మునులు:
కథం దక్షిణమార్గేణ విశంతి పాపినః పురమ్
శ్రోతుమిచ్ఛామ తద్రృహివిస్తరేణ తపోధన
మునులు:
మునులు తపోథనా! పాపులు దక్షిణ మార్గమున నెట్లు వోదురో సవిస్తరముగ నాన తిమ్మన వ్యాసులిట్లనియె.
వ్యాసులు:
సుఘోరం తన్మహోఘోరం ద్వారం వక్ష్యామి భీషణమ్
నానాశ్వాపదసంకీర్ణం శివాశత నినాదితమ్
ఫేత్కారరవసంయుక్త మగమ్యం లోమహర్షణమ్
భూతప్రేతపిశాచైశ్చ వృతం చాన్యైశ్చ రాక్షసైః
ఏవం దృష్ట్వా సదూరాంతే ద్వారం దుష్కృతకారిణః
మోహం గచ్ఛంతి సహసా త్రాసాద్దిప్రలపంతిచ
తతస్తాన్ శృంఖలైః పాశైః ర్బద్ధ్వా కర్షంతి నిర్భయాః
తాడయంతిచ దండైశ్చ భర్త్సయంతి పునః పునః
లబ్దసంజ్ఞా స్తత స్తే వై రుధిరేణ పరిప్లుతాః
ప్రజంతి దక్షిణం ద్వారం ప్రస్ఖలంతః పదేపదే
తీవ్రకంటకయు క్తేన శర్కరానిచితేనచ
క్షురధారానిభై స్తీక్ష్ణైఃపాషాణైర్నిచితేనచ
క్వచింత్పంకేన నిచితా నిరుత్తారైశ్చ ఖాతకైః
లోహసూచీర్నిభైర్దంతైః సంచిన్నేన క్వచిత్క్వచిత్
తటప్రపాతవిషమైః పర్వతైర్వృక్షసంకులైః
ప్రతప్తాంగారయుక్తేన యాంతి మార్గేణ దుఃఖతాః
క్వచిద్విషమగర్తాభిః క్వచిల్లోష్టైః సుపిచ్ఛలైః
సుతప్తవాలుకాభిశ్చ తథా తీక్ణైశ్చ శంకుభిః
అయఃశృంగాటకైస్తప్తైః క్వచిద్దావాగ్నినా యుతమ్
క్వచిత్తప్తశిలాభిశ్చ క్వచిద్వ్యాప్తం హిమేన చ
క్వచిద్వాలుకయా వ్యాప్త మాకంఠాంతః ప్రవేశయా
క్వచిద్దుష్టాంబునా వ్యాప్తం క్వచిత్కర్షాగ్నినా పునః
క్వచిత్సింహైర్వృకైర్వ్యాఘ్రై ర్దంశకీటైశ్చ వారుణైః
క్వచిన్మహాజలౌకాభిః క్వచిదజగరైః పునః
మక్షికాభిశ్చ రౌన్రాభిః క్వచిత్సర్పైర్విషోల్బణైః
క్వచిద్దుష్టగజైశ్చైవ బలోన్మత్తైః ప్రమాథిభిః
పంథానముల్లిఖద్భిశ్చ తీక్ష్ణశృంగైర్మహావృషైః
మహాశృంగైంశ్చ మహిషై రుష్ట్రైర్మత్తైశ్చ ఖాదనైః
ఢాకినీభిశ్చ రౌద్రాభిర్వికరాలైశ్చ రాక్షసైః
వ్యాధిభిశ్చ మహారౌద్రైః పీడ్యమానా వ్రజంతితే
మహాధూళివిమిశ్రేణ మహాచండేన వాయునా
మహాపాషాణవర్షేణ హన్యమానా నిరాశ్రయాః
క్వచిద్విద్యున్నిపాతేన దీర్యమాణా వ్రజంతితే
మహతాబాణవర్షేణ భిద్యమానాశ్చ సర్వశః
పతద్భిర్వజ్రనిర్ఘాతై రుల్కాపాతైః సుదారుణైః
ప్రదీప్తాంగారవర్షేణ దహ్యమానా విశంతి చ
మహతా పాంశువర్షేణ పూర్వమాణా రుదంతి చ
మేఘారవైః సుఘోరైశ్చ విత్రాస్యంతే మహుర్ముహుః
నిఃశేషాః శరవర్షేణ చూర్ణ్యమానాశ్చ సర్వతః
మాహాక్షారాంబుధారాభిః సిచ్యమానా వ్రజంతి చ
మహాశీతేన మరుతా రూక్షేణపరుషేణ చ
సమంతాద్దీర్యమాణాశ్చ శుష్యంతే సంకుచంతి చ
ఇత్థం మార్గేణ పురుషాః పాథేయరహితేన చ
నిరాలంబేన దుర్గేణ నిర్జలేన సమంతతః
అతిశ్రమేణ మహతా నిర్గతేనాశ్రమాయవై
నీయంతే దేహినః సర్వే యే మూఢాః పాపకర్మిణః
యమదూతైర్మహాఘోరై స్తదాజ్ఞాకారిభిర్బలాత్
ఏకాకినః పరాధీనా మిత్రబందువవర్జితాః
శోచంతః స్వానికర్మాణి రుదంతి చ ముహుర్ముహుః
ప్రేతీభూతానిషిద్ధాస్తే శుష్కకంఠౌష్ఠతాలుకాః
కృశాంగాః భీతభీతాశ్చ దహ్యమానాః క్షుధాగ్నినా
బద్ధాః శృంఖలయా కేచి త్కేచిదుత్తానపాదయోః
ఆకృష్యంతే శుష్యమాణా యమదూతై ర్బలోత్కటైః
నరా అధోముఖాశ్చాన్యే కృషమాణాః సుదుఃఖితాః
ఆన్నపానీయరహితా యాచమానాః పునః పునః
దేహి దేహీతి భాషంతః సాశ్రుగద్గదయా గిరా
కృతాంజలిపుటా దీనాః క్షుత్తృష్ణాపరిపీడితాః
భక్ష్యానుచ్చావచాన్దృష్ట్వా భోజ్యాన్పేయాంశ్చ పుష్కలాన్
సుగంధద్రవ్యసంయుక్తా న్యాచమానాః పునః పునః
దధిక్షీరఘృతోన్మిశ్రం దృష్ట్వా శాల్యోదనం తథా
