242 - వసిష్ఠ కరాల జనక సంవాద వర్ణనమ్‌

వసిష్ఠుడు:

ఏవ మప్రతిబుద్ధత్వాదబుద్ధ మనువర్తతే

దేహా ద్దేహసహస్రాణి తథా చ న స భిద్యతే

తిర్యగ్యోని సహస్రేషు కదాచి ద్దేవతా స్వపి

ఉత్పద్యతి తపోయోగాద్గుణైః సహ గుణక్షయాత్‌

మనుష్యత్వాద్దివం యాతి దేవో మానుష్య మేతి చ

మానుష్యా న్నిరయస్థానమాలయం ప్రతిపద్యతే

కోశకారో యథాత్మానం కీటః సమభిరుంధతి

సూత్రతంతుగుణై ర్నిత్యం తథాయ మగుణో గుణైః

ద్వంద్వ మేతి చ నిర్ద్వంద్వస్తాసు తా స్విహ యోనిషు

శీర్షరోగేక్షిరోగే చ దంతశూలే గలగ్రహే

జలోదరేతిసారే చ గండమాలా విచర్చికే

శ్విత్రకుష్ఠేగ్నిదగ్ధే చ సిధ్మాపస్మారయో రపి

యాని చాన్యాని ద్వంద్వాని ప్రాకృతాని శరీరిణామ్‌

ఉత్పద్యంతే విచిత్రాణి తా న్యేవా త్మాభిమన్యతే

వసిష్ఠ జనక సంవాదము

వసిష్ఠుడు:

ఈ చెప్పిన విధముగా ఆ అక్షర తత్త్వము జ్ఞాన్వరూపు డయియు అప్రతి బుద్ద, అజ్ఞాన సహిత, రూపుడై అప్రతిబుద్దులగు మన వంటి వారి ననువర్తించు చున్నది. దేహము నుండి మఱియొక దేహములో ప్రవేశించుచు వేల కొలది జన్మలను పొందు చున్నది. వేల కొలది తిర్యగ్యోను లందును దేవతల యందును తపో వంతుడై మహా సద్గుణ యుక్తుడుగా గుణ క్షయముచే మనుష్యుడుగా జన్మించి పుణ్య వశమున స్వర్గమునకు పోవును. మనుష్య లోకమునకు వచ్చును. పాపముచే నరకమునకును పోవును. పట్టు పురుగు తన దేహము నుండి తీసిన దారముతో తన్నే చుట్టు కొన్నట్లు తన నుండి నిష్పన్నము లైన త్రిగుణములతో తన్నే బంధించుకొని ఆ అక్షరుడు తాను స్వభావముచే ద్వంద్వా తీతుడై యుండియు సుఖ దుఃఖ రూపములగు ద్వంద్వములకు లోబడి శిరో రోగము నేత్ర రోగము దంత శూల గల గ్రహము జలోదరము అతిసారము గండమాల విచ్చర్చిక బొల్లి కుష్ఠము అగ్ని దాహము అపస్మారము మొదలగు బాధలను పొందుచు దేహము నేనే అనియు దేహము నాదే అనియు మాయా వశమున కలిగిన అభిమానముచే ఆ బాధలును తనకే అని అభిమానమును పొందు చున్నాడు.

