31 - మార్తండస్యైక వింశతి నామ కీర్తనమ్‌ ఆదిత్య మాహాత్మ్య వర్ణనము

బ్రహ్మ:

ఆదిత్యమూల మఖిలం త్రైలోక్యం మునిసత్తమాః

భవత్యస్మా జ్జగత్సర్వం సదేవాసుర మానుషమ్‌

రుద్రోపేంద్ర మహేంద్రాణాం విప్రేంద్ర త్రిదివౌకసామ్‌

మహాద్యుతిమతాంచైవ తేజోయం సార్వలౌకికమ్‌

సర్వాత్మా సర్వలోకేశో దేవదేవః ప్రజాపతిః

సూర్య ఏవ త్రిలోకస్యమూలం పరమదైవతమ్‌

అగ్నౌ ప్రాస్తాహుతిః సమ్యగాదిత్య ముపతిష్ఠతే

ఆదిత్యా జ్జాయతే వృష్టి ర్వృష్టే రన్నం తతః ప్రజాః

సూర్యాత్‌ ప్రసూయతే సర్వం తత్ర చైవ ప్రలీయతే

భావాభావౌహి లోకానా మాదిత్యా న్నిః సృతౌ పురా

ఏతత్తు ధ్యానినాం ధ్యానం మోక్షశ్చాప్యేష మోక్షిణామ్‌

తత్రగచ్ఛంతి నిర్వాణం జాయంతేస్మాత్పునః పునః

క్షణా ముహూర్తా దివసా నిశా పక్షాశ్చ నిత్యశః

మాసాః సంవత్సరాశ్చైవ ఋతవశ్చ యుగాని చ

అథాదిత్యా దృతేహ్యేషాం కాలసంఖ్యా న విద్యతే

కాలాదృతే న నియమో నాగ్నౌ విహరణక్రియా

ఋతూనా మవిభాగశ్చ తతః పుష్పఫలం కుతః

కుతోవై సస్యనిష్పత్తి స్తృణౌషధిగణః కుతః

అభావో వ్యవహారాణాం జంతూనాం దివి చేహ చ

జగత్ప్రభావా ద్విశతే భాస్కరా ద్వారితస్కరాత్‌

నావృష్ట్యా తపతే సూర్యో నావృష్ట్యా పరిశుష్యతి

నావృష్ట్యా పరిధిం ధత్తే వారిణా దీప్యతే రవిః

వసంతే కపిలః సూర్యో గ్రీష్మే కాంచన సన్నిభః

శ్వేతోవర్షాసు వర్ణేన పాండుః శరది భాస్కరః

హేమంతే తామ్రవర్ణాభః శిశిరే లోహితో రవిః

ఇతి వర్ణాః సమాఖ్యాతాః సూర్యస్య ఋతుసంభవాః

ఋతుస్వభావర్ణైశ్చ సూర్యః క్షేమ సుభిక్షకృత్‌

బ్రహ్మ:

 ఓ మునులార! సదేవాసుర మానుషమైన సర్వ జగత్తు ఆదిత్య మూలము. ఈ తేజస్సు ఇంద్రో పేంద్రాది సర్వ దేవతా మయము. పరమ దైవత మిదియే. అగ్ని యందు యధావిధి వేల్వ బడిన యాహుతి యాదిత్యు నందును. ఆదిత్యుని వలన వృష్టి, వర్షము వలన నన్నము దాని వలన బ్రజలు గల్గుదురు. ధ్యాన నిష్ఠులకు ధ్యానము మోక్షులకు మోక్షము, ఈతత్వమే. క్షణ, ముహూర్త, దివస, నిశా, పక్ష, మాస, సంవత్సర, ఋతు, యుగాది కాలగణన మాదిత్యుని వలననే. కాలము లేక నియమము లేదు. అగ్ని విహరణ క్రియ లేదు. ఋతు విభాగము లేదు. అపుడు పుష్ప ఫలము లెక్కడ? సస్య నిష్పత్తి యెక్కడిది. తృణౌషధి గణ మెక్కడ ! ఇక్కడ దివంబునను జీవ వ్యవవహారము లేనేలేదు. వారి తస్కరుడైన భాస్కరుని వలననే జగద్వ్యవహారము సాగును. వృష్టి లేక సూర్యుడు తపింపడు నీటిని శోషింప జేయడు. గుడి కట్టడు. ఉదకము ననే వెలుంగును. వసంతమున కపిల వర్ణుడు. గ్రీష్మముస బంగారు రంగువాడు. వర్ష ఋతువున తెల్లని వాడు. శరత్కాలమున పాండు వర్ణము వాడు. హేమంతమున రాగి రంగు గలవాడు. శిశిరమున లోహితుడు (ఎఱ్ఱని వాడు). ఋతు స్వభావ సిద్ధము లయిన రంగులం బట్టి కూడ సూర్యుడు క్షేమము సుభిక్షము సేయువాడు.

