మునులు:
ఏకైకస్యాస్తు యాత్రాయాః ఫలంబ్రూహి పృథక్పృథక్
యత్ప్రాప్నోతి నరః కృత్వా నారీవా తత్ర సంయతా
బ్రహ్మ:
ప్రతియాత్రాఫలం విప్రాః శృణుధ్వం గదతో మమ
యత్ప్రాప్నోతి నరః కృత్వా తస్మిన్క్షేత్రే సుసంయతః
గుడివాయాం తథోత్థానే ఫాల్గున్యాం విషువే తథా
యాత్రాం కృత్వా విధానేన దృష్ట్వా కృష్ణం ప్రణమ్యచ
సంకర్షణం సుభద్రాం చ లభేత్సర్వత్ర వైఫలమ్
నరో గచ్ఛేద్విష్ణులోకే యావదింద్రాశ్చతుర్దశ
యావద్యాత్రాం జ్యేష్ఠమాసే కరోతి విధివన్నరః
తావత్కల్పం విష్ణులోకే సుఖం భుంక్తే న సంశయః
తస్మిన్క్షేత్రవరే పుణ్యే రమ్యే శ్రీపురుషోత్తమే
భుక్తిముక్తి ప్రదే నౄణాం సర్వసత్త్వసుఖావహే
జ్యేష్ఠే యాత్రాం (త్రా) నరః కృత్వా నారీవా సంయరేంద్రియః
యథోక్తేన విధానేన దశ ద్వేచ సమాహితః
ప్రతిష్ఠాం కురుతేయస్తు శాఠ్యదంభవివర్జితః
స భుక్త్వా వివిధాన్భోగా న్మోక్షం చాంతే లభేద్ధ్రువమ్
బ్రహ్మ:
ఉత్థాన యేకాదశి యందు ఫాల్గుణ పూర్ణిమ నాడు విషువ పుణ్య కాల మందు ‘గుడివా’ యాత్ర దర్శనము చేసిన వాడు పదునాల్గు రింద్రుల పరిపాలన కాలము వరకు విష్ణు లోకము నందుండును. పురుషోత్తమ క్షేత్రమునకు జ్యేష్ఠ మందు యాత్ర చేసిన వాడు కల్పాంతము వరకు విష్ణు లోకమందు సుఖించును. విధానమున లోభత్వము డాంబికము లేకుండ భగవత్ప్రతిష్ఠ చేసి పూజించిన యతడు వైకుంఠ భోగముల ననుభవించి మోక్షము నందును.
మునులు:
శ్రోతుమిచ్ఛామహే దేవ ప్రతిష్ఠాం వదతస్తవ
విధానం చార్చనం దానం ఫలం తత్ర జగత్పతేః
మునులు:
భగవత్ప్రతిష్ఠా విధానము, అర్చనము, దానము మొదలైన వాని ఫలము గురించి అడుగ. బ్రహ్మయిట్లనియె.
బ్రహ్మ:
శృణుధ్వం మునిశార్దూలాః ప్రతిష్ఠాం విధిచోదితామ్
యాం కృత్వాతు నరో భక్త్వా నారీవా లభ తే ఫలమ్
యాత్రా ద్వాదశ సంపూర్ణా యదా స్యాత్తు (స్యుస్తు) ద్విజోత్తమాః
తదా కుర్వీతవిధివ త్ప్రతిష్ఠాం పాపనాశినీమ్
జ్యేష్ఠే మాసి సితే పక్షే త్వేకాదశ్యాం సమాహితః
గత్వాజలాశయం పుణ్య మాచమ్య ప్రయతః శుచిః
ఆవాహ్య సర్వతీర్థాని ధ్యాత్వా నారాయణం తథా
తతః స్నానం ప్రకుర్వీత విధివత్సుసమాహితః
యస్యయో విధిరుద్దిష్ట ఋషిభిః స్నానకర్మణి
తేనైవతు విధానేన స్నానం తస్య విధీయతే
న్పితౄస్వాత్వా సమ్యగ్విధానేవ తతో దేవానృషీర్పిత్రూన్
సంతర్పయేత్తథా న్యాంశ్చ నామగోత్రవిధానవత్
ఉత్తీర్య వాససీ ధౌతే నిర్మలే పరిధాయవై
ఉపస్పృశ్య విధానేన భాస్కరాభిముఖస్తతః
గాయత్రీం పావనీం దేవీం మనసా వేదమాతరమ్
సర్వపాపహరాం పుణ్యాం జపేదష్టోత్తరం శతమ్
