వాసుదేవ! నమస్తేస్తు నమస్తే మోక్షకారణ
త్రాహిమాం సర్వలోకేశ జన్మసంసారసాగరాత్
నిర్మలాంబర సంకాశ నమస్తే పురుషోత్తమ
సంకర్షణ నమస్తేస్తు త్రాహిమాం ధరణీధరా
నమస్తే హేమగర్భాభ నమస్తే మకరధ్వజ
రతికాంత నమస్తేస్తు త్రాహిమాం సంవరాన్తక
నమస్తేంజన సంకాశ నమస్తే భక్తవత్సల
అనిరుద్ధ నమస్తేస్తు త్రాహిమాంవరదోభవ
నమస్తే విబుధావాస నమస్తే విబుధప్రియ
నారాయణ నమస్తేస్తు త్రాహిమాం శరణాగతమ్
నమస్తే బలినాం శ్రేష్ఠ నమస్తే లాంగలాయుధ
చతుర్ముఖ జగద్ధామ త్రాహిమాంప్రపితామహ
నమస్తే నీలమేఘాభ నమస్తే త్రిదశార్చిత
త్రాహి విష్ణో జగన్నాథ మగ్నం మాంభవసాగరే
ప్రళయానల సంకాశ నమస్తే దితిజాంతక
నరసింహ మహావీర్య త్రాహిమాం దీప్తలోచన
యథా రసతలాదుర్వీ త్వయా దంష్ట్రోద్ధృతా పురా
తథా మహావరాహస్త్వం త్రాహిమాం దుఃఖసాగరాత్
తవై తా మూర్తయః కృష్ణ వరదాః సంస్తుతా మాయా
తవేమే బలదేవాద్యాః పృథగ్రూపేణ సంస్థితాః
అంగాని తవ దేవేశ గరుడ్మాద్యా స్తథాప్రభో
దిక్పాలాః సాయుధాశ్చైవ కేశవాద్యా స్తథాచ్యుత
ఇంద్రద్యుమ్నుడు పురుషోత్తమ దేవుని స్తుతించుట
వాసుదేవా! మోక్ష కారణ! జన్మ సంసార సాగరము నుండి రక్షింపుము. అచ్చమైన ఆకాశము వంటి వాడవు నిర్లేపుడవు. (గుణ సంగము లేనివాడ వన్నమాట) ఈ స్తుతి పారాయణ నారాయణ నామావళి. బలరామాది వివిధ మూర్తు లన్నియు నీవే వేఱు వేఱుగా ననిపించు చున్నవి. గరుడుడు శంఖ చక్రాదులు దిక్పాలురు కేశవాది రూపము లన్నియు నీ యవయవములే.
యే చాన్యేతవ దేవేశ భేధాః ప్రోక్తా మనీషిభిః
తేపి సర్వేజగన్నాథ ప్రసన్నాయత లోచన
మయార్చితాః స్తుతాః సర్వే తథాయూయం నమస్కృతాః
ప్రయచ్ఛత వరం మహ్యం ధర్మకామార్థమోక్షదమ్
భేదాస్తే కీర్తితా యేతు హరే సంకర్షణాదయః
తవ పూజార్థసంభూతా స్తత స్త్వయి సమాశ్రితాః
న భేదస్తవ దేవేశ విద్యతే పరమార్థతః
వివిధం తవ యద్రూపముక్తం తదుపచారతః
అద్వైతం త్వాం కథం ద్వైతం వక్తుం శక్నోతిమానవః
ఏక స్త్వం హి హరేవ్యాపీ చిత్స్వభావోనిరంజనః
పరమంతన యద్రూపం భావాభావ వివర్జితమ్
నిర్లేపం నిర్గుణంశ్రేష్ఠం కూటస్థమచలంధ్రువమ్
సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్ర వ్యవస్థితమ్
తద్దేవాశ్చ నజానంతి కథం జానామ్యహంప్రభో
ఆపరం తవ యద్రూపం పీతవస్త్రమ్ చతుర్బుజమ్
