బ్రహ్మ మహా పురాణము

232 - వ్యాస ముని సంవాదే ప్రాకృత ప్రతిసంచర కథనమ్‌

సృష్ట్యుప సంహార లక్షణము

వ్యాసులు:

సర్వేషామేవ భూతానాం త్రివిధః ప్రతి సంచరః

నైమిత్తికః ప్రాకృతిక స్తథైవాత్యంతికో మతః

బ్రాహ్యా నైమిత్తిక స్తేషాం కల్పాంతే ప్రతిసంచరః

ఆత్యంతికో వై మోక్షాశ్చ ప్రాకృతో ద్విపరార్ధికః

వ్యాసులు:

సర్వ భూతము లకును జరుగు ప్రతి సంచరము. అనగా ప్రళయము మూడు విధములు. 1. నైమిత్తికము, 2. ప్రాకృతికము 3. అత్యంతికము. వానిలో 1. బ్రహ్మ దేవుని ఆయుః కాలము సమాప్తికాగా కల్పాంతమున జరుగు ప్రళయము నైమిత్తికము. 2. జీవునకు మోక్షము లభించుటయే అత్యంతిక ప్రళయము. 3. రెండు పరార్ధముల కొకసారి జరుగునది ప్రాకృత ప్రళయము అని వ్యాసుడు పలికెను.

మునులు:

పరార్దసంఖ్యాం భగవం స్త్వమాచక్ష్వ యథోదితామ్‌

ద్విగుణీకృతయజ్ఞేయః ప్రాకృతః ప్రతిసంచరః

మునులు:

మాకు పరార్ధ కాల పరిమాణము తెలిసినచో దానికి రెట్టింపు కాలమగు ద్విపరార్ధముల తరువాత జరుగు ప్రాకృత ప్రళయము మాకవగత మగును. కనుక దానిని తెలుపుమని మునులు వ్యాసుల నడిగిరి.

వ్యాసులు:

స్థానాత్థ్సానం దశగుణ మేకైకం గణ్యతే ద్విజాః

తతోష్టాదశమే భాగే పరార్ధమభిధీయతే

పరార్ధం ద్విగుణం యత్తు ప్రాకృతః స లయో ద్విజాః

తదావ్యక్తేభిలం వ్యక్తం సహేతౌ లయమేతి వై

వ్యాసులు:

సంఖ్యల లెక్కింపులో కుడి వైపు నుండి ఎడమ వైపునకు పోగా స్థానపు విలువ పదిరెట్లు పెరుగు చుండును. అట్లు పోగా పదు నెనిమిదవ స్థానముతో పరార్ధ మగును. ఒకట్లు, పదులు, నూర్లు, వేలు, లక్ష, పది లక్షలు, కోటి పదికోట్లు, ఇటు పోగా పదు నెనిమిదవ స్థానములో ఏర్పడు సంఖ్య పరార్థము. అనగా 100,000,000,000,000,000 ఇది పరార్ధ సంఖ్య. ఇన్ని సంవత్సరాల కాలమునకు రెట్టింపు చేసినచో ద్వి పరార్థము. ఇట్టి ద్విపరార్ధ కాలమున కొకసారి జరుగు ప్రళయము ప్రాకృత ప్రళయము. అప్పుడు ఈ వ్యక్త స్పష్ట రూపము కల ప్రపంచ మజతయు తన మూల కారణముతో కూడ అవ్యక్త మగు ప్రకృతి మూల తత్త్వము నందు లయము నొందును.