పానాని చ సుగంధీవి శీతలాన్యుదకాని చ
తాన్యాచమానాంస్తే యామ్యా భర్త్సయంతి స్తసుదారుణాః
వచోభిః వరుషైర్భీమాః క్రోధరక్తాంత లోచనాః
వ్యాసులు:
ఆ మార్గము ఘోరాతి ఘోరము. ఆ ద్వారము ఘూతుక మృగ సంకులము. భయంకరము. నక్కల యరపులతో బ్రతిథ్వనించును. అగమ్యము. భూత ప్రేత పిశాచ రాక్షసంకీర్ణము. తలచి కొన్న తనువు గగుర్పాటు చెందును. పాపులా ద్వారముం దూరాననే కని బెదరి ప్రేలాపన సేయుచు మూర్చ పడుదురు. అటుపై యమ భటులు వారిం గొట్టుచు సంకెళ్లం బాశములం గట్టి యీడ్చుచు దండములం బెదరింతురు. ఆ జీవులు తెలివొంది రక్తము నందడిసి యడు గడుగునం దడవడుచు దక్షిణ ద్వార ముంజొత్తురు. ఆ దారి ముండ్లతో గులక రాళ్లతో కత్తులతో బాషాణములతో నొక్కెడ బురదతో దాటరాని గోతులతో నినుప సూదు లట్టి దంతములతో దుర్గమ మయి యుండును. అందు జీవులు దుఃఖించుచు ఒడ్డులం గూల్చు కొండలు చెట్లతో నిప్పులతో గూడిన దారిం బోదురు. కొన్ని యెదల నొరకములు కొన్ని యెడల మట్టి పెళ్లలు కణకణ లాడు నిసుక పదునైన శంకువులు సలసల కాగు నేలతోడి నలు దారులు కలిసిన బాటలు కాలిన షాషాణములు కొన్ని యెడల మంచుతో పీకదాక దిగిపోవు నిసుక మేటలతో ముఱుగు నీటితో గనగదే మండు నిప్పులతో గూడి యుండును. సింహములు తోడేళ్ళు ఈగలు దోమలు దారుణము లయిన పురుగులు నొక్కెడ పెద్దపెద్ద జలగలు మీద కొండ చిలువలు కందురీగలు విషము గ్రక్కు పాములు దుష్టగ్గములు పదునైన కొమ్ములతో దారి నేలరాయు నెడ్లతో దున్నలతో నొంటెలతో గూడి యుండును. రౌద్రము లయిన ఢాకిని శాకిన్యాది పిశాచములు రాక్షసులు వ్యాధులు పీడింప నాదారిం బీడితులై పోవుదురు. మహాధూళి గ్రమ్మ మహా ప్రచండ వాయువులు వీవ మహా పాషాణములు వరిక్షంచు చుండ యమ భటులు బాదు చుండ నిలువ నీడ గానక నొక్కెడ పిడుగు పాటున నొడలు పగుల బాణ వర్క్షమున బ్రద్దలు కాగా దారుణముగ గొఱవులు పడు చుండ పైని నిప్పులు గురియు చుండ నాదారిం జనుదురు. పెను ధూళి కురియు చుండ నందు బ్రుంగి యేడ్తురు. మేఘముల యురుముల కడలి పోవుదురు. బాణ వర్షములచే జూర్ణమై పోయెదరు. పెద్ద యుప్పు నీటి దారలం దడియుచు పుండు వంటి చలిగాలికి బిగియుచు పగులుచు నొగులుచు నాదారి నాకలి వడి తినుట కేమియు లేక గుములుచు నిరాలంబము నిర్జలము నైన యా దుర్గమ యమ మార్గమునం బడి అతి శ్రమ గుడుచుచు దేహులు మూఢులు పాపాత్ములా వెంటం జనియెదరు. యమునాజ్ఞం గొని దూత లతిఘోర రూపు లీడ్వ నొంటరిగ పరాధీనులై బంధు మిత్రాదులు లేక తాము మున్ను జేసిన పాపములకు మఱిమఱి యేడ్చుచు నడుమ నడుమ యమ భటులు నోరెత్త వలదని కొట్టు చుండ నోరు నాలుక యెండ ప్రేతలై నొగులుదురు. బక్క చిక్కిన మేనులతో జడిసి జడిసి పోవుచు నాకలి చిచ్చునకు దహింప బడుచు సంకెళ్ళం బంధితులై కొందరు తలక్రిందుగా పాదములు మీదుగా గైకొని దూతలచే యీడ్వ బడుదురు. కొందరు మొగము క్రిందుగా నీడ్వబది యేడ్తురు. అన్నము నీరు లేక మఱిమఱి దేహిదేహి అని అడుగు కొనుచు కంట నీర్వెట్టుచు గద్గదికతో జేతులు మొగిచి దీనులై ఆకలి దప్పులం గుమిలి మంచి భక్ష్యములు పేయములు భోజ్యములు గమగమ వాసనలు జిమ్ముచుండ జూచుచు మఱిమఱి ప్రాధేయపడి యడిగి కొనుచు పెరుగు పాలు నెయ్యియుం గలిపిన యన్నముం జూచి సుగంధ భరిత పానీయములం జల్లని నీరుంగని యమ దూతలం బిక్క మొగము వెట్టి యాచించి కొను చుందురు. వారింగని యమ దూతలు భయంకరులు క్రోధమున గనుకెలకు లెఱ్ఱవడ బెదరించుచు నిట్లందురు.
