వ్యాసులు:
ఇత్థంస్తుత స్తదా తేన ముచుకుందేన ధీమతా
ప్రాహేశః సర్వభూతానా మానాదినిధనో హారిః
యధాభివాంఛితాంల్లోకాన్ దివ్యాన్ గచ్ఛనరేశ్వర
అవ్యాహత పరైశ్వర్యో మత్ప్రసాదోపబృంహితః
భుక్తాదివ్యాన్ మహాభోగాన్ భవిష్యసి మహాకులే
జాతిస్మరో మత్ప్రసాదా త్తతో మోక్షమవాప్స్యసి
ఇత్యుక్తః ప్రణిపత్యేశం జగతామచ్యుతంనృపః
గుహాముఖాద్ధి ష్క్రాంతోద దృశే సోల్పకాన్నరాన్
తతః కలియుగం జ్ఞాత్వాప్రాప్తంతప్తుంతతో నృపః
నరనారాయణస్థానం ప్రయయౌ గంధమాదనమ్
వ్యాసులు:
ఇట్లు ముచుకుందునిచే బొగడ బడి సర్వభూతే శ్వరుండగు హరి నీ కోరిన దివ్య లోకముల నందుమని యా రాజునకు దెల్పెను. నా సాకతము అవ్యాహతై శ్వర్యముతో దివ్య భోగము లచట ననుభవించి పూర్వజన్మ స్మృతి వడసి యుత్తమ కుల మందు బుట్టి యవ్వల ముక్తి నందుదువు. అన నా రాజు పరమేశ్వరునకు మ్రొక్కి గుహ నుండి వెలువడి వచ్చి వెలి నున్న అల్పాల్ప శరీరులను నరులం జూచును. దానిచే కలి యుగము వచ్చెనని గ్రహించి నర నారాయణ స్థానమైన గంధ మాదనమున (బదరి కాశ్రమమున) తపము సేయ నేగెను.
కృష్ణోపి ఘాతయిత్వారిముపాయేనహితద్బలమ్
జగ్రాహమథురామేత్య హస్త్యశ్వస్యందనోజ్జ్వలమ్
ఆనీయ చోగ్రసేనాయద్వారవత్యాంన్యవేదయత్
పరాభిభవనిశ్శంకం బభూవ చ యదోః కులమ్
బలదేవోపి విప్రేంద్రాః ప్రశాంతాఖిల విగ్రహః
జ్ఞాతి సందర్శనోత్కంఠః స్రయయౌ నందగోకులమ్
తతో గోపాశ్చ గోప్యశ్చ యథా పూర్వమమిత్రజిత్
తథైవా భ్యవసత్ప్రేవ్ణూ బహుమాన పురస్సరమ్
కైశ్చాపి సంపరిష్వక్తః కాంశ్చిత్స పరిషష్వజె
హాసంచక్రే సమంకైశ్చిద్గోప గోపీజనై స్తథా
ప్రియాణ్యనేకాన్యవదన్ గోపాస్తత్రహలాయుధమ్
గోప్యశ్చ ప్రేమ ముదితాః ప్రోచుః సేర్ష్యమథాపరాః
కృష్ణుడు నుపాయముచే శత్రువును గాలయవనుని గూర్చి వాని సేననెల్ల గొనివచ్చి ద్వారకయం దుగ్రసేనునికి సమర్పించెను. అవ్వల యదు కులము శత్రు భయశంక వోయి స్వస్థత నందెను. బలరాముడును యుద్ధము లెల్ల శాంతింప తన జ్ఞాతులను దర్శించు వేడుకతో నంద గోకులమున కేగెను. గోపికలు గోపకులును ముందటి యట్ల సబహుమానముగ బ్రేమతో గలిసి కొని యచ్చట నుండెను. కొందఱు వచ్చి కౌగిలింప గౌగలించు కొనెను. కొందఱితో నవ్వెను. కొందఱితో ముచ్చట లాడెను. వారు నెన్నో ప్రియ వాక్యములను బలరాముం బలుకరించిరి. కొందఱు గోపికలు ప్రేమతో కొందరీర్ష్య తోడను గూడ ప్రశ్నసేసిరి.
