బ్రహ్మ మహా పురాణము
14 - శ్రీ కృష్ణజన్మానుకీర్తనమ్
లోమహర్షణుడు:
గాంధారీ చైవ మాద్రీ చ క్రోష్టో ర్బార్యే బభూవతుః గాంధారీ జనయామాస అసమిత్రం మహాబలం
మాద్రీ యాధాజితం పుత్రం తతోన్యం దేవమీఢుషమ్ తేషాం వంశ స్త్రిధా భూతో వ్భష్ణీనాం కులవర్ధనః
మాద్య్రాః పుత్రౌ తు జజ్ఞాతే శ్రుతౌ వృష్ణ్యంధకాపుభౌ జజ్ఞాతే తనయౌ వృష్ణేః శ్వఫల్క శ్చిత్రకస్తథా
లోమహర్షణుడు:
క్రోష్టుని భార్యలు గాంధారి మాద్రియును, గాంధారి అనమిత్రుని మాధ్రి యుధాజిత్తును దేవమీఢుఘడనను నిద్దరిం గనెను. వారి వంశమే వృష్టి వంశముగా మూడు శాఖలుగా వృధ్ది నందెను. మాద్రి కొడుకులు వృష్ణి అంధకుడు అనువారు. శ్వఫల్కడు, చిత్రకుడను వారు వృష్ణి యొక్క కుమారులు.
శ్వఫల్కస్తు ముని శ్రేష్ఠా ధర్మాత్మా యత్ర వర్తతే నాస్తి వ్యాధిభయం తత్రానా వర్షస్తపమేవ చ
కదాచి త్కాశిరాజస్య విషమే మునిసత్తమాః త్రీణి వర్షాణి పూర్ణాని నావర్ష త్పాకశాసనః
స తత్ర చానయామాస శ్వఫల్కం పరమార్చితమ్ శ్వఫల్క పరివర్తేస వవర్ష హరివాహనః
శ్వఫల్కః కాశిరాజస్య సుతాం భార్యా మవిందత గాందినీం నామ గాం సా చ దదౌ విప్రాయ నిత్యశః
శ్వఫల్కుడు ధర్మపరుడు, వాని పాలనము నందు వ్యాది భయము, అవృష్ణి తాపము మొదలైన బాధలు లేకుండె. ఒకప్పుడు కాశీ రాజు పాలించు దేశము నందింద్రుడు మూడేండ్లు వర్షింపనే లేదు. అపుడు కాశీ రాజు శ్వఫల్కుని తన రాజ్యమునకుం గొన వచ్చెను. అతడచ్చేట మసలిన కతన హరి వాహనుడు (ఇంద్రుడు) వాన గురియించెను. అపుడు శ్వఫల్కుడు కాశీశ్వరుని కుమార్తె గాంధిరిని వివాహ మాడెను. అమె నిత్యము విప్రునికి గోవు నొసంగు చుండెను.
దాతా యజ్వా చ వీరశ్చ శ్రుతవా నతిథిప్రియాః అ క్రూరః సుషువే తస్మా చ్ఛ్వఫల్కా ద్భూరిదక్షిణః
ఉపమద్గు స్తథా మద్గు ర్మేదుర ళ్చారిమేజయః అవిక్షిత స్తథాక్షేపః శత్రుఘ్న శ్చారిమర్ధనః
ధర్మధృ గ్యతిధర్మాచ ధర్మోక్షోంధకరు స్తథా అవాహ ప్రతివాహౌచ సుందరీ చ వరాంగనా
అక్రూరేణోగ్రసేనాయాం సుగాత్య్రాం ద్విజసత్తమాః ప్రసేస శ్చోపదేవశ్చ జజ్ఞాతే దేపవర్చసౌ
చిత్రక స్యాభ వన్పుత్రాః పృథు ర్విపృథురేవ చ అశ్వగ్రీవోశ్వ బాహుశ్చ స్వపార్మ్వకగవేషణౌ
అరిష్టనేమి రశ్వశ్చ సుధర్మా ధర్మభృత్తథా సుబాహు ర్బహుబాహుశ్చ శ్రవిష్టా శ్రవణే స్త్రియౌ
అసిక్న్యాం జనయామాస శూరం వై దేవమీఢుషమ్ మహిష్యాం జజ్ఞిరే శూరా భోజ్యాయాం పురుషా దశ
వనుదేవో మహాబాహూః పూర్వ మానకదుందుభిః జజ్ఞే యస్య ప్రసూతస్య దుందుభ్యః ప్రాణదన్‌దివి
అనకానం చ సంహ్రాదః సుమహా నభవ ద్దివి పపాత పుష్పనర్షశ్చ శూరస్య జననే మహాన్
మనుష్యలోకే క్సత్స్నేపిరూపే నాస్తి సమోభువి యప్యాసీ త్పురుషాగ్ర్యస్య కాంతిశ్చంద్రమసోయథా