శంఖ చక్ర గదాపాణి ముకుటాంగద ధారిణమ్
శ్రీవత్సోరస్కసంయుక్తం వనమాలా విభూషితమ్
తదర్చయంతి విబుధా యే చాన్యే తవ సంశ్రయాః
దేవదేవ సురశ్రేష్ఠ భక్తానా మభయప్రద
త్రాహిమాం పద్మపత్రాక్ష మగ్నం విషయసాగరే
నాన్యం పశ్యామిలోకేశ యస్యాహం శరణంవ్రజే
త్వామృతే కమలాకాంత ప్రసీద మధుసూదన
జరావ్యాధి శతైర్యుక్తో నానా దుఃఖైర్నిపీడితః
హర్షశోకాన్వితో మూఢః కర్మపాశైః సుయంత్రితః
పతితోహం మహారౌద్రే ఘోరే సంసారసాగరే
విషయోదక దుష్పారే రాగద్వేష ఝషాకులే
ఇంద్రియావర్త గంభీరే తృష్ణాశోకోర్మి సంకులే
నిరాశ్రయేనిరాలంబే నిస్సారేత్యంతచంచలే
మాయయా మోహిత స్తత్ర భ్రమామి సుమిరంప్రభో
నానాజాతి సహస్రేషు జాయమానః పునః పునః
జగన్నాథ! నీ ఆ స్వరూపము లన్నిటి నర్చించితిని. నీ సంకర్షణ అనిరుద్ద ప్రద్యుమ్నాది మూర్తులను నేను కీర్తించితిని. నిన్నేక రూపుని భిన్న రూపుల బేర్కొందురు. ఔప చారికము. అద్వైతుడ వైన (ఏకైక వస్తువైన) నిన్ను ద్వైతునిగా బేర్కొనుట యెట్లు పొసగును? హరీ! నీవు చిత్స్వరూపమున (కేవలము జ్ఞానమై) వొక్కడివై సర్వము వ్యాపించి యున్నావు. నీ పరమ రూపము భావాభావ వర్జితము. ఉనికి మనుకులు లేనిది. కూటస్థము సర్వసాక్షి అచలము ధ్రువము. నామ రూపములు గల దానికి ఉపాధి యని పేరు. నీ రూపముపాధి విడిచినది. కేవలము సత్తా మాత్రము. దానిని దేవతలే యోఱుగరు. నేనట్టె ఱుంగుదును? పీతాంబర ధారి చతుర్బుజము. శంఖ చక్ర గదా పాణీ కిరీటము భుజ కీర్తులు. ధరించిన శ్రీవత్స వక్షము వనమాలా భూషితము నైన నీ మఱొక మూర్తిని (అర్చా మూర్తిని) దేవతలు నీ భక్తులు నర్చింతురు. ప్రభూ రక్షింపుము నేను శరణొంద నీకంటె మఱి యొక్కని గానను. కర్మపాశ బద్దుడనై సంసార సాగరమునం బడి కొట్టుకొను మాయా మోహమున బడిన వానిని నుద్ధరింపుము.
మయా జన్మా న్యనేకానిసహస్రా ణ్యయుతానిచ
వివిధాన్యను భూతాని సంసారేస్మిన్ జనార్దన
వేదాః సాంగా మయాధీతాః శాస్త్రాణి వివిధానిచ
ఇతిహాస పురాణాని తథాశిల్పాన్యనేకశః
అసంతోషాశ్చ సంతోషాః సంచయాపచయా వ్యయాః
మయా ప్రాప్తా జగన్నాథ! క్షయ వృద్ధ్యక్షయే తరాః
భార్యారి మిత్ర బంధూనాం వియోగాః సంగమాస్తథా
పితరో వివిధా దృష్టా మాతరశ్చ తథామయా
దుఃఖాని చానుభూతాని యాని సౌఖ్యాన్యనేకశః
ప్రాప్తాశ్చ బాంధవాః పుత్రా భ్రాతరో జ్ఞాతయస్తథా
