బ్రహ్మ మహా పురాణము
22 - నరకవర్ణనమ్
లోమహర్షణుడు:
తతశ్చానంతరం విప్రా నరకా రౌరవాదయః
పాపితో యేషు పాత్యంతే తాన్ శృణుధ్వం ద్విజోత్తమాః
లోమహర్షణుడు:
ఓ విప్రులారా! పాపాత్ములు పడ వేయబడు రౌరవాది నరకము లనుగూర్చి యిక వినుడు.
రౌరవ శ్శ్‌కరో రోద స్తాలో విశసన స్తథా
మహాజ్రాల స్తప్తకుంఢో మహాలోభో విమోహనః
రుధిరాంధో వసాత ప్తః కృమీశః కృమిభోజనః
అసిపత్రవనం కృష్ణో లాలాభక్షశ్చ దారుణః
తథా పూయవహః పాపో వహ్నిజ్వాలో హ్యధశ్శిరాః
సదంశః కృష్ణసూత్రశ్చ తమ శ్చావీచిరేవ చ
శ్వభోజనోథాప్రతిష్ఠో మావీచిశ్చ తథాపరః
ఇత్యేవమాదయశ్చాన్వే నరకా భృశదారుణాః
యమస్య విషయే ఘోరాః శస్త్రాగ్ని విషదర్శినః
పతంతి యేషు పురుషాః పాపకర్మరతాశ్చ యే
రౌరవము, శౌకరం, రోధము తాలము, విశసనము, మహాజ్వాల, తప్తకుడ్యము మహాలోభము, వియోచనము రుధిఠాంధము, వసాతప్తము, కృమీశము, కృమి భోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, పూయ వహము, వహ్నిజ్వాలం, అధశ్శిరము, సదంశము, కృష్ణసూత్రము, తమస్సు, ఆవీచి, శ్వభోజనము, అప్రతిష్టము మావీచి అనునవి. పరమ దారుణము లైన మరి పెక్కు నరకములు గలవు. ఇవి యముని పరిపాలన దేశములు శస్త్ర, అగ్ని, విషములం బ్రయోగించు యమ భటులు పాప కర్మాసక్తి గల వారు వీని యందుందురు.
కూటసాక్షీ తథా సమ్యక్పక్షపాతేన యో వదేత్
య శ్చావ్య దనృతం వ క్తి స నరో యాతి రౌరవమ్
భ్రూణహా వురహంతా చ గోఘ్నశ్చ మునిసత్తమాః
యాతి తే రౌరవం ఘోరం యశ్చోచ్ఛ్యాస నిరోధకః
సురాపో బ్రహ్మహా హర్తా సువర్ణస్య చ శూకరే
ప్రయాతి నరకే యశ్చత్తెః సంసర్గ ముపైతివై
రాజన్యవైశ్యహాచైవ తథైవ గురుతల్పగః
తప్తకుంభే స్వసృగామీ హంతి రాజభటం చయః
మాధ్వీ విక్రయకృ ద్వధ్యపాలః కేసరవిక్రయీ
తప్తలోహే పతంత్యేతే యశ్చ భక్తం పరిత్యజేత్
దొంగ సాక్ష్య మిచ్చిన వాడు, పక్షపాత బుద్ధితో మాట్లాడు వాడు, అబద్ధము చెప్పు వాడు రౌరవమున కేగును. భ్రూణ హత్య నగర ధ్వంసము గోహత్య చేసిన వాడు జీవుల యూపిరి యాడకుండ చేసిన వాడు భయంకర రౌరమున కేగుదురు. బ్రహ్మ హత్యా కారకుడు బంగారమును దొంగిలించిన వాడు వాని స్నేహితుడు శూకర నరకమున బడుదురు. క్షత్రియ వైశ్య ఘాతకురు, గురు పత్నిని, అప్ప చెల్లెండ్రను గూడిన వాడు రాజ భటుని హత్య చేసిన వాడు తప్త కుంభమను నరకమున గూలును. మద్య విక్రేత వధ్య పాలుడు ఉరి తీయు స్థానమును గాయువాడు (లేక) వధింప దగిన వానినిగా పాడిన వాడు కేసర విక్రేత (విష మమ్మువాడు.) భక్తుని విడిచిన వాడు తప్త లోహమను నరకమున గూలుదురు.
