వ్యాసుడు:
బాణోపి ప్రణిపత్యాగ్రే తతశ్చాహ త్రిలోచనమ్
దేవ బాహు నహస్రేణ నిర్విణ్ణోహం వినిహవమ్ కచ్చిన్మమైషాం బాహూనాం సాఫల్యకరణోరణః
భవిష్యతి వినా యుద్ధం భారాయ మమ కిం భుజైః
వ్యాసుడు:
బాణుడు త్రిలోచనునికి మ్రొక్కి యిట్లనియె. వేయి బాహువులతో యుద్ధము లేక నేను నిస్పృహుడ నైతిని. ఈ చేతు లున్నందులకు ఇవి సాఫల్యము నందుట కేదేని రణము సంఘటింప వలదా? అది లేనపుడీ చేతులు బరువు చేటుగదా. ఇవి యెందులకు? అన శంకరుండు
శంకరుడు:
మయూరధ్వజభంగస్తే యదా బాణ భవిష్యతి పిశితాశి జనానందం ప్రాప్స్యపి త్వం తదా రణమ్
శంకరుడు:
నీ నెమలి టెక్కెమెప్పుడు విఱుగునో యప్పుడు మాంసాశనులగు జనముల కానంద మగు యుద్ధము నీకు సంఘటించు ననియె.
వ్యాసుడు:
తతః ప్రణమ్య ముదితః శంభు మభ్యాగతో గృహాన్ భగ్నం ధ్వజమథా లోక్య హృష్టో హర్షం పరంయయౌ
ఏతస్మిన్నేవ కాలే తు యోగవిద్యాబలేన తమ్ అనిరుద్ధమథానిన్యే చిత్రలేఖా వరా సఖీ
కన్యాంతః పురమధ్యేతం రమమాణం సహోషయా విజ్ఞాయ రక్షిణో గత్వా శశంసు ర్దైత్యభూపతేః
దివ్యాష్టం కింకరాణాంతు సైన్యం తేన మహాత్మనా జఘాన పరిఘం లౌహ మాదాయ పరవీరహా
వ్యాసుడు:
అంతట సంతసించి శంభునికి మ్రొక్కి యింటికి వచ్చి రాగానే ధ్వజ భంగ మగుట చూచి మిక్కిలి హర్ష మొందెను. ఇదే సమయ మున చిత్రలేఖ యా యనిరుద్థుని కన్యాంతః పురమునకు యోగ బలమున గొనివచ్చి నిలుప నుషా దేవితో గ్రీడించు చున్న వానింజుచి కావలి వాండ్రు దైత్యపతి కెఱిగించిరి. బాణు నానతిచే వచ్చి పైబడిన సేవక సైన్యము నమ్మహాత్ముడ నిరుద్ధుడు ఇనుప పరిఘం గొని చాప మోదెను.
హతేషు తేషు బాణోపి రథస్థ స్తద్వధోద్యతః యుధ్యమానో యథాశక్తి యదా వీరేణ నిర్జితః
మాయయా యుయుధే తేన సతదా మంత్రచోదితః తతశ్చ పన్నగాస్త్రేణ బబంధ యదునందనమ్
ద్వారవత్యాం క్వయాతోసా వనిరుద్ధేతి జల్పతామ్ యదూనా మాచచక్షే తం బద్ధం బాణేన నారదః
తం శోణితపురే శ్రుత్వా నీతం విద్యావిదగ్ధయా యోషితా ప్రత్యయం జగ్ము ర్యాదవా నామవైరిణి
వారట్లు హతు లైనంత బాణుడు రథమెక్కి వచ్చి పోరి యవ్వీరుని వలన బరాజయ మొందెను. అవ్వల బాణుడు మంత్రము జపించి మాయా యుద్ధము సేయ నారంభించెను. సర్పాస్త్రముచే యదు నందనుని బంధించెను. అనిరుద్ధుడెటు వోయెనని ద్వారకలో ననుకొను చున్న యదువులకు నారదు డతని బాణునిచే బద్ధు డయినట్లు తెలియ జేసెను. అవ్వల యాదవులా యనిరుద్ధ కుమారుని యోగ విద్యా విశారద యగు నొక యంగన శోణిత పురమునకు గొంపోయి నట్లు విని శత్రువు నందు విశ్వాసము నందిరి.
