లోమహర్షణుడు:
అభిషి చ్యాథ రాజేంద్రం పృథుం వైన్యం పితామహః
తతః క్రమేణ రాజ్యాని వ్యాదేష్టు ముప చక్రమే
ద్విజానాం వీరుధాం చైవ నక్షత్రగ్రహయోస్తథా
యజ్ఞానాం తపసాం చైవ సోమం రాజ్యేభ్యషేచయత్
అపాంతు వరుణం రాజ్యే రాజ్ఞాం వైశ్రవణం పతిమ్
ఆదిత్యానాం తథా విష్ణుం వసూనా మథ పావకమ్
ప్రజాపతీనాం దక్షంతు మరుతా మథ వాసవమ్
దైత్యానాం దానవానాం వై ప్రహ్లాద మమితౌజసమ్
వైవస్వతం పితౄణాంచ యమం రాజ్యేభ్యషేచయత్
యక్షాణాం రాక్షసానాంచ పార్థివానాం తథైవచ
సర్వభూత పిశాచానాం గిరీశం శూలపాణినమ్
శైలానాం హిమవంతం చ నదీనా మథ సాగరం
గంధర్వాణా మధిపతిం చక్రే చిత్రరథం ప్రభుమ్
నాగానాం వాసుకిం చక్రే సర్పణా మథ తక్షకం
వారణానాం తు రాజాన మైరావత మథాదిశత్
ఉచ్చైః శ్రవస మశ్వానాం గరుడం చైవ పక్షిణాం
మృగాణా మథ శార్దూలం గోనృషం తు గవాం పతిమ్
వనస్పతీనాం రాజానాం ప్లక్ష మేవాభ్యషేచయత్
ఏవం విభజ్య రాజ్యాని క్రమేణైవ పితామహః
దిశాం పాలా నథ తతః స్థాపయామాస స ప్రభుః
పూర్వస్యాం దిశి పుత్రం తు వైరాజస్య ప్రజాపతేః
దిశః పాలం సుధన్వానం రాజానంసోభ్యషేచయత్
దక్షణస్యాం దిశి తథా కర్దమస్య ప్రజాపతేః
పుత్రం శంఖపదం నామ రాజానం సోభ్యషేచయేత్
పశ్చిమస్యాం దిశి తథా రజసః పుత్ర మచ్యుతం
కేతుమంతం మహాత్మానాం రాజానం సోభ్యషేచయేత్
తథా హిరణ్య రోమాణం పర్జన్యస్య ప్రజాపతేః
ఉదీ చ్యాం దిశి దుర్ధర్షం రాజానం సోభ్యషేచయేత్
తై రియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా
యథాప్రదేశ మద్యాపి ధర్మేణ ప్రతిపాల్యతే
రాజసూయాభిషిక్త స్తు పృథు రేతై ర్నరాధిపైః
వేదదృష్టేన విధినా రాజా రాజ్యే నరాధిపః
తతో మన్వంతరేతీతే చాక్షుషేమిత తేజసి
వైవస్వతాయ మనవే పృథివ్యాం రాజ్య మాదిశత్
తస్య విస్తార మాఖ్యాస్యే మనోర్వైవస్వతస్య హ
భవతాం చానుకూల్యాయ యది శ్రోతు మిహేచ్ఛథ
మహదేత దధిష్ఠానం పురాణే తదధిష్ఠితమ్
లోమహర్షణుడు:
బ్రహ్మ వేన కుమారుని పృథుని చక్రవర్తిగా నభిషేకించి క్రమముగా వారి వారికి రాజ్యములను నిర్ణయించి యిచ్చెను. ద్విజులు ధాన్యములు నక్షత్రములు గ్రహములు యజ్ఞములు తపస్సులు అను వాని రాజ్యాధికార మందు సోమునకు పట్టాభిషేకము చేసెను. అప్పులకు వరుణుని, రాజులకు రాజ రాజును, (కుబేరుని) అదిత్యులకు విష్ణుని, వసువుల కగ్నిని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తలకు వానవుని, దైత్య దానవులకు ప్రహ్లాదుని, పితరులకు వైవస్వతుని, (యముని) యక్ష రాక్షస పార్థివ సర్వ భూత పిశాచములకు శూల పాణియైన గిరీశుని, (శివుని) శైలమునకు హిమ వంతుని, నదులకు సాగరుని, గంధర్వులకు చిత్రరథుని, నాగులకు వాసుకిని, సర్పములకు తక్షకుని, ఏనుగులకు ఐరావతుని, అశ్వములకు ఉచ్చైఃశ్రవసమును, పక్షులకు గరుడుని, మృగములకు శార్దూలమును, గోవులకు గోవృషమును, వనస్పతులకు జువ్వి చెట్టును, రాజు గావించెను. తూర్పు దిశకు వైరాజ ప్రజాపతి కుమారుని సుధన్వుని, దక్షిణ దిశకు కర్దమ ప్రజాపతి కొడుకు శంఖపదుని, పడమటి దిశకు రజస్సు కుమారుని (అచ్యుతుని) కేతుమంతుని, ఉత్తర దిశకు వర్జన్య ప్రజాపతి తనయిని హిరణ్యరోముని అధిపతులనుగా నభిషేకించెను. సప్త ద్వీప పరివృత మయిన యీ పృథ్వి పట్టణములతో గూడి వారివారి చేత నిపుడును ధర్మముతో పాలించ బడుచున్నది. ఈ నరపతులచే వేద విహితముగ రాజసూయాభిషిక్తుడునై, రాజ్యాభిషిక్తుడవై పృథువు చక్రవర్తియై యిమ్మేదిని నేలను, చాక్షుష మన్వంతరము గడచి వైవస్వంత మన్వంతర మారంభ మయ్యెను. అమ్మన్వంతర వృత్తాంతము వినిపింతును వినుండు.
