బ్రహ్మ మహా పురాణము
16 - స్యమంతక ప్రత్యానయనమ్
లోమహర్షణుడు:
భజమానస్య పుత్రోథ రథముఖ్యో విధూరథః
రాజాధిరాజ శ్శూరస్తు విధూరథ సుతోభవత్
రాజాధిరాజస్య సుతా జజ్ఞిరేవీర్యవత్తరాః
దద్తాతాదత్తౌ బలినౌ శోనాశ్యః శ్వేతవాహనః
శమీ చ ధండశర్మా చ దంతశత్రుశ్చ శత్రుజిత్
శ్రవణా చ శ్రవిష్ఠా చ స్వసారౌ సంభభూవతుః
శమిపుత్రః ప్రతిక్షత్రః ప్రతిక్షత్రస్య చాత్మజః
స్వయంభోజః స్వయంభోజాద్భదికః సంబభూవహ
తస్యపుత్రా బభూపుర్హి సర్వే భీమపరాక్రమాః
కృతవర్మాగ్రజ్జస్తేషాం శతధన్వా తు మధ్యమః
దేవాంతశ్చ నరాంతశ్చ భిషగ్వైతరణశ్చ యః
సుదాంత శ్చాతిదాంతశ్చ నికాశ్యః కామదంభకః
దేవాంతస్యాభవత్పుత్రో విద్వా స్కంబలబర్హిషః
అసమౌజాః సుతస్తస్య నాసమౌజాశ్ఛ తావుభౌ
అజాతపుత్రాయ సుతాం ప్రదదా వసమౌజసే
సుదంష్ట్రశ్చ సుచారుశ్చ కృష్ణ ఇత్యంధకాః స్మృతాః
గాంథారీ చైవ మాద్రీ చ క్రోష్టుభార్యే బభూవతుః
గాంధారీ జనయామాస ఆనమిత్రం మహాబలమ్
మాద్రీ యుధాజితం పుత్రం తతో వై దేవమీఢ్జుషం
అనమిత్ర మమిత్రాణాం జేతార మపరాజితమ్
అనమిత్రసుతో నిఘ్నె నిఘ్నతో ద్వౌ బభూవతుః
ప్రసేవశ్చాథ సత్రాజి చ్ఛత్రుసేనాజితా వుభౌ
లోమహర్షణుడు:
భజమానుని సుతుడు రథముఖ్యుడు, విదూరథుడు, విదూరథుని కుమారుడు వీరుడగు రాజాధిదేవుడు. వానికి దత్త, అతిదత్త, శోణాశ్వ, శ్వేత వాహన, ళమి, దండశర్మ, దంతశత్రు, శత్రుజిత్తులు అను సుతులు. శ్రవణ, శ్రవిష్ఠ యును కుమార్తెలు కలగిరి, శమికుమారుడు ప్రతిక్షత్రుడు, వానికి స్వయంభోజుడు, వానికి భదికుడు కల్గిరి. వాని కుమారులు భీమ పరాక్రములు. వారిలో కృతవర్మ జ్యేష్ఠుడు. శతధన్వ మధ్యముడు, దేవాంతకుడు, నరాంతుడు, భిషక్కు, పైతరుణుడు, సుదాంతుడు, అతిదాంతుడు, నికాశ్యుడు, కామదంభకుడు, అనువారు కలిగిరి. దేవాంతకుని పుత్రడు విద్వంసుడగు కంబల బర్హిషుడు. వాని కొడుకులు అసమౌజుడు నాసమేజుడు అను వారు. పుత్ర సంతతి లేని అసమౌజసునికి సుందష్ట్రుడు సుచారువు కృష్ణుడు అను కుమారులను అంధకుడిచ్చెను. వారు అంధకులను పేరందిరి. గాంధారి మాద్రి కోష్ఠుని యొక్క భార్యలు. గాంధారి తనయుడు మహా బలశాలి యగు అనమిత్రుడు. మాద్రి తనయులు యుధాజిత్తు దేవమీఢుషుడు. ఇతడు శత్రువులకు గూడ మిత్రుడు. శత్రుజేత యగు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు. వాని కొడుకు లిద్దరు. ప్రసేనుడు సత్రాజిత్తు. వీరు శత్రుసేనల జయించిన వారు.
