బ్రహ్మ మహా పురాణము

36 - ఉమా మహేశ్వర కల్యాణ వైభవమ్‌

బ్రహ్మ:

విస్తృతే హిమవత్పృష్ఠే విమానశతసంకులే

అభవత్‌ సతు కాలేన శైలపుత్ర్యాః స్వయంవరః

అథ పర్వతరాజోసౌ హిమవాన్‌ ధ్యానకోవిదః

దుహితు ర్దేవదేవేన జ్ఞాత్వా తదభిమంత్రితమ్‌

జానన్నపి మహాశైలః సమయారక్షణేప్సయా

స్వయంవరం తతో దేవ్యాః సర్వలోకే ష్వఘోషయత్‌

దేవదానవసిద్ధానాం సర్వలోకనివాసినామ్‌

వృణుయాత్‌ పరమేశానం సమక్షం యది మే సుతా

తదేవ సుకృతం శ్లాఘ్యం మమా భ్యుదయసమ్మతమ్‌

ఇతి సంచింత్య శైలేంద్రః కృత్వా హృది మహేశ్వరమ్‌

ఆబ్రహ్మకేషు దేవేషు దేవ్యాః శైలేంద్రసత్తమః

కృత్వా రత్నాకులం దేశం స్వయంవర మచీకరత్‌

బ్రహ్మ:

విశాలమైన హిమవత్పర్వతము మీద విమానముల సమ్మర్ధ మధిక మయ్యెను. పార్వతి స్వయంవర సన్నాహము నందు గిరిరాజు తన కుమార్తె యభిప్రాయము హరునిపై నుండుట నెఱింగియును, వంశాచారము పాలించుటకు స్వయంవర వార్తనెల్ల లోకము లందును జాటింపించెను. దేవ దానవ సిద్ధ గంధర్వాదు లందఱి సమక్షమున నా కూమారి బ్రహ్మ వరకు గల దేవత లందు పరమేశ్వరుని వరించునేని యదినా పుణ్యము నంన్తవనీయము. నా అభ్యుదయములకది అనుకూలము. అని మదినెంచి తన నగరము రత్న తోరణా లంకృతము లొనర్చి స్వయముగా చేసెను.

