9 - సోమోత్పత్తి వర్ణనమ్‌

లోమహర్షణుడు:

పితా సోమస్య భో విప్రా జజ్ఞేత్రిర్భగవా సృషిః

బ్రహ్మణో మానసా త్పూర్వం ప్రజాసర్గంవిధిత్సతః

అనుత్తరం నామ తపో యేన తప్తం హి తత్పురా

 త్రీణివర్ష సహస్రాణి దివ్యానీతి హి నః శ్రుతమ్‌

ఊర్థ్వ మాచక్రమే తస్య రేతః సోమత్వమీయివాన్‌

నేత్రాభ్యాం వారి సుస్రావ దశథా ద్యోతయ న్దిశః

తం గర్భం విధినాదిష్టా దశ దేవ్యో దధు స్తతః

సమేత్య ధారయామాసు ర్నచతా స్సమశక్నువన్‌

యదా న ధారణే శక్తా స్తస్య గర్భస్య తా దిశః

తతస్తాభిః స త్యక్తస్తు నిపపాత వసుంధరామ్‌

పతతిం సోమ మాలోక్య బ్రహ్మా లోకపితామహః

రథమారోపయామాస లోకానాం హితకామ్యయా

తస్మి న్నిపతితే దేవాః పుత్రేత్రేః పరమాత్మని

 తుష్టువు ర్ర్భహ్మణః పుత్రా స్తథాన్యే మునిసత్తమాః

తస్య సంస్తూయమానస్య తేజః సోమస్యభాస్వతః

 ఆప్యాయనామ లోకానాం భావయామాస సర్వతః

స తేన రథముఖ్యేన సాగరాంతాం వసుంధరామ్‌

త్రి స్సప్తకృత్వోతి యశా శ్చకా రాభిప్రదక్షిణమ్‌

తస్య యచ్చరితం తేజః పృథిబీ మన్వపద్యత

ఓషధ్య స్తాః సముద్భూతా యాభిః సంధార్యతే జగత్‌

స లబ్ధతేజా భగవా న్సంస్తవైశ్చ స్వకర్మభిః

తపస్తేపే మహాభాగః పద్మానాం దర్శనాయ సః

తతస్తస్మై దదౌ రాజ్యం బ్రహ్మా బ్రహ్మవిదాం వరః

బీజౌషధీనాం విప్రాణా మపాం చ మునిసత్తమాః

సూతుడు:

 ఓ విప్రులార! సోముని తండ్రి అత్రి భగవానుడు ఋషి. అయన బ్రహ్మ మానస పుత్రుడు. అతడు గొప్ప తప మొనరించిన వాడు. అతడు మూడు వేల దివ్య సంవత్సరములు తపమా చరించెనని ప్రసిద్ధి. ఆయన యొక్క తేజస్సు మీదికి జిమ్ము కొనెను. అదియె సోమ రూపము దాల్చెను. అయన కళ్ళ నుండి నీరు దిక్కుల ప్రకాశింప జేయుచు. పది తెఱంగుల స్రవించెను. దశదిశాధి దేవత లేకమై విధి యానతి నా తేజస్సును ధరింపబోయు శక్యముగాక జార విడిచిరి. వసుధపై బడిన యా సోమరూప మయిన వీర్యమును జూచి లోక పితా మహుడైన బ్రహ్మ లోకహితమునకై తన రథ మెక్కించు కొనియె అత్రి కుమారు డట్లు బడుట చూచి బ్రహ్మ కుమారులు దేవతలు మరి ముని వరులు పొగడిరి. అట్లు స్తుతింపబడు సోముని తేజస్సు లోకముల నాప్యాయ నముసేయ నెల్లడల నలము కొనియె. అ సోముడు బ్రహ్మ యొక్క రథము నందధష్టించి సాగర పరీవృతయైన యివ్వసుంధర నిరువది యొక్క మారులు బ్రదక్షణము సేసెను. అయన తేజస్సు భూమియందు బ్రవేశించెను. అందుండి సర్వౌషధులు సర్వ జగదాధార భూతములై మొలచినవి. ఆ సోముడు స్తుతులచే స్వకీయ సత్కృతులచే తేజస్సు వడసి పద్మ దర్శనమునకై తప మొనరించెను. బ్రహ్మ విదగ్ర గణ్యుడగు బ్రహ్మ యతనికి బీజౌషధుల యొక్కయు విప్రుల యొక్కయు జలము యొక్కయు సామ్రాజ్య మొసంగెను.

