బ్రహ్మ మహా పురాణము

30 - ఆదిత్య మహాత్మ్యమ్‌

మునులు:

అహో దేవస్య మాహాత్మ్యం శ్రుతమేవం జగత్పతే

భాస్కరస్య సుర శ్రేష్ఠ వదత స్తే సుదుర్లభమ్‌

భూయః ప్రబ్రూహి దేవస్య యత్పృచ్ఛామో జగత్పతే

శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్‌ పరంకౌతూలంహినః

గృహస్థో బ్రహ్మచారీచ వాన ప్రస్థోధ భిక్షుకః

య ఇచ్చే న్మోక్ష మాస్థాతుం దేవతాం కాం యజేత సః

కుతో హ్యసాక్షయః స్వర్గః కుతో నిశ్శ్రేయసం పరమ్‌

స్వర్గతశ్చైవ కిం కుర్యా ద్యేన నచ్యవతే పునః

దేవానాం చాత్ర కో దేవః పితౄణాంచైవ కఃపితా

యస్మాత్పరతరం నాస్తి తన్మే బ్రూహి సురేశ్వర!

కుతః సృష్టమిదం విశ్వం పర్వం స్థావర జంగమమ్‌

ప్రళయేచ క మఖ్యేతి తద్భవాన్‌ వక్తు మర్హసి

మునులు:

సూర్య భగవానుని మహిమ నీవు చెప్పగా విన్నాము. ఇంకను విన కుతూహల మగుచున్నది. బ్రహ్మచర్యా శ్రమస్థులు ముక్తి నందుటకే దేవత నుపాసింప వలయును. స్వర్గము నుండి దిగజార కుండుట కేమిచేయ వలయును? దేవతలకు బితృ దేవతలకు పరమ దేవత ఎవరు? ఈ సృష్టి ఎవని వలన నగును? ఎవ్వని యందు లీన మగును. తెలుప వలయును.

బ్రహ్మ:

ఉద్యన్నేవైష కురుతే జగ ద్వితిమిరం కరైః

నాతః పరతరో దేవః కశ్చిదన్యో ద్విజోత్తమాః

ఆనాదినిధనో హ్యేష పురుషః శాశ్వతోవ్యయః

తాపయత్యేష త్రీన్‌ లోకాన్‌ భవ న్రశ్మిఖి రుల్బణః

సర్వదేవమయో హ్యేష తపతాం తపనో వరః

సర్వస్య జగతో నాథః సర్వ సాక్షీ జగత్పతిః

సంక్షిపత్యేష భూతాని తథా విసృజతే పునః

ఏష భాతి తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష ధాతా విధాతా చ భూతాది ర్భూతభావనః

నహ్యేష క్షయ మాయాతి నిత్య మక్షయమండలః

పితౄణాం చ పితా హ్యేష దేవతానాం హి దేవతా

ధ్రువ స్థానం స్మృతం హ్యేత ద్యస్మాన్న చ్యవతేపునః

సర్గకాలే జగత్‌ కృత్య్న మాదిత్యాత్‌ సంప్రసూయతే

ప్రళయే చ త మభ్యేతి భాస్కరం దీ ప్తతేజసమ్‌

యోగినశ్చాప్య సంఖ్యాతా స్త్యక్త్వా గృహకలేబరమ్‌

వాయుర్భూత్వా విశంత్యస్మిం స్తేజోరాశౌ దివాకరే

అస్య రశ్మిసహస్రాణి శాఖా ఇవ విహంగమాః

వసం త్యాశ్రిత్య మునయః సంసిద్ధా దేవతైః సహ

గృహస్థా జనకాద్యాశ్చ రాజనోయోగ ధర్మిణః

వాలఖిల్యాదయశ్చైవ ఋషయో బ్రహ్మవాదినః

వానప్రస్థాశ్చ యే చాన్యే వ్యాసాద్యా భిక్షవ స్తదా

యోగ మాస్థాయ సర్వేతే ప్రవిష్టాః సూర్యమండలమ్‌

శుకో వ్యాససుతః శ్రీమాన్యోగధర్మ మావాప్య సః

ఆదిత్యకిరాణాన్‌ గత్వా హ్యపునర్భావ మాస్థితః

బ్రహ్మ:

ఓ ద్విజో త్తములారా! ఈ యాదిత్యు డుదయించుచునే తన కరంబులచే జీకటిని హరింప జేయును. ఇంత కంటే మరి దైవ మెవ్వరు? ఈ పురుషుడు మొదలు తుద లేనివాడు శాశ్వతుడు. అవ్యయుడు. ముల్లోకముల దన కిరణముల వెలిగించు చుండును. సర్వ దేవ మయుడు సర్వ జగన్నాధుడు సర్వసాక్షి జగత్పతి సర్వ భూతముల సృజించును. పెంచును. సంక్షేపించును. ఈయనయే వేడిమి నిచ్చును. వర్షించును, ధాత, విధాత, భూతాది భూత భావనుడు ఈయనకు క్షయము లేదు. అన్ని వేళల నక్షయ మండలుడు పితరులకు పిత. దేవతలకు దేవత. ఈయనది ధ్రువ స్థానము. ఇందుండి మరలడు. ఆదిత్యుని నుండి జగత్తు పుట్టును. అందు లయించును. యోగులు కళేబరము వీడి వాయు రూపమంది తేజోరాశి యైన దివాకరుని యందు ప్రవేశింతురు. ఈయన వేలకొలది కిరణముల నాశ్రయించి పక్షలు తరుశాఖల నాశ్రయించి యున్నట్లు, సిద్ధులు, దేవతలు నీయన యందు వసింతురు. యోగులు గృహస్థులైన జనకాది రాజర్షులు వాల ఖల్యాదులు, బ్రహ్మ వాదులైన మహర్షులు వ్యాసాదులు వాన ప్రస్థులు భిక్షువులు యోగముం బూని సూర్య మండలమున బ్రవేశింతురు. వ్యాస కుమారుడు శ్రీ శుకుడు యోగ ధర్మమూని యాదిత్య కిరణముల జొచ్చి పునరావృత్తి లేని పదమంది యున్నాడు.