దాత యజ్వ వీరుడు పండితుడు అతిధి ప్రియుడు భూరి దక్షిణుడైన అక్రూరుడు ఉపమద్గువు మద్గువు మందరుడు అరిమేజయుడు, అవిక్షుతుడు అంధకరువు అవాహుడు ప్రతివాహుడును సుందరి యను కన్వయు శ్వఫల్కునకు పుట్టిరి. దేవవర్చస్సు గల ప్రసేనుడు, ఉప దేవుడు అనువారు ఉగ్రసేన యందు అక్రూరునకు ఉదయించిరి. వృష్ణి కుమారుడగు చిత్రుకునకు పృధువు వివృధువు అశ్వగ్రీవుడు, లశ్వబాహువు, స్వపార్శ్వుడు, గవేషణుడు, అరిష్టనేమి, అశ్వుడు, సుధర్ముడు, సుభాహువు, బహుబాహువు నను కుమారులు. శవిష్ఠ శ్రవణయను కుమార్తెలు పుట్టిరి. దేవమీఢుడు అసిక్ని యందు శూరుడను వానిని గనెను. శూరునకు భోజ్య యందు పది మంది శూరులను వారు దయించిరి. వసు దేవుడు ఆనక దుందుభియను పేరున ముందుగ పుట్టెను. పుట్టగానే దివంబున అనకము లనెడి వాద్య విశేములు దుందుభులు మ్రోగినవి. పుష్ప వృష్టి గురిసెను. వసు దేవునితో సముడయిన యందగా డీలోకమున లేడు. అతడు చంద్రుని వంటి కాంతితో తేజరిల్లెను.
దేవభాగ స్తతో జజ్ఞే తథా దేవశ్రవాః పునః అనాధృష్టిః కనవకో వత్సవా నథ గృంజమః
శ్యామః శమీకో గండూషః పంచ చాస్య వరాంగనాః పృధుకీర్తిః పృథా చైవ శ్రుత దేవా శ్రుత శ్రవా
రాజాధిదేవీ చ తథా పంచైతా వీరమాతరః శ్రుత శ్రవాయాం చైద్యస్తు శిశుపాలోభవన్నృపః
హిరణ్యకశిపు ర్యోసౌ దైత్యరాజోభవత్పురా పృథుకీర్త్యాం తు సంజజ్ఞే తనయో వృధ్ధశర్మణః
కరూశాధిపతి ర్వీరో దంతవక్త్రో మహాబలః పృధాం దుహితరం చక్రే కుంతి స్తాం పాండు రావహత్
యస్యాం స ధర్మవి ద్రాజా ధర్మోజజ్ఞే యుధిష్ఠిరః భీమసేన స్థథా వాతా దింద్రాచ్చైవ ధనంజయ
లోకేప్రతిరథో వీరః శక్రతుల్యపరాక్రమః ఆనమిత్రాచ్ఛిని ర్జజ్ఞే కనిష్ఠా ద్వృష్ణినందనాత్
శైనేయః సత్యక స్తస్మా ద్యుయుధానశ్చ సాత్యకిః ఉద్దవో దేవభాగస్య మహాభాగః సుతోభవత్
పండితానాం పరం ప్రాహు ర్దేవశ్రవస ముత్తమమ్ అశ్మక్యం ప్రాప్తవా న్పుత్ర మనాధృష్టి ర్యశస్వినమ్
నివృత్తశత్రుం శత్రుఘ్నం శ్రుతదేవా త్త్వజాయత శ్రుతదేవాత్మజా స్తేతు నైషాదిర్యః పరిశ్రుతః
ఏకలవ్యో మునిశ్రేష్ఠా నిషాదైః పరివర్థితః వత్సవతే త్వవుత్రాయ వసుదేవః ప్రతాపవాన్
అద్భిర్దదౌ సుతం వీరం శౌరిః కౌశిక మౌరసమ్ గండూషాయ హ్యవుత్రాయ విష్వక్సేనో దుదౌ నుతాన్
చారుదేష్ణం సుదేష్ణం చ పంచాలం కృతలక్షణమ్