యమ దూతలు:
న భవద్భిర్హుతం కాలేన దత్తం బ్రాహ్మణేషు చ
ప్రసభం దీయమానాం చ వారితం చ ద్విజాతిషు
తస్య పాపస్య చ ఫలం భవతాం సముపాగతమ్
నాగ్నౌదగ్ధం జలే నష్టం న హృతం నృవతస్కరైః
కృతో వా సాంప్రతం విప్రే యన్నదత్తం పురాధమాః
యైర్దత్తాని తు దానాని సాధుభిః సాత్త్వికాని తు
కషామేతే ప్రదృశ్యంతే కల్పితా హ్యన్నపర్వతాః
భక్ష్యభోజ్యాశ్చ పేయాశ్చ లేహ్యాశ్చోష్యాశ్చ సంవృతాః
నయూయమభిలప్స్యథ్వే న దత్తం చ కథంచన
యైస్తు దత్తం హుతంచేష్టం బ్రాహ్మణాశ్చైవ పూజితాః
తేషామన్నం సమానీయ ఇహ నిక్షిప్యతే సదా
పరస్వం కథమస్మాభిర్దాతుం శక్యేత నారకాః
యమ దూతలు:
సకాలమున మీరు హోమము సేయలేదు. విప్రుల కేమియు నీయలేదు. ఎవరేని యిచ్చు చున్న దాని కడ్డు తగిలితిరి. దాని వలని పాపమిది యనుభవింప వలసి నది. అగ్నిచే గాలలేదు. నీటి పాల్గాలేదు. రాజులు దొంగలు నపహరింప లేదు. మున్ను మీరు సేయని దాన మిప్పుడు బ్రాహ్మణ ముఖమున నీయ బడుచున్నది. సాత్త్విక దానము సేసిన సాధువుల కివిగో అన్న పర్వతము లెదురగు చున్నవి. భక్ష్య భోజ్య లేహ్య పేయాది రూపమగు నాహార సమృద్ధి యిది మీకు గాదు. మీరు విప్ర ముఖము నెన్నడు నింత యన్నము పెట్టియుండ లేదు. బ్రాహ్మణులం బూజింపనైన లేదు. ఆ విధముగ జేసిన పుణ్యాత్ములదీ యన్న సమృద్ధి. వారిది గొనివచ్చి మేము మీకెట్లు పెట్ట గలము?
వ్యాసులు:
కింకరాణాం వచః శ్రుత్వా నిఃస్పృహాః క్షుత్తృషార్దితాః
తతస్తే దారుణైశ్చాస్త్రైః పీడ్యంతే యమకింకరైః
ముద్గరైర్లోహదండైశ్చ శక్తితోమరపట్టిశైః
పరిమైర్భింది పాలైశ్చ గదావరశుభిః శరైః
పృష్ఠతో హన్యమానాశ్చ యమదూతైః సునిర్దయైః
ఆగ్రతః సింహవ్యాఘ్రాద్యై ర్భక్యంతే పాపకారిణః
న ప్రవేష్టుం న నిర్గంతుం లభంతే దుఃఖితా భృశమ్
స్వకర్మోపహతాః పాపాః క్రందమానాః సుదారుణాః
తత్ర సంపీడ్య సుభృశం ప్రవేశం యమకింకరైః
నీయంతే పాపిన స్తత్ర యత్ర తిష్ఠేత్స్వయం యమః
ధర్మాత్మా ధర్మకృద్దేవః సర్వసంయమనో యమః
ఏవం పథాతికష్టేన ప్రాప్తాః ప్రేతపురం నరాః
ప్రజ్ఞాపితాస్తదా దూతై ర్వివేశ్యంతే యమాగ్రతః
తతస్తే పాపకర్మాణస్తం పశ్యంతి భయానకమ్
పాపాపవిద్ధనయనా విపరీతాత్మబుద్ధయః
దంష్ట్రా కరాళవదనం భ్రుకుటీకుటిలేక్షణమ్
ఊర్ధ్వకేశం మహాశ్మశ్రుం ప్రస్ఫురదధరోత్తరమ్
అష్టాదశ భుజంక్రుద్ధం నీలాంజనచయోపమ్
సర్వాయుధోద్యతకరం తవ్రదండేన సంయుతమ్
మహామహిషమారూఢం దీప్తాగ్నిసమలోచనమ్
రక్తమాల్యాంబరధరం మహామేఘమివోచ్ఛ్రితమ్
ప్రళయాంబుదనిర్ఘోషం పిబన్నివ మహోదధిమ్
గ్రసంతమివ త్రైలోత్య ముద్గిరంత మివానలమ్
మృత్యుం చ తత్సమీవస్థం కాలానలసమవ్రభమ్
ప్రళయానలసంకాశం కృతాంతం చ భయానకమ్
మారీచోగ్రా మహామారీ కాళరాత్రీ చ దారుణాః
వివిధావ్యాధయః కష్టా నానారూపా భయావహాః
శక్తిశూలాంకుశధరాః పాశచక్రాసిధారిణః
వజ్రదండధరా రౌద్రాః క్షురతూణధనుర్ధరాః
ఆసంఖ్యాతా మహావీర్యాః క్రూరాశ్చాంజనసప్రభాః
సర్వాయుధోద్యతకరా యమదూతా భయనకాః
అనేక పరివారేణ మహాఘోరేణ సంవృతమ్
యమం పశ్యంతి పాపిష్ఠా శ్చిత్రగుప్తం విభీషణమ్
నిర్భర్త్సయతి చాత్యర్థం యమస్తాన్పాపకారిణః
చిత్రిగుప్తస్తు భగవా న్థర్మవాక్యైః ప్రభోధయన్
వ్యాసులు:
యమ కింకరుల మాట విని దిగులు వడి యాకలికి గుమిలి యా జీవులు దారుణ శస్త్ర పీడితు లయిరి. ఇనుప గుదియలు ఇనుప దుడ్లు శక్తి తోమర పట్టి నపరిషు బిండిపాల గదా పరశు బాణాదులచే వీపునం బాదుచు పరమ నిర్దయులు కింకరుల వేధింప నరిగి యరిగి సింహ హ్యఘ్రాదులచే పాపులు భక్షింప బడుదురు. అట్లు మిగుల పీడించి కింకరులు పాపులను యమ ప్రభువు నెదుటకుం గొంపోదురు. అయన ధర్మాత్ముడు ధర్మకర్త సర్వ ప్రాణి నియామకుడు నైన యముడు ఇట్లతి కష్టమైన దారింజని ప్రేత పురముం జేరిన నరులను ప్రభువు నెదుర బెట్టి యమ దూతలు వారు వారు సేసిన కర్మముల నివేదింప ప్రాణు లాయన నతి భయంకరుని జూచెదరు. పాపముచే గనులు మూత వడి బుద్ధులు చెడి ప్రాణి కోరలతో భయంకరమయి కను బొమలు ముడివడి మిడిగ్రుడ్ల జడుపు కూర్చు మొగము నిక్కిన జుట్టు పెద్ద గడ్డముతో బెదవు లదర బదునెన్మిది చేతులతో కాటుక వలె నల్లని మేనితో సర్వా యుధములం గరములం బూని పెద్ద దున్న పోతు నెక్కి పెద్ద మబ్బువలె నిప్పులట్లు మండు కండ్లు రక్త మాల్యములు పూని ప్రళయ మేఘ మట్లురుముచు సముద్రు నాపోశన పట్టు నాయాన్నట్లు ముల్లోకములను మ్రింగునా యన్నట్లు నిప్పులు గ్రక్కు చున్నట్లు దగ్గరగా నిల్చి కాలాగ్ని ప్రభతో నున్న మృత్యువుం గని మహా మారి కాల రాత్రియు వివిధ వ్యాధులు కష్టాలు నానా రూపాలు శక్తి శూలాస్త్ర పాశ చక్రాంకుశ ఖడ్గాదులు దాల్చి వజ్ర దండములం గొని చుర కత్తెలు అమ్ముల పొదలు విండ్లును నసంఖ్యాకముం బూని మహా వీర్యులు క్రూరులు కాటుక వలె నల్లని మేనికాంతి గలవారు సర్వాయుధ హస్తులయి యమదూత లతి భయాన కులై ఘోరముగ పరివారమై గొలువ గొలు వైన యముని చిత్రగుప్తునిం బాపాత్ములు దర్శింతురు. యముడుగ్రుడై వారి నురిమి యురిమి చూచును. అపుడు చిత్రగుప్త భగవానుడు ధర్మ వచనములచే బ్రబోధించుచు నిట్లనును.
