బ్రహ్మ మహా పురాణము

58 - నృసింహ మాహాత్మ్య వర్ణనమ్‌

బ్రహ్మ:

ఏవం దృష్ట్వా బలం కృష్ణం సుభద్రాం ప్రణిపత్య చ

ధర్మం చార్థం చ కామంచ మోక్షం చ లభతే ధ్రువమ్‌

నిష్క్రమ్య దేవతాగారా త్కృతకృత్యో భవేన్నరః

ప్రణమ్యాయతనం పశ్చా ద్ర్వజే త్తత్రసమాహితః

ఇంద్రనీల మయో విష్ణు రత్రస్తే వాలుకావృతః

 అంతర్థానగతం నత్వా తతో విష్ణుపురం వ్రజేత్‌

బ్రహ్మ:

ఇట్లు బలరాముని కృష్ణుని సుభద్రను జూచి మ్రొక్కిన యతడు ధర్మది పురుషార్థములను నాల్గింటిని బడయును. దేవాలయము వెడలి నమస్కరించి యిసుకలో దాగి యున్న యింద్ర నీలమణి స్వరూపుడగు విష్ణుని దర్శించిన భక్తుడు వైకుంఠమున కేగును.

సర్వదేవ మయో యోసౌ హతవా నసురోత్తమమ్‌

 స ఆ స్తే తత్ర భో విప్రాః సింహార్థ కృత నిగ్రహః

భక్త్యా దృష్ట్వా తు తం దేవం ప్రణమ్య నరకేసరిమ్‌

ముచ్యతే పాతకైర్మర్త్యః సమస్తై ర్నాత్ర సంశయః

నరసింహస్య యే భక్తా భవంతి భువి మానవా!

నతేషాం దుష్కృతం కించిత్ఫలం స్యా ద్యద్యదీప్సితమ్‌

తస్మా త్సర్వప్రయత్నేన నరసింహం సమాశ్రయేత్‌

ధర్మార్థ కామ మోక్షాణాం ఫలం యస్మాత్ర్పయచ్ఛతి

హిరణ్యకశిపుని సంహరించిన నరసింహ మూర్తి సర్వ దేవతా మయము నిచట దర్శించిన నతడు సర్వపాప విముక్తు డగును. నరసింహ భక్తుల కసాధ్యము లేదు. సర్వాభీష్టములు లభించును. ఆయన సర్వ పురుషార్థ ప్రదాత.

మునులు:

మాహాత్మ్యం నారసింహస్య సుఖదం భువి దుర్లభం

యథా కథయసే దేవ తేన నో విస్మయో మహాన్‌

ప్రభావం తస్య దేవస్య విస్తరేణ జగత్పతే

శ్రోతు మిచ్ఛామహే బ్రూహి పరం కౌతూహలం హి నః

యథా ప్రసీదేద్దేవోసౌ నరసింహో మాహాబలః

భక్తానా ముపకారాయ బ్రూహి దేవ నమోస్తు తే

ప్రసాదాన్నరసింహస్య యా భవంత్యత్ర సిద్ధయః

బ్రూహి తాః కురు చాస్మాకం ప్రసాదం ప్రపితామహ

మునులు:

నరసింహమూర్తి ప్రభావమును విపులముగా వినవలతుము. ఆయన యెట్లు ప్రసన్ను డగును. ఆయన వలన కలుగ సిద్దులేవి. దయచేసి తెల్పుము. ఆన బ్రహ్మ యిట్లనియె.

బ్రహ్మ:

శృణుధ్వం తస్య భో విప్రాః ప్రభావం గదతో మమ

అజిత స్యాప్రమేయస్య భుక్తి ముక్తి ప్రదన్య చ

కః శక్నోతి గుణా న్వక్తుం సమస్తాం స్తస్య భోద్విజా

సింహార్థ కృతదేహస్య ప్రవక్ష్యామి సమాసతః

యాః కాశ్చి త్సిద్ధయ శ్చాత్ర శ్రూయంతే దేవ మానుషాః

ప్రసాదా త్తస్య తాః సర్వాః సిద్ద్యంతే నాత్ర సంశయః

స్వర్గే మర్త్యేచ పాతాళే దిక్షు తోయే పురే నగే

ప్రసాదా త్తస్య దేవస్య భవత్యవ్యాహతా గతిః

అసాధ్యం తస్యదేవస్య నా స్త్యత్ర సచరాచరే

నరసింహస్య భోవిప్రాః సదా భక్తానుకంపినః

విధానం తస్య వక్ష్యామి భక్తనాముపకారకమ్‌

యేన ప్రసీదే చ్చైవాసౌ సింహార్ధ కృత విగ్రహః

శృణుధ్వం మునిశార్దూలాః కల్పరాజం సనాతనమ్‌!