ఈయనకు దేవ భాగుడు, దేవశ్రవుడు, అనాధృష్ఠి, కనవకుడు, వత్సవానుడు, గృంజముడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడునను కొమరులు, పృథుకీర్తి, పృథ, శ్రుతదేవ, శ్రుతశ్రవ రాజాధిదేవి అను నైదుగురు కూతురులు వీర పత్నులు గల్గిరి, శ్రుత శ్రవ యందు చైద్యుడు శిశుపాలుడను పేర గల్గెను. ఇతడే క్రింధటి జన్మమున దైత్యపతి హిరణ్య కశివుడు, వృద్ధశర్మ వలన వృధ కీర్తి యందు కరూశాధిపతి యైన దంతవక్త్రుండు పుట్టెను. కుంతియను రాజు పృథను కుమార్తెగా పెంచు కొనెను. అమెను పాండురాజు పెండ్లాడెను. అమె యందు యముడే ధర్మవేత్తయైన ధర్మరాజై (యుధష్టిరుడు) యుదయించెను. వాయువు వలన భీమసేనుడు గల్గెను. ఇంద్రుని వలన ధనంజయుడు అప్రతి రథుడు, ఇంద్ర పరాక్రము డుదయించెను. కనిష్ఠుడయిన అనమిత్రుడను వృష్ణి నందనునికి శిని యనువాడు కల్గెను. శిని కొడుకు (శైనేయుడు) సత్యకుడు సత్యకుని కుమారుడు యుయుధానుడు (సాత్యకి) దేవభాగునకు మహానుభావుడు. ఉద్దవుం డావిర్భవించెను. దేవశ్రవుని పండితాగ్రణి యందురు, దేవశ్రవుడు కీర్తి శాలియగు ఆశ్మక్యుడను సుతునిం బడెసెను. అనాధృష్టిని కృత్తశత్రు వసు కుమారిని శ్రుతదేవ యను నామె శత్రుఘ్ననిం గనెను. శ్రుతదేవ కుమారుండు ఏకలవ్యుడు నిషాదుని పెంపకములో పెరిగెను. వత్సవంతునకు పుత్రులు లేనికతన శౌరి (శూర వంశము వాడగు వసు దేవుడు) తన కుమారుని కౌశికుని ధారాదత్తము సేసెను. అపుత్రకుడైన గండూఘనకు విష్వక్సేనుడు తన కుమారులగు చారుదేష్టుడు, సుదేష్ణుడు పంచాలుడు కృత లక్షణుడు నను వారిం దతత్త యిచ్చెను.
అసంగ్రామేణ యో విరో నా వర్తత కదాచన రౌక్మిణేయో మహాబాహుః కనీయా న్ద్విజసత్తమా
వాయసానాం సహస్రాణి యం యాంతం పృష్ఠతోన్వయుః
చారూ నద్యోప భోక్ష్యామ శ్చారుదేష్ణ హతానితి
తంత్రిజ స్తంత్రిపాలశ్చ సుతౌ కనవకస్య తౌ వీరు శ్చాశ్వ హను శ్చైవ వీరౌ తా వథగృంజిమౌ
శ్యమ పుత్రః శమీకస్తు శమీకో రాజ్య మావహత్ జుగుప్సమానో భోజత్వా ద్రాజసూయ మవాప సః
అజాతశత్రుః శత్రూణాం జజ్ఞే తస్య వినాశనః వసుదేవ సుతా న్వీరా న్కీర్తయిష్యా మ్యతఃపరమ్
వృష్ణే స్త్రవిధ మేవంతు బహుశాఖం మహౌఙసమ్ ధారయ న్విపులం వంశం నానర్థై రిహ యుజ్యతే
చారుధేష్ణుడు యుద్ధమున కేగి యెన్నడు వెను దిరిగిన వాడు గాడు అతడు రుక్మిణి తనయు లందు కడగొట్టు వాడు మహా వీరుడు, చారుధేష్ణునిచే హతులైన వారిని (చారూన్ రుచిగ నున్న వారివి) ఇపుడు తిన వలయునని యాత్ర పోవు నపుడు వేలకొలది కాకు లాతని వెంట పోయెడివట. కనవకునికి తంత్రిజుడు, తంత్రిపాలుడు నను నిద్ధరు కల్గిరి. గృంజమునికి వీరువు అశ్వహనువు గల్గిరి. శ్యమ పుత్రుడగు శమీకుడు రాజ్య మేలెను. భోజ వంశమున జనించుటచే నేపగించు వాడైనను రాజసూయ మొనర్చె. అతనికి శత్రు నాశకుడగు అజాత శత్రపు గల్గెను. ఇక వసు దేవుని సంతానము దెల్పెద. వృష్ణి యొక్క (వృష్ణి అంధకభోజ) త్రిశాఖ మైన (మూడు శాఖలై) యీ వంశము యొక్క చరిత్ర ధారణము చేయు నతడు వంశాభివృద్ధి నందును అనర్థములను బాయును.