నిమేషో మానుషోయోయం మాత్రామాత్రప్రమాణతః

తైః పంచదశభిః కాష్ఠా త్రింశత్కాష్ఠాస్తథా కలా

నాడికా తు ప్రమాణేన కళా శ్చ దశపంచచ

ఉన్మానేనాంభసః సా తు పలాన్యర్ధత్రయోదశ

హేమమాషైః కృతచ్ఛిద్రా చతుర్భిశ్చతురంగుళైః

మాగధేన ప్రమాణేన జలప్రస్థస్తు స స్మృతః

నాడికాభ్యామథ ధ్వాభ్యాం ముహూర్తో ద్విజసత్తమాః

అహోరాత్రం ముహూర్తాస్తు త్రింశన్మాసో దినైస్తథా

మాసైర్ద్వాదశభిర్వర్ష మహోరాత్రం తు తద్దివి

త్రిభిర్వర్షశతైర్వర్షం షష్ట్యా చైవాసురద్విషామ్‌

తైస్తుద్వాదశసాహన్నై శ్చతుర్యుగముదాహృతమ్‌

చతుర్యుగసహస్రం తు కథ్యతే బ్రహ్మణో దినమ్‌

స కల్పస్తత్ర మనవ శ్చతుర్దశ ద్విజో త్తమాః

తదంతే చైవ భో విప్రా బ్రహ్మనై మిత్తిలో లయః

తస్య స్వరూపమత్యుగ్రం ద్విజేంద్రా గదతో మమ

శృణుధ్వం ప్రాకృతం భూయ స్తతో వక్ష్యామ్యహం లయమ్‌

నైమిత్తిక ప్రళయము వివరింతును. కాల పరిమాణములో మానవుని ఱెప్పపాటు అన్నిటికి మూల పరిమాణము. అట్టి నిమేషములు పదునైదు (పదు నెనిమిది) కాష్ఠ అన బడును. ముప్పది కాష్ఠలు కల పదునైదు కలలు నాడిక. రెండు నాడికలు ముహూర్తము. ముప్పది ముహూర్తములు ఒక రాత్రింబగలు. ముప్పది అహో రాత్రములు మాసము. పండ్రెండు మాసములు సంవత్సరము. ఇట్టి మూడు వందల అఱువది సంవత్సరములు దేవతల సంవత్సరము. పండ్రెండు వేల దేవ సంవత్సరములు ఒక చతుర్యుగము. అనగా కృత త్రేతా ద్వాపర కలి యుగములు నాలుగు అగును. వేయి చతుర్యుగములు బ్రహ్మ దినము. అదియే కల్పము. కల్ప కాలములో పదు నాలుగు మంది మనువులు సృష్టిని లోక వ్యవహారమును నిర్వహింతురు అట్టి కల్పాంతము, బ్రహ్మతో కూడ నైమిత్తిక లయుము జరుగును. దాని స్వరూపము మిగుల భయంకరయు. అది మొదట మీకు తెలిపి పిమ్మట ప్రాకృత ప్రళయ స్వరూపము వివరింతును వినుడు.