మయోషితం తథాస్త్రీణాం కోష్ఠే విణ్మూత్రపిచ్చలే
గర్భవాసే మహాదుఃఖమనుభూతం తథాప్రభో
దుఃఖాని యాన్యనేకాని బాల్య యౌవనగోచరే
వార్థకే చ హృషీకేశ తానిప్రాప్తాని వైమయా
మరణే యాని దుఃఖాని యమమార్గే యమాలయే
మయా తాన్యనుభూతాని నరకే యాతనాస్తథా
కృమికీటద్రుమాణాంచ హస్త్యశ్వమృగపక్షిణామ్
మహిషోష్ట్రగవాం చైవ తథాన్యేషాం వనౌకసామ్
ద్విజాతీనాం చ సర్వేషాం శూద్రాణాంచైవ యోనిషు
ధనినాం క్షత్రియాణాంచ దరిద్రాణాం తపస్వినామ్
నృపాణాం నృపభృత్యానాం తథాన్యేషాంచ దేహినామ్
గృహేషు తేషాముత్పన్నో దేవ చాహం పునః పునః
నానా యోనులం బుట్టి నానా కష్టముల నను భవించితిని. సాంగము లైన వేదములను శాస్త్రములను జదివితిని. కళలను శిల్పములను నేర్చితిని. సుఖాలు దుఃఖా లెన్నో యను భవించితిని. సంతోషా సంతోషములు సంచయా ప్రచయములు (కూడ బెట్టుట పో బెట్టుట) పుత్ర మిత్ర కళత్రాదులు తలిదండ్రు లన్నదమ్ముల కలయికలు ఎడబాటు లెన్నో నాకైనవి. విణ్మూత్రముల రొంపిలో (ఆడుదాని గర్భములో) నే నిరికి కొన్నాను. మహా దుఃఖము లందినాను. బాల్య కౌమర యౌవన వార్ధక్యాది దశలం దంతులేని వంత లొందినాను. మరణ మంది యమ మార్గమున నరక మందు పలు యాతనలు పడినాను. కృమి కీటకాదులు పలు మృగ ములు పక్షులు పలు పశువుల బ్రాహ్మణాది శూద్రాంత యోనులందు ధనికులు దరిద్రులు రాజులు రాజర్షులు రాజ సేవకులు మఱి పెక్కు దేహుల గేహములందు మఱల మఱల బుట్టితిని గిట్టితిని.
గతోస్మి దాసతాం నాథ భృత్యానాం బహుశో నృణామ్
దరిద్రత్వం చేశ్వరత్వం స్వామిత్వం చ తథా గతః
హతోమయా హతాశ్చాన్యే ఘాతితో ఘాతితాస్తథా
దత్తం మమాన్యై రన్యేభ్యో మయాదత్తమనేకశః
పితృమాతృసుహృద్ర్భాతృ కళత్రాణాం కృతేన చ
ధనినాం శ్రోత్రియాణాంచ దరిద్రాణాం తపస్వినామ్
ఉక్తం దైన్యంచ వివిధం త్యక్త్వాలజ్జాం జనార్దన
దేవతిర్యజ్మనుష్యేషు స్థావరేషు చరేషు చ
న విద్యతే తథా స్థానం యత్రాహం నగతః
ప్రభో కదా మే నరకే వాసః కదా స్వర్గే జగత్పతే
కదా మనుష్యలోకేఘ కదా తిర్యగ్గతేషు చ
జలయన్త్రే యథా చక్రే ఘటీ రజ్జునిబంధనా
యాతి చోర్ద్వ మధశ్చైవ కదా మధ్యేచ తిష్ఠతి
తథా చాహం సురశ్రేష్ఠ కర్మరజ్జుసమావృతః
అథశ్చోర్ద్వం తధా మధ్యే భ్రమన్ గచ్ఛామి యోగతః
ఏవం సంసార చక్రేస్మిన్భైరవే రోమహర్షణే
భ్రమామి సుచిరం కాలం నాంతం పశ్యామి కర్హిచిత్