చిత్రగుప్తుడు:
భో భో దుష్కృతకర్మాణః పరద్రవ్యాపహారిణః
గర్వితా రూపవీర్యేణ పరదారాభిమర్శకాః
యత్స్వయం క్రియతే కర్మ తత్ప్వయం భుజ్యతే పునః
తత్కిమాత్మోపఘాతార్థం భవద్భిర్దుష్కృతం కృతమ్
ఇచానీం కింను శోచధ్వం పీడ్యమానాః స్వకర్మభిః
భుంజధ్వం స్వాని దుఃఖాని నహి దోషోస్తి కస్యచిత్
య ఏతే పృథివీపాలాః సంప్రాప్తా మత్సమీపతః
స్వకీయైః కర్మభిర్ఘోరై దుష్ప్రజ్ఞాబలగర్వితాః
భోభో నృపా దురాచరాః ప్రజావిధ్వంసకారిణః
అల్పకాలస్య రాజ్యస్య కృతే కిం దుష్కృతం కృతమ్
రాజ్యలోభేన మోహేన బలాదన్యాయతః ప్రజాః
యద్దండితాః ఫలంతస్య భుంజధ్వ మధునా నృపాః
కుతో రాజ్యం కళత్రం చ యదర్థమశుభం కృతమ్
తత్సర్వం సంపరిత్యజ్య యూయ మేకాకినః స్థితాః
పశ్యామో న బలం సర్వం యేన విధ్వంసితాః ప్రజాః
యమదూతైః పాట్యమానా అధునా కీదృశం ఫలమ్
చిత్రగుప్తుడు:
ఓపాప కర్ములారా! పర ద్రవ్యాపహారులారా! రూపముచే బలముచే బొగరెక్కి పరదా రాభిమర్శనము సేసిన ఫలమది యనుభవింప వలయును. దుఃఖము కుడువక తప్పదు. ఈ తప్పెవనిది కాదు. ఈ రాజులు నా కడకు వచ్చిన వారు తెలివి చెడి బల గర్వితులై చేసిన తమ కర్మము ననుభవించు చున్నారు. ఓ రాజులారా! ప్రజా నాశన మొనరించితిరి. అల్ప రాజ్య సుఖమునకై ఘోరములు సేసినారు. మీరు రాజ్య లోభముతో మోహముతో బలత్కారముగ ప్రజల దండించి నారు. దాని ఫలమిపు డనుభవింపుడు. రాజ్యమేది ఇక్కడ భార్య యెక్కడ? ఇపు డేకాకియై చేసిన యశుభ మనుభవింప వలసి నదే ఏ బలముకొని ప్రజల భాదింతురో యాబల మిపుడే మాత్రమీ లోకమున గనబడదు. యమ కింకరుల వలని బాధలకు గురి యైతిరి పాపము. అని యిట్లు పలు తీరుల దెప్పి పొడుచుచు నొవ్వనాడుచు యముడుత్కట కోపియై పడదిట్ట నేడ్చుచు చేసిన పాపములకు పశ్చాత్తాపించుచు ప్రాణులు నోరెత్తక నిల్తురు.
వ్యాసులు:
ఏవం బహువిధైర్వాక్యై రుపాలబ్ధా యమేన తే
శోచంతః స్వానికర్మాణి తూష్ణీం తిష్ఠంతి పార్థివాః
ఇతి కర్మ సమాదిశ్య నృణాం వై ధర్మరాట్స్వయమ్
తత్పాతకవిశుద్ధ్వర్థ మిదం వచనమబ్రవీత్
వ్యాసులు:
ధర్మరాజిట్లు చిత్రగుప్తుని వారివారి కర్మల లెక్కలు సెప్పు మని విని యాపాప విశుద్ధికి విధింప నగు దండన ములం గూర్చి దండధరు డిట్లా దేశ మిచ్చును.
యముడు:
భో భోశ్చండ మహాచండ గృహీత్వా నృపతీనిమాన్
విశోధయధ్వం పాపేభ్యః క్రమేణ నరకాగ్నిఘ
యముడు:
ఓరి చండ! మహాచండ! ఈ నర పతులం గొంపోయి నరకాగ్ను లందు బడనేసి పాపముల నుండి విశుద్ధుల జేయుడన
వ్యాసులు:
తతః శీఘ్రం సముత్ధాయ నృపాన్పంగృహ్య పాదయోః
భ్రామయిత్వా తు వేగేన క్షిప్త్వాచోర్ధ్వం ప్రగృహ్యచ
తత్తత్పాప ప్రమాణేన యమదూతాః శిలాతలే
ఆస్ఫోటయంతితరసా వజ్రేణేవ మహాద్రుమమ్
తతస్తురక్తం స్రోతోభిః స్రవతే ర్జరీకృతః
నిస్సంజ్ఞః స తదా దేహీ నిశ్చేష్టశ్చ ప్రజాయతే
తతః స వాయునా స్పృష్టః శనై రుజ్జీవతే పునః
తతః పాపవిశుద్ధ్యర్థం క్షిపంతి నరకార్ణవే
అన్యాంశ్చ తే తదాదూతాః పాపకర్మరతాన్నరాన్
నివేదయంతి విప్రేంద్రా యమాయ భృశదుఃఖితాన్
వ్యాసులు:
వెనువెంట లేచి యమ భటులు నృపులకాండ్లు పట్టుకొని యెత్తి విసరి పారవేసి పాప పరమాణముం బట్టి బండపై నడిచి పిడుగుచే మహాతరువు నట్లు గొట్టిరి. అంతట రక్తము ప్రవాహ మెత్తినట్లు ముక్కున నోట జాల్కొనం దెలివి తప్పి యాదేహి పడి పోవును. అటుపై దానిపై వాయువు వీవ తెలివిగొని నంత వారిని పాప విశుద్ధికి నరక సాగరమున విసరుదురు. ఆ దూతలు మహా దుఃఖములం గుములు మఱియుం గల జీవులను యమునికి నివేదింతురు.
