23 - భూర్ఛువస్సువరాది లోక వర్ణనమ్‌

మునులు:

కధితం భవతా సర్వ మస్మాకం సకలం తథా

 భువర్లోకాదికాన్‌లోకాన్‌ శ్రోతుమిచ్చామహే వయమ్‌

తథైవ గ్రహసంస్థానం ప్రమాణాని యధాతథా

సమాచక్ష్వ మహాభాగ యథావ ల్లోమహర్షణ

మునులు:

 ఓ లోమహర్షణ! నీవు సర్వమును మాకు దెలిపితివి. భువర్లోకము మొదలగు లోకములను, గ్రహ సంస్థానమును వాని ప్రమాణమును తెలుపుము. అని మునులడుగ

లోమహర్షణుడు:

రవిచంద్రమసోర్యా వన్మయూ ఖై రవభాస్యతే

ససముద్రసరిచ్ఛైలా తావతీ పృథివీ స్శృతా

యావత్ర్పమాణా పృథివీ విస్తారపరిమండలా

సభ స్తావ త్ర్పమాణం హి విస్తారపరిమండలమ్‌

భూమే ర్యోజనలక్షేతు సౌరం విప్రాస్తు మండలమ్‌

లక్షే దివాకరాచ్చాపి మండలమ్‌ శశినః స్థితమ్‌

పూర్ణే శతసహస్రేతు యోజనానాం నిశాకఠాత్‌

నక్షత్రమండలం కృత్స్న ముపరిష్ట్పాత్రకాశతే

ద్విలక్షే చో త్తరే విప్రా బుధో నక్షత్రమండలాత్‌

తావత్ర్పమాణభాగేతు బుధస్యా ప్యుశనాఃస్థితః

అంగారకోపి శుక్రస్య తత్ర్పమాణే వ్యవస్థితః

లక్షద్వయేసు భౌమస్య స్థితో దేవ పురోహితః

సౌరి ర్భృహస్పతే రూర్ధ్వం ద్విలక్షే సమవస్థిత

ప ప్తర్షిమండలం తస్మా ల్లక్షమేకం ద్విజో త్తమాః

ఋషిభ్యస్తు సహస్రాణాం శతా దూర్ధ్వం వ్యవస్థితః

మేధీభూతః సమస్తస్య జ్యోతిశ్చక్రస్య వైధ్రువః

త్రైలోక్యమేత త్కధితం సంక్షేపేణ ద్విజోత్తమాః

ఇజ్యాఫలస్య భూ రేషా ఇజ్యా చాత్ర ప్రతిష్ఠితా

లోమహర్షణుడు:

సూర్య చంద్రుల కిరణ ప్రసారము కలదాక సముద్ర శైల పరివృతమై యున్న ప్రదేశము పృథివీ మండలము, భూమియొక్క విస్తార మెంతో దానికి మీద నున్న అంతరిక్ష విస్తారము నంతే. భూమికి లక్ష యోజనము లలో సౌర మండల మున్నది. దానికి లక్ష యోజనములలో చంద్ర మండల మున్నది. దానికి లక్ష యోజనముల మీద నక్షత్ర మండల మున్నది. ఆ నక్షత్ర మండలము నకు రెండు లక్షల యోజనము లలో నుత్తరమున బుదుడు కలడు. అతని కంటే దూరములో శుక్రుడు, అంతే దూరములో అంగారకుడు (కుజుడు) గలరు. అక్కడకు రెండు లక్షల యోజనముల దూరములో బృహస్పతియు, ఆటకు రెండు లక్షల యోజనములలో శని ఆ మీద లక్ష యోజనములలో సప్తర్షి మండలము దానికి లక్ష యోజనము లలో జ్యోతి శ్చక్రమున కెల్ల కేంద్ర స్థానమై ధ్రువ మండలము నున్నవి. ఈ యంతరిక్ష లోకము జ్యోతిర్మండలము. ఇది యజ్ఞ ఫలమునకు స్థానము. ఇజ్య (యజ్ఞము) ఇందు బ్రతిష్ఠితమై యున్నది. “క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి వర్మజా” మనుష్య లోకమున కర్మఫల సిద్ధి వేగముగ గల్గును.