నరసింహస్య తత్త్వంచ యన్నజ్ఞాతం సురాసురై

మునులారా! ఆయన యజయ్యుడు “ఊహ కందడు. భుక్తి ముక్తి ప్రదుడు. ఆయన గుణ సంపద దెలుప వశము గాదు. ఆయన యనగ్రహముచే దైవమానను సర్వ సిద్దులు లభించును. ఆయన దయచే స్వర్గ మర్త్య పాతాళాదు లందు నప్రతిహతమైన గమన మేర్పడును. చరాచరముల యందు నరసింహ భక్తున కసాధ్యము లేదు. నరసింహా స్వామి ప్రసన్ను డగుటకు సురాసురులకు గూడ తెలియని యాయన తత్వమును, ఉపాసనా కల్పమును చెప్పెదను. వినుండు.

శాక యావక మూలైస్తు ఫల పిణ్యాక సక్తుకైః

పయోభక్షేణ విప్రేంద్రా వర్తయే త్సాధకోత్తమః

కోశ కౌపీన వాసాశ్చ ధ్యానయుక్తో జితేంద్రియః

అరణ్యే విజనే దేశే పర్వతే సింధు సంగమే

ఊషరే సిద్ధ క్షేత్రే చ నరసింహాశ్రమే తథా

ప్రతిష్ఠాప్య స్వయం వాపి పూజాం కృత్వా విధానతః

ద్వాదశ్యాం శుక్లపక్షస్య ఉషోష్య ముని పుంగవాః

జపేల్లక్షాణి విశన్మనసా సంయతేంద్రియః

ఉపపాతక యుక్తశ్చ మహాపాతక సంయుతః

ముక్తో భవేత్తతో విప్రాః సాధకో నాత్ర సంశయః

నృసింహో పాసకుడు ఆకులు, దుంపలు,యవల, పండ్లు, పేలపిండి, ఒలము మాత్రముతో వర్తించుచు పట్టుగోచి పెట్టుకొని యరణ్యము నందు నదీ సంగమము నందు ఊషర క్షేత్రము నందు సిధ్ద క్షేత్రము నందు స్వామిని ప్రతిష్ఠించి జితేంద్రియుడై సమాధి నిష్ఠుడై కల్ప విధానముచే బూజింప వలెను. శుక్ల పక్ష ద్వాదశి నాడు ఉపవసించి నృసింహ మంత్రము నిరువది లక్షలు జపింప వలెను. దానిచే మహాపాత కోప పాతకముల నుండి ముక్తు డగును.