పుణ్యాంశ్చ సౌరమంత్రాంశ్చ శ్రద్ధయా సుసమాహితః
త్రిః ప్రదక్షిణ మావృత్య భాస్కరం ప్రణమేత్తతః
వేదోక్తం త్రిషు వర్ణేషు స్నానం జాప్యముదాహృతమ్
స్త్రీశూద్రయోః స్నానజాప్యం వేదోక్త విధివర్జితమ్
జ్యేష్టశుక్ల యేకాదశి నాడు ఇంద్రద్యుమ్న సరసు నందు యథావిధిగ స్నాన మాచరించి దేవర్షి పితృ తర్పణము లొనరించి మడి వస్త్రములను ధరించి సూర్యాభి ముఖుడై వేదమాత గాయత్రిని యష్టోత్తర శతము (108) జపించి సౌర మంత్ర పారాయణము జేసి ముమ్మార్లు ప్రదక్షిణము జేసి త్రివర్ణముల వారు వేదోక్త విధానమున సూర్య నమస్కారములను చేయ వలెను. స్త్రీ శూద్రులు స్నానాదు లందు జపము లందు వేదోక్తము గాక పురాణొక్త విధానము ననుసరింప వలెను.
తతో గచ్ఛేద్గృహం మౌనీ పూజయేత్పురుషోత్తమమ్
ప్రక్షాళ్యం హస్తౌ పాదౌచ ఉపస్పృశ్య యథావిధి
ఘృతేన స్నాపయేద్దేవం క్షీరేణ తదనంతరమ్
మధుగంధోధకేనై వ తీర్థచందన వారిణా
తతో వస్త్రయుగం శ్రేష్ఠం భక్త్యా తంపరిదాపయేత్
చందనాగరు కర్పూరైః కుంకుమేన విలేపయేత్
పూజయేత్పరయా భక్త్యా పద్మైశ్చ పురుషోత్తమమ్
అన్యైశ్చ వైష్ణవైః పుష్పై రర్చయేన్మల్లికాదిభిః
సంపూజ్యైవ జగన్నాథం భుక్తిముక్తి ప్రదంహరిమ్
ధూపం ఔగురుసంయుక్తం దహేద్దేవస్య చాగ్రతః
గుగ్గులం చ మునిశ్రేష్ఠా దహేద్గంధ సమన్వితమ్
దీపం ప్రజ్వాలయేద్భక్త్యా యథాశక్తా క్తి ఘృతేన వై
అన్యాంశ్చ దీపకాన్దద్యా ద్ద్వాదశైవ సమాహితః
ఘృతేన చ మునిశ్రేష్ఠా స్తిలతైలేన వా పునః
నైవేద్యే పాయసాపూప శష్కుళీవటకం తథా
మోదకం ఫాణితం వాల్పం ఫలాని చ నివేదయేత్
ఏవం పంచోపచారేణ సంపూజ్య పురుషోత్తమమ్
నమః పురుషోత్తమా యేతి జపేదష్టోత్తరం శతమ్
తతః ప్రసాదయేద్దేవం భక్త్యాతం పురుషోత్తమమ్
నమస్తే సర్వలోకేశ భక్తానా మభయప్రద
సంసారసాగరే మగ్నం త్రాహిమాం పురుషోత్తమ
యాస్తే కృతామయా యాత్రా ద్వాదశైవ జగత్పతే
ప్రసాదాత్తవ గోవింద సంపూర్ణాస్తా భవంతుమే
ఏవం ప్రసాద్య తం దేవం దండవత్ప్రణిపత్యచ
తతో ర్చయేద్గురుం భక్త్యా పుష్పవస్త్రానులేపనైః
నానయోరంతరం యస్మా ద్ద్విద్యతే మునిసత్తమాః
దేవస్యోపరి కుర్వీత శ్రద్ధయా సుసమాహితః
నానాపుష్పైర్ముని శ్రేష్ఠా విచిత్రం పుష్పమండపమ్
కృత్వా వధారణం పశ్చా జ్జాగారం కారయేన్నిశి
కథాంచ వాసుదేవస్య గీతికాం చాపి కారయేత్
ధ్యాయన్పఠన్త్సువన్దేవం ప్రణయేద్రజనీం బుధః
తతః ప్రభాతే విమలే ద్వాదశ్యాం ద్వాదశై వతు
నిమంత్రయేద్వ్రతస్నాతా న్బ్రాహ్మణాన్వేదపారగాన్
ఇతిహాసపురాణజ్ఞా న్మ్రోత్రియాన్సంయతేంద్రియాన్