సుతాం స్నుషాం చాపి గత్వా మహాజ్వాలే నిపాత్యతే
అవమంతా గురూణాం యోయశ్చాక్రోష్టా నరాధమః
వేదదూషయితా యశ్చ వేదవిక్రయకశ్చ యః
అగమ్యగామీ యశ్చ స్యా తే యాంతి శబలం ద్విజాః
చౌరో విమోహే పతతి మర్యాదాదూషక స్థథా
దేవద్విజ పితృద్వేష్టా రత్నదూషయితా చ యః
స యాతి కృమిభక్ష్యే వై కృమీశే తు దురిష్టికృత్
పితృదేవాతిథీ న్యస్తు పర్యశ్నాతి ద్విజోత్తమాః
లాలాభక్ష్యే స యా త్యుగ్రే శరకర్తా చ వేధకే
కరోతి కర్ణినో యశ్చ యశ్చ ఖడ్గాదికృన్నరః
ప్రయాం త్యేతే విశసనే నరకే భృశదారుణే
అసత్ర్పతిగ్రహీతా చ నరకే యా త్యధోముఖే
అయాజ్యయాజక స్తత్ర తథా నక్షత్రసూచకః
కృమిపూయే నరశ్చైకో యాతి మిష్టాన్నభుక్సదా
లాక్షామాంసరసానాం చ తిలానాం లవణస్య చ
విక్రేతా బ్రాహ్మణో యాతి తమేవ నరకం ద్విజాః
మార్జారకుక్కుటచ్ఛాగశ్వవరాహ విహంగమాన్
పోషయ న్నరకం యాతి తమేవ ద్విజసత్తమాః
రంగో పజీవీ కైవర్తః కుండాశీ గరదస్తథా
సూచీ మాహిషకశ్త్చెవ పర్వగామీ చ యో ద్విజః
అగారదాహీ మిత్రఘ్నః శకునీ గ్రామయాజకః
రుధిరాంధే పతం త్యేతే సోమం విక్రీయతే చ యః
మధుహా గ్రామహంతా చ యాతి వైతరిణీం నరః
కూతురును కోడలిని సంగ మించిన వాడు, మహా జ్వాలమను నరకమున పడవేయ బడును. వేద దూషకుడు. వేద విక్రయి అగమ్యగామి, శబలమును నరకము పాలగును. దొంగ హద్దు మీరిన వాడును విమోహ నరకమున బడును. దైవ బ్రాహ్మణ పితృ ద్వేషియు రత్నములను (శ్రేష్ఠ వన్తువులను) దూషించిన వాడు కృమి భక్ష్వమును నరకమును పొందును. దుర్యాగము చేసిన వాడు కృమీ శమును నరకము పాలగును. పితృ దేవతా తిధులను విడిచి కుడిచిన వాడు లాలా (చొంగ) భక్ష్యమను నరకమున బడును. బాణములను చేయు వాడు వేధక నరకమున బడును, ఖడ్గాదులను చేయు వాడును, కర్ణికారుడు, (కర్ణి + ఒక విధమైన యాయుధము) పరమ దారుణమైన విశసన మను నరకమున పడుదురు. అపాత్ర దానము పట్టిన వాడు అయాజ్య యాజనము చేయ కూడని వానిచే యజ్ఞము చేయించిన వాడు నక్షత్ర సూచకుడు జ్యోతిష శాస్త్రము వెలియకయే జాతక ముహూర్త ములు చెప్పువాడు అధో ముఖ నరకము నందును అతిథికి పెట్టక మృష్టాన్న మారగించు వాడు కృమిపూయ నరకమున కేగును. లాక్ష = లక్క, మాంసము, రనములు, మధుర పానీయములు, నువ్వులు, ఉప్పు అనువాని నమ్ము బ్రాహ్మణుడు కూడ కృమిఫూయ నరకమున పడును. పల్లి, కోడి, మేక, కుక్క, పంది పఱులు వీనిని పెంచు వానికీని అదేగతి. రంగోపజీవి నాటకాము లందు నటించి జీవించు వాడు జాలరి కుండాశి భగ భక్షకుడు (వీర్య పానము చేయు వాడు) లేక జూరజుని అగ్రము నుతించు వాడు, విషము పెట్టువాడు, సూచి చాడీకోరు, పేచీకోరు మూహిషకుడు, దున్న పోతుల వ్యాపారి, పర్వము లందు స్త్రీ సంయోగము సేసిన బ్రాహ్మణుడు, కొంప లంటించు వాడు, మిత్ర ఘాతకుడు, శకునములు చెప్పు వాడు, గ్రామ పాచకుడు, సోమ విక్రయ రుధిరాంధ కూపమున పడుదురు. తేనె పుట్టలను రేపిన వాడు గ్రామ నాశనము చేసిన వాడు వైతరిణిం బడును.