తతోగరుడ మారుహ్య స్మృతమాత్రా గతం హరిః బలప్రద్యుమ్న సహితో బాణస్య ప్రయయౌ పురమ్
పురీప్రవేశే ప్రమథై ర్యుద్ధ మాసీ న్మహాబలైః యయౌ బాణపురాభ్యాశం నీత్వా తా న్సంక్షయం హరిః
తతస్త్రిపాదస్త్రిశిరా జ్వరో మాహేశ్వరో మహాన్ బాణరక్షార్థమత్యర్థం యుయుధే శార్ఙ్గ ధన్వనా
తద్భస్మస్పర్శసంభూత తాపం కృష్ణాంగసంగమాత్ అవాప బలదేవోపి సమం సంమీలి తేక్షణః
తతః సంయుధ్యమానస్తు సహ దేవేన శార్ఙ్గిణా వైష్ణవేన జ్వరేణాశు కృష్ణదేవా న్నిరాకృతః
నారాయణభుజాఘాత పరిపీడన విహ్వలమ్ తంవీక్ష్య క్షమ్యతా మస్యే త్యాహ దేవః పితామహః
తతశ్చ క్షాంత మేవేతి ప్రోచ్య తం వైష్ణవం జ్వరమ్ ఆత్మన్యేవ లయం నిన్యే భగవా న్మధుసూదనః
మమ త్వయా సమం యుద్ధం యే స్మరిష్యంతి మానవాః విజ్వరాస్తే భవిష్యంతీ త్యుక్త్వా చైనం యయౌహరిః
తతోగ్నీన్భగవాన్పంచ జిత్వా నీత్వా క్షయం తథా దానావానాం బలం విష్ణు శ్చూర్ణయామాస లీలయా
తతః సమస్త సైన్యేన దైతేయానాం బలేః సుతః యుయుధే శంకరశ్చైవ కార్తికేయశ్చ శౌరిణా
హరిశంకరయో ర్యుద్ధ మతీ వాసీ త్సుదారుణమ్ చుక్షుభుః సకలా లోకాః శస్త్రాస్రైర్బహుధార్దితాః
ప్రళయోయమశేషస్య జగతో నూన మాగతః మేనిరే త్రిదశా యత్ర వర్తమానే మహారణే
జృంభాణాస్త్రేణ గోవిందో జృంభయాస శంకరమ్ తతః ప్రణేశు ర్దైతేయాః ప్రమథాశ్చ సమంతతః
జృంభాభిభూతశ్చ హరో రథోపస్థ ఉపావిశత్ న శశాక తదా యోద్ధుం కృష్ణే నాక్లిష్ట కర్మణా
గరుడక్షతబాహుశ్చ ప్రద్యుమ్నాస్త్రేణ పీడితః కృష్ణహుంకారనిర్ధూత శక్తి శ్చాపయయౌ గుహః
జృంభితే శంకరే నష్టే దైత్యనైన్యే గుహేజితే నీతే ప్రమథస్తెన్యే చ సంక్షయం శార్ఙ్గధన్వనా
నందీశ సంగృహీతాశ్వ మధిరూఢో మహారథమ్ బాణస్తత్రాయయౌయోద్ధుంకృష్ణకార్ష్ణ బలైః సహ
అంతట హరి తలచి నంతనే వచ్చి నగరుడు నెక్కి బలరామునితో ప్రద్యుమ్నునితో గూడి బాణ పురమున కేగెను. పుర ప్రవేశ మందే బలశాలు రగు ప్రమథ గణముతో రణ మయ్యెను. హరి వారిని క్షయ మొందించి బాణపుర ప్రాంతములకు వెళ్లెను. అవ్వల త్రిపాదము త్రిశిరస్కము నైన మాహాజ్వరము బాణుని కాపు దలకై శార్ఙ్గ ధన్వునితో (హరితో) పోర జొచ్చెను. కృష్ణ శరీర స్పర్శ వలన భస్మ సర్శ వలన జనించిన యొకానొక తాపమును బలరాముడు కూడ పొంది కన్నులు మూసి కొనెను. కృష్ణునితో బోరు చున్న మహేశ్వర జ్వరము వైష్ణవ జ్వరముచే కృష్ణ దేహము నుండి త్రోసివేయ బడెను. నారాయణుని భుజముల యొత్తిడిచే పీడింప బడిన మహేశ్వర జ్వరమును చూచి బ్రహ్మ దీనిని క్షమింపుడని పలికెను. వాని బాహువన మట్లు తెగిపోవ మధువైరి త్రిపుర వైరిచే దెలుప బడి చేత నున్న సుదర్శనమును వదల నెంచెను. అప్పుడుమాపతి