అభిమా నాతిమానానాం తథైవ సుకృతాన్యపి

ఏకవాసా శ్చతుర్వాసాః శాయీ నిత్య మధ స్తథా

మండూకశాయీ చ తథా వీరాసన గత స్తథా

వీరమాసన మాకాశే తథా శయన మేవ చ

ఇష్టకాప్రస్తరే చైవ చక్రకప్రప్తరే తథా

భస్మప్రస్తరశాయీ చ భూమిశ య్యాసులేపనః

వీరస్థా నాంబుపాకే చ శయవం ఫలకేషు చ

వివిధాసు చ శయ్యాను ఫలగృ హ్యాన్వితాసు చ

ఉద్యానే ఖలలగ్నే తు క్షౌమకృష్ణాజినాన్వితః

మణివాల పరీధానో వ్యాఘ్రచర్మపరిచ్ఛదః

సింహచర్మ పరీధానః పట్టవాసా స్తథైవ చ

ఫలకం (?) పరిధానశ్చ తథా కటకవస్త్రధృక్‌

కటైక వసన శ్చైవ చీరవాసా స్తథైవ చ

వస్త్రాణి చాన్యాని బహూన్యభిమత్య చ బుద్దిమాన్‌

భోజనాని విచిత్రాణి రత్నాని వివిధాని చ

ఏకరాత్రాంతరాశిత్వమైకకాలిక భోజనమ్‌

చతుర్థయామ కాలం చ షష్ఠకాలిక మేవ చ

షడ్రాత్ర భోజనశ్చైవ తథా చాష్టాహభోజనః

మాసోపవాసీ మూలాశీ ఫలాహార స్తథైవ చ

వాయుభక్షశ్చ పిణ్యాకదధిగోమయ భోజనః

గోమూత్ర భోజనశ్చైవ కాశపుష్పాశన స్తథా

శైవాల భోజనశ్చైవ తథా చాన్యేన వర్తయన్‌

వర్తయన్‌ శీర్ణపర్ణై శ్చ ప్రకీర్ణభోజనః

వివిధాన చ కృచ్ర్ఛాణి సేవతే సిద్దికాంక్షయా

చాంద్రాయణాని విధివ ల్లింగాని వివిధాని చ

చాతురాశ్రమ్యయుక్తాని ధర్మాధర్మాశ్రయా ణ్యపి

ఉపాశ్రయా నప్యపరాన్పాఖండాన్వివిధా నపి

వివిక్తా శ్చ శిలాఛాయా స్తథా ప్రస్రవణాని చ

పులినాని వివిక్తాని వివిధాని వనాని చ

కాననేషు వివిక్తాశ్చ శై లానాం మహతీర్గుహాః

నియమా న్వివిధాం శ్చిపి వివిధాని తపాంసి చ

యజ్ఞాంశ్చ వివిధాకారాన్విద్యాశ్చ వివిధా స్తథా

వణి క్పథం ద్విజక్షత్రవై శ్యశూద్రాం స్తథైవ చ

దానం చ వివిధాకారం దీనాంధ కృపణాదిషు

అభిమన్యేత సంధాతుం తథైవ వివిధాన్గుణాన్‌

సత్త్వం రస్తమశ్చైవ ధర్మార్థౌ కామ ఏవ చ

ప్రకృత్యాత్మాన మేవాత్మా ఏవం ప్రవిభజత్యుత

స్వాహాకారవషట్కారౌ స్వధాకారనమస్క్రియే

యజనాధ్యయనే దానం తథైవాహుః ప్రతిగ్రహమ్‌

యాజనాధ్యాపనే చైవ తథాన్యదపి కించన

జన్మమృత్యువిధానేన తథా విశసనేన చ

శుభాశుభమయం సర్వమేత దాహుః సనాతనమ్‌

