బ్రహ్మ:
ఆసీత్కల్పే మునిశ్రేష్ఠా స్సంప్రవృత్తే మహాక్షయే
నష్టార్కచంద్రే పవనే నష్టే స్థావరజంగమే
ఉదితే ప్రళయాదిత్యే ప్రచండే ఘనగర్జితే
విద్యుదుత్పాత సంఘాతైః సంభగ్నే తరుపర్వతే
లోకేచ సంహృతే సర్వే మహదుల్కానిబర్హణే
శుష్కేషుసర్వతో యేషు సరస్సుచసరిత్సుచ
తతః సంవర్తకో వహ్ని ర్వాయునా సహభోద్విజాః
లోకంతు ప్రావిశత్సర్వ మాదిత్యై రుపశోభితమ్
పశ్చాత్స పృథివీం భిత్వా ప్రవిశ్యచరసాతలమ్
దేవదానవయక్షాణాం భయం జనయతే మహత్
నిర్దహన్నాగలోకంచ యచ్చ కించిత్ క్షితా విహ
అధస్తా న్ముని శార్దూలా స్సర్వం నాశయతే క్షణాత్
తతోయోజనవింశానాం సహస్రాణి శతాని చ
నిర్దహత్యాశుగో వాయుః వచ సంవర్తకోనలః
సదేవాసుర గంధర్వసయక్షోరగరాక్షసమ్
తతో దహతి సందీప్తః సర్వమేవ జగత్ర్పభుః
ప్రదీప్తోసౌ మహారౌద్రః కల్పాగ్నిరితి సంశ్రుతః
మహాజ్వాలో మహార్చిష్మాన్ సంప్రదీ ప్తమహాస్వనః
సూర్యకోటిప్రతీకాశో జ్వలన్నివ సతేజసా
త్రైలోక్యం చాదహ త్తూర్ణం ససురాసురమానుషమ్
బ్రహ్మ:
ఓ మునివరు లార! కల్పాంత మందు బ్రళయమైన తఱి సూర్య చంద్రులు వాయువు చరాచర ప్రపంచము నశించి ప్రచండ ప్రలయా దిత్యుడు దయింప మేఘము లురుమ విద్యుదుత్పామున బిడుగులు వడి చెట్లు గుట్టలు భగ్నమై యెల్ల లోకము నుల్కలు పడి నశింప నెల్ల నదులు సరస్సు లింకిపోవ సంవర్త కాగ్ని వాయువుతో గూడ యాదిత్య శోభితమైన లోకమున బ్రవేశించును. అవ్వల భూమిం బ్రద్దలు గొట్టి పాతాలముం బ్రవేశించి దేవదానవ యక్షాదులకు భయము కూర్చెను. అది నాగ లోకముం దహించి యీ మేదిని నేకొంచె మేని లేకుండ గాల్చి యీ క్రింద నంతయు క్షణములో నశింప జేయును. అవ్వల నూరు వేల యోజనముల మేర వాయువు విజృంభించిన ప్రళయాగ్ని దేవాసుర గంధర్వ నాగ రాక్షసముగ సర్వముం దహించును. భయంకర జ్వాలలతో మహాధ్వనితో ప్రజ్వలించునీ రౌద్రాగ్ని కల్పాగ్ని యని శ్రుతుల వినబడును. ఇది కోటి సూర్య ప్రభతో విజృభించును. ముల్లోకములం దహించును.
మార్కండేయకృత వట దర్శనము
ఏవంవిధే మహాఘోరే మహాప్రళయదారుణే
ఋషిః పరమధర్మాత్మా ధ్యానయోగపరోభవత్
ఏకస్సంతిష్టతేవిప్రాః మార్కండేయస్సువిశ్రుతః
మోహపాశై ర్నిబద్దోసౌ క్షుత్తృష్ణాకుతితేంద్రియః
స దృష్ట్వా తం మహావహ్నిం శుష్కకంఠోష్ఠతాలుకః
తృష్ణార్తః ప్రస్ఖలన్విప్రాః తదాసౌ భయవిహ్వలః
బభ్రామ పృథివీం సర్వాం కాందిశీకో విచేతనః
త్రాతారం నాధిగచ్ఛన్వై ఇతశ్చేతశ్చ ధావతి
నలేభే చతదా శర్మ యత్ర విశ్రామ్యతా ద్విజాః
కరోమి కిం నజానామి యస్యాహం శరణం వ్రజే
కథం పశ్యామి తందేవం పురుషేశం సనాతనమ్
ఇతి సంచింతయ న్దేవ మేకాగ్రేణ సనాతనమ్ః
ప్రాప్తవాం సత్త్పదం దివ్యం మహాప్రళయకారణమ్
పురుషేశమితిఖ్యాతం వటరాజం సనాతానమ్
త్వరాయుక్తో ముని శ్చాసౌ న్యగ్రోధస్యాంతికం యయౌ
ఆసాద్యతం మునిశ్రేష్ఠా స్తస్యమూలేసమావిశత్
నకాలాగ్నిభయం తత్ర న చాంగార ప్రవర్షణమ్
నసంవర్తాగమ స్తత్ర నచవజ్రాశనిస్తథా
ఇట్టి మహాదారుణ ప్రలయ మందు మార్కండేయుడను పరమ ధర్మాత్ముడు ఋషి ధ్యాన యోగనిష్ఠ నుండెను. ఆయన యొక్కడే యిప్పుడుండు నని శ్రుతి దెల్పును. ఆయన మోహ పాశములం గట్టువడి ఆకలి దప్పుల కింద్రియములు చెదర నమ్మహాగ్నిం గని కంఠము పెదవులు నాలుకయు నెండ భయమొంది తడ పడుచు నెల్ల భూమిం గాందిశీకుడై దిఱు గాడుచు విశ్రమించుట కించుక చోటు గానక ఏమి చేయుదు నెవ్వని శరణంద వలయునో తెలియ కున్నాను. అన నాతమని బురుషోత్తము నెట్లు కనుగొందు నని యేకాగ్ర మనస్కుడై ధ్యానించి యా దివ్యమైన పరమ పదమును మహాప్రళయ కారణమైన దాని పురుషోత్తమ నామకమైన సుప్రసిద్ధ వట రాజమును జేరెను. తొందరతో నమ్ముని యా మఱ్ఱి దరికేగి దాని మొదలున గూర్చుండెను. అక్కడ కాలాగ్ని భయము లేదు. అక్కడ నిప్పులు గురియవు. సంవర్తాగ్ని యిక్కడకు జోరదు. అచ్చట పిడుగులు పడవు. అట్టి యభయ స్థాన మందా సనాతన ఋషి విశ్రమించెను.
Summary of chapter 52 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Mārkaṇḍeya, having witnessed the incomprehensible cosmic vision, composes an ecstatic prayer of praise to Bhagavān Viṣṇu-Nārāyaṇa. This stotra — reviewing the Lord's transcendent nature, his role as the sole reality during dissolution, his infinite compassion, and his identity as the universe itself — is narrated as Mārkaṇḍeya's supreme testimony to the vision he has witnessed.