బ్రహ్మ మహా పురాణము
21 - పాతాళ ప్రమాణకథనమ్
లోమహర్షణుడు:
విస్తార ఏష కధితః పృధివ్యా మునిస త్తమాః
సప్తతిస్తు సహస్రాణి తదుచ్ర్ఛయోపి కథ్యతే
దశపాహస్రమేకైకం పాతాళం మునిసత్తమాః
అతలం వితలం చైవ నితలం సుతలం తథా
తలాతలం రసాతలం పాతాళం చాపి సప్తమమ్
కృష్ణా శుక్లారుణా పీతా శర్కరా శైలకాంచనీ
భూమయో యత్ర విపేంద్రా వరప్రాసాదశోభితాః
తేఘ దానవదైతేయజాతయః శతశః స్థితాః
నాగానాంచ మహాంగానాం జ్ఞాతయశ్చ ద్విజోత్తమాః
లోమహర్షుణుడు:
ముని శ్రేష్ఠులరా! భూమి యొక్క వైశాల్యము డెబ్బది వేల యౌజనములు, దాని యెత్తునంతే. ఒక్కొక్క పాతాళము వైశాల్యము పదివేల యోజనములు. అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము, యనునవి సప్త పాతాళములు. అచట కృష్ణా శుక్లా అరుణా పీతా శర్కరా శైలకాంచనీ అను భూములు ఉత్తమ సౌధములతో నొప్పు చుండును. ఆ ప్రదేశము లందు దైత్య దానవ జాతులు వందల కొలది గలరు. బ్రాహ్మణో త్తములారా! అచట పెద్ద సర్ప జాతులు కూడ గలవు.
స్వర్లోకా దపి రమ్యాణి పాతాళా నీతి నారదః
ప్రాహ స్వర్గ సదోమధ్యే పాతాళేభ్యో గతో దివమ్
ఆహ్లాదకారిణః శుభ్రా మణయో యత్ర సుప్రభాః
నాగాభరణభూషాశ్చ పాతాశం కేన తత్సమమ్
దైత్యదానవకన్యాభి రితశ్చేతశ్చ శోభతే
పాతాళే కస్య న ప్రీతి ర్విము క్తస్యాపి జాయతే
దివార్కరశ్మయో యత్ర ప్రభా స్తన్వంతి నాతపమ్
శశినశ్చ న శీతాయ నిశి ద్యోతాయ కేవలమ్
భక్ష్యభోజ్యమహాపాన మదమత్తైశ్చ భోగిభిః
యత్ర నజ్ఞాయతే కాలో గతోపి దనుజాదిభిః
వనాని నద్యో రమ్యాణి సరాంసి కమలాకరాః
పుంస్రోకిలాదిలాపాశ్చ మనోజ్ఞా న్యంబరాణిచ
భూషణా న్యతిరమ్యాణి గంధాడ్యం చానులేపనమ్
వీణావేణుమృదంగానాం నిస్వనాశ్చ సదా ద్విజాః
ఏతా న్యన్యాని రమ్యాణి భాగ్యబోగ్యాని దానవైః
దైత్యోర గైశ్చ భుజ్యంతే పాతాళాంతరగోచరైః
స్వర్గము కంటెను పాతాళములు రమ్యములని పాతాళముల నుండి స్వర్గమున కేగి సభా మధ్యమున నారద మహర్షి చెప్పిరి. వీరి యందాహ్లాద జనము లైన పరిశుభ్ర కాంతి భరితములైన రత్నము లున్నవి. నాగాభరణ భూషణములు పెక్కు లున్నవి. ఇట్టి పాతాళము దేనితో సాటి యగును. దైత్య దానవ కన్యా రత్నము లిందందు క్రీడింతురు. ఇట్టి పాతాళము ముక్తుడైన వానికి గూడ ప్రీతి జనకమై యుండును. పగటి సూర్యుని కిరణము లిచ్చట కాంతి నొసంగును గాని యెండ వేడిమిని కలిగింపవు. రాత్రి చంద్ర కాంతులును చలిని గాక చక్కని వెలుగును మాత్రమే యిచ్చును. భక్ష్య భోజ్య లేహ్య పానీయ రూపమైన యాహారములచే మదించిన భోగులగు దానవాదులు కాల గమనము నిచట గమనింప సేగమనింపరు. వనములు నదులు సరోవరములు పుంస్కోకిలల కలకలా రావములతో మనోహరములై యుండును. ఇచటి ప్రజలు ధరించు భూషణములు మిగుల రమ్యములు. అంగరాగములు గంధాదులు పరిమళ భరితములు. నిరంతరము వీణా వేణు మృదంగ నాదము శ్రవణ మనోహరముగ వినిపించును. ఇచటి భాగ్యభోగ్యములు పరమ మనోహరములు. పాతాళ వాసులగు దానవులు ద్తెత్యులు నాగులును ఆ భోగము లనుభవించు చుందురు.