పార్వతీస్వయంవర వైభవము

అథైవ మాఘోషితమాత్ర ఏవ స్వయంవరే తత్ర నగేంద్రపుత్య్రాః

దేవాదయః సర్వజగన్నివాసా స్సమాయయు స్తత్ర గృహీతవేశాః

ప్రపుల్లపద్మాసనసన్నివిష్టః సిద్దైర్వృతో యోగిభి రప్రమేయైః

విజ్ఞాపిత స్తేన మహీధ్రరాజ్ఞా గత స్తదాహం త్రిదివై రుపేతః

అక్షాణంసహస్రం సురరాట్‌ స బిభ్రద్‌ దివ్యాంగహారస్రగుదారరూపః

ఐరావతం సర్వగజేంద్రముఖ్యం స్రవన్మదాసారకృత ప్రవాహమ్‌

ఆరుహ్య సర్వామరరాట్‌ స వజ్రం బిభ్రత్‌ సమాగా త్పురతః సురాణామ్‌

తేజః ప్రభావాధికతుల్యరూపీ ప్రోద్భాసయన్‌ సర్వదిశః వివస్వాన్‌

హైమం విమానం స వలత్పతాక మారూఢ ఆగా త్త్వరితం దినేశః

మణిప్రదీప్తోజ్జ్వలకుండలశ్చ వహ్న్యర్కతేజఃప్రతిమే విమానే

సమభ్యగాత్‌ కశ్యపసూను రేక ఆదిత్యమధ్యా ద్భగనామధారీ

పీనాంగయష్టిః సుకృతాంగహారః తేజోబలాజ్ఞాసదృశ ప్రభావః

దండం సమాగృహ్య కృతాంత ఆగా దారుహ్య భీమం మహిషం జవేన

మహామహీధ్రోచ్ఛ్రయపీనగాత్రః స్వర్ణాదిరత్నాంచిత చారువేశః

సమీరణః సర్వ జగద్బిభర్తా విమాన మారుహ్య సమభ్యగాద్ధి

సంతాపయన్‌ సర్వసురాసురేశాం స్తేజోధిక స్తేజసి సన్నివిష్టః

వహ్నిః సమభ్యేత్య సురేంద్రమధ్యే జ్వలన్‌ ప్రతస్థే వరవేశధారీ

నానామణిప్రజ్వలితాంగయష్టిః జగద్వరం దివ్యవిమాన మగ్ర్యమ్‌

ఆరుహ్య సర్వద్రవిణాధిపేశః స రాజరాజ స్త్వరితోభ్యగాచ్చ

ఆప్యాయయన్‌ సర్వసురాసురేశాన్‌ కాంత్యాచ వేశేన చ చారురూపః

జ్వలన్‌ మహారత్న విచిత్రరూపం విమాన మారుహ్య శశీ సమాయాత్‌

శ్యామాంగయష్టిః సువిచిత్రవేశః సర్వాంగ ఆబద్ధసుగంధిమాల్యః

తారక్ష్యం సమారుహ్య మహీధ్రకల్పం గదాధరోసౌ త్వరితః సమేతః

అథాశ్వినౌ చాపి భిషగ్వరౌ ద్వా వేకంవిమానం త్వరయా ధిరుహ్య

మనోహరౌ ప్రజ్వలచారువేశౌ ఆ జగ్మతు ర్దేవవరౌ సువీరౌ

సహస్రనాగః స్ఫురదగ్ని వర్ణం బిభ్రత్తదానీం జ్వలనార్క తేజాః

సార్థం స నాగై రపరై ర్మహాత్మా విమాన మారుహ్య సమభ్యగాచ్చ

హిమవంతుడు చాటించిన స్వయంవర వార్త విని యఖిల భువన వాసు లయిన యువకులరుదెంచిరి. నేనును నక్కడ గిరి రాజు ప్రార్థనచే నెల్ల యోగులు సిద్ధులు సేవింప దేవతలతో నేగి పద్మాసన మందు పవిష్టుడనై యుంటిని. దివ్యాంబరాంగరాగ హారాది భూషణములం దాల్చి సురరాజు వేయి కన్నులతో నయ్యుత్సవముం దిలకింప మద ధారలం గురియు మహిత గజరాజ మైరావతము నెక్కి వచ్చెను. తేజః ప్రభావము వలన నెల్లదిశల వెలిగించుచు చలత్పతాక మగు (జెండా నెగురు చున్న) బంగారు విమాన మెక్కి భాస్కరుం డరుదెంచెను. తేజమ్మున బలమ్మున శాసనమున నసదృశుడై మణి మయోజ్వల కుండలములు ధరించి యాదిత్య మండలంబు నుండి భగుడును నమర మూర్తి సూర్యుడట్లగ్ని యట్లు వెలుగు విమానమున నేతెంచెను. యముడును దండంబు గొని భయంకర మహిష వాహన మెక్కి జవంబున పెద్ద పర్వత మట్లొడ్డునుం బొడవుం గల్గి మంగళ మూర్తియై మణిమయ స్వర్ణ భూషణ మంజుల వేషియై యచ్చటకు విచ్చేసెను. సర్వ జగత్ప్రాణుడైన సమీరణుడు విమాన మెక్కి సురా సురులకు వెఱగు గూర్చు తేజంబున నరుదెంచెను. వహ్నియు దివ్య విమాన మెక్కి వర వేషధారియై వచ్చి సురేంద్రుల నడుమ వెలుంగుండెను. సర్వ ధనాధ్యక్షుడగు కుబేరుడు కాంతిచే వేషముచే నెల్ల సురాసురుల నాప్యాయన మొంద జేయుచు పుష్పక విమాన మెక్కి యరుగు దెంచెను. నవరత్న విచిత్ర విమాన మెక్కి చామన చాయ మేనివాడు సువిచిత్ర వేషుడు పరిమళ పుష్ప మాలను ధరించి సుధాంశు డరుదెంచెను. పర్వతముల వలెనున్న విష్ణువు గదం దాల్చి గరుడు నెక్కి యేగు దెంచెను. పరమ సుందరులు దేవలోక భిషగ్వరులు అశ్వినీ దేవత లిరువురు నొక్కటే విమాన మెక్కి ముచ్చట గొల్పు వేషములతో నటకు వచ్చిరి. అగ్ని వర్ణమైన విమాన మెక్కి జ్వలనార్క ప్రభతో నాగ పరివారముతో సహస్ర ఫణామణి మండలుడగు నాగేంద్రు డప్పు డేతెంచెను.

దితేః సుతానాంచ మహాసురాణాం వహ్న్యర్క శక్రానిలతుల్యభాసామ్‌

వరానురూపం ప్రవిధాయ వేశం బృందం సమాగాత్‌ పురతః సురాణామ్‌

గంధర్వరాజః సచ చారురూపీ దివ్యాంగదో దివ్యవిమాన చారీ

గంధర్వ సంఘైః సహితోప్సరోభిః శక్రాజ్ఞయా తత్రసమాజగామ

అన్యేచ దేవా స్త్రిదివా స్తదానీం పృథక్‌ పృథక్‌ చారుగృహీతవేశాః

ఆజగ్మురారుహ్య విమానపృష్ఠం గంధర్వయక్షోరగకిన్న రాశ్చ

శచీపతిస్తత్ర సురేంద్రమధ్యే రరాజ రాజాధికలక్ష్యమూర్తిః

ఆజ్ఞాబలైశ్వర్యకృతప్రమోదః స్వయం వరం తం సమలం చకార

హేతుస్త్రిలోకస్య జగత్ప్రసూతే ర్మాతా చ తేషాం ససురాసురాణామ్‌

పత్నీచ శంభోః పురుషస్య సాక్షాత్‌ గీతా పురాణే ప్రకృతిః పరా యా

దక్షస్య కోపా ద్ధిమవద్గృహం సా కార్యార్థ మాయా త్త్రిదివౌకసాం హి

విమానపృష్ఠేమణిహేమజుష్టే స్థితా పలచ్చామరవీజితాంగీ

సర్వర్తుపుష్పాం సుసుగంధమాలాం ప్రగృహ్య దేవీ ప్రసభం ప్రతస్థే

పెండ్లి కుమారులట్ల లంకరించు కొని బృందారక బృంద మేతెంచెను. గంధర్వ రాజు తన సంఘముతో నప్సరసలతో నింద్రాజ్ఞంగొని యమ్ముచ్చటం గనుగొన వచ్చెను. మఱి కిన్నర కింపురుష నాగ గణంబులు వచ్చిరి. అందరిలో నమరేంద్రుడు శచీపతి చూడ ముచ్చటైన సొంపున వెలింగెను. సురాసుర జనని శంభుపత్ని యని పురాణము లందు గీర్తింప బడినది పరాప్రకృతి మున్ను దక్ష కోపమునకు గురియై హిమవంతు నింటికి కార్యావసరము గొని వచ్చినది. దివ్య విమాన మందు దేవకాంతలు వింజామరలు వీవ సర్వ ఋతువు లందలి పువ్వులతో సంతరింప బడిన మాలంగొని సత్వరముగ నామె స్వయంవరమునకు బయలు దేరెను.

బ్రహ్మ:

మాలాం ప్రగృహ్య దేవ్యాం తు స్థితాయాం దేవసంసది

శక్రాద్యై రాగతై ర్దేవై స్స్వయంవర ముపాగతే

దేవ్యా జిజ్ఞాసయా శంభు ర్భూత్వా పంచశిఖ శ్శిశుః

ఉత్సంగతలసంసుప్తో బభూవ సహసా విభుః

తతో దదర్శ తం దేవీ శిశుం పంచశిఖం స్థితమ్‌

జ్ఞాత్వా తం సమవధ్యానా జ్జగృహే ప్రీతిసంయుతా వ

అథ సా శుద్ధసంకల్పా కాంక్షితం ప్రాప్య సత్పతిమ్‌

నివృత్తా చ తదా తస్థౌ కృత్వా సా హృది తం విభుమ్‌

తతో దృష్ట్వా శిశుం దేవా దేవ్యా ఉత్సంగవర్తినమ్‌

కోయ మత్రేతి సంమంత్ర్య చుక్రుశు ర్భృశమోహితాః

వజ్ర మాహారయ త్తస్య బాహు ముత్క్షిప్య వృత్రహా

బాహు రభ్యుత్థిత స్తస్య తథైవ సమతిష్ఠత

స్తంభితః శిశురూపేణ దేవదేవేన శంభునా

వజ్రం క్షేప్తుం న శశాక వృత్రహా చలితుం నచ

భగోనామ తతో దేవ ఆదిత్యః కాశ్యపో బలీ

ఉతిక్షప్య ఆయుధం దీప్తం ఛేత్తు మిచ్ఛన్‌ విమోహితః

తస్యాపి భగవాన్‌ బాహుం తథైవా స్తంభయ త్తదా

బలం తేజశ్చ యోగశ్చ తథై వాస్తంభయ ద్విభుః

శిరః ప్రకంపయన్‌ విష్ణుః శంకరం సమవైక్షత

అథ తేషు స్థితే ష్వేవం మన్యు మత్సు సురేషు చ

అహం పర మసంవిగ్నో ధ్యాన మాస్థాయ సాదరమ్‌

బుద్ధవాన్‌ దేవదేవేశ ముమోత్సంగే సమాస్థితమ్‌

జ్ఞాత్వా హం పరమేశానం శీఘ్ర ముత్థాయ సాదరమ్‌

వవందే చరణం శంభోః స్తుతవాం స్తమహం ద్విజాః

పురాణై స్సామసంగీతైః పుణ్యాఖ్యైః గుహ్యనామభిః

బ్రహ్మ:

అట్ల రుదెంచు గిరిరాజ కన్యంగని యామెను బరీక్షింప నెంచి శంభుడు పంచ శిఖల ముచ్చట గొల్పు శిశువై యాదేవి యొడిలో నల్లన నిదురించెను. ఆదేవి చూచి ప్రీతినంది యా రహస్యంబు గ్రహించి దానభిలషించిన పతిగా నెఱింగి యా పాపనిం దన హృదయ మందు నిలిపి స్వయంవర మండపము నుండి వెనుదిరిగి వెళ్ళి పోయెను. ఎవడీ శిశువు? ఇచటి కెట్లు వచ్చినాడు! అని మిక్కిలి మోహపడి సురలు కేకలిడిరి. ఇంద్రుడు వజ్రంబూని నిలువబడి యా శిశువుచే నపుడ స్తంభితుండయ్యె. భగుడెత్తిన చేయి యెత్తి నట్లయుండె. విష్ణువు శిరః కంపనమును జేయుచు శంకరుని వంక జూచెను. అపుడు నేను (బ్రహ్మ) కలత బడి ధ్యానమున నిలిచి యా క్షణ మయాదేవి యొడిలోని బాలుడు బాలేందుధరుడని గ్రహించితిని. తెలిసి నంత లేచి నిలువబడి యా దేవదేవు చరణములకు మ్రొక్కి పురాణములచే సామ సంగీతములచే గుహ్యము లయిన పుణ్య నామావళిచే పెక్కు రీతులం బొగిడితిని.

బ్రహ్మకృత శివస్తుతి

అజ స్త్వ మజరో దేవో విభుః స్రష్టా పరాపరః

ప్రథానం పురోషో యస్త్వం బ్రహ్మ ధ్యేయం తదక్షరమ్‌

అమృతం పరమాత్మా చ ఈశ్వరః కారణం మహత్‌

బ్రహ్మసృక్‌ ప్రకృతేః స్రష్టా నర్వకృ త్ప్రకృతేః పరః

ఇయంచ ప్రకృతి ర్దేవీ సదా తే సృష్టికారణమ్‌

పత్నీరూపం సమాస్థాయ జగత్కారణ మాగతా

నమ స్తుభ్యం మహాదేవ మహాదేవ్యా యుతాయచ

ప్రసాదా త్తవ దేవేశ నియోగా చ్చ మయా ప్రజాః

దేవాద్యా స్తు ఇమాః సృష్టా మూఢా స్త్వద్యోగమాయయా

కురు ప్రసాద మేతేషాం యథాపూర్వం భవం త్విమే

తత ఏవ మహం విప్రా విజ్ఞాప్య పరమేశ్వరమ్‌

స్తంభితాన్‌ సర్వదేవాం స్తా నిదం చాహం తదోక్తవాన్‌

మూఢాశ్చ దేవతాః సర్వా నైనం బుధ్యత శంకరమ్‌

గచ్ఛధ్వం శరణం శీఘ్ర మేన మేన మహేశ్వరమ్‌

సార్థం మయైవ దేవేశం పరమాత్మాన మవ్యయమ్‌

తత స్తే స్తంభితాః సర్వే తథైవ త్రిదివౌకసః

ప్రణేము ర్మనసా శర్వం భావశుద్ధేన చేతసా

అథ తేషాం ప్రసన్నో భూ ద్దేవదేవో మహేశ్వరః

యథాపూర్వం చకారాశు దేవతానాం తనూ స్తదా

తత ఏవం ప్రవృత్తే తు సర్వదేవనివారణే

వపు శ్చకార దేవేశ స్త్ర్యక్షం పరమ మద్భుతమ్‌

తేజసా తస్య తే ధ్వస్తా శ్చక్షుః సర్వే న్యమీలయన్‌

తేభ్యః స పరమం చక్షుః స్వవపుర్‌ దృష్టిశక్తిమత్‌

ప్రాదాత్‌ పరమదేవేశ మపశ్యం స్తే తదా విభుమ్‌

తే దృష్ట్వా పరమేశానం తృతీయేక్షణధారిణమ్‌

శక్రాద్యా మేనిరే దేవాః సర్వ ఏవ సురేశ్వరాః

తస్య దేవీ తదా హృష్టా సమక్షం త్రిదివౌకసామ్‌

పాదయోః స్థాపయామాస తాం మాలా మమితద్యుతిః

సాధుసాధ్వితి తే హోచుః సర్వే దేవాః పున ర్విభుమ్‌

సహదేవ్యా నమ శ్చక్రుః శిరోభి ర్భూతలాశ్రితైః

అథా స్మి న్నంతరే విప్రా స్త మహం దేవతైస్సహ

హిమవంతం మహాశైల ముక్తవాం శ్చ మహాద్యుతిమ్‌

శ్లాఘ్యః పూజ్య శ్చ వంద్య శ్చ సర్వేషాం త్వం మహా నసి

శర్వేణ సహ సంబంధో యస్య తేభ్యుదయో మహాన్‌

క్రియతాం చారు రుద్వాహః కిమర్థం స్థీయతే పరమ్‌

తతః ప్రణమ్య హిమవాం స్తదా మాం ప్రత్యభాషత

ఇట్లు పరమేశ్వరుని నుతించి స్తంభించిన దేవతలం గని మీరీ పాపని శంకరుడని యెఱుంగ లేరైరి. పొండు! శరణ మందుడు. నేను మీతో శరణా గతుండ నయ్యెద నన నాత్రిదశులు భావ శుద్ధితో నా శర్వుని కానతు లైరి. శీఘ్ర ప్రసన్నుడు కాన స్వామి, వారి యెడ జాలివడి యందరిని మున్నట్లు స్వస్థులం జేసెను ఇది యైయిన వెనుక నీశ్వరుడు త్రిలోచనములతో కూడిన అద్భుతమైన శరీరము దాల్చెను. ఆ తేజమునకు వారు కనులు మిరుమిట్లు గొన జూడలేక కనులు మూసి కొనిరి. ఆయన వారికి తన మూర్తి జూడ ననువైన చూపు ననుగ్రహించెను వారుం దాన నా యీశ్వరుం జూచి యాయన నిట లాక్షుండని యెఱింగిరి. వారందరు కనుగొను చుండ నప్పుడ యద్దేవి యా దేవదెవు పాదమ్ముల స్వయంవర మాల నలంకరించెను. “బాగు బాగు” అని యెల్ల వేల్పులు నుతించిరి. ఆ దేవితో గూడ తలలు వాల్చి నమస్కరించిరి. అపుడు నేను హిమవంతునితో నిట్లంటిని. “పూజనీయుడ వైవు వందనము సేయ దగుదువు. ఈశ్వరుని తోడి సంబంధ మిది నీ భాగ్యమ్ము కానిమ్ము. కల్యాణ మహోత్సవమున కెందులకు విలంబము” అన హిమవంతుడు మ్రొక్కి యిట్లనియె.

