బ్రహ్మ మహా పురాణము
222 - వర్ణాశ్రమ ధర్మ వర్ణనమ్.
మునులు:
శ్రోతు మిచ్ఛామహే బ్రహ్మ స్వర్ణధర్మా న్విశేషతః
చతురాశ్రమధర్మాంశ్చ ద్విజవర్య బ్రవీహితాన్
మునులు:
వర్ణ ధర్మములను నాల్గాశ్రమ ధర్మములు వ్యాసభగవాను డిట్లానతిచ్చెను.
వ్యాసులు:
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చ యథాక్రమమ్
శృణుధ్యం సంయతాభూత్వా వర్ణధర్మాన్మయోదితాన్
దయాదానతపోదేవ యజ్ఞ స్వాధాయతత్పరైః
నిత్యోదకీ భవేద్విప్రః కుర్యాచ్చాగ్నిపరిగ్రహమ్
వ్యత్త్యర్థం యాజయేత్త్వన్యాన్ద్విజానధ్యాపయే త్తథా
కుర్యాత్ర్పతి గ్రహాదానం యజ్ఞార్థం జ్ఞానతో ద్విజాః
సర్వలోకహితం కుర్యా న్నాహితం కస్యచిద్ద్విర్ఛవేద్ద్విజాః
మైత్రీ సమ స్తసత్త్వేషు బ్రాహ్మణస్యోత్తమం ధనమ్
గవి రత్నే చ పారక్యే పమబుద్ధిర్భవే ద్ద్విజః
బుతా వభిగమః పత్న్యాం శస్యతే చాస్య భోద్విజా
దానానిదద్యా దిచ్ఛాతో ద్విజేభ్యః క్షత్రియోపిహి
యజేచ్చ వివిధైర్యజ్ఞై రధీయీత చ బోద్విజాః
శస్త్రాజీవో మహీరక్షా ప్రవరా తస్య జీవికా
తస్యాపి ప్రథమే కల్పే పృథివీ పరిపాలనమ్
ధరిత్రీపాలనే నైవ కృతకృత్యా నరాధిపాః
భవంతి నృపతేరక్షా యతో యజ్ఞాది కర్మణామ్
దుష్టానాంశాననా ద్రాజా శిష్టానాం పరిపాలనాత్
ప్రాప్నో త్యభిమాతా న్లోకా స్వర్ణసంస్థాపకో నృపః
పాశుపాల్యం వణిజ్యాం చ కృషిం చ మునిసత్తమాః
వై శ్యాయ జీవికాం బ్రహ్మా దదౌ లోకపితామహః
తస్యా ప్యధ్యయనం యజ్ఞోదానం ధర్మశ్చ శస్యతే
నిత్యనైమి త్తికాదీనామనుష్టానం చ కర్మణామ్
ద్విజాతిసంశ్రయం కర్మ తదర్థం తేనపోషణమ్
క్రయవిక్రజైర్వాపి ధనైః కారుభవైస్తు వా
దానం దద్యాశ్చ శూద్రోపి పాకయజ్ఞైర్యజేత చ
పిత్ర్యాదికం చ వై సర్వం శూద్రః కుర్వీత తేనవై
భృత్యాదిభరణార్థాయ సర్వేషాం చ పరిగ్రహః
ఋతుకాలాభిగమనం స్వదారేషు ద్విజోత్తమాః
దయా సమస్తభూతేషు తితిక్షా నాతిమానితా
సత్యం శౌచమనాయాసో మంగళం ప్రియవాదితా
మైత్రీ చై వాస్పృహా తద్వదకార్పణ్యం ద్విజోత్తమాః
ఆనసూయాచ సామాన్యా వర్ణానాం కథితాగుణాః
ఆశ్రమాణాం చ సర్వేషామేతే సామాన్యలక్షణాః
గుణా స్తథో పధర్మాశ్చ విప్రాదీనామిమే ద్విజాః
క్షాత్రం కర్మ ద్విజస్యోక్తం వైశ్యకర్మ తథాపది
రాజన్యస్య చ వైశ్యోక్తం శూద్రకర్మాణి చైతయోః
సామర్ధ్యే సతి త్యాజ్యముభాభ్యా మపి చ ద్విజాః
తదేవాపది కర్తవ్యం న కుర్యాత్కర్మ సంకరమ్
ఇత్యేతే కథితా విప్రా వర్ణధర్మా మయాద్యవై
ధర్మమాశ్రమిణాం సమ్యగ్భ్రువతోపి నిబోధత
వ్యాసులు:
బ్రాహ్మణునికి దానము దయ తపస్సు దేవ పితృదేవతా యజ్ఞములు స్వాధ్యాయము ప్రధాన ధర్మములు. నిత్యోదకి (స్నానాదులతో చలికి వెఱువక) త్రిషవణ స్నాన నిరతుడు కావలెను. అగ్నులను ఉపాసింప వలెను. జీవనము కొఱకై యితరుల చేత యజ్ఞములు సేయింప వచ్చును. శిష్యులకు వేదములు చెప్ప వలెను. యజ్ఞ నిమిత్తముగా దెలిసి (పాత్రాపాత్ర వివేకముతో) ప్రతిగ్రహము సేయ వచ్చును. బ్రాహ్మణునికి జెప్ప బడిన షట్కర్మలలో ప్రతిగ్రహము (దానము పట్టుట) కూడ విహిత మయి యున్నది. సర్వలోక మునకు హితమే చేయ వలెను గాని యహితము సేయ రాదు. సర్వ భూతములతో మైత్రి బ్రాహ్మణుని కుత్తమ ధనము. ఋతు సమయ మందే భార్యాభి గమనము దీనికి బ్రశంసా పాత్రము. క్షత్రియుడు మనః స్పూర్తిగ ద్విజులకు దానముల యజ్ఞములు వేదా ధ్యయనము చేయ నగును. జగ ద్రక్షణకై అస్త్రము పట్టి జీవించుట క్షత్రియుని ధర్మము. భూ పాలనము కూడ ప్రధాన ధర్మము. దాననే రాజులు కృతార్థులు. యజ్ఞాది రక్షణము రాజు ధర్మము. దుష్టులను శిక్షించుట శిష్టులను రక్షించుట వర్ణధర్మ వ్యవస్థ చేయుట వలన రాజభీష్ట పుణ్య లోకగామి యగును. పశు పాలనము వాణిజ్యము కృషి (వ్యవసాయము) వైశ్యుని వృత్తిగా (జీవికగా) బ్రహ్మ యొసంగెను.అతనికి గూడ అధ్యయనము యజ్ఞము దానము ధర్మము అనునవి నిత్య నైమిత్తిక కర్మా నుష్టానములు బ్రాహ్మణ పురస్సరముగా కర్మాచరణము విహితము. అందులకే బ్రహ్మణులను బోషించుట అందు కొరకే క్రయ విక్రయ వ్యాపారము వడ్రంగము వైశ్యునికి విహితములు. శూద్రుడు దానము లీయ వలెను. పాక యజ్ఞములు సేయ వలెను. పాక యజ్ఞము చేతనే పితరుల నర్చించుట మొదలగు సర్వకర్మా చరణము విహితము. నౌకరులను భరించుటకు సర్వ పరిగ్రహములు సేయ వచ్చును. ఋతు కాలాభిగమన మందఱికిని సామాన్య ధర్మము, అంతేకాదు సర్వ భూతదయ ఓరిమి దురభిమానము లేమి శౌచము అనాయాసము మంగళ కార్య చరణము ప్రియముగా మాట్లాడుట. సర్వులతో మైత్రి దురాశ లేకుండుట ఇవి యన్ని వర్ణములకు అన్ని యాశ్రమముల వారికిని సాధారణ లక్షణములు. ఇవి గాక బ్రాహ్మణాదులకు ఈ క్రింది ఉప ధర్మములు (అపద్ధర్మము లన్న మాట) కూడ చెప్ప బడినవి. అపద్ధర్మముగా (జీవనము గడువ నపుడు) బ్రాహ్మణుడు క్షేత్ర ధర్మమును క్షత్రియుడు వైశ్య ధర్మమును వైశ్యుడు శూద్ర విహిత కర్మమును జేయ వచ్చును. వైశ్య శూద్రులు సమర్థులై యుండి యీ స్వధర్మము లను విడువ రాదు. అపద్ధర్మములో కూడ వారికిది త్యాజ్యము గాదు. కర్మ సాంకర్యము మాత్ర మెన్నడును జేయ గూడదు. ఇవి వర్ణ ధర్మములు సెప్పితిని. ఇక నాశ్రమ ధర్మములం దెల్పెద నెఱింగి కొనుము.