అభిమానముచే కలుగు ఈ ద్వంద్వ జనిత దుఃఖములతో పాటుగ ఆ దేహ త్మాభిమాన వశముననే అహంకార మమకార వశముననే అతడు కొన్ని సుకృతము లను కూడ ఆచరించు చున్నాడు. అవి ఇట్లు ఉండును. ఒకే వస్త్రము ధరించుట నాలుగు వస్త్రముల ధరించుట నేలపై పరుండుట కప్ప వలె పరుండుట వీరాసనములో కూర్చుండుట వీరాసనము తోను ఆకాశము నందును శయనించుట ఇటుకల కుప్పపై బూడిద రాశిపై భూమిపై పండు కొనుట వీర స్థానమున జలముతో తడిసిన చోట కొయ్య, రాతి పలకలపై పరుండుట కాయలతో పండ్లతో పశువులతో పక్షులతో నిండిన చోట ఉద్యానములో కళ్లములో పండుకొనుట పూసలతో వెంట్రుకలతో చేసిన వస్త్రములు వ్యాఘ్ర చర్మము సింహ చర్మము చెట్ల బెరడు పట్టములు నారతో పురి కొసతో నేసిన పట్టాలు మొదలగు నవి. చాపలు, చాపల వంటి ఇతర వస్తువులు నార వస్త్రములు మొద లైనవి తన అభిరుచి ననుసరించి ధరించుట ఒక రాత్రి వదలి మఱియొక రాత్రియు దినమున కొకే మారును నాలుగు భోజన కాలముల కొకమారు ఎనిమిది భోజన కాములకు ఒకసారి ఎనిమిది నాళ్ళకు ఒకసారి ఆరు నాళ్లకు ఒకసారి భోజనము చేయుట మాసో పవాసము చేయుట మూలములు పండ్లు తిని యుండుట వాయువును నూనె పిండి వంటలను పెరుగును గోధుమలతో యవలతో చేసిన వంటలను గో మూత్రమును ఱెల్లు పూవులను నాచును ఎండు టాకులను వివిధములగు పండ్లను భుజించి జీవనము గడపుట కృచ్ఛమ్రులు చాంద్రాయణములు మొదలగు కఠిన వ్రతములు ఆచరించుట వివిధ వేషములు చిహ్నములు అవి నాలుగు ఆశ్రమములలో వేటికి సంబందించిన వైనను ధర్మాధర్మము లలో దేనికి చెందిన వైనను వాటికి సన్నిహితమైన ఇతర లక్షణములను వేద విరుద్థము లైన వానిని ధరించుట వివిక్త మగు శిలల నీడలను సెలయేళ్లను ఇసుక తిన్నెలను అడవులను పర్వత గుహలను వివిధ నియమములను తవస్సులకు యజ్ఞ ములను వివిధ యజ్ఞములను ఆశ్రయించుట బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రజాతి ధర్మములలో తోచిన వాటిని ఆవలంబించుట దీనులు అంధులు మొదలగు వారికి వివిధ దానములు చేయుట వివిధ గుణములను స్వభావములను అలవాటును పాటించుట ధర్మార్థ కామము లతో తనకు అభిమత మగు పురుషార్థము నందు ప్రవృత్తు డగుట ఇవన్నియు దేహాత్మా భిమానము అహంకార మమకారము అనెడి వాని వలన మాయా వశమున కలుగు ప్రవృ త్తులే. స్వాహాస్వధా వషట్‌ నమస్కారములు యజన యాజ నాధ్య యనాధ్యాపన దాన ప్రతి గ్రహములు జన్మ జరా మృత్యువులు హింస శుభాశుభ కర్మల న్నియు ఈ అభిమానవశ మున కలుగునవే. ఇట్లు ఆ అక్షర తత్త్వమే క్షర రూపమున తన్ను తాను వివిధ రూపము లలో విభజించు కొనుచు వ్యక్త మూర్త రూపమున కనబడు చున్నది.

