బ్రహ్మ మహా పురాణము

180 - శ్రీకృష్ణ చరితే - చతుర్వ్యూహ వర్ణనమ్‌

వ్యాసులు:

నమస్కృత్వా సురేశాయ విష్ణవే ప్రభవిష్ణవే

పురుషాయ పురాణాయ శాశ్వతాయావ్యయాయ చ

చతుర్వ్యూహాత్మనే తస్మై నిర్గుణాయ గుణాయ చ

వరిష్ఠాయ గరిష్ఠాయ వరేణ్యాయామితాయచ

యజ్ఞాంగాయాభిలాంగాయ దేవాద్యైరీప్సితాయ చ

యస్మాదణుతరం నాస్తి యస్మాన్నా స్తి బృహత్తరమ్‌

యేన విశ్వమిదం వ్యాప్తమజేన సచరాచరమ్‌

ఆవిర్భావతి రోభావ దృష్టాదృష్టవిలక్షణమ్‌

వదంతి యత్సృష్ట మితి తథై వాప్యుపసంహృతమ్‌

బ్రహ్మణే చాదిదేవాయ నమస్కృత్య సమాధినా

అవికారాయ శుధ్ధాయ నిత్యాయ పరమాత్మనే

సదైక రూప రూపాయ జిష్ణవే విష్ణవే నమః

నమో హిరణ్య గర్భాయ హరయే శంకరాయ చ

వాసుదేవాయ తారాయనర్గస్థిత్యంతకారిణే

ఏకానేకస్వరూపాయ స్థూలసూక్ష్మాత్మనే నమః

అవ్యక్త వ్యక్త భూతాయ విష్ణవే ముక్తి హేతవే

సర్గస్థితి వినాశానాం జగతో యోజగన్మయః

మూలభూతో నమస్తస్మై విష్ణవే పరమాత్మనే

ఆధారభూతం విశ్వస్యాప్యణీయాంన మణీయసామ్‌

ప్రణమ్య సర్వ భూతస్థ మచ్యుతం పురుషోత్తమమ్‌

జ్ఞాన స్వరూప మత్యంతం నిర్మలం పరమార్థతః

త మేవార్థ స్వరూపేణ భ్రాంతి దర్శనతః స్థితమ్‌

విష్ణుం గ్రసిష్ణుం విశ్వస్య స్థితౌ సర్గే తథా ప్రభుమ్‌

అనాదిం జగతా మీశమజ మక్షయవ్యయమ్‌

కథయామి యథా పూర్వం యక్షాద్యైర్మునిపత్తమైః

పృష్టః ప్రోవాచ భగవానబ్జయోనిః పితామహః

వ్యాసులు:

సురేశ్వరునికి సృష్టి కారణునకు విష్ణువునకు పురాణ పురుషునకు చతుర్వ్యూహ స్వరూపుడైన నిర్గుణ స్వరూపునకు గుణ రూపునకు సర్వాధికునకు యజ్ఞాంగ స్వరూపునకు సర్వాంగునకు నమస్కారము. ఎవని కంటె నణువైన వస్తువు యెవని కంటె పెద్దదైన వస్తువు లేదో, జననము లేని యెవ్వని చేత విశ్వము వ్యాప్త మైనదో బుట్టుట గిట్టుట దృశ్య మగుట యదృశ్య మగుట యను లక్షణములచే విలక్షణ మైన చరాచర విశ్వ వ్యాప్తమైన వానినిగా దెలుపుదురో యెవని వలన జగత్తు పుట్టినది నశించు నదియని బ్రహ్మణ్యులు పేర్కొందురో యట్టి నిర్వికారము శుద్ధము నిత్యము నేకైక రూపము విష్ణువు జిష్ణువు (సర్వ వ్యాపకము జయ శీలము) నని వర్ణింప బడు పరమాత్మకు నమస్కారము. హిరణ్య గర్భునకు (స్వర్ణ మయమైన బ్రహ్మాండము గర్భముగా గలవాడు) హరికి శంకరునకు వాసు దేవునకు (సర్వ దేవ నివాస మైన వానికి) తారునికి (సంసారమును తరింప జేయువాడు) నేక రూపునికి స్ధూలము సూక్ష్మము నైనవానికి నవ్యక్తము వ్యక్తము నైన వానికి ముక్తిహేతు వగు విష్ణునకు జగన్మూలము నయిన వానికి నమస్కారము. విశ్వమున కాధారమై నణువుల కంటె నణువై సర్వభూతము లందుండి చ్యుతిలేని వానికి (అచ్యుతునకు) నమస్కారము. పరమార్థముగ గేవల జ్ఞాన రూపమయ్యు నర్థ స్వరూపముగ భ్రాంతి దర్శనమున దృశ్యాత్మక జగత్తుగ గనిపించు వానినిగ మునులు పేర్కొనెడి భగవత్తత్వమును గుఱించి బ్రహ్మ మున్ను చెప్పినట్లు నేనును జెప్పు చున్నాను.

