బ్రహ్మ మహా పురాణము
208 - బలదేవ మాహాత్మ్యవర్ణనమ్
మునులు:
శ్రోతుమిచ్ఛామహేభూయో బలభద్రస్య ధీమతః
మునే పరాక్రమంశౌర్యం త న్నో వ్యాఖ్యాతు మర్హసి
యమునాకర్షణాదీని శ్రుతాన్యస్మాభి రత్రవై
తత్కథ్యతాం మహాభాగ యదన్య త్కృతవా న్బలః
మునులు:
ధీశాలి బలభద్రుని పరాక్రమము శౌర్యమును గూర్చి విన గోరెదము. యమునా నదీ సమాకర్షణము మొదలగు నవి విన్నాము. అతడు మఱి యేమిసేసె నన
వ్యాసులు:
శృణుధ్వం మునయః కర్మయద్రణేభవత్కృతమ్
అనంతే నాప్రమేయేన శేషేణ ధరణీభృతా
దుర్యోధనస్య తనయాం స్వయంవరకృతేక్షణామ్
బలా దాదత్తవా న్వీరః సాంబో జాంబవతీసుతః
తతః క్రుద్ధా మహావీర్యాః కర్ణదుర్యోధనాదయః
భీష్మద్రోణాదయ శ్చైవ బబంధు ర్యుధి నిర్జితమ్
త చ్ఛ్రుత్వా యాదవాః సర్వే క్రోధం దుర్యోధనాదిషు
మునయః ప్రతిచక్రుశ్చ తాన్విహంతుం మహోద్యమమ్
తా న్నివార్య బలః ప్రాహ మదలోలాకులాక్షరమ్
మోక్ష్యంతి తే మద్వచనా ద్యాస్యా మ్యేకో హి కౌరవాన్
బలదేవ స్తతోగత్వా నగరం నాగసాహ్వయమ్
బాహ్యోపవనమధ్యేభూ న్న వివేశ చ తత్పురమ్
బల మాగత మాజ్ఞాయ తదా దుర్యోధనాదయః
గా మర్ఘ్య ముదకంచైవ రామాయ ప్రత్యవేదయన్
గృహీత్వా విధివత్సర్వం తతస్తా నాహ కౌరవాన్
ఆజ్ఞాపయ త్యుగ్రసేనః సాంబ మాశు విముంచత
తత స్తద్వచనం శ్రుత్వా భీష్మద్రోణాదయో ద్విజాః
కర్ణదుర్యోధనాద్యాశ్చ చుక్రుధు ర్ద్విజసత్తమాః
ఊచుశ్చ కుపితాః సర్వే బాహ్లికాద్యాశ్చ భూమిపాః
అరాజార్హం యదోర్వంశ మవేక్ష్య ముసలాయుధమ్
వ్యాసులు:
వ్యాసుడు అనంతుడు భూమిని మోయు నాదిశేషుడు నగు బలరామ మూర్తి లీలలు వినుండు. స్వయంవర మున దృష్టి వెట్టుకున్న దుర్యోధనుని కూతురును జాంబవతి కుమారుడు సాంబుడు బలాత్కారముగ హరించెను. దాన కోపించి కర్ణ దుర్యోధ నాదులు భీష్మ ద్రోణాదులును వానిని బోర నోడించి బంధించిరి. అది విని యాదవులు దుర్యోధ నాదులందు కోపము గొని వారిని గడతేర్తు మని ప్రతి క్రియకుం బూను కొనిరి. వారిని వారించి బలరాముడు సగర్వముగ నేనొక్కడన యేగెద. నా మాటచే వానిని విడచెదరని నాగసము అనుపురికేగి వెలుపలి యుద్యానవన మందు విడిసెను. నగరములోని కేగడయ్యె. బలభద్రుడు వచ్చెనని తెలిసి దుర్యోధనాదులు హలికి గోవును పాద్యార్ఘ్యములను నొసంగిరి. అవి స్వీకరించి కౌరవులతో ఉగ్రసేను నాజ్ఞ యిది. సాంబుని వెంటనే విడుపుడు. అన భీష్మ ద్రోణాదులు కర్ణ దుర్యోధను లును విని కోపించిరి. బాహ్లికాదులతో నందరును యదు వంశము రాజ్యార్హము గాదని చూచి ముసలా యుధునితో నిట్లనిరి.