లేచి బాహువులు తెగి రక్త ధారలను వర్షించు చున్న బాణునిం గని సామ పూర్వకముగ గోవిందునితో నిట్లనియె. నారాయణ భుజా ఘాతముచే గల్గిన బాధచే గన్నులు తీసి వేసిన మాహేశ్వర జ్వరముంగని బ్రహ్మ వీనిని క్షమింపు మని హరింగోరె అటు మీద క్షమించితి నని వైష్ణవ జ్వరమును దన యంద లయింప జేసి కొనెను. నీతో నాకైన యీ యుద్ధము నెవ్వరు స్మరింతురో వారు విజ్వరులు (జ్వర బాధలేని వారు) అయ్యెదరని హరి యేగెను. అవ్వల శత్రు ప్రయుక్తము లగు పంచాగ్నుల గెల్చి క్షీణింప జేసి దానవుల సేనలను విష్ణువు లీలగ పిండి సేసెను. అవ్వల బాణుడు శంకరుడు కుమార స్వామియు సమస్త సైన్యముతో కృష్ణు నెదిరించి యుద్ధము సేసిరి. హరి హరుల పోరాటము మిక్కిలి దారుణ మయ్యెను. శస్త్రాస్త్రము లచే లోకములు సంక్షోభించెను. ఇది సర్వ జగ త్ప్రళయము వచ్చిన దని వేల్పులు తలచిరి. గోవిందుడు జృంభ ణాస్త్రముచే శంకరుని జృంభింప జేసెను. అంతట దైత్యులు ప్రమథులును నశించిరి. జృంభణము వలన నోటు వడి హరుడు రథమధ్యమం దొరగెను. కృష్ణునితో బోర లేడయ్యెను కుమారస్వామి గరుడునిచే బొడువ బడిన బాహువులతో ప్రద్యుమ్నుని యస్త్రముల దెబ్బతిని కృష్ణుని హుంకారము లచే శక్త్యా యుదము చెదర రణభూమి నుండి తొలగి పోయెను. హరిచే శంకరుడూ దరగొన న సుర సైన్యము నాశము గన గుహుడోటు వడ ప్రమథసేన క్షయ మొంద నందీశు డశ్వములం బూన్చిన రథమెక్కి బాణుడు కృష్ణునితో కృష్ణుని బలముతో బోర వచ్చెను. మహావీరుడు బలభద్రుడు బాణుని సైన్యము ననేక విధముల జెండాడెను. ప్రద్యుమ్నుడు రణ ధర్మము ననుసరించి పారిపోక (వెనుదివక) పోరెను. బలరాముడు నాగలి కొనచే బట్టిలాగి రోకలిను చక్రి బాణములచే నుగ్గా సేయుటను బాణుడు నూచెను. అవ్వల కృష్ణుడును బాణుడును దలపడిరి. ఒండొరులు మెఱుగులు గ్రమ్ము కవచములను ఖండించు కొనిరి. ఒండొరుల బాణములను ఒండొరులను గొట్టు కొనిరి. తుదకు హరి బాణుని సంహరింప వలెనిన దృఢ నిశ్చయము సేసి కొనెను అంతట నూరుగురు నూర్యులట్లు వెలుగు చక్రమును సుదర్శ నాఖ్యమును దైత్య చక్రవైరి హరిచే బట్టెను. మధువైరి ఈ సారి బాణుడు నశించి తీర వలెనని చక్రాయుదమును వదలి నంతట రాక్షసుల మాయా మంత్ర శక్తి కోటరి యనునది దిగంబరి యయ్యెను. అనగా వెల్లడి యయ్యెను. ఆ శక్తింగని కనులు మూసికొని బాణుని బాహు వనమును ఖండించుటకు సుదర్శనమును విసరెను. ఆ చక్రా యుధము బాణుని బాహు వనమును నరకెను. హరి యామీద బాణుని గూడ సంహరింప నెంచి నంతట త్రిపురవైరి (శివుడు) బాణుడు చేతులు తెగి రక్తము వర్షించు చుండ గని తటాలున వచ్చి హరితో సామ పూర్వముగ నిట్లనియె.