ప్రసేనో ద్వారవత్యాం తు నివసన్వో మహామణిమ్
దివ్యం స్యమంతకం నామ స సూర్యా దుపలబ్దవాన్
తస్య సత్రాజితః సూర్యః సఖా ప్రాణనమోభవత్
స కదాచి న్నిశాపాయే రధేన రథినాం వరః
తోయకూల మప స్ప్రష్జు ముపస్థాతుం యయౌ రవిమ్
తస్యోపతిష్ఠతః సూర్యం వివస్వా నగ్రతః స్థితః
విస్పష్టమూ ర్తిర్భగవాంస్తేజో మండలవా న్విభుః
అథ రాజా వివస్వంత మువాచ స్థిత మగ్రతః
యథైవ వ్యోమ్ని పశ్యామి సదా త్వాం జ్యోతిషాం పతే
తేజో మండలినం దేవం తథైవ పురతః స్థితమ్
కో విశేషోస్తి మే త్వత్తః సఖ్యేనోపగతన్య వై
సత్రాజిత్తు ప్రసేనుడు ద్వారపతిలో నుండెను. స్యమంత మను దివ్యమణిని సూర్యో పాసన చేసి వడసెను. అతనికి సూర్యుడు ప్రాణ సమానుడైన మిత్రడు. అతడొక నాడు వేకువ జామున రథమెక్కి యొక జలా శయమున కేగి స్నానము చేసి సూర్యో పస్థానము సేయు చుండగా సూర్య భగవాను డెదుట స్పష్టమైన మూర్తితో తేజో మండలా కారముతో సాక్షాత్కరించెను. రాజాయనను జూచి యిట్లనియె. గగనము నందు నిత్యము నిన్నెట్లు చూచు చున్నానో అట్లే తేజో మండలా కారమున నెదుట నిపుడు చూచు చున్నాను. జ్యోతిస్సుల కెల్ల నధిపతివి నీవు నీతోనిట్లు చెలిమి నొందిన నాకు నీ వలన గలుగు విశేషమేమి? అనిన,
ఏతచ్ఛ్రత్వాతు భగవాన్మణిరత్నం స్యమంతకమ్
స్వకంఠా దవముచ్యాథ ఏకాంతే న్యస్తవాన్విభుః
తతో విగ్రహవంతం తం దదర్శ నృపతి స్తదా
ప్రీతిమా నథ తం దృష్ట్యా ముహూర్తం కృతవా న్కథామ్
తమభిప్రస్థితం భూయో వివస్వంతం స సత్రజిత్
లోకాన్ భాసయసే సర్వా యేన త్వం సతతం ప్రభో
తదేత న్మణిరత్నం మే భగవన్ న్దాతుమర్షసి
తతః స్యమంతక మణిం దత్తవాన్ భాస్కర రస్తదాః
స త మాబధ్య నగరీం ప్రవివేశ మహీపతిః
తం జనాః పర్యధావంత సూర్యోయం గచ్ఛతీతిహ
స్వాం పురీం స విసిష్మాయ రాజా త్వంతఃపురం తథా
తం ప్రసేనజితే దప్యం మణిరత్నం స్యమంతకమ్
దదౌ భ్రాత్రే నరవతిః ప్రేవ్ణూ సత్రాజి దుత్తమమ్
స సుణిః స్యందతే రుక్మం వృష్ణ్యంధకనివేశసే
కాలవర్షీ చ పర్జన్యో నచ వ్యాధిభయం హ్యభూత్
లిప్సాం చక్రే ప్రసేనన్య మణిరత్నే స్యమంతకే