కౌరవులు:
భోభోః కిమేతద్భవతా బలభ ద్రేరితం వచః
ఆజ్ఞాం కురు కులోత్థానం యాదవః కః ప్రదాస్యతి
ఉగ్రసేనోపి యద్యాజ్ఞాం కౌరవాణాం ప్రదాస్యతి
తదలం పాండురైశ్చత్రై ర్నృపయోగ్యై రలంకృతైః
తద్గచ్ఛ బలభద్ర త్వం సాంబ మన్యాయచేష్టితమ్
విమోక్ష్యామో న భవతో నోగ్రసేనస్య శాసనాత్
ప్రణతి ర్యా కృతాస్మాకం మాన్యానాం కుకురాంధకైః
న నామ సా కృతా కేయ మాజ్ఞాస్వామిని భృత్యతః
గర్వమారోపితా యూయం సమానాసనభోజనైః
కోదోషో భవతాం నీతి ర్యత్ప్రీణా త్యనపేక్షితా
అస్మాభి రర్చ్యో భవతా యోయం బలనివేదితః
ప్రేమైణవ స త దస్మాకం కులాద్యుష్మ త్కులోచితమ్
వ్యాసులు:
ఇత్యుక్త్వా కురవః సర్వే నాముంచంత హరేః సుతమ్
కృతైక నిశ్చయాః సర్వే వివిశుర్గజసాహ్వయమ్
కౌరవులు:
బలభద్ర! నీయన్న మాట యిదేమి? ఉత్తమ వంశ మందు బుట్టిన వారి కొక యాదవు డెవ్వడాజ్ఞ యిచ్చుటా? ఉగ్రసేనుడు గూడ కౌరవుల కాజ్ఞ సేయు నేని రాజుల కుచితమైన శ్వేత చ్ఛత్ర మీ కెందులకు, అలంకార ప్రాయములివి యెందులకు? బలభద్ర! నీవు సనుము. అన్యాయ వర్తనుని సాంబుని నీయొక్క కాని ఉగ్రసేనుని యొక్క కాని యాజ్ఞను విడిచి పెట్టము. కుకురాంధ కాదులు రాజులు మాకు ప్రణతు లైనారు. అట్టి ప్రణతి సేయక పోగా పైని స్వామికి భృత్యుడిచ్చి నట్టాజ్ఞ సేయుట యేమి? సహాసన సహపంక్తి భోజనములచే మీరు గర్వ మెక్కింప బడినారు. మీ తప్పేమి! ఓ బల! నీ చెప్పిన యీ యుగ్రసేనుడు మాకు పూజనీయు డగుట ప్రేమ చేతనే. కులమును బట్టి కాదు. ఈ మా మర్యాద మీ కులమునకు దగదు. అని కౌరవు లందురు హరి కుమారుని సాంబుని విడువ రైరి. అందరేక నిశ్చయమున గజసా నగరముం జొచ్చిరి.