యాః సత్న్యో వసుదేవస్య చతుర్దశ వరాంగనాః పౌరవీ రోహిణీ నామ మదిరాది స్తథాపరా
వైశాఖీ చ తథా భద్రా సునామ్నీ చైవ పంచమీ
సహదేవా శాంతిదేవా శ్రీదేవీ దేవరక్షితా
వృకదేవ్యుపదేవీ చ దేవకీ చై వ సప్తమీ నుతను ర్వడవా చైవ ద్వే ఏతేపరిచారికే
పౌరవీ రోహిణీ నామ బాహ్లికస్యాత్మజాభవత్ జ్యేష్ఠా పత్నీ మునిశ్రేష్ఠా దయితానకదుందుభేః
లేభే జ్యేష్ఠం సుతం రామంశరణ్యం శరమేవచ దుర్దమం దమనం ళుభ్రం పిండారక ముశీనరమ్
చిత్రానామ కుమారీ చ రోహిణీ తనయా నవ చిత్రా సుభద్రేతి పున ర్విఖ్యాతా మునిసత్తమాః
వసుదేవాచ్చ దేవక్యాం జజ్ఞే శౌరి ర్మహాయశాః రామాచ్చ నిశఠో జజ్ఞే రేవత్యాం దయితః సుతః
సుభద్రాయాం రథీ పార్థా దభిమన్యు రజాయత అక్రూరా త్కిశికన్యాయాం సత్యకేతు రజాయత
వసుదేవస్య భార్యాసు మహాభాగాసు నప్తసు యే పుత్రా జజ్ఞిరే శూరాః సమస్తాం న్నిబోధత
భోజశ్చ విజయశ్చైవ శాంతిదేవాసుతా వుభౌ
వృకదేవః సునామాయాం గద శ్చాస్తాం నుతా వుభౌ
అగావహాం మహాత్మానం వృకదేవీ వ్యజాయత
వసుదేవుని భార్యలు పదునల్గురు, పురు వంశమున పుట్టిన (1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) ఆది, (5) వైశాఖి, (6) భద్ర, (7) నునామ్నీ, (8) సహదేవ, (9) శాంతిదేవ, (10) శ్రీదేవి (11) దేవరక్షిత, (12) వృకదేవి, (13) ఉపదేవి, (14) దేవకి అని సుతనుపు బడబ అను వారిరువురు పరిచారికలు, పౌరవి, రోహిణియు బాహ్లికుని కుమార్తెలు. వసుదేవుని పెద్ద భార్యకు రాముడు, శరణ్యుడు, శరుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండారకుడు, ఉశీనరుడు, చిత్రయను కూతురుం గల్గిరి మొత్తం వీరు తొమ్మండుగురు. చిత్రయే సుభద్రయను పేరుతో గూడ ఖ్యాతి గాంచినది. వసు దేవునికి దేవకీ యందు శౌరి (కృష్ణుడు) అవతరించెను. రామునికి రేవతి యందు నిశఠుడను, ప్రియుపుత్రు డుదయించె. పార్ధునికి సుభద్ర యందు రథికుడగు అభిమన్యుడు గల్గెను. అక్రూరునికి కాశికన్య యందు సత్యకేతువు జనించె. వసుదేవని యేడ్వురు భార్య లందు కలిగిన శూరుల క్రమమిది. శాంతి దేవకు భోజుడు విజయుడు నను నిద్ధరు గల్గిరి. సునామ యందు వృక దేవుడు, గదుడు గల్గిరి. వృకదేవికి అగావహుడు పుట్టెను.