ధ్రవాదూర్ధ్వం మహర్లోకో యత్రతే కల్పవాసినః

ఏకయోజనకోటౌతు మహర్లోకో విధీయతే

ద్వే కౌట్యౌతు జనో లోకో యత్రతే బ్రహ్మణ స్సుతాః

సునందనాద్యాః కధితా విప్రా శ్చామలచేతసః

చతుర్గుణోత్తరం చోర్ధ్వం జనలోకా త్తపః స్మృతమ్‌

వైరాజా యత్ర తే దేవాః స్థితా దేహవివర్జితాః

షడ్గుణేన తపోలోకా త్సత్యలోకో విరాజతే

ఆవునర్మారకం యత్ర సిద్ధాదిముని సేవితమ్‌

ధ్రువ లోకమునకు మీద నొకకోటి యోజనము లలో కల్పాంత జీవులు నివసించు మహర్లోక మున్నది. దానిపై రెండు కోట్ల యోజనములలో జనో లోకమున్నది. అది బ్రహ్మ మానస పుత్రులు నిర్మల చిత్తులునైన సనకస నందనాదు లుండెడి స్థానము జనో లోకమునకు పై నెనిమిది కోట్ల యోజనములలో తపోలోక మున్నది. అచట వైరాజులను దేహ రహితులైన (విదేహులు) దేవతలు నివసింతురు. తపో లోకమునకు పై నాఱు యోజనములలో సత్య లోకము విరాజిల్లు చున్నది. అచట సిద్ధాది మును లుందురు. అది అపునర్మారకము తిరిగి మరణ ధర్మము లేని పుణ్య లోకము బ్రహ్మ లోకము.

పాదగమ్యం తు యత్కించి ద్వస్త్వస్తి పృథివీమయమ్‌

స భూర్లోకః సమాఖ్యాతో విస్తారోస్య మయోదితః

భూమిసూర్యాంతరం యత్తు సిద్ధాది మునిసేవితమ్‌

భువర్లోకస్తు సోప్యుక్తో ద్వితీయో మునిసత్తమాః

ధ్రువ సూర్యాంతరం యత్తు నియుతాని చతుర్దశ

స్వర్లోక స్సోపి కథితో లోక సంస్థాన చింతకైః

త్రైలోక్యమేతత్కృతకం విప్రైశ్చ పరిపఠ్యతే

జన స్తప స్తథా సత్య మితి చాకృతకం త్రయమ్‌

కృతకాకృతకో మధ్యే మహర్లోక ఇతి స్మృతః

శూన్యోభవతి కల్పాంతే యోయం నచ వినశ్యతి

పాదగమ్య మైన భూభాగ మంతయు భూలోకము. దీని విస్తారము చెప్ప బడెను. భూమికిని, సిద్ధాది ముని సేవిత మైన సూర్య లోకమునకు నడిమి భాగము భువర్లోకము (అంతరిక్షము) అని చెప్ప బడును, ఇది రెండవ లోకము. సూర్యునకు థ్రువునకును నడుమ గల చతుర్దశ నియుత (లక్ష) పరిమాణమైన లోకము స్వర్లోకము. ఈ మూడు లోకములకు కృతకము (కర్మ సంపాద్యము) లను పేరు గలదు. ఆ మీదు జనసపస్సత్య లోకములు మూడును ఆకృతకము లనబడును. కృతకాకృతముల నడిమి భాగము మహర్లోకము. దీనికి కృతకా కృతకమని పేరు. ఇది కల్పాంత మందు శూన్య మగును. కాని నశింపదు.