త్వ మేవ కారణం దేవ యస్య సర్వేదయే మమ

ప్రసాదః సహసోత్పన్నో హేతు శ్చాపి త్వ మేవ హి

ఉద్వాహస్తు యదా యాదృక్‌ తద్విధత్స్వ పితామహ

దేవా! నా అభ్యుదయమున కెల్ల నీవె కారణము. అనుకొనని యనుగ్రహ మిది. నా కొదవినది పితామహ! వివాహ మెట్లు ఎపుడు సేయ నగునో యదెల్ల నీవ నడుప వలయును. అన విని నేను యిట్లంటిని.

కల్యాణ సన్నాహః

బ్రహ్మ:

తత ఏవం వచః శ్రుత్వా గిరిరాజస్య భోద్విజాః

ఉద్వాహః క్రియతాం దేవ ఇత్యహం చోక్తవాన్‌ విభుమ్‌

మా మాహ శంకరో దేవో యధేష్ట మితి లోకపః

తత్క్షణా చ్చ తతో విప్రా ఆస్మాభి ర్నిర్మితం పురమ్‌

ఉద్వాహార్థం మహేశస్య నానారత్నోపశోభితమ్‌

రత్నాని మణయ శ్చిత్రా హేమమౌక్తిక మేవచ

మూర్తిమంత ఉపాగమ్య అలంచక్రుః పురుషోత్తమమ్‌

చిత్రా మారకతీ భూమిః సువర్ణస్తంభశోభితా

భాస్వత్‌ స్ఫటికభిత్తిశ్చ ముక్తాహారప్రలంబితా

తస్మిన్‌ ద్వారి పురే రమ్య ఉద్వాహార్థం వినిర్మితా

శుశుభే దేవదేవస్య మహేశస్య మహాత్మనః

సోమాదిత్యౌ సమం తత్ర తాపయంతౌ మహామణీ

సౌరభేయం మనోరమ్యం గంధ మాదాయ మారుతః

ప్రవవౌ సుఖసంస్పర్శో భవభక్తిం ప్రదర్శయన్‌

సముద్రా స్తత్ర చత్వారః శక్రాద్యా శ్చ సురోత్తమాః

దేవనద్యో మహానద్యః సిద్ధా మునయ ఏవచ

గంధర్వాప్సరసః సర్వే నాగా యక్షాః సరాక్షసాః

ఔదకాః ఖేచరా శాన్యే కింన్నరా దేవచారణాః

తుంబురు ర్నారదో హాహా హూహూ శ్చైవ తు సామగాః

రమ్యాణ్యాదాయవాద్యానితత్రాజగ్ము స్తదాపురమ్‌

ఋషయస్తు కథా స్తత్ర వేదగీతా స్తపోధనాః

పుణ్యాన్‌ వైవాహికా న్మంత్రాన్‌ జేపు స్సంహృష్ట మానసాః

జగతో మాతర స్సర్వా దేవకన్యాశ్చ కృత్స్నశః

గాయంతి హర్షితా స్సర్వా ఉద్వాహే పరమేష్ఠినః

శివకల్యాణే షడృతు సమాగమః తత్రవర్షర్తుః

ఋతవష్షట్‌ సమం తత్ర నానాగంధసుఖావహాః

ఉద్వాహ శ్శంకర స్యేతి మూర్తిమంత ఉపస్థితాః

నీలజీమూత సంకాశై ర్మంత్రధ్వని ప్రహర్షిభిః

కేకాయమానైః శిఖిభి ర్నృత్యమానై శ్చ సర్వశః

విలోల పింగల స్పష్ట విద్యుల్లేఖా విహాసితా

కుముదాపీడ శుక్లాభి ర్వలాకాభి శ్చ శోభితా

ప్రత్యగ్ర సంజాత శిలీంద్రకందలీలతాద్రుమాద్యుద్గత పల్లవా శుభా

శుభాంబుధారా ప్రణయప్రబోధితై ర్మహాలసై ర్భేకగణై శ్చ నాదితా

ప్రియేషు మానోద్ధతమానసానాం మనస్వినీనా మపి కామినీనామ్‌

మయూరకేకాభిరుతైః క్షణేన మనోహరై ర్మానవిభంగ హేతుభిః

తథా వివర్ణోజ్జ్వలచారుమూర్తినా శశాంకలేఖాకుటిలేన సర్వతః

పయోదసంఘాత సమీపవర్తినా మహేంద్రచాపేన భృశం విరాజితా

విచిత్ర పుష్పాంబుభవై స్సుగంధిభి ర్ఘనాంబు సంపర్కతయా సుశీతలైః

వికంపయంతీ పవనై ర్మనోహరై స్సురాంగనానా మలకావలీ శ్శు భాః

గర్జత్పయోదస్ధగితేందుబింబా నవాంబుసిక్తోదకచారుదూర్వా

నిరీక్షితా సాదర ముత్సుకాభి ర్నిశ్వాస ధూమ్రంపథికాంగనాభిః

హంసనూపురశబ్దాఢ్యా సమున్నతపయోధరా

చలద్విద్యు ల్లతాహారా స్పష్టపద్మవిలోచనా

ఆసిత జలదధీరధ్వాన విత్రస్తహంసా విమల సలిలధారో త్పాతనమ్రోత్పలాగ్రా

సురభి కుసుమ రేణు క్లప్త సర్వాంగ శోభా గిరిదుహితృవివాహే ప్రావృ డావిర్బభూవ

హిమవంతుని మాటవిని శివునితో “వివాహ మగు గాక” అని నేననగా నా లోకేశు డగు శంకరుడ ట్లేయగు గాక! అనగా మేమందరము నందమైన కల్యాణ పురము నిర్మించితిమి. నవ రత్నములు మూర్తిని ధరించి కల్యాణ వేదికను స్వయముగ నలంకరించి నవి. అందలి కుడ్యములు స్ఫటికములు భూమి మరకత మాణిక్య మయము. స్తంభములు స్వర్ణ మయములు. ద్వారము లందు ముక్తా హారములు తమంత వ్రేలినవి. అమ్మణుల జిగ జిగ మెఱయించుచు నమ్ముందు సోమ సూర్యులు స్వప్రభల వెలయించిరి. శివభక్తిని ప్రకటించుచు వాయువు మనోహర పరిమళముల వెదజల్లుచు నందందు వాహ్యాళి వెడలెను. చతు స్సముద్రములు శక్రాది సురలు దేవ నదులు మహా నదులు సిద్ధులు మునులు గంధర్వాప్సరో యక్ష రాక్షస నాగ కిన్నర చారణలు జల చరులు ఖేచరులు తుంబు నారదులు