బ్రహ్మ మహా పురాణము

219 - శ్రాద్ధవిధి వర్ణనమ్‌

మునులు:

పరలోకగతానాం తు స్వకర్మస్థానవాపినామ్‌

తేషాం శ్రాద్ధం జ్ఞే(దే)యం పుత్త్రెశ్చాన్యైశ్చజంధుభిః

మునులు:

 పరలోకమున కేగి తమ కర్మానుగుణ మయిన స్థాన మందున్న వారికి కొడుకులు మఱియుం గల బంధువులు శ్రాద్ధ మెట్లు పెట్ట వలయునన వ్యాసభగవాను డిట్లనియె.

వ్యాసులు:

నమస్కృత్య జగన్నాథం వారోహంలోకభావమ్‌

శృణుధ్వం సంప్రవక్ష్యామి శ్రాద్ధకల్పంయథోధితమ్‌

పురా కోకాజలేమగ్నా న్పితౄనుద్ద్రతవాన్నిభుః

శ్రాద్ధం కృత్యా తదాదేవో యథా తత్ర ద్విజోత్తమాః

కి మర్ధం తేతు కోకాయాం నిమగ్నాః పితంరోభసి

కథం తేనోద్ధృతా స్తేవై వారాహేణ ద్విజోత్తమ

తస్మినోకాముఖే తీర్థే భుక్తిముక్తి ఫలప్రదే

శ్రోతుమిచ్ఛామహే బ్రూహి పరం కౌతూహలం హినః

త్రేతాద్వాపరయోః సంధౌ పితరో దివ్యమానుషాః

పురాయేరుగిరేః పృష్టే విశ్వైర్దేవై సహస్థితాః

తేషాం సముపవిష్టానాం పితౄణాం సోమసంభవా

కన్యా కాంతిమతీదివ్యా పురతః పాంజలిః స్థితాః

వ్యాసులు:

జగన్నాథునికి వరాహ మూర్తికి నమస్కరించి తెలుపు చున్నాను. కల్పమును వినుండు. మున్ను కోకా జలడందు మునిగి పోయిన పితరులను వరాహ మూర్తియైన ప్రభువు శ్రాద్ధముం గావించి యుద్దరించెనన

మునులు:

కాసి భద్రే ప్రభుః కోవా భవత్యా వ్యక్తుమర్హసి

మునులు:

మునులదెట్ల జరిగెనో యానతిమ్మన వ్యాసుండిట్లనియె.

వ్యాసులు:

సా ప్రోవాచ పతౄన్దేవా న్కళా చాంద్రమసీతి హ

ప్రభుత్వే భవతామేవ వరయామి యధీచ్ఛథ

ఊర్జా నామా స్తిప్రథమం స్వధా చ తదనంతరమ్‌

భవద్భిశ్చాద్వైవకృతం నామ కోకేతి భావితమ్‌

తేహి తస్యావచః శ్రత్వా పితరో దివ్యమానుషాః

తస్యాముఖం నిరీక్షంతో న తృప్తి మధిజగ్మిరే

విశ్వేదేవాశ్చ తాంజ్ఞాత్వా కన్యాముఖనిరీక్షకాన్‌

యోగచ్యుత్యాన్నిరీక్ష్యైవ విహాత్రిదివం గతాః

వ్యాసులు:

త్రేతా ద్వాపర యుగ సంధిలో మున్ను మెరు గిరిమీద దివ్యులు మానుషులు నైన పితరులు విశ్వే దేవులతో వసించిరి. (పితరులకు దేవత్వము మనుష్యత్వము నను రెండు ధర్మములు గలవని శస్త్రములు తెలుపు చున్నవి. కావున పితృవతి యైన యమునికి నరక చతుర్ధశి నాడు చేయ వలసిన తర్పణము దేవతగా భావించి నవ్యము గానూ మనుషత్వమును భావించి ప్రాచీనారీతి గానూ చేయ వచ్చునని ధర్మ శాస్త్రములు తెలుపు చున్నవి) అచట వారు కూరుచున్న తఱి సోముని కూతురు కాంతి మతియను దేవకన్య ప్రాంజలియై వారి యెదుట నిలిచెను. వారు కళ్యాణి! నీవెవ్వతెవు. నీకు ప్రభు వెవ్వడు? తెలుపు మనిరి. చంద్రకళను మీకిష్ట మగునేని మిమ్ము నా ప్రభువులుగా వరించు చున్నాను. నా మొదటి పేరు ఊర్జ ఆపైన స్వధయను పేరం బిలువ బడుచున్నాను. ఇప్పుడే మీరు ‘కోక’ అను పేర బిల్చినారు. పితరు లామె పలుకులు విని యామె మొము వంక జూచి తృప్తి సెందరైరి. (మోహపడి రన్నమాట) అ కన్య నూరక చూచుచు తనివి సెందక యోగ భ్రష్టులైన వారని యోఱింగి విశ్వే దేవులా పితరులను వారిని వదలి పెట్టి త్రిదివంబున కరిగిరి.