న తత్ప్రాప్య మహారాజ్యం సోమః సౌమ్యవతాం వరః

 సమాజహ్రే రాజసూయం సహస్రశతదక్షిణమ్‌

దక్షిణా మదదా త్సోమ స్త్రీన్లోకానితి నః శ్రుతమ్‌

 తేభ్యో బ్రహ్మర్షిముఖ్యేభ్యః సదస్యేభ్యశ్చ భోద్విజాః

హిరణ్యగర్బో బ్రహ్మాత్రిర్భృగుశ్చ ఋత్విజోభవన్‌

సదస్యో భూ ద్ధరి స్తత్ర మునిభిర్భహుభి ర్వృతః

తం శినీశ్చ కుహూశ్చైవ ద్యుతిః పుష్టిః ప్రభావసుః

కీర్తిర్ధృతిశ్చ లక్ష్మీశ్చ నవ దేవ్యః సిషేవిరే

ప్రాప్యావభృథ మప్యగ్ర్యం సర్వదేవర్షిపూజితః

 విరరా జాజా ధిరాజేంద్రో దశధా భాసయ న్దిశః

తస్య తత్ర్పాప్య దుష్ర్పాప్య మైశ్వర్య మృషిసత్కృతమ్‌

 విబభ్రామ మతిస్తాతావినయా దనయాహృతా

బృహస్పతే స్సవై భార్యా మైశ్వర్యమదమోహితః

జహార తరసా సోమో విమ త్యాంగిరసః సతీమ్‌

సౌమ్యులకెల్ల సౌమ్యుడగు నాతడది వడసి, సహస్రశత దక్షిణముగ రాజ సూయము చేసెను. ముల్లోకములను నాకైరవ బంధువు దక్షిణ యిచ్చెనని వినన య్యెడిని. ఆ రాజసూయా ధ్వరమున సదస్యులై బ్రహ్మర్షులు దక్షిణల నందు కొనిరట. హిరణ్య గర్భుడు (బ్రహ్మ) అత్రి భృగువు నందు ఋత్విజు లైరి. బహుముని పరివృతుడై హరి యందు సదస్యు డయ్యెను. ఆ సోముని సినీకుహువు, ద్యుతి, పుష్టి, వ్రభ, వసువు, కీర్తి, ధృతి, లక్ష్మియను తొమ్మండ్రు దేవతా సుందరీ మణులు సేవించిరి. అవబృథ స్నాతుడై సర్వ దేవర్షి పూజితుడై పది విధముల దిక్కులను ద్భాసింప జేయుచు సోమ రాజేంద్రుడు వెలుగొందెను. ఏరికి బడయరాని యైశ్వర్య మంది ఋషి సత్కార నంభృతమై దనకు లభించెనని యుప్పొంగి యవినయము ననయమునకు (అనీతి) లోబడి యాతని మతి పోయినంత నతడమి తైశ్వర్య మద మోహితుడై కానక బృహస్పతి భార్యను తారను బలాత్కారమున హరించెను.

స యాజ్యమానో దేవై శ్చ తథా దేవర్షిభి ర్ముహుః

 నైవ వ్యసర్జయ త్తారాం తస్మా అంగిరసే తదా

ఉశనా తస్య జగ్రాహ పార్షిమంగిరస స్తథా

రుద్రశ్చ పార్ష్ణిం జగ్రాహ గృహీత్వా జగవం ధనుః

తేన బ్రహ్మశిరోనామ పరమాస్త్రం మహాత్మనా

 ఉద్దిశ్య దేవా నుత్సృష్టం యేనైషాం నాశితం యశః

తత్ర త ద్యుద్ధ మభవ త్ప్రఖ్యాతం తారకామయమ్‌

 దేవానాం దానవానాంఛ లోకక్షయకరం మహత్‌

తత్ర శిష్టాస్తు యే దేవా స్తుషితా శ్చైవ యే ద్విజాః

 బ్రహ్మాణం శరణం జగ్ము రాదిదేవం సనాతనమ్‌

దేవతలు దేవర్షులు మఱిమఱి యాచించినను నతడు వినక తార నాంగిరనునికి అప్పగింపక య పోయెను. అపుడు యంగిరను మడమలం ద్రొక్కికొని ఉశనసుడు (శుక్రుడు) వచ్చెను. రుద్రుడు అజగవమ్మను విల్లుకొని పార్ష్ణి గ్రాహు డయ్యెను. అతడు బ్రహ్మ శిరోనామ కాస్త్రము గొని దేవతలపైకి విసరెను. దానిచే నవ్వేల్పుల కీర్తి కళంకిత మయ్యెను. తారకా మయమును ప్రఖ్యాత మయ్యుద్ధ మక్కడ దేవ దానవ లోక క్షయకర మయ్యెను. బ్రాహ్మణులారా ! అందు మిగిలిన దేవతలు తుషి తులను దేవతలు సనాతనుడును నాది దేవుడునగు బ్రహ్మను శరణు జొచ్చిరి.