మునులు:
విస్తారేణ పృథౌ రన్మ లోమహర్షణ కీర్తయ!
యథా మహాత్మనాతేన దుగ్ధావేయం వసుంధరా
యథా వా పినృభి ర్దుగ్ధా యథాదేవై ర్మహర్షిభిః
యథా దైత్యైశ్చ నాగైశ్చ యథా యక్షై ర్యథా ద్రుమైః
యథా శైలైః పిశాచైశ్చ గంధర్వైశ్చ ద్విజోత్తమైః
రాక్షసైశ్చ మహాసత్త్వై ర్యథా దుగ్ధా వసుంధరా
తేషాం పాత్ర విశేషాంశ్చ వక్తు మర్హసి సువ్రత
వత్సక్షీర విశేషాంశ్చ దోగ్ధారం చాను పూర్వశః
యస్మాచ్ఛ కారణా త్పాణి ర్వేనస్య మథితః పురా
క్రుద్ధై ర్మహర్షిభిస్తాత కారణం తచ్చ కీర్తయ
మునులు:
లోమహర్షణ! పృథు చక్రవర్తి మహానుభావుడు. ఇవ్వసుంధరను గోవు నొనరించి వస్తుసారమును పిదికె నందురు. నర నరాసుర నాగ యక్ష ద్రుమ శైల పిశాచ గంధర్వ ద్విజ రాక్షసాది మహాసత్వ జాతులచే నీ భూమి ఎట్లు పిదుక బడినది. వారువారు పిదికిన పాత్ర విశేషము లేవి? దూడ లెవరు? దోగ్ధ ఎవరు? దుగ్ధము (పాలు) ఎట్టిది? ఆనతిమ్ము. కుపితులైన మహర్షు లెట్లు వేనుని హస్తము మథించిరి? దానికి కారణమేమి? అదియుం గీర్తింపుము.
లోమహర్షణుడు:
శృణుధ్వం కీర్త యిష్యామి పృథో ర్వైన్యస్య విస్తరమ్
ఏకాగ్రాః ప్రయతాశ్చైవ పుణ్యార్థం వై ద్విజర్షభాః
నాశుచేః క్షుద్రమనసో నాశిష్య స్యాప్రతస్యచ
కీర్త యేయ మిదం విప్రాః కృతఘ్నా యాహితాయచ
స్వర్గ్యం యశస్య మాయుష్యం ధన్యం వేదైశ్చ సంమితమ్
రహస్య మృషిభిః ప్రోక్తం శృణుద్వం వై యథాతథమ్
యశ్చేమం కీర్తయేన్నిత్యం పృథో ర్వైస్యస్యవిస్తరమ్
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య న స శోచేత్ కృతాకృతమ్
లోమహర్షణుడు:
ఏకాగ్ర మనస్కులై యాలింపుడు. అశుచికి నీచ మనస్కునకు శిష్యుడు కాని వానికి వ్రత దూరునికి కృతఘ్నునికి అహితునకు నిది నేను తెలుపను. ఇక్కడ స్వర్గప్రదము, కీర్తిదము, ఆయుష్యము, ధన్యము, వేద సమ్మితము, ఋషులు రహస్యముగా నానతిచ్చినది. వినుండు. బ్రాహ్మణులకు నమస్కరించినచో నిది కార్యము. ఇది అకార్యమునని విచారింప బని యుండదు.
అసీ ద్ధర్మస్య సంగోప్తా పూర్వ మత్రిసమః ప్రభుః
అత్రివంశే సముత్పన్న స్త్వంగో నామ ప్రజాపతిః
తస్య పుత్రో భవ ద్ద్వేనో నాత్యర్థం ధర్మకోవిదః
జాతో మృత్యుసపుతాయాం వై సునీథాయాం ప్రజాపతిః
స మాతామహదోషేణ తేన కాలాత్మజాత్మజః
స్వధర్మం పృష్ఠతః కృత్వా కామలోభే ష్వవర్తత
మర్యాదాం భేదయామాస ధర్మోపేతాం ససార్థివః
వేదధర్మా నతిక్రమ్య సోధర్మనిరతోభవత్
నిఃస్వాధ్యాయ వషట్కారాః ప్రజా స్తస్మి స్ప్రజాపతౌ
ప్రవృత్తం న వపుః సోమం హుతం యజ్ఞేషు దేవతాః
నయష్టవ్యం న హోతవ్య మితి తస్య ప్రజాపతేః
ఆసీ త్ప్రతిజా! క్రూరేయం వినాశే ప్రత్యుపస్థితే
అహ మిజ్యశ్చ యష్టా చ యజ్ఞ శ్చేతి భృగూద్వహ
మయి యజ్ఞో విధాతవ్యో షుయి హోతవ్య మిత్యపి
తమతి క్రాంత మర్యాద మాదదాన మసాంవ్రతమ్
ఊచు ర్మహర్షయ స్సర్వే మరీచిప్రముఖా స్తదా
వయం దీక్షాం ప్రవేక్ష్యామః సంవత్సరగణాన్ బహూన్
అధర్మం కురు మా వేన ఏషధర్మ స్సనాతనః
నిధనే త్రేః ప్రసూత స్త్వం ప్రజాపతి రసంశయమ్
ప్రజాశ్చ పాలయిష్యేహ మితీహ సమయః కృతః
తాం స్తథా బ్రువతః సర్వా న్మహర్షీ నబ్రవీ త్తదా
వేనః ప్రహస్య దుర్బుద్ధి రిమ మర్థ మనర్థవిత్