హాహా హూహూ ప్రముఖ దేవ గాయదులు రమ్య మంగళ వాద్యములు గొని యమ్మండపమునకు వచ్చిరి. ఋషులు వేద గీతములు మేళవించిరి. జగన్మాతలు దేవ కన్యలు పాటలు పాడిరి. అప్సరస లాటలాడిరి. ఆఱు ఋతువులు నానా సువాసనల సుఖావహములై మూర్తిమంతులై హిమవంతుని యింటి కేతెంచి యీశ్వరు నుపచరించినవి. వర్షర్తు సమాగమము మంత్ర ధ్వని గర్జములతో నీల జీమూత ప్రభలతో కేకారవ మనోహర మయూర నృత్యములతో విలోల పింగళ రుచి విలాసి విద్యుల్లతా దకచకద్యుతులతో కుముద కుసు మాపీడ శుక్లములగు బలాక మాలికలతో నపుడ పొడమిన శిలీంధ్ర కందళీ లతా ద్రుమ హృద్యతర పల్లవ మంజరులతో చల్లని వానధారల కలరి మేల్కొని సేయు కప్ప యరుపులతో, మానవతు ప్రియు యెడ పొలియలు వాసి తమంత ప్రియుల కౌగిలికిం దార్చు ముచ్చటలతో నును మబ్బుల చాటున నల్లనల్లన తొంగి చూచు శశిరేఖ సొగసుతో మేఘము చాయ చాయగులుకు నింద్ర చాపము చూపు సొంపుతో చిత్ర విచిత్ర సుమ పరిమళములచే భావితంబయి మధుర వాసనల చింత చల్లని జల సంపర్కము నంది వీచు మనోహర మంద మందానిలములచే నల్లనల్లనంగదలు సురాంగనల లలితాలకటనములతో గర్జించు మేఘములు గ్రమ్మిన యిందుబింమ్ము డంబరముతో తొలకరి వాన చినుకులు ముత్యాల మురు గొని పచ్చలు దాపిన్ల మెఱయు గరిక దుబ్బులు నబ్బురము గొల్పు పచ్చని కాంతులతో హంస నూపురంబులతో సమున్నత పయోధర శాలినియై వర్షఋతు సుందరి సుందరపు కల్యాణ మండపము నలంకరించెను. నీలమేఘ గర్జనలకు హంసలు బెదరినవి. స్వచ్ఛములైన సలిల ధారలకు కలువలు వినమ్రము లైనవి. పరిమళ కుసుమ కింజల్క పరాగ పరిభూషి తాంగియై వర్ష ఋతువు పార్వతీ వివాహమునకు తనను ముస్తాబు చేసికొనెను.

శరద్దృతుః

మేఘకంచుక నిర్ముక్త పద్మకోశోద్భవస్తనీ

హంస నూపుర నిర్హ్రాదా సర్వశస్యదిగంతరా

విస్తీర్ణ వులినశ్రేణీ కూజత్సారసమేఖలా

ప్రపుల్లేందీవర శ్యామ విలోచన మనోహరా

పక్వబింబాధరపుటా కుందదంత ప్రహాసినీ

నవశ్యామలతాశ్యామ రోమరాజిపురస్కృతా

చంద్రాంశుహారవర్గేణ కఠోరస్థలగామినా

ప్రహ్లాదయంతీ చేతాంసి సర్వేషాం త్రిదివౌకసామ్‌

సమదాలికులోద్గీత మధురస్వరభాషిణీ

చలత్కుముదసంఘాత చారుకుండలశోభినీ

రక్తాశోక ప్రశాఖోత్థ పల్లవాంగుళి ధారిణీ

తత్పుష్ప సంచయమయై ర్వాసోభి స్సమలంకృతా

రక్తోత్పలాగ్రచరణా జాతి పుష్పనభావళీ

కదలీస్తంభవామోరుః శశాంకవదనా తథా

సర్వలక్షణసంపన్నా సర్వాలంకారభూషితా

ప్రేవ్ణూ స్పృశతి కాంతేవ సానురాగా మనోరమా

నిర్ముక్తాసితమేఘకంచుకపటా పూల్ణేందు బింబాననా

నీలాంభోజ విలోచనా రవికర ప్రోద్భిన్న పద్మస్తనీ

నానాపుష్పరజస్సుగంధిపవనప్రహ్లాదినీ చేతసాం

తత్రా సీత్‌కలహంసనూపురరవా దేవ్యావివాహేశరత్‌

శరద్దృతువు

ఆ పైని శరద్దృతు లక్ష్మి మేఘ కంచుకము దొలగించు కొని పద్మకోశకుచ శోభయై హంస నూపుర మనోహరయై దిశలు తెలివిగొన విస్తీర్ణము లైన సైకతములు పిరుదులుగా మధు రకూజిత హంస మేఖలయై వికసించిన నల్ల కలువ లనెడి నయనముల సొంపుతో పండిన దొండ పండనెడి యధర శోభతో మొల్ల మొగ్గ లనెడి దంత కాంతితో వినూత్న శ్యామ లతికా వినీల రోమరాజితో చంద్రాంశు గౌరహార వితానముతో సర్వ బృందారక బృంద హృదయా రవిందము లనుల్లాస పరచుచు శరద్దృతు లక్ష్మి మనోహర మత్త భ్రమరకుల కలగీత స్వర భాషిణియై చలత్కుముద చారుకుండల మండితయై రక్తాశోక శాఖా నిర్గత లలిత సుకుమార పల్లవాంగుళియై పలు వన్నెల పూలచీర దాల్చి రక్తో త్పలాగ్ర చరణయై జాతీ పుష్ప సఖన వ్యనఖ రుచియై రంభా స్తంభర మణీయోరు రుచియై చంద్ర వదనయై సర్వా లంకార భూషితయై సర్వ లక్షణ లక్షితయై నిర్ముక్త నీలమేఘ కంచు కాంచిత వసనయై పూర్ణేందు బింబ ప్రతిబింబ వదనయై సానురాగ యగు నాయిక వోలె నీలాంభోజ లలిత నయనయై రవిక రవిక చకమల సుస్తనియై నానా కుసుమ రజః పరిమళ పవన ప్రహ్లాదినియై కల హంస నూపుర రవభవ్యయై గిరి సుత కల్యాణ మునకు శరద్దృతు లక్ష్మి తన్ను సింగారించు కొని వచ్చెను.