మత్తః కోపేన చాఘూర్ణన్ తతోధిక్షేపజన్మనా
ఉత్థాయ పార్ష్ణ్యపసుధాం జఘాన స హలాయుధః
తతో విదారితా పృథ్వీ పార్ష్ణిఘాతాన్మహాత్మనః
అస్ఫోటయామాస తదా దిశః శబ్దేన పూరయన్
ఉవాచ చాతితామ్రాక్షో భ్రుకుటీకుటిలాననః
అదిక్షేపము చే గల్గిన కోపముచే మత్తుగొని ఘూర్ణించుచు లేచి నేలను మడమలం ద్రొక్కి తాటించెను. దాన నీ భూమి పగిలి పోయెను. పెద్ద ధ్వని దిక్కుల బిక్కటిల్ల హలి బాహువులం జరచి కనులెఱ్ఱ వడ కనుబొమలు ముడిపడి మొగము కుటిలము గాగ బలదేవుం డిట్లనియె
బలదేవుడు:
అహోమహావలేపోయ మసారాణాం దురాత్మనామ్
కౌరవాణా మాధిపత్య మస్మాకం కిల కాలజమ్
ఉగ్రసేనస్య యే నాజ్ఞాం మన్యంతే చాప్యలంఘనామ్
ఆజ్ఞాం ప్రతీచ్ఛే ద్ధర్మేణ సహదేవైః శచీపతిః
సదాధ్యాస్తే సుధర్మాం తా ముగ్రసేనః శచీపతేః
ధిఙ్మనుష్యశతోచ్ఛిష్టే తుష్టి రేషాం నృపాసనే
పారిజాతతరోః పుష్పమంజరీ ర్వనితాజనః
బిభర్తి యస్యభృత్యానాం సోప్యే షాం న మహీపతిః
సమస్తభూభుజాం నాథ ఉగ్రసేనః స తిష్ఠతు
ఆద్య నిష్కౌరవా ముర్వీం కృత్వా యాస్యామి తాం పురీమ్
కర్ణం దుర్యోధనం ద్రోణ మద్య భీష్మం సబాహ్లికమ్
దుఃశాసనాదీ న్భూరిం చ భూరిశ్రవసమేవ చ
సోమదత్తం శలం భీమ మర్జునం సయుధిష్ఠిరమ్
యమజా కౌరవాంశ్చాన్యా న్హన్యాం సాశ్వరథద్విపాన్
వీర మాదాయ తం సాంబం సపత్నీకం తతః పురీమ్
ద్వారకా ముగ్రసేనాదీ న్గత్వా ద్రక్ష్యామి బాంధవాన్
అథవా కౌరవాదీనాం సమస్తైః కురుభిః సహ
భారావతరణే శీఘ్రం దేవరాజేన చోదితః
భాగీరథ్యాం క్షిపామ్యాశు నగరం నాగసాహ్వయమ్
ఇత్యుక్త్వా క్రోధరక్తాక్ష స్తాలాంకోధోముఖం హలమ్
ప్రాకారవప్రే విన్యస్య చకర్ష ముసలాయుధః
బలదేవుడు:
అహో! వట్టి నీరసులు దురాత్ము లైనవారి కేమి పొగరిది! మాపై కౌరవుల పెత్తనము కాల ప్రభావము. ఉగ్రసేను నానతి యనుల్లంఘ నీయము (దాట గూడనిది) అని యను కొనరే ఆయన యాజ్ఞను దేవతలతో గూడ శచీపతి సధర్మముగ గైకొనునే. శచీ ప్రియుని యా సుధర్మా సభను ఉగ్రసేనుడే వేళ నధిష్ఠించు చున్నాడు. ఛీ ఛీ! నూరుగురు మనుష్యుల యుచ్ఛిష్ట మైన రాజాసనము నందు వీరికి సంతుష్టియట. పారిజాత తరుపుష్ప మంజరులను ఎవ్వని బంట్రౌతుల యబలా జనము కొప్పులందురుము కొందుఱో యట్టి యుగ్రసేనుడు గూడ వీరికి దొర గాడట. సమస్త సార్వభౌములకు నధి నాథుడైన యుగ్రసేనుం డట్లుండుట! ఇప్పుడు ఉర్వినెల్ల నిష్కౌరవ మొనర్చి యా పురికే నేగెదను. కర్ణుని దుర్యోధను ద్రోణుని యిప్పుడ భీష్ముని బాహ్లికుని దుశ్శాస నాదులను భూరి శ్రవస్సును సోమదత్తుని శలుని భీముని అర్జునుని యాధిష్ఠిరునితో కవలను (నకుల సహదేవులను) మరియుం గల కౌరవులను సాశ్వరథ కుంజరముగ హత మొనర్చెదను. ఆ మీద సాంబుని సభార్యకముగ జేకొని యాపురి కేగెదెను. ద్వారక కేగి యుగ్ర సేనాది బంధువులం జూచెదను. లేదా! ఎల్ల కురు వర్గముతో కౌరవుల భారము హరింప దేవాధీశు ప్రేరణమున శీఘ్రముగ నాగస మను నా నగరమును భాగీరథి లోనికి విసరివై చెదను. అని యిట్లు కోపమున నెఱువువారిన చూపులతో దాలాంకుడుగ ప్రాకారవ్రప్రముస అధో ముఖముగ నాగలి (క్రిందు ముఖముగ) గ్రుచ్చి లాగెను. అతట కౌరవులు గగ్గోలువడి యిట్లు గోల వెట్టిరి.