శబ్దమాత్ర శ్రుతిముఖా బ్రహ్మనిష్ణుశివాదయః

ప్రత్యక్షోయం పరోదేవః సూర్యస్తిమిరనాశనః

తస్మాదన్యత్ర భక్తిర్హి న కార్యా శుభ మిచ్ఛతా

యస్మాద్‌ దృష్టే రగమ్యాస్తే దేవా విష్ణు పురోగమాః

అతో భవద్భిః సతత మభ్యర్య్చో భగవాన్‌ రవిః

సహి మాతా పితాచైవ కృత్స్నస్య జగతో గురుః

అనాద్యో లోకనాథోసౌ రశ్మిమాలీ జగత్పతిః

మిత్రత్వే చ స్థితో యస్మాత్తపస్తేపే ద్విజోత్తమాః

అనాదివిధనో బ్రహ్మా నిత్య శ్చాక్షయ ఏవచ

సృష్ట్వా ససాగరాన్‌ ద్వీపాన్‌ భువనాని చతుర్దశ

లోకానాం స హితార్థాయ స్థితశ్చంద్ర సరిత్తటే

సృష్ట్వా ప్రజాపతీన్‌ సర్వా సృష్ట్వా చ వివిధాః ప్రజాః

తతః శతసహస్రాంశు రవ్యక్తశ్చ పునః స్వయం

కృత్వా ద్వాదశధాత్మాన మాదిత్యముపద్యతే

ఇంద్రో ధాత చ పర్జన్య స్త్వష్టా పూషర్యమా భగః

వివస్వాన్‌ విష్ణు రంశశ్చ వరుణో మిత్ర ఏవచ

ఆభిర్ద్వాదశభి స్తేన నూర్యేణ పరమాత్మనా

కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తిభిశ్చ ద్విజోత్తమాః

బ్రహ్మ విష్ణు శివాది దేవతలు శబ్దమాత్ర శ్రుతి గమ్యులు. ఈయనయే ప్రత్యక్ష పరదేవత. తమో హరుడు. విష్ణుముఖ దేవతా వర్గము కంటికి గానరారు. ఈయన ప్రత్యక్ష నారాయణుడు. ఈయనయే తల్లి తండ్రి గురువు అనాది రశ్మిమాలి జగత్పతి మిత్రుడు నిత్యుడు ఆక్షయుడు. ఈయన సాగర ద్వీపములను పదునాల్గు భువనములను సృజించి చంద్ర నదీ తీరమున నున్నడు. సహస్రాంశువై యవ్వక్తు డయ్యు ద్వాదశ మూర్తలచే వ్యక్తుడే ప్రత్యక్ష నారాయణుడై యాదిత్య స్థానమున వెలుంగు చున్నాడు.