మున్నత్రి వంశమున ధర్మ ప్రభువు అత్రి సమానుడు. అంగుడను ప్రజాపతి యుదయించెను. వాని సుతుండు వేనుడు. మృత్యువు కూతురగు నునీధయందు కలిగిన వాడు. మాతా మహ దోషముచే నాతడు స్వధర్మమును వెనుకబెట్టి కామలోభియై ప్రవర్తించెను. ధర్మము యొక్క హద్దులను దారు మారు సేసెను. వేద ధర్మము నతిక్రమించెను. వాని రాజ్యమున స్వాధ్యాయము వషట్కారమును విన రాదయ్యెను దేవతలు యజ్ఞము లందు సోమముం ద్రావి యెఱుంగరు. హవిస్సుల నారగింపరు. ఆ నర పతికి వినశ కాలము దాపురించె గావలయు యజ్ఞము వలదు హోమములు వలదని శాసించెను. క్రూర బ్రతిజ్ఞ చేసెను. నేను యజ్ఞే శ్వరుడను యజ్ఞకర్తను, యజ్ఞమును నన్ను గూర్చి యజింప నగును. నాకై హోమము లాచరింప వలెనని వాడు శాసించెను. మర్యాద నతిక్రమించి ఉత్పధ గామియై యున్న వానింగని మరీచి ప్రముఖులైన ఋషులు వేన మేము పెక్కు సంవత్సరములు దీక్షా ప్రవేశము గావించెదను. అధర్మము సేయకు, ఇది సనాతన ధర్మము. అత్రి తరువాత నీవు ప్రజాపతియను నవతరించి నాడవు. ప్రజలను బాలింతులని ప్రతిజ్ఞ చేసికద రాజైతివి. అన విని వాడు వారన పరిహసించి దుర్బుద్ధి యనర్ధ పరుడుగాన యిట్లనియె.
వేనుడు:
స్రష్టా ధర్మస్య కశ్చాన్యః శ్రోతవ్యం కస్యవా మయా
శ్రుతవీర్యతవస్సత్యై ర్మయా వా కఃసమో భువి
ప్రభవం సర్వభూతానాం ధర్మాణాం చ విశేషతః
సంమూఢా న విదు ర్నూనం భవంతో మాం విశేషతః
ఇచ్ఛన్ దహేయం పృథివీం ప్లావయేయం జలై స్తథా
ద్యాం వై భువంచ రుంధేయం నాత్రకార్యా విచారణా
యదా న శక్యతే మోహా దవలేపాచ్చ పార్థివః
అపనేతుం తదా వేన స్తతః కృద్ధా మహర్షయః
వేనుడు:
ధర్మమునకు నాకంటే కర్త యెవ్వడు? నేనెవ్వని మాట విన వలయును? శ్రుతమున (పాండిత్యమున) వీర్య మందు తపస్సులో సత్యములో నాతో సము డెవ్వరు? సర్వ భూతముల యొక్కయు, ధర్మము యొక్కయు మొదలు తుదియ తెలియని మూర్ఖులు మీరు. నిజముగ నన్నె ఱుగరు. తలచితి నేని యీ యిలాతలము నంతను దహించి వేయ గలను. నీటి వెల్లువల ముంచెత్త వేయగలను. భూమ్యా కాశముల దారులను బంధించ గలను. అనవిని పొగరెక్కి మూర్ఖుడై యున్న వానిని సరి చేయుట యసంభమని మహర్షులు క్రుద్ధులైరి.
తం నిగృహ్య మహాత్మానో విస్ఫురంతం మహాబలమ్
తతోస్య సవ్యమూరుం తే మమంథు ర్జాతమన్యవః
తస్మి న్ని మథ్యమానే వైరాజ్ఞ ఊరౌతు జజ్ఞివాన్
హ్రస్వోతిమాత్రః పురుషః కృష్ణశ్చేతి బభూవహ
న భీతః ప్రాంజలి ర్భూత్వా తస్థివా న్ద్విజసత్తమాః
తమత్రి ర్విహ్వలం దృష్ఠ్యా నిషీదే త్యబ్రవీత్తదా
నిషాద వంశకర్తాసౌ బభూవ వదతాంపరాః
ధీవరా నసృజ చ్చాపి వేనకల్మషసంభవాన్
యే చాన్యే వింధ్యనిలయా స్తథా పర్వతసంశ్రయాః
అధర్మరుచయో విప్రా స్తే తువై వేనకల్మషాః
వానిని బట్టి కట్టివైచి వాని యెడమ తొడను మథించిరి. అందుండి నల్లని వాడు, పొట్టివాడు జనించి భయ పడుచు దోసిలొగ్గి నిల బడెను. బెదురు చున్న వానిని జూచి అత్రి మహర్షి “నిషీద” (గూర్చుండుము) అనెను. అందుచే వాడు నిషాద వంశమునకు (బోయలకు) మూల పురుషు డయ్యెను. ఆ మీదట “ధీవరులు” చేపలు పట్టు వారిని మేని కల్మషమున వాడు కనెను. వాని వలన కోయలు మొదలగు కొండ జాతుల వాండ్రు జనించిరి. వేనుని కల్మషముచే బొడమిన వారందరు నధర్మ ప్రియులైరి.
