29 - సూర్య పూజా ప్రకరణమ్‌

మునులు:

శ్రుతోస్మాభిః సురశ్రేష్ఠ భవతా య దుదాహృతమ్‌

భాస్కరస్య పరం క్షేత్రం భుక్తి ముక్తి ఫలప్రదమ్‌

న తృప్తి మధిగచ్ఛామః శ్రుణ్వంతః సుఖదాం కథామ్‌

తవ వక్త్రోద్భవాం పుణ్యా మాదిత్య స్యాఘనాశినీమ్‌

అతః పరం సురశ్రేష్ఠ! బ్రూహినో వదతాం వర

దేవ పూజాఫలం యచ్చ యచ్చ దానఫలం ప్రభో

ప్రణిపాతే నమస్కారే తథా చైవ ప్రదక్షిణే

ధూపదీపప్రదానేచ సమ్మార్జన విధౌచయత్‌

ఉపవాసే చ యత్‌ పుణ్యమ్‌ యత్‌పుణ్యం నక్తభోజనే

అర్ఘ్యంచ కీదృశం ప్రోక్తం కుత్రవాసంప్రదీయతే

కథంచ క్రియతే భక్తిః కథం దేవః ప్రసీదతి

ఏతత్‌ సర్వం సురశ్రేష్ఠ శ్రోతు మిచ్ఛామహే వయమ్‌

మునులు:

మీరు చెప్పిన భాస్కర క్షేత్ర మహిమ వింటిమి. కాని మాకు తృప్తి కలుగ లేదు. కావున పూజా విధానము, దానము, నమస్కారము, ప్రదక్షిణము ధూప దీపాది సమర్పణముపవాసము, సూర్యాలయ మార్జనము మొదలగు వాని విశేషములను విన గోరెదము. సూర్య ప్రీతి కరములైన పూవులను, నమస్కార విశేషములను, సూర్యార్ఘ్య విధానము, సూర్యు నుద్దేశించి చేయు నుపవాసము, నక్తము (పగలుపవాస ముండి రాత్రి భోజనము చేయుట) మొదలగు వాని ఫలము, దేశకాల విశేషములను విన వలెనని కుతూహల పడుచున్నాము.

బ్రహ్మ:

అర్ఘ్యం పూజాదికం సర్వం భాస్కరస్య ద్విజోత్తమాః

భక్తిం శ్రద్ధాం సమాధించ కథ్యమానం నిబోధత

మనసా భావనా భక్తి రిష్టా శ్రద్ధాచ కీర్త్యతే

ధ్యానం సమాధి రిత్యుక్తం శ్రణుధ్వం సుసమాహితాః

తత్కధం శ్రావయే ద్యస్తు తద్భక్తాన్‌ పూజయీతవా

అగ్ని శుశ్రూషకశ్చైవ సవైభక్తః సనాతనః

తచ్చిత్త స్తన్మనాశ్చైవ దేవపూజారతః సదా

తత్కర్మకృ ద్భవే ద్యస్తు సవైభక్తః సనాతనః

దేవార్థే క్రియమాణాని యః కర్మా ణ్యనుమన్యతే

కీర్తనాద్వా పరో విప్రాః సవై భక్తతరో నరః

నాభ్యసూయేత తద్భక్తాన్‌ న నింద్యా చ్చాన్యదేవతామ్‌

ఆదిత్యవ్రతధారీచ సవై భక్తతరో నరః

గచ్ఛం స్తిష్ఠన్‌ స్వపన్‌ జిఘ్ర న్నున్మిషన్ని మిషన్నపియః

స్మరే ద్భాస్కరం నిత్యం సవై భక్తతరో నరః

ఏవం విధా త్వియం భక్తిః సదా కార్యా విజానతా

భక్త్యా సమాధినా చైవ స్తవేన మనసా తథా

క్రియతే నియమో యస్తు దానం విప్రాయ దీయతే

వ్రతిగృహ్ణంతి తం దేవా మనుష్యాః పితర స్తథా

పత్రం పుష్పం ఫలం తోయం యద్భక్త్యా సముపాహృతమ్‌

ప్రతిగృహ్ణంతి తద్దేవా నాస్తికాన్‌ వర్జయంతి చ

బావశుద్ధిః ప్రయోక్తవ్యా నియమాచార సంయుతా

భావశుద్ధ్యా కృతం య ద్యత్తత్సర్వం సఫలం భవేత్‌

స్తుతిజప్యోపహారేణ పూజయాపి వివస్వతః

ఉపవాసేన భక్త్యా వై సర్వపాపైః ప్రముచ్యతే

ప్రణిధాయ శిరో భూమ్యాం నమస్కారం కరోతి యః

తత్‌క్షణాత్‌ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః

భక్తియుక్తో నరో యోసౌ రవేః కుర్యా త్ప్రదక్షిణమ్‌

ప్రదక్షిణీ వృతా తేన సప్త ద్వీపా వసుంధరా

సూర్యం మనసి యః కృత్వా కుర్యా ద్వ్యోమ ప్రదక్షిణం

ప్రదక్షీణీకృతాస్తేన సర్వే దేవా భవంతి హి

ఏకాహారో నరో భూత్వా షష్ఠ్యాం యోర్చయతే రవిమ్‌

నియమవ్రతచారీచ భవే ద్భక్తిసమన్వితః

సప్తమ్యాం వా మహాభాగాః సోశ్వమేధఫలం లభేత్‌

అహోరాత్రోపవాసేన పూజయే ద్యస్తు భాస్కరమ్‌

సప్తమ్యా మధవా షష్ట్యాం సయాతి పరమాం గతిమ్‌

కృష్ణపక్షస్య సప్తమ్యాం సోపవాసో జితేంద్రియః

సర్వరత్నోపహారేణ పూజయే ద్యస్తు భాస్కరమ్‌

పద్మప్రభేణ యానేన సూర్యలోకం స గచ్ఛతి

శుక్లపక్షస్య సప్తమ్యా ముపవాసపరో సరః

సర్వశుక్లోపహారేణ పూజయే ద్యస్తు భాస్కరమ్‌

సర్వపాపవినిర్ముక్తః సూర్యలోకం స గచ్ఛతి

అర్కసంపుటసం యుక్త ముదకం ప్రసృతం పిబేత్‌

క్రమవృద్ధ్యాచతుర్వింశ మేకైకం క్షపయే త్పునః

ద్వాభ్యాం సంవత్సరాభ్యాంతు సమాప్తనియమో భవేత్‌

సర్వకామప్రదా హ్యేషా ప్రశస్తా హ్యర్కసప్తమీ

శుక్లపక్షస్య సప్తమ్యాం యదాదిత్య దినం భవేత్‌

సప్తమీ విజయా నామ త్రత దత్తం మహత్‌ ఫలం

స్నానం దానం తపో హోమ ఉపవాసస్తథైవచ

సర్వ విజయ సప్తమ్యాం మహాపాతకనాశనమ్‌

బ్రహ్మ:

మనస్సు చేతజేయు భావన భక్తి శ్రద్ధ ధ్యానము సమాధి యనుపేర్ల పిలువ బడును. భక్తి సమాధి స్తుతియను వానిచే పత్ర పుష్ప ఫలము తోయములే కొంచెమొసంగిన నది భగవంతుడు స్వీకరించి ప్రీతి చెందును. రవికి భక్తితో చేసిన ప్రదక్షిణ మఖిల భూ ప్రదక్షిణమే. సర్వ దేవతా ప్రదక్షిణమే. షష్టి తిధి యందు ఏక భుక్తము చేసి గాని సప్తమి నాడు భాను నర్చించిన నది యశ్వమేధ ఫలమిచ్చును. కృష్ణపక్ష సప్తమీ తిధి యందు. భాస్కరుని పూజించిన పద్మ ప్రభమైన విమానములో నెక్కి సూర్య లోక మేగును. శుక్లపక్ష సప్తమి నాడు ఉపవసించి తెల్లని పూజా ద్రవ్యముల నబ్జ బాంధవుని పూజించిన సరియే ఫలము. అర్క సంపుటముతో (రాగి అరివాణముతో) గూడిన తీర్థము నేకోత్తర వృద్ధిగా నిరువది నాలుగు రోజులు పానము చేసి క్రమముగా తగ్గించు కొని వచ్చుచు సేవించుచు నిట్లు రెండేడ్లకు వ్రత సమాప్తి చేసినచో నయ్యర్క సప్తమీ వ్రత మశేష కామ ప్రదము. శుక్లపక్ష సప్తమి భానువారము కలిసి వచ్చెనేని యది విజయ సప్తమి యనబడును. అందు స్నాన దానము లనంత ఫలదము లగును.