భగవానపి శీతాంశు రూర్జాం నాపశ్యదాత్మజామ్‌

సమాకులామనాదధ్యౌ క్వ గతేతి మహాయశాః

స వివేద తదాసోమః ప్రాప్తాం పితౄంశ్చకామతః

తై శ్చావలోకితాం హార్దా త్స్వీకృతాం తపోబలాత్‌

తతః క్రోధపరీతత్మ పితౄంశశధరో ద్విజాః

శశాపనితిష్యధ్వం యోగభ్రష్టానిచేతనః

యస్మాదదత్తాం మత్కన్యాం కామయధ్వం సుభావిశాః

యస్మాద్ధృతవతీ చేయం పతీన్పతృమతీసతీ

స్వతంత్రా ధర్మముత్సృజ్య తస్మాద్భవతు నిమ్నగా

కోకేతి ప్రథితాలోకే శిశిరాద్రిసమాశ్రితా

ఇత్థం శప్తాశ్చంద్రమసా పితరో దివ్యమానుషాః

యోగ భ్రష్టా నిపతితా హిమవత్పాదభూతతే

ఊర్జా తత్రైవపతితా గిరిరాజస్య విస్తృతే

ప్రస్థేతీర్థం సమాసాద్య సప్తసాముద్ర ముత్తమమ్‌

శోకా నామతతో వేగాన్నదీ తీర్థశతాకులా

ప్లావయంతీ గిరేః శృంగం సర్పణాత్తు సరిత్య్మ్సతః

చంద్ర భగవానుడు తన కూతురు నూర్జనింట గానక మనసు కలత పడిన మనస్సుతో నెటుపోయిన దని యాలోచించెను. ఆ సమాధిలో నతడామె కామముతో బితరుల కడ కేగెనని వారిచే హృదయ పూర్వకముగా నామె స్వీకరింప బడిన దనియుం దపో బలమున నేణింగెను. అంత గినుక గొని శశాంకుడు యోగ భ్రష్టులై మనస్సు స్థాయిచెడి తండ్రి హద్దులో నున్న సాధ్వినీ! చీనీయకుండ నా కన్యను హరించితిరి గావున మీరు క్రింద బడుదురు గాక యన శపించెను. ఈ నా కూతురును స్వతంత్రురాలై ధర్మము విడిచి భరించి నందున కోకయను పేర హిమాద్రిపై నది యగుగాక యనియె. ఇట్లు శప్తులైన పితృ దేవతలు యోగ భ్రష్టులై హిమగిరి మొదట బడిరి. ఊర్జయు నక్కడనే హిమగిరి ప్రస్థమందు పడి సప్త సాముద్రమము తీర్థముంజేరి కోకయను పేర నూరు తీర్థములతో హిమగిరి శిఖరమును దడుపుచు నర్పణము సేయుట వలన (ప్రవహించుట వలన) సరిత్తు(నది) అను పేరందెను.