రేతః పానాదిక ర్తారో మర్యాదాభేదినశ్చ యే
తే కృచ్ఛ్రే యాంత్యశౌచాశ్చ కుహకాజే వినశ్చయే
అసిపత్రవనం యాతి వనచ్ఛేదీ వృథైవ యః
జారభ్రికా మృగవ్యాధా వహ్నిజ్వాతే పతంతివై
యాంతి తత్త్రెవ తే విప్రా యశ్చాపాకేషు వహ్నిదః
వ్రతోపలోపకో యశ్చ స్వాశ్రమాద్విచ్యుతశ్చ యః
సందంశయాతనామధ్యే పతత స్తా వుభావపి
దివాస్వప్నే షు స్యందంతే యే నరా బ్రహ్మచారిణః
పుత్త్రెరధ్యాపితా యేతు తే పతంతి శ్వభోజనే
ఏతే చాన్యే చ నరకాః శతశోథ సహస్రశః
యేషు దుష్కృతకర్మాణః పచ్యంతే యాతనాగతాః
తథ్తేవ పాపాన్యేతాని తథాన్యాని సహస్రశః
భుజ్యంతే జాతిపురుషై ర్నరకాంతరగోచరైః
వర్ణాశ్రమ విరుద్ధం చ కర్మ కుర్వంతి యే నరాః
కర్మణా మనసా వాచా నిరయేషు పతంతి తే
అధఃశిరోభి ర్దృశ్యంతే నారక్తె ర్దివి దేవతాః
దేవాతాశ్చాధో ముఖా న్సర్వా నధః పశ్యంతి నారకాన్
స్థావరాః కృమయో బ్జాశ్చ పక్షిణః పశవో నరాః
ధార్మికా స్త్రిదశా స్తద్వ న్మోక్షిణశ్చ యథాక్రమమ్
సహస్రభాగః ప్రథమా ద్ధితీయేనుక్రమాత్తథా
సర్వే హ్యేతే మహాభాగా యావన్త్మ సమాశ్రయాః
రేతః పానము చేసిన వాడు, మర్యాదో ల్లంఘనము చేసిన వాడు (సదాచారములను కట్టు బాట్లను దప్పిన వాడు) మాయా జీవనులు, ఆచార హీనులు, కృచ్ర్ఛ నరకమున బడుదురు. జౌర భ్రికులు (గొఱ్ఱల మందచే జీవించు వారు.) మృగ వ్యాధులు వహ్ని జ్వాలమను నరకమునం బడుదురు. అపాక మలందు ((వండ గూడని వస్తవులకు))అగ్నిని పెట్టిన వాడు అదే నరకమునం బడును. వ్రత లోపము ఆశ్రమ ధర్మచ్యుతి చేసిన వాడు సందంశ యాతనమను నరకమున బడును. దివాస్వాపకా లయిన బ్రహ్మచారులు, కొడుకుల దగ్గర యధ్యయనము చేసిన వారు శ్వభోజన మను నరకమున బడుదురు. ఇట్టివి నూర్ల కొలది వేల కొలది నరకములు కలవు. పాపములను చేసిన వారు ఈ బొంది విడిచి యాతనా శరీరముల నొంది యిందు హిసింప బడుదురు. వర్ణా శ్రమ విరుద్గ మైన కర్మను త్రికరణము లచే చేసిన వారు నరకము పాలగుదురు. ద్యులోక మందలి దేవతలు, తల క్రిందులుగా నుండు నరకలోక జీవులచే చూడబడు చుందురు. దేవతలు నరక లోక వాసులను అథో ముఖులుగా జూచు చుందురు. జీవులు స్థావరములు, కృములు, జల జంతువులు, పక్షులు పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు నను వరుసలో జన్మించి క్రమ ముక్తి నందుదురు.
