరువాత యాతనా దేహములో ప్రవేశించును. నరకములో యమ కింకరులు పాశములతో కట్టుట, కర్రలతో కొట్టుట, యమ దర్శనము భయంకర మగు మార్గములు చూచుట మండు చున్న ఇసుక, అగ్ని యంత్రములు శస్త్రములు మొదలగు వానితో భయంకర బాధలు ఱంపములతో కోయుట మూసలలో వేసి క్రాచుట గొడ్డళ్లతో పగుల కొట్టుట భూమిలో పాతి పెట్టుట శూలముల పై గ్రుచ్చుట పులి నోటిలో వేయుట గ్రద్దలచే తిని పించుట నూనెలో ఉడికించుట కారపు అడుసులో నాన వేయుట ఎత్తు నుండి పడ వేయుట. ఒడిసెలలతో కొట్టుట మొదలైన యాతనలు జీవులు తాము చేసిన పాపానుసారము అనుభవింతురు. ఇంతే కాదు. స్వర్గమునకు వెళ్లిన వారికి కూడ ఆ పుణ్యము పూర్తి కాగానే క్రిందికి పడి పోవలెనను భయము వెంటాడును. కనుక అచ్చటను సుఖము లేదు.

పునశ్చ గర్భో భవతి జాయతే చ పునర్నరః

గర్భే విలీయతే భూయో జాయమానోస్తమేతి చ

జాతమాత్రశ్చ మ్రియతే బాలభావే చ యౌవనే

యద్యత్ర్పీతికరం పుంసాం వస్తు విప్రాః ప్రజాయతే

తదేవ దుఃఖవృక్షస్య బీజత్వ ముపగచ్ఛతి

కళత్రపుత్ర మిత్రాది గృహక్షేత్రధనాదికైః

క్రియతే న తథా భూరి సుఖం పుంసాం యథాసుఖమ్‌

ఇతి సంసారదుఃఖార్కతాపతాపిత చేతసామ్‌

విముక్తిపాదపచ్ఛాయమృతే కుత్ర మఖం నృణామ్‌

తదస్య త్రివిధస్యాపి దుఃఖజాతస్య పండితైః

గర్భజన్మ జరాద్యేషు స్థానేషు ప్రభవిష్యతః

నిరస్తాతి శయాహ్లాదం సుఖభావైక లక్షణమ్‌

భేషజం భగవత్ర్పాప్తిరేకా చాత్యంతికీ మతా

తస్మాత్తత్ర్పాప్తయే యత్నః కర్తవ్యః పండితైర్నరైః

తత్ర్పాప్తి హేతుర్జ్ఞానం చ కర్మ చోక్తం ద్విజోత్తమాః

ఆగమోత్థం వివేకాచ్చ ద్విధా జ్ఞానం తథోచ్యతే

శబ్దబ్రహ్మాగమ మయం పరంబ్రహ్మ వివేకజమ్‌

అంధం తమ ఇవాజ్ఞానం దీపవచ్చేంద్రియోద్భవమ్‌

యథా సూర్యస్తథా జ్ఞానం యద్వై విప్రా వివేకజమ్‌

మనురప్యాహ వేదార్థం స్మృత్వా యన్మునిస్తతమాః

పిమ్మట మరల గర్భ ప్రవేశము పుట్టుట కడుపులో గాని పుట్టుచు కాని పుట్టిన తరువాత ఏదో సమయమున బాల్యము ననో యౌవనము ననో మరణించుట ఇట్టి జన్మ మరణ పరంపర సాగును. ఈ సంసారములో ఏది సుఖమునకు కారణమో ఆదే దుఃఖమునకు కారణము. కనుక దార పుత్త్ర థనాదుల యందు మక్కువ పెంచు కొనక ఈ తెలిపిన తాపత్రయముల లోని దోషములను గుర్తించి ముక్తి కొరకై యత్నించుట ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధము. కనుక వివేకులు అందుకే యత్నింపవలెను. కర్మా చరణము జ్ఞానము ఈ రెండును ముక్తికి సాధనములే. ఆగమములో చెప్పిన శబ్ద బ్రహ్మోపాసనము వివేకము వలన కలిగెడి బ్రహ్మ తత్త్వ జ్ఞానము అని జ్ఞానము కూడ రెండు విధములు. శబ్ద బ్రహ్మ తత్త్వమున కృతార్థు డైనచో పర బ్రహ్మత్వము ప్రాప్తించును. పరా అపరా అను రెండు విద్యలు ఎఱుగ వలసి యున్నది అని అధర్వణ వేదీయ మగు మండ కోపనిషత్తు చెప్పు చున్నది. వానిలో ఋగ్వేదాది వేదప్రోక్త మగు కర్మానుష్టానము అపరావిద్యా. అక్షర తత్త్వమగు పర బ్రహ్మమును అందించునది పరావిద్యా. పరబ్రహ్మ తత్త్వము అవ్యక్తము అజరము అచింత్యము అవ్యయము అనిర్దేశ్యము అరూపము అపాణి పాదము సర్వగతము సత్యము భూతయోని వ్యాప్యము వ్యాప్తము. ఈ తత్త్వమును సూరులు మాత్రమే ఎల్లప్పుడును దర్శింప గలరు. ఆ తత్త్వమే విష్ణు భగవానుడు. భూతముల యొక్క ఉత్పత్తిని నాశనమును వాటి రాకడను పోకడను విద్యను అవిద్యను ఎఱిగిన మహానుభావుడు భగవానుడన బడును. హేయము లగు దుర్గుణములు కాని దోషములు కాని ఏవియు లేక జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులను ఆఱు శక్తులు కలవాడే భగవాను డనుబడును. ఆపరమాత్ముని యందు సమస్త భూతములను అతడు సమస్త భూతముల యందును ఆవసించును. అతడు సర్వాత్మకుడు అందు చేతనే ఈ పర తత్త్వమునకు వాసుదేవుడని పేరు. పూర్వము మహర్షులు చేసిన ప్రశ్నమునకు సమాధానముగా ప్రజాపతియే ఈ వాసుదేవ పదమునకు అర్థమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపెను. అందు చేతనే జగములను నిర్మించు వాడు. వాటి స్థితి వ్యవస్థ చేయువాడు కూడ ప్రభువగు వాసుదేవుడే. అతడు సర్వ భూతము లకును ప్రకృతి మూల తత్త్వమును సమస్త దోషములకును గుణములకును అతీతుడు. సర్వావరణము లకును అతీతుడు. అఖిలాత్ముడు. ఈ భువ నాంతరాళ మంతయు అయన చేతనే అవరింప బడి యున్నది. అతడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు స్వశక్తి లేక మాత్రము చేతనే సమస్త భూత సృష్టిని చేయువాడు. తన ఇచ్చచేత తన కిష్టములగు గొప్ప రూపమల ధరించి సమస్త లోకములకు హితమును సాధించును. తేజో బలైశ్వర్య వీర్య శక్తి జ్ఞానములకు రాశి. పరమైన వాటికంటె వరుడు. ఈ వరావరుని యందు ఎట్టి క్లేశములును లేవు. అతడు ఈశ్వరుడు వ్యష్టి సమష్టి రూపుడు, వ్యక్త రూపుడు, అవ్యక్త రూపుడు, సర్వేశ్వరుడు. సర్వ ద్రష్ట సర్వశక్తి యగు పరమేశ్వరుడు. సమస్త దోష రహితమును శుద్ధమును వరమును నిర్మలమును ఏక రూపమును నగు ఆ మహా తత్త్వమును ఏది తెలుప గలదో చూప గలదో లభింప జేయగలదో అది మాత్రమే జ్ఞానమన బడును. మిగిలిన దంతయు అజ్ఞానము.