తతః పునర్హహాత్మానః పాణిం వేనస్య దక్షిణమ్
అరణీమివ సంరబ్ధా మమంథు ర్జాత మన్యవః
పృథు స్తస్మా త్సముత్పన్నః కరా జ్వలనసంనిభః
దీప్యమానః స్వవపుషా సాక్షాదగ్నిరివ జ్వలన్
అథ సోజగవం నామ ధను ర్గృహ్య మహారవమ్
శరాంశ్చ దావ్యా న్రక్షార్ధం కవచం చ మహాప్రభమ్
తస్మి జాతేధ భూతాని సంప్రహృష్టాని సర్వశః
సమాపేతు ర్మహాభాగా వేనస్తు త్రిదివం యయౌ
సముత్పన్నేన భో విప్రాః సత్పుత్రేణ మహాత్మనా
త్రాత స్స పురుషవ్యాఘ్రః పుంనామ్నో నరకాత్తదా
తం సముద్రాశ్చ నద్యశ్చ రత్నా న్యాదాయ సర్వశః
తోయాని చాభిషేకార్ధం సర్వ ఏవోప తస్థిరే
పితామహశ్చ భగవా న్దేవై రాంగిరసైః సహ
స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వశః
సమాగమ్య తదా వైన్య మభ్యషించ న్నరాధిపమ్
మహతా రాజరాజేన ప్రజా స్తే నానురంజితాః
సోభిషిక్తో మహాతేజా విధివ ద్ధర్మ కోవిదైః
అధిరాజ్యంతదా రాజ్ఞాం పృథుర్వైన్యః ప్రతాపవాన్
పిత్రాపరంజితా స్తస్య ప్రజాస్తేనానురంజితాః
అనురాగా త్తత స్తస్య నామ రాజాభ్యజాయత
ఆప స్తస్తంభిరే తస్య సముద్ర మభియాన్యతః
పర్వతాశ్చ దదు ర్మార్గం ధ్వజభంగశ్చ నాభవత్
అకృష్టపచ్యా పృథివీ సిధ్యాన్త్యన్నాని చింతనాత్
సర్వకామదుఘా గావః పుటకే పుటకే మధు
ఏతస్మిన్నేవ కాలేతు యజ్ఞే పైతామహే శుభే
సూతః సూత్యాం సముత్పన్నః సౌత్యేహని మహామతిః
తస్మిన్నేవ మహాయజ్ఞే జజ్ఞే ప్రాజ్ఞోథ మాగధః
పృథో స్త వార్థం తౌ తత్ర సమాహూతౌ మహర్షిభిః
తా వూచు రృషయ సర్వే స్తూయతా మేష పార్థివః
కర్మైతదనురూపం వా పాత్రంచాయం నరాధిపః
ఆ మీదట వేనుని కుడి చేయిని అరణినట్లు మథింపగా నందుండి “అజగవమ” ను ధనువును దివ్య బాణములను గొని కవచముల దాల్చి పృథువు అగ్నివోలె వెలుంగుచు నుదయించెను. అయ్యెడ సర్వ భూతములు సంతుష్టము లయ్యెను. వేనుడా క్షణము స్వర్గ మలంకరించెను. మహానుభావు డయిన పుత్రుని వలన పుంనామ నరకము నుండి రక్షింప బడెను. ఆ పృథుని సన్నిధికి రత్నములు గొని సముద్రము నదులు వచ్చి పవిత్రో దకముల నభిషేకించి నవి. బ్రహ్మయు నంగిరసుడు మొదలగు దేవతలతో నేతెంచెను. స్థావర జంగమము లయిన భూతములు గూడ వచ్చినవి, అందరు నతనికి పట్టాభిషేకము గావించిరి. యథావిధిగ ధర్మ నిపుణులచే నభిషిక్తుడయిన యా చక్రవర్తి తండ్రిచే బాధితులయిన ప్రజల ననురాగముచే రంజింప జేసెను. దాన నతడు ‘రాజు’ యను పేరంచెను. అతడు సముద్రమున కరుగ నుదకములు స్థంభించి నడక కనుకూల మయ్యెను. పర్వతము లాతని టెక్కెమునకు భంగము రాకుండ దారి యిచ్చెను. తలచు కొన్న మాత్రమున ధరణి దున్నకయే సర్వ సస్యములను బండెను. గోవులు కామధేనువు లయ్యెను. పట్టు పట్టునం దేనియులు కురిసెను. ఈ సమయ మందొక యజ్ఞమున సుత్యాహస్సు నందు సూచి యందు మహా మేధావి సూతుడ వతరించెను. అయ్యజ్ఞ మందు ప్రాజ్ఞుడయిన మాగధుడును కలిగెను. వారిర్వురును పృథు చక్రవర్తిని స్తుతించుటకై మునులు బిలువగా నేతెంచిన మహానుభావులు. ఋషులు పృథు చక్రవర్తిని మీరిద్దరు స్తుతింపుడని యాదేశించిరి. అప్పుడు సర్వ ఋషులను గూర్చి యా సూత మాగధు లిట్లు పలికిరి.
