మునులు:
అధర్మస్య గతిర్బ్రహ్మ న్కథితా నస్త్వయానఘ
ధర్మస్య చ గతిం శ్రోతు మిచ్ఛామో వదతాం వర
కృత్వాపాపాని కార్మాణి కథం యార్తత్యశుభాం గతమ్
కర్మణాచ కృతేనేహ కేవయాంతి శుభాం గతిమ్
మునులు:
నీవు అధర్మము వలన గలుగు గతులను గూర్చి తెల్పితివి. ధర్మ గతులం గూర్చి విన గోరెదము. ఏ పనిచేసి యశుభ గతిని పొందు దేనిచే శుభగతి నందునో యానతిమ్మన వ్యాసుడిట్లనియె.
వ్యాసులు:
కృత్వాపాపాని కర్మాణి త్వధర్మవశమాగతః
మనసా విపరీతేన నిరయం ప్రతిపద్యతే
మోహాదధర్మంయః కృత్వా పునః సమనుతప్యతే
మనఃసమాధిసంయుక్తో నస నేవేత దుష్కృతమ్
యథా యథా మనస్తన్య దుష్కృతం కర్మగర్హతే
తథా తథా శరీరంతు తేనాధర్మేణ ముఛ్యతే
యది విప్రాః కథ్యతే విప్రాణాం ధర్మవాదినామ్
తతోధర్మకృతాతిక్షప్ర మపరాధా త్ప్రముచ్యతే
యథా యథా నరఃసమ్య గధర్మమనుభాషతే
సమాహితేన మనసా విముంచతి తథాతథా
భుజంగ ఇవనిర్మోకా న్పూర్వభుక్తా న్జహాతితాన్
దత్త్వా విప్రస్య దానాని వివిధాని సమాహితః
మనఃసమాధిసంయుక్తః సుగతిం ప్రతిపద్యలే
దానాని తు ప్రవక్ష్యామి యాని దత్త్వా ద్విజోత్తమాః
నరః కృత్వాప్యకర్మాణి నహి పాపేన యుజ్యతే
సర్వేషామేవ దానావా మన్నం శ్రేష్ఠముదాహృతమ్
సర్వమన్నం ప్రదాతవ్వ మృజునా ధర్మమిచ్ఛతా
ప్రాణా హ్యాన్నం మనుష్యోణాం తస్మాజ్జంతుః ప్రజాయతే
వ్యాసులు:
పాపపు పనుల ధర్మపరుడై విపరీత మనస్సుతో జేసిన వాడు నరక మందును పొరబడి యధర్మము సేసి పశ్చాత్తాప బడి మనస్సును కుదుట బెట్టు కొన్నవాడు పాపము ననుభవింపడు. ఎంతెంత వరకు వాని మనస్సు దుష్కర్మమును గర్హించునో అంతంత వరకు వాని యుపాధి (శరీరము) యా ధర్మము నుండి నిడివడును. చేసిన తప్పును ధర్మ వాదులగు విప్రులకు దెల్పి నయెడల అధర్మము వలన జేసిన యపరాధము నుండి వేగముగ ముక్తు డగును. మానవుడు తాను జేసిన తప్పిదమును మనసు సమాధాన పరచుకొని నలుగురలో వెల్లడించు కొన్నకొలది యతుడు దాని నుండి విడివడును. పాము కుబునమును విడిచి నట్లు పూర్వ మనుభవించిన పాప ఫలముల నుండి విమోచన మందును. మన స్సమాధితో విప్రునికి వివిధ దానములు సేసిన యతడు సుగతి నందును. మానవుడు పాప మాచరించియు తత్పల మనుభవింప కుండుటకు జేయ వలసిన దానములను దెల్పెద వినుండు.