అథ తే పితరోవిప్రా యోగహీనా మహానదీమ్‌

దదృశుః శీతసలీలాం న విదుప్తాం సులోచనామ్‌

తతస్తు గిరిరాడ్దృష్ట్యా పితౄంస్తాంస్తు క్షుధార్ధితాన్‌

బదిరీమాదిదేశాథ ధేనుం చై కాం మధుస్రనామ్‌

క్షీరం మధు చ తద్దివ్యం కోకాంభో బదరీ ఫలమ్‌

ఇదం గిరివరేణైషాం పోషణాయనిరూపితమ్‌

తయా వృత్త్యా తు వసతాం పితౄణాం మునిసత్తమాః

దసవర్ష సహస్రాణి యయురేక మహోయథా

ఏవంలోకే విపితరి తథైవ విగతస్వధే

దై త్యా బభూవుర్భలివో యాతుధానాశ్చ రాక్షసాః

తే తాన్రిత్పగణాన్దైత్యా యాతుధానాశ్చ వేగీతాః

విశ్వైర్దేవై ర్విరహితాన్సర్వతః సముపాద్రవన్‌

దై తేయాన్యాతుదానాంశ్చ దృష్ట్వై వాపతతో ద్విజాః

కోకాతటస్థాముత్తుంగాం శిలాం తే జగృహూరుషా

గృహీతాయాం శిలాయాంతు కోకావేగవతి పితౄన్‌

ఛాదయామాస తోయేన ప్లావయంతీ హిమాచలమ్‌

పిత్రూనంతర్హి తన్దృష్ట్వా దై తేయా రాక్షసాస్తథా

విభీతకం సమారుహ్య నిరాహారా స్తిరోహితాః

సలిలేన విషీదంతః పితరంః క్షుద్ర్భమాతురాః

విషీదమానమాత్మానం సమీక్ష్య సలీలాశయాః

జగ్ముర్జనార్దనం దేవం పితరంః శరణం హరిమ్‌

జయస్వ గోవిందజగన్నివాస జయోస్తునః కేశవ తే ప్రసాదాత్‌

జనార్ద నాస్మా న్సలిలలాంతరస్థా నుద్దర్తుమర్హ స్యనఘ ప్రతాప

నిశాచ రైర్దారుణ దర్శనైః ప్రభోవరేణ్య వై కుంఠవరాహవిష్టో

నారాయణాశేషమహేశ్వరేశ ప్రయాహి భీతాంజయ పద్మనాభ

ఉపేంద్ర యోగిన్మధుకై టభఘ్న విస్ణో అనంతాచ్యుత వాసుదేవ

శ్రీశార్ఙ్గచక్రాంబుజ శంఖపాణే రక్షస్వ దేవేశ్వర రాక్షసేభ్యః

త్వం పితా జగతః శంభోనాన్యః శక్తః ప్రబాధితుమ్‌

నిశాచరగణం భీమ మతస్త్వాం శరణంగతాః

త్యన్నామపంకీర్తనతో విశాచరా ద్రవంతి భూత్యాన్యపయాంతి చారయః

నాశం తథా సంప్రతి యాంతి విష్ణో ధర్మాధి సత్యం భవతీహి ముఖ్యమ్‌

ఇత్థం స్తుతః స పితృభిర్ధరణీధరస్తు తుష్టస్తదావిష్కృత దివ్యమూర్తిః

కోకాముఖే పితృగణం సలిలే నిమగ్నం దేవో దదర్శ శిరసాథ శిలాం వహంతమ్‌

తం దృష్ట్వాసలిలే మగ్నం క్రోడరూపీ జనార్దనః

భీతం పితృగణం విష్ణు రుద్ధర్తం మతిరాదధే

దంష్ట్రాగ్రేణ సమాహత్య శిలాం చిక్షేప శూకరః

పితౄనాదాయ చ విభూ రుజ్జహార శిలాతలాత్‌

వరాహదంష్ట్రా సంలగ్నాః పితరః కనకోజ్జ్వలాః

కోకాముఖే గతభయాః కృతా దేవేన విష్ణునా

ఉద్ధృత్య చ పితౄ న్దేవో పిష్ణుతీర్దేతు శూకరః

దదౌ సమాహిత స్తభ్యో విష్ణు ర్లోహర్గళే జలమ్‌