ఋక్వామాన్యుద్గిరన్వక్రైర్యః పునాతి జగత్రయమ్‌

ప్రణిపత్య తథేశాన మేకార్ణవ వినిర్గతమ్‌

యస్యాసురగణా యజ్ఞా న్విలుంపంతి నయాజినామ్‌

ప్రవక్ష్యామి మతం కృత్స్నం బ్రహ్మణోవ్యక్తజన్మనః

యేన సృష్టిం సముద్దిశ్య ధర్మాద్యాః ప్రకటీకృతాః

ఆపోనారా ఇతి ప్రోక్తా మునిభిస్తత్వ దర్మిభిః

అయనం తస్యతాః పూర్వం తేన నారాయణః స్మృతః

సదేవో భగవాన్సర్వం వ్యాప్య నారాయణో విభుః

చతుర్థా సంస్థితో బ్రహ్మా సగుణో నిర్గుణ స్తథా

ఏకా మూర్తిరనుద్దేశ్యా శుక్లాం పశ్యంతి తాం బుధాః

జ్వాలా మాలావనద్ధాంగీ నిష్టా సా యోగినాం పరా

దూరస్థా చాంతికస్థా చ విజ్ఞేయా సా గుణాతిగా

వాసుదేవాభిధానాసౌ నిర్మమత్వేన దృశ్యతే

రూపవర్ణాదయ స్తస్యా న భావాః కల్పనామయాః

ఆస్తే చసా సదా శుధ్దా సుప్రతిష్ఠికరూపిణీ

ద్వితీయా పృథివీం మూర్థ్నా శేషాఖ్యా ధారయత్యథః

తామసీసా సమాఖ్యాతా తిర్యక్త్వం సముపాగతా

తృతీయా కర్మ కురుతే ప్రజాపాలన తత్పరా

సత్త్వోద్రిక్తాతుసా జ్ఞేయా ధర్మసంస్థాన కారిణీ

చతుర్థీ జలమధ్యస్థా శేతే పన్నగ తల్పగా

రజస్తస్యా గుణః సర్గం సాకరోతి సదైవహి

యా తృతీయా హరేర్మూర్తిః ప్రజాపాలన తత్పరా

సాతు ధర్మ వ్యవస్థానం కరోతి నియతం భువి

ప్రోద్ధతా నసురాన్హంతి ధర్మవ్యుచ్ఛిత్తి కారిణః

పాతి దేవాన్సగంధర్వాన్ధర్మ రక్షా పరాయణాన్‌

యదాయదా చ ధర్మస్య గ్లానిః సముపజాయతే

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజత్యసౌ

భూత్వాపురా వరాహేణ తుండేనాపో నిరస్య చ

ఏకయా దంష్ట్రయోత్ఖాతా నళినీవ వసుంధరా

కృత్వా నృసింహరూపం చ హిరణ్య కశిపుర్హతః

విప్రచి త్తిముఖాశ్చాన్యే దానవా వినిపాతితాః

వామనం రూపమాస్థాయ బలిం సంయమ్య మాయయా

త్రైలోక్యం క్రాంతవానేన వినిర్జిత్య దితేః సుతాన్‌

భృగోర్వంశే సముత్పన్నో జామదగ్య్నః ప్రతాపవాన్‌

జఘాన క్షత్రియాన్రామః పితుర్వధమనుస్మరన్‌

తథాత్రితనయో భూత్వా దత్తాత్రేయః ప్రతాపవాన్‌

యోగమష్టాంగ మాచఖ్యావలర్కాయ మహాత్మనే

రామోదాశరథిర్భూత్వా సతుదేవః ప్రతాపవాన్‌

జఘాన రావణం సంఖ్యే త్రైలోక్యస్య భయంకరమ్‌

యదా చై కార్ణవే సుప్తో దేవదేవో జగత్పతిః

సహస్రయుగ పర్యంతం నాగపర్యంకగో విభుః

యోగనిద్రాం సమాస్థాయ స్వేమహిమ్ని వ్యవస్థితః

త్రైలోక్యముదరే కృత్వా జగత్థ్సావర జంగమమ్‌

జనలోకగతైః సిద్ధైః స్తూయమానో మహర్షిభిః