తస్య యా ప్రథమా మూర్తి రాదిత్య స్యేంద్ర సంజ్ఞితా

స్థితా సా దేవరాజత్వే దేవానం రిపునాశినీ

ధ్వితీయా తస్య యామూర్తి ర్నామ్నా ధాతేతి కీర్తితా

స్థితా ప్రజాపతిత్వేన వివిధాః సృజతే ప్రజాః

తృతీ యార్కస్య యా మూర్తిః పర్జన్య ఇతి విళ్రుతా

మేఘేష్వేవ స్థితా సాతు వర్షతే చ గభ స్తిభిః

చతుర్ధీ తస్య యా మూర్తి ర్నామ్నా త్వష్టేతి విశ్రుతా

స్థితా వనస్సతౌ సాతు ఓషధీషు చ సర్వతః

పంచమీ తస్య యా మూర్తి ర్నామ్నా పూషేతి విశ్రుతా

అన్నే వ్యవస్థితా సాతు ప్రజాః వుష్ణాతి నిత్యశః

మూర్తి ష్షష్ఠీ రవే ర్యాతు అర్యమా ఇతి విశ్రుతా

వాయో స్సంసరణా సాతు దేవేష్వేవ సమాశ్రితా

భానోర్యా స ప్తమీ మూర్తి ర్నామ్నా భగేతి విశ్రుతా

భూతి ష్వవస్ధితా సాతు శరీరేషు చ దేహినామ్‌

మూర్తిర్యా త్వష్టమీ తస్య వివస్వానితి విశ్రుతా

ఆగ్నౌ ప్రతిష్టితా సాతు పచత్యన్నం శరీరిణామ్‌

నవమీ చిత్రభానో ర్యా మూ ర్తి ర్విష్ణుశ్చ నామతః

ప్రాదుర్భవతి సా నిత్యం దేవానా మరిసూదనీ

దశమీ తస్య యా మూర్తి రంశుమానితి విశ్రుతా

వాయౌ ప్రతిష్టితా సాతు ప్రహ్లాదయతి వై ప్రజాః

మూర్తి స్త్వేకాదశీ భానో ర్నామ్నా వరుణ సంజ్ఞితా

జలే ష్వవస్థితా సాతు ప్రజాం పుష్ణాతి నిత్యశః

మూర్తిర్యా ద్వాదశీ భానో ర్నామ్నా మిత్రేతి సంజ్ఞితా

లోకానాం సా హితార్థాయ స్థితా చంద్ర సరిత్తటే

వాయుభక్ష స్తపస్తేపే స్థిత్వా మైత్రేణ చక్షుషా

అనుగృహ్ణ న్సదా భక్తాన్‌ వరైర్నానావిధై స్తునః

ఏవం సా జగతాం మూర్తి ర్హితాయ విహితా పురా

తత్ర మిత్రః స్థితో యస్మా త్తస్మా న్మిత్రం పరం స్మృతమ్‌

ఆభి ర్ద్వాదశభి స్తేన సవిత్రా పరమాత్మనా

కృత్స్నం జగదిదం వ్యాప్తం మూర్తిభిశ్చ ద్విజోత్తమా

తస్మా ద్ధ్యేయో నమస్యశ్చ ద్వాదశస్థాను మూర్తిషు

భుక్తిమద్భి ర్నరైర్నిత్యం తద్గతే నాంతరాత్మనా

ఇత్యేవం ద్వాదశాదిత్యా స్నమస్కృత్వా తు మానవః