యావంతో జంతవః స్వర్గే తావంతో నరకౌకసః
పాపకృ ద్యాతి నరకం ప్రాయశ్చిత్త పరాజ్ముఖః
పాపానా మనురూపాణి ప్రాయశ్చిత్తాని యద్యథా
తథా తధైవ సంస్కృత్య ప్రోక్తాని పరమర్షిభిః
పాపే గురూణి గురుణి స్వల్పా న్యల్పేచతద్విదః
ప్రాయశ్చిత్తాని విప్రేంద్రా జగుః స్వాయంభువాదయః
ప్రాయశ్చిత్తాన్యశేషాణి తపఃకర్మాత్మకానివై
యాని తేషా మవేషాణాం కృష్ణానుస్మరణం పరమ్
కృతే పాపేనుతాపో వై యస్య వుంసః ప్రజాయతే
ప్రాయశ్చిత్తంతు తస్త్యెకం హరిసంస్మరణమ్ పరమ్
ప్రాత ర్నిశి తథా సంధ్యామధ్యాహ్నాదిషు సంస్మరన్
నారాయణమవాప్నోతి సద్యః పాపక్షయా న్నరః
విష్ణుసంస్మరణా తీణసమస్తక్లేశ సంచయః
ము క్తిం ప్రయాతి భో విప్రా విష్ణో స్త స్యానుకీర్తనాత్
వాసుదేవే మనో యస్య జపహోమార్చనాదిషు
తస్యాంతరాయో విప్రేంద్రా దేవేంద్రత్వాదికం ఫలమ్
క్వ నాకపృష్ఠగమనం పునరావృత్తిలక్షణమ్
క్వ జపో వాసుదేవేతి ముక్తిబీజ మనుత్తమమ్
తస్మా దహర్నిశం విష్ణుం సంస్మర న్పురుషో ద్విజాః
న యాతి నరకం శుద్ధః సంక్షీణాఖిలపాతకః
మనఃప్రీతికర్మః స్వర్గో నరక స్తద్విపర్యయః
నరకస్వర్గ సంవై పావపుణ్యే ద్విజోత్తమాః
స్వర్గ మందెందరు జీవు లుందురో నరక మందు నందరుందురు పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసి కొనని వాడు నరక మేగును. ఆయా పాపముల కను రూపము లైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ చిన్న దానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను దెల్పిరి. స్వాయంభువ మనువు మొదలయిన వారా ప్రాయశ్చిత్త కాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము కృష్ణ స్మరణము. దానిని మించినది లేదు. ప్రాయశ్చిత్త మనగా తపస్సు. పాపము జేసి యను తాపమి నొందెనేని హరిస్మరణ చేసె నేని దానిని మించిన పుణ్య సాధనము లేదు. దాన జీవి నారాయణుని జెందును. ప్రాతః కాలాహో రాత్రము లందు సంధ్యా సమయము లందు నారాయణ స్మరణ చేసి పాపక్షయ మంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జప హోమార్చనము లందు, వాసుదేవు నందు లగ్నమై యుండునో వాడు ముక్తి నొందును. విష్ణువు నందప్పుడప్పుడు మనసు నిలువక చలించె నేని, వానికి దేవేంద్రాది పదవి లభించును. పుసరావృత్తి లక్షణ మ్తెన స్వర్గ గమన మెక్కడ? ముక్తి బీజమైన వాసుదేవ నామ స్మరణ మెక్కడ? కావున అహర్నిశము పురుషుడు, విష్ణు స్మరణ జేయుచు పాపక్షయ మంది. శుద్ధు డైనచో నరక ధర్శనము జేయడు. స్వర్గము మనః ప్రీతి గూర్చి నది, దానికి వ్యతిరేకము నరకము. నరక స్వర్గము లనగా పాప పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసుదేవై కచిత్తుడు అపునరావృత్తి లక్షణ మైన సాయుజ్య ముక్తి కర్హుడన్న మాట.