బాలః కృతోపనయనో వేదాహరణతత్పరః
గురోర్గేహే వసన్విప్రా బ్రహ్మచారీ సమాహితః
శౌచాచారరత స్తత్రకార్యం శుశ్రూషణం గురోః
వ్రతాని చరతా గ్రహ్యో వేదశ్చ కృతబుద్ధినా
ఉభే సంద్యే రవిం విప్రా స్తథై వాగ్నిం సమాహితః
ఉపతిష్టేత్తథా కుర్యాద్గురోరప్యభి వాదనమ్
స్థితే తిష్టేద్ర్వజేద్యాతి నీచై రాసీత చాసితే
శిష్యో గురౌ ద్విజశ్రేష్టాః ప్రతికూలం చ సంత్యజేత్
తేనైవోక్తం పఠేద్వేదం నాన్యచిత్తః పురస్థితః
అనుజ్ఞాతం చ భిక్షాన్నమశ్నీ యాద్గురుణా తతః
అవగాహేదపః పూర్వమాచార్యేణావగాహితాః
సమిజ్జలాదికం చాస్య కల్పకల్ప ముపానయేత్
గృహీతగ్రాహ్యవేదశ్చ తతోనుజ్ఞామవాప్యవై
గార్హస్థ్యమావసేత్రాజ్ఞో నిష్పన్న గురు నిష్కృతిః
బాలుడు పనీతుడై వేదధ్యయన తత్పరుడై గురు గృహమందు వసించుచు బ్రహ్మచారియై యుండ వలెను. సదాచారమం దభిలాషగొని గురు శుశ్రూష చేయ వలెను. (శూశ్రూష = విన వలెనను కోరిక అనగా గురువు చెప్పి నట్లు వినుట యనగా నా ప్రకారము నడుచుట) వ్రతములం జేయ వలెను.(అనగా బ్రహ్మచర్య నియమములను బాటింప వలెను.) మనసు నిల్పి (అవధానము గొని) వేదము నేర్చుకో వలెను. మది కుదురు పరచి కొని యుభయ సంధ్యలందు నగ్నికార్య మొనరించి గురున కభివానము సేయ నగును. గురువు నిలువ బడిన తాను నిలువ బడి నడచిన వెంట నడచి యాయనకు క్రిందుగ కూర్చుండ వలెను. గురునకు బ్రతికూల మైన పని వదలి పెట్టవలెను. ఆయనతో వేదము పఠింప వలెను. అతని కెదురుగా గూర్చుండి వేరు తలపు గొనకుండ వలెను. అపై భిక్షాన్నము తెచ్చికొని గురునకు నివేదించి తదను మతిం దానది తిన వలెను. గురువు దిగి స్నానము సేసిన తరువాత నీతీర్థ మందు దాను దిగి స్నానము సేయ వలెను. సమిధులు తీర్థమును నీయనకై ప్రతి కల్పము (అవసర మైనపు డెల్ల) దేవలయును. వేదములు సదివిన తరువాత గురు దక్షిణ సమర్పించి ప్రాజ్ఞుడై గార్హస్థ్య మందు బ్రవేశింప వలెను.