యమదూతలు:
ఏష దేవ తవాదేశా దస్మాభిర్మోహితో భృషమ్
ఆనీతో ధర్మ్విముఖః సదా పాపరతః పరః
ఏషలుబ్ధో దురాచారో మహాపాతకసంయుతః
ఉపపాతక కర్తా చ సదా హింసారతోశుచిః
అగమ్యగామీ దుష్టాత్మా పరద్రవ్యాపహారకః
కన్యాక్రయీ కూటసాక్షి కృతఘ్నె మిత్రవంచకః
అనేన మదమత్తేన సదాధర్మో వినిందితః
పాపమాచరితం కర్మ మర్త్యలోకే దురాత్మనా
ఇదానీమస్య దేవేశ నిగ్రహానుగ్రహౌ వద
ప్రభురస్య క్రియాయోగే వయం వా వరిపంథినః
యమదూతలు:
ఇడుగో వీనిని మహాపాపిని మూర్ఛ బడనేసి కొని వచ్చితిమి. ధర్మ విముఖుడు నిత్య పాపరతుడు. ఇడుగో వీడు పరమ లుబ్ధుడు. మహా పాతకో పపాతకము లెన్నో సేసినాడు హింసా పరుడు అనాచారుడు. కూడ రానిదిం గూడిన వాడు పర ద్రవ్యాపహారి. కన్యా విక్రయి కూట సాక్షి కృతఘ్నుడు మిత్రద్రోహి. మరియు వీడు ధర్మ నింద సేసి నాడు. పాపములు సేసి నాడు. దురాత్ముడు వీనిని శిక్షించుటో రక్షించుటో ప్రభువు వీవు సెలవిమ్ము. నీచెప్పిన దములు సేయుటలో మేము సర్వదా విధేయులము
వ్యాసులు:
ఇతివిజ్ఞాప్య దేవేశం న్యస్యాగ్రే పాపకారిణమ్
నరకాణాం సహస్రేషు లక్షకోటి శతేషు చ
కింకరాస్తే తతో యాంతి గ్రహీతు మపరాన్నరాన్
ప్రతిపన్నే కృతే దోషే యమోవై పాపకారిణామ్
సమాదిశతి తాన్ఘోరా న్నిగ్రహాయ స్వకింకరాన్
యథా యస్య వినిర్దిష్టో వశిష్ఠాద్యైర్వినిగ్రహః
పాపస్య సంక్షయం క్రుద్ధాః కుర్వంతి యమకింకరాః
అంకుశైర్ముద్గరైద్దండై క్రకచైః శక్తితోమరైః
ఖడ్గశూలనిపాతైశ్చ భిద్యంతే పావకారిణః
నరకాణాం సహస్రేషు లక్షకోటిశతేషు చ
స్వకర్మోపార్జితైర్దోషైః పీడ్యంతే యమ కంకిరైః
శృణుధ్వం నరకాణాం చ స్వరూపం చ భయంకరమ్
వ్యాసులు:
అని యిట్లు విన్నవించి ధర్మప్రభువు నెదుట నిలిపి వేలకొలది లక్షకోటి నరకములం బడ వైతురు. ఆపై మఱి కొందఱిం బట్ట బోదురు. చేసిన తప్పు నిర్ధారణ సేసిన మీద తన కింకరుల కానయిచ్చి వశిష్ఠాది మహార్షు లేయే నేరముల కేయే దండనము విధించిరో యాయా రీతి దండింప జేయును. యమ కింకరులు క్రోధమూని అంకుశ ముద్గర దండాదులు ఱంపములు శక్తి తోమరములు కత్తులు శూలములుం గొని అడచి కొట్టి కోసి యేసిగ్రుచ్చి నరకి చీల్చి పాప శోధనము సేయుదురు.
