బ్రహ్మ:
అథవృత్తే వివాహే తు భవ స్వామితతేజసః
ప్రహర్ష మతులం గత్వా దేవాః శక్రపురోగమాః
తుష్టువు ర్వాగ్భి రాద్యాభిః ప్రణేము స్తే మహేశ్వరమ్
ఉమా మహేశుల వివాహ మిట్లు జరుగగా నింద్రాదులగు నమరు లెల్లరు నమందానంద భరితులయి మహేశ్వరుని కిం బ్రణమిల్లి తొలి పలుకుల నిట్లు వినుతింప దొడగిరి.
నమః పర్వతలింగాయ పర్వతేశాయతే నమః
నమః పవనవేగాయ విరూపా యాజితాయచ
నమః క్లేశవినాశాయ దాత్రే చ శుభసంపదామ్
నమో నీల శిఖండాయ అంబికాపతయే నమః
నమో ఖైరవ రూపాయ విరూప నయనాయచ
నమః సహస్రనేత్రాయ సహస్ర చరణాయ చ
నమో దేవ వయస్యాయ వేదాంగాయ నమో నమః
విష్ణంభనాయ శక్రస్య బాహ్వో ర్వేదాంకురాయచ
చరాచరాధిపతయే శమనాయ నమో నమః
నమః కపాలమాలాయ కపాలసూత్రధారిణే
నమః కపాలహస్తాయ దండినే గదినే నమః
నమ స్త్రైలోక్య నాధాయ పశులోకరతాయచ
నమః ఖట్వాంగహస్తాయ ప్రమథార్తి హరాయచ
నమో యజ్ఞ శిరో హస్త్రే కృష్ణకేశాపహారిణే
భగనేత్రనిపాతాయ పూష్ణో ర్థంత హరాయచ
నమః పినాకశూలాసిఖడ్గ ముద్గనధారిణే
నమో స్తు కాల కాలాయ తృతీయనయనాయ చ
అంతకాంతకృతే చైవ నమః పర్వతవాసినే
సువర్ణ రేతసే చైవ నమః కుండలధారిణే
దైత్యానాం యోగనాసాయ యోగినాం గురవే నమః
శశాంకాదిత్యనేత్రాయ లలాటనయనాయచ
నమః శ్మశానరతయే శ్మశానవరదాయచ
నమో దైవతనాథాయ త్ర్యంబకాయ నమో నమః
గృహస్థసాధవే నిత్యం జటినే బ్రహ్మచారిణే
నమో ముండార్థముండాయ పశూనాం పతయే నమః
సలిలే తప్యమానాయ యోగైశ్వర్య ప్రదాయచ
నమ శ్శాన్తాయ దాంతాయ ప్రళయోత్పత్తి కారిణే
నమో నుగ్రహ కర్త్రే చ స్థితిక ర్త్రే నమోనమః
నమో రుద్రాయ వసవ ఆదిత్యాయా శ్వినే నమః
నమః పిత్రే థ సాంఖ్యాయ విశ్వేదేవాయ వై నమః
నమః శర్వాయ ఉగ్రాయ శివాయ వరదాయ చ
నమో భీమాయ సేనాన్యే పశూనాం పతయే నమః
శుచయే వైరిహానాయ సద్యోజాతాయ వై నమః
మహాదేవాయ చిత్రాయ విచిత్రాయ చ వై నమః
ప్రధానాయా ప్రమేయాయ కార్యాయ కారణాయ చ
పురుషాయ నమ స్తే స్తు పురుషోచ్ఛాకరాయచ
నమః పురుషసంయోగ ప్రధాన గుణ కారిణే
ప్రవర్తకాయ ప్రకృతేః పురుషస్య చ సర్వశః
కృతా కృతస్య సత్కర్త్రే ఫల సంయోగదాయ చ
కాలజ్ఞాయ చ సర్వేషాం నమో నియమకారిణే
నమో వైషమ్యకర్త్రే చ గుణానాం వృత్తిదాయచ
నమ స్తే దేవదేవేశ! నమ స్తే భూతభావన!
శివ సౌమ్యముఖో ద్రష్టుం భవ సౌమ్యో హి నః ప్రభో
బ్రహ్మ:
ఏవం స భగవా న్దేవో జగత్పతి రుమాపతిః
స్తూయమానః సురై స్సర్వై రమరా నిద మబ్రవీత్
శ్రీశంకర:
ద్రష్టుం సుఖ శ్చ సౌమ్య శ్చ దేవానా మస్మి భో స్సురాః
వరం వరయత క్షిప్రం దాతా స్మిత మసంశయమ్
బ్రహ్మ:
తత స్తే ప్రణతా స్సర్వే సురా ఊచు స్త్రిలోచనమ్
దేవతలు:
తవైవ భగవ న్హస్తే వర ఏషో వతిష్ఠతామ్
యదా కార్యం తదా న స్త్వం దాస్యసే వర మీప్పితమ్
బ్రహ్మ:
ఏవ మస్త్వితి తా నుక్త్వా విసృజ్య చ సురా న్హరః
లోకం శ్చ ప్రమథై స్స్రార్థం వివేశ భవనం స్వకమ్
య స్తు హరోత్సవ మద్భుత మేనం గాయతి దై వత విప్రసమక్షత్
సో ప్రతి రూప గణేశ సమానో
దేహ విపర్యయ మేత్య సుఖీ స్యాత్
ఇట్లు జగత్పతి భగవంతుడు నయిన యుమాపతి యెల్ల సురులచే వినుతుడై ఓ నిర్జరులారా! మీకు నేను జూడ సౌమ్యుడ నైతిని. వేగము వరము కోరుడు ఒసంగెద. సందియము లేదనగా “ఆ వరము నీ చేతనే యుండు గాక! కార్మావసర మందు దాని నిత్తువు గాక! అని దేవత లనగా నాయనయు వల్లెయని ప్రమథ గణములతో స్వభ వనమున కేగెను. అద్భుతమైన యీ శివ కల్యాణ మహోత్సవము దేవ భూదేవుల సమక్షమున గానము చేయు నతడు గణేశ భావము నంది సుఖించును.
బ్రహ్మ:
విప్రవర్యా స్తవం హీ మం పఠే ద్వా శృణుయా దపి
స సర్వలోకగో దేవైః పూజ్యతే మరరా డివ
బ్రహ్మ:
ఈ శివ స్తుతిని చదివిన విన్న యాతడు సర్వ పుణ్య లోకముల వసించి దేవేంద్రు డట్లు దేవతలచే బూజింప బడును.
Summary of chapter 37 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
The famous narrative of Dakṣa's sacrifice and its destruction is narrated. Dakṣa, father of Satī (Śiva's first wife), holds a great yajña to which he deliberately does not invite Śiva. Satī, consumed by grief at this insult to her husband, immolates herself in the sacrificial fire. Śiva, overcome with fury, sends Vīrabhadra and a great host of gaṇas who destroy the sacrifice, wound and kill many Devas, and wreak cosmic havoc.