తతః స్వరోమసంభాతా స్కుశానాదాయ కేశవః

స్వేదోద్భవాం స్తిలాంశ్చైవ చక్రే చోల్ముకముత్తమమ్‌

జ్యోతిః సూర్యప్రభం కృత్యా పాత్రం తీర్థం చ కామికమ్‌

స్థితంః కోటివటస్యాధో వారిగంగాధరంశుచి

తుంగకూటాత్పమాదాయ యజ్ఞీయానోషధీరసాన్‌

మధుక్షీరరసాన్గంధా న్పుష్పధూపానులేపనాత్‌

ఆదాయ దేనుం పరసో రత్నాన్యాదాయ చార్ణవాత్‌

దంష్ట్య్రోల్లిఖ్య ధరణి మభుక్ష్య సలిలేన చ

ఘర్మోద్భవేనోపలిప్య కుశైరుల్లిఖ్య తాం పునః

పరిణీయోల్ముకేనైనా మభ్యుక్ష్య చ పునః పునః

కుశానాదాయ ప్రాగగ్రాం ల్లోమాకూపాంతర స్థితాన్‌

ఋషీనాహూయ పప్రచ్ఛ కరిష్యే పితృతర్పణమ్‌

తైరప్యుక్తే కురుప్వేతి విశ్వాందేవాంస్తత్‌ విభుః

ఆహూయ మంత్రతస్తేషాం విష్టరాణి దదౌ ప్రభుః

అహూయమంత్రతస్తేషాం వేదోక్తవిధినా హరిః

అక్షతర్దైవతారక్షాం చక్రే చక్రగదాధరః

అక్షతాస్తు యవై పథ్యం సర్వ దేవాంశసంభవాః

రక్షంతి సర్వత్రదిశో రక్షార్థం నిర్మితాహితే

దేవదానదై త్యేషు యక్షరక్షస్సు చై పహి

నహి కశ్చిత్జయం తేషాం కర్తుం శక్తాశ్చరాచరే

న కేనచి త్జతా యస్మాత్తస్మాత్తే హ్యక్షతాః కృతాః

దేవానాం తేహి రక్షార్థం నియుక్తా విష్ణునా పురా

తుశగందయవైః పుష్పైరర్ఘ్యం కృత్యా చ శూకరః

విశ్వేభ్య దేవేభ్య ఇతి తతస్తాన్సర్యపృచ్ఛత

యోగమందిన పితరుల చల్లని నీటితో నున్న మహానదిం జూచిరి. కాని యది చంద్రుని కూతురగు ఊర్జ యేయని యెఱుంగ రైరి. అంతట పితరుల నాకలిచే గుములు చున్నట్లు ఒక రేగు వృక్షమును మధు క్షీరము నోసంగు నొక ఆవును నొసంగెను. దివ్యమైన క్షీరము కోకానది జలము రేగుపండు నను నీ యాహారము పితృ దేవతల పోషణము నను నిరూపించ బడినది. ఆ విధమైన వృత్తితో (ఆహారాదుల సేవనముతో) జీవించు చున్న పితరుల కదివేలేండ్లొక్క దినమట్లు గడచెను.

ఈ విధముగా లోకమెల్ల పితృ శూన్య స్వధాకారము వినిపింప నంతట దైత్యులు రాక్షసులు యాతుధానులు బలవంతులైరి. వారు విజృంభించి విశ్వే దేవతలతో విడివడిన పితృ గణములపై నలువైపుల నుండి వచ్చి పడిరి. అదిచూచి పితరులు రోషము గొని యొడ్డు నున్న యొక రాతినెత్తి పట్టు కొనిరి. ఆ రాయి తొలగగానే నది వేగ మెక్కువై నీటిచే పితరులను హిమాలయమును గూడ ముంచెత్తెను. పితరు లంతర్హితు లైనంత రాక్షసులు తాండ్ర చెట్టునెక్కి నిరాహారులై దాగి కొనిరి. పితృ దేవతలు నీటి వెల్లువకు వంత చెంది యాకట నకనకం బడి యానీటనే యుండి విష్ణుని శరణోందిరి.

