46 - పురుషోత్తమ క్షేత్ర వర్ణనమ్‌

మునులు:

శ్రోతుమిచ్ఛామహే దేవ కథాశేషం మహీపతేః

 తస్మినేక్షత్రవరే గత్వా కించకార నరాధిపః

మునులు:

ఆ మీదికథను, అ క్షేత్ర రాజమున కేగి ఇంద్రద్యుమ్న ప్రభుడేమి చేసెను? తెలుపు మని మును లడిగిరి.

బ్రహ్మ:

శృణుధ్వం మునిశార్దూలాః ప్రవక్ష్యామి సమాసతః

క్షేత్ర సందర్శనం చైవ కృత్యం తస్య చ భూపతేః

గత్వా తత్ర మహీపాలః క్షేత్రే త్రైలోక్యవిశ్రుతే

దదర్శ రమణీయాని స్థానాని సరితస్తథా

నదీతత్ర మహాపుణ్యా వింధ్యపాద వివిర్గతా

 స్విత్రోపలేతి విఖ్యాతా సర్వపాపహరా శివా

గంగాతుల్యా మహాస్రోతా దక్షిణార్ణవ గామినీ

మహానదీతి నామ్నా సా పుణ్యతోయా సరిద్వరా

దక్షిణస్యో దధే ర్గర్భం గతావర్తాతి శోభితా

ఉభయోస్తటయోర్యస్యా గ్రామాశ్చ నగరాణిచ

దృశ్యంతే మునిశార్దూలాః సుసస్యాః సుమనోహరాః

 హృష్ట పుష్ట జనాకీర్ణా వస్త్రాలంకార భూషితాః

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా స్తత్ర పృథక్పృథక్‌

స్వదర్మ నిరతాః శాంతా దృశ్యంతే శుభలక్షణాః

తాంబూల పూర్ణ వదనా మాలాదామ విబూషితాః

వేదపూర్ణముఖా విప్రాః సషడంగ పదక్రమాః

అగ్ని హోత్రరతాః కేచిత్కేచిదౌపాసనక్రకియాః

సర్వశాస్త్రార్ధ కుశలా యజ్వానో భూరిదక్షిణాః

చత్వరే రాజమార్గేషు వనే షూప వనేషుచ

సభామండల హర్మ్యేషు దేవతాయతనేషు చ

ఇతిహాస పురాణాని వేదాః సాంగాః సులక్షణాః

కావ్యశాస్త్ర కథాస్తత్ర శ్రూయంతే చ మహాజనైః

స్త్రియ స్తద్దేశవాసిన్యో రూప యౌవన గర్వితాః

సంపూర్ణ లక్షణోపేతా విస్తీర్ణశ్రోణిమండలాః

సరోరుహ ముఖాః శ్యామాః శరచ్చంద్రనిభాననాః

పీనోన్నత స్తనాః సర్వాః సమృద్ధా చారుదర్శనాః

సౌవర్ణ వలయాక్రాంతా దివ్యైర్వస్త్రై రలంకృతాః

కదళీగర్భ సంకాశాః పద్మకింజల్క సప్రభాః

బింబాధరపుటాః కాంతాః కర్ణాంతాయత లోచనాః

సుముఖా శ్చారుకేశాశ్చ హావభావావ నామితాః

కాశ్చిత్పద్మ పలాశాక్ష్యః కాశ్చిదిందీ వరేక్షణాః

 విద్యు ద్విస్పష్ట దశనాస్త స్వంగ్యశ్చ తథా పరాః

కుటిలాలక సంయుక్తాః సీమంతేన నిరాజతాః

గ్రీవాభరణ సంయుక్తా మాల్యదామ ­భూషితాః

కుండలై రత్నసంయుక్తైః కర్ణపూరై ర్మనోహరైః

దేవయోషిత్రృతీకాశా దృశ్యంతే శుభలక్షణాః

దివ్యగీత వరైర్ధన్యైః క్రీడమానా వరాంగనాః

 ­వీణావేణు మృదంగైశ్చ పణవైశ్చైవ గోముఖైః

శంఖదుందుభి నిర్ఘోషై ర్నానానావాద్యై ర్మనో హరైః

క్రీడయంత్య స్పదాహ్వృష్టా ­లాసిన్యః పరస్పరమ్‌

ఏవమాది తథానేక గీతవాద్య ­శారదాః

దివారాత్రౌ సమాయుక్తాః కామోన్మత్తా వరాంగనాః

భిక్షు వైఖానసైః సిద్ధైః స్నాతకై ర్ర్బహ్మచారిభిః

మంత్రసిద్ధైః తపః సిద్ధైర్యజ్ఞ సిద్ధై ర్ని షే­తమ్‌

ఇత్యేవం దదృశే రాజా క్షేత్రం పరమ శోభనమ్‌

అత్రైవా రాధయిష్యా­మి భగవంతం సనాతసమ్‌

జగద్గురుం పరం దేవం పరం పారం పరం పదమ్‌

సర్వేశ్వరేశ్వరం వి­ష్ణుమనంత మపరాజితమ్‌

ఇదం తన్మానసం తీర్థం జ్ఞాతం మే పురుషోత్తమమ్‌

కల్పవృక్షో మహాకాయో న్యగ్రోధో యత్ర తిష్ఠతి

ప్రతిమా చేంద్రనీలాఖ్యా స్వయం దేవేన గోపితా

న చాత్ర దృశ్యతే చాన్యా ప్రతిమా వైష్ణ­వీ శుభా

తథా యత్నం కరిష్యా­మి యథా దేవో జగత్పతిః

ప్రత్యక్షం మమ చాభ్యేతి ­ష్ణుః సత్యపరాక్రమః

యజ్ఞై ర్దానై స్తపోభిశ్చ హోమై ర్ధ్యానై స్థతా ర్చనైః

ఉపవాసైవ్చ ­ధివ చ్చరేయం వ్రతముత్తమమ్‌

అనన్య మనసా చైవ తన్మనా నాన్యమానసః

వి­ష్ణ్వాయతన వి­న్యాసే ప్రారంభం చ కరోమ్యహమ్‌

బ్రహ్మ:

మునులార వి­నుండు. ఇంద్రద్యుమ్న మహా రాజట కేగి చక్కని ప్రదేశములను, ­వింధ్య పాదము నుండి వెడలెడు పుణ్య నదులను దర్శించెను, సర్వపాప హారిణి గంగ కీడైనది దక్షిణ సముద్రమున సంగ­మించు నదియగు “స్విత్రోవల” అను నది యట గలదు. దాని కిరు వైపుల తీరము లందు సస్య శ్యామలములు మనోహరములు నగు గ్రామములు నగరములు కనిపించును. అందలి ప్రజలు చక్కని వలువలు నగలునుం దాల్చి పుష్టియుం దుష్టియు గొని యుందురు. చతుర్వర్ణముల వారు స్వధర్మ నిరతులై శుభ లక్షణులై కనిపింతురు. నిరంతర తాంబూల చర్వణము నిరంతర పుష్పమాలా ధారణము వారి ప్రత్యేక శుభ చిహ్నము. ­విప్రులు వేద పూర్ణ ముఖులు షడంగ­విదులు. పదక్రమల జటాఘన పాఠులు. నిత్యాగ్ని హోత్రులు ఉపాసకులు సర్వ శాస్త్రార్థ సమర్థులు బూరి దక్షిణ లొసంగిన దీక్షితులు సోమయాజులు చయనులు. రాజ ­వీథులందు నలు దారులు కలిసిన చోట మండపము లందు వనము లందు ద్యాన వనము లందు సభ లందు మేడ లందు దేవాలయము లందు నెట­విన్నను ఇతిహాస పురాణ ప్రవచనము సాంగ వేదా ధ్యయనము కావ్యశాస్త్ర గోష్ఠులు నిపించును. ఆ దేశ మందలి సుందరులు చక్కని రూపము యౌవన ముంగొని ఉత్తమ స్త్రీ సాముద్రిక లక్షణ లక్షితలై శరత్కాల చంద్ర బింబాన నలై దివ్య వస్త్రముల దాల్చి బంగారు కంకణములం ధరించి కద గర్భమున కిడగు బంగరు చాయయు ఎఱ్ఱ దామర పూల పుప్పొడి తేనయగు నరుణారుణ వర్ణమును గల మేనులతో నాకర్ణాంత నేత్రములతో చక్కని నెమ్మోములతో నల్పెక్కిన వేనలితో దొండ పండున కీడగు పెదవులతో హావభావ ­విలాసములతో, కొందఱు తామర రేకుల కెనయగు నయన శోభ గలవారు కొందరు నల్లగలువ రేకుల కీడగు కాటుక కండ్ల యందము గల వారునై యుంగరాల్దిరిగిన ముంగురులతో మెఱపట్లు మెఱయు పలు వరుస గల్గి పీనోన్నత స్తన భారమున సువర్ణ మణిమయ కంఠ హారములు సుమ మాలలుం దూగ మణిమయ కుండల కాంతులు చెక్కుటద్దముల ­మిఱు­మిట్లు గొన సాక్షాద్దేవ సుందరు లోయన దర్శన ­మిత్తురు. ­వీణావేణు మృదంగ వాద్యములు జతసేసి భక్తి భరితము లైన చక్కని పాటల నాటలం బరమాత్మను పరవశింప జేయుదురు. రాత్రి యనక పవలనక నచట శంఖ దుందుభి నిర్ఘోషముని పించును. కామోన్మత్త మైన అ­వ్విలాసినుల నృత్య ­లాసము గాన మాధుర్యమును ననీ దృశము. భిక్షువులు వైఖానసులు స్నాతకులు బ్రహ్మచారులు సిద్ధులు ­వీరువారన నేల మంత్ర సిద్ధులు రస సిద్ధులు ఘటికా పాదుకా సిద్ధులు నచట స్వా­మి పరివారమై సే­వింతురు. ఇట్టి దివ్య క్షేత్రమును దర్శించి యారాజు నిజముగ నిదియే మానస క్షేత్రము. ఇది పురుషోత్తమము. తెలిసి నది నాకిది తెలిసిన దని యప్పొంగి మఱ్ఱి నీడకేగి ఇంద్ర నీలమణి మయమగు నీ నీలమేఘ శరీరుని మూర్తింగని ఆ కల్యాణ మూర్తి నాకు గోచరింప యత్న మొనర్తు గాక యని జన్నము లొనర్చుదును. తపము లాచరింతును. హోమములు సేయుదును. ధ్యానింతును. ఉపవసించి యర్చనలు నొనరింతు గాక యని అనన్య మనస్కుడై ­విష్ణ్వాలయ నిర్మాణము గా­వింతును గాక యని నిశ్చయించెను.