అథాదిత్యస్య నామాని సామాన్యాని ద్విజోత్తమాః

ద్వాదశైవ పృథక్త్వేన తాని వక్ష్యామ్యశేషతః

ఆదిత్యః సవితా సూర్యో మిహిరోర్కః ప్రభాకరః

మార్తండో భాస్కరో భాను శ్చిత్రభాను ర్దివాకరః

 రవి ర్ద్వాదశభి స్తేషాం జ్ఞేయః సామాన్యనామభిః

విష్ణు ర్ధాతా భగః పూషా మిత్రేంద్రౌ వరుణోర్యమా

వివస్వా నంశుమాంస్త్వాష్టా పర్జన్యో ద్వాదశఃస్మృతః

ఇత్యేతే ద్వాదశాదిత్యాః పృథ క్త్వేన వ్యవస్థితాః

ఉత్తిష్ఠంతి సదాహ్యేతే మాసైర్ధ్వా దశభిః క్రమాత్‌

విష్ణు స్తపతి చైత్రే తు వైశాఖే చార్యమా తథా

వివస్వాన్‌ జ్యేష్ఠమాసే తు ఆషాఢే చాంశుమాన్‌ స్మృతః

పర్జన్యః శ్రావణే మాసి వరుణః ప్రౌష్ఠసంజ్ఞకే

ఇంద్ర ఆశ్వయుజే మాసి ధాతా తపతి కార్తికే

మార్గశీర్షే తథా మిత్రః పౌషే పూషా దివాకరః

మాఘే భగస్తు విజ్ఞేయ స్త్వష్టా తపతి ఫాల్గునే

శతై ర్ద్వాదశభి ర్విష్ణూ రశ్మిభి ర్దీప్యతే సదా

దీప్యతే గోసహస్రేణ శతైశ్చ త్రిభి రర్యమా

ద్వి స్సప్తకై ర్వివస్వాంస్తు అంశుమాన్‌ పంచభిస్త్రిభిః

వివస్వానిన పర్జ్యన్యో వరుణ శ్చార్యమా తథా

మిత్రవ ద్భగవాం స్త్వష్టా సహస్రేణ శతేన చ

 ఇంద్రస్తు ద్విగుణౖః షడ్భి ర్ధాతైకాదశభిః శతైః

సహస్రేణ తు మిత్రో వై పూషా తు నవభిః శతైః

ఉత్తరోపక్రమేర్కస్య వర్ధంతే రశ్మయప్తథా

దక్షిణోపక్రమే భూయో హ్రసంతే సూర్యరశ్మయః

ఏవం రశ్మిసహస్రంతు సూర్యలోకా దనుగ్రహమ్‌

ఏవం నామ్నాం చతుర్వింశ దేక ఏషాం ప్రకీర్తితః

విస్తరేణ సహస్రంతు పునరన్యత్‌ ప్రకీర్తితమ్‌

సూర్యునకు అదిత్య, సవితృ, సూర్య, మిహిర, అర్క, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి, ఇత్యాదిగ పండ్రెండు సామాన్య నామములు. విష్ణు ధాత, భగపూష, మిత్ర, ఇంద్ర, వరుణ, అర్యమ, వివస్వత్‌ అంశుమత్‌, త్వష్ట, పర్జన్య యను నీ పంద్రెండు నామములు విశేష నామములు. విష్ణువు చైత్ర మందు పంట్రెండు వందల కిరణములతో వెలుగును. అర్యముడు వైశాఖ మందు పదమూడు వందల రశ్ములలో దీపించును. వివస్వంతుడు జ్యేష్ఠ మందు పదునాల్గు వందల కరముల తోడను, అంశుమంతుడు ఆషాఢమున పదునేను వందల యంశువుల తోను వర్జన్యుడు శ్రావణ మందు పదునాల్గు వందలును వరుణుడు భాద్రపద మందు నన్నియే కిరణముల చేతను, ఇంద్రుడా శ్వయుజమున పన్నెండవందల కిరణముల లోను ధాత కార్తీక మందు పదునొకండు వందల కిరణముల చేతను మార్గశిరమున మిత్రుడు పై విధముగాను, పౌషముస పూష తొమ్మిది వందల కిరణముల తోను మాఘమున భగుడును ఫాల్గుణమున త్వష్ట పదునొకండు వందల కిరణముల తోను వెలుంగుదురు, ఉత్తరాయణము నుండి సూర్య కిరణములు పెంపొందును. దక్షిణాయనము నుండి తగ్గును. ఇట్లు వేల కొలది కిరణములు గ్రహముల నను సరించి సూర్యుని నుండి వెలుపడి వెలుంగును. సూర్య సామాన్య నామములు. విశేష నామము లును గలిసి యిరువది నాల్గు ప్రసిద్ధములు. ఇవి గాక సూర్య సహస్ర నామములు వేఱుగా నున్నవి.