ఏతే సప్తమహాలోకా మయా వః కథితా ద్విజాః

పాతాళాని చ సప్తైవ బ్రహ్మాండస్యైష విస్తరః

ఏతదండకటాహేన తిర్యగూర్ధ్వ మధస్తథా

కపిత్థస్య యథాబీజం సర్వతో వై సమావృతమ్‌

దశోత్తరేణ పయసా ద్విజా శ్చాండం చ తద్వృతమ్‌

స చాంబు పరివారోసౌ వహ్నినా వేష్టితో బహిః

వహ్నిస్తు వాయునా వాయుర్విప్రాస్తు నభసావృతః

ఆకాశోపి మునిశ్రేష్ఠా మహతా పరివేష్టితః

దశో త్తరా ణ్యశేషాణి విప్రా శ్చైతాని సప్తవై

మహాంతం చ సమావృత్య ప్రధానం సమవస్థితమ్‌

అనంతస్య న తస్యాంతః సంఖ్యానం చాపి విద్యతే

తదనంత మసంఖ్యాతం ప్రమాణేనాపి వై యతః

హేతుభూత మశేషస్య ప్రకృతిః సా పరా ద్విజాః

అండానాం తు సమస్రాణాం సహస్రా ణ్యయుతాని చ

ఈదృశానాం తథా తత్ర కోటికోటిశతాని చ

దారు ణ్యగ్ని ర్యథా తైలం తిలే తద్వ త్పుమా నిహ

ప్రధానేవస్థితో వ్యాపీ చేతనాత్మని వేదనః

ప్రథానం చ పుమాంశ్చైవ సర్వభూతానుభూతయా

విష్ణుశక్త్యా ద్విజశ్రేష్ఠా ధృతౌ సంశ్రయధర్మిణౌ

తయో స్సవ పృథగ్భావే కారణం సంశ్రయస్యచ

బ్రాహ్మణులారా! సప్త మహా లోకములు, సప్త పాతాళములు నాచే చెప్ప బడినవి. ఇది బ్రహ్మాండము యొక్క విస్తృతి. అండ కటాహముతో క్రింద మీద నడుమ వ్యాపించి వెలగ పండు విత్తనము వలె నుండు నది బ్రహ్మాండము. దీనికి పదిరెట్లు విరివి గల యుదకము వహ్నిచే నావరింప బడి యున్నది. అయ్యగ్ని వాయువుచే, నది యాకాశముచే నాకాశము మహత్తత్వముచే పదేసి రెట్లు పరిమాణము గల దానితో నావరింప బడి యున్నది. మహత్తత్వము నావరించి ప్రధాన మున్నది. అది అనంతము. దానికి లెక్క లేదు. అది సమస్త సృష్టికి హేతువైన పరాప్రకృతి. ఇట్టి అనంత కోటికోటి ప్రకృతు లందు దారువు నందగ్ని వలె నువ్వు లందు తైలము వలె చేతనాత్మకమై పురుష తత్వము అనగా పరబ్రహ్మ వస్తువు ప్రధాన మందు వ్యాపించి యున్నది. ఈ ప్రధానము పురుష తత్వము సర్వ భూతముల యను బూతిలో నున్న విష్ణుశక్తిచే ధరింప బడి పరస్పరాశ్రయ ధర్మము కలవియై యున్నవి. ఆ రెంటి పృథగ్భావమునకు, సంశ్రయ మునకు ఆ విష్ణుశ క్తియే కారణము.