ఎవడు తన ముఖముల చేత ఋక్సామ మంత్రములను బఠించుచు నేకార్ణవము నుండి వెలువడి వచ్చి ముల్లోకముల బవిత్రము జేయునో యట్టి యీశానునకు నమస్కరించి దేవతలు యజ్ఞము లొనరించు వారి యజ్ఞా చరణమునకు లోపము రానీయరో యాయనకు నమస్కరించి యవ్యక్తము నుండి పుట్టిన బ్రహ్మ యొక్క సమగ్రమైన యభిప్రాయమును దెలుపు చున్నాను. ఆయన సృష్ఠి నుద్దేశించి ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములను వేద రూపమున ప్రకటించి యున్నాడు. ఆపః (దీనికి నీరు సామాన్యార్థము. కాని దానికి మూల పదార్థమైన విద్యుత్తు ప్రకాశోదక మను బేర నర్థమని ఋషులు చెప్పినారు) వానికి నారములని నామాంతరము. అవియ యనము అనగా గమ్య స్థానముగ (ఉనికి) గలవాడు నారాయణుడు. సృష్టి మూలమైన నాపో రూపమున సర్వ వ్యాపకమై యున్న తత్త్వమే నారాయణ తత్త్వమని తాత్పర్యము, ఆ భగవత్తత్వము నాలుగు విధములై యున్నది. ఒక మూర్తి శుక్ల వర్ణము. అది జ్వాలామాలా మయము. దానిని యోగులు జ్ఞానులు మాత్రమే దర్శింతురు. అది దూర మందును దగ్గరను గూడ నుండునది. అది గుణముల కతీత మైనది. వాసుదేవ నామమున నుండునది. మమకారము లేని స్థితిలోనే యది కనబడును. రూపము రంగు మొదలగు కల్పిత భావములు దానికి లేవు. కేవల శుద్ధ స్వరూపము. మిక్కిలి నిలకడ గల వస్తువు. ఇక రెండవ వ్యూహము. శేషుడను బేర భూమిని ధరించు చున్నది. అది తమో గుణమూర్తి. తిర్యగ్భావమును బొందినది. అనగా బశుత్వము నొందినదని యర్థము. మూడవ వ్యూహము సత్వ ప్రధాన మూర్తి ధర్మ సంస్థాపన మొనరించి ప్రజా రక్షణ నిమిత్తమైన కర్మను (స్థితి రూపమును జేయునది) నాలుగవ వ్యూహము (మూర్తి) శేష తల్పమున సముద్ర మధ్య మందుండును. రజోగుణ రూపము సర్గ కారణము (సృష్ఠి కారణము) ఈ చెప్పిన వానిలో మూడవ మూర్తి యగు హరి స్వరూపము ధర్మ వ్యవస్థాపనము జేయును. ధర్మ నాశము జేయ జలరేగిన నసురులను సంహారించును. ధర్మ పరాయణు లైన దేవ గంధర్వాదులను రక్షించును. ఈ మూర్తి యెపుడు ధర్మము వాడి పోవునో యధర్మము ప్రకోపించునో యపుడు తనను తాను సృజించు కొనును. మున్ను వరాహమై ముట్టెతో నుదకమును జిమ్ముకొని వచ్చి తన యొక్క కొమ్ము చేత నీ వసుంధరను బద్మిని (తామర తీగ) నట్లు పైకెత్తినది. ఈ మూర్తియే నరసింహ మూర్తియై హిరణ్య కశిపుని సంహరించినది. దేని చేతనే విప్రచిత్తి మొదలుగా మఱెందరో దానవులు గూల్ప బడిరి. వామన రూపమూని మాయచే బలిని బంధించి దైత్యుల గెలచి ముర్లోక మాక్రమింప బడినది. భృగు వంశమందు జమదగ్ని కుమారుడై పుట్టి యద్భుత ప్రతాపముచే నొకరాచ పురువు తండ్రిని సంహరించి నాడని సర్వ క్షత్రియ నాశన మొనరించి నది. అట్లే అత్రి కుమారుడై ప్రతాప శీలియై దత్తాత్రేయు డను బేర నుదయించి మహాత్ముడైన యలక్కునకు నష్టాంగ యోగము నుపదేశించి నది. దశరథ కుమారుడై రాముడను బేర పుట్టి రావణుని సంహరించి నది. సర్వ జగత్తు నొకే సముద్ర మైనపుడు ఈ సర్వ జగత్ప్రభువు అనేక యుగ సహస్రములు నాగపర్యంక శయనుడై యోగనిద్ర నూని తన మహిమ యందు దాన నిమిడి యుండి ముల్లోకములను గర్భమున దాల్చి జనోలోక మందున్న సిద్ధులు స్తుతింప విలసిల్లు చుండును.