యే చాదిత్య దినే ప్రాప్తే శ్రాద్ధం కుర్వంతి మానవాః

యజంతిచ మహాశ్వేతం లభంతే తే యుథేప్సితమ్‌

యేషాం ధర్మ్యాఃక్రియాః సర్వా స్సదైవోద్దిశ్య భాస్కరమ్‌

న కులే జాయతే తేషాం దరిద్రో వ్యాధితోపి వా

శ్వేతయా రక్తయా వాపి పీతమృత్తికయాపివా

ఉపలేపనకర్తా తు చింతితం లభతే ఫలమ్‌

చిత్రభానుం విచిత్రైస్తు కుసుమై ర్య స్పుగంధిభిః

పూజయేత్‌ సోపవాసోయ స్సకామా నీప్సితాన్‌ లభేత్‌

ఘృతేన దీపం ప్రజ్వాల్య తిలతై లేన వా పునః

ఆదిత్యం పూజయేద్యస్తు చక్షుషా న స హీయతే

దీపదాతా నరో నిత్యం జ్ఞానదీపేన దీప్యతే

తిలాః పవిత్రాః తైలం వా తిలగోదాన ముత్తమమ్‌

అగ్నికార్యేచ దీపేచ మహాపాతకనాశనమ్‌

దీపం దదాతి యో నిత్యం దేవతాయతనేషు చ

చతుష్పథేషు రథ్యాసు రూపవాన్‌ సుభగో భవేత్‌

హవిర్భిః ప్రథమః కల్పో ద్వితీయ శ్చోషథీరసైః

వసామేదోస్థి నిర్యాసై ర్నతు దేయః కథంచన

భవే దూర్థ్వగతి ర్దీపో న కదాచి దథోగతిః

దాతా దీప్యతి చాప్యేవం న తిర్యగ్గతి మాప్నుయాత్‌

జ్వలమానం సదాదీపం నహరే న్నాపి నాశయేత్‌

దీపహర్తా నరో బంధం నాశం క్రోధం తమో వ్రజేత్‌

దీపదాతా స్వర్గలోకే దీపమాలేవ రాజతే యః

సమాలభతే నిత్యం కుంకుమాగురుచందనైః

సంపద్యతే నరః ప్రేత్య ధనేన యశసా శ్రియా

రక్తచందనసంమ్మిశ్రైః రక్తపుష్పైః శుచిర్నరః

ఆదివారము శ్రాద్ధము పెట్టినను మహా శ్వేతము (తెల్ల జిల్లేడు) తో హోమ మొనర్చినను నభీష్టసిద్ధి గల్గును. వారి వంశమున దరిద్రుడు గాని, రోగి గాని పుట్టడు. తెల్లని యెఱ్ఱని పసుపు పచ్చని మృత్తికతో పూసికొన్న వాని కోర్కెలు నెరవేరును. రంగు రంగుల పూలతో చిత్రభాను నర్చించి యుపవాస ముండిన నభీష్టము వడయును. ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని దీపము పెట్టి ఆదిత్యుని పూజించిన వానికి నేత్ర వ్యాధు లుండవు. దీపదాతకు జ్ఞాన దీపము లభించును. తిలలు పవిత్రములు కావున తైల గోదానము పుణ్య ప్రదము. నలుదారులు కలిసినచో (చతుష్పథము లందు) రాజ మార్గము లందు నట్టి దీప దానము చేసిన నరుడందగాడు (సుభగుడు), భాగ్య వంతుడు నగును. దీపము హవిర్ద్రవ్యములు (ఆవు నెయ్యి) మొదలైన వానిచే బెట్టుట ప్రథమ కల్పము. ఓషధీ రసముల చేత బెట్టుట రెండవ కల్పము. వసా మేదోస్థి సంబంధమైన (క్రొవ్వు పదార్థములు) దీపము నిషిద్ధము. దీప మెపుడు నూర్ధ్వముగా బ్రసరించును. కావున దీపదాత యెపుడు నూర్ధ్వగతినే గాని యథోగతి నందడు. వెలుగు చున్న దీపమును దగ్గింప రాదు. ఆర్పి వేయరాదు. అట్లుచేసిన వాడు బంధము నాశనము కోపము తమో గుణమును బొందును. దీప దాత స్వర్గ మందు దీప మాలవలె వెలుగును. కుంకుమాగరు చందనములచే రక్త చందన రక్త పుష్పములచే నాదిత్యు నర్పించినయత డుదయమందర్ఘ్య మిచ్చి నతడు సంవత్సరములో నిష్ట సిద్ధి గాంచును.