కృత్వా ప్రదక్షిణం తత్ర నరసింహా ప్రపూజయేత్‌

పుణ్య గంధాదిభిర్ధూపైః ప్రణమ్య శిరసా ప్రభుమ్‌

కర్పూర చందనాక్తాని జాతీ పుష్పాణి మస్తకే

ప్రదద్యా న్నరసింహస్య తతః సిద్దిః ప్రజాయతే

భగవాన్సర్వ కార్యేషు న క్వ చిత్ర్పతిహన్యతే

తేజః సోఢుం నశక్తాః స్స్యుర్ర్బహ్మరుద్రా దయస్సురాః

కింపున ర్దానవా లోకే సిద్ద గంధర్వ మానుషాః

విద్యధరా యక్షగణాః సకిన్నర మహోరగాః

మంత్రం యా నాసుర్హానంతుం జపంత్యే కేన్య సాధకాః

తే సర్వే ప్రళయం యాంతి దృష్ట్వా దిత్యాగ్ని వర్చసః

సకృజ్జప్తం తు కవచం రక్షే త్సర్వ ముపద్రవమ్‌

ద్విర్జప్తం కవచం దివ్యం రక్షతే దేవదానవాత్‌

గంధర్వాః కిన్నరా యక్ష విద్యాధర మహోరగాః

భూతాః పిశాచా రక్షాంసి యే చాన్యే పరిపంధినః

త్రిజప్తం కవచం దివ్య మభ్యేదం చ సురాసురైః

ద్వాదశాభ్యంతరే చైవ యోజనానాం ద్విజోత్తమాః

స్వామికి ప్రదక్షిణ మాచరించి షోడ శోపచార పూజల నొనరించి నమస్కారము చేయవలెను. పచ్చ కర్పూరము నలదు నద్దిన పూవులను శిరసు నందుంచిన సిద్దిని బడయ గలరు. అన్ని పనులు అప్రతిహముగ సఫల మగును. బ్రహ్మ రుద్రాదు లేని యాయాన తేజస్సును నోర్వ జాలరు. దానవ, సిద్ద, గంధర్వ, మానుషాదుల విషయము చెప్పనేల. ఆసురములైన మంత్రములు నాభిచారికము లును నృసింహ మంత్ర జపముచే బ్రళయము చెందును. నృసింహ కవచము నొక్కసారి జపించిన సర్వో పద్రవముల నుండి రక్షించును. రెండుసార్లు జపించిన దేవ దానవ యక్ష భూత ప్రేత పిశాచాదుల బాధలు నశించును. మూడు సార్లు జపించిన పండ్రెండు యోజనముల మేరలో నురాసురలకు నభేద్య డగును.

రక్షతే భగవాన్దేవో నరసింహో మహాబలః

తతో గత్వా బిలద్వార ముపోష్య రజనీత్రయమ్‌

పలాశ కాష్ఠైః ప్రజ్వాల్య భగవంతమ్‌ హుతాశనమ్‌

పలాశ సమిధ స్తత్రజుహుయా త్త్రిమధు ప్లుతాః

ద్వే శతే ద్విజ శార్దూలా వషట్కారేణ సాధకః

తతో వివరద్వారం తు ప్రకటం జాయతే క్షణాత్‌

తతో విశేత్తు ని శ్శంకం కవచ వివరం బుధః

గచ్ఛతః సంకటం తస్య తమో మోహశ్చ నశ్యతి

రాజమార్గః సువి స్తీర్ణో దృశ్యతే భ్రమరాజితః

నరసింహం స్మరం స్తత్ర పాతాళం విశతే ద్విజాః

ఇట్లా భగవంతుని పూజించి యాసాధకుడు నృసింహ బిల ద్వారమున కేగి మూడు రాత్రులు మోదుగ సమిధలచే నగ్నిని జ్వలింప జేసి త్రిమధు రస పూతము లైన మోదుగ సమిధలను హోమము చేయ వలెను. రెండు వందల హోమములను వషట్కార పూర్వకముగా జేయ వలెను. అంతట నరసింహ బిల ద్వారము తెరుచు కొనును. నిశ్శంకముగా నృసింహ కవచ న్యాసము చేసికొని లోనికి ప్రవేశించిన సాధకునకు దమో మోహము కల్గును. వెంటనే సువిశాలమైన రాజ మార్గము కనిపించును. ఆట తేనెతీట గల బాధ కనిపించదు. నృసింహుని స్మరించుచు నట నుండి సాధకుడు పాతాళము ప్రవేశించును.

గత్వా తత్ర జపే త్తత్వం నరసింహాఖ్య మవ్యయమ్‌

తతః స్త్రీణాం సహస్రాణి వీణావాదన కర్మణామ్‌

నిర్గచ్ఛంతి పురో విప్రాః స్వాగతం తా వదంతి చ

ప్రవేశయంతి తా హస్తే గృహీత్వా సాధకేశ్వరమ్‌

తతో రసాయనం దివ్యం పాయయంతి ద్విజోత్తమాః

పీతమాత్రే దివ్యదేహో జాయతే సుమహాబలః

క్రీడతే సహ కన్యాభి ర్యావదాభూత సంప్లవమ్‌

భిన్నదేహో వాసుదేవే లీయతే నాత్ర సంశయః

ఆ లోని కేగి నృసింహ మంత్ర జపము జేయగా వీణా మేళనము జేయు వేల కొలది స్త్రీలెదురై స్వాగత మిచ్చి చేయి పట్టుకొని లోనికి బ్రవేశింప జేయుదురు. తరువాత నొక దివ్య రసాయన పానముచే దివ్య శరీరరియు బల శాలియు నగును. భూత వ్రళయము దాక నా కన్యలతో గ్రీడించి శరీరము బాసి వాసుదేవుని యందు లీన మగును.