రుద్రుడు:
బలభద్రో మహావీర్యో బాణసైన్య మనేకథా వివ్యాధ బాణైః ప్రద్యుమ్నో ధర్మత శ్చాపలాయితః
ఆకృష్య లాంగలాగ్రేణ ముసలేన చ పోథితమ్ బలం బలేన దదృశే బాణో బాణైశ్చ చక్రిణః
తతః కృష్ణస్య బాణేన యుద్ధ మాసీ త్సమాసతః పరస్పరం తు సందీప్తా న్కాయత్రాణవిభేదినః
కృష్ణ శ్చిచ్ఛేద బాణాం స్తాన్బాణేన ప్రహితాన్ శరైః బిభేద కేశవం బాణో బాణం వివ్యాధ చక్రధృక్
ముముచాతే తథాస్త్రాణి బాణకృష్ణౌ జిగీషయా పరస్పర క్షతి పరౌ పరిఘాంశ్చ తతో ద్విజాః
చిద్యమానేష్యశేపేషు శస్త్రే ష్వస్త్రే చ సీదతి ప్రాచుర్యేణ హరి ర్బాణం హంతుం చక్రే తతో మనః
తతోర్కశత సంభూత తేజసా సదృశద్యుతి జగ్రాహ దైత్యచక్రారి ర్హరిశ్చక్రం సుదర్మనమ్
ముంచతో బాణనాశాయ తచ్చక్రం మధువిద్విషః నగ్నా దై తేయ విద్యాభూ త్కోటరీ పురతో హరేః
తామగ్రతో హరి ర్దృష్ట్వా మీలితాక్షః సుదర్శనమ్ ముమోచ బాణముద్దిశ్య ఛేత్తుం బాహువనం రిపోః
క్రమేణాస్య తు బాహూనాం బాణ స్యాచ్యుత చోదితమ్ ఛేదం చక్రేసురస్యాశు శస్త్రాస్త్ర క్షేపణా ద్ద్రుతమ్
ఛన్నే బాహువసే తత్తు కరస్థం మధుసూదనః ముముక్షు ర్బాణనాశాయ విజ్ఞాత స్త్రిపురద్విషా
స ఉత్పత్యాహ గోవిందం సామపూర్వ ముమాపతిః విలోక్య బాణం దోర్దండ ద్ఛేదాసృక్ర్సాప వర్షిణమ్
కృష్ణ కృష్ణ జగన్నాథ జానేత్వాం పురుషోత్తమమ్ పరేశం పరమాత్మాన మనాదివిధనం పరమ్
దేవతిర్యబ్మనుష్యేషు శరీరగ్రహణాత్మికా లీలేయం తవ చేష్టా హి దైత్యానాం వధలక్షణా
తత్ర్పసీదాభయం దత్తం బాణస్యాస్య మయా ప్రభో తత్త్వయా నానృతం కార్యం యన్మయా వ్యాహృతం వచః
అస్మ త్సంశ్రయ వృద్ధోయం నాపరాధస్త వావ్యయ మయా దత్తవరో దైత్య స్తతస్త్వాం క్షమయామ్యహమ్
ఇత్యుక్తః ప్రాహ గోవిందః శూలపాణి ముమాపతిమ్ వ్రసన్నవదనో భూత్వా గతామర్షోసురం ప్రతి
రుద్రుడు:
కృష్ణా! కృష్ణా! జగన్నాథ! నీవు పురుషోత్తముడవు పరాత్పరుడవు ఆద్యంతములు లేని వాడవువని యెఱుంగుదును. దేవ మనుష్య పశు పక్ష్యాదు లందు శరీరమును గ్రహించుట దైత్య సంహారము సేయుట యను క్షణము గల యీ చేష్ట నీ లీల. కావున ప్రసన్నుడ వగుము. ఈ బాణున కేనభయ మిచ్చి యున్నాను. నా పల్కిన పలుకు నీ వబద్ధము సేయ దగదు. నాయాశ్రయ మదముచే బెరిగిన వాడు వీడు. నీ యపరాధ మిందు లేదు. ఈ దైత్యుని కేను వరము లిచ్చితిని. కావున నిన్ను నేను సైరణ గొను మని కోరుచున్నాను. అన గోవిందుడా మాధవుని శూలపాణిం గూర్చి ప్రసన్న ముఖుడై బాణుని యెడ గసి విడచి యిట్లనియె.
శ్రీభగవానుడు:
యుష్మద్దత్తవరో బాణో జీవతా దేష శంకర త్వ ద్వాక్యగౌరవా దేత న్మయా చక్రం నివర్తితమ్
త్వయా య దభయం దత్తం తద్దత్త మభయం మయా మత్తోవిభిన్నమాత్మానం ద్రష్టుమర్హసి శంకర
యోహం సత్వం జగచ్చేదం సదేవాసురమానుషమ్ అవిద్యామోహితాత్మానః పురుషా భిన్నదర్శినః
ఇత్యుక్త్వా ప్రయయౌ కృష్ణః ప్రద్యుమ్ని ర్యత్ర తిష్ఠతి తద్బంథపణినో నేశు ర్గరుడావిలశోషితాః
తతోనిరుద్ధ మారోప్య సపత్నీకం గరుత్మతి అజగ్ము ర్ద్వారకాం రామకార్షిణదామోదరాః పురీమ్
శ్రీభగవానుడు:
శంకర! నీచే వరము లీబడిన వాడు గావున నీ భాణుడు బ్రతుకుంగాక! నీమాటపై గల గౌరవము చేనిదిగో చక్రమును మఱలించి తిని. నీవభయ మిచ్ఛుట నేని చ్చుటయే. నాకంటె నీవు వేఱు గావని చూడ దగను. నేనెవ్వడనో యతడు నీవే. సదేవా సుర మానుష మైన యీ జగత్తు గూడ మనమే. అవిద్యా మోహితులైన వారు భేద దృష్టి నందుదురు. అని కృష్ణుడు పలుక ప్రద్యుమ్నుని జుట్టుకొని యున్న పాములు చచ్చువడి పోయినవి. అంతట పత్నితో గూడిన యనిరుద్దుని గరుడునిపై కెక్కించికొని బలరామ కృష్ణ కృష్ణ సంబంధి పరివారములు ద్వారకా పురికి వచ్చిరి.
Summary of chapter 99 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Balarāma's divine nature, his identity as Śeṣa (the cosmic serpent), and his extraordinary feats are celebrated. His ploughing of the Yamunā, his crushing of the ape-demon Dvivida (narrated in the next chapter), his unconditional brotherly devotion to Kṛṣṇa, and his role as the embodiment of sustaining power in the divine pair are praised in a dedicated eulogy to the elder divine brother.