స్నాత్వా సమ్యగ్విధానేన ధౌతవాసా జితేంద్రియః
స్నాపయేత్పూర్వవత్తత్ర పూజయేర్పురుషోత్తమమ్
గంధైః పుష్పైరుపాహారై ర్వైవేద్యైర్దీపకైస్తథా
ఉపచారైర్బహువిధైః ప్రణిపాతైః ప్రదక్షిణైః
యాప్యైఃస్తుతినమస్కారై ర్గీతవాద్యైర్మనోహరైః
సంపూజ్యైవం జగన్నాథం బ్రహ్మణాన్పూజయేత్తతః
ద్వాదశైవ తు గాస్తేభ్యో దత్త్వా కనకమేవ చ
ఛత్రోపానద్యుగం చైవ శ్రద్థా భక్తిసమన్వితః
భక్త్యాతు సధనం తేభ్యో దద్యాద్వస్త్రాదికం ద్విజాః
సద్భావేనతు గోవింద స్తోష్యతే పూజితో యతః
ఆచార్యాయ తతో దద్యా ద్గోవస్త్రం కనకం తథా
ఛత్రోపానద్యుగం చాన్య త్కాంస్యపాత్రం చభక్తితః
తతస్తాన్భోజయేద్విప్రా న్భోజ్యం పాయసపూర్వకమ్
పక్వాన్నం భక్ష్యభోజ్యం చ గుడసర్పిః సమన్వితమ్
తతస్తానన్నతృప్తాంశ్చ బ్రాహ్మణాన్స్వస్థ మానసాన్
ద్వాదశైవోద కుంభాంశ్చ దద్యాత్తేభ్యః సమోదకాన్
దక్షిణాంచ యథాశక్త్యా (క్తి) దద్యాత్తేభ్యో విమత్సరః
కుంభం చ దక్షిణాం చైవ ఆచార్యాయ నివేదయేత్
ఏవం సంపూజ్య తాన్విప్రా న్గురుం జ్ఞానప్రదాయకమ్
పూజయేత్పరయా భక్త్యా విష్ణుతుల్యం ద్విజోత్తమాః
సువర్ణపస్త్ర గోధాన్యై ర్ద్రవ్యైశ్చా న్యైర్వరై ర్భుధః
సంపూజ్య తం నమస్కృత్య ఇమం మంత్రముదీరయేత్
సర్వవ్యాపీ జగన్నాథః శంఖచక్ర గదాధరః
అనాదినిధనో దేవః ప్రీయతాం పురుషోత్తమః
ఇత్యుచ్చార్య తతో విప్రాంస్త్రిః కృత్వా చ ప్రదక్షిణామ్
ప్రణమ్య శిరసా భక్త్యా అచార్యం తు నిసర్జయేత్
తతస్తా న్బ్రాహ్మణాన్భక్త్యా చాసీమాంత మనువ్రజేత్
అనువ్రజ్య తు తాస్సర్వా న్నమస్కృత్య నివర్తయేత్
బాంధవైః స్వజనై ర్యుక్త స్తతో భుంజీత వాగ్యతః
అన్యైశ్చోపానకైర్దీనై ర్భిక్షుకైశ్చాన్నకాంక్షిభిః
ఏవం కృత్వా నరః సమ్య ఙ్నారీ వా లభతే ఫలమ్
ఆశ్వమేధ సహస్రాణాం రాజసూయశతస్య చ
అతీతం శతమాదాయ పురుషాణాం నరోత్తమాః
భవిష్యం చ శతం విప్రాః స్వర్గత్వా దివ్యరూపధృక్
సర్వలక్షణ సంపన్నః సర్వాలంకార భూషితః
సర్వకామ సమృద్ధాత్మా దేవవద్ద్విగతజ్వరః
రూప యౌవన సంపన్నో గుణైః సర్వైరలంకృతః
స్తూయమానో ప్సరోభిశ్చ గంధర్వైః సమలంకృతః
విమానేనార్కవర్ణేన కామగేన స్థిరేణ చ
పతాకాధ్వజ యుక్తేన సర్వరత్నైరలంకృతః
ఉద్యోతయన్దిశః సర్వా ఆకాశే విగతక్లమః
యువా మహాబలో ధీమా న్విష్ణులోకం స గచ్ఛతి
తత్ర కల్పశతం యావ ద్భుంక్తే భోగాన్యథేప్సితాన్
సిద్ధాప్సరోభి ర్గంధర్వైః సురవిద్యాధరోరగైః
స్తూయమానో మునివరై స్తిష్ఠతే విగతజ్వరః
యథా దేవో జగన్నాథః శంఖచక్ర గదాధరః
తథా సౌ ముదితో విప్రాః కృత్వా రూపం చతుర్భుజమ్