ఉదయేర్ఘ్యం సదా దత్వా సిద్ధిం సంవత్సరా ల్లభేత్‌

ఉదయాత్‌ పరివర్తేత యావదస్తమనే స్థితః

జప న్నభిముఖః కించి స్మంత్రం స్తోత్ర మథాపివా

ఆదిత్యవ్రత మేతత్తు మహాపాతకనాశనమ్‌

అర్ఘ్యేన సహితంచైవ సర్వం సాంగం ప్రదాపయేత్‌

ఉదయే శ్రద్ధయా యుక్తః సర్వపాపైః ప్రముచ్యతే

సువర్ణధేన్వనడుహ వసుధా వస్త్రసంయుతమ్‌

అర్ఘ్యప్రదాతా లభతే సప్తజన్మానుగం ఫలమ్‌

అగ్నౌ తోయే న్తరిక్షేచ శుచౌ భూమ్యాం త థైవచ

ప్రతిమాయాం తథాపిండ్యాందేయమర్ఘ్యం ప్రయత్నతః

నాపసవ్యం నసవ్యంచ దద్యా దభిముఖః సదా

సఘృతం గుగ్గులం వాపి రవే ర్భక్తిసమన్వితః

తత్‌క్షణాత్‌ సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః

శ్రీవాసం చతురస్రంచ దేవదారుం తథైవచ

కర్పూరాగరుధూపాని దత్వా వై స్వర్గగామినః

ఆయనే తూత్తరే సూర్య మథవా దక్షిణాయనే

పూజయిత్వా విశేషేణ సర్వపాపైః ప్రముచ్యతే

విషువే షూపరాగేషు షడశీతిముఖేషు చ

పూజయిత్వా విశేషేణ సర్వపాపైః ప్రముచ్యతే

ఏవం వేలాసు సర్వాసు సర్వకాలంచ మానవః

భక్త్యా పూజయతే యోర్కం సోర్కలోకే మహీయతే

కృసరైః పాయసైః పూపైః ఫలమూలఘృతౌదనైః

బలిం కృత్వా తు సూర్యాయ సర్వాన్‌ కామా నవాప్నుయాత్‌

ఘృతేన తర్పణం కృత్వా సర్వసిద్ధో భవేన్నరః

క్షీరేణ తర్పణం కృత్వా మనస్తాపై ర్న యుజ్యతే

దధ్నాతు తర్పణం కృత్వా కార్యసిద్ధిం లభే న్నరః

స్నానార్థ మహరేద్యస్తు జలం భానోః సమాహితః

తీర్థేషు శుచితాపన్నః నయాతి పరమాం గతిమ్‌

ఛత్రం ధ్వజం వితానం వా పతాకాం చామరాణి చ

శ్రద్ధయా బానవే దత్వా గతి మిష్టా మవాప్నుయాత్‌

యద్యద్ద్రవ్యం నరో భక్త్యా ఆదిత్యాయ ప్రయచ్ఛతి

తత్తస్య శతసాహస్ర ముత్పాదయతి భాస్కరః

మానసం వాచికం వాపి కాయజం యచ్చ దుష్కృతమ్‌

సర్వం సూర్యప్రసాదేవ తదశేషం వ్యపోహతి

ఏకాహేనాపి యద్భానోః పూజయాః ప్రాప్యతే ఫలమ్‌

యథోక్తదక్షిణై ర్విప్రైర్న తత్‌ క్రతుశతైరపి

సూర్యుడుదయించి అస్తమించు దాకా నిలబడి సూర్యాభి ముఖుడై యేదేని మంత్రము జపించిన వాడు సూర్య స్తోత్రమేదేని చేసిన వాడు సర్వ పాపములంబాయును. దీనిని ఆదిత్య వ్రత మందురు. సువర్ణ గోవృషభ వస్త్ర దానములతో సూర్యార్ఘ్యము నిచ్చిన పుణ్యుడా ఫలమేడు జన్మల దాకా యను భవించును. అగ్ని నీరు యంతరిక్షము పవిత్ర భూమి ప్రతిమ పిండితో చేసిన సూర్యమూర్తి అనువాని యందర్ఘ్య మీయ నగును. సవ్యముగా గాని యప సవ్యముగ (కుడి ఎడమ ప్రక్కల) నర్ఘ్యమీయ రాదు. అభిముఖముగా మాత్రమే సూర్యార్ఘ్య మీయ వలెను. రవికి గుగ్గులు క్రర మారేడు దేవ దారువులతో చేసిన నలు పలకల యాసనము కర్పూరాగరు ధూపము లొసగిన వారు స్వర్గ మందుదురు. విషువము లందు (రాత్రి పగలు సమముగా నున్న పర్వము లందు) బ్రభాకరు నర్చించిన సర్వ దురితములు దొలంగును. కృసరము (పులగము) పాయసము, అపూపములు పండ్లు, దుంపలు, నెయ్యి యను వానిచే సూర్య బలి యిచ్చిన సర్వ కామ సమృద్ధి నందును. ఆవు నేతితో తర్పణము చేసిన సర్వసిద్ధి నందును. ఆవు పాలతో తర్పణము మనస్తాప హరణము, ఆవు పెరుగుతో చేసిన కార్యసిద్ధి. పవిత్ర తీర్థజలములచే మార్తాండునకు స్నానము నిర్వర్తించినచో పరమ గతి వడయును. ఛత్రము ధ్వజము (వితానము చాందినీ)పతాక చామరములు భానునకు సమర్పించిన నభీష్ట గతి లభించును. ఏద్రవ్య మర్కునకు భక్తితో సమర్పించునో ఆ ద్రవ్య మనంతముగా లభించును. త్రికరణ కృత దురిత జాలమెల్ల జలజ బంధువు వారింప గలడు. యథోక్త దక్షిణముగా చేసిన క్రతుశతము వలని ఫలము ఒక్కనాడు సూర్యుని భక్తితో నారాధించి నను లభింప గలదు.