మునులు:

యే తన్నామసహస్రేణ స్తువం త్యర్కం ప్రజాపతే

తేషాం భవతి కిం పుణ్యం గతిశ్చ పరమేశ్వర

మునులు:

 ఓ పరమేశ్వరా! ప్రజాపతీ! సహస్ర నామములతో సూర్యుని స్తుతించిన మానవునకు నే పుణ్యం ప్రాప్తించును? ఏ గతి సిద్ధించును? తెలుపుమని యడిగిరి.

బ్రహ్మ:

శృణుధ్వం మునిశార్దూలాః! సారభూతం సనాతనమ్‌

అలం నామసహస్రేణ పఠన్నేవం స్తవం శుభమ్‌

యాని నామాని గుహ్యాని పవిత్రాణి శుభానిచ

తాని వః కీర్తయిష్యామి శృణుధ్వం భాస్కరస్య వై

బ్రహ్మ:

మునులార! సూర్య సహస్రనామ పారాయణము వలన నే ఫలము గల్గునో పవిత్రము శుభావహము, గుహ్యములు నైన యా సూర్య నామములను మీకు దెల్పెదను వినుండు.

వికర్తనో వివస్వాంశ్చ మార్తండో భాస్కరో రవిః

లోకప్రకాశకః శ్రీమాన్‌ లోకచక్షుర్మహేశ్వరః

లోకసాక్షీ త్రిలోకేశః కర్తా హర్తా తమిస్రహా

తపన స్తాపన శ్చైవ శుచిః సప్తాశ్వవాహనః

గభస్తిహస్తో బ్రహ్మాచ సర్వదేవ నమస్కృతః

ఏకవింశతి రిత్యేషస్తవ ఇష్టః సదా రవేః

సూర్యుని యిరువది యొక్క నామములు మూలమున స్పష్టము. ఈ పవిత్ర నామ స్తుతి సూర్యునకు సదా ప్రీతిని గూర్చును.

శరీరారోగ్యదశ్చైవ ధనవృద్ధియశస్కరః

సైవరాజ ఇతి ఖ్యాత స్త్రిషు లోకేషు విశ్రుతః

య ఏతేన ద్విజశ్రేద్విసంధ్యేస్తష్ఠాః మనోదయే

స్తౌతి సూర్యం శుచిర్భూత్వా సర్వ పాపైః ప్రముచ్యతే

మానసం వాచికం వాపి దేహజం కర్మజం తథా

ఏక జప్యేన తత్సర్వం నశ్య త్యర్కస్య సన్నిధౌ

ఏకజప్యశ్చ హోమశ్చ సంధ్యోపాసన మేవ చ

ధూపమంత్రోర్ఘ్య మంత్రశ్చ బలిమంత్రస్తధైవ చ

అన్నప్రదానే దానే చ ప్రణిపాతే ప్రదక్షిణే

పూజితోయం మహామంత్రః సర్వపాపహరః శుభః

తస్మా ద్యూయం ప్రయత్నేన స్తవేనానేన వై ద్విజాః

స్తువీధ్వం వరదం దేవం సర్వకామఫలప్రదమ్‌

ఇది శరీరారోగ్యము, ధనవృద్ధి యశస్సును గూర్చును. రెండు సంధ్య లందు నీ స్తుతి పఠించిన పాపము లెల్ల పోవును. ఒకసారి జపించిన త్రికరణ కృతమైన దురితము నశించును. ఒక మారీ నామములచే హోమము సంద్యో పాసనము చేసిన ఆర్ఘ్య మందు బలియందు అన్నదాన మందు స్నానమున నమస్కార మందు ప్రదక్షిణ మందు నీ మహా మంత్రము పఠించిన సర్వపాప క్షయ మగును. శుభ మగును. కావున మీరీ మంత్రము పఠించి వరదుడైన సూర్య దేవుని నుతింపుడు.