భుక్త్వా తత్ర వరాన్భోగా న్క్రీడాం కృత్వా సురైః సహ
తదంతే బ్రహ్మసదన మాయాతి సర్వకామదమ్
సిద్ధవిద్యాధరైశ్చాపి శోఖితం సురకిన్నరైః
కాలం నవతి కల్పంతు తత్ర భుక్త్వా సుఖం నరః
తస్మాదాయాతి విప్రేంద్రాః సర్వకామ ఫలప్రదమ్
రుద్రలోకం సురగణైః సేవితం సుఖమోక్షదమ్
అనేక శతసాహస్రై ర్విమానైః సమలంకృతమ్
సిద్ధవిద్యాధరై ర్యక్షై ర్భూషితం దైత్యదానవైః
అశీతికల్పకాలంతు తత్ర భుక్త్వా సుఖం నరః
తదంతే యాతి గోలోకం సర్వభోగ సమన్వితమ్
సురసిద్ధాప్సరోభిశ్చ శోభితం సుమనోహరమ్
తత్ర సప్తతి కల్పాంస్తు భుక్త్వా భోగమనుత్తమమ్
దుర్లభం త్రిషు లోకేషు స్వస్థచిల్తో యథా మరః
తస్మాదాగచ్ఛతే లోకం ప్రాజాపత్య మనుత్తమమ్
గంధర్వాప్సరసైః సిద్ధై ర్ముని విద్యాధరై ర్వృతః
షష్టికల్పాన్సుఖం తత్ర భుక్త్వా నానావిధం ముదా
తదంతే శక్రభవనం నానాశ్చర్య సమన్వితమ్
గంధర్వైః కింనరైః సిద్ధైః సుర విద్యాధరోరగైః
గుహ్యకాప్సరసైః సాధ్యై ర్వృతైశ్చాన్యైః సురోత్తమైః
ఆగత్య తత్ర పంచాశ త్కల్పాన్భుక్త్వా సుఖం నరః
సురలోకం తతో గత్వా విమానైః సమలంకృతః
చత్వారింశత్తు కల్పాంస్తు భుక్త్వా భోగాన్సుదుర్లభాన్
అగచ్ఛతే తతో లోకం నక్షత్రాఖ్యం సుదుర్లభమ్
తతో భోగాస్వరాన్భుంక్తే త్రింశత్కల్పాన్యథేప్పితాన్
తస్మాదాగచ్ఛతే లోకం శశాంకస్య ద్విజోత్తమాః
యత్రాసౌ తిష్ఠతే సోమః సర్వదేవైరలంకృతః
తత్ర వింశతికల్పాంస్తు భుక్త్వా భోగం సుదుర్లభమ్
ఆదిత్యస్య తతో లోక మాయాతి సురపూజితమ్
నానాశ్చర్య మయం పుణ్యం గంధర్వాప్సరః సేవితమ్
తత్ర భుక్త్వా శుభాన్భోగా న్దశకల్పాన్ద్విజోత్తమాః
తస్మాదాయాతి భువనం గంధర్వాణాం సుదుర్లభమ్
తత్ర భోగాన్సమస్తాంశ్చ కల్పమేకం యథా సుఖమ్
భుక్త్వా చాయాతి మేదిన్యాం రాజాభవతి ధార్మికః
చక్రవర్తీ మహావీర్యో గుణైః సర్వైరలంకృతః
కృత్వా రాజ్యం స్వధర్మేణ యజ్ఞైరిష్ట్వా సుదక్షిణైః
తదంతే యోగినాం లోకం గత్వా మోక్షప్రదం శివమ్
తత్ర భుక్త్వా వరాన్భోగా న్యావదాభూత సంప్లవమ్
తస్మాదాగచ్ఛతే చాత్ర జాయతే యోగినాం కులే
ప్రవరే సైష్ణవే విప్రా దుర్లభే సాధుసంమతే
చతుర్వేదీ విప్రవరో యజ్ఞైరిష్ట్వా ప్త దక్షిణైః
వైష్ణవం యోగమాస్థాయ తతో మోక్షవాప్నుయాత్
ఏవం యాత్రాఫలం విప్రా మయా సమ్యగుదాహృతమ్
భుక్తిముక్తిప్రదం నౄణాం కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛథ
అటు మీద గృహమున కేగి మౌనమూని పురుషోత్తముని ధ్యానా వాహనాది విధానమున పూజింప వలెను. ఆ దేవుని ఆవు నేతితో పాలతో నభిషేకింప వలెను. పంచామృత స్నానము కూడ చేయింప వలెను. చందనో దకముతో స్నాన మాడింప వలెను. ఆ మీద వస్త్రయుగ్మ సమర్పణ చేయ వలెను. చందనాగరు కర్పూర కుంకుమలు పూయ వలెను. విష్ణు ప్రియము లైన తామర మల్లియలతో జగన్నాథుని పూజింప వలెను. ధూపమీయ వలెను. అవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని పండ్రెండు దీపములను పెట్ట వలెను. పాయసము చక్కెలములు లడ్డూ వటకము బెల్లపు పాకము నివేదింప వలెను. మధుర ఫలములను గూడ నివేదింప వలెను, పంచో పచారములచే నిట్లు పూజించి “నమః పురుషోత్తమాయ” అను మంత్రము 108 మార్లు జపింప వలెను. అటుపై నా దేవుని నమస్తే “నమస్తే సర్వలోకేశ భక్తానా మభయప్రద” అని ప్రారంభించి స్తుతించి యీ పండ్రెండు యాత్రలు నీ యనుగ్రహమున సంపూర్ణ ఫలవంతము లగు గాక యని యా దేవుని యనుగ్రహింప జేసుకొని దండవ త్ప్రణామము గావింప వలెను. పుష్ప వస్త్ర గంధాదులచే నటుపై గురువుని పూజింప వలెను. గురువున కును దేవున కును భేదము లేదు. ఆ మీదట పుష్ప మండప నిర్మాణము జేసి వేదాది విద్యలను స్వామికి నవధరింప జేసి యా రాత్రి జాగరణ చేయ వలెను. అందు వాసుదేవ కథా ప్రసంగము, సంకీర్తనము చేయ వలెను. చేయింప వలెను. ధ్యానించుచు పఠించుచు శ్రీహరిని స్తుతించుచు నమస్కరించుచు నారేయి గడుప వలెను. ద్వాదశి యందు ప్రభాతమున పండ్రెండుగురు వ్రత స్నాతులు వేద పారగులు ఇతిహాస పురాణజ్ఞులు జితేంద్రియులు నయిన బ్రాహ్మణులను ఆహ్వానింప వలెను. తాను యథావిధి స్నానము జేసి పురుషోత్తముని పూజింప వలెను. బ్రాహ్మణులను బూజించి గొ, స్వర్ణ, ఛత్ర, పాదుకా దులను వస్త్రా భరణములను నొసంగి బూజింప వలెను. ఆచార్యునకు కూడ పైన చెప్పిన ద్రవ్యముల నొసంగి యందరికిని మృష్టాన్న భోజనము పెట్ట వలెను. ఆ బ్రాహ్మణులకు మోదకములతో గూడ పండ్రెండు ఉదకుంభ దానములను సదక్షిణముగ చేయ వలెను. జ్ఞాన ప్రదుడైన గురువును బ్రాహ్మణులను విష్ణు తుల్యులుగా భక్తితో భావించి యిట్లు బూజింప వలెను. అటుపై వారికి నమస్కరించుచు నీక్రింది “సర్వవ్యాపీ జగన్నాథః శంఖచక్ర గదాధరః అనాదినిధనో దేవః ప్రీయతాం పురుషోత్తమః” శ్లోక రూప మయిన మంత్రమును పఠింప వలెను. ఆ శ్లోక భావమిది. “అంతటను నిండి యున్నవాడు. ఆది మధ్యాంతములు లేని వాడు శంఖచక్ర గదా ధరుడు జగన్నాధుడు నగు పురుషోత్తమ దేవుడు సంప్రీతు డగుగాక”. అని యిట్లు పలికి విప్రులకు నమస్కరించి యాచార్యుని తోబాటు వారికి శిరసు వంచి నమస్కరించి వారిని