గోవింద! నీవు జయింపుము. జగన్నివాస! ఓ కేశవ నీదయచే మాకును జయమగు గాక! అప్రతిమప్రతాపుడవు మమ్మీ నీట మునిగిన వారి నుద్దరింపుము. దారుణా కారులైన యా రాక్షసులకు జడిసి పోవుచున్న మమ్ము ఓవరాహ మూర్తీ! రక్షింపుము. నీ పుణ్య నామములు సంకీర్తనము సేసినంత రాక్షసులు భూత ప్రేత పిశాచాదులు నశింతురు. ధర్మాధి పురుషార్థములు సిద్ధించును. అని యిట్లు స్తుతింప విని తన దివ్య మూర్తిని జూపి కోకానది ముఖమందు నీట మునిగి తలపై రాతిం ధరించి యున్న పితృ గణముం జూచెను. అంతట వరాహ మూర్తియే హరి పితృ గణము నుద్దరింప సంకల్పించెను. తనకోఱచే గొట్టి యేత్తి యారాతిని విసరి వైచెను. పితరుల నీటినుండి యెత్తి మీది కాకర్షించెను. ఆ దివ్య వరాహము కోర యందున్న పితరులు బంగార మట్లు మెఱయుచు విష్టునిచే భయ ముక్తులైరి. అట్లువారి నెత్తి విష్టు తీర్థమను పేరందిన యాతావున హరి వారిన లోహార్గముల నందలి జలమును ద్రావ నిచ్చెను. అవ్వల తన రోమముల నుండి పుట్టిన దర్భలను చెమట నుండి పుట్టిన నువ్వులను జేకొని కొఱకం చొక దానిని సూర్య సమాన ప్రభనుగ గల్పించి ఒక పాత్రను తీర్థముగా రూపొందించి కోటి వటము క్రింద నిలువబడి గంగాధరమను తీర్థ మందలి ఉదకమును తుంగకూటము నుండి గైకొని యజ్ఞియములైన ఓషధులను మధు క్షీర రసములను గంధములను పువ్వులను గంధదూప దీపాదులను జేకొని సరస్సు నుండి ధేనువును సముద్రము నుండి రత్నములను గైకొని భూమిని కోరచే గీసి నీటం దడిపి భూమిని కుశలచే గీసి కొఱవిని దాని చుట్టుం ద్రిప్పి మఱల మఱల నీరు ప్రోక్షించి రోమ కూపము లందుండి ప్రాగ గ్రములైన (తూర్పువైపు కొసలుగా నున్న) కుశలను గ్రహించి ఋషుల నాహ్వానించి పితృ తర్పణము చేయుదు ననియె. వారును జేయమన ప్రభువు విశ్వేదేవులను బిల్చి సమంత్రకముగ వారికి విష్టరముల (అసనములను) నొసంగి యక్షతలచే దేవతారక్ష సేసెను. సర్వ దేవతల యంశలతో బుట్టిని అక్షతలు ఓషదులు నన్ని దిశల నంతట రక్షణ యిచ్చుటకు గల్పింప బడినవి. దేవ దానవ దైత్య యక్ష రక్షస్సులం జరాచర మందెక్కడును వానికి క్షయము నెవ్వరు గల్పింప జాలరు. గావున వానికి అక్షతములు అను పేరేర్పడి నది. మున్ను విష్ణువు దేవతా రక్షరణ కొరకే యక్షతల నేర్పరచెను. కుశలు గంధము యువలు పువ్వులచే అర్ఘ్య మొసంగి వరాహమూర్తి విశ్వేదేవుల నిట్లడిగెను.