విధినావాప్త దారస్తు ధనంప్రాప్య స్వకర్మణా
గృహస్థ కార్యమఖిలం కుర్యాద్విప్రాః స్వశక్తితః
నిర్వాపేణ పితౄనర్చ్య యజ్ఞైర్దేవాం స్తథాతిథీన్
అన్నైర్మునీం శ్చ స్వాధ్యాయైరపత్యేన ప్రజాపతిమ్
బలికర్మణాతుభూతాని వాక్సత్యేనాఖిలం జగత్
ప్రాప్నోతి లోకాన్పురుషో నిజకర్మసమార్జితాన్
భిక్షాభుజశ్చ యే కేచిత్పరివాడ్ర్బహ్మచారిణః
తేప్యత్ర ప్రతితిష్ఠంతి గార్హస్థ్యం తేన వై పరమ్
వేదాహరణకార్యేణ తీర్థస్నానాయ చ ద్విజాః
అటంతి వసుధాం విప్రాః పృథివీ దర్శనాయ చ
అనికేతా హ్యనాహారా యే తు సాయం గృహాస్తు యే
లేషాం గృహస్థః సతతం ప్రతిష్టా యోనిరుచ్యతే
లేషాం స్వాగతదానాని వక్వవ్యం మధురం సదా
గృహాగతానాం దద్యాశ్చ శయనాసన భోజనమ్
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ర్పతి నివర్తతే
సదత్త్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయగచ్ఛతి
అవజ్ఞాన మహంకారో దంభశ్చాపి గృహే తతః
పరివాదోప ఘాతౌ చ పారుష్యం చ స శస్యతే
యశ్చ సమ్యక్కరోత్యేవం గృహస్థః పరమం విధిమ్
సర్వబంధవినిర్ముక్తో లోకానాప్నోతి చోత్తమమ్
శక్తి కొలది గృహస్థు సేయనగు కార్య మెల్ల జేయ వలెను. పితృ దేవతలను నిర్వాపముచే (తర్పణములచే) దేవతలను నతిథులను యజ్ఞములచే మునుల నన్న దానము స్వాధ్యాయము లచే సంతతి చేత బ్రజాపతిని బలి కర్మచే భూతములను సత్య వచనముచే నెల్ల జగమ్మును నర్చించి పురుషుడు తాజేసిన యీ పుణ్య కర్మ ప్రభావమున బుణ్య లోకముల నందును. భిక్షాన్న భోజనులగు సన్యాసులు బ్రాహ్మచారులు మఱియుం గలవారు యీ గృహము నెడ(గృహస్థు నెడ) నిలుతురు గావున గార్హస్థ్యము. పరమాశ్రమ ధర్మము. వేదములు నేర్చుకొను పనితో తీర్థ స్థానము కొరకు పృథివీ దర్శనము కొఱకు ద్విజులు వసుధపై సంచార మొనరింతురు. ఇల్లు లేక ఆహారము లేక సాయంకాల మందెవరిండ్లకు వత్తు రెవ్వరు. వారికి గృహస్థులు నిలువ నీడ యని చెప్పబడి నాడు. అతడు వారికి మధురాతి మధుర భాషణముల స్వాగతంబు పలుక వలె. (అయ్యా! దయసేయు డన వలయును) ఆ మీద దానములు సేయ గోరు(అన్ని దానాదులు) ఇంటికేగు దెంచిన వారికి పరుండం గూరుచుండ తిన శయనాసన భోజనా దులం గూర్ప వలయును. భగ్నాశుడై యతిథి యెవ్వని యిలు వదిలి పోవునో యా యతిథి తన పాప మాయింటి యజమాని కిచ్చి వాని పుణ్యమం గొని పోవును. ఈసడింపు అహంకారము డాంబికము నింద ఉపఘాత పారుష్యము గృహికి తగదు. గృహస్థీ యుత్తమ ధర్మము పాటించి సర్వబంధ ముక్తుడై యుత్తమ లోకములం బడయును.