గోవిందో న చ తం లేభే శక్తోపి నజహార పః
కదాచి స్మ్రగయాం యాతః ప్రసేన స్తేన భూషితః
స్యసుంతకకృతే సింహాద్వధం ప్రాప వసేచరాత్
అథ సింహాం ప్రధావంత మృక్షరాజో మహాబలః
నిహత్య మణిరత్నం తదాదాయ ప్రావిశ ద్గుహామ్
తతో వృష్ణ్యంధకాః కృష్ణం ప్రసేనవధకారణాత్
ప్రార్ధనాం తాం మణే ర్బుద్ధ్వా సర్వ ఏవ శశంకిరే
స శంక్యమానో ధర్మాత్మా అకారీ తస్య కర్మణః
ఆహరిష్యే మణిమితి ప్రతిజ్ఞాయ వనం యయౌ
దీనిని విని యినుడు తన కంఠము నుండి తీసి స్యమంతక మణిని ఏకాంతమున నుంచెను. అంత నా భానుని సాకారముగ నా రాజప్పుడు దర్శించెను. మఱియు నతనితో ముహూర్త కాలము సంప్రీతితో ప్రసంగిచెను. అటుపై భాస్కరుడు బయలు దేరబోవు తఱి నా ఱేడు ప్రభూ! ఏ రత్నము దాల్చి నీవు లోకము లన్నిటిని బ్రకాశింప జేయు చున్నావో యా మణి రత్నమును నాకు దయ సేయు మని కోరెను. ద్యుమణి యమ్మణిని యారాణ్మణి కిచ్చెను. అది దాల్చి అమ్మహేశుడు రాజధానిం బ్రవేశించెను. ఆ పురజను లంతట నిడుగో సూర్యుడ వనికిం దిగి వచ్చు చున్నాడని యాతనిం గూర్చి పరువిడిరి. అట్లు పట్టణ మెల్ల నాశ్చర్యమున ముంచి యంతఃపురమున కరిగెను. ఆ రత్నము నక్కడ తన తమ్ముడు ప్రసేనజిత్తునకు బ్రీతితో నొసంగెను. అ మణి యావృష్ణ్యంధ కులయింట బంగారమును వర్షించు చుండెను. అది వచ్చిన తరువాత మేఘుడు సకాలమున వర్షించు చుండెను. అందెందును వ్యాధి భయము లేదయ్యె. గోవిందుడా ప్రసేనుని మణి రత్నమును దీసికొన నెంచెను. కాని యతడు శక్తుడయ్య దానిం గైకొన డయ్వెను. అది దాల్ఛి యొకప్పుడు ప్రసేనుడు వేటకుం బోయి యమ్మణింగని బెదరి మీద బడిన సింహము నోట బడి మృతి నందెను. అయ్యెద వానిం జంపి పారిపోవు మృగ రాజును ఋక్షరాజు సంహరించి యా రత్న రాజముం గొని దన గుహం జొచ్చెను. వృష్ణ్యంధ కులయ్యెడ ప్రసేనుడు హతుడవుట విని, అంతకు మున్నా మణి నిమ్మని కోరి యున్నందున నిది కృష్ణుని పని యోమోయని శంకించిరి. అట్లు తనను అనుమానించుట యెరింగి యా పని తాను జేయని వాడయ్యు నయ్య పవాదు తొలిగించు కొన నెంచి హరి యమ్మణింగొని తెత్తునని ప్రతిన నేసి వన మేగెను.