పితౄనావాహయిష్యామి యే దివ్యా యేచ మానుషాః

అవాహయస్వేతి చ తై రు క్తస్త్వావాహ (య) చ్చుచిః

శ్లిష్టమూలాగ్రదర్భాంస్తు సలిలాన్వేద వేదవిత్‌

జానావారోప్య హస్తంతు దదౌ సవ్వేన చా సనమ్‌

తథైవ జానుసంస్థేన కరేణైకేన తా న్పితౄన్‌

వారాహః పితృవిప్రాణా మాయాంతు న ఇతీరయన్‌

అవహతేత్యువాచై ప రక్షణం చాపస్యవతః

కృత్వా చావాహనం చక్రే పితౄణాం నామగోత్రతంః

త్పితరో (పితరోత్ర) మనోజరానా వా ఆ గచ్ఛత ఇతీరయన్‌

సంవత్సరైరిత్యుదీర్య తతోర్ఘ్యం తేషు విన్యసేత్‌

యా స్తిష్ట్యంత్యమృతావాచో యన్మేతి చ పితుః పితుః

యన్మే పితామహేత్యేవం దదావర్ఘ్యం పితామహే

యన్మే ప్రపితామహేతి దదౌచ వ్రపితామహే

కుశ గంధతిలోన్మిశ్రం సుపుష్ప మనస్వ్యతః

తద్వన్మాతమహేభ్యస్తు విధిం చక్రేజనార్దనః

తానర్చ్య భూయో గందాద్వైర్దూపం దత్త్వాతుభక్తితః

ఆదిత్యా వసవో రుద్రా ఇత్యుచ్చార్య జగత్ర్పభుః

తతశ్చాన్నం సమాదాయ సర్పిస్తిలకుశాకులమ్‌

విధాయ పాత్రే తచ్చైవ పర్యపృచ్ఛత్తతో మునీన్‌

అగ్నౌ కరిష్య ఇ తితైః కురుష్వేతి చ చోదితః

అహుతి త్రితయం దత్వా సోమాగ్నీభ్యాంయమాయచ

యేమాయ కేతి చ జపే ద్యజుః సప్తకమచ్యుతమ్‌

హుతావశిష్టం చ దదౌ నామగోత్రసమన్వితమ్‌

త్రిరాహుతిక మైకైకం పితరం ప్రతి తద్విజాః

అతోవశిష్టమన్నద్యం పిండ పాత్రే సమాక్షివత్‌

దివ్యులు మనుషులును గూడ నైన పితరులను ఆహ్వానించు చున్నాననియె. వారు పిలువుమన వారిని శుచియై పిలిచెను. నువ్వులతో మొదళ్ళు చివరలు కూర్చిన దర్భలను మోకాలిపై హస్తమానించి సవ్యముగ అసన మోసంగెను. అదే విధముగ పితరులను పితృస్థాన మందున్న విప్రులకు ‘‘ఆయాంతు’’ అను మంత్రము సెప్పుచు నాహ్వనించెను. ‘‘అపహత’’ అను మంత్రముచే నపస్యవముగా అసురాదుల వలస రక్షణనిచ్చి పితరుల నామ గోత్రములతో ‘‘తత్పితరో మనోజరానావా ఆగచ్ఛత’’ అను మంత్రము కూడా జెప్పుచు నావాహనము సేసెను. ‘‘సంవత్సరైః’’ అను మంత్రముచే నర్ఘ్య మిచ్చెను. యాస్తిష్టంత్య మృతావా చోయన్మ అనియన్మే పితామహ అని తండ్రికి పితామహునికి ‘యన్మే ప్రపితామహ’ అని ప్రపితామహునికి కుశ గంధ పుష్ప తిల మిశ్రమైన యర్ఘ్యమును అపస్యముగ నిచ్చెను. అట్లే మాతా మహులకును విష్ణువు పొనరించెను. ఇట్లు గంధాదులచే నర్చించి ధూప దీపము లొసంగి ‘‘అదిత్యా వసవోరుద్రా’’ అను మంత్రముతో నెయ్యి నువ్వులు దర్భలతో నన్నమును పాత్ర యందుంచి యవ్వల మునులను జూచి ‘‘అగ్నౌకరిష్యే’’ అని పిలికి వారు కురుష్య (చేయుము) అని ప్రేరణ యీయ సోమునికి అగ్నికిని యముని కిని మూడాహుతు లిచ్చెను. ‘‘యోమామకేతి’’ అను యజుర్మంత్ర సప్తకము జపించి హోమశిష్టమును నామ గోత్రములతో నొక్కొక్కసారి మూడేసి యాహుతులుగా పితృ స్థానమం దొసంగెను. ఇందు మిగిలిన యన్నమును పిం డపాత్ర యందుంచెను.

తతోన్నం సరసం స్వాదు దదౌ పాయస పూర్వకమ్‌

ప్రత్యగ్రమేకదా స్విన్న మపర్యుషితముత్తముమ్‌

అల్పశాకం బహుఫలం షడ్రపం చామృతోపమమ్‌

యద్ర్భాహ్మణేషు ప్రదాదౌ పిండాపాత్రే పితౄం స్థథా

దేవపూర్వం పితృష్వన్న మాజ్యప్లుతం మధుక్షితమ్‌

మంత్రితం పృధివీత్యేవం మధువాతాతృచం జగౌ

భుంజానేషు తు విప్రేషు జపన్వై మంత్రపంచకమ్‌

య త్తే ప్రకారమారభ్య నాధికం తే తతో జగౌ

త్రిమధు త్రిసువర్ణం చ బృహదారణ్యకం తథా

జజాప వైషాం జాప్యం తు సు క్తం సౌరం సపౌరుషమ్‌

భుక్తవత్సు చ విప్రేషు పృష్ట్యా తృప్తాఃస్థ ఇత్యుతః

తృపాః స్మేతి సకృత్తోయం దదౌ మౌనవియోమనమ్‌

ఆ మీదట పరిశుద్దము (ప్రత్యగ్రము) ఒకేసారి యుడికి నది నిలువ యుండనిది కూరలు తక్కువ పండ్లెక్కువ యునై యాఱు రసములు గల్గి యమృతోపమాన మయిన యన్నమును బ్రాహ్మణుల కారగింపిడి పిండపాత్ర యందు గూడ వడ్డించి మంత్రముతో నేయి తేనెయుం గూర్చి పృథివి అనియు మధువాతా అను ఋగ్వేద మంత్రమును బఠించెను. బ్రాహ్మణులు భోజనము సేసిన తర్వాత నైదు మంత్రములు య త్తే యను ఋక్కుతో నారంభించి నాధికం అను సమాప్తి మంత్రము వరకు జపించెను. త్రిమధు త్రిసువర్ణ మంత్రములను బృహదారణ్యక మును మఱియు జపింప వలసిన సౌకర సూక్త పురుష సూక్తము లనుగూడ జపించెను. విప్రులు భోజనము సేసిన తర్వాత తృప్తాస్థ మీరు తృపులైనారా? అని అడిగి వారు తృప్తాస్మ తృప్తు లైనాము అని అన్న తర్వాత అంత వరకు మౌనముతో భోజనము సేసిన బ్రాహ్మణులు మౌన విమోచనము సేయుటను సూచించు నుత్తరాపోశన మొసంగెను.