హేమంత శిశిరౌ

అత్యర్థ శీతలాంభోభిః ప్లావయంతౌ దిశ స్సదా

ఋతూ హేమంతశిశిరౌ ఆజగ్మతు రతిద్యుతీ

తాభ్యా మృతుభ్యాం సంప్రాప్తో హిమవాన్‌ స నగోత్తమః

ప్రాలేయచూర్ణవర్షిభ్యాం క్షిప్రంరౌప్యహరో బభౌ

హేమంత శిశిరములు

అవ్వల మిక్కిలి చలువల వెదజల్లు జలముల మించుచు మేమంత శశిర ఋతు దేవతలు ఆ వివాహమునకు వచ్చిరి. హిమవంతుడు ఆ ఋతు విలాసినులు ప్రాలేయ చూర్ణముల వర్షించు చుండ రజత హర్తపగిది రాణించెను.

తేన ప్రాలేయవర్షేణ ఘనే నైవ హిమాలయః

 అగాధేన తదా రేజే క్షీరోద ఇవ సాగరః

ఋతుపర్యాయసంప్రాప్తో బభూవ స మహాగిరిః

 సాధూపచారాత్‌ సహసా కృతార్థ ఇవ దుర్జనః

ప్రాలేయ పటలచ్ఛన్నైః శృంగై స్తు శుశుభే నగః

 ఛత్రైరివ మహాభాగైః పాండరైః పృథివీపతిః

అమ్మంచు సోనలచే ఘనీ భావము నంది హిమవంతుడు చూపరులకు క్షీర సాగరమట్లు మవోహరు డాయెను. ఒకానొక దుర్జనుడు సాధు పరిచర్యఁ జేసి కృతార్థు డైనట్లు ఆధరాధర సార్వభౌముడు హేమంత శిశిర పర్యాయ శోభచే నింపు కొల్పెను. మంచు గవిసిన మహిత శృంగములచే శ్వేత ఛత్ర ఛాయలో నున్న చక్రవర్తి యట్లు వెలుగొందెను.

వసంతర్తు సమాగమః

మనోభవోద్రేకకరాః సురాణాం సురాంగనానాం చ ముహుః సమీరాః

స్వచ్ఛాంబు పూర్ణా శ్చ తథా నలిన్యః పద్మోత్పలానాం కుసుమై రుపేతాః

వివాహే గురుకన్యాయా వసంత స్సమగా దృతుః

ఈషత్సముద్భిన్న పయోధరాగ్రా నార్యో యథా రమ్యతరా బభూవుః

నాత్యుష్ణశీతాని పయస్సరాంసి కింజల్కచూర్ణైః కపిలీకృతాని

చక్రాహ్వ యుగ్మై రుపనాదితాని యయుః ప్రహృష్టాః సురదంతి ముఖ్యాః

ప్రియంగూం శ్చూతతరవ శ్చూతాం శ్చాపి ప్రియంగవః

 తర్జయంత ఇవా న్యోన్యం మంజరీభి శ్చకాశిరే

హిమశృంగేషు శుక్లేషు తిలకాః కుసుమోత్కరైః

 శుశుభుః కార్య ముద్దిశ్య వృద్ధా ఇవ సమాగతాః

పుల్లాశోక లతా స్తత్ర రేజిరే సాలసంశ్రితాః

 కామిన్య ఇవ కాంతానాం కంఠాలంబితబాహవః

తస్మి నృతౌ శుభ్రకదంబనీపా స్తాలా స్తమాలా స్సరలాః కపిత్థాః

అశోక సర్జార్జున కోవిదారాః పున్నాగనాగేశ్వర కర్ణికారాః

లవంగతాలాంగురు సప్తపర్ణా న్యగ్రోధ శోభాంజన నారికేలాః

వృక్షా స్తథా న్యే ఫలపుష్పవంతో దృశ్యా బభూవు స్సుమనోహరాంగాః

జలాశయా శ్చైవ సువర్ణతోయా శ్చక్రాంగకారండవహంసజుష్టాః

కోయష్టి దాత్యూహ బలాకయుక్తా దృశ్యా స్తు పద్మోత్పల మీనపూర్ణాః

ఖగా శ్చ నానావిధ భూషితాంగా దృశ్యాస్తు వృక్షేషు సుచిత్రపక్షాః

క్రీడాసు యుక్తా నథ తర్జయంతః కుర్వంతి శబ్దం మదనేరితాంగాః

తస్మిన్‌ గిరా వద్రిసుతా వివాహే వవు శ్చ వాతాః సుఖశీతలాంగాః

పుష్పాణి శుభ్రాణ్యపి పాతయంతః శనై ర్నగేభ్యో మలయాద్రి జాతాః

తథైవ సర్వే ఋతవశ్చ పుణ్యా శ్చకాశిరే న్యోన్య విమిశ్రితాంగాః

యేషాం సులింగాని చ కీర్తితాని తే తత్ర ఆసన్‌ సుమనోజ్ఞరూపాః

వసంత సమాగమము

వసంతుడును గిరికన్య కల్యాణమునకు వచ్చెను. సురల కుసురాంగనలకు మదనోద్రేక కరములైన మంద మంద మలయా నిలములును స్వచ్ఛాఁబు పూరముల నించుచు సరస్సులును సరసి జోత్పల సంభారముల బూని విమల రస పూర్ణములై ముత్తైదువు లపగిది ముస్తాబు చేసికొని పార్వతి పెండ్లి పేరంటమునకు వచ్చెను. ఇంచించుక స్ఫుట మగుచున్న పయోధ రాగ్రములచే (మేఘములచే) దర్శనీయ లగు కుమారి కలట్లు మిక్కిలి శోభించెను. నాత్యుష్ణ శీతము లైనవై, కుసుమ కింజల్క చూర్ణ కపిశీ కృతములై చక్రవాకముల జంటల కలకలా రావములచే ప్రతిధ్వను లీనుచు సరస్సులు ముచ్చుట గొల్పెను. ఐరావతాది దిగ్గజములు లలిత గమనముతో ఆనందో త్కటము లయి యద్రికన్య ఉద్వాహ మునకు నడచెను. ప్రియంగు వృక్షము లామ్ర వృక్షములను అన్యోన్యము బెదరించు కొను చున్నవా యన్నట్లు కుసుమ మంజరులతో హృదయ రంజకము లయ్యెను. తెల్లని హిమ శృంగము లందు కుసుమిత ములైన తిలక వృక్షములు శుభ కార్యమని యెంచి వచ్చిన వృధ్ధ జనమో యనునట్లు భాసించెను. పుల్లాశోక లతికలు సాల తరువుల గౌగిలించుకొని కాముకుల కంఠమును గౌగలించు కొను కామినీ జనమట్లు చూడ ముచ్చట గొలిపెను. ఆ వసంత వేళ కదంబనీప తాళ తమాల సరళ కపిత్థ అశోక, సజ్జ అర్జున కోవిదార పున్నాగ నాగేశ్వర కర్ణికార లపంగ కాలాగురు సప్తవర్ణ న్యగ్రోధ శోభాంజన నారికేళ ప్రముఖ సకల వృక్ష కదంబము పూలతో పండ్లతో మనోహర కుసుమాంగ రాగములతో హృదయంగ మము లయ్యెను. చిత్ర విచిత్ర వర్ణము లయిన రెక్కలచే టిట్టిభక కలవింక బలాకాది జల విహంగములతో పద్మోత్పల మీనములతో గూడిన సరస్సులనుండి సుశీతల సుగంధ వాయువులు కొమ్మల రెమ్మలం గదలించి రాల్చిన పూవులతో నగ కుమారి వివాహ మండప ప్రాంత భూములు పరస్పర సమ్మేళన మందిన ఋతువుల చిహ్నములతో శోభా వహములై రాజిల్లెను.

