బ్రహ్మ మహా పురాణము
54 - మార్కండేయాఖ్యానమ్
బ్రహ్మ:
స ప్రవిశ్యోదరే తస్యబాలస్య మునిసత్తమః
దదర్మ పృథివీం కృత్స్నాం నానాజనపదైర్వృతామ్
లవణేక్షు సురాసర్పిర్దధిదుగ్ధజలోదధీన్
దదర్శ తాస్సముద్రాంశ్చ జంబు ప్లక్షం చ శాల్మలమ్
కుశం క్రౌంచం చ శాకం చ పుష్కరం చ దదర్శ సః
భారతాదీని వర్షాణి తథా సర్వాంశ్చ పర్వతాన్
మేరుం చ సర్వరత్నాఢ్యమపశ్యత్కనకాచలమ్
నానారత్నన్వితైః శృంగైర్భూషితం బహుకందరమ్
నానా మునిజనాకీర్ణం నానా వృక్షవనాకులమ్
నానాసత్త్వసమాయుక్తం నానాశ్చర్యసమన్వితమ్
వ్యాఘ్రైఃసింహై ర్వరాహైశ్చ చామరైర్మహిషైర్గజైః
మృగైః శాఖామృగైశ్చాన్యై ర్భూషితం సుమనోహరమ్
శక్రాద్యైర్వివిధైర్దేవైః సిద్ధచారణపన్నగైః
మునియక్షాప్సరోభిశ్చ వృతైశ్చాన్యైః సురాలయైః
బ్రహ్మ:
ఆ మార్కండేయుడు వట పత్రశాయి యయిన నాబాలుని గర్భమందు బ్రవేశించి సమస్త భూమండల మందు జూచెను. సప్త సముద్రములను, సప్త ద్వీపములను, సప్తకులాచలములను సర్వ రత్న నిధి యయిన మేరువును దర్శించెను. ఆ మేరు పర్వతము సర్వ రత్న నిధి నానా ముని సమాకీర్ణము. సర్వ వృక్షములకు స్థానము వింతల కెల్ల స్థానము. సింహ వ్యాఘ్రాదులకు నిలయము. ఇంద్రాది దేవతలు సిద్ధ చారణ గంధర్వాప్సరో వర్గములకు విహార స్థానము.
బ్రహ్మ:
ఏవం సుమేరుం శ్రీమంత మపశ్య న్మునిసత్తమః
పర్యటన్సతదావిప్రా స్తస్య బాలస్య చోదరే
హిమవంతం హేమకూటం నిషధం గంధమాదనమ్
శ్వేతం చ దుర్ధరం నీలం కైలాసంమందరంగిరిమ్
మహేంద్రం మలయం వింధ్యం పారియాత్రం తథా ర్బుదమ్
సహ్యం చ శుక్తిమంతం చ మైనాకం వక్రపర్వతమ్
ఏతాశ్చాన్యాశ్చ బహవో యావంతః పృథివీధరాః
తతస్తాంస్తు మునిశ్రేష్ఠాః సో పశ్యద్రత్నభూషితాన్
కురుక్షేత్రం చ పాంచాలాన్మత్స్యాన్మద్రాన్సకేకయాన్
బాహ్లీకాన్శూరనేనాంశ్చ కాశ్మీరాంస్తంగణాన్ఖసాన్
పార్వతీయాన్కిరాతాంశ్చ కర్ణ ప్రావరణాన్మరూన్
అంత్యజానంత్యజాతీంశ్చ సో పశ్యత్తస్య చోదరే
పృథివ్యాం యాని తీర్థాని గ్రామాశ్చ నగరాణి చ
కృషిగోరక్షవాణిజ్యం క్రయవిక్రయణం తథా
శక్రాదీన్విబుధాన్ఛ్రేష్ఠాం స్తథాన్యాంశ్చ దివౌకసః
గంథర్వాప్సరసో యక్షానృషీంశ్చైవ యే చాన్యే సురశత్రవః
దైత్యదానవసంఘాంశ్చ నాగాశ్చ మునిసత్తమాః
సింహికాతనయాంశ్చైవ యే చాన్యే సురశత్రవః
యత్కించి త్తేన లోకే స్మిన్దృష్టపూర్వం చరాచరమ్
ఆపశ్యత్స తదా సర్వం తస్య కుక్షౌ ద్విజోత్తమాః
ఆథవా కిం బహూ క్తేన కీర్తితేన పునః పునః
బ్రహ్మాదిస్తంబపర్యంతం యత్కించిత్సచరాచరమ్
భూర్లోకం చ భువర్లోకం స్వర్లోకం చ ద్విజోత్తమాః
మహర్జనస్తపః సత్యమతలం వితలం తథా
పాతాళం సుతలం చైవ వితలం చ రసాతలమ్
మహాతలం చ బ్రహ్మాండమపశ్యత్తస్య చోదరే
అవ్యాహతా గతిస్తస్య తదాభూద్ద్విజసత్తమాః
ప్రసాదాత్తస్య దేవస్య స్మృతిలోపశ్చ నాభవత్
భ్రమమాణస్తదాకుకౌ కృత్స్నం జగదిదం ద్విజాః
నాంతం జగామ దేవస్య తస్య విష్ణోః కదాచన
యదా సౌ నా గతశ్చాంతం తస్య దేవస్య భో ద్విజాః
తదా తం వరదం దేవం శరణం గతవాన్మునిః
తతో సౌ సహసా విప్రా వాయువేగేన నిశ్రుతః
మహాత్మనో ముఖాత్తస్య వివృతాత్పురుషస్యసః
బ్రహ్మ:
శ్రీమంతమగు నా మేరువును గాంచుచు నా బాలుని యుదర మందు జనిజని కురు క్షేత్రాది పుణ్య క్షేత్రములను బుణ్య నదులను, తీర్ధములను, కృషి గోరక్ష వాణీజ్యాది వృత్తులను జేయు మానవులను సర్వ జనావాస మయిన నగర గ్రామములను ఇది యది యననేల బ్రహ్మాది స్తంబ పర్యంత మయిన సర్వ బ్రహ్మాండమును, భూర్భుస్సర్ మహస్తప స్సత్యముల నూర్ధ్వ లోకములను అతల, వితల, పాతాళ, సుతల, రసాతన, మహాతల, తలాతల అధో లోకములను ఆ స్వామి యుదర మందీక్షించెను. ఆ దేవు ననుగ్రహమున నందాతని గతికడ్డుల కుండెను. అందట్లు తిరు గాడుచు నతడా విష్ణువు యొక్క శరీరమునకు తుద కానడయ్యెను. అంతట నవ్వరదుని నా ముని శరణు జొచ్చెను. అవ్వల నా మహా పురుషుడు ముఖము తెఱువ నందుండి తటాలున వాయు వేగమున వెలికి వచ్చెను.
Summary of chapter 54 of the Brahma Mahā Purana is as follows:
Mārkaṇḍeya visits the shrine of Śrī Kṛṣṇa located within the Puruṣottama kṣetra. The beauty of this shrine and the divine form of Kṛṣṇa enshrined there are described. The sage offers worship and prayer, and the extraordinary merit of visiting — sins accumulated over many births are destroyed, and the devotee is assured of reaching Viṣṇu's supreme abode.