నజానే కిం కరోమ్యద్య హరే వ్యాకులితేంద్రియః
శోక తృష్ణాభి భూతోహం కాందిశీకో విచేతనః
ఇదానీం త్వామహం దేవ విహ్వలః శరణం గతః
త్రాహిమాం దుఃఖతం కృష్ణ మగ్నం సంసారసాగరే
కృపాం కురు జగన్నాథ భక్తం మాం యది మన్యనే
త్వదృతే నాస్తి మే బంధుర్యోసౌ చింతాం కరిష్యతి
దేవ త్వాం నాథ మాసాద్య నభయం మేస్తి కుత్రచిత్
జీవితే మరణే చైవ యోగేక్షేమేథ వాప్రభో
యేతు త్వాం విధివద్దేవ నార్చయంతి నరాధమాః
సుగతిస్తు కథం తేషాం భవేత్సంసార బంధనాత్
పెక్కు మంది దాసులకు దాసుడ నైతిని. దరిద్రుడ నైతిని. రాజులకు రాజ నైతిని. భిక్షకులకు భిక్షకు డైతిని. ఒరులకే నిచ్చితిని. ఒరుల కడ దీనుడనై నేను చెయి సాచితిని. ఒరులచే నేబడితిని. నాచే నొరు లెందఱో పడిరి. తండ్రులు తాతలు మిత్రులు భ్రాతలు పుత్రులు కళత్రముల కొఱకు సిగ్గు విడిచి దైన్యము వెళ్ళబోసి కొన్నాను. పశు పక్ష్యాదులలో చరాచర ప్రపంచము నందు దిగులు గడిచి నేను బోయి యీడిగిల బడని చోటన్నది లేనే లేదు. నరక మెప్పుడో స్వర్గ మెప్పుడో వసుధ యైప్పుడో పశు పక్ష్యాదు లందెప్పుడో నాయునికి యెప్పు డెక్కడో యెఱుగను. నీరు తోడు యంత్ర చక్రమున త్రాటితో గట్టిన కుండ నోకమారు క్రిందికి నొకసరి మీదికి నొకపరి నడిమికి వచ్చిన విధమున భైరవమైన యీ సంసార చక్రమున చిరకాలము పరిభ్రమించు చున్నాను. ఈ తిఱుగుడున కంతు గాన కున్నాను. ఇంద్రియుములు వ్యాకులములై యిప్పుడు నేనేమి సేయ వలెనో దెలియ కున్నాను. శోకము తృష్ణకు (ఆశకు) జిక్కినేను మతివోయి కాందిశీకుడనై (భ్రాంతుడనై = భయముచే నట్టిట్టు పరుగు లెత్తు వాడనై) దేవా! ఇప్పుడు నేను విహ్వలుడనై (తపనచే అవయవములు పట్టుతప్పి) బెగ్గలించుచు విలవిల దన్ని కొనుచు మ్రగ్గుచు విరవిర వోవుచు) నిన్ను శరణందు చున్నాను. కృష్ణా సంసార మందు మునిగి పోయిన నన్ను కాపాడుము. జగన్నాథ నన్ను భక్తుడని యను కొందువేని నా యెడ దయ సూపుము. నన్ను గురించి యాలోచించు బంధువు నీకంటె నాకు లేడు. నిన్ను నా నాథునిగ (దిక్కుగ) బొందితిని. మఱి నాకెక్కడను బ్రతుకున జావున యోగమున క్షేమమున నే భయముండదు. అగద్దాతయైన కేశవు నందు భక్తి కలుగని వారికి నిన్ను యధావిధిగ సేవింపని వారికి నరాధములకు సంసార బంధము నుండి సుగతి(విముక్తి) యెట్లగును?