తా పూచతు స్తదా సర్వాం స్తా నృషీ న్సూతమాగధౌ
అవాం దేవా నృషీంశ్చైవ ప్రీణయావః స్వకర్మభిః
న చాస్య విద్మో వై కర్మ నామ వా లక్షణం యశః
స్తోత్రం యేనాస్య కుర్యావ రాజ్ఞస్తే జస్వినో ద్విజాః
ఋషిభి స్తౌనియుక్తౌతు భవిష్యైః స్తూయతామితి
యాని కర్మాణి కృతవా న్పృథుః పశ్చా న్మహాబలః
తతః ప్రభృతి వైలోకే స్తవేషు మునిసత్తమాః
ఆశీర్వాదాః ప్రయుజ్యంతే సూత మాగధవందిభిః
తయోః స్తవంతే సుప్రీతః పృథుః ప్రాదా త్ప్రజేశ్వరః
అనూపదేశం సూతాయ మగధం మాగధాయ చ
తం దృష్ట్వా పరమప్రీతాః ప్రజాః ప్రోచు ర్మనీషి ణః
వృత్తీనా మేష వో దాతా భవిష్యతి నరాధిపః
తతో వైన్యం మహాత్మానాం ప్రజాః సమభిదుద్రువుః
త్వం నో వృత్తిం విధత్స్వేతి మహర్షివచనా త్తదా
అనూత మాగధులు మేము దేవతలను ఋషులను కీర్తించి సంతుష్టుల నొనరించు వారము. ఇతడెవడో యీతని పేరేమో చేసిన చేతయేమో లక్షణ మెట్టిదో కీర్తి యెలాటిదో యెఱుంగుము. చూచుటకు మహా తేజస్వియై కనిపించు చున్నాడు. కాని యేమని యీతని నుతింతుము. అన మునులు జరుగ బోవునీతని సత్కార్యములను భావించి గానము సేయు మనిరి. వారు నాతని పిమ్మటి చరితము నూహించి కొనియాడిరి. అది మొదలు లోకము నందు జరుగు స్తవములు ఆశీర్వాద ప్రధానములయి సూతమాగధ వందిజన ముఖమున ప్రవర్తింప జొచ్చెను. వారి స్తుతికి మిక్కిలి సంతసించి పృథు చక్రవర్తి సూతునకు (అనూ పదేశము) సముద్ర తీర ప్రాంతమును మాగధునకు మగధ దేశమును బహుమాన మిచ్చెను. అవ్వల మహర్షు లందరు పరమ ప్రీతులయి ప్రజలను ద్దేశించి ఈ ఱేడు మీకందరకు వృత్తుల నొసంగ గలడనిరి. అది విని ప్రజలు వేదసుతుని దరికి పరుగు లెత్తిరి.
సోభిద్రుతః ప్రజాభిస్తు ప్రజాహితచికీర్షయా
ధనుర్గృహ్య పృషత్కాంశ్చ పృథివీ మాద్రవ ద్బలీ
తతో వైన్యభయత్రస్తా గౌ ర్భూత్వా ప్రాద్రవన్మహీ
తాం పృథు ర్ధనురాదాయ ద్రవంతీ మన్వధావత
సా లోకా న్బ్రహ్మ లోకాదీ న్గత్వా వైన్యభయా త్తదా
ప్రదదర్శాగ్రతో? వైన్యం ప్రగృహీత శరాసనమ్
జ్వలద్భి ర్నిశితై ర్బాణై ర్దీప్త తేజస మంతతః
మహాయోగం మహాత్మానం దుర్ధర్ష మమరై రపి
ఆలభంతీ తు సా త్రాణం వైన్యమే వాన్వపద్యత
కృతాంజలి పుటా భూత్వా పూజ్యాలోకై స్త్రీభి స్తదా
ఉవాచ వైన్యం నా ధర్మం స్త్రీ వధే పరిపశ్యసి
కథం ధారయితా చాసి ప్రజా రాజ న్వినా మయా
మయి లోకా స్థితా రాజ న్మయోదం ధార్యతే జగత్
మద్వినాశే వినశ్యేయుః ప్రజాః పార్థివ విద్ధి తత్
న మామర్హసి హంతుం వై శ్రేయ శ్చేత్త్వం చికీర్షసి
ప్రజానాం పృథివీపాల! శృణు చేదం వచో మమ
ఉపాయతః సమారబ్ధా స్సర్వే సిద్ధ్యం త్యుప్రకమాః
ఉపాయం పశ్య యేన త్వం ధారయేథాః ప్రజాఇమాః
హత్వాపి మాం నశక్తస్త్వం ప్రజానాం పోషణే నృప
అనుకూలా భవిష్యామి యచ్ఛ కోపం మహామతే
అవధ్యాం చ స్త్రియం ప్రాహుస్తిర్య గ్యోనిగతే ష్యపి
యద్యేవం పృథివీపాల న ధర్మం త్యక్తు మర్హసి
ఏవం బహువిధం వాక్యం శ్రుత్వా రాజా మహామనాః
కోపం నిగృహ్య ధర్మాత్మా వసుధా మిద మబ్రవీత్
అత్తఱి నా రాజు విల్లు నమ్ములు దాల్చి భూమిం గూర్చి బరు వెత్తిన నామె పెఱగంది పారి పోయిన నాతడు వెంబడించి యామెం దఱుమ జొచ్చెను. ఆమె పృథుని కిం జడిసి లోకముల వెంట బరువులు వెట్టి వెట్టి తానేగిన చోట నెల్ల యెట్ట యెదుట ధనుర్భాణ పాణియై జ్వతి తాగ్ని వలెనున్న యాఱేనింగని అమరులకేని ఓర్వరాని వాడని కని దిక్కు తోపక యాతనినే శరణందెను. త్రిభువన పూజ్యయైన వసుంధర యంజలించి “స్త్రీ”వధ అధర్మమని కానవే? నేను లేకుండ ప్రజానెట్లు ధరింతువు? లోకము లెల్ల నా యందున్నవి. నా చేతన యీ జగము ధరింప బడుచున్నది. నేను పోయిన ప్రజలెల్లరు వోదురు. అది యెఱుంగుము. నీవు ప్రజా శ్రేయస్సు చేయనెంతు వేని ననుదుద ముట్టింప దగదు. మరియు నొక మాటయు వినుము. నిరపాయమైన యుపాయమున సర్వ కార్యములు సిద్దించును. ఈ ప్రజల ధరింప నేనొక యుపాయము సెప్పెద వినుము. నన్ను సంహరించిన నీవు ప్రజలను బోషింప జాలవు. నేను నీకనుకూల నయ్యెద. కోపముప సంహరింపుము. పశు పక్షులందేని అడుది అవధ్యురాలని యందురు. నీవు ధర్మమును వీడుట తగదు. అని పెక్కు విధముల పలికిన ధరిత్రి పలుకు లాలించి మహామతి కావున యా నృపతి కోపమును నిగ్రహించి వసుమతిం జూచి యిట్టనియె
పృథుడు:
ఏకస్యార్థేతు యో హన్యా దాత్మనోవా పరస్య వా
బహూన్వా ప్రాణినోనంతం భవేత్త స్యేహ పాతకమ్.