నామాని చ ప్రమాణం చ యేన యాంతి నరాశ్చ తాన్
మహావాచీతి విఖ్యాతం నరకం శోణితప్లుతమ్
వజ్రకంటక సంమిశ్రం యోజనాయుతవిస్తృతమ్
తత్ర సంపీడ్యతే మగ్నో భిద్యతే వజ్రకంటకైః
వర్షలక్షం మహాఘోరం గోఘాతీ నరకే నరః
యోజనానాం శతం లక్షం కుంభీపాకం సుదారుణమ్
తామ్రకుంభవతీ దీప్తా వాలుకాంగార సంవృతా
బ్రహ్మహా భూమిహర్తా చ నిక్షేప స్యాపహారకః
దహ్యంతే తత్ర సంక్షిప్తా యావదాభూత సంప్లవమ్
రౌరవో వజ్రనారాచైః ప్రజ్వలద్భిః సమావృతః
యోజనానాం సహస్రాణి షష్టిరాయామ విస్తరైః
భిద్యంతే తత్ర నారాచైః సజ్వాలై ర్నరకే నరాః
ఇక్షువత్తత్ర పీడ్యంతే యే నరాః కూటసాక్షిణః
అయోమయం ప్రజ్వలితం మంజూషం నరకం స్మృతమ్
నిక్షిప్తాస్తత్ర దహ్యంతే వంథిగ్రాహ కృతశ్చ యే
అప్రతిష్ఠేతి నరకం పూయమూత్రపురీషకమ్
అధోముఖః పతేత్తత్ర బ్రాహ్మణస్యోప పీడకః
లాక్షాప్రజ్వలితం ఘోరం నరకం తు విలేపకమ్
నిమగ్నాస్తత్ర దహ్యంతే మద్యపానే ద్విజోత్తమాః
మహాప్రభేతి నరకం దీప్తశూల మహోచ్ఛ్రయమ్
తత్రశూలేన భిద్యంతే పతిభార్యోపభేదినః
నరకం చ మహాఘోరం జయంతీ చాయసీ శిలా
తయా చాక్రమ్యతే పాపః పరదారోపసేవకః
నరకం శాల్మలాఖ్యం తు ప్రదీప్త దృఢకంటకమ్
తయా(దా)లింగతి దుఃఖార్తా నారీ బహునరంగమా
యే వదంతి సదాసత్యం పరమర్మావ కర్తనమ్
జిహ్వాచోచ్ఛ్రియ (చ్ఛిద్య)తే తేషాం సదస్యైర్యమ కింకరైః
యేతు రాగైః కటాక్షైశ్చ వీక్షంతేపరయోషితమ్
తేషాం చక్షూంషి నారాచై ర్విధ్యంతే యమ కింకరైః
మాతరం యేపి గచ్ఛంతి భగీనీం దుహితరంస్నుషామ్
స్త్రీబాలవృద్ధ హంతారో యావదింద్రా శ్చతుర్దశ
జ్వాలామాలాకులం రౌద్రం మహారౌరవసంజ్ఞితమ్
నరకం యోజనానాం చ సహస్రాణి చతుర్దశ
పురం క్షేత్రం గృహం గ్రామం యోదీపయంతి చ వహ్నినా
సతత్ర దహ్యతే మూఢో యావత్కల్పస్థితిర్నరః
తామిస్రమితి విఖ్యాతం లక్షయోజన విస్తృతమ్
విపతద్భిః సదా రౌద్రః ఖడ్గపట్టిశ ముద్గరైః
తత్ర చౌరాః నరా క్షిప్తా స్తాడ్యంతే యమకింకరైః
శూలశక్తిగదాఖడ్గైర్యావత్కల్ప శతత్రయమ్
తామిస్రాద్ద్విగుణం ప్రోక్తం మహాతామిస్రసంజ్ఞితమ్
జలౌకాసర్ప సంపూర్ణ నిరాలోకం సుదుఃఖదమ్
మాతృహా పితృహా చైవ మిత్ర విస్రంభ ఘాతకః
తిష్ఠంతి తక్ష్యమాణాశ్చ యావత్తిష్ఠతి మేదినీ
అసిపత్రవనం నామ నరకం భూరిదుఃఖదమ్
యోజనాయుత విస్తారం జ్వలత్ఖడ్గైః సమాకులమ్
పాతితస్తత్ర తైః ఖఢ్గైః శతధా తు సమాహతః
మిత్రఘ్నః కృత్యతే తావ ద్యావదాభూత సంప్లవమ్
కరంభవాలుకా నామ నరకం యోజనాయుతమ్
కుపాకారం వృతం దీప్తై ర్వాలుకాంగార కంటకైః
దహ్యతే భిద్యతే వర్షలక్షాయుతశతత్రయమ్
యేన దగ్ధో జనో నిత్యం మిథ్యోపాయైః సుదారుణైః
కాకోలం నామ నరకం కృమిపూయపరిప్లుతమ్
క్షిప్యతే తత్ర దుష్టాత్మా ఏకాకీ మిష్టభుఙ్నరః
కుడ్మలం నామ నరకం పూర్ణం విణ్మూత్రశోణితైః
పంచయజ్ఞ క్రియాహీనాః క్షిప్యంతే తత్ర వై నరాః
సుదుర్గంధం మహాభీమం మాంసశోణితసంకులమ్
అభక్ష్యాన్నే రతాస్తేత్ర నిపతంతి నరాధమాః
క్రిమికీట సమాకీర్ణం శవపూర్ణం మహావటమ్
అధోముఖః పతేత్తత్ర కన్యావిక్రయకృ న్నరః
నామ్నా వై తిలపాకేతి నరకం దారుణం స్మృతమ్
తిలవత్తత్ర పీడ్యంతే పరపీడారతాశ్చ యే
నరకం తైలపాకేతి జ్వలత్తైలమహీప్లవమ్
పచ్యతే తత్ర మిత్రఘ్నో హంతా చ శరణాగతమ్
నామ్నా వజ్రకపాటేతి వజ్రశృంఖలయాన్వితమ్
పీడ్యంతే నిర్దయం తత్ర యైః కృతః క్షీరవిక్రయః
నిరూచ్ఛ్వాస ఇతి ప్రోక్తం తమోంధం వాతవర్జితమ్
నిశ్చేష్టం క్షిప్యతే తత్ర విప్రదాన నిరోధకృత్
అంగారోపచయం నామ దీప్తాంగారసముజ్జ్వలమ్
దహ్యతే తత్ర యేనోక్తం దానం విప్రాయ నార్పితమ్
మహాపాయీతి నరకం లక్షయోజన మాయతమ్
పాత్యంతేధోముఖాస్తత్ర యే జల్పంతి సదానృతమ్
మహాజ్వాలేతి నరకం జ్వాలా భాస్వరభీషణమ్
దహ్యతే తత్ర సుచిరం యః పాపే బుద్ధి కృన్నరః
నరకం క్రకచాఖ్యాతం పీడ్యంతే తత్ర వై నరాః
క్రకచైర్వజ్రధారోగ్రై రగమ్యాగమనే రతాః
నరకం గుడపాకేతి జ్వలద్గుడహ్రదైర్వృతమ్
నిక్షిప్తో దహ్యతే తస్మి స్వర్ణసంకర కృన్నరః
క్షురధారేతి నరకం తీక్షణక్షురసమావృతమ్
ఛిద్యంతే తత్ర కల్పాంతం విప్రభూమి హరా నరాః
నరకం చాంబరీషాఖ్యం ప్రళయానలదీపితమ్
కల్పోటిశతం తత్ర దహ్యతే స్వర్ణహారకః
నామ్నా వ్రకురారేతి నరకం వజ్రసంకులమ్
ఛిద్యంతే తత్ర ఛేత్తారో ద్రుమాణాం పాపకారిణః
నరకం పరితాపాఖ్యం ప్రళయానలదీపితమ్
గరదో మధుహర్తా చ పచ్యతే తత్ర పాపకృత్