వయః పరిణతౌ విప్రాః కృతకృత్యో గృహాశ్రమీ
పుత్రైషు భార్యాం నిక్షిప్య వనం గచ్ఛేత్సహైవ వా
వర్ణమూల ఫలాహారః కేశశ్మశ్రుజటాధరః
భూమిశాయీ భవేత్తత్ర మునిః సర్వాతిథిర్ద్విజాః
చర్మకాశకుశైః కుర్యా త్పరిధానో త్తరీయకే
తద్వ త్రిషవణం స్నానం శస్తమస్య ద్విజో త్తమాః
దేవతాభ్యర్చనం హోమః సర్వాభ్యాగత పూజనమ్
భిక్షా బలిప్రదానం తు శస్తమస్య ప్రశస్యతే
వన్యస్నేహేన గాత్రాణా మభ్యంగశ్చాపి శస్యతే
తపస్యా తస్య విప్రేంద్రాః శీతోష్ణాది సహిష్ణుతా
యస్త్వేతా నియతశ్చర్యా వానప్రస్థశ్చరేన్మునిః
స దహత్యగ్ని వద్దోషాన్ జయేల్లోకాంశ్చ శాశ్వతాన్
వయస్సు పండిన తఱి గృహాశ్రమి కృతకృత్యుడై భార్యను బుత్రుల కప్పగించి వన మేగ వలెను. ఆమెతో నైన నేగ వచ్చును. రాలిన యాకులు దుంపలు రాలిన పండ్లు దినుచు జుట్టు గడ్డము జటలు వెంచికొని నేలం బరుండుచు నట మునియై సర్వులకుం దాన యతిథియై యుండ వలయును. చర్మములు రెల్లు దర్భలతో నల్లిన వానిం గట్టుకొన వలెను. పైని వేసికొన వలెను. తప్పక త్రిషవణ స్నానము సేయ వలెను. దేవతార్చనము హోమము సర్వాభ్యాగత పూజ భిక్ష బలి ప్రదానము నీ వాన ప్రస్థునకు ప్రశస్తమని చెప్ప బడినది. అడవి నూనెలతో నభ్యంగ స్నానమును వీనికి బ్రశస్తము. శీతోష్ణాది ద్వంద్వ సహనము తపస్సునకు నీ నియమము లంబూని వానప్రస్థుడు చరింప వలెను. అట్టి పుణ్యుడు అగ్ని యట్లెల్ల దోషములం దహించి శాశ్వత పుణ్య లోకము లందగలడు.
చతుర్థశ్చాశ్రమో భిక్షోః ప్రోచ్యతే యో మనీషిభిః
తస్య స్వరూపం గదతో బుధ్యధ్యం మమసత్తమాః
పుత్రద్రవ్యకళత్రేషు త్యజేత్స్నేహం ద్విజోత్తమాః
చతుర్థమాశ్రమస్థానం గచ్ఛేన్నిర్దూత మత్సరః
త్రైవర్ణికాం స్త్యజేత్సర్వానారంభాన్ద్విజసత్తమాః
మిత్రాదిషు నమో మైత్రః సమస్తేప్వేవ జంతుషు
జరాయుజాండజాదీనాం వాఙ్మనః కర్మభిః క్వచిత్
యుక్తః కుర్వీత న ద్రోహం సర్వసంగాశ్చ వర్జయేత్
ఏకరాత్ర స్థితిర్గ్రామే పంచరాత్ర స్ధితిః పురే
తథా ప్రీతిర్న తిర్యక్షు ద్వేషో వా నాస్య జాయలే
ప్రాణయాత్రా నిమిత్తంచ వ్యంగారేభుక్తవజ్జనే
కాలే ప్రశస్తవర్ణానాం భిక్షార్థీ పర్యటేద్దృహాన్
అలాభే న విషాదీస్యా ల్లాభే నైవ చ హర్షయేత్
ప్రాణయాత్రికమాత్రః స్యాన్మాత్రా సంగాద్వినిర్గతః
అతిపూజిత లాభాంస్తు జుగుప్యాం చైవ సర్వతః
అతిపూజిత లాభై స్తు యతిర్ముక్తోపి బధ్యతే
కామః క్రోధ స్తథా దర్పో లోభమోహాదయశ్చయే
తాంస్తు దోషాన్పరిత్యజ్య పరివ్నాణ్నిర్మమో భవేత్
అభయం సర్వస్తత్త్వేభ్యో దత్త్వా యశ్చరతే మహీమ్
తస్య దేహాద్విముక్తస్య భయం నోత్పద్యలేక్వచిత్
కృత్వాగ్నిహోత్రం స్వశరీర సంస్థం శరీరమగ్నిం స్వముఖే జుహోతి
విప్రస్తు భిక్షోపగతై హవిర్భిశ్చితాగ్నినా స ప్రజతి స్మ లోకాన్