చతుర్యుగ సహస్రాంతే క్షీణప్రాయే మహీతలే

అనావృష్టి రతీ వోగ్రా జాయతే శతవార్షికీ

తతో యాన్యల్పసారాణి తాని సత్త్వాన్యనేకశః

క్షయం యాంతి మునిశ్రేష్టాః పార్థివాస్యతి పీడనాత్‌

తతః స భగవా న్కృష్ణో రుద్రరూపీ తథావ్యయః

క్షయాయ యతతే కర్తు మాత్మస్థాః సకలాః ప్రజాః

తతః స భగవాన్విష్ణు ర్భానోః సప్తమ రశ్మిషు

స్థితః పిబత్యశేషాణి జలాని మునిసత్తమాః

పీత్వాంభాంసి సమస్తాని ప్రాణిభూత గతాని వై

శోషం నయతి భో విప్రాః సమప్తం పృథివీతలమ్‌

సముద్రాన్సరితః శైలాన్‌ శైలప్రస్రవణాని చ

పాతాశేషు చ యత్తోయం తత్సర్వం నయతి క్షయమ్‌

తతస్తస్యాప్యభావేన తోయాహారోపబృంహితః

సహస్రరశ్మయః సప్త జాయంతే తత్ర భాస్కరాః

అధశ్చోర్ధ్వం చ తే దీప్తా స్తతః సప్త దివాకరాః

దహంత్య శేషం త్రైలోక్యం సపాతాశతలం ద్విజాః

దహ్యమానం తు తైర్దీప్తై స్తైలోక్యం దీప్త భాస్కరైః

సాద్రినగార్ణవాభోగం విఃస్నేహమభిజాయతే

తతో నిర్దగ్ధవృక్షాంబు త్రైలోక్యమఖిలం ద్విజాః

భవత్యేషా చ వసుధా కూర్మపృష్ఠోపమాకృతిః

తతః కాలాగ్నిరుద్రోసౌ భూతసర్గమరో హరః

శేషాహిశ్వావసంతాపా త్పాతాళాని దహత్యధః

పాతాళాని సమస్తాని స దగ్ధ్వా జ్వలతో మహాన్‌

భూమిమభ్యేత్య సకలం దగ్ధ్వా తు వసుధాతలమ్‌

భువో లోకం తతః సర్వం స్వర్గలోకం చ దారుణః

జ్వాలామాలామహావర్త స్తత్రైవ పరివర్తతే

వేయి చతుర్యుగముల తరువాత మహీతలము చాల వరకు క్షీణించి పోగా నూరేండ్లు ఎడతెగని అనావృష్టి ఏర్పడును. బలమంతగా లేని ప్రాణు లనేకములు భూమిపై మిగుల పీడల పాలై నశించును. అంతట విష్ణు భగవానుడు రుద్రుని రూపమున సమస్త ప్రజలను తనలో లయము చేసి కొనుటకు యత్నించును. అతడు సూర్యుని ఏడు కిరణముల యందును నిలిచి సమస్త జలమును త్రాగును. ప్రాణు లన్నియు అందుచే శోషించును. సముద్రముల నదుల కొండల సెలయేళ్ళ పాతాళముల లోనున్న నీరంతయు ఇంకి పోవును. దానిచే నీరు మాత్రమే ఆహారముగా గల జీవ రాశులును నశించి పోవును. అంతట ఏడు మంది సూర్యుల ఆవిర్భవించి వారు అన్ని దిక్కులకును ప్రజ్వలించుచు పాతాళ తలము వరకు గల లోకము నంతటిని కాల్చి వేయుదురు. వారి మూలమున ఈ భూమి పర్వతముల సముద్రము లతో కూడ దగ్ధమయి తాబేలు వీపు వలె అయి పోవును. అంతట ప్రళయ కాలాగ్ని రుద్రుని ఆది శేషుని నిశ్శ్వాస వాయువుల తాపముచే సప్త పాతాళము లను కాల్చి వేయును. ఆ అగ్నియే పాతాళము నుండి భూలోకము నకు అచటి నుండి స్వర్గమునకు కూడ పోయి వరుసగా మూడు లోకములను పూర్తిగా కాల్చి వేయును.