నిత్యం శ్రుత్వా పఠిత్వాచ సూర్యలోకే మహీయతే

ఇంద్రుడు. ధాత, పర్లన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, ఆంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు అను నీ పండ్రెండు మూర్తులచే నీ పరమాత్మ సర్వ జగమ్ములు వ్యాపించి యున్నాడు. దేవశత్రు నాశిని యైన మూర్తి ఇంద్ర రూపమున దేవ రాజ్యనుందున్నది మొదటిది. రెండవది ప్రజాపతి రూపమున సృష్టి గావించునది. మూడవది మేఘము లందు వర్షించునది. నాల్గవది వనస్పతు లందు నోషథు లందున్నది. ఐదవ మూర్తి పూష అన్న గతమై ప్రజల పోషించును. అఱవ మూర్తి ఆర్యమా రూపమై దేవత లందున్నది. సప్తమ మూర్తి భగనామమున దేహుల దేహము లందు, సంపద లందు నున్నది. ఎనిమిదవది వివస్వాన్‌ అగ్నిగా నుండి జీవుల యాహారమున పచనము చేయు చున్నది. తొమ్మిదవది “విష్ణువు” అను మూర్తి. దేవశత్రు సంహారమునకు ప్రపర్తించును. పదవ మూర్తి వాయువు నందుండి జీవులకు సుఖ స్పర్శ నొసంగి యానంద పెట్టును. పదు నొకండవ మూర్తి వరుణ నామకము, జలము లందుండి ప్రజాపుష్టి కూర్చును. పదిరెండవ మూర్తి మిత్ర సంజ్ఞకము. లోక హితమునకై చంద్ర నదీ తీర మందున్నది. ప్రభాకరుడీ మూర్తితో వాయుభక్షణ సేయుచు మైత్రీ ప్రయుక్తమైన చూపుతో వరము లిచ్చి భక్తా నుగ్రహము చేయుచు చంద్ర నదీతట మందు తపము చేయు చుండును. కావున నతడు మిత్రుడను బిరుదు నామ మందెనని స్మృతులు తెలపు చున్నవి. ఇట్లు ద్వాదశ మూర్తియగు పరమాత్మ స్థావర జంగమముల కెల్ల ఆత్మ రూపుడైన సూర్య భగవానుడై ధ్యానమునకు లక్ష్యమై నమస్యుడు. ఈ ద్వాద శాదిత్యులను గూర్చి నిత్యము నమస్కరించుచు పఠించుచు వినువారు సూర్యలోక ముందు వెలు గొందుదురు.

మునులు:

 యది తావ దయం సూర్యశ్యాదిదేవః సనాతనః

తతః కస్మాత్తపస్తేపే వరేప్సుః ప్రాకృతో యథా

మునులు:

సూర్యుడు సనాతనుడగు నాది దేవుడైనచో ప్రాకృత జనుని వలె వరములగోలి తప మెందులకు చేసెను.