కౌరవులు:
రామరామ మహాబాహో క్షమ్యతాం క్షమ్యతాం త్వయా
ఉపసంహ్రియతాం కోపః ప్రసీద ముసలాయుధ
ఏషసాంబః సపత్నీక స్తవ నిర్యాతితో బల
అవిజ్ఞాత ప్రభవాణాం క్షమ్యతా మపరాధినామ్
కౌరవులు:
రామ! రామ! మహావీర! క్షమింపు క్షమింపుము. కోపము నుపసంహరింపుము. ప్రసన్ను డవగుము! ఇడుగో సాంబుడు పత్నితో నీచె వెలువరింప బడినాడు. నీ ప్రభావ మెఱుగని యపరాధులను క్షమింపుము. అని కౌరవులు త్వరగ దమ పురమున కేగి భార్యతో సాంబుని విడిచిరి.
వ్యాసులు:
తతో నిర్వాతయామాసుః సాంబం పత్న్యాసమన్వితమ్
నిష్క్రమ్య స్వపురీం తూర్ణం కౌరవా మునిసత్తమాః
భీష్మ ద్రోణకృపాదీనాం ప్రణమ్య వదతాం ప్రియమ్
క్షాంతమేవ మ యేత్యాహ బలో బలవతాం పరః
ఆద్యా ప్యాఘార్ణితాకారం లక్ష్యతే తత్పురం ద్విజాః
ఏష ప్రభావో రామస్య బలశౌర్యవతో ద్విజాః
తతస్తు కౌరవాః సౌంబం సంపూజ్య హలినా సహ
ప్రేషయామాసు రుద్వాహధనభార్యాసమన్వితమ్
వ్యాసులు:
బలవంతుల కెల్ల బలవంతు డగు బలుడు భీష్మ ద్రోణ కృపా చార్యాదులకు ప్రణామములు సేసి శాంతుడ నైతినని పలికెను. ఇప్పటికిని ద్వారక పెల్లగిల్లినది పెల్లగిలి నట్లు కనబడు చున్నది. ఇది బలశౌర్య శాలి బలరాముని ప్రభావము. ఓ ద్విజులార! అవ్వల కౌరవుల సాంబుని హరి సహితంబుగ బూజించి పెండ్లి కానుకలు సారె చీరలు వెట్టి భార్యతో ద్వారకకు బంపిరి.
Summary of chapter 101 of the Brahma Mahā Purana is as follows:
Ominous signs of the coming end of the Yādava clan appear — the divine conch and weapons behave ominously, the city of Dvārakā is troubled by bad portents. Sensing the approach of the end of his earthly mission, Śrī Kṛṣṇa prepares the Yādavas for what is to come. The chapter narrates the final period of Kṛṣṇa's earthly sojourn and the portents signaling the conclusion of the divine avatāra's work on earth.