యదా సరోచతే వాస స్తస్మాన్నిర్గచ్ఛతే పునః

పట్టం శూలం చ ఖడ్గం చ రోచనాం చ మణిం తథా

రసం రసాయనం చైవ పొదుకాంజన మేవచ

కృష్ణాజినం మునిశ్ర్శేష్ఠా గుటికాం చ మనోహరామ్‌

కమండలుం చాక్షసూత్రం యష్టిం సంజీవనీం తథా

సిద్ధవిద్యాం చ శాస్త్రాణి గృహీత్వా సాధకేశ్వరః

జ్వలద్వహ్ని స్ఫులింగోర్మి వేష్టితం త్రిశిఖంహృది

సకృన్న్యస్తం దహేత్సర్వం వృజినం జన్మకోటిజమ్‌

విషే న్యస్తం విషం హన్యా త్కుష్ఠం హన్యాత్తనౌ స్థితమ్‌

స్వదేహే భ్రూణహత్యాది కృత్వా దివ్యేన శుధ్యతి

మహాగ్రహ గృహేతేషు జ్వలమానం విచిన్తయేత్‌

హృదంతే వైతతః శీఘ్రం నశ్యేయు ర్దారుణా గ్రహాః

బాలానాం కంఠకే బద్దం రక్షాభవతి నిత్యశః

గండపిండక లూతానాం నాశనం కురుతే ధ్రువమ్‌

వ్యాధిజాతే సమిద్భిశ్చ ఘృతక్షీరేణ హోమయేత్‌

త్రిసంధ్యం మాపమేకం తు సర్వరోగా న్వినాశయేత్‌

అసాధ్యం తు న పశ్యామి త్రైలోక్యే సచరాచరే

యాం యాం కామయతే సిద్ధిం తాంతాంప్రాప్నోతి సధ్రువమ్‌

ఆ గుహ యందు వలసింవ గోరని వాడట నుండి వెలికి వచ్చి పట్టము శూలము ఖడ్గము రోచనము మణి రసము రసాయనము పాదుకాంజనము కృష్ణాజినము మనోహరమైన కమండలువు. అక్షమాల సంజీవని విద్యయును. శస్త్రములను జేకొని బ్వలించెడి విస్ఫులింగము లచే నావరింప బడిన త్రిశిఖము నొక్కసారి హృదయ మందు నానించి నంతనే ననేక కోటి జన్మ పాపము. దహింప బడును. ఆ త్రి శూలమును విషము నందుంచిన విషము విరిగి పోవును. శరీరమునకు దాకించిన కుష్ఠు వ్యాధి పోవును. తన దేహ మందు మోపిన బ్రూణ హత్య మొదలైన పాపములు పోవును. తీవ్ర మయిన హ్రబాధలు జ్వలించు నాత్రిశూలమును ధ్యనించి నంతనే నశించును. బాలురకు కంఠమందు గట్టిన రక్ష యిచ్చును . అది గళ రోగములను. గండపిండ కలూతాది రోగములను నశింప జేయును. ఆవు నేతితో ఆవుపాలతో సమిధలతో నొకనెల మూడు సంధ్యల యందును. నామంత్ర జపముచే హోమము చేసిన యెడల నసాధ్య రోగములు కూడ నశించును. త్రిలోకము లందేది కోరినను సిద్దించును. నృసింహుని పూజించిన యెడల కోరిక కెల్ల సిద్దించును.