తస్యనాభౌ సముత్పన్నం పద్మం దిక్పత్ర మండితమ్‌

మరుత్కింజల్క సంయుక్తం గృహం పైతామహం వరమ్‌

యత్ర బహ్మా సముత్పన్నో దేవదేవశ్చతుర్ముఖః

తదా కర్ణమలోద్బూతౌ దానవౌ మధుకైటభౌ

మహాబలౌ మహావీర్యౌ బ్రహ్మాణం హంతుముద్యతౌ

జఘాన తౌ దురాధర్షౌ ఉత్థాయ శయనోదధే

ఏవ మాదీం స్తథైవాన్యాన సంఖ్యాతు మిహోత్సహే

అవతారో హ్యజస్యేహ మాథురః సాంప్రత స్త్వయమ్‌

ఇతిసా సాత్వికీ మూర్తిరవతారం కరోతి చ

ప్రద్యుమ్నేతి సమాఖ్యాతా రక్షాకర్మణ్యవస్థితా

దేవత్వేథ మనుష్యత్వే తిర్యగ్యోనౌ చ సంస్థితా

గృహ్ణాతి తత్స్వభావశ్చ వాసుదేవాచ్చయా సదా

దదాత్య భిమతాన్కా మాన్పూజితా సా ద్విజోత్తమా

ఏవం మయా సమాఖ్యాతః కృతకృత్యోపి యఃప్రభుః

మానుషత్వం గతో విష్ణుః శృణుధ్వం చోత్తరం పునః

అయ్య నంతశయన మూర్తి నాభి నుండి దిక్కులే రేకులుగా భాసించు నొక పద్మము బుట్టినది. అందలి కేసరములు మరుద్గణము. (వాయు) అది పితా మహుని చతుర్ముఖుని పుట్టిల్లు. యోగ నిద్రనున్న యా స్వామి గులిమి నుండి మదు కైటభు లను దానవులు బుట్టిరి. మహా వీర్యులు మహా బలశాలులునై బ్రహ్మను చంప బోయిన యా యిద్దరను తల్పము నుండి లేచి యా ప్రభువు సంహరించెను. ఇట్లనేక లీలలు ఆయనవి అసంఖ్యాక ములు. అట్టి యజుడు అవికారుడు మధురా నగరములో నవతరించి యున్నాడు. ఈ సాత్విక మూర్తి జగత్‌ స్థితిహేతువై యవతరించగా బ్రద్యుమ్న నామమున నాల్గవ వ్యూహముగ జెప్ప బడినది. ఈ మూర్తి యొకపుడు దేవ భావమును నొకతఱి మనుష్య భావమును వేరొక యెడ పశు పక్ష్యాది భావమును గూడ గ్రహించు చుండి తదనురూప స్వభావమునై వాసు దేవాఖ్యమై పూజింప బడి యభీష్టముల ననుగ్రహించు చున్నది. కృత కృత్యుడయ్యు (ఏకర్తవ్యము లేని వాడయ్యు) సర్వ ప్రభువైన విష్ణువును గూర్చి నేనింత వరకు దెల్పితిని. ఆయన మనుష్యత్వమును బొంది చేసిన లీలా విశేషములను నిటుపై నాలింపుడు.