వ్యాసులు:
వనే విచరతస్తస్య సహగోపైర్మహాత్మనః
మానుషచ్ఛద్మరూపస్య శేషస్య ధరణీభృతః
నిష్పాదితోరుకార్యస్య కార్యేణైవావతారిణః
ఉపభోగార్థ మత్యర్థం వరుణః ప్రాహ వారుణీమ్
వ్యాసులు:
మాయా మానుష రూపమున నొకానొక పనికై యవని నవతరించి గోపకులతో బృందావనమున సంచరించు చున్న తన ఫణా మండలమున ధరణి నెల్ల ధరించిన శేషుని యవతారమై మహత్తర కార్యములను నిర్వహించు చున్న బలరాముని యుప భోగము కొఱకు
వరుణుడు:
అభీష్టా సర్వదా హ్యస్య మదిరేత్వం మహౌజసః
అనంతస్యోపభోగాయ తస్య గచ్ఛముదే శుభే
వరుణుడు వారుణి యను తన శక్తిం గూర్చి ఓ మదిరా! నీవు అనంతుని కెంతయు నిష్టమైన దానవు. అతడు నిన్నాలకించుటకు అనువుగ అచటి కరుగుము అన
వ్యాసులు:
ఇత్యుక్తా వారుణీ తేన సంవిధాన మథాకరోత్
బృందావనతటోత్పన్న కదంబ తరుకోటరే
విచరన్ బలదేవోపి మదిరాగంధమద్భుతమ్
ఆఘ్రాయ మదిరాహర్ష మవాపాథ పురాతనమ్
తతః కదంబాత్సహసా మద్యధారాం స లాంగలీ
పతంతీం వీక్ష్య మునయః ప్రయయౌ పరమాం ముదమ్
పపౌచ గోపగోపీభిః సమవేతో ముదాన్వితః
ఉపగీయమానో లలితం గీతవాద్య విశారదైః
శ్రమతోత్యంత ఘర్మాంభః కణికామౌక్తికోజ్జ్వలః
ఆగత్యయమునాం స్నాతుమిచ్ఛా మీత్యాహ విహ్వలః
యవ్వారుణి సంకర్షణుని సన్నిధానము నకు అరిగెను. బృందావన మందున్న కదంబ (కడిమి) వృక్షము యొక్క తోఱ్ఱలో వసించుచు బలదేవు డద్భుత మైన మద్య పరిమళము నాఘ్రాణించి తొలుతటి చవి గుర్తించి హర్ష మొందెను. అవ్వల నా చెట్టు నుండి పడుచున్న మధ్యధారను జూచి మిగుల సంతోషించెను. గోపికలతో గోపకులతో గూడి గీతవాద్య నిపుణులు తన యశో గానము చేయ ఆ వారుణుని ద్రావెను. శ్రమచే క్రమ్మిన చెమట బిందువులు ముత్యముల వలె భాసిల్ల నతడు యమునకు వచ్చి స్నానము చేయుదు నని పలికెను.
తస్య వాచం నదీ సా తు మత్తోక్తామవమన్యవై
నాజగామః తతః క్రుద్ధోహలం జగ్రాహలాంగలీ
గృహీత్వాతాం తటేనైవ చకర్షమద విహ్వలః
పాపే నాయాపినాయాసి గమ్యతా మిచ్ఛయాన్యతః
సాకృష్టా తేనసహసా మార్గం సంత్యజ్య నిమ్నగా
యత్రాస్తే బలదేవోప్లావయామాసౌ సతద్వనమ్
శరీరిణీ తథోపేత్య త్రాసవిహ్వలలోచనా
ప్రసీదే త్జ్య బ్రవీద్రామం ముంచమాంముశలాయుధ
సోబ్రవీ దవజానాసి మమ శౌర్యబలం యది
సోహంత్వాం హలపాతేన నయిష్యామి సహస్త్రధా
ఇత్యుక్తయాతిసంత్రస్తస్తయా నద్యా ప్రసాదితః
భూభాగే ప్లావితేతత్ర ముమోచయమునాం బలః
ఆ నది యాతని మాట విని తప్పత్రాగి మత్తుచే నన్నమాట యని యనుమానించి యామె రాదయ్యెను. దాన గోపించి యాతడు నాగలి గైకొని మద వివశుడై ఆ నది యొడ్డున బెల్లగించి లాగెను. పాపాత్మురాల! రానైతివి. మరి యెచటి కేని నీ యిచ్చ ననుసరించి పొమ్మనెను. ఆ నదీ దేవత యట్లు తటాలున నాకర్షింప బడి మార్గము విడిచి బలదేవు డున్న అవ్వనము నంతటను ముంచెత్తెను. మరియు శరీరము దాల్చి బెదరిన చూపులతో ఓ హలాయుధా! అనుగ్రహము జూపుము. నన్ను వదలి పెట్టుమని పల్కెను. అతడు నా శౌర్యమును బలమును నీవు కించ పరతు వేని నా నాగలిచే నిన్నుడచి వేయిపాయల వెంట నిన్ను నడిపించెదను. అన నామె మిక్కిలి జడిసి పోయి బ్రతిమాలి నంతట ఆమె ముంచెత్తిన భూభాగ మందామెను వదలెను.
తతః స్నాతస్యవై కాంతి రాజగామ మహావనే
అవతం సోత్పలం చారు గృహీత్వైకంచ కుండలమ్
వరుణ ప్రహితాం చాసై్మ మాలామవ్లూనపంకజామ్
సముద్రార్హే తథా వస్త్రేనీలే లక్ష్మీరయచ్ఛత
కృతావతంసః సతదాచారుకుండల భూషితః
నీలాంబరధరః స్త్రగ్వీ శుశుభేకాంతి సంయుతః
ఇత్థం విభూషితో రేమే తత్ర రామస్తదావ్రజే
మాసద్వయేన యాతశ్చపునః సమథురాం పురీమ్
రేవతీం చైవతనయాంరై వతస్య మహీపతేః
ఉపమేమే బలస్తస్యాం జజ్ఞాతే నిశఠోల్ముకౌ
అవ్వల నతడందు స్నానము చేయగా నద్భుత కాంతి వచ్చెను. తరువాత లక్ష్మి నొక నల్ల గలువను శిరో భూషణము గను వరుణుడు కానుక పంపిన కుండలము వెట్టుకొని వాడిపోని తామర పూమాలను సముద్రుని కుచితము లైన రెండు దివ్యాంబరములను బలభద్రునకు కానుక పెట్టెను. నీలాబ్జము నవతంసముగ ధరించి మణి కుండలము చెవికి బెట్టుకొని యా నీలాంబరములు గట్టు కొని పూలమాల దాల్చి కాంతి నొంది బలరాముడు మిక్కిలి శోభించెను. అచట రెండు మాసములు క్రీడించి మధురకు జని రైవత రాజు కూతురును రేవతిని పరిణయ మాడెను. ఆమె యందతడు నిశఠుడు ఉన్ముఖుడు అను నిర్వురు పుత్రులం గనియెను.
Summary of chapter 91 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Pradyumna — son of Kṛṣṇa and Rukmiṇī who was abducted as an infant by the demon Śambara and raised in his household — grows up as a great hero, slays Śambara, and returns to Dvārakā with his wife Māyāvatī (actually the celestial Rati, Kāma's consort). Their return to the Yādava court is the occasion for joyful recognition and celebration, and the chapter narrates the circumstances of Pradyumna's birth, abduction, and extraordinary upbringing.