యత్ర ప్రసేనో మృగయాం వ్యచర త్తత్ర చాప్యథ
ప్రసేనస్య పదం గృహ్య పురుష్తెరాప్తకారిభిః
ఋక్షవంతం గిరివరం వింధ్యం చ గిరిముత్తమమ్
అన్వేష యన్పరిశ్రాంతః స దదర్శ మహామనాః
సాశ్వం హతం ప్రసేనం తు నావిందత చ తస్మణిమ్
అథ సింహః ప్రసేనస్య శరీర స్యావిదూరతః
ఋక్షేణ నిహతో దృష్టః పదై ర్బక్షస్తు సూచితః
పదైసై రవ్వియాయాధ గుహా మృక్షస్య మాధవః
స హి ఋక్షబిలే వాణీం శుశ్రావ ప్రమదేరితామ్
ధాత్ర్యా కుమారమాదాయ సుతం జాంబవతో ద్విజాః
క్రీడయంత్యాచమణినా మా రోదీ రిత్యధేరితామ్
ప్రసేనుడు వేటాడిన తాపు నందాతని యడుగు జాడలను, ఆప్త జనమ్ము వలన విని గుర్తించి, ఆజాడం బట్టి పోయి పోయి ఋక్షవంత మను గిరిని వింద్య పర్వతమున వెదకి వెదకి అలసి సొలసి తుదకు గుఱ్ఱముతో గూడ కూల్ప బడిన ప్రసేనుం గాంచెను. గాని మణిని మాత్రము గానడయ్యె, ప్రసేనుని శరీరమునకు దగ్గర భల్లుకముచే హతమై పడియున్న సింహమును జూచెను. అడుగుల గుర్తులం బట్టి యా చంపినది భల్లుకమని మాత్రము గ్రహించెను. అట్లే పయనించి యల్లంతలో నొక గుహను జూచెను. ఆ యెలుగు బంటి బిల మందొక సుందరి యెలుంగు విన వచ్చెను. అట నొకదాది జాంబవంతుని తనయు నొక బాలు నెత్తుకొని స్యమంతక మణిం జూపుచు, నాడించు చున్న దానిం జూచెను.
ధాత్రి:
సింహః ప్రసేన మవధీ త్సింహో జాంబవతా హతః
సుకుమారక! మారో దీ స్తవహ్యేష స్యమంతకః
వ్యక్తిత స్తస్య శబ్ధస్య తూర్ణమేవ భిలం యయౌ
ప్రవిశ్య తత్ర భగవాం స్తద్ధృక్షబిల మంజసా
స్థాపయిత్వా బిలద్వా రేయదూన్ లాంగలినాసహ
శార్గధన్వా బిలస్థంతు జాంబవంతం దదర్శ సః
యుయుదే వాసుదేవస్తు బిలే జాంబవతా సహ
బాహూభ్యామేవ గోవిందో దివసా నేకవింశతిమ్
ధాత్రి:
“సింహః ప్రశేన మవధీత్ సింహో జాంబవతా హతః
సుకుమారక! మారోదీ స్తవ హ్యేష స్యమంతకః”
సింహము ప్రసేనుని గూల్చినది. అ సింగము జాంబవంతుని చే గూలినది. ఓ సుకుమారుడా! ఏడువకు ఈ స్యమంతక మణి నీదే సుమా! అని యనుచున్న మాట ఆ మాట యొక్క వ్యక్తిం బట్టి వెను వెంటనే హరి బిలముం జొచ్చెను. కృష్ణ భగవానుడు బిలద్వార మందు బలరామునితో గూడ యదువుల నిక్కడుండుడని నిలిపి శార్ఙ్గధనువూని లోనికిం జొచ్చి జాంబవంతుని జూచెను. ఆ గుహ యందాతనితో వాసుదేవుడు యుద్ధము సేసెను. ఇరువది యొక్క రోజులు వానితో బాహు యుద్ధము గావించెను.