నరకం కాలసూత్రం చ వజ్ర సూత్రవినిర్మితమ్
భ్రమంత స్తత్ర చ్ఛిద్యంతే పరసస్యోపలుంఠకాః
నరకంకశ్మలం నామ శ్లేష్మశింఘాణకావృతమ్
తత్ర సంక్షిప్యతే కల్పం సదామాంసరుచిర్నరః
నరకం చోగ్రగంధేతి లాలామూత్రపురీషవత్
క్షిప్యంతే తత్ర నరకే పితృపిండా ప్రయచ్ఛకాః
నరకం దుర్ధరం నామ జలౌకావృశ్చికాకులమ్
ఉత్కోచభక్షక స్తత్ర తిష్ఠతే వర్షకాయుతమ్
యచ్చ వజ్రమహాపీడా నరకం వజ్రనిర్మితమ్
తత్ర ప్రక్షిప్య దహ్యంతే పీడ్యంతే యమ కింకరైః
ధనం ధాన్యం హిరణ్యం వా పరకీయం హరంతి యే
యమదూతైశ్చ చౌరాస్తే ఛిద్యంతే లవశః క్షురైః
యే హత్వా ప్రాణినం మూఢాః ఖాదంతే కాకగృధ్రవత్
భోజ్యంతే చ స్వమాంసంతే కల్పాంతం యమకింకరైః
ఆసనం శయనం వస్త్రం పరకీయం హరంతి యే
యమదూతైశ్చతే మూఢా భిద్యంతే శక్తితోమరైః
ఫలం పత్రం నృణాం వాపి హృతం యైస్తుకుబుద్ధిభి
యమదూతైశ్చతే క్రుద్ధైర్దహ్యంతే తృణవహ్నిభిః
పరద్రవ్యే కళత్రే చ యః సదా దుష్టధీ ర్నరః
యమదూతైర్జ్వలత్తస్య హృది శూలం నిఖన్యతే
కర్మణా మనసా వాచా యే ధర్మవిముఖా నరాః
యమలోకేతు తే ఘోరా లభంతే పరియాతనాః
ఏవం శతసహస్రాణి లక్షకోటిశతాని చ
నరకాణి నరై స్తత్ర భుజ్యంతే పాపకారిభిః
ఇహ కృత్వా స్వల్పమపి నరః కర్మాశుభాత్మకమ్
ప్రాప్నోతి నరకే ఘోరే యమలోకేషు యాతనామ్
న శృణ్వంతి నరా మూఢా ధర్మోక్తం సాధు భాషితమ్
దృష్టం కేనేతి ప్రత్యక్షం ప్రత్యుక్యైవం వదంతి తే
దివా రాత్రౌ ప్రయత్నేన పాపం కుర్వంతి యే నరాః
నాచరింతి హి తే ధర్మం ప్రమాదేనాపి మోహితాః
ఇహైవ ఫలభోక్తారః పరత్ర విముఖాశ్చ యే
తే పతంతి సుఘోరేషు నరకేషు నరాధమాః
దారుణే నరకే వాసః స్వర్గవాసః సుఖప్రదః
నరైః సంప్రాప్యతే తత్ర కర్మకృత్వా శుభాశుభమ్
నరకముల భయానక స్వరూపము వాని ప్రమాణములు వినుండు. మహావీచి అను నరకము రక్త పూర్ణము. వజ్రకంటక మిశ్రము. పదివేల యోజనముల విరివి గలది పాపినందు ముంచి వజ్రకంటక ములం గ్రుచ్చి చీల్తురు. లక్ష యేండ్లక్కడ గోహత్య చేసిన వాడు గూలి యుండును. కుంభీ పాకము మహాదారుణ నరకము. నూరు లక్షల యోజనము లుండును. కాలుచున్న రాగి బిందెలతో నది మిడమిడ కాలు నిసుక నిప్పులతో గూడి యుండును. బ్రహ్మఘ్నుడు భూమిహర్త ధన నిక్షేపములను (నిధులను) హరించిన వాడచట గూలును. భూత ప్రలయము దాక జీవు లందు కాల్ప బడుదురు. అటుపై రౌరవము జ్వలించు వజ్ర బాణములతో నిండి యుండును. అరువది యోజనముల పొడవు వెడల్పు గల్గి యుండును. జ్వాలలు గ్రమ్ము నానరకమున బాణములచే పాపులు జీల్ప బడుదురు. అయోమయ నరకము మంజూషాకారము (బొను వంటిది) దానిలో బావుల బడనేసి చెఱకు నాడించి నట్లాండింతురు. అదియును జ్వలించు చుండును. ఆప్రతిష్ఠమను నరకము మల మూత్ర పురీష మయము. పాపియంద ధోముఖుడై కూలును. బ్రాహ్మణులను బీడించిన వాడు బ్రాహ్మణ ద్రవ్య మపహరించిన వాడు దానం గూలును విలేపకమను నరకము సలసల కాగు లక్కతో నుండును. మద్య పానరతులందు మున్గుదురు. మహా ప్రభమను నరకము కాలిన శూలములతో నిండి యుండును. ఆలు మగలకు తగవు పెట్టిన వారా శూలములచే బొడువ బడుదురు. జయంతియను ఘోరనరకము ఉక్కు పరచిన రాతినేల. పరభార్యా నంగి దానంబడి యుడికి పోవును. శాల్మల మను నరకము నిప్పుల ముళ్ళతో నిండినది. బహుజన వ్యభిచారిణి యైన స్త్రీ దానిం గౌగలించు కొనును. ఎవ్వరి తరుల యాయువు పట్టుల కుందగులు నసత్యములు పల్కుదురో వాండ్ర నాలుకను లాగి ఱంపములం గోయుదురు. ఎవ్వరు సరాగ ములగు చూపులం బరాంగనం జూతురో వాండ్ర కన్నులం బాణములం గ్రుచ్చి పగిలింతురు. తల్లిని సోదరిని గోడలిని గూతురుం బొందిన వాండ్రను స్త్రీ బాల వృద్ధ హంతకులను పదు నల్వురింద్రుల కాలము జ్వాలా మాలా కాకులమైన రౌద్ర మగు మహా రౌరవమను నరకమునం గూల్తురు. అది యిరువది నాల్గు యోజనముల విరివి యైనది. ఎవ్వడు పుర గ్రామ క్షేత్ర గృహాదులకు నిప్పు వెట్టునో ఆ మూఢుడు కల్పాంతము దాక పై నరకమున గాల్పబడును. తామిస్రమను నరకము లక్ష యోజనములు. కత్తులు పట్టిసములు ముద్గరములు పరచినది. అందు దొంగలను విసరి వైతురు. యమ కింకరులు శూల శక్తి గదా ఖడ్గాదులచే కల్ప శతమచట పాపుల నడంతురు. తామిస్రము కంటె రెట్టింపు విశాలము మహా తామిస్రము. అందు జలగలు పాములు నుండును. కారు చీకటి పరమ దుఃఖదము. మాతృ పితృ హంతకులు మిత్రవిశ్వాస ఘాతకులు నందు బాడితెలం జెక్కబడు చుందురు. భూమి