సమదాలికులలో ద్గీత శిలాకుసుమ సంచయైః

 పరస్పరం హి మాలత్యో భావయంత్యో విరేజిరే

నీలాని నీలాంబురుహైః పయాంసి గౌరాణి గౌరైశ్చ దండైః

రక్తైశ్చ రక్తాని భృశం కృతాని మత్తద్ద్విరేఫా వలిజుష్ట పత్రైః

హేమాని విస్థీర్ణ జలేషు కేషుచి న్నిరంతరం వారుతరాణి కేషుచిత్‌

వైదూర్యనాలాని సరస్సు కేషు చిత్ప్ర జజ్ఞిరే పద్మవనాని సర్వతః

వాప్య స్తత్రా భవన్‌ రమ్యాః కమలోత్పల పుష్పితాః

 నానావిహంగ సంజుష్టా హైమసోపాన పంక్తయః

శృంగాణి తస్య తు గిరేః కర్ణికారైః సుపుష్పితైః

సముచ్ఛ్రితా న్యవిరలై ర్హైమానీవ బభు ర్థ్విజాః

ఈషద్విభిన్నకుసుమైః పాటలై శ్చాపి పాటలాః

 సంబభూవు ర్దిశః సర్వాః వవనాకంపిమూర్తిభిః

కృష్ణార్జునా దశగుణా నీలాశోక మహీరుహాః

 గిరౌ వవృధిరే ఫుల్లాః స్పర్థయంతః పరస్పరమ్‌

చారురాప విజుష్టాని కింశుకానాం వనానిచ

 పర్వతస్య నితంబేషు సర్వేషు చ విరేజిరే

తమాలగుల్మై స్తస్యా సీచ్ఛోభా హిమవతస్తదా

 నీలజీమూతసంఘాతైర్నిలీ నైరివ సంధిషు

అట సమద షట్పద కుల గీతములు మంగళ గీతము లయ్యెను. తుమ్మెదలు ముసరిన కలువలచే నల్లనివై, తెల్లని మృణాల లతలచే తెల్లనివై రక్తారవిందములచే రక్తములై సరోవర నీరములు నయన మనోహర ములయ్యెను. కొన్ని కొలనులు బంగారు తామర పూవుల నలముకొని మిక్కిలి సొంపు నింపు చుండెను. కొన్ని యెడల వైడూర్య మణి నాళమయ ములై కమల వనములు విలసిల్లెను. హేమసోపా పంక్తులతో నానా విహంగ కలకూజితములతో కమలోత్పల వనములతో గూడిన దిగుడు బావులు భావ మధురములయి రాణించెను. కుసుమిత కర్ణికారములతో నీహారాద్రి సమున్నత శృంగములు హేమమయము లట్లు రంజిల్లెను. ఇంచు కించుకగ విప్పారి అల్ల నల్ల వీచు గాలులకు కదులుచు నెత్తావుల నించు పాటల కుసుమములచే దెసలు పాటలము లయ్యెను. (ఎఱుపెక్కెను) నిండ బూసిన కృష్ణ తరువులు, అర్జునములు నీలా శోకములు నల్లనల్లన విరియు విరుల తోడి యందమున స్పర్థగొని యెండొరుల మించి శోభిల్లినవి. గిరి నితంబము లందెల్లెడ వీచు గాలుల కూగుచు హోరు మని మ్రోతనించు కింశుకము వనములు అంత రాంతరముల నీల మేఘ సంఘాతములు క్రమ్ము కొన్నవా యనిపించు తమాలతరు కుంజములచే నచ్చమైన హిమగిరి చూడ ముచ్చట యయ్యెను.

నికామపుష్పై స్సువిశాలశాఖై స్సముచ్ఛ్రతై శ్చందనచంపకైశ్చ

ప్రమత్తపుంస్కోకిలసంప్రలాపై ర్హిమాచలో తీవ తదా రరాజ

శ్రుత్వా శబ్దం మృదుమదకలం సర్వతః కోకిలానాం

చంచత్పక్షా స్సుమధురతరం నీలకంఠా ­నేదుః

తేషాం శబ్దై రుపచితబలః పుష్పచాపేషు హస్తః

సజ్జీభూత స్త్రిదశవనితా వేద్ధు మంగే ష్వనంగః

పటు స్సూర్యాతప శ్చాపి ప్రాయశోల్పో జలాశయః

దేవీ వి­వాహ సమయే గ్రీష్మ ఆగా ద్ధిమాచలమ్‌

కొమ్మల రెమ్మల నిండ పూసి రాలిన పూవులతో చందనములతో చంపక ములతో ప్రమత్త పుంస్కోకిలాలాపములతో గిరిరాజు మిక్కిలి రంజిల్లెను. కోకిల లకల కూజితము లాలించి నీల కంఠములు పురి­ప్పి కేక లిడుచు నాట్యము లారంభించిన­. వాని సడి­ని పుప్ప బాణుండు పుష్టిగొని గీర్వాణాంగనల గురిచేసి వి­రి బాణములు ­విసర దొడగెను. ఎండ తీవ్రమై జలాశయము లెండి తనువులకు సుఖము నిండ నత్తఱి గ్రిష్మర్తువు గిరికన్య పెండ్లికి వచ్చి గిరిరాజు నుప చరించెను.

