వ్యాసులు:
ప్రద్యుమ్నాద్యా హరేః పుత్రా రుక్మిణ్యాం కథితా ద్విజాః
భన్వాదికాంశ్చ వై పుత్రా స్సత్యభామా వ్యజాయత
దీప్తిమంతః ప్రపక్షాద్యా రోహిణ్యాస్తనయా హరేః
బభూవుర్జాంబవత్యాశ్చ సాంబాద్యా బాహుశాలినః
తనయా భద్రవిందాద్యా నాత్నజిత్యాం మహాబలాః
సంగ్రామజిత్ప్రధానాస్తు శైబ్యాయాం చాభవ న్సుతాః
వృకాద్యాస్తు సుతా మాద్రీ గాత్రవత్ప్రముఖాన్సుతాన్
అవాప లక్ష్మణాపుత్రా న్కాళింద్యాశ్చ శ్రుతాదయః
అన్యాసాం చైవ భార్యాణాంసంయుత్సన్నాని చక్రిణః
అష్టాయుతాని పుత్రాణాం సహ్రసాణి శతంతథా
ప్రద్యుమ్నః ప్రముఖస్తేషాం రుక్మిణ్యాస్తు సుతస్తతః
ప్రద్యుమ్నాదనిరుద్ధోభూ ద్వజ్రస్తస్మాదజాయత
అనిరుద్ధో రణేరుద్ధో బలేః పౌత్రీంమహాబలః
బాణస్య తనయాముషా ముపయేమే ద్విజోత్తమాః
యత్ర యుద్ధమభూద్ఘోరం హరిశంకరయోర్మహత్
ఛిన్నం సహస్రం బాహూనం యత్ర బాణస్య చక్రిణా
వ్యాసులు:
శ్రీకృష్ణునికి రుక్మిణి యందు గల్గిన ప్రద్యుమ్నాదులగు పుత్రులం దెల్పితిని. సత్యభామ యందు భానువు మొదలగు కుమారులు గల్గిరి. దీప్తి మంతుడు ప్రవక్షుడు మున్నగు వారు రోహిణి యందు గల్గిన తనయులు. సాంబాదులు జాంబవతి కుదయించిరి. నాగ్నజితి యందు భద్రవిందాదులు పుట్టిరి. శైబ్య యందు సంగ్రామ జిత్తు మొదలయిన కొడుకులు గల్గిరి. మాద్రి కుమారులు వృకాదులు. లక్ష్మణ గాత్ర వంతుడు మొదలగు వారిం గనెను. కాళిందికి శ్రుతాదు లుద యించిరి. మఱి యితర భార్యలందు చక్రికి ఎనిమిది అయుతములు నూరు వేలును కుమారులు జనించిరి. (అయుతము పదివేలు x 8 = 8000 + 100000 = అనగా ఒక లక్ష యెనుబది వేల మంది హరివంశ మన్న మాట) అందరిలో రుక్మిణి కుమారుడు ప్రద్యుమ్నుడు మొదటి వాడు. అతని వలన అనిరుద్దు డుదయించెను. అతనికి వజ్రుడు పుట్టెను. యుద్ధము లందు అరుద్ధుడు = నిరోధింప బడనివాడు. కావున అనిరుద్ధుడను పౌరుష నామము నందిన యాతడు బలి పౌత్రిని బాణుని కుమార్తెను ఉషను బెండ్లాడెను. ఆ సందర్భముననే హరి హరులకు ఘోర యుద్ధమై బాణాసురుని వేయి బాహువులు చక్రిచే దెగగొట్ట బడినవి.
మునులు:
కథం యుద్ధమభూద్బ్రహ్మన్నుషార్ధే హరకృష్ణయోః
కథం క్షయం చ బాణస్య బాహూనాం కృతవాన్హరిః
ఏతత్సర్వం మహాభాగ వక్తుమర్హసి నోఖిలమ్
మహత్కౌతూహలం జాతం శ్రోతు మేతాం కథాంశుభామ్
మునులు:
మునులు విని ఉషా నిమిత్తముగ నైన యయ్యుద్ధ విశేషముల పూర్తిగ దెల్పుము. విన గుతూహల మగు చున్నదన వ్యాసులిట్లనిరి.
వ్యాసులు:
ఉషా బాణసుతా విప్రాః పార్వతీం శంభునా సహ
క్రీడంతీ ముపలక్ష్యోచ్చైః స్పృహాం చక్రే తదాస్వయమ్
తతః సకలచిత్తజ్ఞా గౌరీ తా మాహ భామినీమ్
బాణుని కూతురు ఉష శంకరునితో గ్రీడించు పార్వతిం గని తనలో దానెంతో ముచ్చట పడెను. అంత గౌరి యందరి డెందముల నెఱింగి నది కావున తాప పడకు! నీవును మగనితో నిట్లే క్రీడింతువు. లెమ్మనియె.