కన్యా త్రిగర్త రాజస్య భార్యావై శిశిరాయణేః
జిజ్ఞాసాం పౌరుషే చక్రే న చస్కందే చ పౌరుషమ్ కృష్ణాయస సమప్రఖ్యో వర్షే ద్వాదశమే తథా
మిథ్యాభిశప్తో గార్గ్యస్తు మన్యునాతిసమీరితః ఘోషకన్యా ముపాదాయ మైధునా యోపచక్రమే
గోపాలీ చప్సరా స్తస్య గోపస్త్రీవేషధారిణీ ధారయామాస గార్గ్యస్య గర్భం దుర్ధర మచ్యుతమ్
మాసుష్యాం గర్గబార్యాయాం నియోగా చ్చూలపాణినః స కాలయవనో నామ జజ్ఞే రాజా మహాబలః
పృత్త పూర్వార్ధకాయస్తు సింహసంహననో యువా అపుత్రస్య స రాజ్ఞస్తు వపృధేంతః పురే శిశుః
యవనస్య మునిశ్రేష్ఠా స కాలయువనో భవత్ అయుధ్యమానో నృపతిః పర్యపృచ్చ ద్ద్విజోత్తమమ్
పృష్ణ్యంధకకులం తన్య నారదోకథయ ద్విభుః అక్షౌహిణ్యా తు సైనస్య మధురా మభ్యయాత్తాదా
దూతం సంప్రేషయామాన పృష్ణ్యంధకని వేశనమ్ తతో పృష్ణ్యంథకాః కృష్ణం పురస్కృత్య మహామతిమ్
సమేతా మంత్రయామాసు ర్వవనస్య భయా త్తదా
కృత్వా వినిశ్చయం సర్వే పలాయన మరోచయన్
విహాయ మధురాం రమ్యాం మానయంతః పినాకినమ్ కుశస్థలీం ద్వారవతీం నివేశయితు మీప్సవః
ఇతి కృష్ణస్య జన్మేదం యః శుచి ర్నియతేంద్రియః పర్వసు శ్రావయే ద్విద్వా ననృణః స సుఖీ భవేత్
త్రిగర్త రాజు కూతురు శిశిరాయణి యొక్క భార్య గార్గ్యముని వర్యుని పౌరుష పరీక్షకు పూను కొనెను. కాని యతని వీర్యము స్ఖలనము కాలేదు. పన్నెండవ సంవత్సరమున పరిహసితు డైన యా ముని ఒక ఘోష కన్యతో మిథున క్రీడకు పక్రమించెను. అఘోషాంగన ఘోష వేష ధారిణి యైన గోపాలి యను నొక అప్సరస. గోపకన్యా వేషము ధరించి యాతని ధరింప నలవి కాని గర్భమును (శిశువు) ధరించెను. మనుష్య స్త్రీ యైన యాగార్గ్యుని భార్య యందు శివునాజ్ఞచే కాలయవను డను వాడు సింహము వంటి మహా బలశాలి పుట్టెను. వాని పూర్వ కాయము వర్తులాకారము సింహము వంటి యాకారము గల్గి యుండెను. అపుత్రకు డైన యవన రాజు యొక్క అంతః పురమున వాడు పెరిగెను. అందు వలన యవనునికి వాడు కుమారడయి కాలయవనుడన నొప్పెను. వాడు యుద్ధ కుతూహలము గొని యేరితో తలపడుదు నని యడుగగా దేవర్షి నారదుడు వృష్ణి, అంధక కులములను జెప్పెను. అక్షౌహిణి సేనతో వాడు మధుర పైనేగి దూతను బంపెను. అపుడు వృష్ణ్యంధకులు మహామతి యైన కృష్ణునిం బురస్కరించు కొని పోయి కార్యాలోచన చేసి యొక నిశ్చయమునకు వచ్చి పారిపోవుట కంగీకరించిరి. పినాక పాణియైన శివుని అభిప్రాయమును గౌరవించి మధురను వదిలి కుశస్థలిని ద్వారకను జేరి నివాసము సేయ నెంచిరి. ఇది శ్రీ కృష్ణ జన్మ వృంత్తాంతము. శుచియై ఇంద్రియములను నియమించుకొని పర్వము లందు వినిపింప వలెను. అట్లు వినిపించిన విద్వాంసుడు ఋణములను బాసి సుఖి యగును.
Summary of chapter 14 of the Brahma Mahā Purana is as follows:
The celebrated legend of the Syamantaka jewel is narrated. The Sun-god gives the gem to his devoted friend Satrājit, from whom it passes to Prasenajit who is killed by a lion. Jāmbavān kills the lion and takes the gem into a cave. Śrī Kṛṣṇa, suspected by the Vṛṣṇis of causing Prasenajit's death, enters the forest and then the cave to recover the jewel and clear his name.