యున్నంత దాక యది యనుభవింతురు. అసిపత్ర వనము (కత్తుల బోను) మహా దుఃఖదము. కాలుచున్న కత్తులతో నిండినది. ఒక్క యోజనము విరివి గలది. అందు మిత్రఘ్నుడు భూత ప్రలయము దాక కత్తులచే నూరు వ్రక్కలు గావింప బడును. కరంభవాలుక మను నరక మొక్క యోజనము. కూపాకారము మిడమిడ గాలు నిప్పులతో ముండ్లతో నిసుకతో నిండినది. అందు ఒక లక్షా పదివేల మూడు వందలేండ్లు జనులను మాయో పాయములచే దారుణముగ మ్రగ్గుదురు. దహించిన వాండ్రందు దహింప బడుదురు. కాకోలమను నరకము కృమి మయము మల మయమును. మృష్టాన్నముం దా నొక్కడ దిన్నవాడు దానం గూలును. మలమూత్ర శోణిత మయ ముకుడ్మలమను నది. పంచ యజ్ఞములు మానిన వాండ్రందు బడుదురు. మాంసము రక్తముతో నది పాడుకంపు గొట్టు చుండును. భయంకరము. అభక్ష్యాన్న భక్షకులందు గూలుదురు. క్రిమి కీటక మయము శవ సంపూర్ణము మహా వటమను నరకము. కన్యా విక్రయము సేసిన వాడక్కడ తలక్రిందుగా నా పెద్ద మఱి చెట్టునుండి క్రింద పడును. తిలపాకమను నరకము దారుణము. పరులను బీడింప గోరిన వాండ్రు అందు గానుగ యందు నువ్వు లట్లాడింప బడుదురు. అందు నలనల క్రాగు నూనెలో నుడికి పోదురు. మిత్రఘ్నుడు శరణాగత హంతకుడు వజ్ర కపాట మను నరకమున వజ్ర మయము లయిన గొలుసులం బంధింప బడును. పాలమ్ము వాడు నిర్దయముగ నిరుచ్ఛ్వాస మగు గాఢాంధకార బంధురము గాలి యాడని నరకమునం బీడింప బడును. బ్రాహ్మణునికి చేయు దానమున కడ్డు పడినవాడు చేష్టలు దక్కి యందు గుములును. గనగన మండు నిప్పుల నరకమది. అంగారో వచయము. విప్రునికి దానము సేసి చేయ లేదన్న వాడు దాన బడును. మహాపాయి యను నరకము లక్ష యోజనములు. అనృతము లాడిన వాడు అందధో ముఖముగా బడవేయ బడుదురు. మహా జ్వాలమను నరకము పెను మంటలతో భయంకరము. పాపులందు దహింప బడుదురు. క్రకచమను నరకమున వజ్రము వంటి పదునైన ఱంపములచే నగమ్యామ గమనమును జేసిన పాపులు గోయ బడుదురు. గుడ పాకమను నరకము క్రాగుచున్న బెల్లపు పాకము మడుగు. అందు వర్ణ సాంకర్యము సేసిన వాడు పడవేయ బడును. క్షుర ధారమను నరకము పదునైన కత్తుల నరకము బ్రాహ్మణ భూమి కాజేసినవా డందు కల్పాంతము దాక కోతలం బడును. అంబరీష మను నరకము ప్రలయ కాలాగ్ని దీపితము నూరుకల్ప కోటులందు స్వర్ణస్తేయి (బంగారపు దొంగ) గూలును. వజ్రకుఠార నరకము కేవల వజ్ర మయము. చెట్లను నరకిన వాండ్రట బడుదురు. పరితాపము ప్రలయాగ్ని మయము. విషము పెట్టిన వాడు మధుహర్త (మధువు = తేనె) దానంబడును. కాలసూత్రము వజ్రసూత్ర మయము. ఇతరుల పంటలను హరించిన వాండ్రందు బడుదురు. కశ్మలమను నరకము చీమిడి శ్లేష్మముతో నిండినది. ఒక కల్ప మక్కడ నిరంతర మాంసాభిరుచి గలవాడు గూలును. ఉగ్ర గంధమను నరకము లాలా (చొంగ) మూత్ర పురీష మయము. పితరులకు పిండ ప్రదానము చేయని వాండ్రందు బడవేయ బడుదురు. జలగలు తేళ్ళతో నుండెడి దుర్భర నరకము పది వేలేండ్లందు తిండిపోతు గూలును. వజ్ర మయము వజ్రమహా నీడమను నరకమున ధనధాన్య హిరణ్యములును హరించిన వాండ్రు కుములుదురు. యమ కింకరులు లేశ లేశముగా దొంగలనట చెక్కుదురు. కాకిని గ్రద్దనట్లు ప్రాణుల నరకితిను వాండ్రను యమ కింకరులు కల్పాంతము దాక వాండ్ర మాంసమును వాండ్ర చేతనే దినిపింతురు. బరుల శయనాసన వస్త్రాదులం గాజేసిన వాండ్రను శక్తి తోమరాదులచే యమ భటులు ఖండింతురు. పండ్లు ఆకులు హరించిన కుబుద్ధులు గడ్డి నిప్పునం గాల్ప బడుదురు. కాలభటులు పరదా రథనాదుల యెడ బుద్ధిగల వాని గుండెలలో గాలిన యినుప శూలముం గ్రుచ్చుదురు. మనో వాక్కాయ కర్మలందు ధర్మ విముఖు లయిన పాపులు యమ లోకమున బలు ఘోర మలయిన యాతన లందు వేలు లక్షలు కోట్ల సంవత్సరములు దుఃఖములు గుడువ వలసి యుండును.
Summary of chapter 108 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The nature of saṃsāra — the endless cycle of birth, death, and rebirth driven by karma and desire — is analyzed. The chapter expounds how the soul, bound by its karmic residues, takes on successive embodiments in various species according to the quality of its actions. The futility of seeking permanent satisfaction in saṃsāra is established, and the necessity of seeking liberation through dharma, knowledge, and devotion is urged.