తదేత చ్ఛ్రూయతా మత్ర సంబంధే గదతో మమ

ద్వే బ్రహ్మణీ వేదితవ్యే శబ్దబ్రహ్మ పరం చయత్‌

శబ్దబ్రహ్మణి విష్ణాతః పరం బ్రహ్మధిగచ్ఛతి

ద్వే విద్యే వై వేదితవ్యే ఇతి చాథర్వణీ శ్రుతిః

పరయా హ్యక్షరప్రాప్తి రృగ్వేదాదిమయాపరా

యత్తదవ్యక్త మజర మచింత్య మజ మవ్యయమ్‌

అనిర్దేశ్యమరూపం చ పాణిపాదాత్య సంయుతమ్‌

విత్తం సర్వగతం నిత్యం భూతయోని మకారణమ్‌

వ్యాప్యం వ్యాప్తం యతః సర్వం తద్వై పశ్యంతి సూరయః

తద్ర్బహ్మ పరమం ధామ తద్ధ్యేయం మోక్షకాంక్షిభిః

శ్రుతివాక్యోదితం సూక్ష్మం తద్విష్ణోః పరమం పదమ్‌

ఉత్పత్తిం ప్రలయం చైవ భూతానామాగతిం గతిమ్‌

వేత్తి విద్యామవిద్యాం చ స వాచ్యో భగవానితి

జ్ఞానశక్తి బలై శ్వర్యవీర్యతేజాంస్య శేషతః

భగవచ్ఛబ్దవాచ్యాని వినా హేయైర్గుణాదిభిః

సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని

భూతేషు చ స సర్వాత్మా వాసుదేవస్తతః స్మృతః

ఉవాచేదం మహర్షిభ్యః పురా పృష్టః ప్రజాపతిః

నామవ్యాఖ్యా మనంతస్య వాసుదేవస్య తత్త్వతః

భూతేషు వసతే యోంతర్వసంత్యత్ర చ తానియత్‌

ధాతా విదాతా జగతాం వాసుదేవస్తతః ప్రభుః

ససర్వభూత ప్రకృతిర్గుణాంశ్చ దోషాంశ్చ సర్వా న గుణో హ్యతీతః

అతీత సర్వవరణోఖిలాత్మా తేనావృతం యధ్బువనాంతరాళమ్‌

సమస్త కల్యాణ గుణాత్మకో హి స్వశక్తిలేశాదృత భూతసర్గః

ఇచ్ఛాగృహీతాభిమతోరుదేహః స్వవీర్యశక్త్యాది గుణై కరాశిః

తేజో బలైశ్యర్య మహావరోధః స్వవీర్యశక్త్యాది గుణై కరాశిః

పరః పరాణాం సకలా న యత్ర క్లేశాదయః సంతి పరాపరేశే

స ఈశ్వరో వ్యష్టిసమిష్టిరూపోవ్యక్తస్వరూపః ప్రకటస్వరూపః

సర్వేశ్వరః సర్వదృక్సర్వవేత్తా సమస్తశక్తిః పరమేశ్వరాఖ్యః

సంజ్ఞాయతే యేన తదస్తదోషం శుద్ధం పరం నిర్మలమేకరూపమ్‌

సందృశ్యతే వాప్యథ గమ్యతే వా తజ్జ్ఞానమజ్ఞానమతోన్యదుక్తమ్‌

ఈ అధ్యాయములో పై శ్లోకములకు చెప్పబడిన విషయము తాత్త్వికము గనుక దానినిట వివరింప సాధ్యము కాదు. తత్త్వము నెఱిగిన పెద్దల వలనను వేదాన్త శాస్త్రాధ్యయనము చేతను తెలిసికొని తరింప దగినది.