కిం తేషాం కులశీలేన విద్యయా జివనేన చ
యేషాం నజాయతే భక్తిర్జగద్ధాతరి కేశవే
ప్రకృతిం త్వాసురీం ప్రాప్య యేత్వాం నిందంతి మోహితాః
పతంతి నరకే ఘోరే జాయమానాః పునః పునః
నతేషాం నిష్కృతి స్తప్మాద్విద్యతే నరకార్ణవాత్
యే దూషయంతి దుర్వృత్తాస్త్వాం దేవ పురుషాదమాః
యత్రయత్ర భవేజ్జన్మ మమకర్మ నిబంధనాత్
తత్రతత్ర హరే భక్తి స్త్వయి చాస్తు దృఢా సదా
ఆరాధ్య త్వాం సురా దైత్యా నరాశ్చాన్యేపి సంయతాః
అవాపుః పరమాం సిద్ధిం కస్త్వాం దేవ నపూజయేత్
న శక్నువంతి బ్రహ్మాద్వాః స్తోతుం త్వాం త్రిదశా హరే
కథం మానుష బుద్ద్యాహంస్తౌమి త్వాం ప్రకృతేః పరమ్
తథా చాజ్ఞాన భావేన సంస్తుతోసి మయా ప్రభో
తత్ క్షమస్వాపరాధం మేయది తేస్తి దయా మయి
కృతాపరాధేపి హరే క్షమాం కుర్వంతి సాధవః
తస్మాత్ర్పసీద దేవేశ భక్త స్సేహం సమాశ్రితః
స్తుతోసి యన్మయా దేవ భక్తిభావేన చేతసా
సాంగం భవతు తత్సర్వం వాసుదేవ నమోస్తుతే
కులముతో శీలముతో విద్యతో బ్రతుకుతో బని నేమి? ఎవరు మోహ వశులై నిను నిందింతురో వారాసుర ప్రకృతిలో నుండి మఱల మఱల పుట్టుచు ఘోర నరక మందు బడు చుందురు. నీ దూషణము సేయువాండ్ర కా నరకము కంటె మఱి ప్రాయశ్చిత్తము లేదు. నా ప్రారబ్దమును బట్టి యెందెందు నాకు జన్మము గల్గునో యందందు నీ యందు నాకు దృఢభక్తి యెల్లపుడు గల్గు గాక! నిన్నా రాధించి సురాసురులు నరులను మనసు నిమిడించు కొని పరమ సిద్దినందిరి. నిన్నెవ్వడు పూజింపడు? బ్రహ్మదు లేని వొగడ లేని ప్రకృతి కంటే పరుడైన నిన్ను మానుష బుద్దిని నేనెక్కడ బొగడ గలను. అయినను దెలియని తనముచే నా చేత వినుతుడ నైతివి. నాయెడ దయగల దేని దీనికి నన్ను క్షమింపుము. సాధువులు మహానుభావులు నపరాధుల యెడం గూడ క్షమ సేయుదురు. భక్త వాత్సల్యము ననుసరించి దేవేశ్వర! నాయెడ బ్రసన్నుడ వగుము. భక్తి భరిత చిత్తమున నుతించితింగాన నే చేసిన పూజ యెల్ల సాంగమగును గాక! వాసుదేవ! నమస్కారము.
బ్రహ్మ:
ఇత్థం స్తుత స్తదా తేన ప్రసన్నో గరుడధ్వజః
దదౌ తస్మై మునిశ్రేష్ఠాః సకలం మనసేప్సితమ్
యః సంపూజ్య జగన్నాథం ప్రత్యహం స్తౌతి మానవః
స్తోత్రేణానేన మతిమా న్స మోక్షం లభతే ధ్రువమ్
త్రిసంధ్యం యో జపేద్విద్వా నిదం స్తోత్రవరం శుచిః
ధర్మం చార్థం చ కామంచ మోక్షం చ లభతే నరః
యః పఠేచ్చృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః
స లోకం శాశ్వతం విష్ణో ర్యాతి నిర్దూత కల్మషః
ధన్యం పాపహరం చేదం భుక్తి ముక్తి ప్రదమ్ శివమ్
గుహ్యంసుదుర్లభంపుణ్యం నదేయంయస్యకస్యచిత్
న నాస్తికాయ మూర్ఖాయ న కృతఘ్నాయ మానినే
న దుష్టమతయే దద్యా న్నాభక్తాయ కదాచనః
దాతవ్యం భక్తియుక్తాయ గుణశీలాన్వితాయచ
విష్ణుభక్తాయ శాంతాయ శ్రద్ధానుష్ఠానశాలినే
ఇదం సమస్తాఘవినాశహేతుః కారుణ్యసంజ్ఞం సుఖమోక్షదంచ
అశేష వాంఛా ఫలదం వరిష్ఠం స్తోత్రం మయోక్తం పురుషోత్తమస్య
యే తం సుసూక్ష్మం విమలా మురారిం ధ్యాయంతి నిత్యం పురుషం పురాణమ్