సుఖ మేధంతి బహవో యస్మింస్తు నిహతేశుఖే
తస్మిన్హతే నాస్తి భద్రేః పాతకం చోపపాతకమ్
సోహం ప్రజానిమిత్తం త్వాం హనిష్యామి వసుంధరే
యది మే వచనా న్నాద్య కరిష్యసి జగద్ధితమ్
త్వాం నిహత్యాద్య బాణేన మచ్ఛాసన పరాజ్మఖీమ్
ఆత్మానం ప్రథయిత్వాహం ప్రజా ధారయితా స్వయమ్
సా త్వం శాసన మాస్థాయ మమ ధర్మభృతాం వరె
సంజీవయ ప్రజా స్సర్వా స్సమర్థా హ్యసి ధారణే
దుహితృత్వం చ మే గచ్ఛ తత ఏన మహం శరమ్
నియచ్ఛేయం త్వద్వధార్థ ముద్యతం ఘోరదర్శనమ్
తనకు గాని యితరునికి గాని యెక్కనికి మాత్రము క్షేమము గల్గుటకు పెక్కు ప్రాణులను సంహరించిన వాని కంతులేని పాపము గల్గును. ఏ యొక దుష్టుడు సంహరింప బడుట వలన పెక్కు మంది జీవుల సుఖము నందుదురో అట్టివాని సంహరించుట వలన పాతకము ఉప పాతకము ననునేవియు గలుగవు. వసుంధరా! నా చెప్పినట్లు జగద్ధితము సేయవేని నిన్ను పెక్కు మంది ప్రజల సేమము నిమిత్తమై ఇదిగో ఇపుడు సంహరించెను. నా శాసనమునకు పెడమొగ మయిన నిన్ను నా బాణముచే నిప్పుడు గూల్చి మెప్పుగౌని ప్రజల గాపాడెదను. ధర్మశీలుర కెల్ల నుత్తము రాలవు నీవు నా శానమునకు గట్టువడి ప్రజల బ్రతికింపుము. ప్రజాధారణ మందు నీవు సమర్థు రాలవు గద! నాకు కుమార్తెవు గమ్ము. అపుడీ భయంకర మైన బాణము నుప సంహరించెదను, అని రాజనెను
వసుధ:
సర్వమేత దహం వీర విధాస్యామి న సంశయః
వత్సంతు మమ సంపశ్య క్షరేయం యేన వత్సలా
సమాంచ కురు సర్వత్ర మాం త్వం ధర్మభృతాంవర
యథా నిష్యందమానం మే క్షీరం సర్వత్ర భావయేత్
తత ఉత్సారయామాస శైలాన్ శతసహస్రశః
ధనుష్కోట్యా తదా వైన్య స్తేన శైలా వివర్ధితాః
న హి పూర్వవిసర్గే వై విషమే పృథివీతలే
సంవిభాగః పురాణాం వా గ్రామాణాం వాభవత్తదా
న సస్యాని న గోరక్షం న కృషిర్నవణిక్పథః
నై వ సత్యానృతం చాసీన్న లోభో న చ మత్సరః
వైవస్వతేంతరే తస్మిన్ సాప్రతం సముపస్థితే
వైన్యా త్ర్పభృతి వై విప్రాః సర్వస్యైతస్య సంభవః
యత్రయత్ర సమం త్వస్యాభూమే రాసీత్తదా ద్విజాః
తత్రతత్ర ప్రజాః సర్వా నివాసం సమరోచయన్
ఆహారః ఫలమూలాని ప్రజానా మభవత్తదా
కృచ్ఛ్రేణ మహతా యుక్త ఇత్యేవ మనుశుశ్రుమ
స కల్పయిత్వా వత్సంతు మనుం స్వాయంభువం ప్రభుమ్
స్వ పాణౌ పురుషవ్యాఘ్రో దు దోహ పృథివీం తతః
సస్యజాతాని సర్వాణి పృథుర్వై న్యః ప్రతాపవాన్
తేనాన్నేన ప్రజాః సర్వా వర్తంతేద్యాపి సర్వశః
ఋషయశ్చ తదా దేవాః పితరోథ సరీసృపాః
దైత్యా యక్షాః పుణ్యజనా గంధర్వాః పర్వతానగాః
ఏతే పురా ద్విజ శ్రేష్ఠా దుదుహు ర్ధరణీం కిల
క్షీరం వత్సశ్చ పాత్రం చ తేషా దోగ్ధా పృథక్పృథక్
వసుధ:
ఇది యెల్ల సేనొనరించెదను. సంశయము లేదు. కాని నాకొక దూడను సంపాదింప యత్నింపుము. దాని మూలమున నేను పాలు చేసెదను. ఆదిగాక నన్ను మెట్ట పల్లములు లేనట్లొ నరింపుము. అపుడు నా చేపిన క్షీరము నలు మూలల సమముగా జాల్వారును. నావిని పృథు చక్రవర్తి ధనుష్కోటిచే వేల కొలది కొండలను మీదికి లేవ గొట్టెను. ఇంతకు ముందటి సృష్టి యందు భూతలము విషమముగ నుండెను. ఆయెగుడు దిగుడు నేల యందు పురములు గ్రామములను, విభాగమే లేకుండెను. పంటలు లేవు. గోరక్షణ లేదు. కృషి లేదు. వర్తకము దారి లేదు. సత్యా నృతము (వాణిజ్యము) లేదు. లోభము లేదు. మత్సరము లేదు. పైవస్వత మనువు తరమట్లు నడిచినది. ఇప్పుడు పృథు చక్రవర్తి మొదిలిది యెల్ల యేర్పడినది. ఎక్కడెక్కడ యీ ధరిత్రి సమముగ నుండిన నక్కడ ప్రజలు నివాస మేర్పరచ గొన గోరిరి. ఆనాటికి కంద మూలము లాహారము. అది మిగుల కష్ట జీవనమని విందుము. పృథువు స్వాయంభువ మనుపును దూడ నొనరించి తన హస్తమే పాత్రముగ భూమిని పిదికెను. ఆ పిదికిన క్షీరము సర్వ సస్యస్వ రూపము ఆ అన్నము చేతనే యీ నాటికిని ప్రజలు సుఖ జీవనులగు చున్నారు. ఋష్యాదులు తమ తమ యాహార రూపమైన క్షీరమును తమతమ కభిమతమైన పాత్రము లందు పిదుకు కొనిరి.
ఋషీణా మభవ త్సోమో వత్సో దోగ్ధా బృహస్పతిః
క్షీరం తేషాం తపో బ్రహ్మ పాత్రం ఛందాంసి భో ద్విజాః
దేవానాం కాంచనం పాత్రం వత్స స్తేషాం శతక్రతుః
క్షీరమోజస్కరం చైవ దోగ్ధా చ భగవాన్ రవిః
పితౄణాం రాజతం పాత్రం యమో వత్సః ప్రతాపవాన్
అంతక శ్చాభవ ద్దోగ్ధా క్షీరం తేషాం సుధా స్మృతా
నాగానాం తక్షకో వత్సః పాత్రం చాలాబుసంజ్ఞకమ్
దోగ్ధా త్వైరావతో నాగ స్తేషాం క్షీరం విపంస్మృతమ్
అసురాణాం మధు ర్దోగ్ధా క్షీరం మాయామయం స్మృతమ్
విరోచనస్తు పత్సోభూదాయసం పాత్రమేవచ
యక్షాణా మామపాత్రంతు వత్సోవై శ్రవణః ప్రభుః
దోగ్ధా రజతనాభస్తు క్షీరమంతర్థి రేవచ
సుమాలీ రాక్షాసేంద్రాణాం వత్సః క్షిరం చ శోణితమ్
దోగ్ధ రజతనాభస్తు కపాలం పాత్రమేవ చ
గంధర్వాణాం చిత్రరథోవత్సః పాత్రంచ పంకజమ్
దోగ్ధా చ సురుచిః క్షిరం తేషాం గంధః శుచిః స్మృతః
శైలం పాత్రం పర్వతానాం క్షిరం రత్నౌషధీ స్తథా
వత్సస్తు హిమవా నాసీ ద్దోగ్ధా మేరు ర్మహాగిరిః
ప్లక్షో వత్ససు వృక్షాణాం దోగ్ధా సాలస్తు పుప్పితః
పాలాశపాత్రం క్షీరం చ చ్ఛిన్న దగ్ధ ప్రరోహణమ్
సేయం ధాత్రీ విధాత్రీ చ పావనీ చ వసుంధరా
చరాచరస్య సర్వస్య ప్రతిష్ఠా యోని రేవచ
సర్వకామదుఘా దోగ్ధ్రీ సర్వసస్యప్రరోహణీ
అసీ దియం సముద్రాంతా మేదినీ పరివిశ్రుతా
మధుకైటభయైః కృత్స్న మేదసా సమభిప్లుతా
తేనేయం మేదినీ దేవీ ఉచ్యతే బ్రహ్మవాదిభిః
తతో భ్యుపగమాద్రాజ్ఞః పృథో ర్వైన్వస్య భో ద్విజాః
దుహితృత్వ మను ప్రాప్తా దేవీ పృథ్వీతి చోచ్యతే
ఆ క్రమము:
ఋషులకు సోముడు వత్సము (దూడ) దోగ్ధ (పిదుకు వాడు) బృహస్పతి. క్షీరము తపోబ్రహ్మము పాత్రము ఛందోమయము దేవతల కింద్రుడు దూడ, దోగ్ధ రవి, పాలు ఓజస్సు (తేజస్సు), పాత్రము కాంచనము. పితృ దేవతలకు దూడ యముడు, దోగ్ధ అంతకుడు. పాలు సుధ (స్వధ). పాత్రము రాజతము (వెండి గిన్నె) నాగులకు తక్షకుడు దూడ దోగ్ధ ఐరావతుడను నాగుడు. క్షీరము విషము పాత్రము సొరకాయ. అసురులకు విరోచనుడు వత్సము (దూడ) దోగ్ధ మధువు. పాలు మాయామయము. పాత్ర ఆయసము ఇనుప గిన్నె (అయోమయము) యక్షులకు దూడ వైశ్రవణుడు. దోగ్ధ రజతనాభుడు. పాలు అంతర్ధానము పాత్ర. మట్టి కుండ రాక్షసేంద్రులకు దూడ సుమాలి దోగ్ధ రజతనాభుడు, పాలు శోణితము (రక్తము) పాత్ర కపాలము. గంధర్వులకు దూడ చిత్రరథుడు పిదుకు వాడు సురుచి పాలు సుగంధము. పాత్ర పద్మము పర్వతములకు దూడ హిమవంతుడు దోగ్ధ మేరువు పాలు రత్నౌషధులు పాత్రము శైలము వృక్షములకు దూడ ప్లక్షము (జువ్వి) దోగ్ధ పుష్పించిన