క్షోభకారణభూతా చ సర్గకాలే ద్విజో త్తమాః

యథా శైత్యం జలే వాతో బిభర్తి కణికాగతమ్‌

జగ చ్ఛక్తి స్తథా విష్ణోః ప్రధాన పురుషాత్మకమ్‌

యథా చ పాదపో మూలస్కంధశాఖాదిసంయుతః

ఆద్యబీజా త్ర్పభవతిః బీజాన్యన్యాని వై తతః

ప్రభవంతి తత స్తేభ్యో భవం త్యన్యే పరే ద్రుమాః

తేపి త ల్లక్షణద్రవ్యకారణానుగతా ద్విజాః

ఏవ మవ్యాకృతా త్పూర్వం జాయంతే మహదాదయః

విశేషాంతా స్థత స్తేభ్యః సంభవంతి సురాదయః

తేభ్యశ్చ పుత్రా స్తేషాం తు పుత్రాణాం పరమే సుతాః

బీజా ద్వృక్ష ప్రరోహేణ యధా నాపచయ స్తరోః

భూతానాం భూతసర్గేణ నైవా స్త్యపచయ స్తథా

సంనిధానా ద్యధాకాశకాలాద్యాః కారణం తరోః

త థైవాపరిణామేన విశ్వస్య భగవా న్హరిః

వ్రీహిబీజే యథా మూలం నాళం పత్రాంకురౌ తథా

కాండ కోశా స్తథా పుష్పం క్షీరం తద్వచ్చ తండులమ్‌

తుషాః కణాశ్చ సంతో వై యాం త్యావిర్భావ మాత్మనః

ప్రరోహహేతు సామగ్ర్య మాసాద్య మునిసత్తమాః

తథా కర్మ స్వనేకేషు దేవాద్యా స్తనవః స్థితాః

విష్ణుశక్తిం సమాసాద్య ప్రరోహ ముపయాంతి వై

స చ విష్ణుః పరం బ్రహ్మ యతః సర్వమిదం జగత్‌

జగచ్చ యో యత్ర చేదం యస్మి న్విలయ మేష్యతి

తద్ర్బహ్మ పరమం ధామ సదసత్పరమం పదమ్‌

యస్య సర్వ మభేదేన జగ దేత చ్చరాచరమ్‌

స ఏవ మూలప్రకృతి ర్వ్యక్తరూపీ జగచ్చ సః

తస్మిన్నేవ లయం సర్వం యాతి తత్ర చ తిష్ఠతి

కర్తా క్రియాణాం స చ ఇజ్యతే క్రతుః

స ఏవ తత్కర్మఫలం చ తస్య యత్‌

యుగాది యస్మాచ్చ భవే దశేషతో

హరే ర్నకించి ద్వ్యతిరిక్త మస్తి తత్‌

సృష్టి కాలమందు విష్ణుశక్తి యైన మాయ (ప్రకృతి) యే కారణ రూపమైన తత్త్వము నందు క్షోభకు కారణ మగును. అదే ప్రథమ స్పందనము. ఈ శక్తి, వాయువు నీటి బిందువు లందలి చలువను భరించి నట్లు, ప్రధాన పురుషాత్మకమై యీ జగత్తును భరించును. చెట్టు, మొదలు స్కంధము (బోదె) కొమ్మలు రెమ్మలు ఆకులతో మొదటి విత్తనము నుండి పుట్టును. ఆచెట్టు నుండి మఱల విత్తనము పుట్టును. ఈ క్రమము నందు పుట్టిన చెట్లు మొదలయిన వాని లక్షణములు తత్తద్రవ్యముల కారణముల నను సరించి యున్నట్లే యీ జగత్పరంపర (బీజ పరంపర) అనంతమైన జగత్కారణమైన విష్ణువు ననుసరించి యుండును. ఆ విష్ణువే యవ్యాకృత తత్త్వము. ఆ బీజము నుండియే మహత్తు అహంకారము సమష్టి మనస్సు మొదలగు నవి వ్యాకృత మగు చున్నవి. (అవ్యాకృత మునే యవ్యక్త మని వ్యాకృతమును వ్యక్త మని శాస్త్రము వ్యవహరించినది). అహంకార తత్త్వము నుండి దేవ వర్గము తత్పుత్రులు పౌత్రులు జనించిరి. బీజము నుండి మొలక మొలక నుండి వృక్షము తద్భాగములు పుట్టి నపుడు బీజాదులకు నాశము లేనట్లు భూతల పరిణామము వలన మూల భూతముల కపచయము లేదు. వృక్షమునకు నాకాశము కాలము మొదలైన ద్రవ్యములు సన్నిధాన మాత్రమున కారణ మైనట్లు సర్వసాక్షి యయిన భగవంతుని సన్నిధాన మాత్రమున బొడమెడి నామ రూపాత్మక వివిధ సృష్టి వలన సర్వాధిష్ఠాన మైన భగవ తత్త్వమునకు నుపచయా పచయములు లేవు. హరి పరిణామము లేకుండగనే కారణమగు చున్నాడు. ధాన్యపు గింజలో మూలము కాడ మొలక ఆకు కోశము పువ్వు క్షీరము, ధాన్యము బియ్యము ఊక తవుడు మొదలైన పదార్థములు (అవ్యక్త ముగ) ఇమిడి యుండి తరువాత వ్యక్త మైనట్లు పరమాత్మ యందు సృష్టి కారణ సామగ్రి యయిన అనేక కర్మ బీజములు దేవాద్యుపాధులు జీవ శరీరమును నిండి యుండి విష్ణు శక్తిలన యప్పరమాత్మ నుండి యావిర్భావమును బొందు చున్నవి. కావున నీ జగమెల్ల పుట్టి, పెరిగి, లయించుటకు హేతువైన విష్ణువే పరబ్రహ్మ మన బడును. అదియే పరంధామము, పరమ పదము, సదసద్రూపము ననబడు పరతత్త్వము. చరాచర మైన యీ జగత్తు అభేద దృష్టిచేత నతడే యగును. మూల ప్రకృతియు, వ్యక్తరూప మగు జగత్తును నతడే. ఆతని యందే సర్వము నిలుచు చున్నధి, లయించు చున్నది. యజ్ఞకర్త యజ్ఞము యజ్ఞమున యజింప బడువాడు యజ్ఞభోక్త యజ్ఞఫలము నాతడే. సర్వ స్వరూపు డయిన నతని నుండియే యుగాది కాల గణన మేర్పడినది. ఆ హరికి వ్యతిరిక్తమయినదే కొంచెము లేదు.