అష్టోత్తరశతం త్వేకే పూజాయిత్వా మృగాధిపతమ్‌

మృత్తికాః సప్త వల్మీకే శ్మశానే చ చతుష్పథే

రక్తచందన సంమిశ్రా గవాం క్షీరేణ లోడయేత్‌

సింహస్య ప్రతిమాం కృత్వా ప్రమాణేన షడంగుళమ్‌

లింపేత్తథా భూర్జపత్రే రోచనేన సమాలిఖేత్‌

నరసింహస్య కంఠే తు బద్ధ్వా చైవ హి మంత్రవత్‌

జపేత్సంఖ్యా విహీనంతు పూజయిత్వా జలాశయే

యావత్సప్తాహమాత్రంతు జపేత్సంయమితేంద్రియః

జలాకీర్ణా ముహూర్తేన జాయతే సర్వమేదినీ

అథవా శుష్కవృక్షాగ్రే నరసింహంతు పూజయేత్‌

జప్త్వా చాష్టశతం తత్త్వం వర్షంతం వినివారయేత్‌

తమేవం పింజకే బద్ధ్వా భ్రామయేత్సాధకోత్తమః

మహావాతో ముహూర్తేన ఆగచ్ఛన్నాత్ర సంశయః

పురశ్చ ధారయేత్‌ క్షిప్తం సప్తజప్తేన వారిణా

నరసింహుని యష్ణోత్తర శత నామములతో బూజించి పుట్టమన్ను స్మశాన మందలి మట్టి రాజ వీధిని నాలుగు దారులు కలియు చోట నుండియు నేడేసి మట్టి యుండలు గ్రహించి రక్త చందనము కలిపి యావు పాలతో మెదిపి యారంగుళము నరసింహ ప్రతిమ తయారు జేసి భూర్జ పత్రము నందు గోరోచనముతో మంత్రమును వ్రాసి నరసింహ స్వామి కంఠము నందు గట్టి మంత్రమును లెక్క లేకుండగ మడుగులో నిలిచి యేడు రోజులు పూజించి జపింప వలెను. అందు వలన ముహూర్త మాత్రములో నెల్ల భూమియు జల సమృద్ధ మగును. ఎండిన చెట్టు చివర నరసింహ మూర్తిని పూజించి నూట యెనిమిది మార్లా మంత్రము జపించిన యెడల వర్షమాగి పోవును. అట్లే నరసింహ స్వామిని పిండిముద్దలో నుంచి గిరగిర త్రిప్పిన యెడల వెంటనే పెనుగాలి వీచును. తరువాత నేడు సార్లు జపించి మంత్రించిన జలముచే నా ప్రతిమ నభిషేకించి దానిని దాను ధరింప వలెను.

అథ తాం ప్రతిమాం ద్వారి నిఖనే ద్యస్య సాధకః

గోత్రోత్సాదో భవే త్తస్య ఉద్ధృతే చైవ శాంతిదః

తస్మాత్తం మునిశార్దూలా భక్త్యా సంపూజయేత్సదా

మృగరాజం మహావీర్యం సర్వకామ ఫలప్రదమ్‌

విముక్తః సర్వపాపేభ్యో విష్ణులోకంస గచ్ఛతి

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః స్త్రియః శూద్రాస్త్య జాతయః