పిండ పాత్రం సమాదాయ చ్ఛాయాయై ప్రదదై తతః

సా తదన్నం ద్విధా కృత్వా త్రిధైకై మథాకరోత్

వారాహో భూమథోల్లిఖ్య సమాచ్ఛాధ్య కుశైరపి

దక్షిణాగ్రాస్కుశాస్కృత్వా తేషా ముపరి చాసనమ్‌

సలిలేషు సమూలేషు కుశేష్వవతు సంశ్రయః

గంధపుష్పాధికం కృత్యా తతః పిండం తు భక్తితః

పృథివీదధీరిత్యు క్త్వా తతః పిండం ప్రదత్తవాన్‌

పితామహాః ప్రపితాదామహా స్తథేతి చాంతరిక్షతః

మాతామహానామప్యేవం దదౌ పిండాన్స శూకరః

పిండనిర్వాపణోచ్ఛిష్ట మన్నం లేపభుజేష్య దాతి

ఏతద్వః పితరిత్యు క్త్వా దదౌ వాసాంసి భక్తితః

ద్వ్యంగులజాని శుక్లాని ధౌత్యాన్యభినవాచ

గంధపుష్పాదికం దత్వా కృత్త్వా చైషాం ప్రదక్షిణామ్‌

ఆచమ్మాచమయే ద్విప్రాన్పైత్రానాదౌ తతః సురాన్‌

తత స్త్వభ్యుక్ష్య తాం భూమిం దత్త్వాపః సుమనోక్షతాన్‌

సతిలాంబు పితృష్వాదౌ దత్వా దేవేషు సాక్షతమ్‌

అక్షయ్యం సస్త్వితి పితౄ న్ర్పీయతామితి దేవతాః

ప్రీణయిత్వా పరావృత్య త్రిర్జపేచ్చాఘమర్షణమ్‌

తతో నివృత్య తు జపే ద్యన్మే నామ ఇతీరయన్‌

గృహాన్నః పితరో దత్త ధనధాన్య ప్రపూరితాన్‌

అర్ఘ్యపాత్రాణి పిండానా మంతరే స పవిత్రకాన్‌

నిక్షిప్యోర్జం వహంతీతి కోకాతోయ మథోజపత్‌

హిమక్షీరం మధుతిలా న్పితౄణాం తర్పణం దదౌ

స్వస్థీత్యు కై పై తృకైస్తు సోరాహ్నే ప్రావతర్పయన్‌

రజతం దక్షిణాం దత్త్వా విప్రాన్దేవో గదాధరః

సంవిభాగం మనుష్యేభ్యో దదౌ స్వదితి చాబ్రువన్‌

కశ్చి(చ్చి) త్సంపన్న మి(త్యు) క్త్యా ప్రత్యుక్తస్తైద్వ్విజోత్తమాః

అభిరమ్యతామిత్యువాచ ప్రోచుస్తేభిరతాః స్మ వై

శిష్టమన్నంచ పప్రచ్ఛ తై రిష్టైః సహ చోదితః

పాణావాదా యతాన్వి ప్రాన్కుర్యాదనుగత (స్తతం) తదా

వాజే వాజే ఇతి పఠం స్భహిర్వేది వినిర్గతః

కోటితీర్థజలేనాసా వపస్యవం సముత్క్షిపన్‌

అలగ్నాన్విపులాన్వాలా న్ర్పార్థయామాస చాశిషమ్‌

దాతారో నోభివర్ధంతా తై స్తథేతి సమీరితః

ప్రదక్షిణ ముపావృత్య కృత్యా పాదాభివాదనమ్‌

అసనాని దదౌ చై షాం చాదయామాస శూకరః

విశామ్యతాం ప్రవిశ్యాథ పిండం జగ్రాహ మధ్యమమ్‌

చాయామయీ మహీ పత్నీ తస్యై పిండ మదా త్ర్పభుః

ఆధత్త పితరోగర్భ మిత్యుక్త్వా సాపిరూపిణీ

పిండం గృహీత్వా విప్రాణాం చక్రే పాదాభివందనమ్‌

విసర్జనం పితౄణాం స కర్తుకామశ్చ శూకరః

కోకా చ పితరశ్చైవ ప్రోచుః స్వార్థకరం వచః

శప్తాశ్చ భగవన్పూర్వం దివస్థా హిమభానునా

యోగాభ్రష్టా భవిష్యధ్వం సర్వ ఏవ దిపశ్చ్యుతాః

తదేవ భవతా త్రాతః ప్రవిశంతో రసాతలమ్‌

యోగభ్రష్టాంశ్చ విశ్వేశా స్తత్యజుర్యోగ రక్షిణః