గోప్యః పప్రచ్ఛురపరా నాగరీజనవల్లభః
కచ్చిదాస్తే సుఖం కృష్ణశ్చలత్ ప్రేమరసాకులః
అస్మచ్చేష్టోపహసనం నకచ్చిత్ పురయోషితామ్
సౌభాగ్యమాన మధికంకరోతిక్షణ సౌహృదః
కచ్చిత్ స్మరతినఃకృష్ణోగీతానుగమనం కృతమ్
అప్యసౌమాతరం ద్రష్టుం సకృదప్యాగమిష్యతి
ఆథవాకింతదాలాపైః క్రియంతామపరాః కథాః
యదస్మాభిర్వినాతేన వినాస్మాకం భవిష్యతి
పితామాతా తథాభ్రాతా భర్తాబంధుజనశ్చకః
నత్యక్తస్తత్కృతేస్మాభిర కృతజ్ఞస్తతోహినః
తథాపికచ్చిదాత్మీయ మిహాగమన సంశ్రయమ్
కరోతికృష్ణో వక్తవ్యంభవతా వచనామృతమ్
దామోదరోసౌగోవిందః పురస్త్రీ సక్తమానసః
అపేతిప్రీతరస్మాసు దుర్దర్శః ప్రతిభాతినః
నాగరిక కామినులకు ప్రాణమైన వాడు నిలకడ లేని వలపు తీపులను దొలకు కృష్ణుడు సుఖముగ నున్నాడు గదా! ఆ క్షణమాత్ర సౌహృదుడు (నిమిష మాత్రము వట్టి మెఱపు వలె మెరమిచ్చులు గొలుపు వాడు) నైన చెలిమి గల హరి వారికడ మా చైదముల యెడ బరిహాసము వారి సౌభాగ్య గర్వాతిశయము చేయుట లేదు గదా! బృందావనమున వేణు గానమును విని అనుసరించి వచ్చిన మా రాకను తలంచు చున్నాడా? కన్నతల్లిని జూడ నొక మాటైన నితడు ఇటకు వచ్చునా! ఐనను వాని ప్రసంగము లెందుకు? వేరు మాటలు చెప్పు కొందుము, మనము లేకుండ ఆతనికి, అతడు లేకుండ మనకు సాగదు. అతనికై మేము తండ్రి, తల్లి సోదరుడు భర్త బంధు జనము అను వీరిలో వదలి పెట్టని వారెవరు? అనగా తనకొఱ కిందరను గాదని వచ్చినారము. అట్టి మమ్ములను వదలి యున్న యాతడు కృతఘ్నుడు గదా! ఐన నటకు తిరిగి తాను రాదగిన ఆత్మీక మగు నేదో వస్తువు నుద్దేశించి యుండును. లేదా అట్టి వారెవరికో తన సందేశమిచ్చి యుండ వలెను. అతని వచనామృతము నీవు తెలుప దగును. ఈ దామోదరుడు గోవిందుడు పురస్త్రీలపై నంటిన మనస్సుచే నా యెడల ప్రీతి తొలగి నాడు. ఇక మాకు కనపడడని తోచు చున్నది.
వ్యాసులు:
ఆమంత్రితః స కృష్ణేతి పునర్దామోదరేతిచ
జహసుః సుస్వరం గోప్యోహరిణా కృష్టచేతసః
సందేశః సౌమ్యమధురైః ప్రేమగర్భైరగర్వితైః
రామేణాశ్వాసితా గోప్యః కృష్ణస్యాతి మధుస్వరైః
గోపైశ్చ పూర్వవద్రామః పరిహాసమనోహరైః
కథాశ్చకార ప్రేవ్ణూచ సహ తైర్వ్రజ భూమిషు
వ్యాసులు:
ఇట్లు గోపికలు బలరామునితో పలుకుచునే మైమరచి కృష్ణా దామోదరా యని సుస్వరముగ బిలుచుచు గలకల నవ్విరి. అవ్వల కృష్ణుని సందేశమును మంచిగ మధురముగ నిండుప్రేమ దొలుక స్వాతిశయ మించుకయు గన పడకుండ మధుర స్వర సరసముగ కృష్ణుడు పంపిన సందేశము వినిపించి బలరామునిచే నా గొల్లభామ లోదార్చ బడిరి. అవ్వల బలభద్రుడు మునుపటి యట్ల పరిహాస సుందరులగు గోపకులతో నా వ్రేపల్లె యందు ప్రేమ పూర్వకముగా సంభాషణములు నెఱపెను.
Summary of chapter 90 of the బ్రహ్మ మహా పురాణము is as follows:
Balarāma, on a festive occasion, asks the river Yamunā to come to him. When she refuses, he uses his ploughshare to drag her toward him, forcing a new channel. The episode demonstrates Balarāma's immense divine strength even in playful moods, and the Yamunā, subdued, flows where Balarāma directs — confirming the divine authority of both Kṛṣṇa and Balarāma over the forces of nature.