బ్రహ్మ:

ఏత ద్వః సంప్రవక్ష్యామి పరం గుహ్యం విభావసోః

పృష్టం మిత్రేణ యత్‌ పూర్వం నారదాయ మహాత్మనే

ప్రాజ్మయోక్తాస్తు యుష్మభ్యం రవేర్ద్వాదశ మూర్తయః

మిత్రశ్చ వరుణశ్చోభౌ తాసాం తపసి సంస్థితౌ

అధ్యక్షో వరుణ స్తాసాం తస్థౌ పశ్చిమ సాగరే

మిత్రో మిత్ర వనే చాస్మిన్‌ వాయుభక్షోభవ త్తదా

అథ మేరుగిరేః శృంగాత్‌ ప్రచ్యుతో గంధమాదనాత్‌

నారదస్తు మహా యోగీ సర్వావ్లోకాంశ్చరన్‌ వశీ

అజగామాఢ తత్రైవ యత్ర మిత్రోచరత్తపః

తం దృష్ట్వాతు తపస్యంతం తస్య కౌతూహలం హ్యభూత్‌

యోక్షయ శ్చావ్యయశ్చైవ వ్యక్తా వ్యక్తః సనాతనః

ధృతమేకాత్మకం యేన త్రైలోక్యం సుమాహాత్మనా

యః పితా సర్వదేవానాం పరాణామపి యః పరః

అయజద్దేవతాః కాస్తు పితౄన్‌ వా కానసౌ యజేత్‌

ఇతి సంచిత్య మనసా తం దేవం నారదోబ్రవీత్‌

బ్రహ్మ:

 ఇది మిక్కిలి రహస్య విషయము. నారదుడు సూర్యు నడగిన విషయమిది. ఇంతకు మున్ను సూర్య భగవానునుని పండ్రెండు మూర్తల గురించి చెప్పితిని. అందు మిత్రుడు. వరుణుడు అనువారు తపస్సు నందుండిరి. అందు జలాహారియై వరుణడు పశ్చిమ సముద్రము నందును, మిత్రుడు వాయు భక్షకుడై యీ వనమందు నున్నారు. ఈ మిత్రుడు మేరు శిఖరము నుండి గంధ మాదనము నుండి జారెను. మహాయోగి యైన నారదుడు మిత్రుని దగ్గరకు వచ్చెను. తపస్సు చేయు చున్న యాయనను జూచి చాల వేడుక పడెను. ఆవ్యయము వ్యక్తావ్యక్తము త్రిలోక ధారకము సర్వ దేవతా పరాయణము సర్వ జనకము నైన మిత్ర మూర్తి మఱి యే దేవతలను పితృ దేవతల నుద్దేశించి మనస్సుచేత ధ్యానించుచు యజించు చున్నాడు.” అని ఆలోచించి యాయనతో నిట్లనియె.

నారదుడు:

వేదేషు సపురాణేషు సాంగోపాంగేషు గీయసే

త్వమజః శాశ్వతో ధాతా త్వం నిధాన మనుత్తమమ్‌

భూతం భవ్యం భవచ్చైవ త్వయి సర్వమ్‌ ప్రతిష్ఠితమ్‌

చత్వార శ్చాశ్రమా దేవ గృహస్థాద్యాస్తధై వహి

యజంతి త్వామహరహస్త్వాం మూర్తిత్వం సమాశ్రితమ్‌

పితా మాతాచ సర్వస్య దైవతం త్వంహి శాశ్వతమ్‌

యజసే పితరం కంత్వందేవం వాపి న విద్మహే

నారదుడు:

సాంగో పాంగములైన వేదము లందు నీవు గానము సేయ బడుదువు. భూత భవద్భవ్య మయిన యీ దృశ్యమెల్ల కేవల ద్రష్టవైన నీ యందు నిలుపు నందును. గృహస్థాద్యా శ్రమస్థులు నల్గురు నిన్నే పూజింతురు. నీవు సర్వ జగజ్జన కుడవు జననివి యున, దైవమును, నీవు నీకు పితయైన మఱియే దేవతను యజింతువో మేమెఱుంగము.