ప్రకృతిః కురుతే దేవీ భయం ప్రలయ మేవ చ

దివసాంతే గుణా నేతానతీత్యై కోవతిష్ఠతే

రశ్మిజాల మి వాదిత్యస్తత్కాలం సంనియచ్ఛతి

ఏవ మే వైష తత్సర్వం క్రీడార్థ మభిమన్యతే

ఆత్మరూపగుణా నేతాన్వివిధా న్హృదయప్రియాన్‌

ఏవ మేతాం ప్రకుర్వాణః సర్గప్రలయధర్మిణీమ్‌

క్రియాం క్రియాపథే రక్తస్త్రగుణ స్త్రిగుణాధిపః

క్రియాక్రియాపథో పేత స్తథా త దితి మన్యతే

ప్రకృత్యా సర్వ మే వేదం జగదంధీకృతం విభో

రజసా తమసా చైవ వ్యాప్తం సర్వ మనేకధా

ఏవం ద్వంద్వా న్యతీతాని మమ వర్తంతి నిత్యశః

మత్త ఏతాని జాయంతే ప్రలయే యాంతి మా మపి

నిస్తర్తవ్యా ణ్య థైతాని సర్వా ణీతి నరాధిపః

మన్యతే పక్షబుద్దిత్వాత్తథైవ సుకృతా న్యపి

భోక్తావ్యాని మమైతాని దేవలోక గతేన వై

ఇ హైవ చైనం భోక్ష్యామి శుభాశుభఫలోదయమ్‌

సుఖ మేవం తు కర్తవ్యం సకృత్కృత్వా సుఖం మమ

యావ దేవ తు మే సౌఖ్యం జాత్యాం జాత్యాం భవిష్యతి

భవిష్యతి న మే దుఃఖం కృతే నేహాప్యనంతకమ్‌

సుఖదుఃఖం హి మానుష్యం నిరయే చాపి మజ్జనమ్‌

నిరయాచ్చాపి మానుష్యం కాలే నై ష్యా మ్యహం పునః

మనుష్యత్వా చ్చ దేవత్వం దేవత్వా త్పౌరుషం పునః

మనుష్యత్వా చ్చ నిరయం పర్యాయే ణోపగచ్ఛతి

ఏష ఏవం ద్విజాతీనామాత్మా వై త్రిగుణై ర్వృతః

తేన దేవమనుష్యేషు నిరయం చోపపద్యతే

మమత్వే నావృతో నిత్యం త్రైవ పరివర్తతే

పూజ్యురాలగు ప్రకృతి దేవియే భయమును ప్రళయమును కూడ కలిగించును. బ్రహ్మ యొక్క పగలు = సృష్టి కాలము అయిన తర్వాత శ్రీ మహా విష్ణువు ప్రళయ మును జరిపి ఈ త్రిగుణములకును వాటి వలన కలుగు సమస్త లక్షణములకును అతీతుడై ఏకైక తత్త్వ మగు తాను మాత్రమే ఉండును. సృష్టి జరుగక నిలిచి పోయిన రాత్రి = ప్రళయ కాలమున సూర్యుడు తన కిరణములను వలె కొంత కాలము పాటు ఆయా గుణ ధర్మములను తన లోపల ఆయన నిగ్రహించి యుంచును. ఇది యంతయు ఆయన ఇట్లు లీలా క్రీడార్థమై చేయుచు తన హృదయము నకు ప్రియములైన ఈ తన రూప గుణములను తనవి అను అభిమానముతో, మమకారముతో, చూచును. ఆయన త్రి గుణాత్మకుడ, త్రిగుణముల కధిపతి, క్రియా ప్రవృత్తి మార్గము నందు ఆసక్తి కలవాడు. క్రియా ప్రవృత్తుల తోను యజ్ఞాది క్రియలతోను సంతతమును కూడి యుండువాడు. అందుచే ఈ సృష్టి ప్రళయ రూపమగు ప్రవృత్తి యందు ముందునకు సాగుచు ఇది నాది యను మమకారమును లీలార్థమై మాత్రమే వహించును. వాస్తవమున ఆ మహానుభావునకు అహంకార మమకార ములు ఏవియు లేవు. ఈ జగ మంతయు ప్రకృతి ధర్మముచే కన్ను గానక రజ స్తమో గుణ ధర్మములచే అనేక విధములుగా వ్యాప్తమై యున్నది. ఈ ద్వంద్వములు సుఖ దుఃఖ, శీతోష్ణాదులు. నాచే అతీతములై నానుండి యుత్పన్నము లగుచు నా యందే లయము నొందు చున్నవి. అని ఆయన ఎరుగును. అవి తనచే లెస్సగ సృజింప బడినవే యైనను తాను సామాన్య జీవుడై యున్నపుడు మాయా వశమున ఏమియు ఎరుగక పోవుటచే అయ్యో! ఇవి యన్నియు నేను తరించ వలెను. దేవ లోకమున నేను ఈ ఫలము లనుభవింప వలెను. ఈ లోకములో నున్నపుడు కర్మ వశమున కలుగు శుభాశుభ ఫలము లనుభవింప వలసి యున్నది. ఈ విధమగు కర్మము లాచరించి సుఖములను సంపాదింప వలెను. ప్రతి జన్మము నందును నాకు సుఖమే కలుగుటకు యత్నించ వలెను. ఇహమున నాకు అనంత మగు దుఃఖములు నరకమున యాతనలు ఉండరాదు. ఒకవేళ నరకమునకు పోయినచో మరల మనుష్య జన్మమును తరువాత దేవత్వమును పొందుదును. అని యిట్లు బ్రహ్మణాది జన్మములు పొందిన ఈ మానవులు ఆయా గుణములతో ఆవరింప బడి భావన చేయుచు అందుకు తగినట్లు కర్మము లాచరించుచు నరకమునో మనుష్యత్వ దేవత్వము లనో పొందుచు కేవలము మమకార వశమున ఈ జనన మరణ రూప సంసార గతిలో తిరుగు చుందురు.