ప్రవిషేథ బిలే కృష్ణే బలదేవ పురస్సరాః
పురీం ద్వారవతీ మేత్య హతం కృష్ణం న్యవేదయన్
వాసుదేవోపి నిర్జిత్య జాంబవంతం మహాబలమ్
లేభే జాంబవతీం కన్యా మృక్షరాజస్య సంమతామ్
మణిం స్యమంతకమ్ చైవ జగ్రాహ త్మవిశుద్దయే
అనునీయర్జరాజం తు నిర్యియౌ చ తతో బిలాత్
ఉపాయా ద్ద్వారకాం కృష్ణ స్స వినీతైః పురస్సరై
ఏవం స మణిమాహృత్య విశోధ్యాత్మాన మచ్యుతః
దదౌసత్రాజితే తం వై సర్వసాత్త్వతసంనది
ఏవం మిధ్యాభిశప్తేన కృష్ణే నామిత్రషూతినా
అత్మా విశోదితః పాపా ద్యినిర్జిత్య స్యమంతకమ్
కృష్ణుడు బిలమం బ్రవేశించిన తరువాత బలరామాదులు ద్వారవతి కేగి కృష్ణుడందు హతు డయ్యెనని తెలిపిరి. వాసు దేవుండో, జాంబవంతుని గెలిచి, యా ఋక్షాధిపతి తనయను జాంబవతిం బొంది తన యపవాదు పోవ నెలుగుల ఱేని నను నయించి స్యమంతక మణిం గైకొని యుపాయమున నా గుహ వెలువడి యావల కేగెను. ఆయనతో విధేయు లయిన పరివారము వెన్నంటి వచ్చిరి. ఇట్లాతడు మణిం గొని వచ్చి అత్మ విశోధనము సేసికొని సర్వసాత్వత జన సమావేశ మందు దానిని సత్రాజిత్తున కొసంగెను. అరిజన సంహారి యైన హరి లేనిపోని యపవాదు నకు గురియై యది పాపు కొనెను.
సత్రాజితో దశ త్వాస న్భార్యా స్తాసాం శతం సుతాః
ఖ్యాతిమంత స్త్రయ స్తేషాం భంగకారస్తు పూర్వజః
వీరో వాతపతి శ్చైవ వసుమేధ స్తథైవ చ
కుమార్యశ్చాపి తిస్రో వైదిక్షు ఖ్యాతా ద్విజోత్తమాః
సత్యభామోత్తమా తాసాం వ్రతినీచ దృడవ్రతా
తథా ప్రస్వాపినీ చైవ భార్యాః కృష్ణాయ తాదదౌ
సభాక్షో భంగకారిన్తు నా వేయశ్చ సరోత్తమౌ
జజ్ఞాతే గుణసంపన్నౌ విశ్రుతౌ రూపసంపదా
మాద్య్రాః పుత్రోథ జజ్ఞేథ వృష్ణిపుత్రో యుధాజితః
జజ్ఞాతే తనయౌ వృష్ణేః శ్వఫల్క శ్చిత్రక స్తథా
శ్వఫల్కః కాశిరాజస్య సుతాం భార్యామవిందత
గాంధీనీంనామ తస్యాశ్చ గాః సదా ప్రదదౌ పితా
తస్యాం జజ్ఞే మభాబాహుః శ్రుతవా నతిథిప్రియః
అక్రూరోథ మహాబాగో జజ్ఞే విపులదక్షిణః
ఉపమద్గు స్తథా మద్గు ర్ముదరశ్చారిమర్ధనః
ఆరిక్షేప స్తథోపేక్షః శత్రుహా చారిమేజయః
ధర్మభృచ్ఛాపి ధర్మా చ గృధ్రభోజాంధక స్తథా
ఆవాహప్రతివాహౌ చ నుందరీ చ వరాంగనా
విశ్రుతాశ్వస్య మహిషీ కన్యా చాస్య వసుంధరా
రూపయౌవన సంపన్నా సర్వత్త్వమనోహరా
అక్రూరేణోగ్ర సేనాయాం సుతౌ వై కులనందనౌ
వసుదేవశ్చోప దేవశ్చ జజ్ఞాతే దేవ వర్చసౌ
చిత్రకస్యా భవస్సుత్రాః పృథుర్విపృథురేవ చ
అళ్వగ్రీవోశ్వబాహుశ్చ సుపార్శ్వకగవేషణౌ
అరిష్టనేమిశ్చ సుతా ధర్మో ధర్మభృదేవ చ
సుబాహుర్బహు బాహుశ్చ శ్రనిష్ఠాశ్రవణే స్త్రియా