శాలము. వృద్ధి పాలు తెగిన కాలిన చోట మొలపించు శక్తి యనునది. పాత్రము మోదుగాకుల దొన్నె (పాలాశ పత్రము) ఈ విధముగ నీ ధాత్రి నిజముగ ధాత్రియో (పాలిచ్చి పెంచెడి దాదియే) విధాత్రి (జీవన విధాత్రి బ్రతుకు తెఱవు చూపెడి తల్లి) పావని. చరాచర భూతములకు నిలుచు నాదరుపు. (యోని కారణము) సర్వ కామ దోగ్థ్రి సర్వసస్య ప్రరోహణి. ఆ సముద్ర పర్యంతయైన యీ భూమి మధుకైటభుల మేదస్సుచే (మెదడుచే) మేదిని యన ప్రఖ్యాతి గొన్నది. ఈ పేరు వేదవాదులు పెట్టినది. ఈ వల నీమె పృథు నృపతికి కన్న కూతురయ్యెను గావున పృథివి యను ఖ్యాతి గన్నది.
పృథునా సువిభక్తాచ శోథితా చ వసుంధరా
సస్యాకరవతీ స్ఫీతా పురపత్తవశాలినీ
ఏవంప్రభావో వైన్య స్సరాజాసీద్రాజసత్తమః
నమస్యశ్చైవ పూజ్యశ్చభూతగ్రామై ర్నసంశయః
బ్రాహ్మణైశ్చ మహాబాగై ర్వేదవేదాంగపారగైః
పృథురేవ నమస్కార్యో బ్రహ్మయోనిః సనాతనః
పార్థివైశ్చ మహాభాగైః పార్థివత్వ మిహేచ్ఛుభిః
ఆదిరాజో నమస్కార్యః పృథు ర్వైన్యః ప్రతాపవాన్
యోధైరపి చ విక్రాంతైః ప్రాప్తుకామైర్జయం యుధి
ఆదిరాజో నమస్కార్యో యోధానాం ప్రథమో నృపః
యోహి యోద్ధా రణం యాతి కీర్తయిత్వా పృథుం నృపమ్
న ఘోరరూపా త్సంగ్రామా త్జేమీ భవతి కీర్తిమాన్
వైశ్యైరపి చ విత్తాఢ్యైర్యైశ్యవృత్తివిధాయిభిః
పృథు రేవ నమస్కార్యోృ వ్యత్తిదాతా మహాయశాః
తథైవ శూదైః శుచిభి స్త్రివర్ణ పరిచారిభిః
పృథు రేవ నమస్కార్యః శ్రేయః పర మిహేప్పుభిః
ఏతే వత్స విశేషాశ్చ దోగ్దారః క్షీరమేవ చ
పాత్రాణి చ మయోక్తాని కిం భూయో వర్ణయామి వః
అతనిచే వసుంధర సువిభక్త యయినది సువిశోధిత యయి సస్యములు గనులు గల్గి, పుర పట్టణ గ్రామాదులచే నిండు దనము సంతరించు కొన్నది. వైన్య రాజస్య చూడామణి యిట్టి యసామాన్య ప్రభావుడు రాజ సత్తముడు, భూత, గ్రామముల కెల్ల నమస్కరింప దగినవాడు. పూజింప నర్హుడు. వేదవేదాంగ పారగులైన బ్రాహ్మణులకు గూడ పృథు చక్రవర్తి నమస్కార్యుడు. పార్థివత్వమును గోరు రాజుకు మహానుభావులకు ఆది రాజుగ నభివంద్యుడు. ప్రతాపశాలి శ్రీపృథువు. విక్రమ శీలురైన యోధులకు జయాక్షాంక్ష లయిన వారికి యోధుల కెల్ల ప్రథముడైన పృథువు వంద్యుడు. పృథుని ధ్యానించి, కీర్తించిన యోధుడు ఘోర మయిన సంగ్రామ రంగము నుండి క్షేమముగ మరలి రాగల్గును వాణిజ్య వృత్తినను సరించు వైశ్యులకు విత్త సమృద్ధికై వృత్తి దాతయైన పృథువు వందనీయుడు. శుచివర్తనులై త్రివర్ణముల నుపచరించు శూద్రులకును పృథు చక్రవర్తి నమస్కారార్హుడు. దానవారు పరమ శ్రేయస్సు నంద గలరు మహర్షులార ! మహానుభావు లార! మఱియేమి వినదలతురు? సెలవిండు.
Summary of chapter 4 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The origin and evolution of Vivasvat (the Sun-god, Āditya) are narrated, tracing his birth from Kaśyapa and Aditi. The chapter describes how Vivasvat came to be recognized as the luminous lord of the solar world, his relationship with Saṃjñā (his wife, daughter of Viśvakarman), and the significant progeny born from their union — including Vaivasvata Manu, Yama, and Yamī.