తే ముక్తిభాజః ప్రవిశంతి విష్ణుం మంత్రైర్యథాజ్యం హుత మధ్వరాగ్నౌ
ఏకః సదేవో భవదుః ఖహంతా పరః పరేషాం న తతోస్తి చాన్యత్
బ్రహ్మ:
ఇట్లాతనిచే బొగడ బడి గరుడ ధ్వజుండు ప్రసన్నుడై యాతడు మనసా రనేది కోరె నది యెల్ల యిచ్చెను. దినదిన మెవ్వడు పూజించి హరి నీ స్తోత్రముచే వినుతించు నతడు నిక్కముగ మోక్ష మందును. ఈ స్తోత్ర వరము నెవ్వడు తెలిసి (అర్థ మెఱిగి) త్రిసంధ్యము శుచియై జపించునో ఆ నరుడు ధర్మ అర్థ కామ మోక్షములను బోందును. దీని జదివిన విన్న వినిపించిన యాతడు పాపము లెడని శాశ్వతమైన విష్ణులోక మందును. ధన్యము పాప హరము భుక్తి ముక్తి దముశివము(మంగళము) గుహ్యము (రహస్యము) సుదుర్లభము పుణ్యము నైన యీ స్తుతి నెవ్వనికి బట్టిన వానికీయరాదు. నాస్తికుడు మూర్ఖుడు కృతఘ్నుడు మాని (నే నే ఘనుడు నను కొనువాడు) దురాలోచనుడు (దుష్ట జ్ఞానము గలవాడు) అభక్తుడు కెప్పుడును దీని నీయరాదు. భక్తుడు గుణ వంతుడు శీలవంతుడు విష్ణు భక్తుడు శాంతుడు శ్రద్దతో ననుష్ఠానము సేయు వాడునైన వారికిది సర్వాఘ విఘాతుకము సుఖ మోక్షదము అశేష వాంచా ఫలదము వరిష్ఠము నైన “కారుణ్య”మను పేరుగల యీ పురుషోత్తమ స్తోత్రమును నేను జెప్పితిని. విశుద్దు లెవ్వరాసునూక్ష్మ వస్తువైన మురారిని పురాణ పురుషుని నిచ్చలు ధ్యానింతురో వారు ముక్తులై మంత్రములచే యజ్ఞాగ్ని యందు హోమము సేయబడిన యాజ్యము వలె హరిం బ్రవేశింతురు. అతడొక్కడే దైవము సంసార దుఃఖ హరుడు పరుడు పరాత్పరుడు, అంతకంటె మఱి యెందులేడు.
ద్రష్టా స పాతా సతు నాశకర్తా విష్ణుః సమస్తాఖిల సారభూతః
కిం విద్యయా కిం స్వగుణైశ్చతేషాం యజ్ఞైశ్చ దానైశ్చ తపోభిరుగ్రైః
యేషాం న భక్తిర్భవతీహ కృష్ణే జగద్గురౌ మోక్ష సుఖప్రదే చ
లోకే స ధన్యః సశుచిః స విద్వాన్మఖైస్తపోభిః సగుణైర్వరిషః
జ్ఞాతా స దాతా స తు సత్యవక్తా యస్యాస్తి భక్తిః పురుషోత్తమాఖ్యే
ఆ కృష్ణుడు ద్రష్ట (సర్వసాక్షి) పాత (రక్షకుడు) నాశ కర్తయు సమస్త సారభూతుడు జగద్గురువు మోక్ష సుఖ ప్రదాతయు నగును. కృష్ణు నందె వరికి ఇహ మందు భక్తి కలుగదో వారికి విద్యచే నేమి? గుణముల నేమి యజ్ఞములను దానముల నుగ్ర తపముల నేమి ప్రయోజనము? ఎవనికి బురుషోత్తము నందు భక్తి యుండు నాతడు లోక మందు ధన్యుడు. అతడు శుచి అతడు విద్వాంసుడు. సుఖములతో తపస్సులతో గుణములతో నతడు శ్రేష్ఠుడు. జ్ఞాని దాత యతడే సత్యవక్త.
Summary of chapter 49 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The sage Mārkaṇḍeya arrives at the Puruṣottama kṣetra and visits the sacred Vaṭa (Banyan) tree — the site where the Lord reclines during cosmic dissolution, holding the infant universe within himself. Mārkaṇḍeya performs reverence at the holy Vaṭa and is thereby prepared for his extraordinary vision of pralaya.