వస్త్వేకమేవ దుఃఖాయ సుఖా యేర్ష్యోదయాయచ
కోపాయ చ యత స్తస్మా ద్వస్తు దుఃఖాత్మకం కుతః
తదేవ ప్రీతయే భూత్వా పునర్దుఃఖాయ జాతయే
తదేప కోపాయ యతః ప్రసాదాయ చ జాయతే
తస్మాద్దుఃఖాత్పకం నాస్తి న చ కించి త్సుఖాత్మకమ్
మనసః పరిణామోయం సుఖదుఃఖాది లక్షణః
జ్ఞానమేవ పరం బ్రహ్మాజ్ఞానం బంధాయ చేష్యతే
జ్ఞానాత్మక మిదం విశ్వం న జ్ఞానాద్ద్విద్యతే పరమ్
విద్యావిద్యేహి భో విప్రా జ్ఞానమే వావధార్యతామ్
ఏవ మేత న్మయాఖ్యాతం భవతాం మండలం భువః
పాతాళాని చ నర్వాణి తధైవ నరకా ద్విజాః
సముద్రాః పర్వతాశ్చైవ ద్వీపావర్షాణి నిమ్నగా
సంక్షేపా త్సర్యమాఖ్యాతం కిం భూయః శ్రోతు మిచ్ఛథ
ఒకే వస్తువు దుఃఖము నకు, సుఖముకు ఈర్ష్యకు కోపము నకు కారణ మగును. కావున నే వస్తు వైనను దుఃఖాత్మకమే. ఆ వస్తువే యొకప్పుడు కోపమునకు హేతువై యదే ప్రసన్నతకు గారణ మగును. కావున కేవలము దుఃఖాత్మకము కేవలము సుఖాత్మకము నయిన వస్తువు లేనే లేదు. సుఖ దుఃఖాది లక్షణ మైన యీ పరిణామము కేవల మానసికము, బ్రహ్మజ్ఞాన మొక్కటియె జ్ఞానము. లౌకిక మయిన జ్ఞానము బంధ మునకు బ్రహ్మ జ్ఞానము ముక్తికిని కారణ మగును, ఈ ప్రపంచ వ్యవహారము తెలివి వలననే జరుగును. కాని ధీనికే మందదు. విద్య అవిద్య యను వానిని బ్రహ్మ జ్ఞానము, లౌకిక జ్ఞానము నుగా గ్రహింప వలెను. (మోక్ష విషయక మైన జ్ఞానమే జ్ఞాన మనియు, తదన్య విషయక మైన తెలివి విజ్ఞాన మనియు సమరుడు చెప్పెను.) అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృత మశ్నుతే అనగా నవిద్యచే జరా మరణము లను లేకుండ జేసికొని విద్యచే సమృత స్థితిని (మోక్షమును) బొందునని శ్రుతి చెప్పినది. ఔపనిషద మైన జ్ఞానము బ్రహ్మజ్ఞాన మగును. పేర విద్యాశబ్ద వాఛ్యమై కేవల మవునరావృత్తిక మైన ముక్తికి హేతు వగును తక్కిన వేద వేదాంగాది విద్యలు, తదుదిత కర్మా నుష్ఠానమున విద్యగా బేర్కొన బడి స్వర్గాది భోగమాత్ర సాధనములగు నన్నమాట. వీనిచే జిత్తశుద్ది వడసి పునరావృత్తి సహితము లయిన పుణలోక భోగములను బొంద వచ్చును. కేవలము విద్య వలననే మోక్షస్థితి కలుగునను భావము. ఈ విధముగ నా చే భూ మండలము సమస్త పాతాళములు, నరకములు, మీకు చెప్పబడినవి, సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు, సంక్షేపముగ చెప్ప బడినవి. ఇంకేమి వినగోరు చున్నారు.
Summary of chapter 22 of the Brahma Mahā Purana is as follows:
The Dhruva (Pole Star) is described in its cosmological significance as the cosmic pivot around which all heavenly bodies revolve. The sacred story of the boy Dhruva — spurned by his father, performing intense tapas, and obtaining Viṣṇu's grace to secure the highest fixed position in the heavens — is narrated. The orbits of the sun, moon, and planets relative to the Pole Star are cosmologically mapped.