సర్గకోటిసహస్రాణి మరణా న్తాసు మూర్తిషు

య ఏవం కురుతే కర్మ శుభాశుభఫలాత్మకమ్‌

స ఏవ ఫల మాప్నోతి త్రిషు లోకేషు మూర్తిమాన్‌

ప్రకృతిః కురుతే కర్మ శుభాశుభఫలాత్మకమ్‌

ప్రకృతి శ్చ తథాప్నోతి త్రిషు లోకేషు కామగా

తిర్యగ్యోని మనుష్యత్వే దేవలోకే తథైవచ

త్రీణి స్థానాని చైతాని జానీయా త్ర్పాకృతాని హ

ఆలింగ ప్రకృతిత్వాచ్చ లింగై ర ప్యనుమీయతే

తథైవ పౌరుషం లింగమనుమానాధ్ధి మన్యతే

స లింగాంతర మాసాద్య ప్రాకృతం లింగ మప్రణమ్‌

వ్రణద్వారా ణ్యధిష్ఠాయ కర్మణ్యాత్మని మన్యతే

శ్రోత్రాదీని తు సర్వాణి పంచ కర్మేంద్రియా ణ్యథ

రాగాదీని ప్రవర్తంతే గుణే ష్విహ గుణైః సహ

అహ మేతాని వై కుర్వన్మ మైతా నీంద్రియాణి హ

నిరింద్రియో హి మన్యేత వ్రణవా నస్మి నిర్ర్వణః

ఆలింగో లింగమాత్మాన మకాలం కాలమాత్మనః

అసత్త్వం సత్త్వ మాత్మానమమృతం మృత మాత్మనః

అమృత్యుం మృత్యు మాత్మానమచరం చరమాత్మనః

అక్షేత్రం క్షేత్ర మాత్మానమసంగం సంగమాత్మనః

ఆతత్త్వం తత్త్వమాత్మానమభవం భవమాత్మవః

అక్షరం క్షర మాత్మానమబుద్ధత్వా ద్ధి మన్యతే

ఏవ మప్రతిబుద్ధత్వాదబుద్ధ జనసేవనాత్‌

సర్గకోటి సహస్రాణి పతనాంతాని గచ్ఛతి

జన్మాంతరసహస్రాణి మరణాంతాని గచ్ఛతి

తిర్యగ్యోని మనుష్యత్వే దేవలోకే తథైవ చ

చంద్రమా ఇవ కోశానాం పునస్తత్ర సహస్రశః

నీయతే ప్రతిబుద్ధత్వాదేవ మేవ కుబుద్ధిమాన్‌

కలా పంచదశీ యోనిస్త ద్ధామ ఇతి పఠ్యతే

నిత్యమేవ విజానీహి సోమం వై షోడశాంశకైః

కలయా జాయతేజస్రం పునః పున రబుద్ధిమాన్‌

ధీమాంశ్చాయం న భవతి నృప ఏవం హి జాయతే

షోడశీ తు కలా సూక్ష్మా స సోమ ఉపధార్యతామ్‌

స తూప యుజ్యతే దేవైర్దేవా నపి యునక్తి నః

మమత్వం క్షపయిత్వా తు జాయతే నృపసత్తమ

ప్రకృతే స్త్రిగుణాయా స్తు స ఏవ త్రిగుణో భవేత్‌

ఈ విధముగా జీవుడు శుభాశుభ ఫలాత్మక మగు కర్మల నాచరించుచు జనన మరణముల నడుమ అనేక రూపములలో సంచరించు చున్నాడు. కాని ఈ జీవుల ప్రవృత్తుల లోను తిర్యగ్యోని మనుష్యత్వ దేవత్వ ప్రాప్తులలోను ప్రకృతియే హేతువు. అది స్వతంత్ర మైనది. జీవుడు ప్రకృతికి అతీతమైన తత్త్వము నందు వ్రణము లేదు. కర్మఫల సంగము లేదు. వ్రణ ద్వారము లనదగిన జ్ఞాన కర్మేంద్రియములు త్రిగుణ జన్యము లైన రాగ ద్వేషాదులు తోడు కాగానే యీ జీవుడు అహంకార మమ కారములు కలిగి తనకు ఇంద్రియములు వ్రణములు చిహ్నములు కాలము సత్తా మరణములు సంచరణము క్షేత్రము సంగము, తత్త్వము, సంసారము నాశము లేకున్నను ఆజ్ఞాన వశమున తనకివి యన్నియు ఉన్నవని భావించుచు పెద్దలను సేవించి వివేకమును సంపాదించక దేవత్వము మొదలు నరక పాతము వరకు గర్భ ప్రకాశము మొదలు మరణము వరకు వివిధ స్థితులకు కారణము లగు వేల కొలది సృష్టులలో సంచరించుచు సంసరించు చున్నాడు. చంద్రునకు పదునారు కలలున్న వని శాస్త్రము చెప్పు చున్నది. వానిలో పదు నైదింటిని మాత్రము దేవత లనుభవింతురు. పదు నారవ కళ మాత్రము దేవతల అనుభవమునకు అందక నిలిచి యుండుచు తానే దేవతలను అనుభవించుచు మరల మరల చంద్రుడు వృద్ధి క్షయములు పొందుటకు మూలమగు చున్నది. అట్లే శుద్ధ మగు ఆత్మ తత్త్వము కూడ అజ్ఞాన వశమున ప్రకృతికి లోబడి ఆయా జన్మ పరంపరలలో వృద్ధి క్షయములను పొందు చుండియు శుద్ధ తత్త్వమునకు ఏమియు అంటక నిలుచును కావున ఆ తాత్త్విక స్థితిని వృద్ధజన సేవనముచే వివేకము పొందియు యోగాది సాధన చేసియు భగవద నుగ్రహము పొంది నప్పుడు గ్రహంచి ముక్తుడగు చున్నాడు.