మోక్షాశ్రమం యశ్చరతే యధోక్తం శుచిశ్చ సంకల్పిత బుద్దియుక్తః
అనింధనం జ్యోతిరివ ప్రశాంతం స బ్రహ్మలోకం వ్రజతి ద్విజాతిః
చతుర్థాశ్రమము భిక్షువునకు సంబంధించి నది. సన్న్యాసమను పేరనగు నా యాశ్రమ ధర్మముం దెల్పెద నెరింగి కొనుడు. కలత్ర పుత్ర దనాదు లందు స్నేహములం బాయవలెను. మాత్సర్య మేమాత్రము నుండ రాదు. త్రైవర్ణిక ధర్మములం గర్మల నన్నింటిని విడువ వలెను. మిత్రాదుల మైత్రుడు సముడునై యెల్ల భూతము లందు నట్లుండ వలెను. జరా యుజములు (మావి వలన బుట్టినవి) అండజములు (పక్షులు) స్వేద జములు (చెమట వలన బుట్టు క్రిములు) ఉద్భిజ్జములు (విత్తు నుండి పుట్టు వృక్షాదులు) నగు వీని యందెందును త్రికరణము లచే నెట్టి ద్రోహము సేయరాదు. సర్వ సంగములు వీడ వలెను. ఒకయూర నొక్క రాత్రి, పురమం దైదు రాత్రులు మాత్రమే యుండ వలెను. పశు పక్ష్యాదు లందు ప్రీతి ద్వేషమును వీని కుండదు. ప్రాణ యాత్రా నిమిత్తము గనే నిప్పు లార్పుకొని జనములు భుజించిన తర్వాత ప్రశస్త వర్ణములు వాండ్లకడ భిక్షాటనము సేయ వలెను. భిక్ష దొరకని చో విషాద పడరాదు. దొరకిన హర్ష పడరాదు. ప్రాణయాత్ర మాత్ర మాత్రాకాల సంగముగొని వెడలి పోవలెను. మితి మీరిన పూజ లాభముల నెల్లడను సహించుకొన వలెను. కామము క్రోధము దర్పము లోభము మోహము మొదలగు దోషములను వీడి నాది నేనను భావము లేక (నిర్మముడు నిరహంకురుడై) యుండ వలెను. వానికి దేహమును వదలు నపుడును భయము కలుగదు. తన మేని లోని యగ్నిని తన ముఖమున నగ్నిహోత్ర మాచరించి అనగా తనలో నున్న జఠరాగ్ని యందు వైశ్వానరాగ్ని యందు హవిస్సుగా పంచాహుతుల రూపమున నాహారమును హోమ ద్రవ్యముగా వేల్చి అది గూడ భిక్షా రూపమున దెచ్చి కొన్న దానినే హోమము సేసి చితాగ్నులైన వారి యొక్క లోకముల కాత డేగును. అగ్ని చయనము సేసిన వారేగు లోకము లందు నన్న మాట) ఇదంతయు వివిదిషాది సంన్య్నాసు లన్నమాట. ఇక మోక్షాశ్రమ సన్యాసియో (విద్వత్స నన్య్నాసి యన్నమాట) యథోక్త విధానమున నాశ్రమ ధర్మము నిర్వహించి సంకల్పిత బుద్ధితో ననింధన మయిన జ్యోతి వలె (కట్టెలు లేని నిప్పు వలె) ప్రశాంత మయిన యా బ్రహ్మ లోకమును బొందును. ద్విజులకు మాత్రమే యీ యాశ్రముము సెప్ప బడినది.
Summary of chapter 115 of the Brahma Mahā Purana is as follows:
The origins and characteristics of the intermediate social categories (saṃkara-jātis) arising from inter-varṇa unions are described. The chapter identifies numerous mixed categories, their prescribed occupations, social standing, and degrees of ritual purity, reflecting the purāṇic attempt to account comprehensively for all social groups within the framework of varṇa-dharma.