అన్నే ప్రతిష్టితా లోకా స్తస్మాదన్నం ప్రశస్యతే
అన్న మేవ ప్రశంసంతి దేవర్షిపితృమానవాః
అన్నత్య హిప్రదాదేవ స్వర్గ మాప్నోతి మానవమానవః
యాల్లవభ్యం ద్రాతవ్యం ద్విజాతిభోన్న ముత్తమమ్
స్వాధ్యాయనము పేతేభ్యః ప్రహృష్టే నాంతరాత్మనా
యస్య త్వన్నముపాశ్వతి బ్రాహ్మణాశ్చ సకృద్దశ
సాృష్టేన మనసా దత్తం నసి తిర్యగ్గతిర్భవేత్
భ్రాహ్మణానాం పహస్రాణి దశాభోజ్య ద్విజోత్తమాః
సరోధర్మాత్ర్పముచ్యేత పాపే ష్వభిరతః సదా
భై క్షేణాన్నం సమాహృత్యం విప్రో వేద పురస్కృతః
హ్వధ్యాయనిరతే విప్రేదత్త్వేహ సుఖమేధతే
అహింసన్భ్రాహ్మణస్వాని న్యాయేన పరిపాల్య చ
క్షత్రియ స్తరసా ప్రాప్త మన్నంయో వై ప్రయచ్ఛతి
ద్విజోభ్యో వేదముఖేభ్యః ప్రయతః సుసమాహితః
తేనాపోహతి ధర్మాత్మా దుష్కృతం కర్మ భోద్వితాః
షడ్భాగపరిశుద్ధంచ కృషేర్భాగముపార్టితమ్
వైశ్యో దదద్ధ్విజాతిభ్యః పాపేభ్యః పరిముచ్చతే
అవాస్య ప్రాణసందేహం కార్కశ్యేన సమార్జితమ్
అన్నం దత్వా ద్విజాతిభ్యః శూద్రః పాపాత్ర్పముచ్యతే
ఔర సేన బలేనాన్న ముర్జయిత్వా విహింసకః
యః ప్రయచ్ఛతి విప్రోభ్యో న స దుర్గాణి సేవతే
న్యాయేనావా ప్తమున్నంతు సరో హర్షసమన్వితః
ద్విజేభ్యో వేదవృధ్దేభ్యో దత్త్వాపాపాత్ర్పముచ్యతే
అన్న మూర్జస్కరం లోకే దల్త్వోర్జస్వీ భవేన్నరః
సతాం పంథాన మావృత్య సర్వపాపైః ప్రముచ్యతే
దానవిద్భిః కృతః పంథా యేన యాంతి మనీషిణః
తేష్వప్నన్నస్య దాతార స్తేభ్యో ధర్మః సనాతనః
సర్వావస్థం మనుష్యేణ న్యాయేనాన్న ముపార్జితమ్
కార్వాన్న్యాయగతం నిత్య మన్నంహి పరమ్యాతిః
అన్నస్య హి ప్రదానేన నరోయాతి పరాం గతిమ్
సర్వకామసమాయుక్తః ప్రేత్య చాప్యశ్వుతే సుఖమ్
ఏవం పుణ్య సమాయు క్తో నరః పాపైః ప్రముచ్యతే
తస్మాదనం ప్రదాతవ్య మన్వాయ పరివర్జితమ్
యస్తు ప్రాణాహుతీపూర్వ మన్నం భుం క్తే గృహీసదా
అబంధ్యం దివసం కుర్వా దన్నదానేవ మానవః
భోజయిత్వా శతం నిత్యం నరో వేదవిదాం వరమ్
న్యాయవిద్ధర్మవిదుషా మితిహాసవిదాం తథాః
నాయాతి నరకం ఘోరం సంసారం నచ సేవతే
సర్వకామసమాయ క్తః ప్రేత్య చాప్యశ్ను తే సుఖమ్
ఏవం కర్మ సమాయు క్తో రమతే విగతజ్వరః
రూపవాన్కీర్తిమాం శై వ ధనవాంశ్చో పాయతే
ఎతధ్వః ఎతద్వః సర్వమాఖ్యాత మన్నదానఫలం మహత్
మూల మేతత్తు ధర్మాణాం ప్రధానానాం చ భోద్విజాః
అన్ని దానముల కంటే నన్నదానము మిన్న. ధర్మపేక్ష కలవాడు వక్రము గాని బుద్దితో సర్వాన్న దానము సేయ నగును. మనుజులకు ప్రాణ మన్నము గదా! అన్నము వలననే జీవుడు పుట్టును. లోకము అన్నము నందు బ్రతిష్టితము లయి యున్నవి. (బ్రతుకంతయు నన్నము మీద నాధార పడి యున్న దన్నమాట!) అందు వలన నన్నము ప్రశంసార్హ మగును. దేవర్షి పితృ మానవు లన్నమునే మెచ్చు కొందురు. అన్న దానముచే స్వర్గ మందును. ఎంత లభించు నంత యున్నము ద్విజులకు బెట్ట వలెను. నిండు మనసుతో వేదాధ్యయన సంపన్ను లగు బ్రాహ్మణు లకన్న దానము నీయ వలెను. ఒక్క మారైన బదిమంది బ్రాహ్మణు లెవ్వడు వెట్టిన యన్న మారగింతురో