అంబరీషమివాభాతి త్రైలోక్యమఖిలం తదా

జ్వాలా వర్త పరీవార ముపక్షీణ బలా స్తతః

తతస్తాప పరీతాస్తు లోకద్వయనివాసినః

హృతావకాశా గచ్ఛంతి మహర్లోకం ద్విజా స్తదా

తస్మాదపి మహాతాప తప్తా లోకా స్తతః పరమ్‌

గచ్ఛంతి జనలోకం తే దశావృత్త్యా పరైషిణః

తతో దగ్ధ్వా జగత్పర్వం రుద్రరూసీ జనార్దనః

ముఖ నిఃశ్వాసజాన్మేషూ న్కరోతి ముని సత్తమాః

తతో గజకుల ప్రఖ్యా స్తదిద్వంతో నివాదినః

ఉత్తిష్ఠంతి తదా వ్యోమ్ని ఘోరాః సంవర్తకా ఘనాః

కేచిదంజస సంకాశాః కేచిత్కుముద సంనిభాః

ధూమవర్జా ఘనాః కేచి త్కేచిత్పీతాః పయోధరాః

కేచిద్ధరిద్రావర్ణాభా లాక్షారస నిభా స్తథా

కేచిద్వైదూర్య సంకాశా ఇంద్ర నీలని భాస్తథా

శంఖకుందనిభాశ్చాన్యే జాతీకుందనిభా స్తథా

ఇంద్రగోపనిభాః కేచి న్మనః శిలనిభా స్తథా

పద్మపత్రనిభాః కేచి దుత్తిష్ఠంతి ఘనా ఘనాః

కేచిత్పురవరాకారాః కేచిత్పర్వత సంనిభాః

కూటాగార నిభాశ్చాన్యే కేచిత్థ్సలనిభా ఘనాః

మహాకాయా మహారావా పూరయంతిః సభఃస్థలమ్‌

వర్షంతస్తే మహాసారా స్తమగ్నిమతి భైరవమ్‌

శమయంత్యఖిలం విప్రా స్త్రైలోక్యాంతర విస్తృతమ్‌

నష్టే చాగ్నౌ శతం తేపి వర్షాణామధికం ఘనాః

ప్లావమంతో జగత్సర్వం వర్షంతి మునిసత్తమాః

ధారాభి రక్షమాత్రాభిః ప్లాపయిత్వాఖిలాం భువమ్‌

భువో లోకం తథైవోర్ధ్వం ప్లావయంతి దిషం ద్విజాః

అంధకారీకృతే లోకే నష్టే స్థాపరజంగమే

వర్షంతి తే మహామేఘా వర్షాణా మధికం శతమ్‌

అపుడు ఈ మూడు లోకములు జ్వాలల సుడులతో చుట్టి వేయబడి కాలుచున్న వేపుడు మంగలము వలె నుండును. ముల్లోకముల లోని బ్రాహ్మణులును తాపముతో నిండి బలము ఉపక్షీణమై ఎచ్చటను నిలుచుటకు అవకాశము లేక మహర్లోకమునకు పోవుదురు. అచ్చటను మహా తాపముతో తపించి అంతకు పైనున్న జన లోకమునకు పోవుదురు. అంతట రుద్ర రూపుడగు విష్ణువు తన నిట్టూర్పు అవిరులచే మేఘముల సృష్టించును. సంవర్తకము లను పేరుతో ఆ మబ్బులు పెద్ద ఉరుములతో మెఱపులతో ఆకాశ మంతట క్రమ్మును. ఏనుగుల వలె కాటుక వలె నల్ల కలువ పూలవలె న్లలనివి కొన్ని పొగ రంగుతో కొన్ని పచ్చనివి కొన్ని పసుపు వలె లక్క వలె వైడూర్య రత్నముల వలె ఇంద్ర నీలముల వలె శంఖముల వలె మల్లె పూలవలె జాజి పూలవలె అర్ద్ర పురుగుల వలె మనః శిలవలె తామర పూరేకుల వలె వెలిగెడి ఆ మేఘములు అంతటను వ్యాపించును. నగరముల వంటి పర్వతముల వంటి గిడ్డంగుల వంటి మిట్ట నేలల వంటి అకారములతో పెద్ద శరీరము లతో పెద్ద ధ్వనులతో అవి ఆకాశమున నిండును. పెద్ద వానలు కురియించి అభయంక రాగ్ని జ్వాలలను అర్పి వేయును. ఆ అగ్ని చల్లారిన తరువాత కూడ ఆ మేఘములు ఎడతెగక వర్షించుచు లోకము నంతటిని నీటితో ముంచును. అవి బండి ఇరుసంత లావైన జలధారల నీటితో భూమిని నింపిన తరువాత ఊర్ధ్వరుకములను లోడ నింపును. ఇట్లు స్థిర్నర జీవులు జడ చేతనే పదార్థములు అన్నియు నశించి లోక మంతయు అంధకారావృత మైయుండగా ఆ మేఘము లట్లు నూరు సంవత్సరములకు పై కాలము ఎడ తెగక వర్షించు చునే యుండును.