తత్తే భూయోభిరక్షింతు విశ్వే దేవా హి నః సదా

స్వర్గం యాస్యామశ్చవిభో ప్రసాదా త్తవ శూకర

సో(య)మోధి దేవోస్మాకం చ భవత్యచ్యుత యోగధృక్‌

యోగాధార స్తథా సోమ స్త్రోయతే న కదాచన

దివి భూమౌ సదా వాసో భవత్వస్మాసు యోగతః

అంతరిక్షే చ కేషాంచి న్మాసం పుష్టి స్థథాస్తునః

ఊర్జా చేయం హినః పత్నీ స్వధానామ్నాతు విశ్రుతా

భవత్వేషైవ యోగాఢ్యా యోగమాతా చ ఖేచరీ

ఇత్యేవముక్తః పితృభి ర్వారోహో భూతభావనః

ప్రోవాచాథ పితౄన్విష్ణు స్తాం చ శోకాం మహానదీమ్‌

యదుక్తంతు భవద్వీర్మే సర్వ మేత ద్భవిష్యతి

యమోధిధేవో భవతాం సోమః స్వాధ్యాయ ఈరితః

అధియజ్ఞ స్థథై వాగ్ని ర్భవతాం కల్పనా త్వియమ్‌

అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చస్థానం హి భవతామి

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ భవతా మధి పూరుషాః

ఆదిత్యా వసవో రుద్రా భవతాం మూర్తయి స్త్విమాః

యోగినో యోగదేహాశ్చ యోగధారాశ్చ సువ్రతాః

కామతో విచరిష్యధ్వం ఫలదాః సర్వజంతుషు

స్వర్గస్థాన్న రక్తస్థాంశ్చ భూమిస్థాంశ్చ చరాచరాన్‌

నిజయోగబలేవై వాప్యాయ యిష్యధ్వము త్తమాః

ఇయమూర్జశశిసుతా కీలాలమధువిగ్రహా

భవిష్యతి మహాభాగ దక్షస్య దుహితా స్వధా

తత్రేయం భవతాం పత్నీ భవిష్యతి వరాననా

కోకానదీతి విఖ్యాతి గిరిరాజ సమాశ్రితా

తీర్థకోటి మహాపుణ్యా మద్రూప పరిపాలితా

అస్యామద్య ప్రభృతి వై విపత్య్సఘనాశకృత్‌

వరాహరదర్శణం పుణ్యం పూజనం భుక్తి ముక్తిదమ్‌

కోకాసలిలపానం చ మహాపాతక నాశనమ్‌

తీర్థష్వాప్లవనం పుణ్య ముపవాసశ్చ స్వర్గదః

దానమక్షయ్య ముదితం జన్మమృత్యుజరాపహమ్‌

మాఘే మా స్వసితే పక్షే భవర్భిరుడుపక్షయే

కోకాముఖ ముపాగమ్య స్థాతవ్యం దినపంచకమ్‌

తస్మిన్కాలే తు యః శ్రాద్ధం పితౄణాం నిర్వపిష్యతి

ప్రాగుక్త ఫలభాగీ చ భవిష్యతి న సంశయః

ఏకాదశీ ద్వాదశీంచ చ స్థేయమత్ర మయా సదా

యస్త్రతోపవసేద్దీమా న్స ప్రాగుక్త ఫలం లభేత్‌

తద్ర్వజధ్వం మహాభాగాః స్థానమిష్టం యథేష్టతః

అహమప్యత్ర వత్స్యామీ త్యుక్త్వా సోంతరధీయత

గతే వరాహే పితరః కోకా మామంత్ర్య తే యయుః

కోకాపి తీర్థసహితా సంస్థితా గిరిరాజని

ఛాయా మహిమమయా క్రోఢీ పిండ ప్రాశన బృంహితా

గర్భమాదాయ సశ్రద్దా వారాహస్యైవ సుందరీ

తతోస్యాః ప్రాభవత్పత్రో భౌ మస్తు నరకాసురః

గోజ్యతిషంచ నగర మస్యద త్తంచ విష్ణునా

ఏవం మయోక్తం వరదవ్య విష్ణో కోకా ముఖే దివ్య వరాహరూపమ్‌

శ్రుత్వా నరప్త్యక్తమలో విపాప్మా దశాశ్వమేధేష్టి ఫలం లభేత

(--------------తాత్పర్యం ఇవ్వలేదు------------------------)