సంపూజం తం సుర శ్రేష్ఠం భక్త్యా సింహవపుర్ధరమ్‌

ముచ్యంతే త్వ శుభై ర్దుఃభై ర్జన్మకోటి సముద్భవైః

సంపూజ్య తంసురశ్రేష్ఠం ప్రాప్నువంత్యభివాంచితమ్‌

దేవత్వమమరేశత్వం గంధర్వత్వంచభోద్విజాః

యక్షవిద్యాధరత్వం చ తథాన్యచ్ఛాభి వాంఛితమ్‌

దృష్ట్యా స్తుత్వా నమస్కృత్వా సంపూజ్య నరకేసరీమ్‌

ప్రాప్నువంతి నరా రాజ్యం స్వర్గం మోక్షంచ దుర్లభమ్‌

నరసింహం నరో దృష్టా లభేదభిమతమ్‌ ఫలమ్‌

నిర్ముక్తః సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి

సకృద్దృష్ట్వా తు తం దేవం భక్త్యా సింహవపుర్ధరమ్‌

ముచ్యతే చాశుభై ర్దుఃభై ర్జన్మకోటి సముద్భవైః

సంగ్రామే సంకటే దుర్గే చోరవ్యాఘ్రాది పీడితే

స్మృత్వా తం పురుషః సర్వై రాజగ్రా మైర్విముచ్చతే

సూర్యోదయే యథా నాశంతమోభ్యేతి మహత్తరమ్‌

తథా సందర్శనే తస్య వినాశం యాంత్యుపద్రవాః

ఘుటికాంజన పాతాళ పాదుకేచ రసాయనమ్‌

నరసింహే ప్రసన్నే తు ప్రాప్నోత్యన్యాంశ్చ వాంఛితాన్‌

న్యా యోన్కామా నభిధ్యా యన్భజతే నరకేసరీమ్‌

దానిని యెవ్వని గృహ ద్వారమందు పాతి పెట్టునో వాని వంశము నశించును. ఆ ప్రతిమను వెలికి దీయగా నా యుపద్రము శాంతించును. కావున సర్వా భీష్టముల నొసంగు నరసింహ మూర్తిని భక్తితో బూజింప వలెను. దానిచే పాప ముక్తుడై విష్ణులోక మందును. బ్రాహ్మణాది వర్ణముల వారు ఆంత్యజులు కూడా నా స్వామిని పూజించి యమంగళము లను తరింప గలరు. అంతియ కాదు దేవత్వ దేవేంద్ర త్వములు యక్ష విద్యాధర గంధర్వాది దేవ విశేష భావములను రాజ్య స్వర్గ సుఖములను దుర్లభమైన మోక్షమును గూడ బొంద గలరు. నృసింహ దర్శన మొకసారి చేసినను పాప విముక్తి నంది యభీష్టము నొందగలరు. యుద్ద మందు. సంకటము లందు దొంగలు కిరాతులు మొదలైన వారి పీడచే దుర్గమమ మైన యడవి యందు ప్రాణ సందేహము కల్గి నపుడు విషాగ్ని జలో పద్రవముల నుండియు రాజుల వలన సముద్రము వలన గ్రహముల వలన కలుగు పీడ నుండి తరించును. నృసింహ స్వామిని స్మరించి నంతనే రాజో పద్రవములు నుండి ముక్తు డగును. ఉదయ మందు జీకటి విడి పోయినట్లు స్వామి దర్శనముచే సమస్త కష్టములు నశించును. ఘటిక కాటుక, పాదుక యను వాని యందు రసాయన సిద్దిని పొంద వచ్చును. ఎల్ల కోరికలు ఫలించును.

తాం స్తా న్కామా నవాప్నోతి నరో నాస్త్యత్ర సంశయః

దృష్ట్వా తందేవదేశంభక్త్య పూజ్య ప్రణమ్యచ

దశానా మశ్వమేధానాం ఫలం దశగుణం లభేత్‌

పాసైః సర్వైర్వినిర్ముక్తో గుణైః సర్వైరలంకృతః

సర్వకామ సమృద్ధత్మా జరామరణవర్జితః

సౌవర్ణేన విమానేన కింకిణీజాలమాలినా

సర్వకామ సమృద్దేన కామగేన సువర్చసా

తరుణాదిత్య వర్ణేన ముక్తాహారావలంబినా

దివ్యస్త్రి శతయుక్తేన దివ్యగంధర్వ నాదినా

కులైకవింశముద్దృత్య దేవవన్ముదితః సుఖీ

స్తూయమానో ప్సరోభిశ్చ విష్ణులోకం వ్రజేన్నరః

భుక్త్వాతత్ర వరాన్భోగాన్విష్ణులోకే ద్విజోత్తమాః

గంధర్వైప్సరైర్యుక్తః కృత్వా రూపం చతుర్భజమ్‌

మనోహ్లదకరం సౌఖ్యం యావదాభూతసంప్లవమ్‌

పుణ్యక్షయా దిహాయాతః ప్రవరే యోగినాం కులే

చతుర్వేదీ భవేద్విప్రో వేదవేదాంగ పారగః

వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షమవాప్నుయాత్‌

స్వామిని పూజించి నమస్కరించి దర్శించి యశ్వమేధ యాగముల ఫల మందును సద్గుణ సంపన్న డగునున. జరా మరణములు లేని వాడయి, చిరు గంటలతో మెరయు మొరయు కామద మైన స్వర్గ విమానమెక్కి యుదయ సూర్యుని వలె దివ్యవర్చస్సుతో ముత్యాల హారములు మెరయు దివ్య స్త్రీ శతముతో గంధర్వ గాన రమ్యమైన విమాన మెక్కి యిరువది యెక్క తరముల వారి నుద్దరించుచు సాక్షా ద్దేవతా స్వరూపముతో నమ్మోదముతో సుఖముతో అప్సరసలు స్తుతింప విష్ణు లోకమున కేగును. అందనుపమ భోగముల ననుభవించి చతుర్భజముల దాల్చి మనోహరమైన రూపముతో భూత ప్రళయము దాక నానంటించి యా పుణ్యము భుక్త మయిన తరువాత నుత్తమ మయిన యోగుల కుల మందు బుట్టి చతుర్వేద వేదాంగ పారగుడయి విష్ణు దేవతా భక్తి యోగము నంది మోక్షమును బొందును.