మనస్పూర్తిగా నట్లేట్టిన వాడు పశు పక్ష్యాది జన్మము లెత్తడు. పదివేల మంది బ్రాహ్మణులకు అన్న సంతర్పము గావించి నాతడు మున్ను పాపరహితుడై చేసిన యధర్మము నుండి విముక్తి నందును. వేదములు సదివి భిక్షాటనము సేసికొని తెచ్చిన యన్నమును వేదవేత్త యగు విప్రునికి బెట్టిన వాడిహ లోకమున సుఖాభి వృద్ధి నందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హాని సేయక న్యాయ బరిపాలన సేయుచు సుసమాహితమున సుఖాభివృద్ధి నందును. క్షత్రియుడు బ్రాహ్మణ ద్రవ్యమునకు హాని సేయక న్యాయ బరిపాలన సేయుచు సుసమాహిత మనస్కుడై వేద విదులయిన ద్విజులకు బలాత్కారముగ లభించిన యన్నమును దానము నేసిన యెడల నీతడు ధర్మాత్ముడై రాజనముచే జేసిన దుష్కర్మ నెడబాపు కొనును. కృషి (వ్యవసాయము) సేసి వైశ్యు డార్జించు కొన్న ద్రవ్యమారవ వంతుగ బది శుద్దమైన దానిని ద్విజులకు దానము సేసి పాప విముక్తు డగును. శూద్రులు ద్విజాతులకు అన్నదానము సేసి పాప విముక్తు డగును. ప్రాణము లిక పోవునన్న సమయమున శూద్రుడు కర్కశుడై (కఠినుడై) సంపాదించిన అన్నమును కన్న కొడుకుచే గూడ బెట్టించి యన్నము విప్రులకు బెట్టిన వాడు దుర్గమును (కడువరాని కష్టముల) దాటును. న్యాయార్జిత మైన యన్నమును ఆనందముతో వేద వృద్దు లయిన విప్రులకు విందు సేసిన వాడు పాపముం బాయును. అన్నము లోకమందు ఊర్జస్కరము. కావున దానిని బెట్టిన వాడు ఊర్జస్వి యగును. సత్పురుషు లేగిన దారి నేగిన వాడు సర్వ పాప విముక్తు డగును. దాన ధర్మ మెఱింగిన వారేర్పరచిన దారిం బుద్ధిమంతు లేగుదురు. అందులో గూడ అన్నదాత లుత్తములు. వారి వలననే సనాతన ధర్మము నిలుచును. అందు వలన నన్నదానము న్యాయము దప్ప కుండ జేయ వలసినది. ఏ గృహస్థు ముందు ప్రాణాహుతులు సేసి యన్న మారగించునో ఎవ్వడన్న దానముచే రోజును (అవంభ్యమును = గొడ్డు వూనిదానిగ) సార్థకమైన దానిం గావించునో నిత్యము వేద విదులను ధర్మ వేత్తలను ఇతిహాస పురాణ విదులను నూరు మందిని విందారగింప జేయునో యతడు ఘోర నరకము పాలు గాడు. సంసారము నంబడడు. చని పోయిన నతడు సర్వ కామ్య సాఫల్య మంది సుఖ మందును. ఇట్లు సత్కర్మ నమన్వితుడై యే బాధలు లేకుండా నానంద పడును. చక్కని వాడు కీర్తిశాలి ధనవంతుడునై మరుజన్మ మందును. మీకిట్లన్న దాన మహాఫల మంతయు దెలిపితిని. సర్వ ధర్మములకు దానములకును మూల మిదియే.
Summary of chapter 111 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The complete ritual procedure for performing Śrāddha is described step by step: the selection of auspicious times (new moon, pitṛ-tithis), the qualification and invitation of brāhmaṇas, the preparation of food, the specific mantras and ritual actions (tarpana, piṇḍa-dāna), and the prescribed behavior during the rite. The chapter functions as a detailed ritual manual for this foundational ancestral ceremony.