తన యింటి సరిహద్దుల వరకు సాగనంపి నమస్కరించి వచ్చి బంధు జనముతో వాజ్నియమము వహించి భగవ త్ప్రసాదము నారగింప వలెను. ఉపాసకులకు దీనులకు భిక్షుకులకు అన్నాతురులకు గూడ భోజనము బెట్ట వలెను. ఇట్లు చేసిన పురుషుడేని స్త్రీ యేని యశ్వమేధ రాజసూయ శత సహస్ర పుణ్యము బొందును. నూరు తరములు వెనుక వారిని ముందు వారిని తరింప జేసి దివ్య రూపధారియై సూర్యునట్లు వెలుగు కామగ మగు విమానమున గంధ ర్వాప్సరో బృందము స్తుతింప దన పుణ్య విశేషముచే దశ దిశలను వెలిగించుచు నాతడు హరిపుర మేగును. నూరు కల్పములు వైకుంఠ భోగముల ననుభవించి సర్వస్తుతి పాత్రమయి జగన్నాధ స్వామి సారూప్య మంది సర్వ భోగముల ననుభవించి బ్రహ్మలోక మేగును. అచట తొంబది కల్పములు సుఖించి రుద్ర లోకమున కేగును. అచట నెనుబది కల్పములు సుఖ మనుభవించి గోలోకమున కేగును. డెబ్బది కల్పము లచట నుండును. అట నుండి ప్రజాపతి లోకమేగి యఱువది కల్పములు నానా భోగముల ననుభవించును. అట నుండి యింద్ర భవనమున కేతెంచి యేబది కల్పములు సుఖించి నలుబది కల్పములు సురలోకమున సుఖ మనుభవించి నక్షత్ర లోకమున కేగి ముప్పది కల్పము లుండి చంద్ర లోకమున నిరువది కల్పము లుండి యాదిత్య లోకమున కేగి పది కల్పములు సుఖించి గంధర్వ భువనమున నొక కల్పము భోగించి భూమి కేతెంచి ధర్మ పరుడైన చక్రవర్తి యగును. ఇచట రాజ్యమును ధర్మముగ పాలించి సంపూర్ణ దక్షిణము లగు యజ్ఞము లాచరించి యోగి గమ్యమగు మోక్షప్రద మయిన శివలోక మందును. అందు భూత ప్రళయము దాక సర్వ భోగముల ననుభవించి మరల నిటకు వచ్చి యోగుల కులమందు విష్ణు భక్తుడైన విప్రుల వంశమందు జనెంచి చతుర్వేదా ధ్యాయిమై సుదక్షిణములై యజ్ఞములను జేసి విష్ణు భక్తి యోగము నూని మోక్ష మందును.
భుక్తిముక్తుల నొసంగు గుడివా యాత్రాఫలము మీకు చక్కగ వినిపించితిని. ఓ విప్రులార! మరి యేమి విన వలతురు?
Summary of chapter 66 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The supreme glory of Bhagavān Puruṣottama — his identity as the eternal, all-pervading, imperishable Puruṣa — is extolled through direct theological declaration and stotra. His status as the supreme goal of all spiritual endeavor, his compassion for devotees who seek refuge in him, and the incomparable efficacy of his name, form, and kṣetra are praised in terms that blend philosophical depth with devotional ardor.