తదా నివార్యోశనసం తం వై రుద్రం చ శంకరమ్‌

 దదా వంగిరసే తారాం స్వయమేన పితామహః

తా మంతః ప్రసవాం దృష్ట్వా క్రుద్ధః ప్రాహ బృహస్పతిః

మదీయాయాం నతేయోనౌ గర్భో ధార్యః కథంచన

ఇషీకా స్తంబ మాసాద్య గర్భం సా చోత్సపర్జహ

జాతమాత్రః స భగవా న్దేవానా మాక్షిప ద్వపుః

తత స్సంశయమాపన్నా స్తారా మూచుః సురోత్తమాః

సత్యం బ్రూహి సుతః కస్య సోమస్యాథ బృహస్పతేః

పృచ్ఛ్యమానా యదా దెవైర్నాహ సా విబుధా న్కిల

 తదా తాం శప్తుమారబ్ధః కుమారో దస్యుహంతమః

తం నివార్య తతో బ్రహ్మా తారాం పప్రచ్ఛ సంశయమ్‌

యదత్ర తథ్యం త ద్భ్రూహి తారే కస్యసుత స్త్వయమ్‌

ఉవాచ ప్రాంజలిః సాతం సోమస్యేతి పితామహమ్‌

 తదాతం మూర్ధ్నిచాఘ్రాయ సోమో రాజా సుతంప్రతి

బుధ ఇత్యకరోన్నామ తస్య బాలస్య ధీమతః

 ప్రతికూలం చ గగనేసమ్య గుత్తిష్ఠతే బుధః

ఉత్పాదయామాస తదా పుత్రం వై రాజపుత్రికమ్‌

 తస్యాపత్యం మహాతేజా బభూ వైలః పురూరవాః

ఉర్వస్యాం జజ్ఞిరే యస్య పుత్రాః సప్త మహాత్మనః

ఏత త్సోమస్య వో జన్మ కీర్తితం కీర్తివర్థనమ్‌

వంశ మస్య మునిశ్రేష్ఠ కీర్త్యమానం నిబోధత

 ధన్య మాయుష్య మారోగ్యం పుణ్యం సంకల్ప సాధనం

సోమస్య జన్మ శ్రుత్వైవ పాపేభ్యో విప్రముచ్యతే

పితామహు డంతట శుక్రుని రుద్రుని (శంకరుని) వారించి స్వయముగ తారను అంగిరసుని కప్ప గించెను. బృహస్పతి, యా యిల్లాలి నంతః ప్రసవగ గమనించి (గర్భిణి యగుట గ్రహించి) క్రుద్ధుడై నాకు హక్కయిన ఈయోని యందు గర్భము దాల్చుట నీకుచితము గాదనిన నామె ముంజ గడ్డి యందుంచెను. ఈ శిశువు పుట్టి నంతనే దివ్య శరీరము నొందెను. సుర వరులంతట సంశయమంది తారంగని నిజము చెప్పుము. ఈ బాలుడు సోముని కొడుకా లేకా బృహస్పతి బిడ్డడా యనగా నామె వేల్పులకు బదులు పలకదయ్యె. అపుడు చోర హస్తకుడగు నా మారుడామెను శపింప బూనిన వారించి బ్రహ్మ, తారా! ఇందు నిజమేది చెప్పుము. వీడెవ్వని కొడుకు? అననామె ప్రాంజలియై సోముని వాడని యనెను. అయ్యడ సోముడా పావని శిరంబు మూర్కొని వానికి బుధుడని నామ కరణ మొనరించెను. అ బుధుడు గగనమున ప్రతికూలముగ నుదయించు చుండును. అతడు వైరాజ మనువు పుత్రిక యందు పుత్రుని గనెను. అ పుత్రునకు పురూరవుడను పుత్రుడు జనించెను. పురూరువున కూర్వశి యందేడ్గురు మహాత్ములైన కుమారు లుదయించిరి. ఇది సోముని జన్మ వృత్తాంతము. ఇది కీర్తంప కీర్తి కలుగును. ఈ సోమవంశ సంకీర్తనము ధన్యతను అయుష్యము, ఆరోగ్యము, పుణ్యము గూర్చును. సంకల్ప సాఫల్యము గూర్చును. సోమజన్మ వృత్తాంతము విన్న యతడు పాప విముక్తి నందు గల్గును.