పాతాళానా మధశ్చాస్తే విష్ణో ర్యా తామసీ తనుః
శేషాఖ్యా యద్గుణా న్వక్తుం న శక్తా దైత్యదానవాః
యోనంతః పఠ్యతే సిద్ధై ర్దేవదేవర్షిపూజితః
సహస్రశిరసావ్యక్తః స్వస్తికామలభూషణః
ఫణామణిసహస్రేణ యః స విద్యోతయ న్దిశః
సర్వా న్కరోతి నిర్వీర్యా న్హితాయ జగతోసురాన్
మదాఘార్ణితునేత్రోసౌ యః సదైవైకకుండలః
కిరీటీ స్రగ్ధరో భాతి సాగ్నిః శ్వేత ఇవాచలః
నీలవాసా మదోత్సిక్తః శ్వేతహారోపశోభితః
సాభ్రగంగా ప్రపాతోసౌ కైలాసాద్రి రివోత్తమః
లాంగలాసక్తహస్తాగ్రో బిభ్రమ్మసల ముముత్తమమ్
ఉపాస్యతే స్వయం కాంత్యా యో వారుణ్యా చ మూర్తయా
పాతాళమున కడుగున విష్ణువు యొక్క తమోమయ శరీరము శేషుడను పేర అనంత కళ్యాణ గుణ నిలయమై తేజరిల్లు చుండును. దేవ, దేవర్షి, సిద్దులచే నత డనంతుడని కీర్తింప బడును. స్యస్తిక ముద్రాంకితములైన వేయి శిరశ్సులచే సహస్రణామణి కాంతి పుంజములచే దెసలను రంజింప జేయు చుండును. లోక హితమునకై ఆయన యచటి యనురులను తన తేజముచే నిర్వీర్యుల నొనరించు చుండును. ఎల్లప్పుడు నొకే కుండలము నాభరణముగ ధరించి, కిరీట ధారియ్తె, పుష్ప మాలా లంకృతుడై మదఘార్ణిత నేత్రుడై అగ్ని సహిత శ్వేతా చలమట్లు ప్రకాశించు చుండును. నీల వసనుడు మదోత్సీక్తుడు శ్వేత వరోప శోభితుడు ఆకాశ గంగాప్రపాత సంయుత కైలాస వర్వత మన్నట్లు ఈ శేషుడు ఒకచేత నాగలియు మరొక చేతి రోకలియు ధరించి వారుణి యను నాగాంగ నతో గూడి యుపాసింప బడును.
కల్పాంతే యస్య వక్త్రేభ్యో విషానలశిఖోజ్జ్వలః
సంకర్షణాత్మకో రుదో నిష్ర్కమ్యాత్తి జగత్రమమ్
స బిభ్ర చ్ఛిఖరీభూత మశేషం క్షితిమండలమ్
అస్థే పాతాళమూలస్థః శేషోశేషసురార్చితః
తస్యవీర్యంప్రభావశ్చ వైభవం రూపమేవ చ
నహి వర్ణయితుం శక్యం జ్ఞాతుం వా త్రిదశైరపి
యస్యైషా సకలా పృధ్వీ ఫణామణిశిఖారుణా
ఆస్తే కుసుమమాలేవ కస్తద్వీర్యం వదిష్యతి
కల్పాంత మందు సహస్ర ముఖముల నుండి విషానల జ్వాలలు గ్రమ్ముకొన సంకర్షణ స్వరూపుడైన రుద్రుడు జగ త్రయమును మ్రింగి వేయును. గిరి మండలమట్లు అశేష క్షితి మండలమును ఫణాగ్రమున ధరించి ఆశేషు యాశేష సురస మర్చితుడై పాతాళ మూల మంధ ధిష్టించి యున్నాడు. దేవతలు కూడ యతని వీర్య ప్రభావ రూప వైభవము వర్ణింప జాలరు. తెలసికొన జాలరు ఆయన ఫణామణి శిఖాలచే అరుణ మయి కుసుమ మాలిక వలె నిలాతల మఖిలము నిలిచి యున్నది. అట్టి మహానుభావుని శక్తి నెవ్యడు వర్ణింప గలడు.
యదా విజృంభతేనంతో మదాఘార్ణితలోచనః
తదా చలతి భూ రేషా సాద్రితోయధి కాననా
గంధర్వావ్సరసః సిద్ధాః కింనరోరగవారణాః
నాంతం గుణానాం గుచ్ఛంతి తతోనంతోయ మవ్యయః
యస్య నాగవధూహస్తై ర్లాపితం హరిచందనమ్
ముహుః శ్వాసానిలాయస్తం యాతి దిక్పటవాసతామ్
య మారాధ్య పురాణర్షి ర్గ ర్గో జోతీంషి తత్త్వతః
జ్ఞాతవా న్సకలం చైవ నిమిత్త పఠితం ఫలమ్
తేనేయం నాగవర్యేణ శిరసా విధృతా మహీ
బిభర్తి సకలాల్లొకా న్స దేవాసురసుసుషాన్
మదముచే తిరుగ డువడు కన్నులతో నయ్యనంతు నెప్పుడు విజృంభించునో అపుడు భూ మండలమున పర్వత సముద్రముగ కంపించును. గంధర్వాప్సర స్సిద్ధ కిన్నరోరగ వారణులు కూడ ఆశేషాహి గుణముల యంతు తెలియ లేదు. కావుననే యాయన అనంతుడను పేరొందెను. నాగ కన్యా తిలకములు తమ మృదుల కర కమలములచే నతనికి పూయు హరి చందనము శ్వాసా నిలములచే విసరబడి దెసలకు సువాసన భరిత వట వాసమై (పరిమళ చూర్ణమై) వాసించును. ఆ ఫణిరాజు నారాధించి పురాణ మహర్షి గర్గాచార్యుడు జ్యోతి శ్చక్రము యొక్క రహస్యములు నెణుంగనెను. సకల శకున ఫలితములను దెలుప గల్గెను. ఆ నాగేంద్రునిచే శిరసా వహింప బడిన యీ వసుంధర దేవాసుర మానుష విశేష సహీతము లయిన సర్వ లోకములను ధరింప గల్గుచున్నది.
Summary of chapter 21 of the Brahma Mahā Purana is as follows:
The seven upper cosmic planes — Bhūloka, Bhuvarloka, Svarloka, Maharloka, Janaloka, Tapoloka, and Satyaloka — are described. The nature of each loka, its inhabitants, and the duration of residence there are presented. Brahmaloka at the apex is described as the abode of liberated beings, establishing the vertical cosmological architecture of the purāṇic universe.