గ్రీష్మర్తు సమాగమ :

స చాపి తరుభి స్తత్ర బహుభిః కుసుమోత్కరైః

శోభయామాస శృంగాణి ప్రాలేయాద్రే స్సమంతతః

తథాపి చ గిరౌ తత్ర వాయవః సుమనోహరాః

వవుః పాటల వి­స్తీర్ణ కదంబార్జున గంధినః

వాప్యః ప్రపుల్ల పద్మౌఘకేసరారుణమూర్తయః

అభవం స్తటసంజుష్ట కలహంస కదంబకాః

తధా మరవకా శ్చాపి కుసుమాపూర్ణ మూర్తయః

సర్వేషు నగశృంగేషు భ్రమరావళిసే­తాః

వకుళా శ్చ నితంబేషు ­విశాలేషు మహీభృతః

ఉత్ససర్జ మనోజ్ఞాని కుసుమాని సమంతతః

ఇతి కుసుమ వి­చిత్ర సర్వ వృక్షాః ­­ధ ­హంగమనాదరమ్యదేశాః

హిమగిరి తనయా ­వాహభూత్యై

షడుపయుయూఋతవో మునిప్రవీరాః

తత ఏవం ప్రవృత్తే తు సర్వభూత సమాగమే

 నానావాద్య సమాకీర్ణే అహంం తత్ర ద్విజాతయః

శైలపుత్రీ మలంకృత్య యోగ్యాభరణసంపదా

 పురం ప్రవేశితవాం స్తాం స్వయ మాదాయ భో ద్విజాః

తత స్తు పున రేవేశ మహం చైవోక్తవాన్‌ ­విభుమ్‌

 హ­ ర్జుహోమి వహ్నౌ తే ఉపాధ్యాయపదే స్థితః

దదాసి మహ్యం యద్యాజ్ఞాం కర్తవ్యోయం క్రియా­ధిః

మా మాహ శంకర శ్చైవం దేవదేవో జగత్పతిః

మఱియు తరువుల నుండి ­విరుల రాల్చి ప్రాలేయ గిరి శృంగముల సింగారించెను. పాటల కుసుమ ­విస్తీర్ణ కదంబార్జున సుమనోహర వాయువులు చల్లగ వీచెను. దిగుడు బావులు ­కచకమల కేసర పుంజ రంజితములై యెఱుపెక్క దరుల కలహంస కదంబము లచ్చపు జిగి నెంతేని ముచ్చట గొలిపెను. పూల గోరింటలు పువ్వుల తెలినిగ్గుల నెఱనీటు గులుకు భ్రమరములకు వలపు గూర్చు చుండెను. హిమశైల ­శాలని తంబములం బొగడలు నలువంకల తావులు జిమ్ము పూవుల రాసులం గ్రుమ్మరించిన­. ఓముని ప్రవరులారా! వింటిరే ఇట్లారు ఋతువులు గౌరీ వి­వాహ కౌతుకమునకు కుతూహలము గొని కుసుమ విచిత్ర శృంగార తరులతా బృందముతో నందముగా నేతెంచిన­వి. మంగళ వాద్యములు మ్రోయ నిట్లు సాగిన కల్యాణ వైభవమున బ్రాహ్మణ సముదాయములతో శైలపుత్రిని సకలాభరణ భూషితం గావించి వెంటగొని నేను స్వయముగా పుర ప్రవేశముం జేయించితిని. అవ్వల నీశ్వరునితో నేను బ్రహ్మస్థాన మందుండి నీ ­వివాహ నిమిత్తముగ నగ్ని యందాజ్యాది హవిస్సులను హోమము నిర్వహించెద నాజ్ఞ యిమ్మని యడిగితిని.

శివుడు:

య దుద్దిష్టం సురేశాన! త త్కురుష్వ యథేప్సితమ్‌

కర్తా స్మి వచనం సర్వం బ్రహ్మం స్తవ జగద్విభో

శివుడు:

ఏమి చేయ నుద్దేశింప బడిన దదెల్ల నో సురేశ్వర! నీ యిష్టాను సారము గావింపుము, నీ వన్న యట్లంతయు నే నొనరింతును.

బ్రహ్మ:

తత శ్చాహం ప్రహృష్టాత్మా కుశా నాదాయ సత్వరమ్‌

హస్తం దేవ్యా శ్చ యోగబంధేన యుక్తవాన్‌

జ్వలన శ్చ స్వయం తత్ర కృతాంజలిపుటః స్థితః

శ్రుతి గీతై ర్మహామంత్రైః మూర్తిమద్భి రుపస్థితైః

యథోక్త ­విధినా హుత్వా సర్పిస్తద మృతం హవిః

తత స్తం జ్వలనం సర్వం కారయిత్వా ప్రదక్షిణమ్‌

ముక్త్వా హస్తసమాయోగం సహితః సర్వదేవతైః

పుత్రై శ్చ మానసై స్సిధ్ధైః ప్రహృష్టేనాంతరాత్మనా

వృత్త ఉద్వాహకాలే తు ప్రణమ్య చ వృషధ్వజమ్‌

యోగేనైవ తయో ర్విప్రాస్తదుమాపరమేశయోః

ఉద్వాహ స్స పరో వృత్తో యం దేవా న వి­దుఃక్వచిత్‌

ఇతి వ స్సర్వ మాఖ్యాతం స్వయంవర మిదం శుభమ్‌

ఉద్వాహశ్చైవ దేవస్య శృణుధ్వం పరమాద్భుతం

బ్రహ్మ:

అమ్మాట కానందబడి నేను కుశలంగొని యాద్దేవుని యొక్కయు దే­వి యొక్కయు హస్తములను యోగ బంధమున జత సేసితిని. శ్రుతి గీతము లయిన మహా మంత్రములు మూర్తి మంతములయి సన్నిధి సేయ నగ్నియు హ­ర్భాగముల స్వయముగా నందుకొన కృతాంజలి వుటుండయ్యె. యథావి­ధిగ నమృత రూపమైన హవి­స్సును హోమము చేసి సనాతనులయ్యు నూతను లయిన యా దంపతులు చేయి చేయి యుంగొని నగ్నికి ప్రదక్షిణము నొనరించి యవ్వల వారి చేయి ­విడిపింప సర్వ దేవతలు నామానస పుత్రులు సిద్ధులు ప్రహృష్టాంతరంగులై నన్న నుగమింప నందఱము వృష ధ్వజున కా పెండ్లి వేళ ప్రణామములు గావించితిమి. ఇట్లా సనాతన మిధునమునకు యోగము చేతనే యీ వివాహ మహోత్సవము జరిగినది. ఈ యందము మున్నెన్నడు దేవత లేని గాంచి యెఱుంగరు. ఈ మహేశ్వర స్వయంవర కల్యాణ వృత్తాంతము మీకెల్ల వి­నిపించితిని. ఇది సకల జగత్కల్యాణ కరము.