మిత్రుడు:

అవాచ్యమేత ద్వ క్తవ్యం పరం గుహ్యం సనాతనమ్‌

త్వయి భక్తిమతి బ్రహ్మన్‌ ప్రవక్ష్యామి యథాతథమ్‌

యత్తత్‌ సూక్ష్మ మవిజ్ఞేయ మవ్యక్త మచలం ధ్రువమ్‌

ఇంద్రియై రింద్రియార్థైశ్చ సర్వభూతై ర్వివర్జితమ్‌

స హ్యంతరాత్మా భూతానాం క్షేత్రజ్ఞశ్చైవ కథ్యతే

త్రిగుణా ద్వ్యతిరిక్తోసౌ పురుషశ్చైవ కల్పితః

హిరణ్యగర్భో భగవాన్‌ సైవ బుద్ధిరితి స్మృతః

మహానీతి చ యోగేషు ప్రథాన మితి కథ్యతే

సాంఖ్యేచ కథ్యతే యోగే నామభి ర్భహుధాత్మకః

స చ త్రిరూపో విశ్వాత్మా శర్వోక్షర ఇతి స్మృతః

ధృతమేకాత్మకం తేన త్రైలోక్య మిద మాత్మనా

ఆశరీరః శరీరేషు సర్వేషు వినస త్యసౌ

వసన్నపి శరీరేషు నస లిప్యేత కర్మభిః

మమాంతరాత్మా తవచ యే చాన్యే దేహసంస్థితాః

సర్వేషాం సాక్షిభూతో సౌ నగ్రాహ్యం కేనచిత్‌ క్వచిత్‌

సగుణో నిర్గుణ విశ్వో జ్ఞానగమ్యో హ్యసౌ స్మృతః

సర్వతః పాణిపాదాంతః సర్వతోక్షిశిరోముఖః

సర్వతః శ్రుతిమాన్‌ లోకే సర్వమావృత్య తిష్ఠతి

విశ్వమూర్థా విశ్వభుజో విశ్వపాదాక్షినాశికః

ఏకశ్చరతి వైక్షేత్రే స్వైరచారీ యథాసుఖమ్‌

క్షేత్రాణీహ శరీరాణీ తేషాంచైవ యథాసుఖమ్‌

తానివేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే

అవ్యక్తేచ పురే శేతే పురుష స్తేన చోచ్చతే

విశ్వం బహువిధం జ్ఞేయం సచ సర్వత్ర ఉచ్యతే

తస్మాత్‌ స బహురూపత్వా ద్విశ్వరూప ఇతి స్మృతః

తస్యైకస్య మహత్వం హి స చైకః పురుషః స్మృతః

మహాపురుషశబ్దం స బిభ ర్త్యేకః సనాతనః

సతు విధిక్రియాయత్తః సృజత్యాత్మాన మాత్మనా

శతాధా సహస్రధా చైవ తథా శత సహస్రధా

కోటిశశ్చ కరోత్యేష ప్రత్యగాత్మనమాత్మనా

ఆకాశాత్‌ పతితం తోయం యాతి స్వాద్వంతరం యథా

భూమే రసవిశేషేణ తథా గుణరసాత్తు సః

ఏక ఏవ యథా వాయు ర్థేహేష్వేవ హి పంచధా

ఏకత్వం చ పృథక్త్వంచ తథా తస్య న సంశయః

స్థానాంతరవిశేషాచ్చ యథాగ్నిర్లభతే పరామ్‌

సంజ్ఞాం తథా మునే సోయం బ్రహ్మదిషు తథాప్నుయాత్‌

యథా దీపసహస్రాణీ దీప ఏకః ప్రసూయతే

తథా రూపసహస్రాణి స ఏకః సంప్రసూయత్‌

యదా స బుధ్యత్యాత్మానం తదా భవతి కేవలః

ఏకత్వప్రలయే చాస్య బహుత్వంచ ప్రవర్తతే

నిత్యం హి నాస్తి జగతి భూతం స్థావర జంగమమ్‌

అక్షయ శ్చాప్రమేయశ్చ సర్వగశ్చ స ఉచ్యతే

తస్మా దవ్యక్త ముత్పన్నం త్రిగుణం ద్విజసత్తమాః

ఆవ్యక్తావ్యక్త భావస్తా యా సా ప్రకృతి రుచ్యతే

తాం యోనిం బ్రహ్మణో విద్ధి యోసౌ సదసదాత్మకః

లోకే చ పూజ్యతే యోసౌ దై వేపిత్ర్యే చ కర్మణి

నాస్తి తస్మాత్‌ పరో హ్యన్యః పితా దేవో పి వా ద్విజాః

ఆత్మనా సతు విజ్ఞేయ స్తతస్తం పూజయా మ్యహమ్‌

స్వర్గేష్వపి హి యే కేచి త్తం నమస్యంతి దేహినః

తేన గచ్ఛంతి దేవర్షే తేనోద్దిష్ట ఫలాం గతిమ్‌

తం దేవాః స్వాశ్రమసాశ్చ నానామూర్తిం సమాశ్రితాః

భక్త్యా సంపూజయం త్యాద్యం గతి శ్చైషాం దదాతి సః

సహి సర్వగతశ్చైవ నిర్గుణశ్చైవ కథ్యతే

ఏవం మత్వా యథాజ్ఞానం పూజయామి దివాకరమ్‌

యేచ తద్భావితా లోక ఏకతత్వం సమాశ్రితాః

ఏత దప్యధికం తేషాం యదేకం ప్రవిశం త్యుత

ఇతి గుహ్యసముద్దేశ స్తవ నారద కీర్తితః

అస్మద్భక్త్యాపి దేవర్షే త్వయాపి పరమం స్మృతమ్‌

సురైర్వా మునిభిర్వాపి పురాణౖర్వరదం స్మృతమ్‌

సర్వేచ పరమాత్మానం పూజయంతి దివాకరమ్‌

మిత్రుడు:

 నీ వడిగిన ప్రశ్న పరమ గుహ్యము. తెలుప రానిది. నీవు భక్తుడ వని తెలుపు చున్నాను. సూక్ష్మము అవ్యక్తము అచలము ధ్రువము ననబడు నాది వస్తువేది గలదో యది భూతేంద్రీయ వివర్జితము. సర్వ భూతాంతరాత్మ క్షేత్రజ్ఞు డనంబడును. త్రిగుణా తీతము. పురుష శబ్ద వాచ్యము. హిరణ్య గర్భ నామక మదియే బుద్ధియని చెప్ప బడును. మహత్తు ప్రధాన మనియు యోగ సాంఖ్యము లందు పెక్కు పేరుల పిలువ బడును. ఆ వస్తువు త్రిరూపము. ఈశ్వరు డనియు, అక్షర మనియు పేర్కొన బడినది. అది ఏక రూపమై యీ త్రిలోకము ధరించును. శరీరులందశరీరుడై యుండును. కర్మలేప మతనికి లేదు, అంతరాత్మ యన నది, సర్వసాక్షి. ఈ తత్త్వము సగుణము, నిర్గుణము, విశ్వరూపము, జ్ఞాన గమ్యము. సర్వతః పాణిపాదము. సర్వతోక్షి శిరోముఖము. సర్వత శ్రుతి మంతము. సర్వ మావరించి యున్నది. విశ్వమూర్ధము విశ్వభుజము విశ్వపాదాక్షి నాసికము. క్షేత్ర మందు (దేహ మందు) స్వేచ్ఛా సంచారియై యొక్కడుగా నుండును, తానున్న ఉపాధుల నెఱుంగు వాడు గావున క్షేత్రజ్ఞుడనం బడును. అవ్యక్త మయిన పురమందు శయించును. కావున పురుషడనం బడును. విశ్వము బహు విధము. అది యాయనయే కావున విశ్వ రూపుడన నగును. ఆయన యొక్కనికే మహత్త్వ ముండుటచే మహా పురుష వాచ్యుడతడు. ఆకాశము నుండి పడిన నీరు భూమి యొక్క రుచిని బట్టి రుచి భేధమంది నట్లు గుణ భేదమును బట్టి యతడు పలు విధ రూపములం గాన వచ్చును. ఒక్కటే వాయువు దేహ మందయిదు తీరులుగ నున్నట్లాయన యొక్కడే నానారూపు డగును. అగ్ని స్థాన భేధముం బట్టి పలు రీతులం గనవచ్చి పలు నామము లందినట్లు ఆయనయు నుపాధి నిమిత్తముగా నానాత్వ మందును. ఒక్క దీపము నుండి పలు దీపములు ముట్టింప బడి వెల్లి నట్లొక్క డయ్యు నాత డనేక రూపములం గన్పించి వెలుగును. తన్ను తానెరిగిన తరి నతడు కేవలుం డగును. ఏకత్వ ప్రళయము నందు బహుత్వము నొందును. నిత్యుడత డొక్కడే. అతని వలన త్రిగుణ రూప మవ్యక్తము పొడమి నది. వ్యక్తావ్యక్త భావస్థ యగు దానినే ప్రకృతి యందురు. అది బ్రహ్మకు కారణము. బ్రహ్మ సదస దాత్మకుడు. దేవపితృ కర్మము లందితడే పూజింప బడువాడు. అతడు, తండ్రి, దేవుడు, ఆత్మచే దెలియ దగిన వాడు. అతనినే నేను బూజించు చున్నాను. నానా రూపముల నానా దేవతల నర్చించు నందరి పూజలు నాత నొక్కనే చెందును. అయన సర్వగతి. ఆయనయే సూర్యుడును. కావున దివాకరుని నామ రూపమునే నేనా రాధింతును. ఏకత్వ విశ్వాసము గల వారేకైక మైన యా పర తత్వమునే యందుదురు. ఇది గుహ్యాతి గుహ్యమైన యంశము.

బ్రహ్మ:

ఏవ మేతత్‌ పురాఖ్యాతం నారదాయ తు భ్యానునా

మయాపి చ సమాఖ్యాతా కథా భానోర్ద్విజోత్తమాః

ఇదమాఖ్యాన మాఖ్యేయం మయాఖ్యాతం ద్విజోత్తమాః

నహ్యనాదిత్యభక్తాయ ఇదందేయం కదాచన

యశ్చైతచ్ఛ్రావయేన్నిత్యం యశ్చైవ శృణుయా న్నరః

స సహస్రార్చిషం దేవం ప్రవిశే న్నాత్రసంశయః

ముచ్యేతార్త స్తథారోగా చ్ఛ్రుత్వేమా మాదితః కథాం

జిజ్ఞాసు ర్లభతే జ్ఞానం గతి మిష్టాం తథైవ చ

క్షణేన లభతేధ్యాన మిదం యః పఠతే మునే

యోయం కామయతే కామం సతం ప్రాప్నో త్యసంశయమ్‌

తస్మా ద్భవద్భిః సతతం స్మర్తవ్యో భగవాన్‌ రవిః

సచ ధాతా విధాతాచ సర్వస్య జగతః ప్రభుః

బ్రహ్మ:

ఇట్లు మున్ను నారదునికి సూర్యుడు తెలిపెను. మీకిది తేట తెల్లం బొనరించితి. ఆదిత్య భక్తి లేని వానికిది తెలుప రాదు. ఇది చదివిన విన్న నరులు సహస్ర కిరణు సాలోక్య మందెందరు, సర్వదుఃఖ హరమిది. అభీష్ట సిధ్ధిదము. సూర్య భగవానుని మీరెల్లప్పుడు స్మరింపుడు. ఆయనయే ధాత విధాత సర్వ జగత్ప్రభువు.