ఇమాం మిథ్యాభిశస్తిం యః కృష్ణస్వ సముదాహృతామ్
వేద మిథ్యాభి శాపాస్తం స స్పృశంతి కదాచశ
సత్రాజిత్తు భార్యలు పదిమంది. వారి యందు నూర్గురు కుమారులు దయించిరి. అందు ప్రఖ్యాతి గలవారు ముగ్గురు. అంద గ్రజుడు భంగకారుడను వాడు, వాతపతి, వసుమేధుడు, వాని తరువాతి వారు. కూతరులు ముగ్గురు, వారిలో సత్యభామ ఉత్తమ (పెద్దదన్న మాట) రెండవది ఉత్తమ వ్రతాచార పరాయణ యగువ్రతిని. ప్రస్వాపిని అనునది మూడవ యామె. వారిని సత్రాజిత్తు కృష్ణున కిచ్చెను. భంగకారి కొడుకు లిద్దరు. కీర్తిమంతులు, రూప వంతులు సభాక్షుడు, నావేయుడను వారు. (క్రోష్టు భార్యయగు) మాద్రి యందు గల్గిన వాడు వృష్ణిపుత్రడు, యుధాజిత్తు. వృష్ణి కుమారులు శ్వఫల్కుడు, చిత్రకుడు నని యిద్దరు. శ్వఫల్కుడు, కాశిరాజ తనయం బెండ్లాడెను. అమె గాందిని యను పేరిది. అమె తండ్రి యామెకు గోవుల నెప్పుడు నిచ్చెడు వాడు (అందున నాపేరు ప్రఖ్యాతికి వచ్చినది) అమె యందు పండితుడు, అతిథి ప్రియుడు మహా వీరుడు బహు దక్షిణ నిచ్చువాడు మహానుభావు డగు అక్రూరుడు దయించెను. అక్రూరుడే గాక ఉపమద్గువు, మద్గువు, మదురుడు, అరిమర్దనుడు, అరిక్షేపుడు, ఉపేక్షుడు, అరిమేజయుడు, ధర్మపరుడైన ధర్ముడు, గృధ్రభోజుడు, అంధకుడు, ఆవాహుడు, ప్రతివాహుడు, నను వారును సుందరి యగు వసుంధర యను కుమార్తె యును శ్వఫల్కునికి కలిగిరి. వసుంధర విశ్రుతాశ్వుని వివాహ మాడి పట్ట మహిషి అయినది. ఈమె రూప యౌవన సంపన్న సర్వసత్వ మనోహరయునై యొప్పెను. అక్రూరుని కుగ్రసేన యందు కుల నందను లైన నందను లిద్దరు గల్గిరి. వసుదేవుడు, ఉపదేవుడు అనువారు. దేవ వర్చస్కులు. చిత్రకుని కుమారులు పృథువు, విపృథువు, అశ్వగ్రీవుడు, అశ్వబాహుడు, సుపార్శ్వకుడు, గవేషణుడు, అరిష్టనేమి, ధర్ముడు, ధర్మభృత్తు సుబాహువు, బహుబాహువు, యను పుత్రులు, శ్రవిష్ఠ, శ్రవణ యను కూతుళ్లు కలిగిరి. కృష్ణుని యీ యపవాద వృత్తాంతము విన్న వానికి ఎన్నడును ఆపదల స్పర్శ యుండదు.
Summary of chapter 16 of the Brahma Mahā Purana is as follows:
The cosmographical description of the seven continents (Saptadvīpas) is presented. Beginning with Jambūdvīpa at the center, the text enumerates Plakṣa, Śālmali, Kuśa, Krauñca, Śāka, and Puṣkara dvīpas, each surrounded by a different ocean. The rulers, inhabitants, and sacred character of each continent are described, establishing the purāṇic geography of the inhabited world.