ఉష:
అల మిత్యనుతాపేన భర్త్రా త్వమంపి రంస్యసే
ఇత్యుక్తా సా తదా చక్రే కదేతి మతిమాత్మనః
కోవా భర్తా మమే త్యేనాం పునరప్యాహ పార్వతీ
ఉష:
అది విని యా ముగ్ధ ఎప్పుడు నామగ డెవ్వడన
పార్వతి:
వైశాఖే శుక్లద్వాదశ్యాం స్వప్నేయోభిభవం తవ
కరిష్యతి స తే భర్తా రాజపుత్రి! భవిష్యతి
పార్వతి:
మరల పార్వతి వైశాఖ శుక్ల ద్వాదశి నాడు కలలో నీకు అభిభవము = తిరస్కారమును (మాన భంగమును) జేయేనో యతడోరాచ కన్నియ! నీకు భర్త కాగల డనియె.
వ్యాసులు:
తస్యాం తిథౌ పుమాన్స్వప్నే యథా దేవ్యా ఉదిరితః
తథైవాభిభవం చక్రే రాగం చక్రే చ తత్ర సా
తతః ప్రబుద్ధా పురుష మపశ్యంతీ తముత్సుకా
వ్యాసులు:
చెలి చిత్రలేఖ మెల్లన లాలించు విశ్వాసము గల్గించి నంత ఉషాదేవి గౌరి పలికినది పలికి నట్లు చెలికత్తెకుం దెలిపి వాని కుపాయము సేయ మనియె.
ఉష:
క్వ గతోసీతి నిర్లజ్జా ద్విజాశ్చోక్తవతీ సఖీమ్
బాణస్య మంత్రీకుంభాండశ్చిత్రలేఖా తు తత్సుతా
తస్యాః సఖ్యభవత్సా చ ప్రాహ కోయం త్వయోచ్యతే
యదా లజ్జాకులా నాస్యై కథయామాస సా సఖీ
తదా విశ్వాసమానీయ సర్వమేషా న్యవేదయత్
విదితాయాం తు తా మాహ పునరూషా యథోదితామ్
దేవ్యా తథైవ తత్ప్రాప్తౌ యోభ్యుపాయః కురుష్వతమ్
తతః పటే సురాన్దైత్యా న్గంధర్వాంశ్చ ప్రధానతః
మనుష్యాంశ్చాభిలిఖ్యాసౌ చిత్రలేఖాప్యదర యత్
అపాస్య సాతుగంధర్వాం స్తథోరగ సురాసురాన్
మనుష్యేషు దదౌ దృష్టిం తేష్వప్యంధకవృష్ణిషు
కృష్ణరామౌ విలోక్యాసీ త్సుభ్రూర్లజ్జాయతేక్షణా
ప్రద్యుమ్నదర్మనే వ్రీడాదృష్టిం నిన్యే తతోద్విజాః
దృష్ట్వానిరుద్ధం చ తతో లజ్జా క్వాపి నిరాకృతా
సోయం సోయం మమేత్యుక్తే తథా సా యోగగామినీ
యయౌ ద్వారవతీ ముషాం సమాశ్వాస్య తతః సఖీ
అంతట చిత్రలేఖ పటము నందు సురలను దైత్యులను గంధర్వులను ప్రధానముగా మనుష్యులను లిఖించి చూపెను. ఆ బాలిక యందఱం దలగించి మనుష్యుల చిత్తర్వు లందు జూపుంచెను. వారిలో గూడ ఆంధక వృష్ణి వంశము లందు దృష్టి పెట్టెను. అందును కృష్ణుని బలరామునిం గని సిగ్గు దొలకి కన్నులు విప్పార ప్రద్యుమ్నునిం జూడ లజ్జ నిండిన చూపును బ్రసరింప జేసెను. అవ్వల ననిరుద్ధుం గాంచియు ఆ సిగ్గెటు వోయెనో అతడే యీతడు నాకని (నాకు కనబడిన వాడని బాహ్యార్థము) నాకు గావలసిన వాడని చెప్పగా సఖియగు నాచిత్రరేఖ నెచ్చెలి నోదార్చి యోగ శక్తిచే ద్వారవతి కేగెను.
Summary of chapter 98 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Kāśīrāja, allied with Bāṇa and having insulted the Yādavas, faces Kṛṣṇa's divine wrath. Kṛṣṇa surrounds and burns Kāśī with the Jvara (fever) weapon and Sudarśana discus as an act of divine justice. The chapter underscores that even the most sacred cities are not exempt from divine retribution when their rulers align themselves with adharma.